వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 15
- కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)
|
వ్యాస విషయం
మార్చుకొన్ని వ్యాసాలు కనబడుటలేదు. ఆ వ్యాసాలు సవరింపు నొక్కినపుడు వ్యాస విషయం కనబడుతుంది. వీటిని సరిచేయగలరు.
వ్యాస విషయం కనబడని వ్యాసాలు అట్లాంటా , ఇగ్లూ , ఫ్లోరెన్స్ , మిన్నియాపాలిస్ , రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్-- కె.వెంకటరమణ చర్చ 12:32, 10 జూలై 2013 (UTC)
{{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
నిర్వాహక హోదాకు మద్దతు
మార్చుమీరు నాయొక్క నిర్వాహక హోదాకు ప్రతీపాదించి మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:47, 18 జూలై 2013 (UTC)
నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు
మార్చుమీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:51, 22 జూలై 2013 (UTC)
సహాయం కావలెను
మార్చువైజా సత్య గారికి నా నమస్కారములు. నా రచనలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకున్న కొద్దిపాటి జ్ఞానము కూడా దేవుడిచ్చిందే అని అనుకుంటాను. కాని కొంతమంది మిడి జ్ఞానంతో నేను వ్రాస్తున్న వ్యాసాలను మార్చేస్తున్నారు. కేవలం వికీపిడియాలోకి లాగిన్ అయినవారు మాత్రమే సవరించేలా ఉంటే బాగుంటుంది. దురదృష్టవశాత్తు లాగిన్ కాకుండానే కొంతమంది వ్యాసాలను సవరించగలుగుతున్నారు. నేను నా ఫొటో ను అప్లోడ్ చేసుకోవచ్చా? అప్ లోడ్ చేసుకొన్న ఫొటో ను ఎవరైనా దుర్వినియోగం చేసుకొనే అవకాశం ఉన్నదా? (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:50, 31 జూలై 2013 (UTC))
- నమస్కారం రాజు గారూ, మీ ఫోటోను ఇక్కడ తప్పకుండా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ సభ్యుల ఫోటోలను సాధారణంగా ఉపయోగించుకునే అవసరం ఎవరికీ ఉండదు. కానీ వికీపీడియా మీ ఫోటో యొక్క వినియోగం గూర్చి ఎటువంటి పూచీ ఇవ్వదు. ఇక వ్యాసాల విషయానికొస్తే మనం వ్రాసినవి వేరేవాళ్ళు దిద్దకుండా అడ్డుకోలేము. సాధారణంగా వేరే వ్యక్తులు కూడా వ్యాసాన్ని మెరుగుపరచడానికే మార్పులు చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యాసం విపరీతంగా దుశ్చర్యలకు గురౌతుంటే ఆ వ్యాసాన్ని నిర్వాహకులు అనామక సభ్యులు మార్పులు చేర్పులు చెయ్యకుండా సంరక్షించే అవకాశం ఉన్నది. దుశ్చర్యలను చేసిన సభ్యులను హెచ్చిరించి, అదీ కుదరకపోతే బహిష్కరించే అవకాశమున్నది. అయితే మీకు ఇష్టం లేనివి వ్రాసినంతమాత్రాన అది దుశ్చర్యగా పరిగణింపబడదు. ఉదాహరణకు పేజీ మొత్తం సరదాకు తుడిచెయ్యటం ఒక దుశ్చర్య. మీరు ఏ వ్యాసంలో దిద్దుబాట్ల గురించి ప్రస్తావిస్తున్నారో తెలిపితే ఆ వ్యాసంలో మార్పులు చేర్పులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోగలను --వైజాసత్య (చర్చ) 04:43, 1 ఆగష్టు 2013 (UTC)
పతకం
మార్చువికీపీడియా ఉగాది మహోత్సవాన్ని నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 11:00, 16 ఆగష్టు 2013 (UTC)
మొలకల జాబితా గురించి
మార్చునమస్కారం వైజాసత్య గారు. జూన్ మొలకల జాబితా బాటు తాజాకరించినట్టు అనిపించుటలేదు. కొంచం చూస్తారా? అలాగే జులై 2013 మొలకల జాబితా కూడా పెడితే బాగుంటుందేమో. ఈ మొలకలను బాటు ద్వారా లేదా ఇతరత్రా ఎలా సేకరించాలో నేర్పితే దీనిని ప్రతి నెలా పొందుపరచటంలో నావంతు ప్రయత్నిస్తాను. --విష్ణు (చర్చ)13:36, 19 ఆగష్టు 2013 (UTC)
- జూలై మొలకల జాబితా ఇప్పటికే ఉన్నది. జూన్ జాబితా ఇప్పుడే తాజాకరించాను. ఈ స్క్రిప్టును ఉపయోగించి నెల చివర్లో ఆ నెల్లో ప్రారంభించబడిన మొలకల జాబితా తయారుచేయవచ్చు. ఈ స్క్రిప్టును ఉపయోగించి అవసరమైనప్పుడల్లా ఈ నెలవారి మొలకలజాబితాలను తాజాకరించవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:17, 20 ఆగష్టు 2013 (UTC)
నిర్వాహకుడు-ప్రతిపాదన
మార్చువైజాసత్యగారు,
మీరు నన్ను నిర్వాహకుడిగా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు.అయితే నిర్వాహకూడనేది అధికారంకాదు,అధికభాద్యత.నాఉద్దేశ్యంలో సినియారిటికన్న క్రియాశీలకంగా వున్నవారే దీనికి సరియైనవారని నా భావన.అంటే కేవలం వ్యక్తిగతరచనలకే పరిమితంకాకుండ వీకీ యొక్క ఇతరకార్యక్రమాలలో చురుకుగా,సరిగా చెప్పాలంటే రమణగారిలా పాల్కొనేవారినే ప్రతిపాదించటం అవసరం.అంతేకాకుండ నిర్వాహకుడుగా వీలున్నంత సమయాన్ని వికీకి మునుపటికన్న ఎక్కువగా కెటాయించగలగాలి.నావిషయానికి వస్తే నేను ఎక్కువగా వ్యాసరచనకే ప్రాముఖ్యత యిచ్చాను.మరియు నేనుచేసిన దిద్దుబాట్లసంఖ్యకూడా పరిమితం,రెండున్నర సంవత్సరాలలో సుమారు 3500 మాత్రమే,మరియు మధ్యలో వికీలో రచనలు చేయనికాలం(break up)కూడా 5-6 నెలలున్నది.ఇప్పటికి నామొదటి ప్రాదాన్యత రచనలకే -ఇంకా నూనెలగురించి-యంత్రవిజ్ఞానంగురించి పలు వ్యాసాలు వ్రాయాల్సి వుంది.కాని సమయాన్ని కెటాయించలేకున్నాను.అంతే కాకుండ కన్నడలో(తెలుగు తరువాత నేను అధికంగా అభిమానించే భాష)రచనలకారణంగా తెలుగు వికీలో నారచనల వరవడి తగ్గింది. మరియు నాకు కంప్యూటరు పరిజ్ఞానంకూడా తక్కువ.అందువలన నిర్హాకుడిగా మీరు నానుంచి ఆశించినది అందించలేనని భావిస్తున్నాను.అందువలన మీ ప్రతిపాదన స్వీకరించకుండ,మీ మనస్సు నొప్పించినందులకు క్షమించగలరని ఆశిస్తూ.పాలగిరి (చర్చ) 06:50, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారూ, నేనేం నొచ్చుకోలేదండి. మీలాంటి పెద్దలు నన్ను క్షమించమని అడగవలసిన అవసరమూ లేదు. మీలాగే నాకూ నిర్వహణ కంటే వ్యాసరచన అంటేనే ఇష్టం. ఇప్పుడు నన్ను నిర్వాహక పదవికి ప్రతిపాదిస్తే నేనూ ఇలాంటి సమాధానమే ఇచ్చేవాన్ని. కాబట్టి మీ ఉద్దేశం నేను చక్కగా అర్ధం చేసుకోగలను --వైజాసత్య (చర్చ) 02:13, 11 సెప్టెంబర్ 2013 (UTC)
నంది పురస్కారాలు
మార్చునందు పురస్కారాలు మూస చాలా బాగుంది. ధన్యవాదాలు. ఇందులో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రదానం చేసే పురస్కారాలకు ఒక్కో పేజీ ఉన్నది. అలా తయారుచేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:08, 29 ఆగష్టు 2013 (UTC)
తెవికీ నిర్వహణ
మార్చుతెవికీలో మళ్ళీ క్రియాశీలకంగా నిర్వహణను కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. --వైజాసత్య (చర్చ) 02:08, 11 సెప్టెంబర్ 2013 (UTC)
- నా నిర్వహణపై వ్యాఖ్యానించినందులకు ధన్యవాదాలు. పాలగిరి గారు చెప్పినట్లు నిర్వహణ అనేది బాధ్యతగా చేపట్టాలి. అయితే తెవికీ కార్యం అనేది మనకు ప్రవృత్తి మాత్రమే కాబట్టి రోజూ వచ్చి రచనలు, నిర్వహణ చేయాలని ఏమీ లేదు. అయితే దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణను పట్టించుకోకపోవడం సమంజసం కాదు. మనం ఇక్కడ రచనలు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న రచనలను కాపాడుకోవడం మరియు రోజూవారి దిద్దుబాట్లను క్రమపద్దతిలో ఉంచడం అంతకంటె ముఖ్యమైనది. ఇవన్నీ క్రియాశీలకంగా ఉండే నిర్వాహకులే చేయాల్సిన బాధ్యత. నిర్వహణను ఎవరూ పట్టించుకోనప్పుడు జన సంచారంలేని వీధులు చెట్లు, పుట్టలలో నిండిపోయినట్లుగా లేదా కొంతకాలం మనుషులు నివశించని ఇల్లు చెత్తాచెదారంతో, సాలెగూళ్ళతో, దుమ్ము-ధూళితో కూడి ఉండినట్లుగా గోచరించడం ఖాయం. రోజూ ఎందరో కొత్తవారు వస్తుంటారు, వారందరూ రెగ్యులర్ సభ్యులు కారు, నియమాలు తెలియవు, తమ ఇష్టమున్నట్లు రాసుకుంటారు, వాటన్నింటినీ వికీకరణ, తొలిగింపులు చేయాల్సి ఉంటుంది. కొందరు పాతసభ్యులైనా వికీ నియమాలు అంతగా తెలియని వారుంటారు, వారికీ అప్పుడప్పుడూ గుర్తుచేస్తుండాల్సి ఉంటుంది. అవన్నీ నాకెందుకులే, నా దిద్దుబాట్లే నాకు ప్రధానం కదా అనుకునే వారు కూడా ఉండవచ్చు. అలాంటివారివల్ల కూడా పెద్దగా ప్రమాదం లేకపోవచ్చు కాని, నియమాలను విరుద్ధంగా ఉన్నప్పుడు ఎవరికైనా తెలియజేసినప్పుడు మాత్రం, నియమాలు తెలియజేసిన వారిపైనే ఎగరే వారూ ఉంటారు, వారితోనే తెవికీకి ప్రమాదం. వారు చెప్పరూ, ఇతరులకు చెప్పనీయరు. అయినా సరే మనపని మనం చేయాలి, మన బాధ్యత మనం నెరవేర్చాలి, మన లక్ష్యాన్ని మనం సాధించాలి, తెవికీ గమ్యాన్ని మనం చేర్చాలి. ఇక్కడ మనకు వ్యాసాలే ప్రధానం కాని సభ్యులు కాదుకదా! మన నిజ జీవితానికి మన తెవికీ ప్రస్థానానికి చాలా తేడా ఉంటుంది. మన లక్ష్యం తెవికీకి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాని మనం మంచివారమని పేరు తెచ్చుకోవడానికి ఇక్కడ పని చేయడం లేదుకదా! మనం మంచిపేరు తెచ్చుకోవాలని ఎవరికీ ఏమీ చెప్పకుండా ఉంటే నిర్వహకులుగా ఉండి ప్రయోజనమేమిటి? నిర్వహణహోదా అనేది అలంకారప్రాయ హోదా కాదుకదా! నిర్వహణ చేస్తున్నప్పుడు వ్యాసాలు, బొమ్మలు తొలిగిస్తున్నప్పుడు కొందరికి కోపం వచ్చి ఉన్న కోపమంతా మనపై కుమ్మరిస్తారు. నాలుగేళ్ల క్రితం నియమాలకు విరుద్ధంగా మొదటి పేజీలో బొమ్మ పెట్టడానికి ఒక సభ్యుడు ప్రయత్నిస్తే, ఆలా చేయడాన్ని నేను వాయిదా వేయదలిస్తే ఎంత ఎగిరాడో మీకు బాగా తెలుసు. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకులు ఎదిరిస్తేనే ముందుకు పోగలం. నియమాలకు విరుద్ధంగా ప్రయత్నించిననూ వారికి మనమేం చెప్పరాదనుకుంటే మరి నిర్వాహకులుగా ఉండి ప్రయోజనమేమిటి? నేను సెలవులో ఉన్నందున ఇక్కడికి రోజూ రావడానికి వీలుకావడం లేదు. 4 రోజుల క్రితం యాధృచ్ఛికంగా వచ్చి పాత కూర్పులు, ఇటీవలి కొత్త వ్యాసాలు చూస్తే చాలా రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పత్రికల సమాచారం ఉన్న బ్లాగుల నుంచి సమాచారం కాపీచేస్తున్నట్లుగా గమనించి రచ్చబండలో కొనసాగుతున్న చర్చకు భిన్నంగా సూచనలు చేశాను. ఇటీవలి కాలంలో నిర్వాహకులు రోజూవారీ నిర్వహణ చేయకపోవడంతో కొత్త సభ్యులకు నియమాలపై అవగాహన రావడం లేదు. కొందరు అనుభవమున్న సభ్యులు కూడా ఇప్పటికీ నియమాలకు విరుద్ధంగానే చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరికీ నియమాలపై వందశాతం అవగాహన ఉండదు కాని ఉన్న నియమాలు చెబుతూ, చెప్పించుకుంటూ ఉంటే మిగితావారికీ దీనిపై అవగాహన వస్తుంది. నియమాలు కూడా ఒక్కొక్కరు ఒక్కోరకంగా అర్థంచేసుకోవచ్చు, అది మామూలే. నియమాలు స్పష్టంగా ఉండటం, అలా చేయడం చాలా కష్టం. ఇక్కడే కాదు ప్రముఖ చట్టాలు కూడా స్పష్టంగా లేనందువల్ల ఒకే కేసుకు సంబంధించి ఒక్కో లాయరు ఒక్కో విధంగా వాదిస్తారు. క్రిందికోర్టులో వీగిపోయిన ఒక కేసు అవే చట్టాలు, నియమాలతో పై కోర్టులో ఎలా నెగ్గుతుంది అనే దానికి ఇదే కారణం. మళ్ళీ తెవికీ విషయానికి వస్తే మనం ఒక తెవికీ రాజ్యాంగాన్ని రచించుకొని నియమాలు ఇప్పడు ఉన్నవాటికంటే కాస్త స్పష్టంగా ఉండేటట్లుగా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై నేను ఇదివరకే ఆలోచించాను కాని సెలవులోకి వెళ్ళడం వల్ల వీలుకాలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 11 సెప్టెంబర్ 2013 (UTC)
- మీరు చెప్పినవాటిలో చాలామటుకు అంగీకరిస్తున్నాను. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వాళ్ళలో చాలామందికి ఇది తెలుగులో విషయాలు వ్రాసే వెబ్‌సైటుగానే అర్ధం అయ్యింది కానీ వికీస్ఫూర్తి అర్ధం కాలేదు. మీకు చాలా విషయాలు తెలుసు, మీరు కాస్తా కరుకుగా చెప్పినప్పుడు దాన్ని, నేను మీరు దృష్టికోణం నుండి చెబుతున్నారో చూపించడానికి ప్రయత్నించానే తప్ప, ఏదో మంచివాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయమేమీ లేదు. ముఖ్యంగా పట్టూ విడుపూ ఉండాలన్న వికీ ధోరణిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని ఆచరించాను. పోన్లెండి నా సోదెందుకు కానీ, ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటారు. విష్ణు గారికి నేను నియమనిబంధనలు, వికీపద్ధతులపై కొన్ని వీడియోలు తయారుచేసే క్రమంలో సమాచారం అందిస్తానని మాటిచ్చాను, ఇంకా క్రియాశీలక సభ్యులకు నియమనిబంధనలలో శిక్షణ కూడా ఇవ్వాలి. మీరు నాకు సహాయం చెయ్యగలరా? --వైజాసత్య (చర్చ) 04:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారు, మీ వ్యాఖ్యకు స్పందించడం మరియు మీ చర్చాపేజీలో వ్రాయడంతో నేను చేసిన చర్చ మీ గురించేనని అనుకుంటున్నారు. అదేమీ కాదండీ, ప్రస్తుత తెవికీ పరిస్థితులకు అనుగుణంగానే, సాధారణ దృష్టితోనే చర్చ చేశాను కాని మీపై గాని మరే సభ్యునిపైగాని నేను ప్రత్యేకంగా దృష్టిపెట్టలేను. నిర్వహణలో భాగంగా కొన్నిసార్లు సభ్యులకు వివరంగా చెప్పవలసి వచ్చింది, దానికి అప్పటి పరిస్థితులు, సభ్యుల ధోరణులు కూడా దానికి కారణమయ్యాయి కాబట్టి వాటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అందరూ తలా కొద్దిగా నిర్వహణ బాధ్యత తీసుకుంటే ఇలాంటి సమస్యే ఉత్పన్నం కాదు. ప్రతి ఒక్కరు తాము చేసేదే సరైనదనుకునే ధోరణి కూడా ఉంది. సూచించిన పొరపాట్లను కూడా సభ్యులు మళ్ళీమళ్ళీ చేయడంతో తెవికీ నిర్వహణ చేయలేక, తెవికీలో జరుగుతున్న పొరపాట్లు, నియమనిబంధనల ఉల్లంఘనలు చూడలేక చివరికి సెలవులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రియాశీలక సభ్యులకు నియమనిబంధనలలో శిక్షణ ఇవ్వాలనే మీ అభిప్రాయానికి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తాను. నాకు చాలా విషయాలు తెలుసని అంటున్నారు అయితే విశాలమైన ఈ వికీ ప్రపంచంలో నేనెంత? నాకు తెలిసినదెంత? అయిననూ నాకు తెలిసిన కొన్ని నిబంధనలు సభ్యులకు సూచించడానికి ప్రయత్నించాను. అదేవిధంగా నాకు తెలిసిన తెవికీ నిబంధనలతో మీకూ తప్పకుండా సహాయపడగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:30, 12 సెప్టెంబర్ 2013 (UTC)
- మీరు చెప్పినవాటిలో చాలామటుకు అంగీకరిస్తున్నాను. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వాళ్ళలో చాలామందికి ఇది తెలుగులో విషయాలు వ్రాసే వెబ్‌సైటుగానే అర్ధం అయ్యింది కానీ వికీస్ఫూర్తి అర్ధం కాలేదు. మీకు చాలా విషయాలు తెలుసు, మీరు కాస్తా కరుకుగా చెప్పినప్పుడు దాన్ని, నేను మీరు దృష్టికోణం నుండి చెబుతున్నారో చూపించడానికి ప్రయత్నించానే తప్ప, ఏదో మంచివాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయమేమీ లేదు. ముఖ్యంగా పట్టూ విడుపూ ఉండాలన్న వికీ ధోరణిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని ఆచరించాను. పోన్లెండి నా సోదెందుకు కానీ, ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటారు. విష్ణు గారికి నేను నియమనిబంధనలు, వికీపద్ధతులపై కొన్ని వీడియోలు తయారుచేసే క్రమంలో సమాచారం అందిస్తానని మాటిచ్చాను, ఇంకా క్రియాశీలక సభ్యులకు నియమనిబంధనలలో శిక్షణ కూడా ఇవ్వాలి. మీరు నాకు సహాయం చెయ్యగలరా? --వైజాసత్య (చర్చ) 04:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
పాత సినిమాలు
మార్చుమంచి పాత తెలుగు సినిమాల విశేషాలు చేర్చుతున్నారు. బాగున్నవి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:16, 14 సెప్టెంబర్ 2013 (UTC)
వికీపీడియా:మొలకల జాబితా/1.5
మార్చువికీపీడియా:మొలకల జాబితా/1.5 లో కొన్ని వ్యాసాలు విస్తరించడం జరిగినది. ఆ పేజీని ఒకసారి తాజాకరించండి-- -- కె.వెంకటరమణ చర్చ 03:36, 24 సెప్టెంబర్ 2013 (UTC)
మూసలలో అక్షరక్రమం
మార్చువైజాసత్య గారికి,
మూసలలో అక్షరక్రమం ఉత్తమమని గ్రామ వ్యాసాలలో మార్పులు చేస్తున్నప్పుడు నాకు చంద్రకాంతరావుగారు ఇచ్చిన సందేశం -
రెడ్డి గారు మీ దిద్దుబాట్లను చూస్తే మీరు గ్రామవ్యాసాలలో అతికించిన మండలంలోని గ్రామాలకు చెందిన మూసలలో గ్రామాల పేర్లను మార్చి అక్షరక్రమంలో ఉంచుతున్నట్లు గమనించాను. ఇలా చేయడం మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కాని, ప్రస్తుతం ఉన్న గ్రామాల పేర్లు కోడ్ సంఖ్య ప్రకారం ఉన్నాయి. వాటిని అలాగే ఉండనిస్తే మంచిది. అలాగే జిల్లాకు చెందిన మూసలలో మండలాలు కూడా కోడ్ సంఖ్య ప్రకారమే ఉన్న వాటికి మీరు అక్షరక్రమంలో మార్చుతున్నారు. మూసలలోని పేర్లను అక్షరక్రమంలో మార్చే అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ తప్పనిసరిగా వాటిని అక్షరక్రమంలో మార్చాల్సివచ్చినచో వైజాసత్య గారు బాటుద్వారా చాలా తేలికగా మార్చగలరు. ఇలాంటివాటికి మానవశ్రమ అవసరం లేదు. కాబట్టి మీరు చేసే ఈ శ్రమ బదులు వ్యాసాలలో సమాచారం చేర్చితే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:52, 24 సెప్టెంబర్ 2013 (UTC)
మూసలలో అక్షరక్రమమే ఉత్తమమని నా అభిప్రాయం, అంతేకాక ఇంతకు మునుపే కొన్ని గ్రామ వ్యాసాలలో అక్షరక్రమాన్ని పాటించారు కూడా కాబట్టి మీరు బాటు ద్వారా అక్షరక్రమంలోకి మార్చగలరని మనవి. మీ YVSREDDY (చర్చ) 21:49, 24 సెప్టెంబర్ 2013 (UTC)
Hello. Sorry for writing in English (I don't know Telugu).
