ద్విదళబీజాలు

(ద్విదళ బీజాలు నుండి దారిమార్పు చెందింది)

తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలు, విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం ద్విదళబీజాల (Dicotyledons) ముఖ్యలక్షణాలు.

మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు)
Magnolia పుష్పం
Scientific classification
Kingdom:
Division:
Class:
మాగ్నోలియోప్సిడా

Orders

See text.

వర్గీకరణ

మార్చు

పరిపత్రం (Perianth)లో ఉండే వలయాల సంఖ్య, ఆకర్షణపత్రాలు అసంయుక్తమా లేక సంయుక్తమా అనే అంశాలపై ఆధారపడి ద్విదళబీజాలను మూడు ఉపతరగగులుగా విభజించారు.

  • ఉపతరగతి 1: పాలిపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. పుష్పాసనం (Thalamus) ఆకారం ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
    • శ్రేణి-థలామిఫ్లోరె (Thalamiflorae): దీనిలో పుష్పాసనం పొడవుగాగాని, శంకు ఆకారంలోగాని లేదా కుంభాకారంలోగాని ఉంటుంది. ఉదా: మాల్వేసి.
    • శ్రేణి-డిస్కిఫ్లోరె (Disciflorae): దీనిలో పుష్పాసనం పళ్ళెం లేదా చక్రం వంటి ఆకారంలో ఉంటుంది.
    • శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: ఫాబేసి.
  • ఉపతరగతి 2: గామోపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
    • శ్రేణి-ఇన్ ఫెరె (Inferae): దీనిలో అండాశయం నిమ్నంగా ఉంటుంది. ఉదా: ఆస్టరేసి.
    • శ్రేణి-హెటిరోమీరె (Heteromerae): దీనిలో అండాశయం ఊర్థ్వంగా ఉండి, రెండు కంటే ఎక్కువ ఫలదళాలుంటాయి.
    • శ్రేణి-బైకార్పెల్లేటె (Bicarpellatae): దీనిలో అండాశయం ఊర్థ్వంగా ఉండి, రెండు ఫలదళాలుంటాయి. ఉదా: సొలనేసి
  • ఉపతరగతి 3: మోనోక్లామిడె లో పరిపత్రం రక్షక, ఆకర్షణపత్రావళులుగా విభజన చూపించకుండా ఏకపరిపత్రయుతంగా ఉంటుంది. దీనిలో ఎనిమిది శ్రేణులున్నాయి.

ముఖ్యమైన కుటుంబాలు

మార్చు