వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 2

(వాడుకరి చర్చ:Kvr.lohith/పాత చర్చ 2 నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: ప్రత్యుత్తరం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
     పాత చర్చ 2   
All Pages:  ... (up to 100)


దూరదర్శిని చర్చ

చర్చ:దూరదర్శిని లో స్పందించండి.--అర్జున (చర్చ) 04:38, 10 మార్చి 2013 (UTC)Reply

హైదరాబాదులో తెవికీ సమావేశం

వెంకట రమణ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 03:16, 13 మార్చి 2013 (UTC)Reply

పారిభాషిక పదాలు

భౌతిక శాస్త్రంలోని పారిభాషిక పదాలను కొంత వరకు చేర్చడం జరిగినది. దీనిని ఇంకనూ విస్తరించవలసి యున్నది. సహోదర వాడుకరులు వారికి తెలిసిన పదాలను వాటి అర్థాలను అక్షర క్రమంలో చేర్చవససినదిగా కోరుచున్నాను.( కె. వి. రమణ. చర్చ 17:49, 19 మార్చి 2013 (UTC))

నా వద్ద తెలుగు అకాడమీ వారి భౌతికశాస్త్రం యొక్క పారిభాషిక పదకోశం ఉన్నది. నా మొబైల్ 9246376622 కు ఫోను చేయండి. ఎలా చేర్చాలో మాట్లాడదాం. తప్పుగా చేరుస్తానేమోనని నా భయం.Rajasekhar1961 (చర్చ) 15:06, 20 మార్చి 2013 (UTC)Reply

భౌతిక శాస్త్రం - పారిభాషిక పదాలు(ఆంగ్లం-తెలుగు)

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

స్కట్, స్కర్టు

లోహిత్ గారికి నమస్కారం. స్కర్టు వ్రాశాను. అయితే ఇది స్కర్ట్ ఆ? లేక స్కట్ ఆ? మూస:ఆంధ్రుల దుస్తులు లో తగువిధంగా శుద్ధి/రీ-డైరెక్టు చేయవలసినదిగా మనవి.శశి (చర్చ) 14:05, 28 మార్చి 2013 (UTC)Reply

వ్యాసము

రమణ గారూ ! మీరు అభివృద్ధి చేసిన వ్యాసము (గణితం) వ్యాసంబాగుంది. మీరు చేస్తున్న కృషి మెచ్చతగినది. అనవసర చర్చలలో చిక్కుబడకుండా మీ కృషి కొనసాగించండి. --t.sujatha (చర్చ) 14:15, 28 మార్చి 2013 (UTC)Reply

రమణ గారూ ! వ్యాసాల నాణ్యతకు, వికీపీడియా అభివృద్ధికి ఎంతైనా చర్చ జరగవచ్చు. ఉన్నత విధ్యాభ్యాసంసం చేసి భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులైన మీకంటే ఈ విషయంలో మిగిలిన సభ్యులకు అవగాహన తక్కువే అన్నది నా అభిప్రాయం. మీరు వ్రాస్తున్న వ్యాసాల నాణ్యత బాగుంది. అర్ధవంతమైన, సమగ్రమైన, నాణ్యమైన శాస్త్రీయమైన వ్యాసాలు మీరు అందిస్తున్నరు. వికీపీడియాకు మీ అవసరం ఎంతో ఉంది. మీ పనికి ఆటకం కలిగించి మీ విలువైన సమాయాన్ని వృధాచేసుకోకూడదన్నది నా భావన. వికీపీడియాలో వ్రాసి బద్గ్రపరిచిన మరు క్షణం నుండి అందులో ఉన్న విషయాలు సభ్యులవి కాదు వికీపీడియావి అన్న విషయం అర్ధం చేసుకుని తరువాతనే ఇక్కడ వ్రాస్తున్నము. ఇందులో వ్యాస రచయిత వ్యాస ఆరంభకులు అన్న విషయానికి అర్ధం లేదు. ఈ విషయంలో చర్చలు అనవసరం.--t.sujatha (చర్చ) 15:03, 28 మార్చి 2013 (UTC)Reply

సంతకం లో ఎరుపు రంగు

నాకు పలుమార్లు సలహా ఇచ్చిన చొరవతో చెబుతున్నాను. మరోలా అనుకోకండి. మీ సంతకంలో ఎరుపు రంగుని ఎందుకు ఎంపిక చేసుకొన్నారు? అది ఏదో ఎర్రర్ లాగా కనబడుతున్నది. (మామూలు గా వికీ లో ఆ పదంతో వ్యాసం లేనప్పుడు లేకపోతే ఉదహరింపు, దస్త్రపు పొరబాట్లకి అలా వస్తూ ఉంటుంది. ) ఎరుపు రంగే ఉండాలి అనుకొంటే దానికి బ్యాక్ గ్రౌండ్ మార్చటమో, ఎరుపు తీవ్రతని తగ్గించటమో చేస్తే బావుంటుందని నా ఉద్దేశ్యం శశి (చర్చ) 14:03, 29 మార్చి 2013 (UTC)Reply