I've made comments about possible improvements to the numeral conversion gadget at mw:MediaWiki_talk:Gadget-Numerakri.js#Documentation.2C_standardization_and_cookie. Since the issue is specific to its implementation here, please comment. Regards--Siddhartha Ghai (చర్చ) 05:46, 4 అక్టోబర్ 2013 (UTC)
- PS:Please comment there (on mediawiki.org). Thanks--Siddhartha Ghai (చర్చ) 05:47, 4 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదం
మార్చుశ్రీ వైజాసత్య గారు,మీ ప్రత్యేక అభినందానానికి ధన్యవాదంపాలగిరి (చర్చ) 05:24, 20 అక్టోబర్ 2013 (UTC)
అధికారహోదా
మార్చుసహ సభ్యులకు మాట మాత్రము చెప్పకుండా అధికారహోదా తొలగించుకోవటం బాధనిపించింది. --అర్జున (చర్చ) 06:34, 20 అక్టోబర్ 2013 (UTC)
- నొప్పించి ఉంటే క్షమించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అధికారహోదా ఉండటం ముఖ్యం కాదనిపించింది. కేవలం అధికారహోదాతో వ్యవహరిస్తున్నానన్న అపవాదు రాకూడదని అలా చేయటం జరిగింది. విషయం రభస చేయటం ఎందుకని ఎవరికీ చెప్పలేదు. అయినా అందులో పెద్దగా చర్చించవలసిన విషయం కనిపించలేదు. అయినా అధికార హోదాతో అదనంగా చేయగలిగే పనులు పెద్దగా ఏవీ లేవని మీకు తెలియనిది కాదు. వికీ నుండి నేనేమీ తప్పుకోవటం లేదు అందుకే నిర్వాహకహోదా అలాగే ఉంచుకున్నాను --వైజాసత్య (చర్చ) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)
- మీ వివరణకి ధన్యవాదాలు. మీ వికీబడి ప్రతిపాదన ఫలించి మరికొంతమందినిర్వాహకులు, అధికారులై తెవికీఅభివృద్ధిపధంలో నడిపించాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 06:46, 20 అక్టోబర్ 2013 (UTC)
- ఈ విషయం నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది బాధాకర విషయమే అయిననూ నిర్వాహకహోదాతో తెవికీని అభివృద్ధిపథంలో పయనింపజేస్తారని ఆశిస్తున్నాను. మీరాకతో చర్చలు మళ్ళీ ఊపందుకున్నాయి. కొన్నేళ్ళ క్రితం కూడా ఇలాగే చర్చలు బాగానే జరుగుతుండేవి. చర్చల ద్వారానే కొత్త సభ్యులకు నియమాలపై అవగాహన ఏర్పడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:17, 20 అక్టోబర్ 2013 (UTC)
- తెలుగువికీపీడియా అభివృద్ధికి తోడ్పడిన వారిలో అగ్రగణ్యులు, మృదుస్వభావి, సంయమనం పాటించగలిగిన సహనశీలి, సహసభ్యులకు ప్రోత్సాహం అందించిన సమర్ధవంతమైన అధికారి అయిన వైజాసత్యగారు పదవి నుండి తొలగడం విచారకరం. ఇది తెలుగు వికీపీడియాకు తీరని లోటు. అయినప్పటికీ వారి అభిప్రాయాన్ని అది బాధాకరమైనదైనా గౌరవిస్తాను. --t.sujatha (చర్చ) 13:03, 20 అక్టోబర్ 2013 (UTC)
- మీ వివరణకి ధన్యవాదాలు. మీ వికీబడి ప్రతిపాదన ఫలించి మరికొంతమందినిర్వాహకులు, అధికారులై తెవికీఅభివృద్ధిపధంలో నడిపించాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 06:46, 20 అక్టోబర్ 2013 (UTC)
- సత్యగారూ నమస్కారం, ఏమిటీ !!! మీరు అధికార హోదా నుండి తప్పుకున్నారా ?? ఏమిటండీ మీ జులుం!!. సభ్యులందరికీ మీ నిర్ణయం సుతరామా ఇష్టం లేదు. సోదరి సుజాతగారు చెప్పినట్టు మీరొక సమర్థవంతమైన అధికారి. దయచేసి మీ నిర్ణయాన్ని తక్షణం మార్చుకోండి. ఎలాంటి అపవాదాలకు స్థానం లేదు. ఇక్కడ సభ్యులందరూ సోదర సభ్యులే. అందరికీ ఒకరిపట్ల మరొకరికి గౌరవభావాలు మెండుగా వున్నాయి. తెవికీకి ఇదే కొండంత బలం. కొన్ని గరం గరం చర్చలు వుండవచ్చు, అవి కూడా తెవికీ అభివృద్ధికి ఓ దారి చూపిస్తాయని మా ప్రగాఢ నమ్మకం. మీరు అధికారి హోదానుండి తప్పుకోవడం, చంద్రకాంతరావుగారు సున్నితంగా నిరాకరించడమూ, ఈ రెండు విషయాలూ నేను జీర్ణించుకోలేక పోతున్నాను. తొలినుండీ చూస్తున్నాను, మీరూ చంద్రకాంతరావు గార్లు తెవికీ నావకి "చుక్కాని" వంటి వాళ్ళు. మీరీవిధంగా తప్పుకోవడం వెనుక విషయం స్పష్టంగా అర్థం కావడం లేదు. మీరు అధికారిగా వుండాల్సిందే, ఇది మా (తోటి సభ్యులందరి తరపున) మన:పూర్వక "ఆర్డర్", దయచేసి స్వీకరించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:29, 27 అక్టోబర్ 2013 (UTC)
File source problem with దస్త్రం:Bramakrishanarao.jpg
మార్చుThank you for uploading దస్త్రం:Bramakrishanarao.jpg. I noticed that the file's description page currently doesn't specify who created the content, so the copyright status is unclear. If you did not create this file yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. Please add this information by editing the image description page.
If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.
Please refer to the image use policy to learn what images you can or cannot upload on Wikipedia. Please also check any other files you have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions or are in need of assistance please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 07:08, 21 అక్టోబర్ 2013 (UTC)
Non-free rationale for దస్త్రం:Krishna.jpg
మార్చుThanks for uploading or contributing to దస్త్రం:Krishna.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:45, 21 అక్టోబర్ 2013 (UTC)
సహాయ అభ్యర్థన
మార్చుసత్యగారూ, నాకు ఉర్దూ వికీలోనూ అకౌంటు వున్నది. 2008 జూలైలో చేరాను. దాదాపు 5000 పైబడి దిద్దుబాట్లు వున్నాయి. ఈ లింకు చూడండి.[1]. నా ఖాతా పేరు Ahmadnisar తో వున్నది. దీనిని నా తెలుగు ఖాతా "అహ్మద్ నిసార్" తో లంకె చేయదలచుకున్నాను. కారణం తెవికీ నుండి ఉర్దూ వికీలో ప్రవేశించాలంటే, పాత అకౌంటు Ahmadnisar పేజీకి పోవడం లేదు, "అహ్మద్ నిసార్" (ఎర్రలింకు) తో ప్రవేశం జరుగుచున్నది. ఉర్దూ వికీ లో పాత అకౌంటు అభిరుచులు పేజీ లింకు ఇది [2]తెవికీ మరియు ఉర్దూవికీ లో ప్రవేశించుటకు సుళువు మార్గం దయచేసి తెలిపేది, లేదా ఆ పని మీరే చేసి పెట్టేది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:54, 27 అక్టోబర్ 2013 (UTC)
- నిసార్ గారు, మీ చర్చాపేజీలో వివరించాను చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:47, 27 అక్టోబర్ 2013 (UTC)
వాడుకరి మూసలు
మార్చువాడుకరి పెట్టెలు వాడుకరి ఔన్నత్యాన్ని ప్రతిబించేటట్లు ఉండాలి. ఈ మధ్య కొన్ని పెట్టెలు నిజ జీవితంలొ చేసే ప్రతి కృత్యానికి తయారుచేయటం వలన వారికి తెలియజేయుటకు అలా చేశాను. క్షమించండి.
- ఇలా ఐపీ అడ్రస్ తో వ్రాయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్ తెవికీలో చురుకైన సభ్యులలో ఇద్దరికి వస్తుంది. రెండో వ్యక్తి ఎవరనేది నాకు తెలుసు. రోజూ అన్ని రచనలు పరిశీలించే వారికి ఇది తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. చెప్పేది ధైర్యంగా సభ్యనామంతోనే చెప్పడం మంచి పద్దతి. పొరపాటున లాగిన్ కాకుండా ఐపీ అడ్రస్‌తో వ్రాయడం వేరు, ఉద్దేశ్యపూర్వకంగా వ్రాయడం వేరు. 10 మాసాల క్రితం రచ్చబండలో కూడా ఈ సభ్యుడే 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్‌తో దిద్దుబాట్లు చేసిన సంగతి విదితమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:03, 1 నవంబర్ 2013 (UTC)
- ఏ దుశ్చర్య చేయకపోయినా తెవికీపై గౌరవం కొద్దీ క్షమాపణ అడిగినపుడు మధ్యలోనికి వచ్చి ఆరా తీయటం ఎంతవరకు సబబు? అజ్ఞాత సభ్యులు చర్చించరాదా?106.207.16.102 11:41, 2 నవంబర్ 2013 (UTC)
- మీ ప్రైవసీని గౌరవిస్తాను, మీరు చెప్పదలచుకున్నది నాకు అర్ధం అయ్యింది. అందుకనే మీ ప్రతిస్పందనా మూసలు చూడగానే నాకో పది నిమిషాల పాటు కళ్ళలో నీళ్లొచ్చేంతగా నవ్వొచ్చింది. ధన్యవాదాలు. అజ్ఞాతసభ్యులకూ చర్చించే హక్కు భేషుగ్గా ఉన్నది. ఇక ఈ నిత్యకృత్యాలకు సంబంధించిన పెట్టెల విషయానికొస్తే ఒక సభ్యుడు ముచ్చట పడ్డాడు సరదాగా వదిలెయ్యండి. అలాంటి వాడుకరి మూసలు తయారుచేసుకోవటం వికీనియమాల ఉల్లంఘణ ఏమాత్రం కాదు. కాకపోతే అవసరమా? అన్న ప్రశ్నను మాత్రం మనం వేసుకోవచ్చు. ఆ సభ్యుడికి అవసరమనిపించింది. అసభ్యత, అశ్లీలం లేనంత వరకు నాకేం అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 22:25, 2 నవంబర్ 2013 (UTC)
- మరికొంత వివరణ ఇవ్వాలనిపించింది. వాడుకరి మూసలు పచ్చబొట్లలాంటివి. కొందరికి అవి ససేమిరా ఇష్టమిండదు, మరికొందరికవి వ్యసనం; పర్సనాలిటీ ఎక్స్‌ప్రెషన్ (వ్యక్తిత్వ ప్రదర్శన). ఇవి వాడుకరి పేజీల్లోనే వాడతారు కాబట్టి పెద్దగా నియంత్రించే అవసరం లేదు. ఇక అజ్ఞాతత్వం గురించి - సాధారణంగా లాగిన్ ఉన్నవారు ఉద్దేశ్యపూర్వకంగా అజ్ఞాతులుగా వ్యాఖ్యలు చేయటం సముదాయం హర్షించదు. కానీ మీ concern కూడా నాకర్ధం అయ్యింది. మీరు విమర్శిస్తే ఆ తర్వాత ఆ సభ్యునితో కలిసి సరిగా పనిచేయలేకపోవచ్చని మీకనిపించి ఉండవచ్చు. అది కొంచెం కష్టమైనా, మనం ఒక పద్ధతిని, ఆలోచనను, ఒక దిద్దుబాటును విమర్శిస్తున్నాం కానీ వ్యక్తులను విమర్శించడం లేదని అందరూ అర్ధం చేసుకోవాలి. ఇక్కడ చర్చలూ, విమర్శలూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగత విమర్శలు, దూషణలను మాత్రం వికీ సహించదు. --వైజాసత్య (చర్చ) 22:44, 2 నవంబర్ 2013 (UTC)
- లెస్స పరికితిరి. మీ పేరు "Why? जा...సత్య" లోనే మూడు భాషలతో కూడిన తాత్విక సందేశం ఉంది. "అనవసర విషయాలెందుకు?సత్యాన్వేషణ కోసం వెళ్ళండి" అని. సత్యానికి కట్టుబడే వారికి అంతిమ విజయం ప్రాప్తించినప్పటికీ హరిశ్చంద్రునిలా కొన్ని కష్టాలు తప్పవు. నేటి సమాజంలో "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ,నబ్రూయాత్ సత్య మప్రియం..." అనేది సరిపోతుంది. అంటే అప్రియమైన సత్యం కంటే ప్రియమైన అసత్యం ఎదుటి వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. అందువల్ల సత్యాన్ని నేరుగా చెప్పి సభ్యుల మనోభావాలను గాయపర్చరాదని పరోక్షంగా రెండు మూసలు తయారుచేసి యివికూడా మూసలేనా? అన్నట్లు సందేవశాన్నిచ్చాను. ఏమీ అనుకోవద్దు.223.177.7.130 01:43, 3 నవంబర్ 2013 (UTC)
- ఐపీ అడ్రస్‌తో వ్రాయడం తప్పేమీ కాదు, చేసింది దుశ్చర్య కాదు కాని దాదాపు అదే ఐపీ ఉన్న తోటి సభ్యులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది. దాదాపు ఐదున్నర సంవత్సరాల క్రితం ఇలా ఐపీ అడ్రస్ మరియు మారుపేర్లతో ప్రారంభమైన చిన్న ఉదంతం చివరకి తెవికీలో ఎంత దుమారం లేపిందో అప్పటివాళ్ళకే తెలుసు. ఈ చర్యలతో ఏ మాత్రం సంబంధం లేకున్నా దేవా అనే సాంకేతికంగా నిపుణత ఉన్న సభ్యుడిని మనం కోల్పోవడానికి సరిగ్గా ఇలాంటి చర్యే కారణమైంది. ఎవరో చేసిన తప్పుకు దేవాగారు నిర్వాహకహోదానే వదులుకున్నారు. ఇప్పుడు ఈ 106తో ప్రారంభమయ్యే ఐపీ నాకూ వస్తుంది కాబట్టి నేను అభ్యంతరపర్చాను. ఆ సభ్యులతో కలిసి పనిచేయలేకపోతామని భావించి అందరూ ఇలా ఐపీ తో చెప్పడం ప్రారంభిస్తే తెవికీలో కొత్త దుస్సంప్రదాయానికి దారితీసినట్లవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:51, 3 నవంబర్ 2013 (UTC)
- మీకు 106 ఐ.పి సంఖ్య కలదని ఆ సంఖ్య గల వేలాది మంది సభ్యులు చేసే చర్చలకు మీరెలా బాద్యులవుతారు? లాగిన్ ఐన వారందరూ జ్ఞాత సభ్యులేనా?ఈ చర్చను నేను ముగించినప్పటికీ ఇంకా చర్చను రచ్చ చేస్తున్నారు.నేనేమి చేస్తే మీరు శాంతిస్తారు? 223.177.68.193 06:59, 3 నవంబర్ 2013 (UTC)
- నేను అశాంతిగా ఏమీలేను. ఏదేని విషయం సభ్యుల దృష్టికి తేవడానికి చర్చలలో మన అభిప్రాయాలు చెప్పడం అవసరమే. పైన ఈ రోజు నేను చెప్పిన విషయాలు ఏ ఒకరికో కాకుండా తెవికీ సమాజానికి ఉద్దేశించి చెప్పాను. రచ్చకు చర్చకు తేడా తెలుసుకోకపోవడం శోచనీయం సి. చంద్ర కాంత రావు- చర్చ 07:05, 3 నవంబర్ 2013 (UTC)
- ఏ దుశ్చర్య చేయకపోయినా తెవికీపై గౌరవం కొద్దీ క్షమాపణ అడిగినపుడు మధ్యలోనికి వచ్చి ఆరా తీయటం ఎంతవరకు సబబు? అజ్ఞాత సభ్యులు చర్చించరాదా?106.207.16.102 11:41, 2 నవంబర్ 2013 (UTC)
నాస్పందన
మార్చు- చర్చ చేయటానికి రచ్చబండ వేదిక ఉంది. నేను ఈ సభ్యుని పేజీలో చర్చ ప్రారంభించలేధు.వివరణ మాత్రమే ఇచ్చాను. ఈ పేజీలో చంద్రకాంతరావు గారి జోక్యం అనవసరం. ఆయన హుందాగా వ్యవహరించాలి. 106.206.177.180
- ఇది నా చర్చా పేజీ అయినా, ఇక్కడి చర్చలోనే ఇతరులు పాల్గొనకూడదన్న నియమేమీ లేదు. ఇదివరకు జరిగిన కొన్ని సంఘటనలవల్ల చంద్రకాంతరావు గారు అప్రమత్తతో వ్యవహించారని అనుకొంటాను. ఇందులో ఇక చర్చించవలసినదేమీ లేనట్టు నాకు తోచింది. ఏదేమైనా చర్చను రచ్చబండకు తరలిస్తున్నాను. కావలంటే ఇక అక్కడ కొనసాగించగలరు. --వైజాసత్య (చర్చ) 08:34, 3 నవంబర్ 2013 (UTC)
- చర్చ చేయటానికి రచ్చబండ వేదిక ఉంది. నేను ఈ సభ్యుని పేజీలో చర్చ ప్రారంభించలేధు.వివరణ మాత్రమే ఇచ్చాను. ఈ పేజీలో చంద్రకాంతరావు గారి జోక్యం అనవసరం. ఆయన హుందాగా వ్యవహరించాలి. 106.206.177.180
తెవికీ నాణ్యత
మార్చురచ్చబండలో మీరు తెవికీ నాణ్యతను గురించి తెలిపారు. చాలా సంతోషం. చిన్ని వివరణలు కోరుతున్నాను. 200 అక్షరాలు అంటే 4-600 బైట్లు ఉండవచ్చంటారా? మీరు కొన్నేళ్ళుగా పరిశీలిస్తునన్నారు, ఎప్పటి నుండో తెలుపగలరా? ధన్యవాదాలు. --విష్ణు (చర్చ)04:26, 17 డిసెంబర్ 2013 (UTC)
వీరతాడు
మార్చు- నిసార్ భాయ్, నాకు ఈ వీరతాడు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. దశాబ్ది ఉత్సవాలకు నేను పెద్దగా చేసినది ఏమీ లేదు. కాకపోతే కొలరావిపు ప్రతిపాదనలు మాత్రం పరిశీలించటంలో నావంతు సహాయం చేశాను. వికీ పురస్కారం అందుకున్న సందర్భంగా శుభాభినందనలు --వైజాసత్య (చర్చ) 07:07, 1 జనవరి 2014 (UTC)
గొల్లతగుడి గురించి
మార్చు{{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
వర్గం:నెల్లూరు జిల్లా మండలాలు
మార్చువర్గం:నెల్లూరు జిల్లా మండలాలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --కె.వెంకటరమణ (చర్చ) 17:50, 31 డిసెంబర్ 2013 (UTC)
మొలకల బాటు మార్పులు
మార్చువైజాసత్య గారూ,
మొలకల జాబితా లో ప్రస్తుతం మొలక పేరు. వ్యాసకర్త పేరు మాత్రమే చూడగలము. వీటితో బాటు ఆయా వ్యాసాల పరిమాణమును కూడా చూపించే విధముగా దానిని రూపొందించే బాటులో మార్పులు చేస్తే ఉపయుక్తముగా ఉంటుంది. వ్యాస పరిమాణము 2 కొలో బైట్లు దాటినదా లేదా అనే విషయము తెలుసుకోవడానికి ప్రస్తుతమున్న మార్గము ముంజేతి కంకణము. అది పనిచేయడము లేనందున ఈ మార్పును సూచిస్తున్నాను. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:17, 4 జనవరి 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ, ఈ సమస్యను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. ముంజేతి కంకణం మళ్ళీ పనిచేసేలా చేశాను. కాబట్టి మొలకల పేజీకి మార్పులు అవసరంలేదనుకుంటా --వైజాసత్య (చర్చ) 05:07, 5 జనవరి 2014 (UTC)
- ధన్యవాదములు వైజాసత్య గారూ,
- బ్రతికించారు. మీకు అభ్యంతరం లేకపోతే, ముంజేతి కంకణములో ఉత్పన్నమైన సమస్య వివరాలు, పరిష్కారము తెలుపగలరా? ఉత్సుకత కొద్దీ అడుగుతున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:13, 5 జనవరి 2014 (UTC)
- ధన్యవాదములు వైజాసత్య గారూ,
You can remove this notice at any time.
