Sri Lekha Pathakamuri
Sri Lekha Pathakamuri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 06:38, 2 అక్టోబరు 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 06:38, 2 అక్టోబరు 2018 (UTC)
మీ రచనలు
మార్చువాడుకరి:Sri Lekha Pathakamuri తెలుగు వికీపీడియాలో మీ కృషికి ధన్యవాదాలు. మీరు ఇటీవల అన్నమయ్య గ్రంథాలయ జాబితాలు చేరుస్తున్నట్లు గమనించాను. ఇది చాలా పాతబడిన ప్రాజెక్టు. ఇంతవరకు సమీక్ష జరగలేదు. నా దృష్టిలో ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు. మీరు ఇంతకు ముందు మంచి విలువైన వ్యాసాలకు కృషి చేసినందున, మీ కృషి నలుగురికి మరింతగా ఉపయోగపడాలని నా అభిప్రాయం చెబుతున్నాను. కొనసాగించదలచుకుంటే, మీరు ప్రాజెక్టు సమన్వయకుడైన విశ్వనాథ్ గారితో సమీక్ష చేసి, సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, ఎవైనా మార్పులతో కొనసాగించవచ్చు. --అర్జున (చర్చ) 04:53, 6 సెప్టెంబరు 2019 (UTC)
అర్జున గారికి వీరు నాతో మాట్లాడటం జరిగింది. ఈ మార్పులు చేయు సభ్యులు అన్నమయ్య గ్రంథాలయం ద్వారా చేయుచున్నారు. వీరు కేవలం ఈ మార్పుల కొరకు ఆశక్తులై ఉన్నారు. వీరిని ఈ మార్పులు చేయుచూ, ఇతర మార్పులు చేయు విధముగా ప్రోత్సహించుట మంచిది కాని. వారి ముఖ్య ఉద్దేశ్యమును పక్కన పెట్టి మిగిలిన వాటిలో వ్రాయమనుట ఉచితము కాదు. వారికి వారి గ్రంథాలయ పుస్తక జాబితా పూర్తి చేయవలెనని ఉత్సాహముతో వాడుకరిగా నమోదు కాబడి వ్రాయుచున్నారు. వారి పనిని కొనసాగిస్తూ సభ్యుల యొక్క సూచనలతో మిగతా పనులలో కూడా వ్రాయగలమని తెలిపారు, కనుక వారి పనిని కొనసాగిచుటకు ప్రోత్సహించగలరని నా మనవి.. ధన్యవాదములు..B.K.Viswanadh (చర్చ) 12:41, 7 సెప్టెంబరు 2019 (UTC)
- B.K.Viswanadh గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నా అభిప్రాయం నేను చెప్పాను. ప్రాజెక్టు సమన్వయకునిగా మీరు సమీక్ష చేసి సముదాయం అభిప్రాయాలను తీసుకొని కొనసాగించటం మంచిది కదా. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 13:28, 7 సెప్టెంబరు 2019 (UTC)
- అర్జున గారు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. కొందరు సభ్యులకు దాన్లో మార్పులు చేయాలనిపిస్తే చేస్తారు. దానర్ధం ప్రాజెక్టు కొనసాగించడం కాదు. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీ దృష్టిలో ఈపని వలన లాభం లేదని చెప్పారు, కాని వాళ్ళ దృష్టిలో లాభం ఉందనుకునే చేస్తున్నారు. మీకు అభ్యంతరం ఉంటే రచ్చబండలో చర్చించి. ప్రస్తుతం ఏక్టివ్ సభ్యులైన సుజాత, చదువరి, ప్రణయ్‌రాజ్, రామారావు, రవిచంద్ర, వెంకటరమణ, పవంసంతోష్ వంటి సభ్యులతో పాటు మిగతా సభ్యుల అభిప్రాయాలు మీకు అనుకూలంగా ఉంటే ఆ ప్రాజెక్టు సంభంధిత పేజీలు, అనుబంధ వ్యాసాల్లో ఎవరూ మార్పులు చేయకుండా నిరోధం విధించండి. తదుపరి చర్చలను రచ్చబండలోకి మారిస్తే బావుంటుంది అనుకొంటున్నాను. ధన్యవాదాలతో..B.K.Viswanadh (చర్చ) 14:36, 7 సెప్టెంబరు 2019 (UTC)
- Arjunaraoc గారూ, ఈ అంశంపై సముదాయంలో ఏ రకమైన ఏకాభిప్రాయం లేదు. ఫలానా ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాకు లాభమా కాదా అన్నది మీరు నిర్ణయించుకుని, దాని మీద పనిచేస్తున్న ఓ కొత్త వాడుకరికి దాదాపు ఓ నిర్ణయం తరహాలో చెప్పేస్తున్నారు. ప్రాజెక్టు ఏమీ ప్రయోజనకరం కాదని కానీ, నష్టమని కానీ ఇప్పటిదాకా సముదాయంలో ఓ ఏకాభిప్రాయం లేదు. ఇలా వాడుకరి చర్చా పేజీలో చర్చించుకోవడం బాగోలేదు. నిరుత్సాహజనకంగా ఉంటుంది వారికి. కాబట్టి దయచేసి ఇలాంటి చర్చలు చేసేముందు, అది కూడా ఓ సలహాగానో, సలహాకన్నా రెండు అడుగుల ఎత్తులోనో కొత్తవారికి ప్రాజెక్టు గురించి చెప్పేముందు సముదాయంలో చర్చించుకుని ఆయా అభిప్రాయాలపై నిర్ణయాలు తీసుకుందామని B.K.Viswanadh గారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:39, 7 సెప్టెంబరు 2019 (UTC)
- అర్జున గారు ఆయనకు అనిపించిన అభిప్రాయం సలహాగా చెప్పారు. అందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు. శ్రీలేఖ గారు విశ్వనాథ్ గారితో చర్చించే ఈపని చేస్తున్నందున వారికి ఈ పని మీద ఆసక్తి ఉండే కొనసాగిస్తున్నారని భావిస్తున్నాను. అర్జున గారి అభిప్రాయం వల్ల ఆమె పనికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని భావిస్తాను. వికీకి కావల్సింది స్వేచ్ఛగా, ఇష్టంగా, కొన్ని నియమాలకు లోబడి పనిచేసేవారు. అటువంటి వారు ఏ పని చేసినా నాకు సంతోషమే. రవిచంద్ర (చర్చ) 18:09, 7 సెప్టెంబరు 2019 (UTC)
- Arjunaraoc గారూ, ఈ అంశంపై సముదాయంలో ఏ రకమైన ఏకాభిప్రాయం లేదు. ఫలానా ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాకు లాభమా కాదా అన్నది మీరు నిర్ణయించుకుని, దాని మీద పనిచేస్తున్న ఓ కొత్త వాడుకరికి దాదాపు ఓ నిర్ణయం తరహాలో చెప్పేస్తున్నారు. ప్రాజెక్టు ఏమీ ప్రయోజనకరం కాదని కానీ, నష్టమని కానీ ఇప్పటిదాకా సముదాయంలో ఓ ఏకాభిప్రాయం లేదు. ఇలా వాడుకరి చర్చా పేజీలో చర్చించుకోవడం బాగోలేదు. నిరుత్సాహజనకంగా ఉంటుంది వారికి. కాబట్టి దయచేసి ఇలాంటి చర్చలు చేసేముందు, అది కూడా ఓ సలహాగానో, సలహాకన్నా రెండు అడుగుల ఎత్తులోనో కొత్తవారికి ప్రాజెక్టు గురించి చెప్పేముందు సముదాయంలో చర్చించుకుని ఆయా అభిప్రాయాలపై నిర్ణయాలు తీసుకుందామని B.K.Viswanadh గారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:39, 7 సెప్టెంబరు 2019 (UTC)
- ఒక వాడుకరిని "మీరు ఫలానా పని కూడా చేస్తే చాలా బాగుంటుంది" అని ప్రోత్సహించవచ్చేమో గానీ, "నా దృష్టిలో ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు." అని చెప్పడం ఆ వాడుకరిని నిరుత్సాహపరచడమే నని నేను అనుకుంటున్నాను. ఒక వ్యాసం పనికొచ్చేదా కానిదా అనేది వ్యక్తి దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. వికీ నియమాలను అనుసరించి రాసేదేదీ కాదు వికీకనర్హం అని నా అభిప్రాయం. అర్జున గారూ, మీరు చెప్పినది మీ అభిప్రాయమే, సందేహం లేదు. కానీ అది అవతలి వారిని నిరుత్సాహపరుస్తుంది అనేదాన్ని మీరు గమనించాలి. బూతు అంచుల్లో తచ్చిట్లాడే వ్యాసాలను సంరక్షిస్తే, సుదుద్దేశంతో రాయదలచిన అజ్ఞాతలు రాయరేమో అని ఆరాటపడి అభ్యంతరపెట్టిన మీరు, ప్రస్తుత చర్చాంశమైన వ్యాసం పట్ల వెలిబుచ్చిన అభిప్రాయం అంత సబబుగా లేదు. ఎవరికి నచ్చిన అంశం గురించి వారిని రాయనివ్వండి. రవిచంద్ర గారు చెప్పినట్టు నియమాలకు లోబడి పనిచేసినంతవరకు ఏ పని జరిగినా మనం సంతోషించాల్సిందే కదా. లేదూ అసలు వికీలో ఈ ప్రాజెక్టు యోగ్యత పట్ల మీకు అభ్యంతరముంటే, B.K.Viswanadh గారు చెప్పినట్టు వేరే అనువైన చోట చర్చింస్తే బాగుంటుంది .__చదువరి (చర్చ • రచనలు) 05:14, 8 సెప్టెంబరు 2019 (UTC)
- స్పందించిన పవన్ సంతోష్, రవిచంద్ర, చదువరి గార్లకు ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం తెలియచేయాలనుకొంటున్నాను. పుడుతూనే ఎవరూ పరిగెత్తరు. పరుగెత్తాలనుకున్నా పడుతూ ఉంటారు.అలాగే కొత్త వాడుకరుల స్వభావం ఏదో అత్రంగా రాయాలనుకోవడం. వారు రాస్తూ నేర్చుకోవాలి తప్ప నేర్చుకొనే రాయాలనుకోకూడదు, నియమాలు, పాలసీల విషయంలోనూ అంతే, రాస్తూ మెల్లగా అన్నీ తెలుసుకుంటారు కాని తెలుసుకొని వికీలో ప్రవేశించరు. @రవిచంద్ర గారు ఆమెకు మెసేజ్ పెట్టారు కనుక పని ఆపి నాతో సంప్రదించారు. అంటే పని ఆటంకం జరిగింది. నేనైతే రాయమనే ప్రోత్సహిస్తాను కాని ఈ చర్చల బట్టి వారి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ధన్యవాదాలు...B.K.Viswanadh (చర్చ) 05:42, 8 సెప్టెంబరు 2019 (UTC)
- చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. కొత్త వాడుకరులకు మార్గదర్శకం చేయటం అనుభవమున్న ప్రతి నిర్వాహకుని కర్తవ్యం. ఇక వాడుకరి:Sri Lekha Pathakamuri గారిని నిరుత్సాహపరిచానో లేదో ఆమె స్పందించకపోయేసరికి తెలియదు. ఒకవేళ నేను నిరుత్సాహపరిచానని అనుకొంటే, మిగతావారు ఉత్సాహపరిచే పని అంటే ఈ ప్రాజెక్టు కొనసాగించటం ఎందుకువిలువైనదో తెలియచేయవచ్చు కదా. ఇక B.K.Viswanadh గారు, వికీమీడియా ఫౌండేషన్ నుండి ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు సమన్వయకునిగా సమీక్ష చేయటం కనీస బాధ్యత. ఇప్పటికే కొన్ని సార్లు సూచించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికైనా వారు చర్యతీసుకుంటారని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 03:49, 9 సెప్టెంబరు 2019 (UTC)
- అర్జున గారు ఈ ప్రాజెక్టు పూర్తి అయినది. దీని వలన ఉపయోగాలు ప్రాజెక్టు పేజీలో ఉదహరిచబడినవి. ప్రాజెక్టు సంభందించినంతవరకూ ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్పులు చేస్తే దానర్ధం ప్రాజెక్టు కొనసాగిస్తున్నట్టు కాదు. వారి సొంత ఆశక్తితో మార్పులు చేస్తున్నట్టే. కొత్త వాడుకరులకు మార్గ నిర్దేశం చేయడం వేరు నిరుత్సాహపరచడం వేరు. ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు అంటున్నారు. ధనం నాకు ఉచితంగా ఇవ్వలేదు. ఖర్చులకొరకు ఇచ్చినది. అదీ ఒక సంవత్సర కాలం వరకూ మాత్రమే. నేను వికీలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చర్చలే అవసరం లేదు. ప్రాజెక్టు నిజంగా అనవసరం అని మెజారిటీ సభ్యుల ద్వారా తెలియచేయగలిగితే ఖర్చుచేసిన మొత్తం ధనం తిరిగి వికీమీడియా పౌండేషన్ వారికి మీ ద్వారానే అందచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతమూ లేదు.B.K.Viswanadh (చర్చ) 04:35, 9 సెప్టెంబరు 2019 (UTC)
- ఇది మార్గదర్శకం చేయడం కాదు, కాబోదు. పదుల సంఖ్యలో వికీపీడియన్లను తీసుకువచ్చి, కనీసం పదిమందిని ప్రోత్సహించి నిలబెట్టిన అనుభవంతో చెప్తున్నాను. ఒకవేళ arjunaraoc గారే గనుక "మీకు పుస్తకాలంటే ఆసక్తి ఉన్నట్టుంది. ఇదిగో ఫలానా పద్ధతిలో పుస్తకాల గురించి రాయవచ్చు, అలా రాస్తే ఆయా పుస్తకాల గురించి పదిమందికీ చెప్పినవారవుతారు" అనే ఉంటే అది ప్రోత్సాహం అవుతుంది. వికీకి వచ్చిన కొత్తల్లో నన్ను రాజశేఖర్ గారు ప్రోత్సహించారు. అప్పుడు ఆయన చేసింది ఫలానా చేస్తే బావుంటుందని, ఫలానా చేయడం నియమాల ప్రకారం తప్పు అని, అంతేకానీ ఫలానా చేయడం నియమాల ప్రకారం తప్పు కాదు కానీ వికీకి పెద్ద ప్రయోజనం లేదు అనలేదు. అనే ఉంటే, నా ఆసక్తులు మీకు ప్రయోజనకరం కానప్పుడు నేనెందుకు ఇక్కడ, సెలవు అని వెళ్ళిపోయేవాడిని. పైన చదువరి గారు గుర్తుచేసినట్టు పెద్దలకు మాత్రమే వ్యాసాలలో అజ్ఞాతలు రాసే స్వేచ్ఛ గురించి మాట్లాడే మనిషే ఇక్కడ ఫలానా ప్రాజెక్టులో కొత్తవాడుకరి చేస్తున్న పని తనకు ప్రయోజనకరంగా అనిపించకపోవడం వల్ల "ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు." అంటున్నారంటే రెండు వాదనలు ఒకే సదుద్దేశంతో చేశారని అనుకోలేకపోతున్నాను. ఈ ప్రాజెక్టుకు సముదాయానికి విలువైనదా కాదా అన్నది ప్రశ్న కాదు, పైగా ఈ ప్రశ్న ముందే ఒక తీర్పులా తీర్చిచి ఇప్పుడు, కొత్తవాడుకరి పేజీలో కాదు అడగాల్సింది. ఈ జాబితాలో ఆ అమ్మాయికి ఇష్టమైతే కొన్ని పుస్తకాలు చేర్చడం వల్ల ప్రాజెక్టుకి నష్టం ఏమీలేదు. పైగా అసలంటూ ఒక మనిషి అలా వికీపీడియా వాతావరణం అలవరుచుకుంటూ ఉంటే రేపన్న రోజు మిగిలిన వ్యాసాల్లోనూ పనిచేసేలా ఉత్సాహపరచవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:44, 9 సెప్టెంబరు 2019 (UTC)
- చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. కొత్త వాడుకరులకు మార్గదర్శకం చేయటం అనుభవమున్న ప్రతి నిర్వాహకుని కర్తవ్యం. ఇక వాడుకరి:Sri Lekha Pathakamuri గారిని నిరుత్సాహపరిచానో లేదో ఆమె స్పందించకపోయేసరికి తెలియదు. ఒకవేళ నేను నిరుత్సాహపరిచానని అనుకొంటే, మిగతావారు ఉత్సాహపరిచే పని అంటే ఈ ప్రాజెక్టు కొనసాగించటం ఎందుకువిలువైనదో తెలియచేయవచ్చు కదా. ఇక B.K.Viswanadh గారు, వికీమీడియా ఫౌండేషన్ నుండి ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు సమన్వయకునిగా సమీక్ష చేయటం కనీస బాధ్యత. ఇప్పటికే కొన్ని సార్లు సూచించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికైనా వారు చర్యతీసుకుంటారని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 03:49, 9 సెప్టెంబరు 2019 (UTC)
- స్పందించిన పవన్ సంతోష్, రవిచంద్ర, చదువరి గార్లకు ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం తెలియచేయాలనుకొంటున్నాను. పుడుతూనే ఎవరూ పరిగెత్తరు. పరుగెత్తాలనుకున్నా పడుతూ ఉంటారు.అలాగే కొత్త వాడుకరుల స్వభావం ఏదో అత్రంగా రాయాలనుకోవడం. వారు రాస్తూ నేర్చుకోవాలి తప్ప నేర్చుకొనే రాయాలనుకోకూడదు, నియమాలు, పాలసీల విషయంలోనూ అంతే, రాస్తూ మెల్లగా అన్నీ తెలుసుకుంటారు కాని తెలుసుకొని వికీలో ప్రవేశించరు. @రవిచంద్ర గారు ఆమెకు మెసేజ్ పెట్టారు కనుక పని ఆపి నాతో సంప్రదించారు. అంటే పని ఆటంకం జరిగింది. నేనైతే రాయమనే ప్రోత్సహిస్తాను కాని ఈ చర్చల బట్టి వారి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ధన్యవాదాలు...B.K.Viswanadh (చర్చ) 05:42, 8 సెప్టెంబరు 2019 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:29, 1 సెప్టెంబరు 2021 (UTC)
Invitation to Rejoin the Healthcare Translation Task Force
మార్చుYou have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)