వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 7

(వాడుకరి చర్చ:Kvr.lohith/పాత చర్చ 7 నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: inclusion of list. టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
     పాత చర్చ 7   
All Pages:  ... (up to 100)


విలీనం గురించి

Vmakumar గురజాడ వ్రాసిన పుత్తడి బొమ్మా పూర్ణమ్మ గూర్చి తెవికీ లో మూడు పేర్లతో వ్యాసాలున్నాయి. పూర్ణమ్మ పేరుతో వాడుకరి:Rajasekhar1961 గారు 29.10.2009 లో వ్రాసారు. రెండవది పుత్తడి బొమ్మా పూర్ణమ్మా పేరుతో వాడుకరి:Rajasekhar1961 గారు 7.10.2011 న సృష్టించి పూర్ణమ్మ కు దారిమార్పు చేసారు. తరువాత వాడుకరి:Vmakumar గారు 25.4.2015 న పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పేరుతో వ్యాసం వ్రాసి చక్కగా విస్తరించారు. అందులో చర్చా పేజీలో విలీనం గూర్చి చర్చ జరిగింది.చర్చ:పూర్ణమ్మ లో విలీనం గూర్చి తెలియజేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి కనుక 12.7.2015 న విలీనం చేసితిని. విలీనం అనేది ముందుగా ఉన్న వ్యాసంలోనికి చేయాలని సంప్రదాయం ఉన్నది. అందువలన విలీనం చేసితిని. -- కె.వెంకటరమణ 03:19, 16 జూలై 2015 (UTC)Reply

Vmakumar గారూ మీరు అడిగిన సందేహాలను చర్చావేదిక అయిన వికీపీడియా:రచ్చబండ లో ఉంచాను అనుభవం ఉన్న వాడుకరులు సరైన సమాధానాలను తెలియజేస్తారు.-- కె.వెంకటరమణ 03:19, 16 జూలై 2015 (UTC)Reply
రెండు వ్యాసాల వ్యాస చరిత్రలకు భంగం వాటిల్లకుండా విలీనం చేసితిని.Vmakumar గారు కోరినట్లు వ్యాస శీర్షిక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గా మార్చితిని.-- కె.వెంకటరమణ 14:25, 16 జూలై 2015 (UTC)Reply

తిరుమల వ్యాసాలలో విలీనం మూసలు

కె.వెంకటరమణ గారూ తిరుమలకు సంభందించిన వ్యాసాలలో నేను అమర్చిన విలీనం మూసలు కేవలం ప్రయోగాత్మకంగానే. వాటిని దేనిలోనూ విలీనం చేయవలసిన అవసరం లేదు. చర్చ:తిరుమల చరిత్ర మరీ పెద్దది అవుతోంది లో గత చర్చలను చూడండి. పలు వ్యాసాలుగా విడదీయాలని ప్రతిపాదించినది నేనే.. అన్నిటినీ విస్తరించవచ్చు....--విశ్వనాధ్ (చర్చ) 05:56, 1 ఆగష్టు 2015 (UTC)

బాహుబలం గురించి

the literal meaning of valency is బాహుబలం or బలం; it tells how many "hands" an atom has to facilitate combination with another. There is no danger to have two words to convey the same meaning; usage over time will determine the suitability of one over another. Look at hydrogen bomb, fusion bomb, thermonuclear weapon, etc. They are all in use. I hope I answered your question. -Rao Vemuri

వేమూరి వెంకటేశ్వరరావు గారూ, మీరు ఆంగ్లంలో గల రసాయన శాస్త్రనామాలను తెలుగులోకి అనువదించడం నవబరు-2007-సుజన రంజని] లో "వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 7" అనే శీర్షికతో వ్రాయడం చూశాను. వేలన్సీ అనే పదానికి బాహుబలం అని మీ వ్యక్తిగత అభిప్రాయమని తెలుస్తుంది. దీని అర్థం నిఘంటువులలో లేదు. వ్యక్తిగత అభిప్రాయంతో మీరు చేసిన అనువాదం ఎంతమందికి తెలుస్తుంది. రసాయన శాస్త్ర తెలుగు మాధ్యమ పాఠ్య పుస్తకాలలో "సంయోజనీయత" "సంయోగ సామర్థ్యం" అని ఉన్నది. దీని గూర్చి తెలుసుకోగోరు విద్యార్థులు అవే నామాలతో వికీలో,అంతర్జాలంలో శోధిస్తారు. మీరు వ్యక్తిగతంగా సృష్టించిన శీర్షికను తెవికీలోనికి ఎలా చేరుస్తారో దయచేసి తెలియజేయగలరు.దీనికి మూలాలు,ఆధారాలు ఉన్నవా? మూలాలు లేని వాక్యాలను తెవికీ అంగీకరించదు. -- కె.వెంకటరమణ 01:32, 9 ఆగష్టు 2015 (UTC)
వేమూరి గారూ, మీరు "valency" కి సమానార్థాలు గల పదాల వ్యాసాలను సృష్టించి ఆ ఖాళీ వ్యాసంలో #దారిమార్పు[[బాహుబలం]] అనే కోడ్ వ్రాసి సేవ్ చెయ్యండి. అపుడు అంతర్జాలంలో శాస్త్ర విషయాలను శోధించే వాడుకరులు "సంయోజనీయత" అని గానీ "సంయోగ సామర్థ్యం" లేదా "వేలన్సీ" అని గానీ శోధించినా మీరు సృష్టించిన "బాహుబలం" వ్యాసానికి చేరుతుంది. ఈ విధంగా అందరికీ ఆ కొత్త పదం పరిచయమవుతుంది. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 02:09, 9 ఆగష్టు 2015 (UTC)
"మీరు "valency" కి సమానార్థాలు గల పదాల వ్యాసాలను సృష్టించి ఆ ఖాళీ వ్యాసంలో #దారిమార్పుబాహుబలం అనే కోడ్ వ్రాసి సేవ్ చెయ్యండి." అర్థం కాలేదు. - వేమూరి
వేమూరి గారూ "valency" కి సమానార్థ పదాలు వేలన్సీ, సంయోజనీయత, సంయోగ సామర్థ్యం అనే మూడు ఉన్నాయనుకుందాం. ఏ పదం పై క్లిక్ చేసినా మీరు సృష్టించిన బాహుబలం వ్యాసం రావడానికి. పై పదాల వ్యాసాలు పూర్తిగా వ్రాయకుండా #దారిమార్పు[[బాహుబలం]] అని వ్యాసం వ్రాస్తే చాలు. అన్నీ మీరు వ్రాసిన బాహుబలం వ్యాసానికి దారిమార్పులుగా వెళతాయి. నేను చేశాను చూడండి.-- కె.వెంకటరమణ 15:19, 9 ఆగష్టు 2015 (UTC)

