తెలుగు సినిమాలు 1953
ఈ యేడాది 25 చిత్రాలు విడుదలయ్యాయి. అక్కినేని సాంఘిక హీరోగా రూపాంతరం చెందడంలో వినోదా వారి 'దేవదాసు' సాధించిన ఘనవిజయం ఎంతగానో తోడ్పడింది. నాటి నుండి నేటి వరకు ఈ చిత్రం విషాదాంత ప్రేమకథలకు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలచింది. భానుమతి తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'చండీరాణి' చిత్రాన్ని రూపొందించి, ఒకే రోజున విడుదల చేసి రికార్డు సృష్టించారు. అయితే ఈ సినిమా తెలుగులో పరాజయాన్ని చవిచూసింది. యన్టీఆర్ సొంత సంస్థ యన్. ఏ.టి. నిర్మించిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య' మంచి చిత్రంగా ప్రశంసలు పొందినా, ఆర్థికంగా ఫలితం సాధించలేక పోయింది. 'అమ్మలక్కలు', 'బ్రతుకు తెరువు' చిత్రాలు హిట్స్‌గా నిలిచి శతదినోత్సవాలు జరుపుకున్నాయి. హిందీ నుండి తెలుగుకు అనువదించిన రాజ్‌కపూర్ 'ప్రేమలేఖలు' విశేషాదరణ పొందింది. ఈ సినిమా ద్వారా ఆరుద్ర పరిచయమయ్యారు.
- అపేక్ష (డబ్బింగ్?)
- అమ్మలక్కలు
- అమరకవి
- ఇన్స్‌పెక్టర్ (డబ్బింగ్?)
- ఒక తల్లి పిల్లలు
- కన్నతల్లి
- కోడరికం
- గుమస్తా
- చండీరాణి
- చంద్రహారం
- జగన్మోహిని (డబ్బింగ్?)
- దేవదాసు
- నా చెల్లెలు
- నా యిల్లు
- పరదేశి
- పరోపకారం
- పక్కింటి అమ్మాయి
- పెంపుడు కొడుకు
- పిచ్చి పుల్లయ్య
- ప్రపంచం
- ప్రతిజ్ఞ
- ప్రేమలేఖలు
- పుట్టిల్లు
- బ్రతుకు తెరువు
- మంజరి
- రోహిణి
- లక్ష్మి
- వయ్యారిభామ
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |