పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

భుజంగ ప్రయాతము

మార్చు

భుజంగేశ పర్యంక పూర్ణానురాగన్
భుజంగప్రయాతాఖ్యఁ బూరించు చోటన్
నిజంబై ప్రభూతావనీ భృద్విరామం
బజస్రంబుగాఁ గూర్ప యా ద్వంద్వ మొప్పన్.

గణ విభజన

మార్చు
భుజంగ ప్రయాత వృత్త పాదము నందు గణవిభజన
IUU IUU IUU IUU
భుజంగే శపర్యం కపూర్ణా నురాగన్


నాలుగు యగణములు

IUU IUU IUU IUU య య య య

లక్షణములు

మార్చు
భుజంగ ప్రయాత వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు
12
ప్రతిపాదంలోని గణాలు: య, య, య, య (నాలుగు యగణములు)
యతి : ప్రతిపాదంలోనూ 8వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు


ఉదాహరణ 1:

మార్చు

పోతన తెలుగు భాగవతంలో వాడిన భుజంగ ప్రయాత వృత్త పద్యాల సంఖ్య: 1

పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/పరీక్షిజ్జన్మంబు|(భా-1-295-భు.)
హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్
భరించు న్ధర న్రామభధ్రుండుఁ బోలెన్
జరించు న్సదా వేదశాస్త్రానువృత్తిన్
వరించు న్విశేషించి వైకుంఠుభక్తిన్.