ప్రత్యేకించి ఏ అభిప్రాయం లేదు. మీ సూచనని పరిగణన లోనికి తీసుకుని మార్చుకున్నాను---- కె.వెంకటరమణ చర్చ 15:20, 29 మార్చి 2013 (UTC)Reply
ధన్యవాదాలు. ఇప్పుడు చక్కగా ఉంది. శశి (చర్చ) 20:06, 29 మార్చి 2013 (UTC)Reply

ఈ వారం... కు సహాయం

చరిత్రలో ఈ రోజు, మీకుతెలుసా నిర్వహిస్తున్నందులకు ధన్యవాదాలు. అలాగే ఈ వారం వ్యాసాలను గుర్తించడానికి సహాయపడుతున్నారు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:49, 31 మార్చి 2013 (UTC)Reply

మూసకు script error

అర్జునరావుగారూ, {{ప్రపంచ మతములు}} అనే మూస ను ఉంచినపుడు Script error అని వస్తుంది.సరిచేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 11:57, 31 మార్చి 2013 (UTC)Reply

రచ్చబండలో చెప్పినట్లుగా సరిచేశాను.--అర్జున (చర్చ) 12:56, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply

జాకెట్ = కోటు, జాకెట్ = చోళి

అర్జున గారి చర్చా పేజీలో మీ అభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకొమ్మన్ వ్రాశాను. ధన్యవాదాలు. శశి (చర్చ) 12:52, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 09:41, 4 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

మొలకల జాబితా గురించిన ప్రశ్నకు సమాధానం వైజాసత్య (చర్చ) 09:41, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply

బొమ్మలు చేర్చడంలో మెళకువలు

దయచేసి బొమ్మలు చేర్చేప్పుడు లైసెన్సు సరి చూసుకొని వికీపీడియాకు సరిపోయే లైసెన్స్ ఉన్న చిత్రాలనే ఎక్కించండి. మీ సొంత కృతులు లేదా హక్కులు మీ వద్ద ఉన్న చిత్రాలే వికీపీడియాలో ఎక్కింపుకు అర్హత కలిగి ఉంటాయి. మిగితావి సరిపోవు. రహ్మానుద్దీన్ (చర్చ) 15:23, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply

దస్త్రం ఎక్కింపుసూచనలు తెలియజేసిదందుకు ధన్యవాదాలు. వికీపీడియాకు సరిపోయే లైసెన్స్ ఉన్న చిత్రాలను ఎలా తేలుసుకోవాలి?  కె.వెంకటరమణ చర్చ 15:38, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమణగారు,

వికీ కామన్సులో వున్నబొమ్మలను వాడుకొండి.పాలగిరి (చర్చ) 07:39, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply

తప్పనిసరిగా ఉండవలసిన వ్యాసాలు

నేను 1.5 కె.బి మొలకల విస్తరణ కు కృషి చేయుచున్నాను. అలాగే తెవికీ లో తప్పనిసరిగా ఉండవలసిన వ్యాసాల జాబితా ఏదైనా కలదా?ఒక వేళ ఉంటే వాటిని కూడా విస్తరించవచ్చు. లేకపోతే జాబితా తయారు చేయండి  కె.వెంకటరమణ చర్చ 02:35, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply

వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు మరియు వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:15, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply

మూసలకై అభ్యర్థన

కెవి ఆర్ గారికి నమస్కారం. ఆంధ్రుల దుస్తులు కు చేసిన విధంగా భారతీయ దుస్తులు, భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు లకు కూడా మూసలు చేయగలరా?శశి (చర్చ) 20:00, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply

దీనికి సంబంధించిన మూస {{భారతీయులు ధరించే దుస్తులు}} ను తయారుచేసితిని. --  కె.వెంకటరమణ చర్చ 08:40, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

జాకెట్ అయోమయ నివృత్తి

జాకెట్ అయోమయ నివృత్తి చేశాను. జాకెట్ (రవికె, ఛోళీ లేదా బ్లౌజు) ఒక వ్యాసం కాగా జాకెట్ (కోటు) మరొకటి. స్పోర్ట్స్ జాకెట్, ఫైర్ జాకెట్, రెయిన్ కోట్ వంటి వ్యాసాలు పూర్తయిన తర్వాత అవసరాన్ని బట్టి ఇతర జాకెట్లు ని ఈ అయోమయ నివృత్తి లో చేర్చటం మంచిదనిపిస్తోంది. మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు - శశి (చర్చ) 05:31, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

దీనిపై నా అభిప్రాయాన్ని మీ చర్చా పేజీలో తెలియజేశాను.--  కె.వెంకటరమణ చర్చ 08:42, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

మూసల శుద్ధికై అభ్యర్థన

కేవిఆర్ గారికి, నా అభ్యర్థనని మన్నించి మూస చేసినందుకు ధన్యవాదాలు. నాకు మూసలు సృష్టించటం రాదు. అందుకే అభ్యర్థించాను.

  • స్వదేశీ పురుషుల దూస్తులులో 9 మరియు 12 ఒక్కటే. ఒకదానిని తొలగించండి
  • స్వదేశీ స్త్రీల దుస్తులు లో మిడి, మిని, మైక్రోమినీలు స్కర్ట్ యే నేమో అని చిన్న మీమాంస. ప్రస్తుతానికి దీనిని అలా వదిలి వేయండి. వీటిలో తేడాలు నేను మీకు త్వరలో తెలియజేస్తాను. దానిని బట్టి శుద్ధి చేయవచ్చును. పోల్కా డాట్ అనునది ఒక డిజైన్ మాత్రమే. షర్టులు ప్యాంటులు ఇతర వస్త్రాలు ప్లెయిన్ (సాదా), స్త్రైప్డ్ (చారలు) చెకర్డ్ (గడులు), హెర్రింగ్ బోన్ (వంకర టింకర చారలు), స్పాటెడ్ (చిన్న చుక్కలు), పోల్కా డాటెడ్ (పెద్ద చుక్కలు) వంటి అనేక డిజైన్లలో లభ్యమవుతాయి. (బహుశా నేను ఈ డిజైన్ల పై కూడా ఒక వ్యాసం ప్రారంభిస్తానేమో!!!). ఒక పోల్కా డాటెడ్ స్కర్టుని స్కర్టు వ్యాసంలో ఉదహరించటం జరిగినది. కావున పోల్కా డాట్ ని తీసివేయండి.

నాకై నేనే శుద్ధి చేయవచ్చునుగానీ, మూసని చెరచటం ఇష్టం లేదు. ఈ మూసలని ఆధారం చేసుకొని నేను ఎరుపు రంగులో ఉన్న వ్యాసాలని ప్రారంభిస్తాను. ఇంకనూ ఏవైనా మార్పులు ఉన్నచో మీకు తెలిపెదను. - శశి (చర్చ) 09:48, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

జాకెట్ (కోటు)

మీరు నాకు చెప్పదలచుకొన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నందుకు క్షమించాలి. మీరు మొదట చెప్పిన దానిని బట్టి జాకెట్ (రవికె, ఛోళీ లేదా బ్లౌజు) (భారతీయ వస్త్ర విశేషం) మరియు జాకెట్ (కోటు) (విదేశీ వస్త్ర విశేషం) లు చేశాను. మీ జవాబుని బట్టి జాకెట్ (రవికె, ఛోళీ లేదా బ్లౌజు) మీకు అంగీకారమే కానీ జాకెట్ (కోటు) పై మీకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు గా గోచరిస్తున్నది. మీకు చర్చకి అభ్యంతరం లేకపోతే veera.sj@rediffmail కి మీ ఫోన్ నెం. పంపండి. నేనే కాల్ చేసి మీతో చర్చించి దీనిని సరిచేస్తాను. అలా కాక మీరే తగు విధంగా దారి మార్పులు చేస్తానన్ననూ నాకు అంగీకారమే - శశి (చర్చ) 10:15, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

గండపెండేరం

(వాడుకరి పేజీ నుండి చర్చా పేజీకి తరలింపు)

మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:   దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply

మీ సభ్యపేజీలో ఒక గండపెండేరాన్ని బహుకరించాను. చూడండి.Rajasekhar1961 (చర్చ) 16:25, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమణగారూ ! గండపెండేరం అందుకున్న సందర్భంలో అభినందనలు అందుకోండి. t.sujatha (చర్చ) 13:27, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమణగారు సభ్యుడుగా చేరిన 6 నెలల తక్కువకాలంలోనే మీఅవిశ్రాంతకృషికి గుర్తింపుగా గండెపెండేరము అందుకున్నందులకు నాహృదయయపూర్వక అభినందనను.పాలగిరి (చర్చ) 14:13, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
హృదయపూర్వక శుభాకంక్షలు. మీరు ఇలాగే కృషి చేస్తూ మరిన్ని సత్కారాలు పొందాలని ఆశిస్తున్నాను - శశి (చర్చ) 14:49, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply
అభినందన మందార మాల రమణగారూ. మీ కృషిని ఇలాగే కొనసాగించగలరని, రాబోవు రోజుల్లో మీనుండి మరిన్ని శాస్త్రవిజ్ఞాన వ్యాసాలను ఆశిస్తున్నాను.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:15, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply
ఈ గండపెండేరాన్ని ఏ సభ్యుడైన అందుకొని చాలా రోజులైంది. గండపెండేరము పొందిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇది మీకు తగిన సత్కారము --వైజాసత్య (చర్చ) 02:26, 10 ఏప్రిల్ 2013 (UTC)Reply
రమణగారు! ఆరునెలల తక్కువ కాలంలోనే 4వేల దిద్దుబాట్లుచేసిన మీకృషికి అభినందనలు అందుకోండి.11:30, 19 ఏప్రిల్ 2013 (UTC)

CIS-A2K వారి ధన్యవాదాలు

వెంకటరమణ గారు 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు.--విష్ణు (చర్చ)18:50, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply

తెలుగు సినిమాలో పేలిన డైలాగులు

కె వి ఆర్ గారు, ఆ వ్యాసం నేను చేసినది కాదు. అందులో డైలాగులు అప్పుడప్పుడూ నేను చేర్చుతుంటాను. మరి వ్యాసం పేరు మార్పు నేనో, మీరో చేసేయవచ్చో లేదో తెలియదు. అందుకే నేను డైలాగుల వరకు చేర్చుతుంటాను. శశి (చర్చ) 11:19, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply

భారతీయ దుస్తులలో దోష సవరణ

కె వి ఆర్ గారు, దోష సవరణ, మరియు దాని వివరణలకి ధన్యవాదాలు. గ్యాలరీ ట్యాగులని నేను ఎప్పుడు కాపీ-పేస్టు చేసేవాడిని. ఈ మారు ఎందుకో CTRL M ఉపయోగించి నేనే టైపు చేశాను. అందుకే అలా కలిసొచ్చింది (కామెడీ). C, C+, C++, C# వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ లలో ఉండవలసిన చోట చుక్క లేకున్ననూ, అవసరం లేని చోట చుక్క ఉన్ననూ, అది మనకి చుక్కలు చూపిస్తుంది. ఈ ఫ్రంట్, బ్యాక్ స్ల్యాష్ ల అయోమయం, నేను కంప్యూటరు ఓనమాలు నేర్చుకొన్న రోజులని గుర్తు చేసినది. - శశి (చర్చ) 19:34, 9 ఏప్రిల్ 2013 (UTC)Reply

విక్షనరీ

రమణగారు, మీరు విక్షనరీ తలపుటలోనుచేసినమార్పులు బాగున్నాయి.ధన్యవాదం.మన తెలుగు వికీపీడియా మహోత్సవంలో పాల్గొనుటకై నేను హైదారాబాదు వెళ్ళడం వలన మీకు వెంటనే ప్రత్యుత్తరము ఇవ్వలేకపోయాను.తెలుగు వికీపీడియా మహోత్సవం బాగా జరిగినది.మీరులేని లోటు నాకు వ్యక్తిగతంగా కనిపించింది,తక్కువ కాలంలోనే చాలా విలువైన వ్యాసాలు వ్రాసిన మీరు కూడా వుండివుండిన చాలా బాగుండెది.పాలగిరి (చర్చ) 01:55, 12 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

వికీసోర్స్ గురించి వైజాసత్య (చర్చ) 05:32, 13 ఏప్రిల్ 2013 (UTC) వికీసోర్స్ గూర్చి తెలుపగలరు.  కె.వెంకటరమణ చర్చ 05:13, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply

వికీపీడియా ఎన్‌సైక్లోపీడియా అయితే వికీసోర్స్ గ్రంథాలయమనమాట. en:Wikisource చూడండి. క్లుప్తంగా ఒక ఉదాహరణతో చెప్పాలంటే భగవద్గీత రాయటం వేరు, భగవద్గీతను గురించి వ్యాసం రాయటం వేరు. భగవద్గీత గురించి వ్యాసం వ్రాస్తే అది వికీపీడియాలో ఉండాలి. భగవద్గీతను యధాతధంగా దించితే వికీసోర్స్ (వికీమూలాలు)లో ఉండాలి. భగవద్గీతను సొంత వ్యాఖ్యానంతో వ్రాస్తే దాన్ని వికీబుక్స్‌లో ఉంచాలి --వైజాసత్య (చర్చ) 05:30, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply

వంటల వ్యాసాల గురించి

వంటల వ్యాసాలు వికీపీడియాకు తగినవి కావు. అవి మీ వాడుకరి పేజీలోనో లేక ఇసుకపెట్టెలోనో ప్రయత్నించవచ్చు. లేదా వికీబుక్స్ లో ఒక పుస్తకంగా మార్చి రాయవచ్చు. గమనించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 04:15, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

రహ్మనుద్దీన్ గార్కి,
  • ప్రస్తుతం [[వర్గం:వంటలు]] లో 83 వ్యాసాలు, 7 వర్గాలు ఉన్నాయి. యివి చాలా కాలం నుండి వికిపీడియనులు చేర్చుతున్నవే. ఈ రోజే కొత్తగా ప్రారంభించలేదని గమనించాలి.
  • వాడుకరి:Anitha venkat గారు వ్యాసాలను వాడుకరి పేజీలో, చర్చా పేజీలో ప్రారంభిస్తే వ్యాసం వ్రాయు విధానం గూర్చి సలహా ఇచ్చాను.
  • నాకు వంటల వ్యాసాలపై ఆశక్తి లేదు. నాకు ఆ విషయములు తెలియవు. కనుక నేను వ్రాయలేను. వ్రాయను. కాని పై వాడుకరి చర్చాపేజీ లో వ్రాసిన విషయాన్ని వేరొక పేజీగా సృష్టించాను. కాని ఆ వ్యాసం విషయం గురించి తెలియదు.
  • వంటల వ్యాసాలు ఉండకూడదనే నియమం గానీ, యిదివరకు జరిగే చర్చా లింకులను తెలియజేయగలరు. నాకు తెలియదు.--  కె.వెంకటరమణ చర్చ 05:40, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply
వెంకట రమణ గారూ, మీరే వికీపీడియా ఐదు మూలస్థంబాలను పరిశీలించి, వీటికి ఈ వంటల వ్యాసాన్ని జతచేసి చూడండి. ఆపై మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను. మీరు రాయని పక్షంలో ఆ వ్యాసం చర్చ పేజీలో ఈ విషయాన్ని గురించి రాయవలసింది. లేని పక్షంలో ఎవరయినా ఆ వ్యాసం మీరు సృష్టించినదే అనుకుంటారు. రహ్మానుద్దీన్ (చర్చ) 07:10, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply

సహాయము కొరకు అభ్యర్థన

అయ్యా నేను వికీపిడియాకు కొత్త వాడిని. కనుక నా వ్యానం సిన్‌సినాటస్‎ అనువాదము కొరకు సహకరించవలసినదిగా ప్రార్థన.--Badbuu1000 (చర్చ) 13:59, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply

కొత్త వ్యాసాల సృష్టి

అయ్యా, మీరు వికీలో అద్భుతమైన, అత్యదిక రచనలు చేస్తున్నారు. మీకు ఏ రచనా వనరు దొరికిందో తెలియదు, కాని అందులోని సమాచారం మక్కికి మక్కి రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అని ఎవరో రాసినట్టుగా పలుచోట్ల కనిపిస్తున్నది. అలాటివి వికీలో కొంత ఉపయుక్తం కావు. వికీకి అవసరమైనటువంటి సమాచారం అనుకొంటే దానిని పాత వ్యాసాలలో చేర్చండి. మీ కృషికి డోకా ఉండదు. కొత్త వ్యాసాల సృష్టిపై దృష్టి పెట్టే కంటే పాత వ్యాల మెరుగుపై ఆశక్తి కనబరచడం వలన మేలైన వ్యాసాలు తయారు కాగలవని నా మనవి. అపార్ధం చేసుకోవలదు. మిత్రుడు..విశ్వనాధ్ (చర్చ) 13:52, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

అయితే క్షమించాలి, అలాంటి వ్యాసాలు మీకు తగిలితే తత్సంభంద వ్యాసాలలో విలీనానికి మూస తగిలించండి. లేదా మంచి వ్యాసం అనిపిస్తే విస్తరణ మూస తగిలించండి..విశ్వనాధ్ (చర్చ) 14:02, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 11:46, 2 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