రెండు ప్రశ్నలు

  • "వర్గం" తీసేసి అదే వ్యాసాన్ని "రసాయనశాస్త్రంలో పేర్లు" అనే వ్యాసం కింద మార్చడం ఎలా?
  • ఇంగ్లీషు వికీపీడియా నుండి కొన్ని బొమ్మలు దింపుకుని నా బల్ల మీద పెట్టుకున్నాను. వాటిని నా తెలుగు వ్యాసంలోకి ఎక్కిద్దామని విజర్డ్ని ఉపయోగించినప్పుడు సవాలక్ష ప్రశ్నలు అడుగుతోందా విజర్డ్. ఇక్కడేదో కిటుకు ఉంది. అర్థం కావడం లేదు. ధన్యవాదాలు - వేమూరి.
యిది వరకు మీరు ఒకసారి మెండలీఫ్ వ్యాసానికి శీర్షికను మార్చారు. అదే విధంగా మార్చవచ్చు. నేను మారుస్తాను. రెండవది మీరు చేర్చవలసిన చిత్రాలు మీస్వంతమైనవైతే కామన్స్ విజార్డ్ ఉపయోగించండి. స్వంతకృతి అని తెలియజేసినట్లయితే వేగంగా అప్‌లోడు కాగలవు. అప్‌లోడు అయిన తదుపరి తెవికీ వ్యాసంలోనికి చేర్చవచ్చు.-- కె.వెంకటరమణ 18:34, 9 ఆగష్టు 2015 (UTC)

నిఘంటువు

  1. మీ సలహా ప్రకారం తెలుగు-ఇంగ్లీషు రసాయన శాస్త్ర నిఘంటువు ప్రారంభించేను. మీ భౌతిక శాస్త్ర నిఘంటువు format లోకి మార్చడం ఎలా?
  2. ఇదే విధంగా ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు కూడా నేను చేసినది నా దగ్గర ఉంది.
  3. నిజానికి నేను కూర్చిన ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులు (అన్ని శాస్త్రాలకీ పనికి వచ్చేవి) నా దగ్గర ఉన్నాయి. Baraha ఉపయోగించి text files చేసేను. వాటిని కూడ మీ భౌతిక శాస్త్ర నిఘంటువు format లోకి మార్చడం ఎలా? వికీలో పెట్టడానికి సంసిద్ధుడనే.

ధన్యవాదాలు. -వేమూరి

వేమూరి గారూ, మీరు అక్షర క్రమంలో చేర్చండి. నేను దానిని చక్కని ఫార్మేట్లో అమరుస్తాను. శాస్త్రపరంగా గణిత శాస్త్ర నిఘంటువు కూడా అవసరమె అని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ 00:58, 11 ఆగష్టు 2015 (UTC)

సలహా కొరకు

మీ సలహా ప్రకారం ప్రయోగాత్మకంగా నా నిఘంటువులోని A కి సంబంధించిన ఎంట్రీలు అన్నీ ఒక పేజీలో ఎక్కించేను. ప్రతి అంశానికి ముంది * పెట్టాలంటే సుళువయిన పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి మీరు నాకు చెబితే దీనికి ఒక ఫార్మేట్ తీసుకు వస్తాను. అప్పుడు గణిత-భౌతిక శాస్త్రాలని ఒక విభాగం గాను, రసాయన జీవ శాస్త్రాలని ఒక భాగం గానూ విడగొడదామనుకుంటున్నాను. లేదా నిఘటువు అంతటిని యథాతథంగా ఉంచెయ్యవచ్చు. మీ సల్హా ఇవ్వండి. ధన్యవాదాలు - వేమూరి

వేమూరి గారూ మీరు వ్యాసాన్ని దిద్దిబాటు చేయాలనుకున్నప్పుడు మొదట వ్యాసం లో పై భాగాన కల ఉపకరణాలలో "మూలపాఠ్యాన్ని సవరించు" బొత్తం పై ఒత్తుతారు. తరువాత దిద్దుబాటు పెట్టె వస్తుంది. ఆ వ్యాస విషయాన్ని చేర్చునపుడు లేదా దిద్దుబాటు చేయునపుడు పై భాగంలో గల ఉపకరణాల లో "ఉన్నత" ఉపకరణం క్లిక్ చేస్తే దానిలో గల ఉప ఉపకరణాలలో పదాల ముందు స్టార్ గుర్తులు, సంఖ్యా గుర్తులు, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సూపర్ స్క్రిప్టు, సబ్ స్క్రిప్టు, వంటి అంశాలుంటాయి. మీరు టైప్ చేసిన పదాలనన్నింటిని ఒకేసారి డ్రాగ్ చేసి ఉపకరణాలలో గల "బిందు జాబితా" ను ఒత్తితే అన్ని పదాలకు ఒకేసారి ముందు బిందువులు వస్తాయి. ప్రయత్నించడి.-- కె.వెంకటరమణ 17:58, 11 ఆగష్టు 2015 (UTC)
ఇంగ్లీషు-తెలుగు పదకోశం ఒక సారి చూసి మీ అభిప్రాయం చెప్పండి. నిఘంటువునంతటినీ వికీలోకి ఎక్కించి, సరి చెయ్యడానికి సుళువుగా 30 రోజులు పడుతుంది (ప్రతి రోజూ 8 గంటలు పని చేస్తే!) కనుక ముందు కొంచెం చేసి చూస్తున్నాను. ధన్యవాదాలు - వేమూరి

రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం చర్చ

మీ సహాయానికి ధన్యవాదములు.

