కందం
(కందము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
యిందు గణములు
మార్చుగ గ | భ | జ | స | నల |
U U | U I I | I U I | I I U | I I I I |
లక్షణములు
మార్చు- పాదాలు=4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలు మాత్రమే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలుకావాలి.
- యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.
- ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.
ఉదాహరణ 1
మార్చునడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింటు గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
ఉదాహరణ 2
మార్చుభూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
భ | భ | భ | ||
భూ త ల | నా థు డు | రా ము డు | ||
గ గ | గ గ | జ | నల | స |
ప్రీతుం | డై పెం | డ్లి యాడె | బృథుగుణ | మణి సం |
గ గ | గ గ | గ గ | ||
ఘాతన్ | భాగ్యో | పేతన్ | ||
గ గ | స | నల | స | గ గ |
సీతన్ | ముఖకాం | తి విజిత | సితఖ | ద్యోతన్ |
కంద పద్యమునందు గణముల వివరణ
మార్చుగగ గణము = UU { గురువు, గురువు }
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }