Navamoini గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)Reply

చదరంగం మార్చు

Navamoini గారూ! మీరు ఉత్సాహంగా వికీలో పాల్గొంటున్నందుకు అభినందనలు. మీకు అసక్తి ఉంటే చదరంగం (ఆట) అనే వ్యాసం అనువాదం ప్రారంభించవచ్చును. అందులో మూసలూ వగైరా నేను నిదానంగా సరి చూస్తాను. <ref>, </ref> వంటి గుర్తుల మధ్యలో ఉన్న రెఫరెన్సులను మాత్రం తొలగించవద్దు. ఏ వైనా సందేహాలుంటే తప్పకుండా నా చర్చా పేజీలో వ్రాయండి. --కాసుబాబు 16:07, 2 మే 2007 (UTC)Reply


పవన్ గారూ! చదరంగం అనువాదం సాగిస్తున్నందుకు అభినందనలు. మీరు చేసేదే సరైన విధానం. చిన్న సూచనలు

  • ఏవైనా అనుమానంగాను, కష్టం గాను ఉన్న పదాలను, భాగాలను వదిలేయండి, వేరెవరైనా సరి చూస్తారు.
  • నాకు సబ్జెక్టు తెలియదు గనుక మొత్తం ఇంగ్లీషు వ్యాసాన్ని దించేశాను. కాని యధాతధంగా ఇండాలన్న నియమం లేదు. మీరు వెనుకాడకుండా అనవుసరమైన, అతియైన భాగాలను కుదించండి.
  • అంతకంటే ముఖ్యం- మీరు స్వతంత్రంగా వ్రాయాలనుకొన్నవి చొరవగా వ్రాయండి. ముఖ్యంగా భారత దేశం, తెలుగు నాడు లకు సంబంధించిన విషయాలు.

--కాసుబాబు 3/5/07


మూసలు, వగైరా మార్చు

పవన్,

  • సాదారణంగా "మూసలు చేయడం" అంటున్నాము. కాని నువ్వు "మూసలు పోయడం" అన్న పదాలు చాలా బాగున్నాయి.
  • నిజం చెబుతున్నాను. నాకు మూసలు పోయడం చేతకాదు. ఇంగ్లీషులోంచి కాపీ చేసేస్తుంటాను. కొద్ది రోజులు పరిశీలిస్తే నీకు మెళకువలు తెలుస్తాయి. నీలాంటివారు మూసలు పోయడం నేర్చుకుంటే తెలుగు వికీకి చాలా ఉపయోగం.
  • మూసల గురించి నవీన్ అధ్యయనం చేస్తున్నాడు. అతని పేజీలోంచి తస్కరించిన లింకులు క్రింద ఇస్తున్నాను.
  1. మూసలు వ్రాయడం ఎలా?
  2. క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?
  3. మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం
  4. పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....
  5. పార్సర్ ఫంక్షన్
  6. వికి మ్యాజిక్ పదాలు
  • కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?

--కాసుబాబు 09:01, 5 మే 2007 (UTC)Reply

అభినందనలు మార్చు

పవన్, గత కొన్ని రోజులుగా మీరు వికీలో వ్రాస్తున్న వ్యాసాలు చూస్తున్నాను. తెవికీలో కొత్తవారు ఇంత ఉత్సాహంగా వ్రాయటం ఆనందాన్నిస్తోంది. మీకు నచ్చిన అంశాల్లో వ్యాసాలు వ్రాస్తూండండి. ఈ విషయంలో మీకు ఏ సహాయం కావలసినా గూగుల్ గుంపును కానీ నన్ను కానీ నిర్మొహమాటంగా అడగండి --నవీన్ 10:25, 5 మే 2007 (UTC)Reply

అనువాదాలు మార్చు

అనువాదాలను ఒక పట్టుపడుతున్నందుకు కృతజ్ఞతలు. తప్పలు దొర్లుతాయని జంకవద్దు. మన తప్పులను ఎవరోఒకరు దిద్దుతారు. తెవికీకి మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. --వైఙాసత్య 22:20, 10 మే 2007 (UTC)Reply

కొత్త వ్యాసపు పెట్టె మార్చు

నా పేజీలో ఉన్న కొత్తవ్యాసం సృష్టించే పెట్టెకు తెలుగు లిపి స్క్రిప్టును జతచేయలేదు. కాబట్టి ఆంగ్లంలోనే అకరాలు వస్తాయి. ప్రస్తుతానికి "అన్వేషణ" పెట్టె మరియు మార్పులు చేసే పెట్టెలో మాత్రమే తెలుగులో టైపు చేయగలుగుతారు. త్వరలోనే ఈ పెట్టెను కూడా దానికి కలుపుతాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:50, 11 మే 2007 (UTC)Reply

బొమ్మ:Ferdowsi_Memorial.jpg లైసెన్సు వివరాలు మార్చు

__Mpradeepbot 09:37, 14 ఫిబ్రవరి 2008 (UTC) -->Reply 

ఈ నోటీసు తొలగించబడినది. బొమ్మ వికీకామన్స్ లో ఉన్నది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:55, 1 మార్చి 2009 (UTC)Reply

కుశలమా! మార్చు

పవన్! కొంత విరామం తరువాత మళ్ళీ వికీలో మీరు పాల్గొనడం చాలా సంతోషం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:55, 1 మార్చి 2009 (UTC)Reply

గరికపాడు మార్చు

పవన్! మీరు నా చర్చా పేజీలో ఇలా వ్రాశారు

కాసు బాబు గారు, మీరు ప్రస్తవించిన అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గరికపాడు అగ్రహారానికి గరికపాడు (క్రోసూరు మండలం) చెందినవారు, గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గరికపాటి వంశచరిత్ర పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను. ---Navamoini 04:18, 5 ఏప్రిల్ 2009 (UTC)Reply


అసలు నేను వ్రాసిన విషయం పుర్తిగా మరచిపోయాను. మీరు చక్కగా పరిశీలించి వ్రాసినందుకు కృతజ్ఞతలు. ఆ పుస్తకం (తెలుగు సాహిత్య కోశము- తెలుగు అకాడమీ)లో "గరికపాడు (నైజాం మండలం)" అని ఉంటే అది వైరా కావచ్చునని నేను ఊహించి ఈ గరికపాడులో వ్రాసినట్లున్నాను. మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే విషయాన్ని "గరికపాడు (క్రోసూరు మండలం)కు మార్చేయండి. . --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:58, 5 ఏప్రిల్ 2009 (UTC)Reply

దుకాణాల పేర్లు మార్చు

దుకాణాల పేర్లు (ప్రకటనల కోసం కానంతవరకూ) ఇస్తే ఆ ఊరి వ్యాపార వ్యవస్థ కూడా కొంత అవగాహన అవుతుంది. ఏమంటారు? (Navamoini 21:54, 11 అక్టోబర్ 2009 (UTC))

Navamoini గారు, ఏది ప్రకటన, ఏది ప్రకటన కాదు అనేది నిర్ణయించడం కష్టమే. అయితే నేను దుకాణాల పేర్లు తొలిగించినది ఈ విషయంలో కాదు. చిన్న పట్టణంలోనే వందలాది దుకాణాలుంటాయి. వాటన్నింటినీ తెవికీలో చేర్చడం సాధ్యం కాదు, ఏవో కొన్నింటినీ చేర్చిననూ అది పరిపూర్ణం కాదు. అంతేకాకుండా దుకాణాల పేర్లు చేర్చిననూ విజ్ఞానసర్వస్వంలో వాటి ఉపయోగం ఉండదు. పట్టణంలో పేరుపొందిన పరిశ్రమల గురించి, సంస్థల గురించి, థియేటర్ల గురించి, ప్రముఖ ఆసుపత్రుల గురించి చేర్చితే పర్వాలేదు. ఒక పట్టణం వ్యాసంలో పట్టణంలో పేరుపొందిన వాటినే చేర్చితే బాగుంటుంది. ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:57, 12 అక్టోబర్ 2009 (UTC)
అవును, ఇలా దుకాణాల పేర్లు వ్రాయటం ప్రారంభిస్తే చిట్టాలు అవుతాయి. --వైజాసత్య 23:36, 23 అక్టోబర్ 2009 (UTC)

పతకం మార్చు

 
Navamoini గారికి, తెవికీ లో వివిధ అంశాలపై వ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:32, 1 మార్చి 2012 (UTC)Reply

తిట్టు వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

తిట్టు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక, మూలాలు లేవు. లింకులు లేవు. దీనిని ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తిట్టు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. -- K.Venkataramana -- 12:41, 14 ఏప్రిల్ 2021 (UTC) -- K.Venkataramana -- 12:41, 14 ఏప్రిల్ 2021 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@Navamoini గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:J.K._MohanaRao.jpg
  2. File:HinduTempleWisconsinSide.JPG
  3. File:HinduTempleWisconsinFront.JPG
  4. File:Oshkosh_AirVenture_Museum.JPG

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:39, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply