వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 10

తాజా వ్యాఖ్య: Translating Ibero-America is back! Come and join us :) టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Anna Torres (WMAR)
     పాత చర్చ 10   
All Pages:  ... (up to 100)


లయోలా కళాశాల వర్కుషాపు వ్యాసాలు

వెంకటరమణ గారూ మీరు తొలగింపు మూస చేరుస్తున్న వ్యాసాలు వర్కుషాపు సందర్భంగా కొత్త వారు చేర్చిన వ్యాసాలు. వాటిని మీకు సమంజసమనిపిస్తే చర్చ లేకుండా తొలగించవచ్చని నా అభిప్రాయం. కొన్నింటిని ఇదివరకే నేను తొలగించాను. --రవిచంద్ర (చర్చ) 13:15, 18 ఆగష్టు 2016 (UTC)

తొలగింపులు పని ప్రస్తుతానికి వాయిదా వేయించండి

వాడుకరి చర్చ:Kvr.lohith గారికి నమస్కారము. ఆంగ్ల వికీలో పనిచేయు మన తెలుగులోనూ పనిచేస్తున్న వాడుకరి:Vin09 గారు, వారి స్వంత నిర్ణయములతో వర్గాలు, గ్రామాలు తొలగిస్తున్నారు. మనము ఇంకా ఈ గ్రామాల గురించి ఇంకా ఒక ఎటువంటి నిర్ణయానికి రాలేదు. చర్చలు ఇంకా సాగుతున్నాయి. పవన్ ఆపని మీదనే ఉన్నానని కూడా చెప్పారు. మన బాధే ఏదో మనము తరువాత అందరము కలసి పడదాము. ప్రస్తుతము ఆయనను ఆంగ్ల వికీకి అనుగుణంగా తొలగింపులు పని ప్రస్తుతానికి ఆపమని దయచేసి మీరు మీకు తోచిన పద్ధతిలో తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:19, 21 ఆగష్టు 2016 (UTC)

తిరుచెందూర్

వాడుకరి చర్చ:Kvr.lohith గారికి దండాలు. మీ తిరుచెందూర్ పుటన్ జూచితిన్. అందు " ఎవరేని ఈ ఆలయమునకు వెళ్ళినచో ఈ అభిషేకము చేయించుకొనుడి ఆ ఆభిషేకము చేయించుకొనుడి " అని యున్నది. ఇది అంత బాగుగాలేదు. వ్యక్తిగత అభిప్రాయములకు తావీయరాదుగనుక ఇటుల గాక "తిరుచెందూరినందు ఫలాన అభిషేకము మిక్కిలి ప్రసిద్ధి " అని వ్రాసినచో బాగుగానుండును.Hydkarthik (చర్చ) 06:53, 21 ఆగష్టు 2016 (UTC)

మీ నిరంతరకృషికి ఓ చిరుకానుక

  అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి. (దీన్ని మీ సభ్యపేజీలో ఉంచుకోగలరు)-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC)
చంద్రకాంతరావు గారు చెప్పిన ప్రతి మాటా సత్యం. వెంకటరమణ గారు ఇందుకు అన్ని విధాలా అర్హులు. అభినందనలు. --రవిచంద్ర (చర్చ) 19:42, 21 ఆగష్టు 2016 (UTC)
పతకాన్నందించిన చంద్రకాంతరావు గారికి ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 15:31, 22 ఆగష్టు 2016 (UTC)

నేవిగేష పాపప్స్ గురించి

వెంకటరమణ గారూ,

వికీలో నాకు తరచుగా ఈ క్రింది గమనిక కనబడుచున్నది. ఈ పేజీని ఎలా తొలగించవచ్చునో తెలుపగలరు.

Information: You are importing User:Lupin/popups.js into your common.js or <skin>.js! This script is unmaintained. Please remove this inclusion and enable the Navigation popups Gadget in the preferences of your account instead. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:46, 22 ఆగష్టు 2016 (UTC)

ఈ సాంకేతిక అంశం నాకు తెలియదు. రహ్మానుద్దీన్ సరిచేయగలరనుకుంటాను.-- కె.వెంకటరమణచర్చ 15:32, 22 ఆగష్టు 2016 (UTC)
ధన్యవాదాలండీ.. రహ్మానుద్దీన్ ను అడుగుతాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:32, 23 ఆగష్టు 2016 (UTC)

కామనగరువు

వెంకటరమణ గారూ! తూర్పుగోదావరి జిల్లా గ్రామవ్యాసాలలో కామనగరువు అనే వ్యాసాన్ని పునఃప్రారంభించాను. వీలువెంబడి దానిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు ఒక అనుమానం. గరువు అనే గ్రామవ్యాసం ఉంది. కామనగరువునే గరువు అని సింపుల్‌గా పిలుస్తారా? రెండు వ్యాసాలు ఒకే గ్రామం గురించేనా? లేక రెండు వేరు వేరా? తూగో జిల్లా వారిని (ముఖ్యంగా అమలాపురం వారిని) ఎవరినైనా అడిగి నిర్ధారించి ఈ రెండు వ్యాసాలను ఒకదానిలో ఒకటి విలీనం చేయగలరా? --స్వరలాసిక (చర్చ) 16:46, 27 ఆగష్టు 2016 (UTC)

P.S. ఇదివరకు దూసిపేట గ్రామవ్యాసం గురించి నాకు ఒక మాటిచ్చారు. గుర్తు చేస్తున్నా. :)

స్వరలాసిక గారూ కామనగురవు అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గ్రామం. "గురవు" అనేది పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన గ్రామం. రెండూ ఒకటి కాదని అంతర్జాల మూలాల వల్ల తెలుస్తుంది.-- కె.వెంకటరమణచర్చ 05:31, 28 ఆగష్టు 2016 (UTC)
కామనగరువు కు మీరు చూపించిన అంతర్జాల మూలం లోని అక్షాంశ రేఖాంశాలు, ప్రస్తుతం ఉన్న గరువు వ్యాసంలోని అక్షాంశరేఖాంశాలు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న గరువు వ్యాసం, నేను ప్రారంభించిన కామనగరువు వ్యాసం ఒకటే అనే నిర్ధారణకు రావలసిఉంది. కాబట్టి గరువు వ్యాసాన్ని మీరు చూపిన రెండవ అంతర్జాల మూలం ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా లోని గ్రామ వ్యాసంగా మార్పులు చేయవచ్చా?--స్వరలాసిక (చర్చ) 06:06, 28 ఆగష్టు 2016 (UTC)

పదార్ధం--> పదార్థం

AWB ఉపయోగమేమిటో నిరూపిస్తున్నారు. సూపర్! "పదార్ధము"ను కూడా మారుస్తున్నారా?
"పదార్ధం" కు గూగుల్లో 35,100 ఫలితాలున్నాయి. "పదార్థం" కు 1,26,000. ఇకపై తగ్గుతాయి. _చదువరి (చర్చరచనలు) 14:19, 28 ఆగష్టు 2016 (UTC)

