వర్తమాన ఘటనలు | 2007 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2006 ఘటనలు


జనవరి 2007
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

పతాక శీర్షికలు

2007 జనవరి 31, బుధవారం మార్చు

  • సిడ్నీ షెల్టన్‌ మృతి:
    ప్రముఖ ఆంగ్ల రచయిత సిడ్నీ షెల్టన్‌ కన్నుమూశారు.
  • కోరస్‌ను కొనుగోలు చేసిన టాటా:
    బ్రిటిష్‌-డచ్‌ స్టీల్‌ కంపెనీ కోరస్‌ను భారత్‌కు చెందిన టాటా స్టీల్స్‌ కంపెనీ కొనుగోలు చేసి భారత ఉక్కు రంగ చరిత్రలో నూతనాధ్యాయం సృష్టించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ వేలంపాటలో బ్రెజిల్‌కు చెందిన ఉక్కు కంపెనీ సీఎస్‌ఎన్‌ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ వేలంపాట ముగిసింది. 11.3 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 50వేల కోట్ల రూపాయలకు టాటా స్టీల్స్‌ కోరస్‌ను కొనుగోలు చేసింది. ఆఖరుగా జీఎస్‌ఎన్‌ కంపెనీ ఒక్కో షేరుకు 603 పెన్నీలు ఆఫర్‌ చేయగా టాటా కంపెనీ 608 పెన్నీలు ఆఫర్‌చేసి విజేతగా నిలిచింది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్స్‌ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఇంతకుముందే టాటా కంపెనీ సింగపూర్‌, థాయ్‌లాండ్‌ కంపెనీలకు చెందిన స్టీల్‌ కంపెనీలను కూడా కొనుగోలు చేసింది. మార్చి మధ్యకల్లా ఈ డీల్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. ఈ విలీనం భారత స్టీల్‌ చరిత్రలోనే అతి పెద్దది.ఈనాడు

2007 జనవరి 22, సోమవారం మార్చు

అంతరిక్ష రంగంలో భారత్ మరో విజయం: 550 కిలోల బరువున్న 'స్పేస్‌ రికవరీ క్యాప్స్యూల్‌(ఎస్‌ఆర్‌ఈ-1)' ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి ఈరోజు విజయవంతంగా భూమికి తిరిగి తీసుకురావడం ద్వారా ఇస్రో నవశకంలోకి అడుగుపెట్టింది. దీంతో రీ ఎంట్రీ పరిజ్ఞానాన్ని సముపార్జించిన అగ్రరాజ్యాల సరసన భారత్‌ చేరినట్లయింది. ఈ పరిణామంతో మానవ సహిత అంతరిక్ష యాత్రల దిశగా ముందడుగు వేసినట్లయింది. అంతే కాకుండా, పదేపదే వినియోగించే రోదసీ నౌకల తయారీకీ శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఎస్‌ఆర్‌ఈ-1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ఈ నెల 10న శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇది 12 రోజుల పాటు కక్ష్యలో ఉండి పలు మైక్రో గ్రావిటీ ప్రయోగాలు చేపట్టింది. బి.బి.సి.

2007 జనవరి 18, గురువారం మార్చు

  • సెన్సెక్స్ 14,217.75 పాయింట్ల వద్ద ముగిసి సరికొత్త రికార్డు సృష్టించింది

2007 జనవరి 17, బుధవారం మార్చు

  • ములాయంకు కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణ: సమాజ్‌వాది పార్టీ నేతృత్వంలోని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి బయట నుంచి ఇస్తున్న మద్దతును కాంగ్రెస్‌ ఈ రోజు రాత్రి ఉపసంహరించుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నర్‌ టి.వి.రాజేశ్వర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు 15 మంది మాత్రమే కాబట్టి ఎస్పీ అధికారంలో కొనసాగడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. ఈనాడు
  • ఆంధ్రప్రదేశ్ లో మరో 4 విమానాశ్రయాలు:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నెల్లూరు, ఒంగోలు, రామగుండం, తాడేపల్లిగూడెంలలో విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు. వరంగల్‌, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, పుట్టపర్తిలలో విస్తరణ పనులు చేపడతారు. నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ సాయంతో కేంద్ర విమానయాన సంస్థ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. దీని ఆధారంగా నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈనాడు

2007 జనవరి 12, శుక్రవారం మార్చు

  • ఈ రోజు నుంచి రైళ్లలో సాధారణ బోగిల్లో ప్రయాణించేవారు కూడా మూడు రోజుల ముందుగానే టికెట్లను కొనుగోలు చెయ్యవచ్చు. ఈ నిర్ణయం వలన చివరిక్షణంలో రైలు బయలుదేరే ముందు రద్దీ వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు వీలు అవుతుంది.
  • అమెరికా దౌత్య కార్యాలయంపై రాకెట్‌ దాడి: గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రాకెట్‌ దాడి జరిగింది. ఈ రోజు ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు.

2007 జనవరి 11, గురువారం మార్చు

  • సుప్రీం సంచలన తీర్పు: చట్టాలన్నీ న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో 1973 తర్వాత చేర్చిన అంశాలన్నీ రాజ్యంగసమీక్షకు లోబడే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సభర్వాల్‌ ఆధ్వర్యంలోని 9మంది సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. న్యాయసమీక్షను తప్పించుకునేందుకు పార్లమెంటు 9వ షెడ్యూలును ఉపయోగించజాలదని కోర్టు పేర్కొంది. 1973 తర్వాత ఈ షెడ్యూలులో చేసిన చట్టాలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉంటే కోర్టులో కేసులు వేయవచ్చని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు పార్లమెంట్‌ ఈ షెడ్యూలుకింద చేసే చట్టాలు కోర్టు పరిధిలోకి రావటంలేదు. 1951 సంవత్సరంలో భూసంస్కరణలను సమర్థంగా అమలుచేసేందుకు గాను అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 9వ షెడ్యూలుకు రూపకల్పన చేశారు. అప్పట్లో ఇందులో 13 చట్టాలు ఉండేవి. ఇప్పుడు అందులో 284 చట్టాలు ఉన్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తమిళనాడు కల్పించిన 69 శాతం రిజర్వేషన్లను కూడా ఈ షెడ్యూలులోనే చేర్చారు. ఈనాడు
  • తెలంగాణ విశ్వరూపం: తెరాస ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న వరంగల్‌లో 'తెలంగాణ విశ్వరూపం' పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.
  • కోర్టులో లొంగిపోయిన సిద్ధూ: హత్య కేసులో మూడేళ్ల శిక్ష పడిన మాజీ క్రికెటర్‌, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ గురువారం చండీఘడ్ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆయన్ను రెండువారాల పాటు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది. పోలీసులు వెంటనే పాటియాలా సెంట్రల్‌ జైలుకు ఆయన్ను తరలించారు. ఈనాడు

2007 జనవరి 10, బుధవారం మార్చు

  • పీఎస్‌ఎల్‌వీ సీ-7 ప్రయోగం విజయవంతం: భారత అంతరిక్ష పరిశోధనాకేంద్రం మరో మైలురాయిని అధిగమించింది. మొదటిసారిగా నాలుగు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు గాను సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌ చేసిన ప్రమోగం విజయవంతమైంది. ఈరోజు ఉదయం 9.23 నిముషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి 7 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది.
  • పోస్టాఫీసుల్లో కూడా చందమామ లభ్యం: పోస్టాఫీసుల్లో కూడా చందమామ విక్రయించాలని ఆ పత్రిక యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పోస్టల్‌శాఖతో వప్పందం కుదిరినట్లు చందమామ సంపాదకుడు విశ్వనాథరెడ్డి తెలిపారు.
  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు:ఎంపీలను బహిష్కరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. 2005 సంవత్సరంలో 'ఆపరేషన్‌ దుర్యోధన్‌' పేరుతో కోబ్రాపోస్ట్‌ప్రసారం చేసిన కథనంలో పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ఎంపీలు లంచాలు తీసుకుంటున్న వైనాన్ని బయటపెట్టారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్పీకర్‌ దీనిపై విచారణకు ఓ కమిటీని నియమించారు. పార్లమెంట్‌ క్రమశిక్షణ కమిటీ ఈ విషయంపై విచారణ జరిపి ఎంపీల బహిష్కరణకు సిఫార్సు చేయటంతో స్పీకర్‌రాజ్యసభ ఎంపీతో సహా 11మందిని పార్లమెంటునుంచి బహిష్కరించారు. దీన్ని ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం ఈరోజు జస్టిస్‌ సభర్వాల్‌తో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఎంపీల బహిష్కరణ సబబేనని తీర్పును వెలువరించింది. అందుకుగాను పార్లమెంట్‌కు అధికారం ఉందని వారు స్పష్టంగా తెలిపారు. అయితే ఈ ఎంపీలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు పేర్కొంది.