విలీనం మూసల గూర్చి అడిగిన ప్రశ్నకు సమాధానం వైజాసత్య (చర్చ) 11:46, 2 మే 2013 (UTC)Reply

encoding conversion

since there were different font layouts and encodings in telugu earlier days, we could have to download every font to read a single website written in telugu. But due to the emergence of unicode, we can read any content written in telugu without needing to download different fonts. Hence, It is suggested to use unicode universally. :) I saw an article in anu font. i couldn't read the article. its like a spam. but that doesnt mean we have to delete the article. there are certain converters which convert from different layouts to unicode and vice versa. can you suggest a converter so that i can convert it to unicode. i think there may be a good content in anu font. :) Can we try? -தமிழ்க்குரிசில் (చర్చ) 12:55, 2 మే 2013 (UTC)Reply

there is a converter available here. see here. I have tried. verify. (there are 4 versions of anu. if there is any error, try the other three versions. Thanks. :) -தமிழ்க்குரிசில் (చర్చ) 13:09, 2 మే 2013 (UTC)Reply

తెలుగు ప్రముఖులు

తెలుగు ప్రముఖుల ప్రాజెక్టులో ఆసక్తి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రముఖులకు చెందిన ఆంగ్ల వికీ లింకుల్ని చేరుస్తున్నారు. వాటిని ప్రధాన వ్యాసంలో చేరిస్తే బాగుంటుంది. ప్రాజెక్టుకు చెందిన జాబితాలో మీరు కేంద్రీకరించబోయే విభాగాలలో మీ పేరును చేర్చండి. సందేహాలుంటే చర్చించండి.Rajasekhar1961 (చర్చ) 09:10, 4 మే 2013 (UTC)Reply

చర్చ పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చడంలో సహాయానికి ధన్యవాదాలు. మూస చేర్చిన తర్వాత తరగతి క్రింద చాలా తక్కువ సమాచారం ఉంటే మొలక అని; కొంత 4-5 కె.బి.ల సమాచారం వుంటే ఆరంభ అనిచేర్చండి.Rajasekhar1961 (చర్చ) 12:24, 4 మే 2013 (UTC)Reply
వ్యాసాన్ని చూడకుండా వ్యాసస్థాయిని అంచనా వేయడం బాగుండదు. దీనికంటె వ్యాస సమాచారంపై దృష్టిపెట్టడం బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:57, 4 మే 2013 (UTC)Reply
పెద్ద వ్యాసాలకు కూడా మొలక స్థాయిని నిర్థారించారు ఇలా చాలా వాటికి చేశారు. రాజశేఖర్ కూడా ఇలా చేయడం బాగుండదు. ముందుగా నాణ్యత పెంచాలి. స్థాయి నిర్థారించడం తర్వాతి సంగతి. ప్రాజెక్టు పని ప్రారంభమైతే చాలా మొలకల స్థాయి పెరగవచ్చు, అప్పుడు బాటుద్వారా దీన్ని నిర్థారించవచ్చు. ఇప్పుడే దీని అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:02, 4 మే 2013 (UTC)Reply
రమణగారు, ఇదివరకు నేను చెప్పినట్లు కాకుండా తెలుగు ప్రముఖుల వ్యాసపు చర్చాపేజీలలో ఎలాంటి మూసలైనా పెట్టండి. ఇక నేనేమీ అభ్యంతరపర్చను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:41, 5 మే 2013 (UTC)Reply
రమణ గారు, నేను చురుకుగా ఉన్నప్పుడు వందలాది కొత్తసభ్యులకు ఎన్నో సూచనలు చేశాను. నా సూచనలు, అభిప్రాయాలు పాటించారు, గౌరవించారు. కాని ఇటీవల కాలంలో నేను ఏమి చేసిననూ సీనియర్ సభ్యులు వ్యతిరేకంగానే చూస్తునారు. ప్రతిఒక్కరు వారికి నచ్చినది చేస్తుంటే తెవికీ సమాజం ఎందుకు? అందరికీ ఆమోదమోగ్యమైనట్టుగానే చేయాలని మీకూ తెలుసు కదా! ఇలా ఎవరికి వారి నచ్చినదే చేస్తుండబట్టి నేను కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను. నిన్న నేను చేసిన సూచన మీకు నచ్చింది కాని వైజాసత్యకు నచ్చలేదట! అతను మనకు పేద్ద అధికారి కదా!! ఆయన విలువైన సూచన మేరకు నేను నిన్న చేసిన సూచనను ఉపసంహరించుకుంటున్నాను. ఇక ఎవరైనా ఏమైనా చేయవచ్చట!! పెద్దమార్పులే చేయాల్సిన అవసరం లేదట! అది నాకు తెలుసు కాని, మరి బాటులెందుకు? సరే నాకూ చిన్నమార్పులు చేయవచ్చని చూపిస్తాను. ధన్యవాదములతో సి. చంద్ర కాంత రావు- చర్చ 15:56, 5 మే 2013 (UTC)Reply

బొమ్మలు

మీరు చేర్చిన సుసర్ల దక్షిణామూర్తి బొమ్మ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి వారిది అనుకుంటాను. అలాగే సుబ్బరామన్ గారి బొమ్మ ఘంటసాల బలరామయ్య చిత్రపటం. ఒకసారి మూలాన్ని పరీక్షించి సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 08:00, 7 మే 2013 (UTC)Reply

అధికారి హోదాకు మద్దతుకు కృతజ్ఞతలు

రమణ గారూ, వైజాసత్యగారు నాకు అధికారిహోదాకై ప్రతిపాదించిన ఓటింగులో నాకు మద్దతు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. కాని నాకు ఈ హోదా స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:22, 8 మే 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకై విజ్ఞప్తి

రమణగారు, మీరు గత ఏడు మాసాలుగా తెవికీ పురోగతికి విశేషమైన సేవలందించారు. మీ అనుభవం, ఆలోచనలు, సాంకేతికాంశాలపై అవగాహన, నియమాలపై పరిజ్ఞానం తదితరాల ఆధారంగా మీకు నిర్వాహక హోదాకై ప్రతిపాదించదలిచాను. నా ప్రతిపాదనకు ముందస్తుగా మీ సమ్మతి తెలియజేస్తారని లేదా మీరే స్వీయప్రతిపాదన చేసుకుంటారని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 8 మే 2013 (UTC)Reply

సరే మీ ఇష్టం. ఇక నా గురించి చెప్పాలంటే నేను సెలవెందుకు పెట్టానో మీకు తెలుసేననుకుంటాను. ఇక్కడ సెలవులో ఉన్ననూ నేను పురాతన గ్రంథాలు, క్షేత్రపర్యటనల ద్వారా పాలమూరు జిల్లాకు చెందిన సమాచారం సేకరిస్తూ దానిపై పరిశోధన చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు సమయం లభించినప్పుడు తెవికీని కూడా దర్శిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:04, 10 మే 2013 (UTC)Reply
రమణగారిని నిర్వాహకులుగా ప్రతిపాదించడం మంచి ఆలోచన నా మనసులోనున్న ప్రతిపాదనను చంద్రకాంతరావుగారు చర్చించడం ఆనందంగా ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 08:51, 13 మే 2013 (UTC)Reply

అధికార హోదాకు మద్దతు

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:52, 13 మే 2013 (UTC)Reply

కాపీహక్కులున్న బొమ్మలు

వెంకటరమణ గారూ, మీరు కాపీహక్కులున్న బొమ్మలు ఆయా వ్యాసాల్లో చేర్చడానికి ఎక్కిస్తున్నారని గమనించాను. ఒక్కో వ్యాసంలో ఒక బొమ్మను సముచిత వినియోగం (ఫెయిర్ యూజ్) ప్రకరణం క్రింద వాడుకోవచ్చు. కానీ అలా చేర్చిన బొమ్మలకు సముచిత వినియోగం క్రింద వస్తుందని కొన్ని హేతువులు చూపించాలి. ఉదా: దస్త్రం:Bnreddy.jpg లో లైసెన్సు వివరాలు విభాగం చూడండి. దీని గురించి మరిన్ని వివరాలు en:Non-free content మరియు en:Fair use చూడండి --వైజాసత్య (చర్చ) 11:08, 22 మే 2013 (UTC)Reply

మీరు ఎక్కించిన బొమ్మలో సముచిత వినియోగానికి హేతువులు వ్రాస్తున్నట్టున్నారు. అయితే సమస్యేం లేదు. గురజాడ వ్యాసంలో ఉన్న బొమ్మ మాత్రం సముచిత వినియోగం క్రింద రాదు. ఎందుకంటే ఆ వ్యాసంలో గురజాడ బొమ్మలు రెండు మూడు ఉన్నాయి కాబట్టి --వైజాసత్య (చర్చ) 11:16, 22 మే 2013 (UTC)Reply

8 వేల దిద్దుబాట్లు-అభినందించటంలేదు.

రమణగారు,

మీరు 8వేల దిద్దుబాట్లు చేసిన శుభ సందర్భాన మిమ్మల్ని అభినందించలేను.ఎలా అభినందించ గలనయ్యా?.మనకన్నచిన్నవాళ్లను,సమానమైనవాళ్లను,కొన్నిసమయాల్లో మనకన్నపెద్దవారినైన పెద్దరికాన్ని వారినుండి చనువుగా లాగేసుకొని,భుజంతట్టి ,శభాష్!నాలాగే పైకొస్తావని దీవింవవచ్చు.ఆరే! చూస్తుండగానే గోమఠేశ్వరునిలా తలపైకెత్తిన కన్పించనంతేత్తుకు ఎదిగిన మీ భుజం నాచేతికి అందటం లేదయ్యా అభినందించేటందుకు.జయం.పాలగిరి (చర్చ) 15:19, 23 మే 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియాలో మంచి శాస్త్ర వ్యాసాలను చేర్చి; ప్రస్తుతం తెలుగు ప్రముఖుల ప్రాజెక్టులో కీలకపాత్రపోషిస్తున్న రమణగారికి, తెవికీ సభ్యులందరి తరుపున శుఖాకాంక్షలు మరియు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 15:44, 23 మే 2013 (UTC)Reply

ఐ.పి నెంబర్లకు స్వాగత సందేశాలు

మీ సూచనలను తప్పకుండా ఆచరిస్తాను. ధన్యవాదాలు Pranayraj1985 (చర్చ) 06:09, 2 జూన్ 2013 (UTC)Reply

గజల్ గాయకులు

లోహిత్ గారూ, బ్రజ్ నారాయణ్ చక్ బస్త్, మోమిన్ ఖాన్ మోమిన్ లు గజల్ గాయకులు కారు. వీరు గజల్ కవులు. కావున వీరిని వర్గం:గజల్ గాయకులు లో వుంచకూడదనుకుంటాను. గజల్ గాయకులలో పంకజ్ ఉధాస్ , మంహర్ ఉధాస్ , అనూప్ జలోట , జగజీత్ సింగ్ , చిత్రా సింగ్ , గులాం అలి , మెహదీ హసన్ , ముహమ్మద్ రఫీ , తలత్ మెహమూద్ , తలత్ అజీజ్ , అహ్మద్ హుసేన్ ముహమ్మద్ హుసేన్ మొదలగు వారు ప్రసిద్ధులు. తెలుగు గజల్ గాయకుడుగా గజల్ శ్రీనివాస్ ప్రసిద్ధుడు. గజల్ కవులలో మిర్జా గాలిబ్ , మీర్ తఖి మీర్ , ఫిరాఖ్ గోరఘ్ పురి , గుల్జార్ , సుదర్శన్ ఫాకిర్ , మున్నగు వారు ప్రసిద్ధులు. వర్గీకరణ విషయంలో ఈ విషయం దృష్టిలో పెట్టుకోవలెనని మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 22:39, 12 జూన్ 2013 (UTC)Reply

మీరు సూచించిన విధంగా సరిచేశాను.--  కె.వెంకటరమణ చర్చ 04:31, 13 జూన్ 2013 (UTC)Reply

10,000 దిద్దుబాటు సందర్భంగా అభివందనలు

తెవికీలో ముందెన్నడూ లేని వేగంతో 10,000 స్థాయికి చేరినందులకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు.--అర్జున (చర్చ) 03:54, 17 జూన్ 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియాలో నిర్మాణాత్మకంగా పనిచేసి ఎన్నో విశేష వ్యాసాలు తయారుచేసి వికీ స్పూర్తికి జీవం పోస్తున్న రమణగారికి, 10,000 మార్పులు చేసినందుకు అభినందనలు. మీరు సమ్మతిస్తే నిర్వాహకులుగా ప్రతిపాదిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 06:24, 17 జూన్ 2013 (UTC)Reply
శుభాకాంక్షలు, అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 21:04, 18 జూన్ 2013 (UTC)Reply
నేను గమనించనేలేదు. అవునూ, ఇప్పటిదాకా ఇంత వేగంగా తెవికీలో 10వేల దిద్దుబాట్లకు చేరటం వెంకటరమణ గారికే చెల్లింది. శుభాకాంక్షలు --వైజాసత్య (చర్చ) 04:56, 1 జూలై 2013 (UTC)Reply
అద్భుతమైన కృషితో తెవికీని ముందుకు నడిపిస్తున్న మీలాంటి వికీపీడియన్ తప్పక నిర్వహకునిగా ఉండాలి, రాజశేఖర్ గారి ఆలోచనకు సుముఖత తెలుపండి..విశ్వనాధ్ (చర్చ) 05:41, 2 జూలై 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం

 
నమస్కారం K.Venkataramana గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 02:33, 8 జూలై 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.Reply

మీ మొలకల జాబితా గురించి వైజాసత్య (చర్చ) 02:33, 8 జూలై 2013 (UTC)Reply

Return to the user page of "K.Venkataramana/పాత చర్చ 2".