తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2021

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, అనేది జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్‌, మెడల్‌ అందజేసి సన్మానిస్తారు.[1]

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2021
పురస్కారం గురించి
విభాగం విద్యారంగంలో కృషి
వ్యవస్థాపిత 2014
మొదటి బహూకరణ 2014
క్రితం బహూకరణ 2020
మొత్తం బహూకరణలు 48
బహూకరించేవారు తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ
నగదు బహుమతి ₹ 10,000

2021 పురస్కారాలలో భాగంగా సెప్టెంబరు 4న రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల జాబితా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దేవసేన జారీచేసింది.[2][3] ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలకుగాను 48 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికచేశారు. హెచ్‌ఎం క్యాటగిరీలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాటగిరీలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ క్యాటగిరీలో 11 మంది, డైట్‌ లెక్చరర్‌ క్యాటగిరీలో ఒక్కరు, స్పెషల్‌ క్యాటగిరీలో ఆరుగురు ఎంపికయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల టీచర్లతోపాటు డైట్‌ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2021 సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించే గురుపూజోత్సవంలో అవార్డులు ప్రదానం చేశారు.[4]

పురస్కార గ్రహీతలు మార్చు

2021 తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల జాబితా:[5]

ప్రధానోపాధ్యాయులు/గురుకులాల ప్రిన్సిపాల్స్ మార్చు

క్రమసంఖ్య పేరు ప్రాంతం
1 హుర్బాను బాలక్ మందిర్, ఆదిలాబాదు
2 బి. విజయ జహీరాబాద్, సంగారెడ్డి
3 కుంట రవికుమార్ నరేంద్రనగర్, హనుమకొండ
4 పి. వెంకటేశ్వర్ గౌడ్ మార్కూక్, సిద్దిపేట
5 కోడెపాక రఘుపతి చల్లగరిగె, చిట్యాల మండలం, భూపాలపల్లి
6 జి. శంకరయ్య వెన్నకేడ్, మహబూబ్ నగర్
7 సొగల అంజయ్య చెల్పూర్, కరీంనగర్
8 ఎం. ఉదయ్ బాబు బోరగూడ, ఆసిఫాబాదు
9 బి. సీతయ్య పెర్కిట్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్
10 వి. ఆంజనేయులు భగత్ సింగ్ నగర్, మేడ్చల్

స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ట్యూటర్ మార్చు

క్రమసంఖ్య పేరు ప్రాంతం
1 జి. శ్రీనివాస్ రెడ్డి వర్షకొండ, జగిత్యాల
2 ఎన్. మురళీధర్ యానంపల్లి, డిచ్‌పల్లి మండలం, నిజామాబాద్
3 పి.సురేష్ బాబు పున్నేల్, హనుమకొండ
4 బి. మధు గట్లకానిపర్తి, వరంగల్
5 ఆర్. శోభారాణి బోరబండ, హైదరాబాద్
6 జి. రతనాగఫణి రెడ్డి జానంపేట, మహబూబ్ నగర్
7 ఎం. డాన్ బోస్కో శాంతినగర్, ఖమ్మం
8 వి. మహేష్ చంద్ర ఎల్లంతకుంట, రాజన్న సిరిసిల్ల
9 కె. శ్రీనివాస్ రెడ్డి చర్లపల్లి, వరంగల్
10 డి. వెంకటేశ్వర్లు జంకాపూర్, ఆసిఫాబాద్
11 ఎస్. వెంకటేశ్వర్లు వాడాపూర్, పెద్దపల్లి
12 పి. ఐలయ్య మంగళగూడెం, ఖమ్మం
13 గౌసియా బేగం ఇటికాలపల్లి, జనగామ
14 ఎస్. బాలాజీ మస్కాపూర్, ఖానాపూర్ మండలం, నిర్మల్
15 జి. అంజిగౌడ్ కుతివాడ, మెదక్
16 బాకం రాజేందర్ నాయినిపాక, చిట్యాల మండలం, భూపాలపల్లి
17 బి. సంపత్ కుమార్ జూలూరుపాడ్, కొత్తగూడెం
18 సి. వెంకట హరికృష్ణ తూప్రాన్ పేట్, చౌటుప్పల్ మండలం, భువనగిరి
19 బి.లక్ష్మణ్ యాపల్గూడ, ఆదిలాబాద్
20 డి. శ్రీనివాస్ కాలమడుగు, మంచిర్యాల

ఎస్‌జీటీ/పీఈటీ/ఎల్‌పీ మార్చు

క్రమసంఖ్య పేరు ప్రాంతం
1 కె. శ్రీనివాసరెడ్డి కుక్కునూర్‌పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట
2 ఎ. సతీష్ బాబు ఊటూరు, మానకొండూర్ (మం), కరీంనగర్
3 ఏజే. ప్రభాకర్ అచ్యుతాపురం, దుమ్ముగూడెం, కొత్తగూడెం
4 ఎం. రామరాజ్ వడ్లకొండ, జనగామ
5 కె. రత్నరాజు భరణిపాడు, వేంసూరు (మం), ఖమ్మం
6 తేలుకుంట్ల సునీత ముడుపుగల్, మహబూబాబాద్
7 ఇ. సమ్మయ్య శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ, పెద్దపల్లి
8 కసిరెడ్డి అశోక్ రెడ్డి ఎస్సీ కాలనీ, సూర్యాపేట
9 ఎ. దేవరాజు అంబేద్కర్ నగర్, రాచర్ల, రాజన్న సిరిసిల్ల
10 పి. సమ్మయ్య ముప్పవరం, హనుమకొండ
11 ఎం. పరమేశ్వర్ రెడ్డి వల్లభాపూర్, మెదక్

ప్రత్యేక విభాగం మార్చు

క్రమసంఖ్య పేరు ప్రాంతం
1 కట్టబోయిన సైదయ్య సైల్గ్పూర్, తిరుమలగిరి సాగర్ (మం), నల్గొండ
2 బి. శంకరి ముత్యంపల్లి, మంచిర్యాల
3 జి. కళావతి పోచమ్మగడ్డ తండా, మహబూబ్ నగర్
4 పి. రాములు కలిగోటి, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్
5 ఆర్. రాజిరెడ్డి తాళ్ళసింగారం, చౌటుప్పల్ (మం), భువనగిరి
6 టి. నిహారిక గొర్రెకుంట, గీసుకొండ (మం), వరంగల్

బిఎడ్ కళాశాల అధ్యాపకులు మార్చు

క్రమసంఖ్య పేరు ప్రాంతం
1 ఎం. పాపయ్య మహబూబ్ నగర్

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Telugu, TV9 (2020-09-05). "రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక". TV9 Telugu. Archived from the original on 2022-03-06. Retrieved 2022-04-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల జాబితా విడుదల". www.suryaa.com (in ఇంగ్లీష్). 2021-09-04. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.
  3. "Best Teacher Awards: 48 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు". Sakshi Education. 2021-09-04. Archived from the original on 2021-09-04. Retrieved 2022-04-13.
  4. telugu, NT News (2021-09-04). "ఉత్తమ ఉపాధ్యాయులు 48 మంది". Namasthe Telangana. Archived from the original on 2021-09-04. Retrieved 2022-09-02.
  5. "సేంద్రీయ సాగు పెంచేలా ఈనెల 16 న రాష్ట్ర స్థాయి సదస్సు." ETV Bharat News. 2021-09-04. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.