ఎం.ఎ.రహ్మాన్
ఎం.ఎ.రహ్మాన్ భారతదేశం గర్వించదగిన చలనచిత్ర ఛాయాగ్రాహకులలో ఒకడు. ఇతని కృషికి గుర్తింపుగా 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతడిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
ఎం.ఎ.రహ్మాన్ | |
---|---|
వృత్తి | ఛాయాగ్రాహకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1941-1987 |
జీవిత భాగస్వామి | బళ్ళారి లలిత |
పురస్కారాలు | రఘుపతి వెంకయ్య అవార్డు (1983) |
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1914 మార్చి 14న ఔరంగాబాదులో జన్మించాడు. ఇతడికి మొదటినుండి సినిమాటోగ్రఫీ పట్ల అభిరుచి ఎక్కువగా ఉండేది. ఇతడు తన 19వ యేట చలనచిత్ర ఛాయాగ్రాహకుడు జోషి వద్ద కెమెరా బాయ్‌గా పనిచేశాడు. తరువాత ఇతర కెమెరామెన్ల వద్ద మూకీ చిత్రాలకు పనిచేసి అనుభవం గడించాడు. 1934లో బెంగళూరులోని సూర్యా ఫిలిం కంపెనీలో చేరి అనేక చిత్రాలకు పనిచేశాడు. తరువాత ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో మూకీ కెమెరా మెన్‌గా చేరాడు. అప్పట్లో అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీతో అనేక స్టంట్ చిత్రాలు విజయవంతం అయ్యేందుకు ఎంతో కృషి చేశాడు. ట్రిక్ ఫోటోగ్రఫీలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. నలుపు తెలుపు ఛాయాగ్రహణంలో ఇతని పరిజ్ఞానానికి అనేక తెలుగు, తమిళ చిత్రాలే నిదర్శనం. అనేక దశాబ్దాల పాటు సినీ ఛాయాచిత్ర కళలో వివిధ రకాల ప్రయోగాలు చేసి ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు.[1]
సినిమాలు
మార్చుఇతడు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కొన్ని తెలుగు సినిమాలు:[2]
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|
1941 | భక్తిమాల | హరిలాల్ దేశాయ్ | |
1943 | భాగ్యలక్ష్మి | పి. పుల్లయ్య | |
1949 | మన దేశం | ఎల్.వి.ప్రసాద్ | |
1950 | లక్ష్మమ్మ | త్రిపురనేని గోపీచంద్ | |
1950 | సంసారం | ఎల్.వి.ప్రసాద్ | |
1951 | పేరంటాలు | త్రిపురనేని గోపీచంద్ | |
1952 | దాసి | సి.వి.రంగనాథ దాసు | |
1953 | నా ఇల్లు | చిత్తూరు నాగయ్య | |
1953 | పిచ్చి పుల్లయ్య | తాతినేని ప్రకాశరావు | |
1954 | తోడుదొంగలు | డి.యోగానంద్ | |
1955 | జయసింహ | డి.యోగానంద్ | |
1955 | విజయగౌరి | డి.యోగానంద్ | |
1955 | సంతానం | సి.వి.రంగనాథ దాసు | |
1956 | సాహస వీరుడు | డి.యోగానంద్ | మదురై వీరన్ అనే తమిళ సినిమా డబ్బింగ్ |
1957 | పాండురంగ మహత్యం | కమలాకర కామేశ్వరరావు | |
1957 | సువర్ణసుందరి | వేదాంతం రాఘవయ్య | |
1958 | రాజనందిని | వేదాంతం రాఘవయ్య | |
1959 | కృష్ణలీలలు | జంపన చంద్రశేఖరరావు | |
1959 | రేచుక్క-పగటిచుక్క | కమలాకర కామేశ్వరరావు | |
1960 | దేసింగురాజు కథ | టి.ఆర్.రఘునాథ్ | రాజా దేసింగు అనే తమిళచిత్రానికి డబ్బింగ్ |
1962 | భీష్మ | బి.ఎ.సుబ్బారావు | |
1963 | నర్తనశాల | కమలాకర కామేశ్వరరావు | |
1963 | మంచి చెడు | టి.ఆర్.రామన్న | |
1963 | వాల్మీకి | సి.యస్.రావు | |
1965 | ప్రమీలార్జునీయము | ఎం.మల్లికార్జునరావు | రవికాంత్ నగాయిచ్, మాధవ్ బుల్బులేలతో కలిసి |
1966 | శకుంతల | కమలాకర కామేశ్వరరావు | |
1967 | కాలచక్రం | టి.ఆర్.రామన్న | పణం పడైతవన్ అనే తమిళ సినిమా డబ్బింగ్ |
1967 | కొంటెపిల్ల | టి.ఆర్.రామన్న | పారక్కం పావై అనే తమిళ సినిమా డబ్బింగ్ |
1975 | బాగ్దాద్ వీరుడు | టి.ఆర్.రామన్న | బాగ్దాద్ పెరళగి అనే తమిళ సినిమా డబ్బింగ్ |
1978 | మేలుకొలుపు | బి.వి.ప్రసాద్ | |
1978 | శ్రీరామ పట్టాభిషేకం | ఎన్.టి.రామారావు | |
1979 | మా వారి మంచితనం | బి.ఎ.సుబ్బారావు | |
1979 | శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం | ఎన్.టి.రామారావు | |
1979 | శ్రీమద్విరాట పర్వము | ఎన్.టి.రామారావు |
పురస్కారాలు, సత్కారాలు
మార్చు- దక్షిణ భారత సినీ సాంకేతిక నిపుణుల సంస్థ ఇతడిని రామన్ అవార్డుతో సత్కరించింది.
- దక్షిణాది టాకీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాదు, చెన్నైలలో సన్మానం.
- 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు
మూలాలు
మార్చు- ↑ కమీషనర్. నంది అవార్డు విజేతల పరంపర (1964-2008) (PDF) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ. pp. 71–72. Retrieved 30 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "All Movies M.A. Rahman". ఇండియన్ సినిమా. Retrieved 30 September 2022.
బయటిలింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎం.ఎ.రహ్మాన్ పేజీ