సందేహం

ఫోటోలు, సొంత పేజీ గురించి, కొంచెం వివరంగా చెప్పగలరు.
  1. వెంకటరమణ గారు మీతో పరిచయం ఆనందం కలిగిస్తోంది. మీరు అందించిన వివరాలు కొంచెం అర్ధం అయ్యాయి. అయితే తెలుగులో కొడుతుంటే కొన్ని పదాలు పడడం లేదు. అందుకే గూగుల్ ట్రాన్స్ లేషన్ లో కొడ్తున్నాను. ఇక్కడే నేరుగా టైపు చేయాలంటే ఏం చేయాలి?
  2. ఇక వీరేశలింగం ఆర్టికల్ ఆమోదం అయిందా. ఫోటోలు తర్వాత పెట్టవచ్చా? ఇక నా పేరుతొ పేజీ వస్తుందా? ఎప్పుడు? ఎలా?
  3. 22 ఏళ్ళ నుంచి జర్నలిస్టుగా ఉన్న నేను వీకీపీడియాలో పేజీ సృష్టించుకోగలనా? --16:37, 10 సెప్టెంబరు 2016‎ Bhamidipalli v raghavarao (చర్చ|రచనలు)‎

సమాధానం

  1. వ్యాసాలలో మీ యొక్క స్వంతంగా తీసిన చిత్రాలను కామన్స్ లో ఎక్కించాలి. కామన్స్ లో చిత్రం అప్‌లోడ్ అయిన తదుపరి చిత్రం యొక్క వివరాలను ఆ వ్యాఅంలో చేర్చవచ్చు. ఆ చిత్రాలను [[File:Example|250px|right|చిత్రం వివరం]] అని వ్యాసంలో మీకు కావలసిన విభాగంలో చిత్రం కనబడుతుంది.
  2. మీయొక్క వాడుకరి పేజీలో మీయొక్క వివరాలను మీరే చేర్చవచ్చు. వాడుకరి పేజీలో మీ యొక్క బయోగ్రఫీని మీరే వ్రాసుకోవచ్చు.
  3. తెలుగులో అక్షరాలు టైప్ కానప్పుడు cntrol+M ఒత్తితే లిప్యంతరీకరణ ఏక్టివేట్ అయి తెలుగు అక్షరాలను సులువుగా నేరుగా టైప్ చేయవచ్చు.
  4. సరైన మూలాలు ఉన్నప్పుడు ఆ వ్యాసం మంచి వ్యాసం అవుతుంది. కనుక వీరేశలింగం టౌన్ హాల్ సరియైన వ్యాసమే.
  5. మీరు లాగిన్ అయిన తరువాత వెంటనే ఎర్ర లింకుతో మీ పేరు కనవడిన మీ వాడుకరి పేజీ వాడుకరి:Bhamidipalli v raghavarao అని ఉంటుంది. దానిని ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను మీరే చేర్చవచ్చు.
  6. మీరు ఎవరి గురించి అయినా మూలాలు లభిస్తే వ్యాసాలు వ్రాయవచ్చు. కానీ మీరు నోటబిలిటీ ఉన్న వ్యక్తి అయినా మీయొక్క పేజీని వ్యాసంగా మీరు సృష్టించకూడదు. సరియైన మూలాలు లభిస్తే యితర వాడుకరులు మీయొక్క వ్యాసాన్ని సృష్టిస్తారు. మీ గురించి వార్తాపత్రికల, అంతర్జాల మూలాలెమైనా ఉంటే తెలియజేయండి. మీ గురించి వ్యాసం వ్రాయగలము.-- కె.వెంకటరమణచర్చ 04:54, 11 సెప్టెంబరు 2016 (UTC)Reply

ఫోటో అప్ లోడ్ గురించి

అయ్యా వెంకటరమణ గారు, నమస్కారం ...

  1. టౌన్ హాలు ఫోటో పాతది సంపాదించాను. ఇది అపురూపమైన ఫోటో ఇది అప్ లోడ్ అవ్వడం లేదు కారణం ఏమిటి?
  2. నా గురించి వివరాలు ఎలా రాసుకోవాలి.--09:32, 13 సెప్టెంబరు 2016‎ Bhamidipalli v raghavarao (చర్చ | రచనలు)

మీరు మొదట లాగిన్ అవ్వండి. మీకు దొరికిన చిత్రం మీ స్వంతమేనా? మీరు స్వంతంగా తీసిన చిత్రం ఐతే కాపీహక్కుల సమస్య రాదు. కానిచో దానిని కొన్ని నియమాలకు లోబడి నాన్ ఫెయిర్ యూజ్ చిత్రంగా చేర్చవచ్చు. కానీ మీరు చేర్చదలచిన చిత్రంపై మీకు సంపూర్ణ హక్కులు ఉంటే ఈ క్రింది విధంగా అప్‌లోడ్ చేయండి.

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం

  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే   లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.

అప్‌లోడ్ అయిన తదుపరి ఆ పుటలో యున్న [[File:Example|చిత్రం వివరణ]] అనే దాన్ని కాపీచేసి వికీపీడియా లో మీరు కోరుకున్న వ్యాసంలో పేస్టు చేసి సేవ్ చేస్తే చిత్రం కనబడుతుంది.

మీ వాడుకరి పేజీ

మీ యొక్క వాడుకరి:Bhamidipalli v raghavarao. ఈ ఎర్ర లింకుపై క్లిక్ చేయండి. మీ యొక్క వాడుకరి పెజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలను చేర్చండి.

చర్చాపేజీలలో మీరు వ్రాసిన విషయం తరువాత ~~~~ అని సంతకం చేస్తే. భద్రపరచిన తదుపరి మీ పేరు కనబడుతుంది.-- కె.వెంకటరమణచర్చ 10:00, 13 సెప్టెంబరు 2016 (UTC)Reply

ఫొటొ గురించి

అయ్యా , వీరెశలింగం టౌన్ హలు ఫొటొ అప్ లొడ్ చెసాను ఒకసారి ఎలా వచ్చిందొ ఒకసారి పరిశీలించగలరు. అది పాత ఫొటొ. కమిటీ వాళ్ళ దగ్గర సంపాదించాను. వ్యాసం లొ అప్ లొడ్ అయ్యిందా? ఇక మెల్లిగా వికీలొనె కొదుతున్నాను, కొన్ని అక్షరాలు సరిగ్గా రాలెదు అది ఎలాగొ చెప్పండి

ఫొటొ గురించి

అయ్యా , వీరెశలింగం టౌన్ హలు ఫొటొ అప్ లొడ్ చెసాను ఒకసారి ఎలా వచ్చిందొ ఒకసారి పరిశీలించగలరు. అది పాత ఫొటొ. కమిటీ వాళ్ళ దగ్గర సంపాదించాను. వ్యాసం లొ అప్ లొడ్ అయ్యిందా? ఇక మెల్లిగా వికీలొనె కొదుతున్నాను, కొన్ని అక్షరాలు సరిగ్గా రాలెదు అది ఎలాగొ చెప్పండి సంతంకం అంటున్నారు అది ఎలా? ఇలాగెనా--Bhamidipalli v raghavarao (చర్చ) 16:45, 17 సెప్టెంబరు 2016 (UTC)Reply

రాఘవరావుగారూ, మీరు అప్‌లోడ్ చేసిన వీరేశలింగం టౌన్ హాల్ కామన్స్ లో అప్‌లోడ్ అయినది. దానిని File:Town hal.jpg గా అప్‌లోడ్ చేసారు. దీనిని వీరేశలింగం టౌన్ హాల్ వ్యాసంలో [[File:Town hal.jpg|right|250px|thumb|వేరేశలింగం టౌన్‌హాల్]] అని చేర్చితే ఆ చిత్రం వ్యాసంలో చేరుతుంది. మీరు సరిగ్గానే తెలుగు టైపింగ్ నేర్చుకున్నారు. ఏవైనా పదాల టైపింగులో కష్టమనిపిస్తే సహాయాన్ని అభ్యర్థించండి. మీరు సంతకం సరిగ్గానే చేసారు. మీరు మరిన్ని ప్రముఖుల వ్యాసాలను తెవికీకి అందించాలని మా ఆకాంక్ష. -- కె.వెంకటరమణచర్చ 07:25, 18 సెప్టెంబరు 2016 (UTC)Reply

నా పరిచయం రాసిన చోట

మీరు వీరేసశలింగం ఫొటో అప్ లోడ్ చేశారు చూసాను. కాని నా పరిచయం రాసాను సరిపొతుందా. ఇక అక్కడ నా ఫొటో అప్ లోడ్ అవుతుందా అది ఎలా అప్ లోడ్ చేయాలి. కేటగిరీ అడిగిన చోట అసలు ఎమి రాయాలొ తెలియడం లేదు. ఎలాగో చెప్పరూ..--రాఘవీయం 08:45, 18 సెప్టెంబరు 2016 (UTC)


మీరు కామన్స్ లో చేర్చిన చిత్రాన్నే నేను వీరేశలింగం టౌన్‌హాల్ వ్యాసంలో చేర్చాను. మీరు కామన్స్ లో అప్ లోడ్ అయిన తదుపరి "ఈ దస్త్రాన్ని వికీలలో ఉపయోగించడానికి, ఈ పాఠ్యాన్ని పేజీ లోనికి కాపీచెయ్యండి:" అనే బాక్సులో గల విషయాన్ని కాపీచేసి సంబంధిత వ్యాసంలో పేస్టు చేసినట్లయితే ఆ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. మీ యొక్క వివరాలను మీ యొక్క వాడుకరిపేజీలో సంగ్రహంగా చేర్చారు. ఇంకా ఏవైనా వివరాలు ఉంటే చేర్చుకోవచ్చు. పై విధంగానే పోటో అప్‌లోడ్ చేసినపుడు కేటగిరీ విభాగంలో "wikipedians" అని చేర్చండి.-- కె.వెంకటరమణచర్చ 09:05, 18 సెప్టెంబరు 2016 (UTC)Reply

వీరేశలింగం టొన్ హలు పేజీ గురించి

అయ్యా వెంకట రమణ గారు, వీరేశలింగం టొన్ హలు పేజీలొ ఎదొ చెర్చమని వస్తొందెమిటొ కాస్త సరి చేయ గలరని మనవి లాగిన్ అవ్వకుండా, .డైరక్ట్ గా పేజీ ఒపెన్ చేస్తె ఇలా ఎదో అడుగుతొంది.గమనించగలరు.--రాఘవీయం 17:51, 19 సెప్టెంబరు 2016 (UTC)

సహాయం

రమణ గారు మళ్లీ మీ సహాయం కోరతున్నాను. నేను సృష్టించుతున్న వ్యాసం (ఇవాళే మొదలుపెట్టినది) విలియం బెంటింక్ అను వ్యాసములో విలియం అని వుండాల్సినది పొరబాటున విలియమ్ గా పడినది. దయచేసి సరియేయగలరా? ధన్యవాదాలు.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 02:13, 21 సెప్టెంబరు 2016 (UTC)Reply

సహాయం చేయబడినది.-- కె.వెంకటరమణచర్చ 02:23, 21 సెప్టెంబరు 2016 (UTC)Reply

కొత్త పేజీ గురించి

వెంకట రమణ గారు కొత్తగా విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి గారి వ్యాసం పెట్టాను.ఓసారి చూడండి. ఫొటో తర్వాత పెడతా. రాష్ట్రపతి బాబూ రాజేంధ్రప్రసాద్ నుంచి పురస్కారం అందుకున్న ఫోటొ వుంది. లోడ్ చేయడం సరిగా రావడం లేదు.కొంచెం అలవాటు అయ్యెదాకా ఇబ్బంది తప్పదు. --Bhamidipalli v raghavarao

విశ్వనాధ జగన్నధ ఘనపాఠి ఫొటొ అప్ లోడ్

విశ్వనాధ జగన్నధ ఘనపాఠి ఫొటొ అప్ లోడ్ కి సంబంధించి కామంస్ లొ లొడ్ అయింది దాన్ని వ్యాసం లోకి తేవడం ఎలా?--Bhamidipalli v raghavarao

మీరు కామన్స్ లోకి ఎక్కించిన పోటోను ఇక్కడ వ్యాసంలోనికి [[File:విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి.jpg|thumb|right|250px|భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారిచే సత్కారం]] గా చేర్చితె బొమ్మ కనబడుతుంది. బొమ్మను చేర్చాను.-- కె.వెంకటరమణచర్చ 12:30, 24 సెప్టెంబరు 2016 (UTC)Reply

ఒక షార్టఫిల్మ్ యాక్టర్ గురించి

నేను ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గురించి రాయలని అనుకుంటున్నాను కాని నాకు పూర్తి స్టేప్పులతో కావాలి ధన్యవాదములు. -శేఖర్ 15:16, 25 సెప్టెంబరు 2016 (UTC)-

వంశీ గారూ, మీరు వికీపీడియాలో షార్ట్ ఫిల్మ్‌ యాక్టరు గురించి వ్రాయవచ్చు. కానీ ఆ నటునికి సంబంధించి సరైన మూలాలు లభ్యమవ్వాలి. సరైన మూలాలు లేకుండా ఉన్న వ్యాసాలను వికీలోనికి చేర్చరాదు. ఆ వ్యక్తి ఏ రంగంలోనైనా ప్రసిద్ధుడైనా, ఆయన గురించి వివిధ వార్తాపత్రికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ, సరైన అంతర్జాల వెబ్‌సైటులలోనూ లేదా నోటబిలిటీ ఉన్న పుస్తకాలలో మూలాలు దొరికినట్లయితే వ్యాసం వ్రాయవచ్చు. కానీ మనకు ఆ వ్యక్తి ప్రసిద్ధుడైనట్లు తెలిసినా సరైన మూలాలు లేనిదే వ్రాయరాదు. మీరు వ్రాయవలసిన నటుడు వ్యాసం వికీపీడియాలో ఉన్నదో లేదో ముందు వెతికి, లేనట్లయితే వ్యాసం ప్రారంభించండి. మీకు మా వికీ సభ్యులు సరైన మార్గనిర్దేశం చేస్తారు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 14:00, 26 సెప్టెంబరు 2016 (UTC)Reply

కొత్త ఆర్టికల్ గురించి

వెంకట రమణ గారు,నమస్కారం, యాతగిరి శ్రీరామ నరసింహారావు ఆర్టికల్ కి సంబంధించిన పేజీ సృష్ట్ంచాను. దానికి సంబంధించిన పోటొ కామన్స్ లోకి వెళ్ళిపోయింది. ఆర్టికల్స్ కొడుతున్నాను గానీ ఫోటో అప్ లోడ్ సరిగ్గా రావడం లేదు. మరోసారి అప్ లోడ్ విధానం చెప్పగలరని మనవి.--రాఘవీయం 18:51, 25 సెప్టెంబరు 2016 (UTC)

రాఘవీయం గారూ, మీరు కామన్స్ లో చిత్రం చేర్చిన చివరి అంకంలో వికీపేజీల్లో ప్రచురించడానికి [[File:యాతగిరి శ్రీరామ నరసింహారావు.tif|right|thumb|250px|యాతగిరి శ్రీరామ నరసింహారావు]] గా వాడుకోవచ్చు అని ఉంటుంది. కనుక దానిని కాపీ చేసి వికీపుటలో చేర్చి సేవ్ చేసిన యెడల ఆ చిత్రం మీరు కోరిన వ్యాసంలోనికి చేరుతుంది. ఒకవేళ మీరు కామన్స్ లోనికి చిత్రం చేర్చిన తదుపరి మీరు చేర్చిన చిత్రం మీకు దొరకనప్పుడు మీరు కామన్స్ లో చేర్చిన చిత్రాలను వాడుకరి రచనలు లో చూడవచ్చు. ఈ లింకులో మీరు చేర్చుతున్న చిత్రాలు వరుసగా ఉన్నాయి. గమనించండి. కామన్స్ లో చిత్రాలకు తెలుగు పేర్లకు బదులుగా ఆంగ్ల నామాలతో చేర్చిన యెడల మిగిలిన వికీ సభ్యులు కూడా వాటిని సులువుగా వెదికి పుటలలో ఉంచుకొనుటకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరిన చిత్రాన్ని సంబంధిత పుటలో ఉంచాను. -- కె.వెంకటరమణచర్చ 13:53, 26 సెప్టెంబరు 2016 (UTC)Reply

ఆర్టికల్ గురించి

సందెహాలు తీరుస్తున వెంకటరమణ గారికి నమస్కారం,

  1. శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు పేజీకి సంబంధించి శుద్ధి చేయమని, వికీకరణ అని వస్తోంది. అది ఎమిటొ అర్ధం కాలేదు. కాస్త పరిశీలించ మనవి.
  2. అలాగే ఈ ఆర్టికల్ లొ ఇంకా ఫొటొలు పెట్టవచ్చా,. ప్రస్తుత ఫొటొ మార్చవచ్చా. కొంచెం చెప్పగలరు--రాఘవీయం 07:07, 27 సెప్టెంబరు 2016 (UTC)
రాఘవీయం గారికి, వికీపీడియాలో వ్రాసిన వ్యాసానికీ, పత్రికలో వ్రాసిన వ్యాసానికీ వ్యత్యాసముంటుంది. మీరు వ్రాసిన యాతగిరి శ్రీరామ నరసింహారావు వ్యాసం బాగుంది. వికీపీడియా వ్యాసం సరియైన శైలిలో లేనప్పుడు నిర్వాహకులు అందులో {{వికీకరణ}} మూసను చేర్చుతారు. ఇలా చేర్చిన తరువాత మీరుగానీ, ఎవరైనా గానీ ఆ వ్యాసాన్ని వికీశైలిలో మార్పులు చేసి తీర్చిదిద్దుతారు. అదే విధంగా అచ్చుతప్పులు ఉన్నప్పుడు {{శుద్ధి}} మూసను చేర్చుతారు. దీనివల్ల యితరులెవరైనా అక్షర దోషాలను దిద్ది సహాయపడతారు. వ్యాసం చక్కగా తీర్చిదిద్దబడినపుడు ఆ వ్యాసంలో ఈ మూసలను తొలగిస్తారు. వికీపీడియాలో వ్యాసానికి ఒక శైలి ఉంటుంది. దీని కొరకు వికీపీడియా:శైలి చూడండి.

యాతగిరి శ్రీరామ నరసింహారావు వ్యాసంలో విభాగాలను మీరు చేర్చినపుడు ఉదాహరణకు "రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం" అనే విభాగం ఉన్నదనుకుందాం. దానిని మీరు వ్రాసినపుడు ==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం== అని విభాగంగా టైప్ వ్రాసినట్లయితే భద్రపరచిన తరువాత విభాగం కనిపిస్తుంది. వ్యాసం వ్రాసిన తరువాత చివరి విభాగంగా "మూలాలు" అని చేర్చి దానిలో {{మూలాలజాబితా}} అనే మూసను చేర్చినట్లయితే మీరు వివిధ వాక్యాలకు చేర్చిన మూలాలన్నీ దిగువన చేరుతాయి.

ఈ ఆర్టికల్ లో ఇంకా కొన్ని ఫోటోలు పెట్టవచ్చు. ఆయన ప్రస్తుత ఫోటోను కూడా మార్చవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 12:33, 27 సెప్టెంబరు 2016 (UTC)Reply

ఫొటొ మార్పు గురించి

కెవిఆర్ లోహిత్ వెంకటరమణ గారికి నమస్కారం ,

  1. యాతగిరి శ్రీరామ నరసింహారావు వ్యాసంలో కొత్త ఫోటొలు చేర్చాలి. కామన్స్ లోకి ఎక్కించాను. పాత ఫొటొ తీసేసి కొత్తది పెట్టాలి. అది ఎలాగొ తెలియడం లేదు. అలాగే మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్ తొ యాతగిరి ఫైల్ ఫొటొ కూడా వుంది. కొంచెం ఆ ఫొటొలు పెడతారని మనవి.
  2. కొత్తగా జిత్ మోహన్ మిత్ర వ్యాసం రాసాను. జిత్ ఫొటొ కూడా కామన్స్ లోనే వుంది --రాఘవీయం 04:58, 30 సెప్టెంబరు 2016 (UTC)
  3. డాక్టర్(మేజర్)చల్లా సత్యవాణి వ్యాసం పెట్టాను. ఇందులో యూజర్ నేం డా.మేజర్ చల్లా సత్యవాణి అని పెట్టాను. అది పొరపాటున డామేజర్ అని కనిపిస్తున్నట్టు వుంది.ఒకవేళ ఎబ్బెట్టుగా వుంటే మార్చడం అవుతుందా?

సమాధానం

  1. మీరు చేర్చిన కామన్స్ చిత్రాలను యాతగిరి శ్రీరామ నరసింహారావు వ్యాసంలో చేర్చాను. సమాచారపెట్టెను ఆ వ్యాసంలో చేర్చితిని. మీరు చేర్చిన ఆయన యొక్క చిత్రాలను కామన్స్ కాటగిరీ విభాగంగా యితర లింకులలొ చేర్చాను. ఒక వ్యాసంలో ఒకే విధమైన అనేక చిత్రాలు ఉంచడం అంత మంచిది కాదు. అందువలన ఆయనకు సంబంధించి ముఖ్యమైన చిత్రాలను ఉంచి. కామన్స్ లోని ఆయన చిత్ర వర్గానికి లింకును చేర్చాను.
  2. మీరు చేర్చిన జిత్ మోహన్ మిత్రా చిత్రాన్ని [[File:Sripada Jit Mohan Mitra.jpg|right|250px|thumb|జిత్‌మోహన్ మిత్రా]] గా చేర్చి భద్రపరిస్తె ఆ వ్యాసంలొ ఆ చిత్రం చేరుతుంది.
  3. వికీపీడియాలోని వ్యక్తుల వ్యాసాల శీర్షికల ముందు గౌరవ వాచకాలు ఉంచరాదు. అందువల్ల డాక్టర్(మేజర్)చల్లా సత్యవాణి వ్యాసాన్ని చల్లా సత్యవాణి మార్చవలసి ఉంటుంది. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 10:53, 30 సెప్టెంబరు 2016 (UTC)Reply

english wikipedia

english wikipedia not accepting ariticle on jyoti reddy. How can i resolve this? any help

i have given answer in your talk page.-- కె.వెంకటరమణచర్చ 07:52, 8 అక్టోబరు 2016 (UTC)Reply

దేవీచౌక్ పేజీ గురించి

కె.వి.ఆర్.లొహిత్ గారికి దసరా శుబాకాంక్షలు.

