పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఉత్సాహము[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. ఉత్సాహము ఛందోరూపం చాలా ప్రాచీన మైనది.[2]

పద్య లక్షణము మార్చు

  1. ఇది జాతి రకానికి చెందినది
  2. 15 నుండి 22 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం కలదు
  5. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  6. ప్రతి పాదమునందు ఏడు సూర్య , ఒక గురువు గణములుండును.

యతి స్థానం మార్చు

ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము.

ఉదా: సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్

ఉదాహరణలు మార్చు

 
కడియం జెడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో తిరుపతి వేంకట కవుల విగ్రహాలు

తిరుపతి వేంకట కవులు ఒక రోజున ఒక అవధానము (సాహిత్యం)లో "ఉల్లిపాయ పకోడి" మీద ఆశువుగా చెప్పిన పద్యము

సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్
చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.

ఉదాహరణ: 2

గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్
నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.

మరిన్ని ఉదాహరణలు [3] ఇక్కడ చూడవచ్చు.

మూలాలు మార్చు

  1. "ఉత్సాహము". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
  2. మిరియాల), Dileep Miriyala(దిలీపు. "ఉత్సాహము — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2021-10-17. Retrieved 2020-08-26.
  3. "ఉత్సాహము ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్సాహము&oldid=3783398" నుండి వెలికితీశారు