వ్యక్తిగత వ్యాసం
మార్చువైజాసత్య గారు,నా వ్యక్తిగత వ్యాసం తొలగింపుపై మీ సలహాకు ధన్యవాదం,నాస్పందనను రచ్చబండలో వ్యక్తపరచాను.Palagiri (చర్చ) 12:16, 23 జనవరి 2014 (UTC)
స్వాగతం
మార్చుతెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 04:37, 29 జనవరి 2014 (UTC)
స్వాగతం
మార్చువైజా సత్య గారూ ! స్పందనకు ధన్యవాదాలు. [3] ఈ లింకు ఆధారంగా చేస్తున్నాను. బాటుద్వారా చేసే వీలుంటే మీరు ప్రయత్నించండి. నిజానికి నాకు ఇది చేయడానికి తగిన వ్యవధిలేదు ఫిబబ్రవరి 01 నుండి 14 వరకు వారణాశి వెళుతున్నాను. వెళ్ళే వరకు మాత్రమే చేయగలను. మీరు ఆరంభించేవరకు నేను చేయగలిగినంత చేస్తాను.--t.sujatha 08:41, 31 జనవరి 2014 (UTC)
- {{subst:స్వాగతం/దశాబ్ధి ఉత్సవాలు}} అవసరమనుకుంటే స్వాగతం చెప్పడానికి ఈ మూసను ఉపయోగించవచ్చు.--t.sujatha 08:47, 31 జనవరి 2014 (UTC)
- సుజాత గారూ, బాటు పని ప్రారంభించింది. ఇక మీరు ఇతర పనులపై దృష్టి పెట్టవచ్చు --వైజాసత్య (చర్చ) 08:59, 31 జనవరి 2014 (UTC)
- వైజాసత్యగారూ ! ధన్యవాదాలు. ఇక నాపని నేను చేసుకు పోతాను. --t.sujatha 11:29, 31 జనవరి 2014 (UTC)
మీజాన్ పత్రిక గురించి
మార్చు- వైజాసత్య గారూ, మీ ఫర్మాయిష్ ప్రకారం, జనవరి 24 న మీకు ఒక మెయిల్ పంపాను. బహుశా మీరు చూసేవుంటారు. అది పి.డి.యఫ్. ఫైలు. అందులో మీజాన్ ఉర్దూ పత్రిక యొక్క మార్చి 14, 1944 ముఖ పేజీలో గల విశేషాలు తెలుగులో తర్జుమా చేసి పంపాను. ఉర్దూ మరియు తెలుగు భాషలలో గలదు. ఓసారి చూడగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:23, 11 ఫిబ్రవరి 2014 (UTC)
- నిసార్ గారూ, మీ చాలా శ్రమకోర్చి తెలుగులోకి అనువదించి పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. ఏదో మూడు నాలుగు ముఖ్య వార్తల శీర్షికలు వ్రాసి పంపిస్తారని అనుకున్నాను కానీ మీరు దానికి చాలా సమయం వెచ్చించారని అనిపించి నాకు మీకా పని పెట్టినందుకు కాస్త చివుక్కుమన్నది. అందునా ఆ పత్రికలో స్థానిక వార్తలేమీ లేకపోవటం ఒకింత ఆశ్చర్యమును, కాస్త నిరుత్సాహం కలిగింది. కానీ మీరు నా మాట మన్నించి తర్జుమా చేసినందుకు ధన్యవాదాలు. కాస్త తీరిక దొరికినప్పుడు ఉర్దూ వేగంగా చదవగలిగే స్థాయి చేరాలన్నది నా ఆకాంక్ష --వైజాసత్య (చర్చ) 02:31, 12 ఫిబ్రవరి 2014 (UTC)
ధన్యవాదం
మార్చువైజాసత్య గారు,అవార్డు ఎంపిక కమిటి తరుపున మీ అభినందనకు ధన్యవాదం,దశాబ్ది ఉత్యవం విజయవంతంగా జరిగినది.00:44, 17 ఫిబ్రవరి 2014 (UTC)Palagiri (చర్చ) 00:48, 17 ఫిబ్రవరి 2014 (UTC)
- అవార్డు ఎంపిక కమిటి తరుపున మీ అభినందనకు ధన్యవాదాలు.---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 01:55, 17 ఫిబ్రవరి 2014 (UTC)
- సాంఖ్యిక ప్రశంసాపత్రం ప్రదానం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కని ప్రోత్సాహకాన్ని అందజేసి, తెవికీ తోడ్పాటుకి మా కృషిని అభినందించటంలో ముందున్నందుకు హృదయపూర్వక అభినందనలు. - శశి (చర్చ) 11:26, 17 ఫిబ్రవరి 2014 (UTC)
- అవార్డు ఎంపిక కమిటి తరుపున మీ అభినందనకు ధన్యవాదాలు.---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 01:55, 17 ఫిబ్రవరి 2014 (UTC)
నమస్కారం
మార్చుకొన్ని సంవత్సరాల నుంచి నేను వికిపీడియాలో రచనలు చెయ్యలెదు, మళ్ళీ రచన మొదలుపెట్టాలి అని అనుకుంటున్న తరుణంలో కొలరావిపు ప్రశంసా పతకం అందటం జరిగింది. ఇంత కాలం వికీలో రచనలు చెయ్యకపోవుట కారణంగా పట్టు తప్పింది, కాస్త సహకారం అందించమని మనవి. మరొక విషయం ఏమనగా, నేను నా వాడుకరి పేరును మార్చుకోవాలి అని అనుకుంటున్నాను, అది సాధ్యపడగలదో లేదో తెలుపగలరు. ధన్యవాదాలు. Mukteshvari (చర్చ) 12:46, 17 ఫిబ్రవరి 2014 (UTC)
- ముక్తేశ్వరి గారూ, మీరు మళ్లీ వికీలో రచనలు చేయాలనుకోవటం సంతోషకరం. వాడుకరి పేరును భేషుగ్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతం తెవికీలో క్రియాశీలకంగా ఉన్న అధికారుల (రాజశేఖర్ గారు కానీ, అర్జున గారి) చర్చా పేజీలో వ్రాయండి. వారు మీ పేరును మార్చగలరు. ఇతర ఏ సలహాలకైనా నన్ను తప్పకుండా సంప్రదించగలరు --వైజాసత్య (చర్చ) 12:15, 18 ఫిబ్రవరి 2014 (UTC)
కొత్త పుస్తకాలు
మార్చు- http://www.thraithashakam.org/Books.html లోని కొన్ని పుస్తకాలను వికీసోర్స్ లో ఉంచేందుకు గ్రంధకర్త అనుమతించారు.ఈ పుస్తకాలన్నీ అనూ ఫాంట్ లో ఉన్నాయి.ఖురాన్ భావామృతాన్ని యూనికోడ్ లోకి మార్చినట్లే వీటినీ వికీపీడియా గ్రంధాలయంలో ఉంచగలరా? శ్రీమతి ఉషశ్రీ గారిని ఫోన్.9133353709,indusriushasri@gmail.com లో సంప్రదించగలరు.--Nrahamthulla (చర్చ) 13:22, 13 మార్చి 2014 (UTC)
- రహంతుల్లా గారూ, చాలా సంతోషకర విషయం. ఈ విషయంపై తదుపరి చర్యలకు అర్జున గారిని సంప్రదించగలరు. ఆయన వికీసోర్సులో గ్రంథాలు చేర్చే విషయంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. --వైజాసత్య (చర్చ) 16:36, 15 మార్చి 2014 (UTC)
ఎన్నికల ఫలితాలు
మార్చువైజాసత్య గారు, ఎన్నాళ్ళనుండో నేను ఎదురుచూస్తున్న పని మీరు ఇప్పుడు పూర్తిచేసినందుకు ధన్యవాదాలు. 1951 నుండి 2009 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఫలితాలు మీరు జాబితా రూపంలో తెవికీలో చేర్చారు. అయితే మనం వీటిని మనం ముందు తెలుగులోని అనువాదం చేసుకోవాలి. తర్వాత ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలలో చేర్చాలి. ఇది అందరం కలిసి ఒక పధకం ప్రకారం చేస్తే బాగుంటుంది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ.Rajasekhar1961 (చర్చ) 03:42, 21 మార్చి 2014 (UTC)
- రాజశేఖర్ గారూ, 1955 ఎన్నికల వరకు క్రితం సంవత్సరం మేలోనే పూర్తి చేశాను. 1951 సంవత్సరం ఎన్నికల విషయంలో కాస్త సాంకేతిక ఇబ్బంది ఎదురయ్యింది. అది మళ్ళీ ఇప్పుడు పరిష్కరించటానికి కూర్చున్నాను. ఇంకో రోజులో ఆ జాబితా పూర్తి కాగలదు. అనువదించి ఆయా నియోజకవర్గాల్లో చేరుద్దామా? ఆయా నియోజకవర్గాల్లో చేర్చి అనువదించుదామా? --వైజాసత్య (చర్చ) 05:25, 21 మార్చి 2014 (UTC)
- ధన్యవాదాలు. నేను గమనించలేదు. నియోజకవర్గాలలో చేర్చడం యాంత్రికంగా చేయాలా; లేదా మీరేదైనా బాటుతో సుళువుగా చేయగలరా. ఒకవేళ బాటుతో చేయగలిగితే నియోజకవర్గాలలో చేర్చిన తర్వాత అందులోని సమాచారాన్ని అనువదించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:07, 21 మార్చి 2014 (UTC)
ఏప్రిల్ 27, 2014 సమావేశం
మార్చుఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:51, 23 ఏప్రిల్ 2014 (UTC)
Your admin status (వైఙాసత్య)
మార్చుHello. I'm a steward. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus recently. According to this policy, the stewards are reviewing administrators' activity on wikis with no inactivity policy. You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on tewikisource, where you are an administrator. Since that wiki does not have its own administrators' rights review process, the global one applies. If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights. We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard. Best regards, Rschen7754 00:46, 25 జూలై 2014 (UTC)
విశేష వ్యాసాల కొరకు ప్రతిపాదనలు
మార్చువైజాసత్య గారూ, నమస్కారం. వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి మీ అభిప్రాయాలు తెలుపండి. ఈ ప్రక్రియకు మెరుగు పరచండి. తగిన రీతిలో మార్పులు చేర్పులు జరిగిన తరువాత అమలు చేసేందుకు చర్చకు పెడదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 20:56, 2 ఆగష్టు 2014 (UTC)
వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
మార్చునమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:59, 3 ఆగష్టు 2014 (UTC)
విశేష వ్యాసాల ఎన్నిక-బాధ్యత
మార్చు- సత్యగారూ, వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓ కంట చూస్తూ వుండండి. విశేష వ్యాసాలుగా ఎన్నిక చేసే బాధ్యత (ప్రస్తుత ఎన్నికకు) ముగ్గురిది. 1.మీరు, 2. రాజశేఖర్ గారు 3. అర్జున గారు (ప్రోటోకాల్ సుమా! - ఆక్టివ్ వికీపీడియన్స్ కాబట్టి). అహ్మద్ నిసార్ (చర్చ) 11:22, 6 ఆగష్టు 2014 (UTC)
- నిసార్ భాయ్, ప్రస్తుతం చురుకుగా పనిజేస్తున్న వారినే ఆక్టివ్ వికీపీడియన్ అని అనాలి. నాకు పనుల ఒత్తిళ్ల వళ్ల మరో మూడు, నాలుగు నెలలపాటు ఇక్కడికి తరచుగా వచ్చే వీలుపడదు. ఆ తర్వాత ఖచ్చితంగా తిరిగి క్రియాశీలకమై తెలుగు వికీకి నా సేవలను అందించగలను. అధైర్యపడకుండా చక్కగా సముదాయాన్ని ముందుండి నడిపించగలరు. మీకా సత్తా, అనుభవం మరియు కలుపుగోలుతనం మెండుగా ఉన్నాయని నా అభిప్రాయం. --వైజాసత్య (చర్చ) 02:08, 20 ఆగష్టు 2014 (UTC)
Your admin status (వైజాసత్య)
మార్చుHello. I'm a steward. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus recently. According to this policy, the stewards are reviewing administrators' activity on wikis with no inactivity policy.
You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on tewikibooks, where you are an administrator. Since that wiki does not have its own administrators' rights review process, the global one applies.
If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights.
We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard.
పప్పూరి రామాచారి
మార్చువైజాసత్య గారూ ఈయన పేరు పప్పూరు రామాచార్యులు అనే వాడుకలో ఉంది. పప్పూరి రామాచారి అని కాదు. కాబట్టి పప్పూరి రామాచారి పేజీని పప్పూరు రామాచార్యులు పేజీకు దారిమళ్ళిస్తే బాగుంటుంది.--స్వరలాసిక (చర్చ) 11:01, 9 సెప్టెంబరు 2014 (UTC)
- అలాగే నండి స్వరలాసిక గారూ --వైజాసత్య (చర్చ) 02:01, 10 సెప్టెంబరు 2014 (UTC)
Movie songs classical ragas list
మార్చునమస్తే!
ఆ మధ్య browse చేస్తూ మీరు కాసుబాబు గారు అనుకుంటాను discuss చేస్తున్న excel list చూసాను ఎక్కడో వికీలో. ఆ లంకె ఇప్పుడు కనపడటంలేదు. మీదగ్గర ఉంటే దయచేసి ping చెయ్యగలరు.
ధన్యవాదములు
~~ krittivaas
ధన్యవాదాలు
మార్చువైజాసత్యగారూ ! మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు ఉద్యోగబాధ్యతలు అధికమని నాకు తెలుసు. ఈ పని ఒక సంవత్సర కాలం చేయాలని అనుకున్నాను. అనుకున్న గడువులో పూర్తి చేస్తాను. మీ నుండి ఇలా ప్రోత్సాహకరమైన అభినందనలు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చాలు మరికొంత కాలం తెవికిలో పని కొనసాగించడానికి. --t.sujatha (చర్చ) 03:17, 16 సెప్టెంబరు 2014 (UTC)
ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
మార్చువైజాసత్య గారూ, నమస్కారం. IEG గ్రాంట్స్ క్రింద, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అనే ప్రాజెక్టును చేపట్ట దలచాను, అందులకు మీ అమూల్యమైన సంపూర్ణ సహకారము కోరుచున్నాను. అలాగే ఈ ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారులలో ఒకరుగా వుండవలసినదిగా మనస్పూర్తిగా కోరుచున్నాను. మీరు మీ అమూల్యమైన సమయాన్ని దీని కొరకు కేటాయించనక్కరలేదు. ప్రాజెక్టుపై ఓ నిఘా పెట్టి అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ వుండండి, దిశానిర్దేశాలు చేస్తూ వుండండి. నాకోరికను మన్నిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 14:55, 28 సెప్టెంబరు 2014 (UTC)
- అహ్మద్ నిసార్ గారూ, చక్కని ప్రయత్నం. పైగా నాకు చరిత్ర బాగా నచ్చిన విషయం. అలాగే తప్పకుండా నాకు వీలైన సలహాలు, సహకారం అందించగలను --వైజాసత్య (చర్చ) 01:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
దీపావళి శుభాకాంక్షలు
మార్చుమీకూ, మీ కుటుంబసభ్యలకు దీపావళి శుభాకాంక్షలు. వెలుగుల పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాను.
అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి:
మీ సన్నిహితుడు
పవన్ సంతోష్ (చర్చ) 12:56, 23 అక్టోబరు 2014 (UTC)
ఆంగ్ల వికీలో వలె సమగ్రమైన మూలాల కోసం
మార్చుమూలాలను చేర్చేందుకు ఆంగ్లవికీలో సైట్ సోర్సెస్ అనే వీలు ద్వారా (హెల్ప్ అనే ఆప్షన్ పక్కన ఉండడం అందరికీ విదితమే) సమగ్రంగా అందించేందుకు వీలు దొరుకుతోంది. తెవికీలో కూడా నేను ఆ మూసలే వాడి ఈ మధ్య మూలాలు చేరుస్తున్నాను. ఐతే అక్కడిలాగా నేరుగా పైన సహాయం పక్కన వచ్చేలా చేస్తే తేలికగా నింపి మూలాలు అందించగలను. దీని కొరకు ఎప్పటినుంచో చూస్తున్నాను. ఏం చెయ్యగలమన్న విషయం తెలియట్లేదు. మీకు వీలుంటే స్పందించండి.--పవన్ సంతోష్ (చర్చ) 00:50, 26 అక్టోబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, దానికి రెఫరెన్స్ టూల్ బార్ 2.0b ని ఇక్కడ స్థాపించాలి. నేను ఆ పనిచేస్తాను. కానీ అది వెనువెంటనే ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చు. ఎందుకంటే దానికి కావలసిన మూసలు, సందేశాలు వగైరా స్థానికీకరించుకోవటానికి కొంత కృషి అవసరం --వైజాసత్య (చర్చ) 12:07, 26 అక్టోబరు 2014 (UTC)
- ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 13:31, 26 అక్టోబరు 2014 (UTC)
- ఈ మూసలలోని సమాచారాన్ని స్థానికీకరణ చేయడానికి పవన్, నేను పనిచేస్తాము. దీనిని స్థాపించడం వలన వాడుకరులు వారి వ్యాసాలలో మూలాల్ని సవివరంగా చేర్చడానికి, తద్వారా మన నాణ్యత మెరుగుపడడానికి తోడ్పడుతుంది.--Rajasekhar1961 (చర్చ) 15:59, 26 అక్టోబరు 2014 (UTC)
- ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 13:31, 26 అక్టోబరు 2014 (UTC)
వాడుకరి పేరు మార్పు సహాయం
మార్చుసెప్టెంబరు మొదటి వారంలో వాడుకరి:janardhan36 తన పేరును వాడుకరి:జనార్దనశర్మ గా మార్చమని సహాయం కోరి ఉన్నారు. నెలరోజులు అయినా కూడా తనకు సహాయం అందనందుకు అసంతృప్తిని మూస చర్చ:సహాయం కావాలి లో వ్యక్తపరచినాడు. అతనికి సహాయం అందుతుందేమో దయచేసి పరిశీలించగలరు.---- కె.వెంకటరమణ⇒✉ 09:18, 26 అక్టోబరు 2014 (UTC)
- వైజాసత్య గారికి, నాకు తన పేరును ఎలామార్చాలో తెలియదు. దయచేసి ఈ సహాయం మీరు చేయగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:56, 26 అక్టోబరు 2014 (UTC)
- రాజశేఖర్ గారూ, నాకు పేరుమార్పు చేసే అనుమతి లేదు. మీరు Special:RenameUser పేజీ ఉపయోగించి ఆ పనిచేయవచ్చు. ఇది పెద్ద పనేం కాదు. పేరుమార్చవలసిన పాత వాడుకరి పేరు, కొత్త వాడుకరి పేరు ఇవ్వవలసి ఉంటుంది. ఒక నొక్కుతో పని జరిపోతుంది --వైజాసత్య (చర్చ) 16:21, 26 అక్టోబరు 2014 (UTC)
తెవికీ 11వ వార్షికోత్సవాల ఆహ్వానం
మార్చు- వైజాసత్య గారికి ముందస్తు హెచ్చరిక - ఇప్పటి నుండీ టికెట్లు వైగైరా ఏర్పటు చేసుకోవాలి. ఈ సారి రావడం కుదరదని మిస్సైతే పరిస్థితి విషమించి సాటి వికీపీడియన్లు మీదపడి కరిచేయగలరని (అవకాశం దొరికినపుడు) కొన్ని వికీ వర్గాలలోని వేగులకు అందిన సమాచారం. కనుక త్వరపడి తిరుపతికి సమయానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దాలని (మీరొక్కరే చక్కదిద్దాలా అని బయపదవద్దని మీ పాత సహచరులైన కాసుబాబు,ప్రదీప్, దేవ్, బ్లాగేశ్వరుడూ అనే మరో బాబు ఇంకా మరికొందరు కూడా మీ తోడుగా వచ్చేలా చర్యలు తీసుకోబడతాయని కూడా లోపాయికారీ సమాచారం) నా ద్వారా ఇది లోకల్ వారి కోరిక...విశ్వనాధ్ (చర్చ) 13:27, 31 అక్టోబరు 2014 (UTC)
- విశ్వనాధ్ గారూ, ఇదే విషయం మీతో ఇవ్వాలో, రేపో చెప్పబోతున్నాను. అంతలోనే మీరు వ్రాశారు. నేను జనవరిలో ఇండియా వస్తున్నాను. కానీ ఫిబ్రవరీ దాకా ఉండలేను. నేను తిరిగి జనవరి 24 కళ్ళా ఇక్కడుండాలి. కొంతమంది వికీయులను కలవగలను కానీ వార్షికోత్సవానికి ఉండలేను --వైజాసత్య (చర్చ) 10:58, 1 నవంబర్ 2014 (UTC)
- ధన్యవాదాలు. మిమ్మల్ని ఇండియాలో కలవాలని కుతూహలంగా ఉన్నది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏయే ప్రాంతాలలో ఉంటారో తెలియజేస్తే ఆ దగ్గర్లోనున్న తెవికీ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. దయచేసి తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 06:46, 18 నవంబర్ 2014 (UTC)
- జనవరి మొదటి ఆదివారం మన తెవికీ సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తాను. చుట్టుప్రక్కలనున్న సభ్యుల్ని కలుద్దాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:06, 20 నవంబర్ 2014 (UTC)
- Rajasekhar1961 గారూ, వీలైతే జనవరి 10 లేదా జనవరి 11 తేదీలో సమావేశం ఏర్పాటు చేయగలిగితే నేను హైదరాబాదులో సహ తెవికీయులను కలవగలను. వీలుకాకపోతే మరోసారి వచ్చినప్పుడు కలుద్దాం --వైజాసత్య (చర్చ) 10:18, 30 డిసెంబరు 2014 (UTC)
- విశ్వనాధ్ గారూ, ఇదే విషయం మీతో ఇవ్వాలో, రేపో చెప్పబోతున్నాను. అంతలోనే మీరు వ్రాశారు. నేను జనవరిలో ఇండియా వస్తున్నాను. కానీ ఫిబ్రవరీ దాకా ఉండలేను. నేను తిరిగి జనవరి 24 కళ్ళా ఇక్కడుండాలి. కొంతమంది వికీయులను కలవగలను కానీ వార్షికోత్సవానికి ఉండలేను --వైజాసత్య (చర్చ) 10:58, 1 నవంబర్ 2014 (UTC)
- చాలా చాలా ధన్యవాదాలు. తెవికీ మీద మీకున్న అభిమానానికి ఇదొక ఉదాహరణ. జనవరి 11 తేదీన (సంక్రాంతి ముందు ఆదివారం) హైదరాబాదులో TOU లో నెలవారీ సమావేశాన్ని ఏర్పాటుచేస్తాము. మీ సమయాన్ని సద్వినియోగం చేయడానికి వీలైనంత ఎక్కువమందిని సమావేశపరచి మీతో కల్పించి వారిని మరింత క్రియాశీలకంగా చేయడానికి ప్రయత్నిస్తాను. మరోసారి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:26, 30 డిసెంబరు 2014 (UTC)
- మీరు హైదరాబాదు వచ్చారా. మనం ఎక్కడ, ఎప్పుడు కలుద్దామో దయచేసి తెలియజేయగలరు. నేను, పవన్ సంతోష్ మిమ్మల్ని కలుస్తాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:04, 9 జనవరి 2015 (UTC)
పిట్స్‌బర్గ్ వ్యాసం అనువాదంలో సహాయం
మార్చునమస్కారం. ఇంగ్లీషు వికీపీడియానుండి పిట్స్‌బర్గ్ వ్యాసాన్ని తెలుగులోనికి అనువాదం చేయడంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మీకు వీలైనప్పుడు కొంచెం కొంచెం అనువాదం చేస్తూ ఉండండి.--స్వరలాసిక (చర్చ) 23:57, 17 నవంబర్ 2014 (UTC)
- స్వరలాసిక గారూ, అలాగే సహాయం చేస్తాను. కానీ పిట్స్‌బర్గునే ఎంచుకోవటంలో ఆంతర్యమేవిటని కొంచెం కుతూహలం. మీరు పిట్స్‌శైలాధివాసులా? --వైజాసత్య (చర్చ) 00:50, 18 నవంబర్ 2014 (UTC)
- వైజాసత్యగారూ, అబ్బే కాదండీ. నేను హైదరాబాదులో ఉంటాను. నా వ్యాసాలలో ఎర్రరంగులో వున్నవాటిని నీలిరంగులోనికి మార్చే చర్యలో భాగంగా పిట్స్‌బర్గును ఎంచుకోవలసి వచ్చింది.--స్వరలాసిక (చర్చ) 00:57, 18 నవంబర్ 2014 (UTC)
కందనూరు గురించి
మార్చునమస్తే,
మీది ప్రకాశం పరిసర ప్రాంతాలని విన్నాను. నేను ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కర్నూలు జిల్లా గ్రామాల చర్చపేజీలు చూస్తున్నప్పుడు అక్కడ మీరు తెలిసినట్టుగా కొన్ని వాగుల గురించి, కొండల గురించి స్థానికులైన రచయితలతో మాట్లాడడం గమనించాను. కనుకనే అడుగుతున్నాను.
1830 ప్రాంతాల్లో కర్నూలు, కొంతవరకూ కడప, ప్రకాశం వంటి జిల్లాల ప్రాంతాలను పరిపాలించినది కందనూరు నవాబని కాశీయాత్రచరిత్ర, కథలూ గాథలు వంటివాటి వల్ల బాగా తెలుస్తోంది. అందరూ కందనూరు నవాబు, కందనూరు నవాబు అని వ్రాసేవారే తప్ప వారి పేరేంటో దొరకలేదు. ఆ నవాబు, వారి పరిపాలన గురించి నా వద్ద విస్తారమైన సమాచారం ఉంది. ఇంతకీ ఈ కందనూరు గ్రామ వ్యాసంలోనైనా వివరాలు వ్రాద్దామంటే అసలు కందనూరు, కందినూరు, కందెనూరు వంటి చిన్న చిన్న పేరు మార్పులతో ప్రయత్నించినా ఆ నవాబు గ్రామమేమిటో తెలయట్లేదు. 150 ఏళ్ళ క్రితం ఇంత పరిపాలనా కేంద్రంగా విలసిల్లిన గ్రామం హఠాత్తుగా మాయం అయిపోదు కదా. ఇంతకీ ఆ గ్రామమేమిటి.
ఆ నవాబు పరిపాలన గురించిన వివరాలతో కందనూరు రాజ్యమనో, సంస్థానమనో పేరు పెట్టి ఓ వ్యాసం ప్రారంభించేదా? లేదా గ్రామ వ్యాసమే వెతికి పట్టుకుని వ్రాసేదా? కందనూరు ఏమైనట్టు? కొంపదీసి కర్నూలు కాదు కదా? ఒకవేళ అయితే కర్నూలు అన్న పేరును మాట మాత్రం కూడా తలవకుండా కాశీయాత్రాచరిత్రలో మరీ కందనూరు, కందనూరు అని జపం చేస్తాడేం?--పవన్ సంతోష్ (చర్చ) 03:50, 27 నవంబర్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ. హహ్హహ్హా, మీరూహించినది చాలా కరెక్ట్. తుంగభద్రను దాటేముందు బళ్ల ఇరుసులకి కందెన (గ్రీసు) పూసే వారట. అందుకే కందెనూరు, కందనూరు, కందెనవోలు, కర్నూలయ్యింది. వీరాస్వామయ్య గారు యాత్రలు చేసేనాటికి అలాగే పిలిచేవారనుకుంటా. --వైజాసత్య (చర్చ) 03:58, 27 నవంబర్ 2014 (UTC)
- సూపర్. అయితే నేను కర్నూలు చరిత్రలో వ్రాసుకుంటాను. కందెనవోలు నవాబులు, కర్నూలు నవాబులు అని గానీ కర్నూలు సంస్థానం అని గానీ పేరు పెట్టి ఓ వ్యాసం వ్రాయొచ్చంటారా?--పవన్ సంతోష్ (చర్చ) 04:01, 27 నవంబర్ 2014 (UTC)
- కర్నూలు నవాబులు అని పేరుపెట్టి వ్రాయండి. కర్నూలు స్వతంత్ర సంస్థానంగా ఎక్కువ రోజులు ఉండలేదు. స్వాత్రంత్ర్యం వచ్చేనాటికి కర్నూలు జిల్లాలో బనగానపల్లె సంస్థానం ఒక్కటే మిగిలింది --వైజాసత్య (చర్చ) 04:08, 27 నవంబర్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ. హహ్హహ్హా, మీరూహించినది చాలా కరెక్ట్. తుంగభద్రను దాటేముందు బళ్ల ఇరుసులకి కందెన (గ్రీసు) పూసే వారట. అందుకే కందెనూరు, కందనూరు, కందెనవోలు, కర్నూలయ్యింది. వీరాస్వామయ్య గారు యాత్రలు చేసేనాటికి అలాగే పిలిచేవారనుకుంటా. --వైజాసత్య (చర్చ) 03:58, 27 నవంబర్ 2014 (UTC)
కర్నూలు చరిత్ర శుద్ధీకరణలో తోడ్పాటు
మార్చుఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్రను సామాజిక చరిత్రకు, కొంత పరిపాలన వ్యవహారాలకు, దిగవల్లి వెంకట శివరావు కథలు-గాథలులో కందనూరు నవాబుల పాలన అన్న అధ్యాయాన్ని రాజకీయ చరిత్రకు మూలాలుగా స్వీకరించి ప్రస్తుతం కర్నూలు నవాబుల గురించి ఓ వ్యాసం తయారుచేస్తున్నాను. ఐతే కర్నూలు చరిత్రలో చూస్తే ఔరంగజేబు, మరాఠాలు, మైసూరు రాజ్యం, నిజాం, ఈస్టిండియా కంపెనీల పాలనలో ఉన్నట్టు చూపిస్తోంది. నిజమే. కాకుంటే వీరందరికీ సామంతులుగా కొనసాగుతూ, మరాఠా-ఫ్రెంచి-మైసూర్ ముట్టడులు ఎదుర్కొని ఓడి ఈ ప్రాంతాన్ని అర్థస్వతంత్రులుగా, స్వతంత్రులుగా వివిధ పద్ధతుల్లో 1840 వరకూ పరిపాలించిన కర్నూల్ నవాబుల ప్రస్తావనే లేదు. నేను వ్రాస్తున్న కర్నూలు నవాబులు వ్యాసంలో ఈ చరిత్ర విపులంగా వ్రాస్తున్నా దాన్ని క్లుప్తంగా ఇక్కడ శుద్దీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. కనుక ఈ విషయంలో మీరేదైనా సాయం చేయగలరేమోనని అడుగుతున్నాను. ప్రస్తుతం నేను కర్నూలు నవాబుల పేజీలో విపులంగా రాసిందే మళ్ళీ ఇక్కడ క్లుప్తంగా రాయాలంటే ఒకే పరీక్ష రెండుసార్లు రాసినట్టుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నేరుగా మూలాల నుంచే రాస్తానంటే కాశీయాత్రచరిత్ర పేజీలో దాని పీడీఎఫ్ లింకు(లేదా మన వికీసోర్సులో పుస్తకం), కథలు-గాథలు పేజీలో దాని డీఎల్‌ఐ లింకూ ఉన్నాయి.--పవన్ సంతోష్ (చర్చ) 03:33, 1 డిసెంబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అలాగే! నేను కర్నూలు వ్యాసంలో క్లుప్తంగా వ్రాస్తాను. కర్నూలు నవాబులు వ్యాసాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 04:45, 1 డిసెంబరు 2014 (UTC)
సైట్ మూస గురించి
మార్చుసైట్ చేసేందుకు వస్తున్న బటన్ చాలా ఉపయుక్తంగా ఉంది. చేర్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను కొందరు కవుల గురించి వ్రాస్తూంటే తెలుగువారికి సైట్ బుక్, సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ జర్నల్ టెంప్లెట్లే కాక మరొకటి అవసరమని తెలుస్తోంది. మన పద్యాలను పూర్వం పండితులు కోట్ చేసేప్పుడు కుమారసంభవం 8వ ఆశ్వాసం 135 పద్యం వగైరా విధంగా ఇచ్చేవారు. ఆశ్వాసమో, స్కంధమో, కాండమో ఏదోకటి ఉండి పద్యసంఖ్య సహా ఇస్తే వీలుగా వుంటుంది. మనం ఈ టెంప్లెట్లలో అలా పద్యాలను సైట్ చేసేందుకు కూడా వీలైన విధానం తయారుచేసుకుంటే బావుంటుందనిపిస్తోంది. దీనికి తగ్గ సాంకేతిక విషయంలో సహకారం చేస్తానంటే నేను అదెలా ఉండొచ్చో నా ఊహ నేను చెప్తాను. దీనిపై వెంకటరమణ గారు వంటి వారు కూడా సహకరిస్తే బావుంటుంది. ఏమంటారో తెలియజేయగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 06:17, 7 డిసెంబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అలాగే, తప్పకుండా సహాయం చేయగలను. ఈ మూసలో ఏఏ ఫీల్డులు ఉండాలో తెలియజేస్తే తదనుగుణంగా మూసను తయారుచేసి, సైట్ బటన్లో వచ్చేలా చేయగలను --వైజాసత్య (చర్చ) 03:44, 8 డిసెంబరు 2014 (UTC)
- సాధారణంగా పూర్వులైన పండితులు రిఫరెన్సులు ఇచ్చే విధానం చూ.ఫలానా గ్రంథం, ఫలానా కాండ, 21 పద్యం అని వుంటుంది.
- కవి పేరు.
- గ్రంథం పేరు వ్రాసే వీలు ఉండాలి.
- విభాగం పేరు నిర్ధారించేందుకు వీలు ఉండాలి. ఉదా: కాండం, స్కంధం, అంకం, పర్వం వగైరా.
- వేరే ఆప్షన్‌లో విభాగం అంకె వేసుకునేందుకు వీలివ్వాలి ఉదా: 1, 2, 3 లేదా ప్రథమ, ద్వితీయ, తృతీయ తదితరాలు లేదూ అరణ్య, అజ్ఞాత, కిష్కింధ, సభా.
- ఆపైన ఉపవిభాగం కూడా ఉంటే అదీ నిర్ధారించే అవకాశం ఇవ్వాలి ఉదా: రామాయణ కల్పవృక్షంనో ఖండాలు అనేవి కాండలకు ఉపవిభాగాలుగా ఉంటాయి.
- తదనంతరం వీటి ఉపవిభాగాన్ని నిర్ధారించే వీలు ఇవ్వాలి ఉదా:ఇష్టి, కళ్యాణ, తదితరాలు.
- చివరగా పద్యం సంఖ్య.
- మధ్యలో పద్యం పేరు కూడా ఇచ్చే వీలు.
ఇవన్నీ కలిస్తే వచ్చేది ఇలా ఉండొచ్చు: విశ్వనాథ, సత్యనారాయణ. రామాయణ కల్పవృక్షము, బాలకాండము:ఇష్టిఖండము 36వ పద్యం. లేదా పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధము:రుక్మిణీ కళ్యాణ ఘట్టం 43 పద్యం.--పవన్ సంతోష్ (చర్చ) 07:49, 9 డిసెంబరు 2014 (UTC)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మార్చువైజాసత్య గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:43, 2 జనవరి 2015 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ, ధన్యవాదాలు. ఈ కొత్త సంవత్సరం మీకు శుభదాయకం కావాలని కోరుకుంటున్నాను --వైజాసత్య (చర్చ) 00:40, 27 జనవరి 2015 (UTC)
సహాయ అభ్యర్థన
మార్చువైజాసత్య గారికి, నమస్కారము. నేను మొదటి సారిగా 24.1.15 న ఒక పుటను దిగుమతి చేశాను. దానితో పాటు మిగాతా అనుబంధములు కూడా దిగుమతి అయ్యాయి.[4] తదుపరి కొన్ని గంటల అనంతరం తెలుగు వికీ మూసలు, మూలాలు పని చేయలేదు. నేను దిగుమతి చేసి కారణము వల్ల, జరిగిందేమోనని ఈ రోజు వాటిలో కొన్ని తొలగించాను. ఆ తదుపరి సమస్య మరింత జటిలం అయ్యింది. తెలిసి తప్పు చేయలేదు. కనుక మీరు సహృదయముతో అర్థము చేసుకొన గలరు. దయచేసి సమస్యకు పరిష్కారము చూపగలరు. తోటి వికీ వాడుకరులకు కలిగిన అసౌకర్యమునకు మంచి మనసులతో మన్నించ గలరు. వీలయినంత త్వరలో ఈ సమస్య సరి దిద్దగలవారు సహాయ పడగలరని అభ్యర్థించు చున్నాను. JVRKPRASAD (చర్చ) 00:37, 25 జనవరి 2015 (UTC)
- JVRKPRASAD గారూ, మీరు ఏ పుటను దిగుమతిచేసినప్పుడు ఈ విధంగా జరిగిందో తెలియజేయండి. నేను పరిశీలిస్తాను --వైజాసత్య (చర్చ) 23:23, 26 జనవరి 2015 (UTC)
- మీ స్పందనలకు ముందుగా ధన్యవాదములు. నేను Air Force one అనే పుటను దిగుమతి చేశాను. ఆరోజున వెతుకు దగ్గర ఉన్న చర్చ, ప్రయోగశాల, అభిరుచులు, బీటా,...........ఇవి నిలువ వరుస నుండి అడ్డవరుసకి అదేరోజున ముందుగా కొద్ది వ్యవధిలోనే జరిగింది. నేను అదే రోజు రాత్రి (8.00 - 8.30 అనుకుంటా) మూసలు, మూలాలు పని చేయడం లేదు. తదుపరి మూలాలు పని చేశాయి. కానీ మూసలు మాత్రము ఇంకా పని చేయడము లేదు. ఈ సమస్య కొన్ని వికీలలో ఉన్నట్లు మన వాళ్ళు గమనించినట్లు నాకు తెలియజేశారు. JVRKPRASAD (చర్చ) 01:42, 27 జనవరి 2015 (UTC)
శుభాకాంక్షలు
మార్చుఇండియా నుండి మీ తిరుగు ప్రయాణం సాఫీగా సాగిందని భావిస్తాను. పవన్, నేను మీతో జరిపిన చర్చలు చాలా ఉపయోగమైనవి. మీ సహాయ సహకారాలు తెల్గు వికీపీడియాకు ఒక వరం. ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 05:42, 27 జనవరి 2015 (UTC)
- భారతదేశంలో మీరు గడిపిన కొద్ది రోజుల సమయంలో కూడా తెవికీ ప్రాజెక్టుల మంచికోసం మాతో చర్చించినందుకు కృతజ్ఞతలు. మొత్తానికి మీరు క్షేమంగా వచ్చి, లాభంగా వెళ్ళివుంటారని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 15:19, 1 ఫిబ్రవరి 2015 (UTC)
స్వాగతం
మార్చుతిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
సమాధానము కోసం నిరోధించ లేదండి
మార్చువైజాసత్య గారికి, ఈ రోజున కూడా చాలా వ్యాసాలలో అనేక మార్పులు వారికి తోచిన విధముగా చేశారు. . అందువలన 2 గం. నిరోధించాను, సమాధానము తెలిసి ఇవ్వలేదో, తెలియక ఇవ్వలేదో ఇప్పుడు ఫోను చేసి సంప్రదించాను. నిన్న కూడా ఓ వాడుకరి వారి రచనా వ్యాసాంగమునకు భంగము కలిగినట్లు రాజకీయంగా చర్చ చేశారు. వేగ నిరోధకాలు గమ్యానికి అడ్డురావు కనుక, ముందుకు వెళ్ళుతునే ఉంటాము. మనము పెద్దరికంతో కొత్త తరం వారికి చేతనయినంత ఆసరా అందించి, మనకి తెలిసిన విద్యను భవిష్యత్తు వారికి అందించడమే కర్తవ్యం. JVRKPRASAD (చర్చ) 05:56, 7 ఫిబ్రవరి 2015 (UTC)
మొలకలు
మార్చువైజాసత్య గారికి, ప్రస్తుతము నా మొలకలు ఎన్ని ఉన్నాయో, ఎప్పటికప్పుడు జాబితా మరియు పరిమాణము ఎంత ఉంది అని ఎలా తెలుసుకోవాలి ? వ్యాసముగా గుర్తింపు పొందుటకు దాని యొక్క కనీస పరిమాణము ఎంత ఉండాలో దయచేసి తెలియజేయగలరు మరియు ప్రస్తుత మొలక వ్యాస పరిమాణము తగు విధముగా అభివృద్ధి చేయగలను. JVRKPRASAD (చర్చ) 04:45, 20 ఫిబ్రవరి 2015 (UTC)
- JVRKPRASAD గారూ, నేను ముంజేతి కంకణం ఉపకరణాన్ని (నావిగేషన్ పాపప్స్ అని మీ అభిరుచుల్లో ఉంటుంది చూడండి) పెట్టుకున్నాను. అది పెట్టుకున్న తర్వాత, ఏదైనా వ్యాసపు లింకు మీదకు మూషికాన్ని తోలి కొద్దిసేపు తచ్చాడితే ఆ వ్యాసం ఎంత పరిమాణమున్నది, తదితర వివరాలు తెలియజేస్తుంది. ఒక వ్యాసం ఇంత పరిమాణం ఉండాలని ఎలాంటి కట్టుదిట్టమైన నియమాలేవీ లేవు. కానీ ఏదో ఒక కొలబద్ద పెట్టుకొని ప్రారంభించాలి కదా అన్న ఉద్దేశ్యంతో రెండు కిలోబైట్లకు తగ్గినవి తెలుగు వికీపీడియాలో మొలకలుగా వ్యవహరించడం జరగుతున్నది. భవిష్యత్తులో ఈ స్థాయిని మరింతగా పెంచే అవకాశం ఉన్నది. నిన్ననే కదా మీ మొలకల జాబితా తయారు చేసింది. నాకు మళ్ళే మీక్కూడా రెండు వందల యాభై దాకా మొలకలున్నట్టున్నాయి. మీక్కావాలంటే అప్పుడుప్పుడు బాటును నడిపి మీ మొలకల జాబితా తాజాకరిస్తానండి. --వైజాసత్య (చర్చ) 05:00, 20 ఫిబ్రవరి 2015 (UTC)
- ముందుగా మీకు ధన్యవాదములు. మీరు చెప్పిన బాటు నా పేరున మీరు తయారు చేసి ఎక్కడైనా నా పేజీలో పొందుపరచడానికి అవకాశము ఉందంటారా ? అప్పుడు ఎప్పటికప్పుడు మొలకలు వీలయినంత త్వరలో వ్యాసరూపములో మార్చగలను. అటువంటి అవకాశము లేకపోతే మీరన్నట్లు మీకు వీలు అయినప్పుడు జాబితా నాకు పంపగలరు. వీలయినన్ని మొలకలు అభివృద్ధి పరచిన తదుపరి మాత్రమే కొత్తవాటి జోలికి వెళ్ళతాను. మొలకలను సాధ్యమైనంత వేగంగా త్వరలో అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు నాకు ఈ సంగతి గురించిన అవగాహన నాకు లేదు. దయచేసి తగు జవాబు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 07:05, 20 ఫిబ్రవరి 2015 (UTC)
- JVRKPRASAD గారూ, మీరు దేని గురించి ప్రస్తావిస్తున్నారో నాకు స్పష్టంగా అర్ధం కాలేదు. మీరు ఇప్పటి వరకు సృష్టించిన పేజీల్లో ఇంకా మొలక స్థాయిలో ఉన్నవి ఈ పేజీలో (వాడుకరి:JVRKPRASAD/మొలకల జాబితా ) ఉన్నాయి. ఈ జాబితాను రియల్ టైంలో తాజాపరచే సౌకర్యం లేదు. కానీ అప్పుడప్పుడు బాటు నడిపి తాజాకరింపజేయగలను. ఇక ముంజేతి కంకణం గురించి అంటారా, అది అందరికీ సౌలభ్యంలో ఉన్న సదుపాయమే. మీరు పేజీకి కుడివైపు పైభాగంలో ఉన్న అభిరుచులు లలో కెళ్ళి ఉపకరణాలు అనే టాబ్లో నావిగేషన్ పాపప్స్ కు టిక్కుపెట్టి తే చాలు ఈ సదుపాయం మీకు అందుబాటులోకి వస్తుంది. --వైజాసత్య (చర్చ) 08:19, 20 ఫిబ్రవరి 2015 (UTC)
- ముందుగా మీకు ధన్యవాదములు. మీరు చెప్పిన బాటు నా పేరున మీరు తయారు చేసి ఎక్కడైనా నా పేజీలో పొందుపరచడానికి అవకాశము ఉందంటారా ? అప్పుడు ఎప్పటికప్పుడు మొలకలు వీలయినంత త్వరలో వ్యాసరూపములో మార్చగలను. అటువంటి అవకాశము లేకపోతే మీరన్నట్లు మీకు వీలు అయినప్పుడు జాబితా నాకు పంపగలరు. వీలయినన్ని మొలకలు అభివృద్ధి పరచిన తదుపరి మాత్రమే కొత్తవాటి జోలికి వెళ్ళతాను. మొలకలను సాధ్యమైనంత వేగంగా త్వరలో అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు నాకు ఈ సంగతి గురించిన అవగాహన నాకు లేదు. దయచేసి తగు జవాబు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 07:05, 20 ఫిబ్రవరి 2015 (UTC)