మీరు ప్రస్తావించిన పుస్తకం 1977లో ప్రచురింపబడింది. అందులో చివర అసంపూర్ణం అని కూడా తెలియజేసారు. నాకు రాసిన ఉత్తరం 1982లో కనుక, ఆమె ఆ తరవాత రెండు సంపుటములుగా ప్రచురించే అవకాశం ఉందని నా అభిప్రాయం. రచయిత్రే స్వయంగా రెండు సంపుటములు అని చెప్పినప్పుడు మనం ఆ విషయం గమనార్హం, కనీసం ఈవిషయం వికీ పేజీలో వివరించవలె అనుకుంటున్నాను- 00:04, 13 ఆగష్టు 2015‎ Malathi Nidadavolu (చర్చ • రచనలు • నిరోధించు) నిడదవోలు మాలతి

తెన్నేటి హేమలత పీజీలో మూలాలతో రామాయణ విషవృక్ష ఖండన-లత రామాయణం రెండు సంపుటాలని చేర్చడం జరిగింది.-- కె.వెంకటరమణ 05:25, 14 ఆగష్టు 2015 (UTC)

రెండు ప్రశ్నలు

మీ సలహాలకి ధన్యవాదాలు. ఇటుపైన వీలయినంత మట్టుకు నా పని నేను చేసుకుని పోగలను. మరి రెండు ప్రశ్నలు:

  1. How can I specify WHERE the figure should be placed in the table you created for me. Now I placed the దస్త్రం:... commnd right nest to where I want the figure. But the figure is not going into the last column intended for it. If I place the commands at the end, as you did, then I hav no control on where the figure goes.
  2. Is there a place where I can refer to instructions on how to use the commands to get specialized effects? That way I do not have to bother like this.

Thanks a million for getting me started on this project. I did this before but fogot the procedures.

Best- 02:55, 12 ఆగష్టు 2015‎ Vemurione

మీరు తయారుచేసిన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) వ్యాసం చూసాను. బాగుంది. అందులో కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. మూలాల విభాగం వ్యాసం చివరి భాగంగా ఉండాలి. మీరు చిత్రాలను చేర్చేటప్పుడు అన్ని చిత్రాలను <!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) ---> అనే వాక్యం దిగువన చేర్చాలి. అన్ని పదాల అర్థాల చిత్రాలకు స్థలం చాలదు కనుక విశేషమైన చిత్రాలను మాత్రమే చేర్చాలి. -- కె.వెంకటరమణ 00:58, 15 ఆగష్టు 2015 (UTC)

పాషాణ హృదయులైన తన వియ్యంకులకు సయ్యద్ మక్దూం చివరి సందేశం

కేవీఆర్ గారు, భర్త పట్ల క్రౌర్యంలో "ముగింపు" సబ్ హెడ్ క్రింద నేను పేర్కొన్న మక్దూం, తను ఉరి వేసుకొనే ముందు తీసుకొన్న వీడియో: https://www.youtube.com/watch?v=0QCrD6guxYY. మరో రెండు వీడియోలు ఉన్నాయి కానీ, వాటికి అనువాదాలు లేవు. ఈ లంకెను వ్యాసంలో మూలంగా పేర్కొనవచ్చునో లేదో నిర్ణయించుకొని ఆ ప్రకారంగానే చేర్చగలరు. మూలాల ఫార్మాటింగ్ నాకు రాని కారణాన, మీరు వనరులు, మూలాలు సబ్ హెడ్లను సవరించిన తర్వాత నేను వాటి జోలికి పోదలచుకోలేదు. ఈ వ్యాసంలో మీరు చేసిన శుద్ధిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు - శశి (చర్చ) 17:43, 13 ఆగష్టు 2015 (UTC)

శశి గారూ భర్త పట్ల క్రౌర్యం వ్యాసం చక్కగా ఫార్మాటింగ్ అయినది. మీరు సూచించిన వీడియోలో ఆయన ఆత్మహత్యకు ముందు తెలియజేసిన అంశాలు హృదయాన్ని కలచి వేస్తాయి. వ్యాసంలో ఒక విభాగంలో ఇటువంటి విషయాలను చేర్చి.వాటిని మూలాలుగా ఈ లింకును యివ్వండి. ఉదాహరణకు
  • సయ్యద్ అహ్మద్ మఖ్దూం అనే వ్యక్తి పాషాణ హృదయులైన తన వియ్యంకులకు తాను ఆత్మహత్య చేసుకునే ముందు చివరి సందేశంలో ఆయన పడిన గృహహింస గూర్చి ఆవేదన వ్యక్తంచేసాడు.<ref>[https://www.youtube.com/watch?v=0QCrD6guxYY సయ్యద్ అహ్మద్ మఖ్దూం చివరి సందేశం]</ref>

ఇటువంటి వాక్యాలన్నీ ఒక విభాగంలో చేర్చండి. మూలాలను యివ్వండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 02:15, 14 ఆగష్టు 2015 (UTC)

చిత్రాల గురించి

"మీరు చిత్రాలను చేర్చేటప్పుడు అన్ని చిత్రాలను <!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) ---> అనే వాక్యం దిగువన చేర్చాలి. అన్ని పదాల అర్థాల చిత్రాలకు స్థలం చాలదు కనుక విశేషమైన చిత్రాలను మాత్రమే చేర్చాలి"

మీరు చెప్పిన విధంగా ప్రయత్నిస్తే బొమ్మ ఒక చోట, entry word మరొక చోట వస్తున్నాయి. . entry word కి దగ్గరగా బొమ్మ వస్తే బాగుంటుంది. బొమ్మని "position" చెయ్యడానికి తేలిక మార్గం ఉంటే బాగుంటుంది. చాల ప్రయత్నం చేసేను. అర్థం కాలేదు. ధన్యవాదాలు. - వేమూరి

ఇదే సందర్భంలో --- మీరు అన్ని వరుసలని * తో మొదలు పెట్టమన్నారు. అన్నిటి ముందు * వెయ్యడం తేలికే కాని అన్నిటి ముందు ఎలా వెయ్యాలో తెలియలేదు. అన్నిటిని bold face చేసేసి తరువాత * వెయ్యవచ్చు కాని అప్పుడు మీరు అన్ని వరుసలని * తో మొదలు పెట్టమని చెప్పేవారు కాదు.

సమాధానం

చిత్రాలలో ముఖ్యమైనవి చివరి వరుసలో వస్తాయి కానీ పదానికి సంబంధించిన చిత్రం ఈ విధానం వల్ల రాదు. కానీ మీరు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) నిఘంటువులో abacus అనే పదం అర్థం వ్రాసారనుకుందాం ఆ పదం పైభాగాన ఈ క్రింది విధం గా చేస్తే ఆ పదం ప్రక్కన చిత్రం కనబడుతుంది.

[[File:Boulier1.JPG|thumb|150px|right|పూసలపాటీ]]
*abacus, n. పూసలపాటీ; పూసల పలక; గణక ఫలకం;

పై విధంగా చేస్తే అబాకస్ యొక్క అర్థం మరియు చిత్రం ఒకే చోట కనిపిస్తాయి. కానీ అన్ని వేల అర్థాలయొక్క చిత్రాలను చేర్చలేము. ముఖ్యమైన పదాల యొక్క చిత్రాలను మాత్రమే చేర్చాలి.


ఇక రెండవది పదాలను * గుర్తుతో ప్రారంభించమని చెప్పాను. వాటిని బోల్డ్ ఫెస్ లోకి మారిస్తే ''' ''' ల మధ్య ఆ పదం చేరుతుంది.

మీ ప్రశ్నలకు సత్వర స్పందనకు మీ సందేహాన్ని నా చర్చా పేజీలో వ్రాసి పై భాగాన సంతకం ఉపకరణాన్ని ఒత్తితే --~~~~ ఇలా వస్తుంది. భాద్రపరచిన తదుపరి మీ పేరు,సందేహం చేర్చిన సమయం వస్తుంది.ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 12:59, 15 ఆగష్టు 2015 (UTC)

సినిమా మూసతో ఓ ప్రయోగం

సినిమా మూసకు ప్రయోగశాల పేజీ తయారుచేసుకుని ఓ ప్రయోగం చేస్తున్నాను. దాని వివరాలు రచ్చబండలో రాశాను. మీరు ఈ విషయంపై ఆసక్తి చూపిస్తారన్న ఆలోచనతో ఇక్కడ రాస్తున్నాను. మీరోసారి చూసి సలహా సూచనలు, సహాయ సహకారాలు అందిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 19:02, 20 ఆగష్టు 2015 (UTC)

విజ్ఞానం టైపు చెయ్యడం

ఆశ్చర్యం ఏమిటంటే ముందు * కొట్టి తరువాత vij~nanaM కొడితే విజ్ఞానం అని రావడం లేదు. * లేకుండా కొడితే వస్తున్నాది. ఇది నాకు అలవాటు ఉన్న పదమే. నిఘంటువులో ఈ ఇబ్బంది వచ్చింది. మరిచిపోయాననుకున్నాను. ఇప్పుడు bug ఉందేమో అని అనుమానంగా ఉంది. Vemurione (చర్చ) 15:49, 29 ఆగష్టు 2015 (UTC)

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

పూర్తి అయినట్లే లెక్క. మీరు సూచించిన "ముందు పేజీ" కూడ రాసేను. వీటన్నిటిని సమంవయీకరించి, ఈ నిఘంటువు వాడకానికి ప్రోత్సాహక మార్గాలు ఆలోచించండి. ఒక్క తెలుగు వికీ పాఠకులకే కాకుండా ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు సంప్రదించాలని కోరిక ఉన్నవారందరికి ఇది అందుబాటులో ఉండే పద్ధతి ఆలోచించండి. ధన్యవాదాలు Vemurione (చర్చ) 15:55, 29 ఆగష్టు 2015 (UTC)

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు: పేరు

వికీపీడియాలో వెతుక్కుందుకి వీలుగా ఉండాలంటే నిఘంటువు పేరు మరీ పొడుగ్గా ఉంటే ఇబ్బంది అని నా అనుమానం. అందుకని నా నిఘంటువు పేరు "వేమూరి వేంకటేశ్వరరావు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు" అని కాకుండా కొంచెం కుదించి వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) అంటే ఎలా ఉంటుందంటారు? ధన్యవాదాలు Vemurione (చర్చ) 01:46, 30 ఆగష్టు 2015 (UTC)

మీ సూచన బాగుంది. నిఘంటువు శీర్షిక మరీ పెద్దదిగా ఉంది. కనుక మీరు కోరిన శీర్షిక వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) కు తరలించాను.-- కె.వెంకటరమణ 14:41, 31 ఆగష్టు 2015 (UTC)

నిఘంటువు ముఖ పత్రం

వెతికి పంపుతాను. కంప్యూటర్లో ఎక్కడో ఉండాలి. లేకపోతే స్కేన్ చేసి పి. డి. ఎఫ్. పంపుతాను.Vemurione (చర్చ) 14:03, 30 ఆగష్టు 2015 (UTC)

బెడిసికొట్టిన తరలింపు

కోలవెన్ను మలయవాహిసిని తరలింపు

ఈమె అసలు పేరు కోలవెన్ను మలయవాసిని - హ లేదు.ఈ కొత్త పేరుతో తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడో తప్పు చేసేను. ఇప్పుడు సరి అయిన పేరుతో ఒక పేజీ, పై పేరుతో ఒక పేజీ ఉన్నాయి. ఈ తప్పుని సరి దిద్దండి.ధన్యవాదాలుVemurione (చర్చ) 05:52, 31 ఆగష్టు 2015 (UTC)

వేమూరి గారూ, మీరు కోరినట్లు కోలవెన్ను మలయవాసిని కి తరలించితిని.-- కె.వెంకటరమణ 14:38, 31 ఆగష్టు 2015 (UTC)

రెండు పేజీలు

టెలురియం, టెలూరియం అని రెండు పేజీలు ఉన్నాయి.టెలురియం పేజీని తీసెయ్యండి. కావలసిన అంశాలు రెండవ పేజీలో ఉన్నాయి. Vemurione (చర్చ) 23:45, 2 సెప్టెంబరు 2015 (UTC)Reply

రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి కనుక మొదట సృష్టిచిన వ్యాసం ఉంచి అక్షరభేదంతో ఉన్న వ్యాసాన్ని తొలగించితిని.-- కె.వెంకటరమణచర్చ 02:03, 3 సెప్టెంబరు 2015 (UTC)Reply

గూగుల్ లో వెతికే వారికి వెసులుబాటు కల్గించడం ఎలా?

1. ఇంగ్లీషులో ఉన్న విహారిణిని వాడుతూన్న వాళ్లకి తెలుగు వికీపీడియాలో ఉన్న "వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)" కనబడేటట్లు చెయ్యడానికి మన తెలుగు వికీ పేజీలో ఏ రకం "మెటా డేటా" పెట్టాలి? ఉదా. గూగుల్ వెతుకు పెట్టెలో "English-Telugu Dictionary" అని ఎవ్వరైనా ఇంగ్లీషు లిపిలో అడిగితే వారికి మన తెలుగు వికీలో ఉన్న నిఘంటువుకి దారి చూపాలి. ఎలా?
2. మన "వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)" ఎవ్వరైనా వాడుతున్నారో లేదో మనకి ఎలా తెలుస్తుంది?
ధన్యవాదాలు Vemurione (చర్చ) 03:13, 3 సెప్టెంబరు 2015 (UTC)Reply

Vemurione గారూ, ఒక వ్యాసం యొక్క చరిత్ర లో గల బయటి ఉపకరణాలు: "Revision history statistics" , "Revision history search" , "Number of watchers" మరియు "Page view statistics" లను ఉపయోగించి కావలసిన వివరాలను తెలుసుకోవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 13:49, 3 సెప్టెంబరు 2015 (UTC)Reply

రేడియో ధార్మికత

పై పేజీని తొలగించవచ్చు. అందులో సమాచారాన్ని మరొక చేట చేర్చేను Vemurione (చర్చ) 18:53, 4 సెప్టెంబరు 2015 (UTC)Reply

చుక్కలు, కామాలు పెట్టే పద్ధతి

  1. మీరు దయచేసి వికీ రచయితలకి ఒక సందేశం పంపగలరా? తెలుగు వికీపీడియాలో సర్వసాధారణంగా కనిపించే ఒక తప్పుని ఏ రచయిత కా రచయిత సరిదిద్దుకుంటే సర్వత్రా మన రాత మెరుగుపడుతుందని నా అభిప్రాయం. నేను సరిదిద్దుతున్నాను, కాను ఎన్నని దిద్దగలను?
  2. ఫుల్‌ స్టాప్ (లేదా చుక్క) వాక్యం పూర్తి అయీఅవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. ఇదే నియమం ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు విషయంలో కూడ పాటించాలి.
    ఉదా:రాముడు బంతిని తన్నెను . - తప్పు
    రాముడు బంతిని తన్నెను. - ఒప్పు.
  3. కామా (comma) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు.
    ఉదా:ప్రతి విద్యార్థి మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి: అభ్యాసం , అభ్యాసం , అభ్యాసం. (తప్పు)
    ప్రతి విద్యార్థి మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి: అభ్యాసం, అభ్యాసం, అభ్యాసం. (ఒప్పు)
  4. కుండలీకరణాలు తెరచిన తరువాత, వెనువెంటనే, మాట మొదలవాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. మాట పూర్తి అయిన వెనువెంటనే కుండలీకరణాలు మూయాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు
    ఉదా: కామా ( comma ) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. (తప్పు)
    కామా (comma) మాట పూర్తి అవగానే పెట్టాలి; ఒక ఖాళీ వదలిన తరువాత కాదు. (ఒప్పు)
  5. చుక్క తరువాత, కామా తరువాత, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు తరువాత, మూసిన కుండలీకరణం తరువాత విధిగా ఒక ఖాళీ వదలాలి.
    ఈ నాలుగు నియమాలు పాటిస్తే రాత చూడడానికి బాగుండడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణలతో ఉంటుంది. ఎంత పాండిత్యం ఉన్నా మనం ధరించిన దుస్తులని చూసి ఎలా విలువ కడతారో, అలాగే మనం ఎంత కష్టపడి రాసినా విరామ చిహ్నాల వాడుకలో కనీసపు శ్రద్ధ చూపించకపోతే చదువరులు మన రాతని గౌరవించరు. Vemurione (చర్చ) 00:23, 12 సెప్టెంబరు 2015 (UTC)Reply
వేమూరి గారూ యిటువంటి దోషాలు అనేక వేల సంఖ్యలో ఉంటాయి. వీటిని సరిదిద్దాలంటే బాటు ద్వారా చేయాలి. యిటువంటి దోషాలు సరిదిద్దాలంటే బాటు సభ్యత్వం గల రహ్మానుద్దీన్ గారు సులువుగా చేయగలరు.మీరు చేసిన ప్రతిపాదనను రచ్చబండలో చేర్చాను.-- కె.వెంకటరమణచర్చ 01:23, 12 సెప్టెంబరు 2015 (UTC)Reply

ధన్యవాదాలు

మీ అభినందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.Palagiri (చర్చ) 03:41, 15 సెప్టెంబరు 2015 (UTC)Reply

తెలుగులో వైకల్పనలు

వైజ్ఞఆనిక కల్పనలు అన్న వ్యాసం ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చెయ్యబడ్డ వ్యాసం. ఇది ప్రపంచంలోని SF గురించి రాసిన వ్యాసం. చాల పొడుగ్గా ఉంది. దీని చివర ఒక లంకె తగిలించి, తెలుగులో వైకల్పనలు అనే వ్యాసం నేను వేరొక అంశంగా చేర్చేను. ఇది ఒక సైన్‌సు ఫిక్షన్ కథల పుస్తకానికి నేను రాసిన పీఠిక మీద ఆధారపడింది. దీనిని పైన ఉదహరించిన పెద్ద వ్యాసంలో ఒక భాగంగా రాయవచ్చు కాని అది ఇప్పటికే పొడుగయిపోయింది. అంతే కాక దాంట్లో దీనిని కలిపితే సముద్రంలో కాకిరెట్టలా కొట్టుకుపోతుంది తప్ప ఎవ్వరి కంటా పడదు. తెలుగులో SF ని ప్రోత్సహించాలంటే దీనికి ప్రత్యేకం ఒక చిన్న వ్యాసం ఉంటే బాగుంటుంది. Vemurione (చర్చ) 00:31, 18 సెప్టెంబరు 2015 (UTC)Reply

బ్రోకలీ

బ్రోకలీ అనే పేజీ ఉంది. బ్రొక్కొలి అనే పేజీని తీసెయ్యండి.Vemurione (చర్చ) 23:13, 20 సెప్టెంబరు 2015 (UTC)Reply

బ్రొక్కలి అనే పేజీని విలీనం చేసి తొలగించాను.-- కె.వెంకటరమణచర్చ 01:58, 21 సెప్టెంబరు 2015 (UTC)Reply

కాపర్‌ సల్ఫేట్‌

కాపర్‌ సల్ఫేట్‌, కాపర్ (II) సల్ఫేట్ అని రెండు ఉన్నాయి. రెండూ ఒకటే అని నా నమ్మకం. ఒకటి తొలగించవచ్చేమో చూడండి.Vemurione (చర్చ) 01:51, 21 సెప్టెంబరు 2015 (UTC)Reply

వేమూరిగారూ, కాపర్ సల్ఫేట్ ను అయోమయ నివృత్తి పేజీగా ఉంచవచ్చు. కాపర్ రెండు రూపాలకు సల్ఫేట్స్ ఉన్నాయి. అవి క్యుప్రస్ సల్ఫేట్ (కాపర్ (I) సల్ఫేట్), క్యుప్రిక్ సల్ఫేట్ (కాపర్(II) సల్ఫేట్) లు. కనుక వాటిని విలీనం చేయకుండా ఆంగ్ల వికీలో ఉన్నట్లు Copper sulfate పేజీని తయారుచేయవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 02:05, 21 సెప్టెంబరు 2015 (UTC)Reply

ప్రొఫేనిటీ

profanity, n. అసభ్యం; అశ్లీలం; బూతు; అసభ్యపు మాట; బూతు మాట; బజారు భాష; మోటు భాష;

నిజానికి ఆంధ్రభారతి వారి అపవిత్రం కూడ సరి అయిన అనువాదం కాదు. నేను ఇచ్చిన పై అనువాదాలు చూడండి. మీకి నచ్చినది ఎంచుకోండి.Vemurione (చర్చ) 03:45, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply

నన్ను పరిచయం చేసిన పేజీ

నన్ను పరివచయం చేసిన పేజీలో , ఇతర లింకులు ఉన్న భాగంలో, మొదటి లంకె http://www.gulte.com/trending/41871/Top-10-Telugu-Living-Legends-In-USA

ఇది gulte వారి పేజీకి దారి చూస్పిస్తున్నాది. ఆ పేజీ అక్కడ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఆ పేజీ అక్కడ ఉన్నా, లేకపోయినా ఈ మేటర్‌ వికిలో శాస్వతంగా కనబడేటట్లు చెయ్యడం ఎలా?

ధన్యవాదాలుVemurione (చర్చ) 17:05, 30 సెప్టెంబరు 2015 (UTC)Reply

ముంజేతి కంకణం

వాడుకరి చర్చ:Kvr.lohith గారు, నమస్కారము. ఇంతకు ముందు వ్యాస పరిమాణము తెలుసుకునేందుకు ముంజేతి కంకణం అని నావిగేషన్ పాపప్స్ నందు లభ్యమయ్యేది. ఇప్పుడు అది అందుబాటులో లేనట్టు ఉంది. దానిని వీలయితే దయచేసి సరి చేయగలరు. JVRKPRASAD (చర్చ) 13:16, 1 అక్టోబరు 2015 (UTC)Reply

ముంజేతి కంకణం సరిచేసే విధానం నాకు తెలియదు. ఈ విషయం అధికారులకు విన్నవించవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 16:37, 2 అక్టోబరు 2015 (UTC)Reply

Unused images without license

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:33, 2 అక్టోబరు 2015 (UTC)Reply

Nemo bis, i have deleted my unused images which are without licensing information. some images are used in the articles. please don't delete the images which are used in the articles.-- కె.వెంకటరమణచర్చ 16:36, 2 అక్టోబరు 2015 (UTC)Reply

కొక్కొండ వెంకటరత్నం

కొక్కొండ వెంకటరత్నంగారి వ్యాసము మొదలైనప్పడే వేంకటరత్నం అని వున్నది. నేను దాంట్లోనే విస్తరణ చేయుచున్నామ. కానీ వారి పేరు లో వేంకట కాదు వెంకట అనే వుండాలి. మీరు దానిని సరిచేయ గలిగితే బావుంటుంది--దిగవల్లి రామచంద్ర (చర్చ) 03:31, 9 అక్టోబరు 2015 (UTC)Reply

పాలగిరి గారు కొక్కొండ వెంకటరత్నం కొక్కొండ వెంకటరత్నం పంతులు కు తరలించారు.-- కె.వెంకటరమణచర్చ 13:17, 9 అక్టోబరు 2015 (UTC)Reply

వాణీ-వీణా వ్యాసం తొలగింపు

వాణీ-వీణా వ్యాసాన్ని పరిశీలించి ఇది వికీలో ఉండదగ్గ వ్యాసమో కాదో నిర్ణయించగలరు. దీనికి ఎలాంటి విషయ ప్రాముఖ్యత లేదని అనిపిస్తున్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:25, 16 అక్టోబరు 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారూ, ఇది ఒక అవిభక్త కవల పిల్లల గూర్చి వ్రాసిన వ్యాసం. అలా కాకుండా అవిభక్త కవలలు అనే వ్యాసం సృష్టించి ఆ వ్యాసంలో ఇలాంటి కవలల గూర్చి విభాగంగా చేరిస్తే బాగుంటుంది. ఆంగ్లంలో Conjoined twins పేరుతో ఈ వ్యాసం ఉన్నది.-- కె.వెంకటరమణచర్చ 16:09, 16 అక్టోబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ, ఈ ప్రతిపాదనకు సమ్మతిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:28, 17 అక్టోబరు 2015 (UTC)Reply
సుల్తాన్ ఖాదర్ గారూ, అవిభక్త కవలలలో విభాగానికి విలీనం చేసాను.-- కె.వెంకటరమణచర్చ 15:03, 25 అక్టోబరు 2015 (UTC)Reply
ధన్యవాదములు కె.వెంకటరమణ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:02, 26 అక్టోబరు 2015 (UTC)Reply

వాడుకరుల విలీనము

రమణ గారూ, పాతదే అయినా , మరలా ఇదే ప్రశ్న అడుగుతున్నందుకు మన్నించండి. వాడుకరి:సుల్తాన్ ఖాదర్ ని వాడుకరి:Sultankhadar లో విలీనం చేయాలని అభిలషిస్తున్నాను. అందుకు తగిన మార్గం తెలుపగలరు. రెండు ఖాతాలు నిర్వహించడం కొంచెం కష్టంగా ఉన్నది. వాడుకరి:సుల్తాన్ ఖాదర్ కృషిని వాడుకరి:Sultankhadar కి తరలించవచ్చునా? తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:24, 17 అక్టోబరు 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారూ, సభ్యనామం మార్పు కోసం వికీపీడియా:సభ్యనామం మార్పు పేజీలో అభ్యర్థన చేయాలి. అధికారులు సభ్యనామం మార్చగలరు. అలా మార్చినపుడు పాత లాగ్ లు కొత్త పేరులోని వెళ్ళిపోతాయి. మీరు కోరుకున్నట్లు వాడుకరి:సుల్తాన్ ఖాదర్ కృషిని వాడుకరి:Sultankhadar కు తరలించడం అధికారులు చేయగలరు! అధికారులను సంప్రదించగలరు.-- కె.వెంకటరమణచర్చ 16:54, 17 అక్టోబరు 2015 (UTC)Reply

నదియా వ్యాసంలో మూలాలలను చేర్చాను

పరిశీలించి మూసను తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:30, 22 అక్టోబరు 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారూ, మూలాల మూసను తొలగించాను. చిత్రాన్ని సరిచేసాను.-- కె.వెంకటరమణచర్చ 15:01, 25 అక్టోబరు 2015 (UTC)Reply

మీ వాడుకరి పేజీలో కొత్త వర్గం

వర్గం:కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలు వర్గాన్ని మీ వాడుకరి పేజీలో చేర్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:00, 23 అక్టోబరు 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారి సూచనకు ధన్యవాదాలు. నా వాడుకరి పేజీలో ఆ వర్గాన్ని చేర్చాను.-- కె.వెంకటరమణచర్చ 14:49, 25 అక్టోబరు 2015 (UTC)Reply

ధన్యవాదాలు

  సాంకేతిక తారాపతకం
అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._

పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC)Reply

అధ్బుతమైన తారాపతకాన్నందించిన పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. -- కె.వెంకటరమణచర్చ 14:47, 25 అక్టోబరు 2015 (UTC)Reply

వర్గం:ఒలింపిక క్రీడలు తొలగింపు

అక్షర భేదాలతో సరైన వర్గం వర్గం:ఒలింపిక్ క్రీడలు ఉన్నది. పరిశీలించి తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:04, 26 అక్టోబరు 2015 (UTC)Reply

అక్షర దోషాలతో ఉన్న వర్గాన్ని తొలగించాను.-- కె.వెంకటరమణచర్చ 13:18, 26 అక్టోబరు 2015 (UTC)Reply
ధన్యవాదములు కె.వెంకటరమణ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:06, 26 అక్టోబరు 2015 (UTC)Reply

inclusion of list.

Dear sir
Please upload the list of eminent Arya vysya.
vysya.
Tq
Laxmi narayana tavidisetty
+919849057228
117.213.170.82 02:36, 27 అక్టోబరు 2015 (UTC)Reply

అజ్ఞాత వాడుకరి గారూ తెలుగు వికీపీడియాలో ఆర్య వైశ్యులు అనే వ్యాసంలో కులంలోని ప్రముఖ వ్యక్తులు గూర్చి జాబితా ఉన్నది. వారిలో కొంతమంది గూర్చి వ్యాసాలున్నవి. మీరుకూడా మరికొందమంది విశిష్ఠ వ్యక్తుల యొక్క వ్యాసాలు వ్రాయండి. సహకరిస్తాము. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 14:10, 27 అక్టోబరు 2015 (UTC)Reply

inclusion of list.

Dear sir, Great initiative taken. While preparing the list, please consider to include the one and only Iron and steel merchant store established in the year 1900 A.D by Mr . Tavidisetty Hanumaiah and later by his son Mr. Sambaiah. As per the prevailing laws transformed as Tavidisetty Sambaiah son, management by his son Hanumantha rao. Now the name of the store changed to M/S TAVIDISETTY HANUMANTHA RAO AND SONS IRON AND STEEL MERCHANT 2-3-232 SUNDER TALKIES ROAD KHAMMAM -507003 TELANGANA. Ours is a hundred years firm still serving the needs of the society. Kindly consider the name while you prepare the list before posting. Thank you. Regards, LAXMI NARAYANA TAVIDISETTY (The IV Generation partner of the said store) t. Iaxman96 @gmail.com +919849057228 117.213.170.82 02:51, 27 అక్టోబరు 2015 (UTC)Reply

వెంకటరమణ గారికి చిన్న విన్నపము:
పై శీర్షికలో నిన్న అనగా 11.11.15 న నాపేరును నామోదు చేశాను. గుళ్లపల్లి నాగేశ్వర రావుగారు ఎండర్స్ చేశారు. కాని ఈ రోజున చూస్తే నాపేరు తొలగించ బడి యున్నది. దీనిని ఎవరు తొలిగించారో??? కారణమేమిటో చెప్పగలరా...??? ఇప్పుడు మరలా నాపేరును నామోదు చేసుకోవచ్చునా....? తెలుపగలరు. భాస్కరనాయుడు (చర్చ) 06:42, 12 నవంబర్ 2015 (UTC)

భాస్కరనాయుడు గారికి, పై శీర్షికలో 27 అక్టోబరు 2015 నాటికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు, అహ్మద్ నిస్సార్, మీనా గాయత్రి మరియు పవన్ సంతోష్ గార్లు మాత్రమే దరఖాస్తు చేసియున్నారు. వారిలో ఒకరిని ఎండార్సు చేయవలసినదిగా రచ్చబండలో కోరియున్నారు. కనుక రచ్చబండలో ప్రస్తుతం చేర్చిన మీ పేరును తొలగించితిని. పై శీర్షికలో గల పుటలో దరఖాస్తుకు చివరితేదీ అయిపోయినదని తెలిపియున్నారు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 12:43, 12 నవంబర్ 2015 (UTC)

తొలగించవలసిన వ్యాసములు

తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన వ్యాసాలలో దేవగుప్తాపు భరద్వాజము, నడకుదుటి వీరరాజు మరియొక సారి పరిశీలించగలరు.--స్వరలాసిక (చర్చ) 00:39, 16 నవంబర్ 2015 (UTC)

Dear sir
Telamgana Resource Centre article has been revised...
we mentioned some sources also...In Hyderabad city editions all news papers publishing the CHARCHA...as u are living in another state you may now know the real facts...
i dont know why you again proposed to delete that...If you know Telugu language...just go to any Telugu newspaper website and check sunday city editions...all most all telugu and Urdu papers publishing Charcha items...I think Its a world record that one organization completed 200 charcha programs with more than 650 guests and thousands of public...in 200 weeks. every week we may have upto 10 links of a charcha...shall i provide all these thousands of links here...pls suggest....

thank you for your support
vamsiglobal 07:35, 20 నవంబర్ 2015‎ 49.207.65.29 (చర్చ • నిరోధించు)

వికీపీడియా విధానాల ప్రకారం మూలాలు గల వ్యాసాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు మొదట తయారుచేసిన వ్యాసం "తెలంగాణ రీసోర్స్ సెంటర్" కు మూలాలు జత చేయలేదు. అందువల్ల తొలగింపబడినది. ప్రస్తుతం మూలాలు చేర్చబడినవి. ఈ వ్యాసాన్ని సృష్టించినందుకు వంశీగ్లోబల్ కు ధన్యవాదాలు. వ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుటకు చిత్రాలను చేర్చగలరు.ఈ వ్యాసం అభివృద్ధి విషయంలో సహాయపడగలను.-- కె.వెంకటరమణచర్చ 13:52, 20 నవంబర్ 2015 (UTC)

తొలగించవలసిన వ్యాసములు

కె.వెంకటరమణచర్చ kvr.లోహిత్ గారికి విన్నపము తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన వ్యాసాలలో , మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే మిరే ఆ వ్యాసాన్ని తొలగించి కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.Jai balu yadav (చర్చ) 05:36, 26 నవంబర్ 2015 (UTC)

Jai balu yadav గారూ, ఏదైనా వ్యాసం వికీ నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు దానిలో తొలగింపు మూసను చేర్చడం పరిపాటి. అపుడు ఆ వ్యాసాన్ని ఎందుకు తొలగించరాదో అని సహసభ్యులు, వ్యాస సృష్టి కర్త లు ఆ వ్యాస చర్చాపేజీలో చర్చించాలి. తరువాత ఆ వ్యాసం నియమాలకు విరుద్ధంగా ఉంటే తొలగించబడుతుంది. కానీ ఏక పక్షంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ వ్యాసాన్ని తొలగించవలసిన పని నాకు లేదు. ఈ వ్యాసం మీరూ స్వయంగా వ్రాసుకున్నది కనుక నియమాలకు విరుద్ధం కనుక ఆ వ్యాసం తొలగించబడుతుంది. మీరు సూచించిన లింకులు సరియైనవైతే ఆ మూలాలతో నేనుగానీ, సహసభ్యులు గానీ ఆ వ్యాసాన్ని సృష్టించి విస్తరిస్తారు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 16:35, 26 నవంబర్ 2015 (UTC)

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించకండి

కె.వెంకటరమణచర్చ గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి. -Jai balu yadav (చర్చ) 11:27, 26 నవంబర్ 2015 (UTC)

Jai balu yadav గారూ, తెలుగు వికీపీడియాలో ప్రముఖ వ్యక్తులకెల్లప్పుడూ స్థానం ఉంటుంది. మీరు కూడా మీ యొక్క వ్యాసం తప్ప ప్రముఖ వ్యక్తుల వ్యాసాలను ప్రారంభించండి. విస్తరించండి. కానీ ఆ వ్యాసాలకు సరైన మూలాలుండాలి. మూలాలు లేని వ్యాసాలు తొలగింపబడతాయి. వికీపీడియా మహోన్నతమైన విజ్ఞాన సర్వస్వం. వికీపీడియాలో నూతన కళాకారులే కాక సరైన మూలాలు లభించిన అజ్మల్ కసబ్ వంటి తీవ్రవాదులు, కొత్తదాస్ లాంటి గూండాలు, వీరప్పన్ వంటి బందిపోటు వ్యాసాలు కూడా ఉన్నాయి. నోటబిలిటీ ఉన్న వారి వ్యాసాలు సరైన మూలాలతో ఉన్నాయి. అంతే కాకుండా శ్రీవరిసాగు అత్యధిక దిగుబడినిచ్చిందని నిరూపించిన మహిళ దుద్దెడ సుగుణమ్మ వ్యాసం కూడా ఉన్నది. కనుక కళాకారులే కాదు సరైన మూలాలున్నచో అన్ని వర్గాల వారి వ్యాసాలు ఉన్నట్లు గమనించగలరు. మీరు స్వంతంగా వ్రాసిన మీ వ్యాసాన్ని తొలగించబడుతుంది. వికీలో యితర సభ్యులు సరైన మూలాలతొ ఆ వ్యాసాన్ని సృష్టిస్తారు. విస్తరిస్తారు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 16:30, 26 నవంబర్ 2015 (UTC)
Return to the user page of "K.Venkataramana/పాత చర్చ 7".