పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తెలుగున పద్యవిశేషమలు వాటి పదాలలోగల అక్షరాలసంఖ్యను బట్టి ఛందములుగా వర్గీకరించబడ్డవి। ఉదాహరణకు, పదమునకు ఒక్క అక్షరముమాత్రమే వున్నపద్యరీతులను ఉక్తఛందమునకు చెందినవాటిగా గుర్తింపవలెను। అటులనే, పాదానికి ఇఱువై అక్షరాలుగల పద్యవిశేషము కృచ్ఛందమునకు చెందినదిగా గుర్తించవలెను। ఇలా పదానికి 26 అక్షరములుగల పద్యవిశేషములకు ఛందముల పేర్లు నియమింపబడినవి।

పేర్లు మార్చు

ఇరువదియాఱు ఛందముల పేర్లు ఇవ్విధముగానున్నవి।

  1. ఉక్త
  2. అత్యుక్త
  3. మధ్య
  4. ప్రతిష్ఠ
  5. సుప్రతిష్ఠ
  6. గాయత్రి
  7. ఉష్ణిక్కు
  8. అనుష్టుప్పు
  9. బృహతి
  10. పంక్తి
  11. త్రిష్టుప్పు
  12. జగతి
  13. అతిజగతి
  14. శక్వరి
  15. అతిశక్వరి
  16. అష్టి
  17. అత్యష్టి
  18. ధృతి
  19. అతిధృతి
  20. కృతి
  21. ప్రకృతి
  22. అకృతి
  23. నికృతి
  24. సంకృతి
  25. అతికృతి
  26. ఉత్కృతి

పై ఛందములలో ఏర్పడు సమ వృత్తముల సంఖ్య 13,42,17,726. వాటిలో ప్రముఖమైనవాటిని గుఱించి వికీపీడియాలో వివరించబడ్డవి।

లెక్కించు విధానము మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛందములు&oldid=3878074" నుండి వెలికితీశారు