2007 జనవరి 8, సోమవారం మార్చు

  • పోతిరెడ్డిపాడు పై పొన్నాల సవాలు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందంటూ తెరాస నేత కేసీఆర్‌, తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ శాసన సభ్యులులు పి.జనార్ధనరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలు వాస్తవాలు విస్మరించి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నదానికంటే ఒక్క క్యూసెక్కు నీరైనా అదనంగా వెళ్తుందని గాని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని గాని నిరూపిస్తే మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నాడు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిచేయొద్దని ఆయా పార్టీల నేతలకు మంత్రి పొన్నాల విజ్ఞప్తిచేశారు. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, జంట నగరాలకు నీటి సంక్షోభం వస్తుందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వీటిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. 'తెలంగాణ గడ్డపై పుట్టినవాడిగా, ఇంజినీరుగా, పోతిరెడ్డిపాడుపై కూలంకషంగా అధ్యయనం చేసిన వ్యక్తిగా రాష్ట్ర మంత్రిమండలి సభ్యుడిగా ఉన్న నేను పోతిరెడ్డిపాడు విస్తరణపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం' అని అన్నాడు. ఈనాడు

2007 జనవరి 7, ఆదివారం మార్చు

2007 జనవరి 5, శుక్రవారం మార్చు

  • రష్యాలో తవ్వకాల్లో బయటపడ్ద విష్ణు విగ్రహం: రష్యాలోని వోల్గాలో జరిగిన తవ్వకాల్లో పురాతన విష్ణు విగ్రహమొకటి బయటపడింది. ఈనాడు

2007 జనవరి 4, గురువారం మార్చు

  • కోరాడ నరసింహారావు మృతి: ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు తీవ్ర అస్వస్థతతో 2007 జనవరి 4 రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

2007 జనవరి 3, బుధవారం మార్చు

  • ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు:ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల వర్క్‌బుక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యాశాఖా మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెలిపారు.ఈనాడు
  • ముఖ్యమంత్రి భూదానం: వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ఎస్టేట్‌కు చెందిన 310 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, అదే జిల్లాలోని పెనగలూరు మండలం తిమ్మమాంబాపురం గ్రామంలోని 997 ఎకరాలను కూడా ప్రభుత్వానికి అప్పగించారు.ఆంధ్రజ్యోతి[permanent dead link]
  • త్రినేత్ర సూపర్ మార్కెట్ అమ్మకం: రిటైల్‌ రంగంలో ఉన్న విస్త­ృతమైన అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా దక్షిణాదిలో 250 కోట్ల టర్నోవర్‌తో 172 రిటైల్‌ స్టోర్‌లు నిర్వహిస్తున్న త్రినేత్ర సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. త్రినేత్ర సూపర్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 83, బెంగుళూరులో 26, చెన్నైలో 15 సూపర్‌ స్టోర్‌లున్నాయి. ఆంధ్రజ్యోతి

2007 జనవరి 2, మంగళవారం మార్చు

  • రామోజీ రిట్‌పై హైకోర్టు స్టే తిరస్కృతి: మార్గదర్శి కార్యకలాపాలపై ఇద్దరు అధికారులతో విచారణ జరపడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను, డిపాజిటర్ల చట్టాన్ని సవాల్‌ చేస్తూ రామోజీరావు దాఖలు చేసిన రిట్లపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ గణపత్‌సింగ్‌ సింఘ్వి, జస్టిస్‌ నాగార్జునరెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అయితే ఈ చట్టం కింద తమపై చర్య తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న పిటి షనర్‌ అభ్యర్ధనను సాంకేతిక కారణాలపై న్యాయ మూర్తులు తిరస్కరించారు. ఆంధ్రజ్యోతి వార్త
  • గ్రేటర్ రాయలసీమ: ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి, ఆత్మకూరు శాసన సభ్యులు ఏరాసు ప్రతాపరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ లబ్బి వెంకటస్వామితో కర్నూలులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 'ఒకవేళ అనుకోని పరిస్థితులు సంభవించి రాష్ట్రం విడిపోవాల్సి వస్తే.. రాయలసీమ ప్రజల హక్కుల సంగతి తేలాలి. విభజనకు ముందే ఇక్కడి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి గ్రేటర్‌ రాయలసీమను ఏర్పరచాలి. అన్నదమ్ముల్లా విడిపోదాం అని తెలంగాణ వాదులు అంటున్నారు గనుక..ఎవరి వాటాలు ఏమిటో తేలాలి. ఇన్నాళ్లుగా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోంది. రాజధాని తరలింపు దానికి పరాకాష్ఠ. అయినా ఇక్కడి ప్రజలు ఉదారత చూపారు. ఇంకా అలా జరగదు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 'సీమ'లోని నాల్గుజిల్లాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. 11 ఎంపీలు, 77 మంది శాసన సభ్యులులు ఉన్నారు.పైగా అక్కడి ప్రజలూ కోరుకుంటున్నారు, కనుక గ్రేటర్‌ రాయలసీమను ఏర్పాటు చేయాలి' అని డిమాండ్‌ చేశారు.
  • రెండో ఎస్సార్సీ: రెండో ఎస్సార్సీ ఏర్పాటుకు సమయం వచ్చిందని, కేంద్రం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నాడని ఈనాడు రాసింది.
  • మళ్లీ రెచ్చగొట్టిన కేశవరావు: జనవరి 2 న పీసీసీ అధ్యక్షుడు కేశవరావు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తూ కరెంటు విషయమై తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఇటీవల అన్న మాటలను ఉటంకిస్తూ ఇలా అన్నాడు.. 'ఏది చీమనైనా రానివ్వమని అన్నారే మేము అన్ని చోట్లా తిరిగివచ్చాం కదా, గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్‌ నేతలను తరిమికొట్టడం ఖాయమని అన్నారే మేము అన్ని చోట్లా తిరిగివచ్చాం కదా'. రైతులు కోరినట్లు వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతరంగా కరెంటు ఇవ్వడం అసాధ్యమని అన్నాడు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏ ప్రభుత్వమూ కూడా రైతులకు తొమ్మిదిగంటల పాటు కరెంటు ఇవ్వలేదని, ఈ విషయంలోఎవరికైనా అనుమానాలు ఉంటే చరిత్ర పుస్తకాలు చదవాలని కూడా ఆయన అన్నాడు.
  • రాష్ట్రం ఎంత త్వరగా విడిపోతే అంత మంచిదని కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య అన్నారు. కనీసం 2009 లోపైనా రాష్ట్ర విభజన జరిగి తీరాలని.. అలా జరగని పక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవని హెచ్చరించారు.

2007 జనవరి 1, సోమవారం మార్చు

  • డూండీ మరణం: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు పోతిన డూండీశ్వరరావు మరణించాడు. డూండీగా ఆయన సినీ పరిశ్రమకు సుపరిచితుడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న డూండీ విశాఖపట్నం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భౌతిక కాయాన్ని విశాఖపట్నం సీతమ్మధారలోని డూండీ కుమార్తె నివాసానికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈనాడులో డూండీ మరణ వార్త
"https://te.wikipedia.org/w/index.php?title=జనవరి_2007&oldid=3428254" నుండి వెలికితీశారు