  1. రాజమండ్రి దేవీచౌక్ పేజీ సృష్తించాను. దీనికి సంబంధించి రెండు పొటొలు అప్ లొడ్ కామన్స్ లో అయ్యాయి. అందులో ఓ ఫొటొ దేవీచౌక్ పేజీలొ అప్ లొడ్ చేయ మనవి.
  2. జిత్ మోహన్ మిత్ర పేజీలొ కూడా జిత్ మొహన్ మిత్ర ఫొటొ అప్ లొడ్ చేస్తారని మనవి.

నాకు ఫేజీలొ అప్ లోడ్ చేయడం రావడం లేదు.--రాఘవీయం 07:32, 8 అక్టోబరు 2016 (UTC)

రాఘవీయం గారూ, కామన్స్ లో మీరు చేరుస్తున్న చిత్రాల కొరకు ఈ లింకు చూడండి. అందులో మీరు చేరుస్తున్న చిత్రాలు వరుస క్రమంలో ఉన్నాయి. అందులో అక్టోబరు 8, 2016 న దేవీచౌక్ గురించి రెండు చిత్రాలను అప్‌లోడ్ చేసారు. వాటిని ఈ క్రింది విధంగా ఆయా పేజీలలో చేర్చి భద్రపరిస్తే వ్యాసంలో చేరుతుంది.

[[File:Devichowk.jpg|right|250px|thumb|దేవీచౌక్, రాజమండ్రి]]
[[File:Devichowk2.jpgright|250px|thumb|దేవీచౌక్, రాజమండ్రి]]

పై విధంగా దేవీ చౌక్ వ్యాసంలో చేర్చి సేవ్ చేయండి ఆయా చిత్రాలు చేరుతాయి. ప్రయత్నించంది. ఇంకా ఏదైనా సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి.-- కె.వెంకటరమణచర్చ 07:58, 8 అక్టోబరు 2016 (UTC)Reply

ఫొటొల చేర్పు గురించి

కె.వి. లోహిత్ గారికి దసరా శుభాకాంక్షలు,

  1. రత్నం బాల్ పెన్ వర్క్స్ పేజీ సృష్టించాను. దానికి సంభంధించి మూడు ఫొటోలను కామన్స్ లోకి ఎక్కించాను.అవి పేజీలోకి చేర్చ ప్రార్ధన
  2. జిత్ మోహన్ మిత్ర ఫొటొ కూడా పేజీలొ చేర్చ ప్రార్ధన.
  3. తర్వాత ఒ ముఖ్యమైన విషయం ఎమంటే, ఈ పేజీలను సొషల్ మీడియాలొ లింక్ ఇచ్చుకొవచ్చా.--రాఘవీయం 11:17, 11 అక్టోబరు 2016 (UTC)
రాఘవీయం గారూ, కామన్స్ లో మీరు చేరుస్తున్న చిత్రాల కొరకు ఈ లింకు చూడండి. అందులో మీరు చేరుస్తున్న చిత్రాలు వరుస క్రమంలో ఉన్నాయి. వాటిలో మీకు కావలసిన చిత్రాలను పై విభాగంలో తెలియజేసినట్లు చేర్చవచ్చు. ఈ వ్యాసాలను లింకులిచ్చుకోవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 11:22, 11 అక్టోబరు 2016 (UTC)Reply
మీరు కోరినట్లు చిత్రాలను చేర్చితిని. వికీపీడియా:తెవికీ వ్యాసం ఒకసారి చదవండి.-- కె.వెంకటరమణచర్చ 11:48, 11 అక్టోబరు 2016 (UTC)Reply

మూస:Infobox India district

యాదాద్రి జిల్లాలొ యాదాద్రి district మరియు District of తెలంగాణా అని వస్తుంది మూస:Infobox India district చూడండి.--Vin09(talk) 12:41, 12 అక్టోబరు 2016 (UTC)Reply

Vin09(talk) గారూ మీరు కోరిన విధంగా మూసలో మార్పులు చేయబడినవి.-- కె.వెంకటరమణచర్చ 13:58, 12 అక్టోబరు 2016 (UTC)Reply
ధన్యవాదాలు.--Vin09(talk) 14:00, 12 అక్టోబరు 2016 (UTC)Reply

బౌద్ధంపై క్రొత్త వ్యాసం ఎక్కడ వ్రాయాలి?

నేను పూర్వము వలె కొన్ని బౌద్ధ ధర్మానికి సంభందించిన వ్యాసాలను వ్రాయ దలచాను , కానీ నాకు క్రొత్త వ్యాసం ఎలా వ్రాయాలో,ఎక్కడ వ్రాయాలో తెలియటం లేదు.కావున మీరు దయ చేసి నాకు కొత్త వ్యాసం ఎక్కడ వ్రాయాలో తెలియచెయ్యగలరని మనవి.తద్వారా తెలుగువారికి బౌద్ధ ధర్మానికి సంభందించిన అనేకానేక విషయాలను తెలియపరచటానికి ఉపయోగపడెదను.--Buddha Boy 19:18, 12 అక్టోబరు 2016 (UTC) Ravi Raja Buddhaya

బుద్దా బోయ్ గారూ మీరు బౌద్ధ ధర్మానికి చెందిన వ్యాసాలను వ్రాయండి. వర్గం:బౌద్ధ మతము ఉన్న వ్యాసాలను చూడండి. అందులో మీకు తెలిసిన వ్యాసాలలొ విషయాన్ని చేర్చి ఆయా వ్యాసాలను అభివృద్ధి చేయండి. వాటిలో లేని వ్యాసాలను కొత్తగా మీరు వ్రాయవచ్చు. ఉన్న వ్యసాలను మరల మొదలుపెట్టకండి. ఇదివరకు తెవికీలో అష్టాంగమార్గములు ఉంది. దానిని మీరు మరలా అష్టాంగమార్గం అని సృష్టించారు. వికీ పుటలో పై భాగాన ఉన్న వెతుకు పెట్టెలో మీరు సృష్టించాల్సిన వ్యాసాన్ని టైప్ చేయండి. యిదివరకు ఆ వ్యాసం లేకపోతే మీరు టైప్ చేసిన శీర్షిక ఎర్రలింకుగా కనబడుతుంది. ఆ ఎర్ర లింకుపై క్లిక్ చేస్తే కొత్త పుట వస్తుంది. అందులో మీరు చేర్చాల్సిన విషయాన్ని చేర్చండి. మీరు చేరిన వాక్యాలకు ఏపుస్తకం నుండి లేదా వెబ్‌సైట్ నుండి చేర్చారో దాని మూలాన్ని వ్యాసంలో చేర్చండి. ఏదైనా సందేహాలు వస్తే అభ్యర్థించండి. -- కె.వెంకటరమణచర్చ 13:16, 13 అక్టోబరు 2016 (UTC)Reply

పొరపాటు ఎమైనా దొర్లిందా

కెవిఆర్.లోహిత్ గారు మెయిల్ కి ఓ మెసెజ్ వచ్చింది. అదెమిటో అర్ధం కాలేదు. ఎదైనా తప్పు జరిగిందా కాస్త చూసి చెప్పరూ. లింక్ ఇచ్చాను--రాఘవీయం 11:49, 13 అక్టోబరు 2016 (UTC)

https://commons.wikimedia.org/wiki/User_talk:Bhamidipalli_v_raghavarao#File%3A.E0.B0.B5.E0.B0.BF.E0.B0.B6.E0.B1.8D.E0.B0.B5.E0.B0.A8.E0.B0.BE.E0.B0.A7_.E0.B0.9C.E0.B0.97.E0.B0.A8.E0.B1.8D.E0.B0.A8.E0.B0.BE.E0.B0.A7_.E0.B0.98.E0.B0.A8.E0.B0.AA.E0.B0.BE.E0.B0.A0.E0.B0.BF.jpg

మీరు కాపీ హక్కులు గల చిత్రాలను స్వంత చిత్రాలుగా ఎక్కించారు. అందువలన వాటిని కామన్స్ లో తొలగించారు. అందువల్ల తొలగించడానికి కారణాన్ని పైన తెలియజేసిన వాడుకరి చర్చా పేజీలో తెలియజేసారు. -- కె.వెంకటరమణచర్చ 13:07, 13 అక్టోబరు 2016 (UTC)Reply

ఫొటొల తొలగింపు తదితర అంశాల గురించి

లొహిత్ గారికి నమస్కారం.

  1. విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, జిత్ మోహన్ మిత్ర, రత్నం పెన్ పెజీలలో ఫొటొలు తీసెసారు. వచ్చిన మెసెజ్ మీకు పంపాను. నాకైతె అర్ధం కాలేదు. గాంధి జీ లెటర్ - రత్నం పెన్ పేజీ లొ కాపీరైట్ అంటె ఫొటొలు ఎలా వస్తాయి. వాళ్ల దగ్గర తీసుకుని అప్ లోడ్ చేస్తె, ఎమి చేయాలి. నాకైతె ఏమీ అర్ధం కాలేదు. కాస్త వివరంగా చెప్ప గలరు. నాకు వచ్చిన మెసెజ్ లింకు చూడండి.
  2. గొదావరి నిత్య హారతి ఫొటొలు పుష్కరాల సమయం లొనివి, ఇప్పటివి కూడా అప్ లొడ్ చెస్తాను, ఇబ్బంది లెనివి అనుకుంటె గొదావరి నిత్య హరతి పెజీలొ అప్ లోడ్ చేయమనవి.--రాఘవీయం 17:29, 15 అక్టోబరు 2016 (UTC)
కామన్స్ లో మీరు స్వంతంగా తీసిన చిత్రాలను ఎక్కించవచ్చు. ఇతరులు అందజేసిన వాటికి వారి నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. కామన్స్ లో చిత్రాలను ఎక్కించే విధానం మరియు లైసెన్స్ వివరాల గురించి లింకును సందర్శించండి. కాపీహక్కుల వివరాల గూర్చి లింకును సందర్శించండి. గోదావరి పుష్కరాలకు సంబంధించి మీరు తీసిన చిత్రాలను మీరు అప్‌లోడ్ చేయవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 16:16, 17 అక్టోబరు 2016 (UTC)Reply

మూలాలు లేకపొతె ఎమిచెయాలి

కెవిఆర్.లొహిత్ గారు ఈమధ్య అసలు చర్చలోకి రావడం లెదేమిటి? కొత్త పేజీలు సృష్టించి, సందేహాలు అడిగితే స్పందన లేదు.

  1. గోదావరి హారతి ఫోటొలు కామ్ంస్ లో వున్నాయి. వాటిని పేజీలొ చెర్చరూ.
  2. విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, జిత్ మోహన్ మిత్ర,రత్నం బాల్ పెన్ వర్క్స్ ఫొటొలు తొలగించారు, అది కాస్త వివరిస్తె,ఎలా అప్ లొడ్ చేయాలో చేస్తా.
  3. కొన్నింటికి మూలాలు వుండడం లేదు చాలమంది ప్రముఖుల గురించి వివరాలున్నా ఫొటొలు, మూలాలు లభ్యం కావడం లెదు. మరి ఎమిచేయాలి.--రాఘవీయం 06:42, 24 అక్టోబరు 2016 (UTC)

సమాధానం

రాఘవీయం గారూ, మీరు మంచి వ్యాసాలను తెవికీకి అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఉద్యోగ కార్యకలాపాలలో ఎక్కువకాలం గడపవలసి యున్నందున సమస్యలకు ఆలస్యంగా స్పందించినందులకు క్షంతవ్యుణ్ణి.

  1. గోదావరి హారతి చిత్రం యిప్పటికే ఆ వ్యాసంలో చేర్చబడినది.
  2. విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, జిత్ మోహన్ మిత్ర,రత్నం బాల్ పెన్ వర్క్స్ ఫొటొలు మీ స్వంత చిత్రాలైతే మరలా చేర్చి అవి మీ స్వంతమనే వివరణ వ్రాయండి. లేనిచో ఆయా కాపీ హక్కుదారుని నుండి అనుమతి పొందవలసి ఉంటుంది.
  3. వికీ వ్యాసానికి మూలాలు అత్యావశ్యకం. మూలాలు లేని వ్యాసానికి ప్రామాణికత ఉండదు. కనుక మీరు చేర్చిన వ్యాసాల యొక్క వివరాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ, అంతర్జాలంలోనూ శోధించండి. ఆ వ్యాసం ప్రాముఖ్యమైనదైతే ఏదో ఒకచోట మూలం లభిస్తుంది. మూలాలు చేర్చడానికి కొంత సమయం కావలసి వస్తే మీరు వ్యాసం వ్రాసి ఆ వ్యాసం మొదటలో {{మూలాలు సమీక్షించండి}} మూసను చేర్చండి. మూలాలు లభ్యమైన తరువాత ఆ మూసను తొలగించవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 15:07, 3 నవంబర్ 2016 (UTC)

విజ్ఞప్తి

వెంకటరమణ గారు, ఇలా అడుగుతునందుకు తప్పు గా అనుకోకండి. నాకు తెవికీ లో నిర్వాహకుడిగా చేయాలని ఆసక్తి ఉంది. దయచేసి ఇప్పటిదాకా నా పని ని పరిశీలించి, ఇంకా నేనే విధాలుగా ముందుకు సాగాలో, న అవకాశాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో సూచించగలరని నా విజ్ఞప్తి. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 06:10, 1 నవంబర్ 2016 (UTC)

KingDiggi గారికి, మీరు నిర్వాహకత్వంపై ఆసక్తి కలిగి యున్నందుకు ధన్యవాదాలు. 9 డిసెంబరు 2015 న తెవికీలో మొదటి మార్పు కు శ్రీకారం చుట్టారు. తరువాత సినిమా వ్యాసాలలో మార్పులు చేసారు. కొన్ని దస్త్రాలను ఎక్కించారు. మీరు యిప్పటి వరకు తెవికీలో 1041 ఆంగ్లవికీలో 422 లతో పాటు యితర మార్పులతో కలసి 1507 మార్పులు చేసారు. యిప్పటి వరకు మీరు తొమ్మిది కొత్తవ్యాసాలు రాసారు. తెలుగు వికీలో కొత్త నిర్వాహకులకు కనీసం మూడు నెలల అనుభవం మరియు 1000 దిద్దుబాట్లు వుండాలనే నియమం ఉంది. మీరు 11 నెలల అనుభవం, 1000 దిద్దుబాట్లు పూర్తిచేసారు. కానీ వికీ పీడియాలో నిర్వాహకునిగా అభ్యర్థన చేయడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దాని కొరకు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు చూడండి. మీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని భావిస్తే స్వీయ అభ్యర్థన చేయవచ్చు. దీనికొరకు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చూడండి. దీని ప్రకారం మీ యొక్క నిర్వాహకత్వం కొరకు మీరే అభ్యర్థించవచ్చును. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 12:52, 1 నవంబర్ 2016 (UTC)

మీ సూచనకు ధన్యవాదాలు KingDiggi (చర్చ) 13:54, 1 నవంబర్ 2016 (UTC)

అగ్‌మెంటెడ్ రియాలిటీ వ్యాస తొలగింపు

అగ్‌మెంటెడ్ రియాలిటీ వ్యాసన్ని కొద్దిగా విస్తరించా. తొలగింపు కు చెసిన ప్రతిపాదన మూస ను తొలగించవచ్చా?. మీ స్పందన తెలుపగలరు. ధన్యవాదాలు --KingDiggi (చర్చ) 03:56, 7 నవంబర్ 2016 (UTC)

KingDiggi గారూ వ్యాసం ఏక వాక్యంగా ఉన్నప్పుడు తొలగింపు మూసను చేర్చాను. వ్యాసం విస్తరించబడినందున తొలగింపు మూసను తొలగించవచ్చు. తొలగించాను. -- కె.వెంకటరమణచర్చ 15:06, 7 నవంబర్ 2016 (UTC)

ధన్యవాదాలు KingDiggi (చర్చ) 15:59, 7 నవంబర్ 2016 (UTC)

సహాయం

వెంకట రమణ గారు నేను మొదలుపెట్టి అప్పుడప్పుడు విస్తరిస్తున్న వ్యాసము బ్రిటిష్ గవర్నర్ జనరల్ లో జాబితా క్రింద నేను ==బయటి లింకులు== and ==మూలాలు== అని paragraphs లు పెట్టినా కూడా అవి జాబితా పైనో లేక జాబితాలోనో వస్తున్నాయి. Can you please help me and edit correctly? --దిగవల్లి రామచంద్ర (చర్చ) 02:23, 21 నవంబర్ 2016 (UTC)

సరిచేయడమైనది.-- కె.వెంకటరమణచర్చ 05:37, 21 నవంబర్ 2016 (UTC)

{{Orphan}} లో మీరు చేసిన మార్పు

{{Orphan}} లో మీరు చేసిన మార్పుతో వర్గం:All_orphaned_articles లో ఉండాల్సిన అనాథ పేజీలన్నీ వర్గం:అన్ని అనాథ పేజీలు లోకి మారిపోయాయి. పాత వర్గంలో పేజీలేమీ లేకపోయే సరికి నేను హతాశుణ్ణయ్యాను. కొద్దిపాటి పరిశోధన తరువాత జరిగిందేమిటో అర్థమైంది. పాతదాన్ని దారిమార్పుగా చేసాను, తికమక ఏమీ లేకుండా. ఇప్పుడోకే! జరిగింది మీకు చెబుదామని రాస్తున్నానంతే, ఇక చెయ్యాల్సిందేమీ లేదులెండి.___చదువరి (చర్చరచనలు) 15:20, 21 నవంబర్ 2016 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:56, 1 డిసెంబరు 2016 (UTC)Reply

Address Collection

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)Reply

సహాయ అభ్యర్థన

వెంకట రమణగారు మరల మీ సహాయం కావలిసివచ్చింది. ఇవాళ డా బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి వ్యాసంలో ఉల్లేఖించియున్న (తప్పుగా శివలంక మల్లిఖార్జున రావు) వుండియున్నదానినే క్లిక్ చేసి వ్యాసం మొదలుపెట్టేశాను. కాని వారి పేరు సరిగా శివలెంక మల్లికార్జున రావు . అని వుండవలెను. ఇంటి పేరు "శివలంక" కాదు "శివలెంక". అలాగే పేరులో కూడా " ఖార్జున " కాదు " కార్జున" అని వుండాలి. ఇప్పుడు హెడింగ్ లో సరిచేయటం నాకు చేతకావడం లేదు దయచేసి దానికి సరిచేసి పెట్టండి. --దిగవల్లి రామచంద్ర (చర్చ) 11:32, 21 జనవరి 2017 (UTC)Reply

మీ కోరిక ప్రకారం శివలెంక మల్లికార్జున రావు గా మార్చడం జరిగినది.-- కె.వెంకటరమణచర్చ 13:10, 21 జనవరి 2017 (UTC)Reply

రామారెడ్డి గారి ఆర్టికల్ గురించి

అయ్యా లొహిత్ కె.వెంకటరమణ గారు, చాలా కాలం అయింది నేను వి.కీ. లొకి వచ్చి... కొత్తగా డాక్టర్ కర్రి రామారెడ్డి గురించి రాశాను. ఈమధ్య టచ్ లో లేనందున కొన్ని మరిచిపోయాను. అందుచేత డాక్టర్ రామారెడ్డి అర్టికల్ లొ తేడాలొచ్చాయి. ఓసారి సరిచేయగలరు. ఫొటొలు తర్వాత పెడతా--రాఘవీయం 11:54, 24 జనవరి 2017 (UTC)

మానస రవళి వ్యాసములో ఇటీవలి మార్పులు

అయ్యా వెంకటరమణగారు నమస్కారములు!! ముందుగా, మానస రవళి వ్యాసములో ఇటీవల మీరు చేసిన మార్పులు చూసి బొమలు ఒక బొత్తిగా ఎలా చేర్చాలో నేర్చుకున్నాను. దానికి ధన్యవాదములు. ఈ వ్యాసములో చాలా వరకు సమాచారాన్ని మీరు తొలగించినట్టు గా గమనించాను (ఉదా|| "సత్యనారాయణ పురం: ప్రపంచీకరణ పేరుతొ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్న ... " అలాగే మరి కొన్ని అంశాలను కూడా తొలగించారు, దానికి కారణం మీ సమయం వీలు చూసుకొని ఒకసారి వివరించ గలరు. ధన్యవాదములు "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 07:32, 23 ఫిబ్రవరి 2017 (UTC)"Reply
కొండూరు రవి భూషణ్ శర్మ గార్కి నమస్కారములు. తెవికీలో మంచి వ్యాసాలు రాస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. మానస రవళి వ్యాసం బాగుంది. ఈ వ్యాసం ఒక పుస్తకానికి సంబంధించినది. కనుక పుస్తకం యొక్క వివరాలు కల మూసను చేర్చాను. చిత్రాలు అస్తవ్యస్థంగా ఉన్నందున వాటన్నింటినీ ఒక విభాగం గా చేర్చాను. ఇక మీరు వార్తా పత్రికలోని అంశాలను యదాతధంగా ఉంచారు. కనుక ఇది వ్యాసంగా కనబడుటలేదు. వార్తాపత్రికలలో గల అంశాన్నంతా యధాతథంగా చేర్చరాదు. వార్తాపత్రిక శైలి వేరుగా ఉంటుంది. వికీపీడియాలో ఒక వ్యాసంగా ఉండాలంటే దానికి వేరొక శైలి ఉంటుంది. వార్తా పత్రిక కథనంలోని కొన్ని పుస్తకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను వికీశైలిలో వాక్యాలుగా మలచి వ్రాయాలి. వాక్యం చివర ఆ అంశం చేర్చిన వార్తాపత్రిక మూలాన్ని చేర్చాలి. పుస్తక వ్యాసంలో పుస్తకం కథాంశం, పురస్కారాలు (ఏవైనా ఉన్నచో), పుస్తక సమీక్ష వంటి అంశాలను మూలాలతో పాటు చేర్చాలి. వికీపీడియాలో పుస్తక వ్యాసం ఉండాలంటే నోటబిలిటీ కలిగి ఉన్న పుస్తక వ్యాసం అయితే మంచిది! మీ కృషికి ధన్యవాదాలు. మరిన్ని వ్యాసాలను చేర్చాలని మా ఆకాంక్ష. ఎటువంటి సహాయానికైనా అభ్యర్థించండి. -- కె.వెంకటరమణచర్చ 16:00, 23 ఫిబ్రవరి 2017 (UTC)Reply
అయ్యా వెంకటరమణగారు నమస్కారములు!! మీ సూచన ప్రకారం ఇకపై మార్పులు చేర్పులు చేస్తాను అండి. "కొండూరు రవి భూషణ్ శర్మ (చర్చ) 18:37, 24 ఫిబ్రవరి 2017 (UTC)"Reply

మూస దిద్దుబాటు

రమణ గారు, మూస:convert ఉపయోగించినపుడు centimetres లాంటి ఆంగ్లపదాలు వచ్చుచున్నవి. ఈ centimetres ని తెలుగులో రాయాలని (సెంటీమీటర్లు) ప్రయత్నిస్తే మూస యొక్క మూలపాఠ్యము కనపడుట లేదు. ఎక్కడ మార్చవలెనో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:53, 24 మార్చి 2017 (UTC)Reply

రమణ గారూ.. అలాగే మూస:Automatic taxobox విషయం కూడా చూడగలరు. ఇది ఆంగ్ల వికీలో పనిచేస్తున్నది. కానీ అక్కడి నుండి తెవికీకి తరలిస్తే పనిచేయడం లేదు. ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:00, 25 మార్చి 2017 (UTC)Reply

మౌస్‌ డీర్‌ వ్యాసంలో మూస:Automatic taxobox ని సరిచేసినందులకు ధన్యవాదములు రమణ గారూ..--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:51, 27 మార్చి 2017 (UTC)Reply

మార్పులు ఏమైనా చేసారా?

తెవికిలో మార్పులు ఏమైనా చేసారా? ఎందుకంటె, మూల పాఠ్యాన్ని సవరించు అనే ట్యాగ్ బదులు సవరించు ఆనేది కనిపిస్తొంది.ఒకవేళ సెట్టింగ్స్ లో ఏమైనా మారిపోయాయా అన్నది తెలియడం లేదు. దిద్దుబాటుకి ఇబ్బందిగా వుంది. కొంచెం వివరించరూ?--రాఘవీయం 16:23, 31 మార్చి 2017 (UTC)

రెండూ కనిపిస్తున్నాయి. ఏ మార్పులూ చేయలేదు.-- కె.వెంకటరమణచర్చ 14:56, 1 ఏప్రిల్ 2017 (UTC)Reply

-రాఘవీయం గారు, మీరు అభిరుచుల్లోకి వెళ్ళి,అందులో editing mode కు వెళ్ళి show me both editor tabs ను సెలక్ట్ చేసుకుంటె రెండు కనిపిస్తాయి. 05:30, Palagiri (చర్చ|రచనలు), 13 ఏప్రిల్ 2017 (UTC)

చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా వ్యాసం

మీరు రాసిన చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా వ్యాసం చదివాను. వీరు ప్రపంచ ప్రముఖ వైద్యులు. ఎందరో రోగులకు గ్యాస్ట్సిక్ సంబంధిత వ్యాధులను నయం చేశారు. మీకు వీరితో పరిచయము ఉన్నదా? ఇలాంటి వ్యక్తి వ్యాసమును వికీలో చేర్చినందులకు అభినందనలు. ఈ వ్యాసమును మెరుగు పరచడానికి కృషి చేస్తాను. వీరి కుమారుడు కూడా వైద్యుడే. అతడిని కలిసి ఇంకా ఏమైనా వివరములు ఉన్నచో చేర్చెదను. ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:15, 13 ఏప్రిల్ 2017 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారూ, తెలుగు ప్రముఖుల వ్యాసాల అభివృద్ధిలో భాగంగా ఈ వ్యాసాన్ని తయారుచేయడం జరిగినది. ఆయనతో నాకు ఎటువంటి పరిచయం లేదు. ఈ వ్యాస విస్తరణకు కృషిచేయ సంకల్పించినందులకు ధన్యవాదాలు. నేను కూడాఅ అభివృద్ధికి సహకరించగలను. -- కె.వెంకటరమణచర్చ 13:44, 13 ఏప్రిల్ 2017 (UTC)Reply

సినిమా వ్యాసాలకు ఒక శైలి మార్గదర్శి రూపకల్పన

సినిమా వ్యాసాలు రాయడానికి శైలీ మార్గదర్శి వ్యాసాన్ని వికీపీడియా:శైలి/సినిమా వ్యాసం పేరుతో రూపొందించాను. ఇందుకు ప్రధానంగా ఆంగ్ల వికీ నుంచి అనువదించినా, భారతీయ సినిమాలను, తెలుగు సినిమాలను దృష్టిలో పెట్టుకుని మార్పుచేర్పులు చేస్తూ పోయాను. ఇందుకు నేను గతంలో వివిధ మూలాలతో, విస్తారంగా రాసిన సినిమా వ్యాసాలను (మూగ మనసులు (1964 సినిమా), లవకుశ వంటివి) దృష్టిలో ఉంచుకుని రాశాను. దీన్ని ఓసారి పరిశీలించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 20 మే 2017 (UTC)Reply

వికీపీడియా:శైలి/సినిమా వ్యాసం బాగుంది. ఇది సినిమా వ్యాసాలు రాయడానికి మార్గదర్శిగా ఉంటుంది. దీనిని రూపొందించినందులకు ధన్యవాదాలు. గతంలో మీరు విస్తరించిన మూగ మనసులు (1964 సినిమా), లవకుశ వ్యాసాల శైలి బాగుంది. ఇలా మరిన్ని వ్యాసాలు తెలికీలోకి రావాలని కోరుకుంటున్నాను. ----కె.వెంకటరమణచర్చ 04:02, 21 మే 2017 (UTC)Reply

Translating Ibero-America is back! Come and join us :)

Hi!

Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.

We would love to have you on board :)

Please find the contest here

Hugs!--Anna Torres (WMAR) (చర్చ) 00:43, 12 జూన్ 2017 (UTC)Reply

Return to the user page of "K.Venkataramana/పాత చర్చ 10".