పాత చర్చ 4 | పాత చర్చ 5 | పాత చర్చ 6

ఇది పాత ప్రతిపాదనలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా ప్రతిపాదించాలంటే ఇక్కడ చేయండి.

సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ

మార్చు

సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ గురించి ఇంతకు ముందు కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో చాలా వరకు విస్తరించే అవకాశం అత్యల్పమని ఆ చర్చలో అభిప్రాయం వెల్లడి అయింది. వికీ మొదటి దశలో 2000 సంవత్సరం వరకు అన్ని సినిమాలకూ డేటాబేస్ చేసి దానిని అనువదించడం జరిగింది. ప్రతి సినిమాకూ ఒక పేజీ చేయాలని అప్పటి ఆలోచన. ఆప్పుడు అనువాదంలో నేను చాలా ఉత్సాహంగా పాల్గొన్నాను కూడాను. అయితే తరువాత జరిగిన కృషిని చూస్తే ప్రతి సినిమానూ విస్తరించడానికి సభ్యులకు పెద్ద ఆసక్తి లేదని తెలుస్తున్నది. అంతే గాకుండా ప్రాచుర్యం లేని పాత సినిమాలు ఉన్నకొద్దీ ఇంకా పాతబడుతుంటాయి గనుక వాటికి పేజీలు కేటాయించడం వలన పెద్ద ప్రయోజనం లేదని నేను భావిస్తున్నాను. మరియు తెలుగు వికీ అంటే తెలుగు సినిమాల డేటాబేస్ కాదు. అందుకు వేరే సైటులున్నాయి. చాలా పనికిమాలిన సినిమాలకు కష్టపడి వ్యాసాలు వ్రాయాలని యత్నించడం, ప్రోత్సహించడం వికీ సభ్యుల విలువైన సమయాన్ని వృధా చేయడమే అనుకొంటాను.

అందుచేత ఈ వ్యాసాలు పునర్వ్యవస్థీకరించడానికి ఈ ప్రతిపాదనను చేస్తున్నాను.

ఉదాహరణగా ఎవరిని నమ్మాలి అనే సినిమా తీసికొనండి. దీనిలో "నాలుగు పదాల సమాచారం" మాత్రం ఉంది. (వాక్యాలు కాదు, పదాలే). దీనిలో ఉన్న సమాచారం నష్టం కాకుండా ఇలా చేయవచ్చును (ఉదాహరణగా చేశాను)-

  • తెలుగు సినిమాలు ఎ లో ఈ సమాచారం ఉంచవచ్చును.
  • మరియు తెలుగు సినిమాలు 1970 లో ఈ సమాచారం ఉంచవచ్చును.
  • ఇప్పుడు ఎవరిని నమ్మాలి అనే వ్యాసాన్ని తొలగించవచ్చును. అది పై రెండు పేజీలలో ఎర్ర లింకుగా ఉంటుంది.
  • ఎవరైనా ఈ సినిమా గురించి వ్యాసాన్ని వ్రాయాలని సంకల్పిస్తే పాత సమాచారం సిద్ధంగా ఉంది. ఎర్ర లింకు ద్వారా మళ్ళీ వ్యాసాన్ని మొదలెట్టొచ్చు.

ఈ విధానం అప్లై చేయడంలో పాటించదగ్గ మినహాయింపులు -

తెలుగు వికీలో వ్యాసాల నాణ్యత శాతం పెంచడానికి ఈ చర్యలు ఉపయోగపడుతాయని భావిస్తున్నాను. సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను. (మరొక గమనిక : ఈ ప్రమాణాలనే గ్రామాల వ్యాసాలకు ఎందుకు వాడరాదు? అని సభ్యులు ప్రశ్నించవచ్చును. అన్ని విషయాలూ కలగలుపుగా చర్చించడం వల్ల ఇబ్బంది గనుక దాని గురించి మరొకమారు చర్చించాలని సూచిస్తున్నాను)

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:19, 14 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ప్రతిపాదన సబబుగానే ఉంది. ఇవన్నీ చేత్తో చేయటం కంటే బాటుతో సులువుగా చెయ్యవచ్చు. ముందుగా ఆంగ్లవికీలోని ఈ వ్యాసం en:Telugu_films_of_2001 తరహాలో పట్టికలు బాటుతో తెలుగు సినిమాలు 1970 వంటి పేజీల్లో జోడించిన తరువాత అవసరం లేదనుకున్న సినిమా పేజీలను తొలగిద్దాం. నేను ఒక వారం రోజుల్లో బాటు తయారుచేసి నడపటానికి ప్రయత్నిస్తాను. గ్రామాల వ్యాసాల గురించి తరువాత చర్చిద్దాం. దీన్ని ఎలా అమలుపరచాలో సభ్యులు సలహాలు, సూచనలు చేయగలరు. అప్పట్లో కేవలం వ్యాసాల సంఖ్య పెంచటమే లక్ష్యంగా పెద్దగా ఆలోచించకుండా చాలా పనులు చేశాము. :-) --వైజాసత్య 21:27, 14 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ప్రతిపాదన బాగుంది. కానీ సినిమా పేజీలున్నాయి. యాంత్రికంగా మార్చడం చాలా కష్టం. వైజాసత్య గారు ప్రతిపాదించినట్లుగా ప్రతి సంవత్సరానికి బాటు ద్వారా ఒక పట్టిక తయారుచేసి ఉన్న సమాచారాన్ని అందులోకి మార్చిన తర్వాత సమాచారం ఎక్కువ ఉన్న సినిమాలకు మాత్రమే వేరుగా ప్రత్యేకమైన పేజీలు ఉంచితే తెలుగు వికీపీడియా ఒక మెట్టు అభివృద్ధి సాధించినట్లే. ఇంగ్లీషు వికీపీడియాలో తెలుగు సినిమాలకు పేజీలు ఈ మాదిరిగానే ఉన్నాయి.Rajasekhar1961 03:56, 15 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


నా ఉద్దేశంలో బాటు ద్వారా కంటే మాన్యువల్‌గా చేయడమే మంచిది. ఎందుకంటే (1) సమాచారాన్ని మరొకసారి పునఃసమీక్షించే అవకాశం ఉంటుంది. (2) టేబుల్ ఫార్మాట్ క్రొత్త సమాచారం చేర్చడానికి క్రొత్త సభ్యులకు అంత వీలుగా ఉండదు. (3) ఇదేమీ అర్జంటు పని కాదు గనుక నిదానంగా చేయవచ్చును. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇతరులు కూడా పాల్గొంటారని ఆశిస్తాను. (4) తొలగించడానికి నిర్ణయించిన పేజీల గురించి అభ్యంతరాలు ఏవైనా ఉంటే అవి చర్చించడానికి ఆస్కారం ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:02, 15 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పని మొదలుపెట్టారా. పాత సినిమా పేజీలను తొలగించవద్దని మనవి. వాటిని దారిమార్పు పేజీలుగా ఉంచండి. ఎందుకంటే ఇవి చాలా అయోమయ పేజీలలో ఉన్నాయి. జాబితాలు పట్టికలా ఉంటేనే ఒక పద్ధతిగా ఉంటాయి. లేకపోతే ఎవరైనా చేర్చి నియంత్రించడం కష్టమౌతుంది.Rajasekhar1961 08:54, 16 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకా పనేమి మొదలుపెట్టలేదు. మాన్యుయల్‌గా అయినా ఫర్వాలేదు. చేత్తో చేసేట్టైతే ఒక పట్టిక వేసుకొని ఒక్కొక్క సంవత్సరానికి చెందిన సినిమాలను ఆసక్తి ఉన్న ఒక్కో సభ్యుడు బాధ్యత వహించేట్టుగా ఆ పట్టికలో నమోదుచేసుకుంటే ఒక పద్ధతిన సాగుతుందనుకుంటా. --వైజాసత్య 21:52, 16 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నాలుగు రోజులైనాక మొదలు పెడతాను. తొలగించేముందు అయోమయ నివృత్తి, విస్తరణ సాధ్యాసాధ్యాలు, ప్రాముఖ్యత, సమాచారం, బొమ్మ, ఆంగ్లం లింకులు సరి చూస్తాను. అంతకంటే ముఖ్యం - కనీస విస్తరణ చేసి తొలగించకుండా ఉండడమే నా లక్ష్యం. రెండు వారాలైన తరువాత ప్రగతిని సమీక్షించి, అనంతరమే ఇతర సభ్యులు పాల్గొనమని కోరుతున్నాను. అలాగైతే సమీక్షా ప్రమాణాలు యూనిఫార్మ్‌గా ఉండే అవకాశం ఉంది. తరువాత ఈ చర్చను వికీపీడియా చర్చ:WikiProject/తెలుగు సినిమాలు లోకి కాపీ చేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:33, 17 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:33, 17 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధ బాంధవ్యాలు

మార్చు

ఈ కాలంలో ప్రతి మనిషి మనిషి నడుమ సంబంధాలు పలచన అవుతున్నవి. గజిబిజి ఉరుకులు పరుగుల ఈ జీవితంలొ ఎవరికి ఎవరు అన్న ఛందాన సాగి పోతున్నది. ప్రేమ కరువవుతున్నది. అప్యాయత, అనురాగాలు, మమకారలు ఎంత వెల కట్టి సొంతం చేసుకుందామనుకున్న కాన రావటం లేదు. ప్రతి ఒక్కరి జీవితం అభద్రతకు లోనవుతు, మానసిక ఆందోళనతొ నిరంతరం మ్రగ్గుతూ క్రుంగి పోతున్నది.... etc....

దీనికి పరిష్కార మార్గం.......!!!!!!?

శ్రీ రాజశేఖర్ గారిది బాధ కాదండి. నడుస్తున్నచరిత్ర. దీనికి పరిష్కారం ఉన్నది. అది ఎమిటంటే, ఇంటిపెద్ద క్రమబద్ధంగా వుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే కుటుంబపెద్ద ఒక క్రమశిక్షణ అనే దానిని కుటుంబ సభ్యుల మధ్య నెలకొల్పాలి. దీనికి చాలా శ్రద్ధ పట్టుదల అవసరం. ఒకసారి నేను భాగ్యనగరం - పద్మారావునగరం లో వున్న స్వరాజ్ ప్రెస్ లో మతపెద్దల ప్రవచనం వినటం జరిగింది. దానిలో ముందుగా ప్రసంగించిన, శ్రీ విశ్వంజీ (గర్తపురి,గుంటూరు) గారు, సభికులనుద్దీశించి, " మీరు మీ పిల్లల ముందు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ,మీరు మీ పిల్లలు సద్వర్తనులుగా వుండాలని కోరుకోవడం ఎంత సబబు? " అని ఆవేశంగా ఆ సభికులైన, లయిన్సు క్లబ్,రొటెరియన్లు, వైస్ మెన్లు, తదితర సాంఘిక సేవాసంస్ఠ ల వారిని ప్రశ్నిస్తే ,వారంతా అవాక్కయ్యారు. నిజానికి శ్రీ విశ్వంజీ దాదాపు ఇరవై నిమిషాలు ఆ ప్రవచనము కొనసాగించారు. అక్కడ వేదిక మీదనున్నమిగిలిన మతపెద్దలు మరి ప్రసంగిచకుండా వీరి ప్రసంగమే చాలునని కరతాళద్వనులతో ఆ ప్రసంగానికి తమ ఆమోదముద్ర వేసారంటే, శ్రీవిశ్వంజీ ప్రసంగము ఎంత స్పూర్తిదాయకంగ, ఎంత సమంజసంగా వుందో మీరు ఊహించుకోవచ్చును. నేను పూర్తి ప్రసంగము వ్రాయనవసరముంది. కాని వ్యాసచదువరికి "రసం" చాలు కదా! ఇఖ శ్రీశేఖర్ గారు అన్నట్లు, ప్రేమ, ఆప్యాయత, అనురాగలు, మమకారాలు, మన ఇళ్ళలో/కుటుంబాలలోనికి తిరిగి రావాలంటే, తల్లిదండ్రులు పూనుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా, అందరు కలిసి, కనీసం పది నిమిషాలు పూజా గది లో భగవదర్చనలో గడపాలి. శెలవరోజులలో, అందరు కలసి, భోజనం చెయ్యాలి. ప్రతిరోజు నియమంగా అందరు కలిసి వ్యాయమం గాని, నడక గాని చెయ్యాలి. ఒక మంచి పుస్తకం చదవడమో,లేదా పుస్తకం గురించి చర్చ జరపాలి.

నమస్సుమాంజలులతొ,  జాజిశర్మ.

జాజి శర్మ గారు బాగా ఛెప్పరు. ప్రస్తుత కాలంలో కుటుంబ పెద్దకు డబ్బు సంపాదించటం లో వున్న శ్రద్ధ కుటుంబం మీద వుండం లేదు అని నా అభిప్రాయం. తల్లి,తండ్రి పిల్లలతో తక్కువ సమయం గడపటం వల్ల ఈ విధమైన సమస్యలు ఉద్బవిస్తాయి. ఇప్పుడు అందరూ వేరు కాపురాలు పెట్టటం వల్ల కూడా పిల్లలకి కావలసిన విజ్ఞానము/మేధ పెద్దల నుంచి అందక, టీవీల్లో/సినిమాల్లో చూసిన దాన్ని తిరిగి వ్యక్త పరుస్తున్నారు. రోజూ ఒక్క కధ(నీతి కధే కాని లేక ఇతిహాసమే కానీ లేక హాస్య కధ కానీ) పిల్లలు పడుకునే ముందు చెప్పే మన సంస్కృతి పోయింది. తాత - మనవళ్ళు ఇరివురితో గడిపే తీరిక ఇరువురికి వండటం లేదు. శెలవులలో కూడా పిల్లలకి ప్రెవేటు క్లాసులు లేదా ట్యూషన్లు. ఇంటికి వచ్చాక హోం వర్కు తరువాత టీవీ, భోజనం, నిద్ర.. అమ్మ ఆఫీసు, వంట గది.. , నాన్న ఆఫీసు, టీవీ/స్నేహితులు.., అమ్మమ్మ-తాత వుంటే వాళ్ళు కూడా ఏదో ఒక సీరియల్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. జాజి శర్మ గారు చెప్పినట్టు, అందరు కలిసి చేసే పనులకు ఎక్కువ సమయం కేటాయించినట్లయితే అందరి మధ్య అవగాహన పెరిగి, సంభంధ-భాంధవ్యాలు మెరుగు పడతాయని నా వుద్దేశ్యం. జైహంద్, ఫణి

చరిత్రలో ఈ రోజు - ఈ వ్యాశం ముందరి రోజు చుపిస్తొంది

మార్చు

చరిత్రలో ఈ రోజు - ఈ వ్యాశం ముందరి రోజు చుపిస్తొంది అలా చుపించ కుండా ఈ రొజు చుపాలి అంటే ఏమి చెయ్యాలి

ప్రతిపాదనలు

మార్చు

ఇక్కడ కొంత విషయం వాడుకరి:Sairatna పేజీకి మార్చడమైనది. --కాసుబాబు 11:50, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పుస్థకాలు కోసం

మార్చు

హాలో ఫ్రెంద్స్ మీకు తెలుసా మన తెలుగు వారి కోసం మన్ఛి తెలుగు వెబ్ ఉంది. దాని పేరు మల్లెపూలు.కాం

Rajasricity 17:56, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు మిత్రమా. ఈ వెబ్ సైట్ చాలా బావుంది. దీని ద్వారా ముఖ్యంగా NRIs బాగా సులభంగా తెలుగు పుస్తకాలు అందుబాటులో వుంటాయి. ఫణి

ఛరిత్ర లొ ఈ రొజు/నివృత్తి}}

మార్చు

నమస్కరనములు, ఛరిత్ర లొ ఈ రొజు సీర్షిక లొ జూలై 6 తెది మంగళంపల్లి బాలమురలళీ క్రిష్ణ గారి జన్మ దినము అని చూపు చున్నది. కాని, వార్త లలొ జులై 2 ఆయన జన్మదినం అని చదివినటు గా గుర్తు. దయచేసి విసిదీకరించ గలరు.

భవదీయుడు, Srinivaskarri 10:15, 7 జూలై 2009 (UTC)శ్రీనివాస్ కె[ప్రత్యుత్తరం]

సరి చూస్తాము. తెలియజేసినందుకు ధన్యవాదాలు. —రవిచంద్ర 11:57, 7 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఛరిత్ర లో ఈ రోజు -

మార్చు

నమస్కరములు, ఛరిత్రలో ఈ రోజు శీర్షికలో ముందు రోజు విశేషాలను చూతున్నది. దయచేసి సరి చేయగలరు.

Srinivaskarri 04:56, 10 జూలై 2009 (UTC) శ్రీనివాస్. కే[ప్రత్యుత్తరం]

నాకు సరిగానే కనిపిస్తున్నది. మీ బ్రౌజర్ కాష్ ను ఒక సారి రిఫ్రెష్ చేయండి. లేదా మీ సిస్టమ్ టైమ్ ను ఒకసారి సరిచూసుకోండి. —రవిచంద్ర 05:04, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సంరక్షణ - మత సంబంధమైన పేజీలన్నీ

మార్చు

మత సంబంధమైన పేజీలన్నీ సంరక్షించబడితే, అజ్ఞాత వ్యక్తుల ద్వారా మార్పులు నిరోధించవచ్చు కదా! ఉదా. జిహాద్ కిరణ్మయీ 16:02, 13 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి వేటిమీదైతే అజ్ఞాత వ్యక్తులు అసంగతమైన, అసంబద్ధమైన మార్పులు చేస్తున్నారో నిర్వాహకుల దృష్టికి తీసుకు రండి. అలాగే సంరక్షిద్దాం. --రవిచంద్ర (చర్చ) 16:37, 13 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

యువతకు ఉద్యొగ విషయములు తెలుపుతకు తెవిపి సహయము.

మార్చు

ఈనాటి యువత కొసమ్ తెవిపి ఒక పొర్టల్ ఆరమ్బిస్తె ?

చూడండి ఉపాధి. ఆసక్తి గల వారు దాని చర్చపేజీలో లింకు ద్వారా విద్య, ఉపాధి ప్రాజెక్టు పేజీ కి వెళ్లి సహాయం చేయవచ్చు -- అర్జున 00:12, 20 అక్టోబర్ 2010 (UTC)

మన పర్యావరణం

మార్చు

పర్యావరణ పరిరక్షణ మనందరి కనీసభాద్యత అని నా అభిప్రాయం. కాని మనలొ ఎంతమంది ఈ విషయం లొ శ్రద్ధ కనబరుస్తున్నారో? ఎండలు ఎక్కువుగా వున్నా, వర్షాలు సమయానికి కురవక పోయినా, మనం దేవుణ్నె ప్రార్ధించడమో, యజ్ఞ, యాగాదులు చెయ్యడమో చేస్తూంటాం. కాని ఇవన్ని చూస్తూ ఆ భగవంతుడు నవ్వుకుంటూటాడు.. ఎందుకంటే మనం చెయ్యాల్సిన్ది మాని ఇవన్ని చేస్తున్నామని. ఎండలు ఎక్కువుగా వున్నా, వర్షాలు సమయానికి కురవక పోయినా దానికి కారణం పర్యావరణ పరిరక్షణ మరియు ప్రకృతి సమతుల్యత పట్ల మన నిర్లక్ష్య విఖరే. మొదటిగా అతి ప్రమాదకరమయిన ప్లాస్టిక్ వినియొగం: ఈ రొజు మనషి జీవిన విధానం ఎంతగా మారిపోయిందంటే ప్లాస్టిక్ వుత్పత్తులకు బానిసగా మారిపోయాడు. ముఖ్యంగా క్యారీబ్యాగ్. క్యారీబ్యాగ్ లేనిదే ఏ పనీ చేసుకోలేని పరిస్థితికి దిగజార్చబడ్డాడు.కూరలు, పళ్ళు, పాలు, కిరాణా సామన్లు, స్వేట్లు, ఇలా ఒక్కటేమిటి ఏ వస్తువు ఇంటికి తేవాలన్నా క్యారీబ్యాగ్ లేనిదే వీలుకాని పరిస్థితి. ఇలా ఒక మనిషి వుదయాన్నే పాలతొ మొదలుపెట్టి రాత్రి పూలు పళ్ళు వరకూ కనీసం రోజుకు నాలుగు నుండి అయిదు క్యారీబ్యాగులు తేవడం, ఇంటికి రాగానే అవన్ని ఖాళీ చేసి విసిరి పారెయ్యడం. దానివలన జరిగే హానితొ సంబధం లేదు. ఒక మనిషి కి వుండే ఇతర వ్యసనాల వల్ల అతని ఆరోగ్యానికి తద్వారా అతని కుటుంబానికి మాత్రమే హాని. కాని ఈ క్యారీబ్యగ్ వ్యసనం వల్ల అతని కన్నా సమాజానికి, పర్యావరణానికి జరిగే హాని చాలా ఎక్కువ.. ఒక క్యారీబ్యాగ్ మట్టీ లో కరిగి అంతరించిపోవదానికి పట్టే కాలం కొన్ని వేల సంవత్సరాలు.అంతవరకూ అది మనకు హాని చేస్తూనే వుంటుంది.దానిని కాల్ఛడం వల్ల వెలువడే వాయువు ఓజోన్ పొరకు హానికరం.దానిని తగలబెట్టడానికి కూడా వీలుకాదు. ఎక్కడో జనావాసాలకి దూరంగా పారిశ్రామిక వాడల్లొ వుండే పరిసశ్రమల కాలుష్యం వల్ల్ల కలిగే హాని కన్నా ఇది చాలా ప్రమదకరమ్. క్యారీబ్యాగ్ లు విచ్ఛలవిడిగా వాడుతూ ఇలా మన పరిసరాలలో మనం సృష్టించే కాలుష్యమే మనం మన పిల్లలకు, వారి పిల్లలకు అందించే వారసత్వ సంపద. ఇంత హానికరమయిన క్యారీబ్యాగ్ విదేశాలలో నిషేధం. పాశ్చాత్య నాగరికత ను ఇట్టే వంటబట్టించుకొనే మన వాళ్ళకు ఇలాంటి విషయాలు పట్టవు. మన ప్రభుత్వాలకు ఇలాంటి పరిశ్రమలకు అనుమతులివ్వడమే తప్ప వాటి వల్ల జరిగే అనర్ధాలతో సంబంధం లేదు. ప్రజలకు ఇంత హాని చేస్తున్న ఈ క్యారీబ్యాగ్ పరిశ్రమను నిషేధించడం ప్రభుత్వానికి చాలా చిన్న విషయం.

కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా
ప్రజలు తమ విలువైన కాలన్ని వృధా చేస్తూ ఇంత చిన్న విషయం పై పోరాడాల్సి రావడం చాలా సిగ్గుగా అనిపిస్తోంది. 

Sureshkoduri 16:51, 29 సెప్టెంబర్ 2009 (UTC)కోడూరి సురేష్

  • పర్యావరణ పరిరక్షణ అనేది ఒక పెద్ద అంశం. మొదట ప్లాస్టిక్ వినియోగం గురించి వ్యాసం మొదలుపెట్టండి. ఈ వికీ మాధ్యమం ద్వారా మనం ఇలాంటి ప్రజోపకరమైన సమాచారాన్ని అందరికీ తెలియజేయవచ్చును.Rajasekhar1961 06:35, 30 సెప్టెంబర్ 2009 (UTC)

computer కు బదులు గణ యన్త్రము అని వాడ వఛు కధా

తెలుగు వికీపీడియా లొ "పేజీ" ను "పుట" అని వ్యవహరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--Mohanvihari 16:28, 30 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చచూడండి.--అర్జున 16:37, 13 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

google translation

మార్చు

ఆంగ్ల వికీపిడియా నుంచి ఎంపిక చేసిన కొన్ని వ్యాసాలను గూగుల్‌ బృందం తెలుగులోకి అనువదిస్తోంది. ఇది సంతోషించదగ్గ విషయమైనా...అదేస్థాయిలో విచారించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. 1. ఈ వ్యాసాల ఎంపిక విషయంలో సగటు తెలుగు పాఠకుడిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకున్నట్లుగా లేదు. 2. రుసుం తీసుకొని అనువదిస్తున్న కంపెనీలు, అనువాదకుల్లో అధిక శాతం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి, కేవలం, ధనార్జనే ధ్యేయం అన్నట్లుగా వార్తలను డంప్‌ చేస్తున్నారు. కొన్ని వ్యాసాలు తెలుగులో చదివినతరువాత, అసలు కవి హృదయం ఏమిటో...అర్థం కాక.. మళ్లీ ఇంగ్లిష్‌ వ్యాసం చదివి.. భావాన్ని తెలుసుకోవాల్సిన వస్తోంది. 3. మరిన్ని తరాల వరకు ఉండే ఈ వ్యాసాల్లో ముద్రారాక్షసాలు( కంపోజింగ్‌ రాక్షసాలు అందామా..!) ఎలా అరికడదాం....? సూచనలు, సలహాలు ఇవ్వండి. నా మట్టుకు రోజుకు ఒక వ్యాసం చదివి.. ఆ తప్పులను నమోదు చేస్తాను. అందరం కలిసి ఈ పని చేపట్టి... తప్పులను గూగుల్‌ వారి ముందు ఉంచుదాం.. తద్వారా తెలుగును బతికించుకుందాం... అదే విధంగా తెలుగు వికీలో నాణ్యతను పెంచుదాం.... ఏమంటారు...?

పై ప్రశ్న అడిగిన వారు:ప్రభ.. వ్యాఖ్య చేసినవారు సంతకంచేయటం మరిచినందున ఈ వ్యాఖ్య ద్వారా అది సరి చేయడమైనది..--అర్జున 03:01, 16 నవంబర్ 2010 (UTC)
మీరన్నట్లు ఈ వ్యాసాల్లో నాణ్యత తక్కువే. వాటిని అరికట్టడానికి క్రియాశీలకంగా పనిచేసే అనేకమంది సభ్యులు కావాలి. ప్రస్తుతానికైతే అలా అనువదించబడిన వ్యాసాలన్నింటినీ వర్గం:యాంత్రిక అనువాద వ్యాసాలు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు క్రింద ఉంచుతున్నాం. మీకు ఆసక్తి ఉంటే వాటిని శుద్ధి చేయగలరు. మరింత సమాచారం కొరకు వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు చూడండి. --రవిచంద్ర (చర్చ) 14:54, 26 ఆగష్టు 2010 (UTC)
ఈ విషయంపై ఇదివరకు ఇక్కడ మరియు ఇక్కడా చర్చ జరిగింది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:09, 26 ఆగష్టు 2010 (UTC)

జలసూత్రం వంశ వృక్షం

మార్చు

వైజాసత్య గారికి మీకు నమస్కారములు. మీరు పంపిన సందేశము అందినది. విషయములు గ్రహించినాను. ముఖ్యముగా తెలియ చేయునది ఏమనగా, మీరు అన్నట్లుగా ప్రస్తుత వ్యక్తుల వివరములు అంతగా అవసరము లేదు. కానీ పూర్వ కాలములో వలె సమిష్టి కుటుంబాలు ఇప్పుడు లేవు. ఉన్నయేక కుటుంబములో కూడా వారి సంతతి దేశాలు విడిఛి యెక్కడెక్కడో నివశిస్తూ వున్నారు. కనీసము ఆ కుటుంబము లోని పిల్లలకు వారి వారి తాత, ముత్తాత ల గురించి పేర్లు కూడా తెలియని ఎంతో మంది వున్నారు. ప్రస్తుతము జరుగుతున్నది అదే. మనము మన పూర్వీకుల గురించి చదువు కుంటున్నాము. అలాగే ఈ 100 సం. వారు మరో 1000 సం. లకు వీరే మనకు పూర్వీకులు అవుతారు. ముఖ్యముగా బ్రాహ్మణ కుటుంబాలలో పూర్వీకులయిన తాత, ముత్తాత ల పేర్లు, గోత్ర నామములు, ప్రవరలు గురించి మంచి, చెడు కార్యక్రమములలో ప్రతి వారు తెలుసుకోవలసి వుంటుంది. వారు యాత్రలలో వుండవచ్చు, విదేశాలలో, తదితరములయిన స్త్తితులలో వుండవచ్చు. తగిన సమయానికి వారికి గుర్తుకు రాక పోవచ్చును. అలాంటి ఇబ్బంది లేకుండా యెంతో విలువైన సమాచారము అని నాకు అనిపించింది. ఈ సమాచారము వలన తెలుగు వారు ఎక్కడ వున్నా మన అందరి బంధుత్వములు యెప్పటికైనా తెలుసుకోగలుగుతారు. దయచేసి వికీ పెద్ద లందరు ఈ విషయము గురించి కూలంకషముగా చర్చ చేయగలరు అని భావిస్తూ వున్నాను. ఇప్పుడు నా వయసు 55 సం.లు. మీరు పెద్దలతో కూడా సంప్రదించ గలరు. అనుకూల మయిన నిర్ణయము తీసుకోగలరని ఆశిస్తూ వున్నాను. మీ పెద్దలందరికీ నమస్కారములు. భవదీయుడు, ़జె.వి.ఆర్.కె.ప్రసాద़్

ప్రసాద్ గారు, వైజాసత్యగారు చెప్పినది నిజమే. పూర్వీకుల గురించి, గోత్రనామాల గురించి, మీ వంశవృక్షం గురించి వ్యాసాలు వ్రాయడానికి తెవికీ వేదిక కాదు. ఇందులో అందరికీ ఉపయోగపడే విజ్ఞానకరమైన వ్యాసాలు మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. మీరు చేర్చిన సమాచారం మొత్తం త్వరలోనే తొలిగించవలసి ఉంది. ఎందుకంటే తెవికీ నిబంధనలు దీనికి ఒప్పుకోవు. మీరు చేర్చే సమాచారంకై అలాంటి ఉద్దేశ్యం కొరకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏవైనా ఉంటే అక్కడ చేర్చడానికి ప్రయత్నించండి లేదా మీరే ఒక బ్లాగు ప్రారంభించండి. సి. చంద్ర కాంత రావు - చర్చ 07:45, 19 సెప్టెంబర్ 2010 (UTC)

సి. చంద్ర కాంత రావు గారికి నాకు నేనుగా త్వరలో తొలగిస్తాను. కాస్త సమయము ఇవ్వగలరని ప్రార్దన. ़12:37, 19 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద్


నేను చేర్చిన వికీకి అసంబందించిన సమాచారం మొత్తం త్వరలోనే తొలిగించ గలరు. ़13:22, 19 సెప్టెంబర్ 2010 (UTC)~़జె.వి.ఆర్.కె.ప్రసాద్

వికీపీడియా పాఠకునికి ప్రత్యక్షము గురించి

మార్చు
  • మీరు అందరూ సమిష్టిగా అందించే విజ్ఞానామృతభాండాన్ని అందుకోవడము చాలా చాలా కష్టము. అందులో "అణు"వులోని కనీసం "పరమాణువు" లోనయినా మాలాంటి వారు అందుకోవాలని ఆశ, ఆశయము. (ఙా అక్షరము సరిగా వ్రాయలేకపోయాను. తమరు అర్ధము చేసుకోగలరు).
  • ముఖ్యముగా, వికీపీడియా పూర్తిగా తెల్లగా ఉంటున్నది. యెక్కువ సేపు కంప్యూటరు ముందు వుంటే కళ్ళు ఇబ్బంది పెడుతూ వున్నాయి.
  • దీని గురించి అందరూ కూలంకషముగా చర్చలు జరుపగలరు.

़04:19, 20 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద్

ఈ విషయం ఇక్కడ అడగటం సరి కాదు. ఇది కొత్తగా చేసేవాటిగురించి, వికీపీడియా లో మౌలిక మార్పులు గురించి చర్చించాలి. కీ బోర్డు వ్యాసం మీకు ఉపయోగపడవచ్చు. --అర్జున 04:14, 18 అక్టోబర్ 2010 (UTC)

వికీపీడియా సముదాయ పందిరి

మార్చు
  • వికీపీడియా సముదాయ పందిరిలో షోడశ కన్యలు అని వ్రాశి, వారి వివరములు అడిగినారు. దానికి సందించిన లింకు ఇవ్వగలరు.
  • నాకు తెలిసినంత, తెలుసుకున్న, అందుబాటులో వున్న నా పుస్తక గ్రంన్ధములలో వరకు షోడశ అంటే పదహారు. అంటే అవి;
  1. షోడశ మహాదానములు
  2. షోడశ కర్మలు
  3. షోడశ కళాస్థానములు
  4. షోడశ లక్ష్మీ నివాస స్థానములు అని నాకు తెలుసు.
  • వికీపీడియా సముదాయ పందిరిలో షోడశ కన్యలు అని వ్రాశివున్నది మరియు వారి వివరములు అడిగినారు. అందువల్ల మీరు ఎవరైనా.. దానికి సందించిన లింకు ఇవ్వగలరు.

़06:05, 20 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద్జె.వి.ఆర్.కె.ప్రసాద్

ఈ విషయం ఇక్కడ అడగటం సరి కాదు. ఇది కొత్తగా చేసేవాటిగురించి, వికీపీడియా లో మౌలిక మార్పులు గురించి చర్చించాలి. షోడశ కన్యలు వ్యాసం చర్చా పేజీలో చర్చించటం మంచిది.--అర్జున 04:11, 18 అక్టోబర్ 2010 (UTC)
  • అర్జునగారు,
  • వికీపీడియా సముదాయ పందిరిలో షోడశ కన్యలు అని వ్రాశి, వారి వివరములు అడిగినారు. ఒకసారి మీరు సముదాయ పందిరిని చూడండి. మీకు కాస్త అర్ధం అవ్వవచ్చు. మనకు షోడశ కన్యలు మాత్రం లేరు అని అనుకుంటాను. సముదాయ పందిరిలో ఆ పదము ఉండాలంటారా ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:05, 20 అక్టోబర్ 2010 (UTC)

వికీపీడియా పరిధి సమస్త మానవ జ్ఞానం. సముదాయ పందిరిలో రాసినవారికి అవసరమై వుండవచ్చు. దానికి ఎవరూ కొంతకాలం స్పందించకపోతే దానిని తొలగించవచ్చు. -- అర్జున 03:05, 16 నవంబర్ 2010 (UTC)

తెలుగు విక్షనరీ

మార్చు

తెలుగు విక్షనరీ లోని పదములకు బొమ్మలు మాత్రము తెలుగు వి అయితేనే బావుంటుందని నా మనవి. కాస్త అలోచించ గలరు. ़08:19, 20 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద్

అంగీకరిస్తాను. కాని తెలుగు వారి బొమ్మలు కామన్స్ లో ఎక్కువగా లేవు.--అర్జున 03:57, 18 అక్టోబర్ 2010 (UTC)

PMGSY కోడు [2]

మార్చు

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పట్టిక లో ఇచ్చినారు. అందులో జిల్లాలకు ఇచ్చినవి సరి అయినవేనా అని చిన్న అనుమానము. ़జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:46, 20 సెప్టెంబర్ 2010 (UTC)़़జె.వి.ఆర్.కె.ప్రసాద్

మీ వ్యాఖ్యని విశదపరచండి, వ్యాసాలకి లింకులు ఇవ్వండి.--అర్జున 04:01, 18 అక్టోబర్ 2010 (UTC)
  • అంటే క్రిష్ణ జిల్లాకు ఎ.పి.16 అని వుంటుంది కదా! ఆ PMGSY కోడు [2] లో ఇచ్చిన కోడ్ నంబరులు ఒకటా లేదా వేరు వేరునా అని నా అనుమానము.
వివరము సరిపోలేదు. వ్యాసాల లేక అంతర్జాల లింకులు ఇవ్వడం మరిచినట్లున్నారు ..--అర్జున 03:51, 19 అక్టోబర్ 2010 (UTC)
  • అర్జునగారు,
  • నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. జనాభా కోసము ఎ.పి.16 అని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమము కొఱకు ఇచ్చిన కోడ్ వేరు అని తెలిసింది. మీకు ధన్యవాదములు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:22, 19 అక్టోబర్ 2010 (UTC)

జ్యోతిష్యం

మార్చు

జ్యోతిష్యం విభాగము లోని సమాచారాన్ని కొన్ని వర్గాలుగా విభజీంచాలి. జ్యోతిష్యం గురించి ప్రస్థావన చేసి, ఆ తరువాత ఒక్కొక్క విభాగముగా విషయాన్ని విడదీయాలి. యెవరి అభిప్రాయ పద్దతుల గురించి ఆ విభాగములో విడి విడిగా యెవరికి వారు చేర్చటానికి అవకాసము వుంటుంది. ఆచరించి అనుసరింఛే పద్దతులు ప్రదేశాన్ని బట్టి మారుతూ వుంటాయి కదండి. అయినా ఒకేచోట సమాచారాన్ని వుంచితే కొత్తగా ప్రవేశపెట్టేందుకు బ్రొజరు భవిష్యత్తులోఅంగీకరించదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:45, 1 అక్టోబర్ 2010 (UTC)

మీరే చొరవ తీసుకోవచ్చు. కొత్తపేజీలు సృష్టించి ఇప్పటికే వున్న సమాచారాన్ని చేర్చి విస్తరించి, ప్రధాన పేజీలో కొత్తపేజీకి లింకు చేరుస్తూ సారాంశం వ్రాయండి. ఆ వ్యాసం చర్చా పేజీలో ఇంకా చర్చించండి.--అర్జున 04:07, 18 అక్టోబర్ 2010 (UTC)

వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు

మార్చు

విక్షనరీ లోని వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు అన్ని పుటలు తనిఖీ ప్రాధమిక స్థాయిలో ఈ రోజున పూర్తి అయినది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:53, 10 అక్టోబర్ 2010 (UTC)

ధన్యవాదాలు. ఈ విషయం విక్షనరీ రచ్చబండలో చేర్చకపోతే చేర్చండి. తరువాత పని ప్రతిపాదన వివరాలున్నప్పుడు ప్రతిపాదన పేజీలో వ్రాయటం బాగుంటుంది. లేకుంటే వార్తలు విభాగంలో మంచిది.. అర్జున 05:16, 11 అక్టోబర్ 2010 (UTC)
విక్షనరీ లో కూడా చేర్చాను. ప్రతిపాదన పనులు అక్కడ యేమిటొ తెలియడము లేదు. విక్షనరీ కి వాడుకరులు అంతగా హాజరు కావటములేదు. నాకు వేరే లింకు పేజీలను కేటాయించారు. వాటి గురించి మీరు కాస్త తెలియజేగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:48, 11 అక్టోబర్ 2010 (UTC)
విక్షనరీ లో రచ్చబండ ఒకే పేజీగా వుంది. అక్కడే వ్రాయవచ్చు. ఇక వాడుకరులను ఎలా పెంచాలా అన్న సమస్య కి పరిష్కారము అంత సులభం కాదు. ప్రస్తుతానికి విక్షనరీలో జరుగుతున్న పని గురించి, వికీపీడియా రచ్చబండ వార్తలు పేజీలో అప్పుడప్పుడు పంచుకోవడము చేయవచ్చు. కంప్యూటర్లో తెలుగు ప్రామాణీకత గురించిన స్థానికీకరణకు తరచూ వాడే పదాలు (Frequently used entries for localization (FUEL) )ప్రాజెక్టుకి అనుబంద నిఘంటువుగా విక్షనరీని ప్రతిపాదించి పనిచెయ్యాలి. వచ్చే నెలలో కొంత ఆ దిశగా పనిజరగవచ్చు.-- అర్జున 03:51, 12 అక్టోబర్ 2010 (UTC)

telugu calender

మార్చు

తెలుగు కాలెండర్ వ్యాసం

వికీపీడియా:కోరుచున్న వ్యాసములు లో చేర్చబడినది.--అర్జున 03:55, 18 అక్టోబర్ 2010 (UTC)

ప్రయోగశాల

మార్చు
  • ప్రయోగశాలలో కొన్ని రోజులుగా ఒక వ్యాసము ఉన్నది. దానిని దారి మార్పు చేయగలరు.
  • సూచన: ప్రయోగాశాల లోని పుటని ఖాళీగా వుంచగలరు. లేదా మరో తెల్లగా (ఖాళీగా) వుండే పుటను కేటాయించ గలరు. విక్షనరీ లో కూడా తెలుగులో ప్రత్యేక ఒక పుటను వ్రాసుకునేందుకు వీలు కల్పించగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:24, 18 అక్టోబర్ 2010 (UTC)

ప్రయోగశాల పేరుకుతగ్గట్టు ప్రయోగ శాల మాత్రమే, దానిలో పరీక్షించన వాళ్లు వ్యాసంలో పెట్టగలరు. వ్యక్తిగత ప్రయోగశాలకోసం మా సభ్యపేజీలో మార్చి [[/నా ప్రయోగశాల]] వ్రాసి సరిచూసినప్పుడు కనబడేలింకుకు వెళ్లడం ద్వారా వ్యాసాన్ని సృష్టించవచ్చు.--అర్జున 03:48, 18 అక్టోబర్ 2010 (UTC)
  • ప్రయోగశాలలో కొన్ని రోజులుగా ఒక వ్యాసము ఉన్నది. ఆ వ్యాసాన్ని వ్రాసిన వారు ఎవరో తెలియదు కదా ! మరి ప్రయోగశాల వేరే ఎవరైనా ఎలా వాడుకోవాలి ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:38, 18 అక్టోబర్ 2010 (UTC)

ని రభ్యంతరంగా వాడుకోండి, దానిలోని విషయాన్నంతా మార్చవచ్చు, ప్రయోగశాల కదా? --అర్జున 03:34, 19 అక్టోబర్ 2010 (UTC)
  • అర్జునగారు,
  • ప్రయోగశాల కంటే ఖాళీపుట ఖాళీదస్త్రం తెల్లపుట కొత్తపుట అనే అర్ధము వచ్చు విధముగా ఉంటే బావుంటుందేమో ఒకసారి పెద్దలు అలోచించగలరు. మీకు, ప్రయోగశాల గురించి నా దుగ్ధ (సందేహము) తీర్చినందులకు మరో ధన్యవాదము.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:28, 19 అక్టోబర్ 2010 (UTC)

ప్రయోగశాల మూస తెలుగు వికీపీడియా లో ఇంకా చేయలేదు. దాని ద్వారా వాడే వారికి సరియైన సూచనలు ఇవ్వవచ్చును. ప్రస్తుతానికి మామూలు పాఠంతో సూచనలు రాశాను, చూడండి. మీ సందేహం వెలిబుచ్చటం ద్వారా తెలుగు వికీ లో అవసరమైన మార్పులకు దోహదం చేసినందులకు ధన్యవాదాలు. -- అర్జున 00:09, 20 అక్టోబర్ 2010 (UTC)
  • చూసాను. మరి కొన్ని అవసరమయిన సలహాలు మాలాంటి వారు కూడా అక్కడ వాడుకరుల కోసము పొందు పరచ వచ్చంటారా ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:15, 20 అక్టోబర్ 2010 (UTC)

ఇంగ్లీషు వికీపీడియా లో మూస చూసి అదే ప్రకారం తెలుగులో చేయవచ్చు. మూసలు తయారుచేయటం, మార్చటానికి కొంత సాంకేతిక నిపుణత కావాలి. నేర్చుకొని ఎవరైనా చేయవచ్చు.--అర్జున 09:09, 20 అక్టోబర్ 2010 (UTC)

వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా...

మార్చు

వీకీపీడియా తెలుగు నిర్వాహకులారా.. మీక రోషం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. మీరు వీకీపీడియా తెలుగు నిర్వాహకులు కావడానికి మీకున్న అర్హతల గురించి నేను ప్రశ్నిస్తున్నాను. రోజూ వీకీపీడియాలోకి ప్రవేశించడమా...??? లేక.. రోజువారీగా పనీపాట లేని ఉబుసుపోక చర్చల్లో మరింత చురుగ్గా పాల్గనడమా..????? అన్నాను అని కాదు... ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. తరతరాలకు ఉండేవిధంగా చక్కటి తెలుగు విజ్ఞానబాండాగరంగా వీకీపీడియాను తీర్చిదిద్దాలని.. మా ఆశ( కచ్చితంగా మీ ఆశ మాత్రం కాదు.. ) సంఖ్యాపరంగా పరిగెడుతున్నాం.. అని మీరు బాగా చంకలు కొట్టుకుంటున్నారు. తప్ప... ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి ఒకడు.. బూతు బొమ్మలతొ ఆ0గ్ల భాష ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు. మరొకడు.. రోజూ మరే పనిలేదంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.

ఇక గూగుల్‌ వారి సంగతి చెప్పనక్కరలేదు. స్వకార్యం, స్వామి కార్యం రెండూ నెరవేరినట్లు.. ఛారిటీ పేరిట.. గూగుల్‌ వికీపీడియా తెనుగీకరణ అంటూ.. అమెరికా సామాజ్య్రవాద భావజాలాన్ని భారతదేశం దశదిశలా వ్యాప్తి చెందేలా.. యాంత్రిక అనువాదాలు జరుపుకుంటే... గౌరవనీయులైన తెలుగు వీకీపీడియా నిర్వాహకులారా... గూగుల్‌ తెలుగు సంస్కృతి పై సాగుతున్న దండయాత్ర కనపడలేదా...???? 'ఇక గూగుల్‌ గోల ఒక్కటైతే.. యాంత్రిక అనువాదాలు చేసేవారి గోల మరొకటి.'

అస్సలు అది తెలుగేనా...????

మీరు ఒప్పుకుంటారో లేదో.. కానీ.. పట్టుమని పదోక్లాసు పాసుకాని వ్యక్తి కూడా.. అది తెలుగు కాదు.. తెలుగుకు పట్టిన తెగులు అని ఢంకా భజాయించి మరీ చెబుతాడు. ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు. గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది. చేవ లెని వారు మాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు. మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట. ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...? మనమేమైనా అర్థనారీశ్వరులమా... ? మనభాషను మనం కాపాడుకోలేమా..?? మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????

కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...

తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు. ఏమంటారు.. మనం బెంగాలీల బాట ఒక్క వారం రోజులు పడితే చాలు.. యాంత్రిక అనువాదాల పేరిట వచ్చే కథనాలను డిలీట్‌ చేస్తే.. అప్పుడు గూగుల్‌వారికి బుద్ధి వస్తుంది. అలాగే సింగిల్‌ లైన్‌ వార్తలనూ డిలీట్‌ చేస్తాం అని చెప్పి.. నాలుగు రోజులు సమయం ఇవ్వండి. మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి.. లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..
ఇక్కడ వరకూ రాసిన సభ్యుడి కోసం ఇక్కడ నొక్కండి


  • అర్థనారీశ్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈశ్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి ఈ పదం వాడతారు. శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --శశికాంత్ 11:49, 3 నవంబర్ 2010 (UTC)
    • నేను తెలుగు కాలెండర్ ప్రకారం ప్రతి రోజుకు ఒక పేజీ తయారుచేస్తున్నాను. ఇది స్వచ్ఛమైన తెలుగుతనానికి ఉదాహరణ. ఈ కాలెండర్ ప్రకారం ప్రతి రోజు వచ్చే పండగలను చేరుస్తాను. అందుకు కావలసిన పుస్తకాలు నా వద్ద ఉన్నాయి. ప్రముఖుల జీవితచరిత్రలు మీరెవరి దగ్గరైనా ఉంటే వారి పుట్టిన మరియు మరణించిన తిథుల్ని వీటిలో చేర్చమని మనవి. 1947కు ముందు బ్రిటిష్ వారు రాకపూర్వం తేదీలంటే ఈ తెలుగు కాలెండర్ ప్రకారం మాత్రమే చూసుకొనేవారు. ఇప్పుడు అవేమిటో కొందరికి తెలియదు.Rajasekhar1961 14:15, 3 నవంబర్ 2010 (UTC)
  • రాజశేఖర్ గారూ , మీ కృషి అభినందనీయం. నాకు ప్రస్తుతం వార్షిక పరీక్షలు ఉన్నాయి. పూర్తవ్వగానే నేనుకూడా ఇందులో పాలుపంచుకుంటాను. ఇందులో చారిత్రిక సంఘటనలు, వర్తమానంలో జరుగుతున్న విశేష సంఘటనలు కూడా చేరుద్దాం. ఆంగ్ల క్యాలండర్ కు ధీటుగా తయారుచేద్దాము. ఇప్పటికీ మనం నిత్యజీవితంలో చాలా శుభకార్యాలకు మరియు ఇతర పనులకు ముహూర్తాలు నిర్ణయించడానికి ఈ క్యాలండరే వాడుతున్నాం. కనుక ఈ కృషి వృధా కాదు. --శశికాంత్ 14:31, 3 నవంబర్ 2010 (UTC)
  • రాజశేఖర్ గారూ మీకృషి ప్రశంశనీయమైనది. నాకు తెలిసిన విషయాలు నేనూ చేరుస్తాను. --t.sujatha 16:42, 3 నవంబర్ 2010 (UTC)
యాంత్రిక అనువాద వ్యాసాలపై ఇది వరకు చాలా సార్లు చర్చ జరిగింది. ఆ వ్యాసాలు చాలా సభ్యులకు రుచించడం లేదు కూడా, కాని ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అలాంటి వ్యాసాల సంఖ్య వృద్ధి అవుతూనే ఉంది. కొత్త వ్యాసాలే కాదు ఎంతో కష్టపడి, ఎందరో సభ్యుల కృషి వల్ల చక్కగానే వృద్ధి చెందిన వ్యాసాలపై కూడా యాంత్రిక వ్యాసాలు ఓవర్‌టేక్ చేశారు. ఇదే విషయం నేను ఇదివరకు తెలియజేశాను. సభ్యులు ప్రతిస్పందించకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. తెవికీలో నిర్వాహకులు స్వయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోరు, ఏది చేసిననూ పాలసీలు, సంప్రదాయాల ప్రకారము కాని, ప్రజాస్వామ్య పద్దతిలో సభ్యుల అంగీకారం ప్రకారం కాని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది నిర్వాహకుల తప్పిదం అని చెప్పడం సరికాదు, సభ్యులందరూ దీనిలో భాగస్వామ్యులే. నిర్వాహకులకు మామూలు సభ్యుల కంటె అనుభవం ఉంటుంది, ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడంతో కొత్తసభ్యులకు తోడ్పడతారు. కొత్తగా చేరిన సభ్యుడైననూ, సంవత్సరాల అనుభవం ఉన్న నిర్వాహకుడైననూ ప్రస్తుతమున్న పాలసీల ప్రకారం ఓటింగ్ నిర్ణాయకంలో ఇద్దరూ సమానమే. కొత్త సభ్యులైననూ నిస్సందేహంగా ప్రస్తుత లోపాలను సరిదిద్దడానికి చర్చలు లేవదీయవచ్చు. మీరు యాంత్రిక వ్యాసాలు తదితర విషయాలపై చర్చ తీస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్వాహకులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:00, 3 నవంబర్ 2010 (UTC)


ముందుగా శశికాంత్‌ గారికి ధన్యవాదాలు. నా ప్రతిపాదనపై చర్చ లేవదీసినందుకు... అయితే శశికాంత్‌ గారు మూల విషయాన్ని పక్కనబెట్టి.. అర్థనారీశ్వరులన్న పదంపై దృష్టి సారించి మీరు ప్రత్యుత్తరం ఇవ్వడం కోడిగ్డుపై ఈకలు పీకడం..లాంటిదే. మీరన్నట్లు.. మీరు సూచించిన పదాన్ని ఉపయోగిద్దాం. నో ప్రాబ్లమ్‌... అర్థనారీశ్వరుడున్నదన్ని బూతు అర్థం ధ్వనించే విధంగా నేను ఉపయోగించలేదు. ఇది పూర్తిగా మీ తెలియనితనం. అక్కడ చేతగాని వారు, లేదా ఏ పనిని పూర్తిగా చేయలేనివారని తెలియజెప్పే వ్యంగ్యప్రయోగం. ఇక ఆ పదం గురించి చర్చ కొనసాగిస్తే.. పుంఖానుపుంఖాలు రాయాల్సి ఉంటుంది. శశికాంత్‌గారు... మొత్తం నా ప్రతిపాదనలో భావం మీకు అర్థం అయి ఉంటుందని భావిస్తున్నాను. అపరిపక్వ అనువాద వ్యాసాలు, గూగుల్‌ చేస్తున్న సాంస్కృతిక దాడిని, అల్లరి చిల్లరగా ఒక్కొక్క వాక్యం రాసే వారిని ఏరిపారేయాలనేది నా ప్రతిపాదన.

ఇక వీకీపీడియాకు కొత్త వాడకరిని మీరు నా గురించి ప్రస్తావించారు. దీనికి కొలమానం ఏమిటండి..? వీకీపీడియలో రోజూ లాగిన్‌ అయితే పాత లేక పోతే కొత్తా... ??? లేక మరేదయినా ఉందా...?

ఇక చంద్రకాంతరావుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రకాంతరావు గారు.. మీరన్న విషయాలను కొన్నింటిని ఏకీభవిస్తాను. మరికొన్నింటితో విబేధిస్తాను. అనువాద వ్యాసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీరు పేర్కొన్నారు. గూగుల్‌ వారి అనువాద వ్యాసాలు ప్రారంభమై.. ఇప్పటికి 18 మాసాలు కావొస్తోంది. ఒక పక్క సాంస్కృతి దాడి.. మరో పక్క వ్యాపార దృక్పథంతో..అక్షరం అంటే తెలియని బీపీవోలు... కోట్ల రూపాయలు అర్జిస్తూ... (నిజంగానే ఈ అనువాదాలపేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి) తెలుగు వీకీపీడియాను కలుషితం చేస్తుంటే.. నిర్ణయం తీసుకోలేదంటున్నారు.. ఈ అలసత్వానికి కారణాలు ఏమిటో..??? సభ్యులు ప్రతిపాదించకపోవడంతో...నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్నారు. నేనూ సభ్యుడినే...( కాదంటారా.. దానికేమైనా ప్రమాణాలున్నాయా) ఇప్పుడు నేను ప్రతిపాదిస్తున్నాను. అనువాద వ్యాసాలు, ఏక వాక్య వ్యాసాలపై కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రకాంతరావుగారు.. దీనిపై చర్చను ముందుకు తీసుకెళ్లాల్సినదిగా అభ్యర్థిస్తున్నాను. అయితే రావుగారు.. మరో విషయం..

తెవికి నిర్వాహకుల నుంచి వచ్చే పడికట్టు సమాధానాన్ని ముందుగానే ఇక్కడ పొందుపరుస్తున్నాను. గతంలోనూ ఇదే విధమైన సమాధానాలు రావడంతో... వారికి ఆ సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా.. దానిపై మరో ప్రశ్నను సైతం లేవనెత్తుతున్నాను. వారి సమాధానం( ఊహించి...) అలాంటి అనువాద వ్యాసాలన్నింటిని.. యాంత్రిక అనువాదాల కింద పెడుతున్నాం. ఆసక్తికరమైన వారు వీటిని శుద్ధి చేసి.. వాటిపైన ఉన్న యాంత్రిక అనువాదాల మూసను తొలగించమని కోరుతున్నాం. వీలైనంత వరకు మాకు మట్టుకు మేము.. కొన్నింటిని సంస్కరిస్తున్నాం. ఎంత సిగ్గు చేటు... అవి యాంత్రిక అనువాదాలా...???? ఎవరైనా కొత్త వ్యక్తి చూస్తే.. నిజంగానే యంత్రాల ద్వారా వాటిని అనువదించారేమో అని అనుకుంటున్నారు. భావదారిద్య్రానికి పరాకాష్ట.. అది యాంత్రిక అనువాదం కాదు.. గూగుల్‌ వారు..కేవలం కాసులకు ఆశపడి.. నిర్లక్ష్యంగా.. తెంపరితనంతో.. వచ్చీరానీ తెలుగులో.... అడ్డూ అదుపు లేకుండా చేసిన అనువాదాలు.. అని పెట్టలేమా...? ఇక మనం ఎందుకు వాటిని శుద్ధి చేయాలండి.. చంద్రకాంతరావు గారు.. రుసుము తీసుకొని అనువదించే వారు మనలాంటి ఔత్సాహికులకన్నా.. మరింత బాధ్యతతో వాటిని అనువదించాలి. వారు పని జవాబుదారీగా ఉండేవిధంగా.. తెవికి నిర్వాహకులు వ్యవహరించాలి కదా.. ఆ బాధ్యత నెరవేర్చనప్పుడు నిర్వాహకులనే పదానికి అర్థం ఏమిటో..????

నేను ఎక్కువగా యాంత్రికానువాద వ్యాసాలు చదవలేదు. నేను చదివిన వ్యాసం డిబేట్ నాణ్యత బాగనే వుందనిపించింది. ఇటీవలి సమాచారం ప్రకారం గూగుల్ తమిళ వికీ సముదాయ విమర్శలకు స్పందిస్తోంది. వారికి వున్న పరిమితులకారణంగా, తమిళ వికీ సంప్రదింపులతో విధానాలను మెరుగు పరిచి ఆ తరువాత తెలుగు వికీ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పారు. మీరు దీనిలో పాల్గొనదలచుకుంటే మీ వివరాలు తెలియచేయండి. ఇకపై వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు ప్రాజెక్టు పేజీలో చర్చని కొనసాగించండి. ఇక మొలకలు గురించి వికీ సముదాయం లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది కొత్త వ్యాసాలకు ప్రేరణనిస్తాయని అంటుండగా, వికీ నాణ్యతని దెబ్బతీస్తాయని మరికొందరి వాదం. ప్రతీ వ్యాసం చిన్న వ్యాసం లేక మొలకగా ప్రారంభమై ఆ తరువాత కాలానుగుణ మార్పులు చెందుతూ మంచి వ్యాసంగా రూపుదిద్దుకుంటుందని తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తి మొలకలు మాత్రమే సృష్టించటం కాక, కొన్నిటినైనా విస్తరించటానికి పనిచేస్తుంటే వారిని ప్రోత్సహించడం అవసరం. ఏ నిర్ణయమైనా తీసుకోటానికి, అమలుచేయటానికి పరస్పర గౌరవంతో ప నిచేసే క్రియాశీల సముదాయం అవసరం. దానిని పెంచడానికి మీతోడ్పాటు ఇవ్వండి. -- అర్జున 05:51, 14 నవంబర్ 2010 (UTC)

శశికాంత్ యేమకుంటున్నారు ?

మార్చు
  • శశికాంత్ గారు,
  • షోడశ కన్యలు లేవని నేనే తెలియజేశాను.
  • మీరు వ్రాశినది ఇప్పుడే చూశాను. మీ పద ప్రయోగాలు చూసి చాలా మనసు బాధ వేసింది. అటువంటి పదాలు వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఇక ముందు అలోచించండి.
  • నేను చేరిన కొత్తలో తెలియక వంశవృక్షాలు గురించి వ్రాసాను. అటువంటివి వ్రాయకూడదని చెప్పారు, ఆ తరువాత తీసివేయటము జరిగింది. యెప్పుడో జరిగిన దానికి గురించి ఇప్పుడిక్కడ ప్రస్తావించటము దేనికీ ? వెంటనే తగిన విధముగా క్షమాపణలు చెప్పండి. హిందువుల వంశవృక్షాలు అంటే మీకు అంత తేలికగా వుందా ? అదియును గాక వ్యక్తి గతముగా నన్ను విమర్శించటములో అర్ధము యేమిటి ?
  • మీ గురించి మీరు యేమని అనుకుంటున్నారు ? కనీసము నా వయసును అయినా దృష్టిలో యెందుకు పెట్టుకోలేదు ?
  • తెలుగు విక్షనరీలో మీరు చేసే ఘనకార్యాలేమిటో తెలియంది కాదు. ముందు మీ గురించి ప్రశ్నలు వేసుకొండి.
  • ఇప్పటి వరకు అన్ని వికిలలో యే రకములుగా మీరేం ఉద్ధరించారో తెలియ జేస్తే ఆ తరువాత అందరూ చర్చలు చేయవచ్చును.
  • ఈ నా జాబు చదివిన వారు వెంటనే తెలుగు విక్షనరీ తప్పకుండా వీక్షించండి.
  • నాతొ చర్చ చేయాలనుకుంటే యెప్పుడైనా, యెక్కడైనా, యెలాగైనా, యెంతసేపైనా, యెన్నిరోజులయినా చేస్తాను. (ఇక్కడ అనవసరము అనుకుంటాను.)
  • శశికాంత్ వెంటనే క్షమాపణలు చెప్పండి. లేనియెడల మీ ఆశ, ఆశయము ప్రకారము ఈ విషయాన్ని నేను అంత తేలికగా మాత్రము తీసుకోను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:20, 14 నవంబర్ 2010 (UTC)

శశికాంత్ దాష్టీకం

మార్చు

Rajasekhar1961 గారికి,

  • మీరంతా శశికాంత్ దాష్టీకానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. తనది చాలా పొరపాటు. తనకి భేషజము యెక్కువలా వున్నది.
  • ఇక్కడకు వచ్చే వాళ్ళను కూడా రానీయకుండా చేసే ప్రయత్నములా వుంది.
  • తన లాగే మరికొందరు ముందు ముందు అదే ఆవేశ బాటలో నడిచే ప్రమాదము ఉన్నది.
  • చర్యలు తీసుకోవటములో తప్పులేదు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:41, 14 నవంబర్ 2010 (UTC)

గమనించగలరు

మార్చు

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:17, 15 నవంబర్ 2010 (UTC)

జ్యోతిష్యము

మార్చు
  • లగ్న స్థానము నుండి ద్వాదశ స్థానముల 12 రాశుల్లో వున్న గ్రహ గతుల ననుసరించి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రస్తుతము నడుస్తున్నకొన్ని జాతక వివరములు వారికి సంబందించిన వివరములు చూడకుండా కూడా తను, షష్ట, వ్యయ, తదితర స్థానములు, గురు, చంద్ర, కుజ గ్రహగతులను బట్టి చెప్పవచ్చండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:29, 15 నవంబర్ 2010 (UTC)

ఏమి జరుగుతోందో తెలియట్లేదు...

మార్చు

ప్రసాదు గారూ, నా మీద చాలా ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ముడు, నాలుగు రోజుల నుండీ వికీపీడియాకి రావట్లేదు. నేను చేసిన తప్పు కాస్త వివరించగలరు. నాకు తెలిసి ఎవరినీ (ముఖ్యంగా మిమ్మల్ని) నేను ఎప్పుడూ అభ్యంతరకరంగా మాట్లాడలేదు. తొందరపడి ఆరోపణలు చేయకుండా కాస్త ఒకసారి సరిచూసుకోవాలని మనవి. నా వల్ల కలిగిన ఇబ్బంది ఏమిటో కాస్త వివరణ ఇవ్వండి. తప్పకుండా మీకు సహకరించగలను. --శశికాంత్ 17:19, 15 నవంబర్ 2010 (UTC)

అర్థం అయ్యింది బాబోయి....

మార్చు

మీరు చాలా పెద్ద పొరబాటు చేశారు. వేరే అజ్ఞాత సభ్యుడు అధికారులను బండ బూతులు తిడుతూ రాసిన దానికి నేను అందరికంటే ముందుగా నా సంతకంతో జవాబు ఇవ్వడంతో పైనది రాసింది కూడా నేనే అనుకుని పొరబడి నన్ను మీరందరూ అపార్ధం చేసుకున్నారు. మీరు కాస్త చరిత్ర పేజీ గమనిస్తే ఆ అజ్ఞాత సభ్యుడి బూతు పురాణం ఖండించిన మొదటి వ్యక్తిని నేనే అని మీకు అర్థం అవుతుంది. అలా తిట్టిన వ్యక్తి ఇదుగో ఇతడు..ఇక్కడ నొక్కండి.. ప్రసాదు గారూ, మీ జవాబు కోసం వేచి చూస్తున్నా... --శశికాంత్ 17:28, 15 నవంబర్ 2010 (UTC)

శశికాంత్ గారు బాధ పడకండి

మార్చు
  • మీరు ముందు ప్రశాంతముగా వుండండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది.
  • జమ్ బో జాయిను అయినది 3.11.2010, దానికి అంగీకార పత్రము మీరే అతనికి పంపించారు. అదే రోజు ఎంతో అనుభవము వున్న వాడిలా అందరి మీద అంత పెద్ద విమర్శలు చేయడము. లింకు చూడండి: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Jambo

(తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png శశికాంత్ 11:51, 3 నవంబర్ 2010 (UTC))

  • జంబో విమర్శ మొదటి సమయము:16:16, నవంబర్ 3, 2010 (తేడాలు • చరితం) చి వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) ‎ (→వీకీ పీడియా
  • జంబో విమర్శ చివరి సమయము: 10:13, నవంబర్ 4, 2010 (తేడాలు • చరితం) వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) ‎ (→వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా...)
  • దీన్ని బట్టి జాయిన్ అయిన రోజునే అంతలా విమర్శలు చేశాడంటే కేవలము అందు కోసమే అని స్పష్టముగా అర్ధమవుతున్నది. విమర్శల కోసం జంబో వచ్చాడు. శశికాంత్ అనుమతివ్వడము జరిగింది.
  • శశికాంత్ జవాబు సమయము: --శశికాంత్ 11:49, 3 నవంబర్ 2010 (UTC)
  • జంబో అడ్రస్సు ఇప్పటికయినా యెవరికయినా తెలుసాండీ ?
  • శశికాంత్ గారు మీకు ఇచ్చిన విషయాలన్నీ జంబోని మీరు ప్రశ్నించండి.
  • పనులు యేమీ చేయని వారు పనికి రాని ప్రశ్నలు వేస్తునే వుంటారు. అలాంటి వారికి జవాబులు చెప్పనవసరము లేదు. వున్న కాస్త సమయము నలుగురికి వుపయోగించుదాము.
  • మన వికీలు అర్ధము చేసుకుంటారు మీ నిజాయితీని, మీకెందుకు చింత.
  • చాలా మంది మన వారి మనసుల్లోని భావాలు అర్ధం చేసుకుంటున్నారు.
  • అడ్రసులు లేని వారితో వచ్చే సమస్యలు ఎలా వుంటాయో, ఎలాంటి నీలాపనిందలు వస్తాయో, ఒకరొకరి మనసులు బాధలు పడతాయో గ్రహించాము. దీనికి పరిష్కారము చూడవలసిన అవసరము ఎంతైనా వుంది.
  • ఎవరో వ్రాశిన దానికి మీరు ఇక్కడకు కావాలని రాకపోతే అది చాలా పొరపాటు.
  • సలహాలు, సూచనలు, పదాల రూపంలో పలకరింపులు, ఇలా అందరూ మాట్లాడుకోవాలి.
  • అందరము ఒకే ఆశ, ఆశయాలతో పని చేస్తున్న ఎందరో మహానుభావులు వున్నారు.
  • ఇంతటితో ఈ విషయాన్ని దయచేసి అందరూ మరచిపోగలరు.
  • సదా మీ అందరి శ్రేయస్సును, అభివృద్దిని కోరుకుంటూ.............

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 19:00, 15 నవంబర్ 2010 (UTC)

నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంకా నన్నే అనుమానిస్తున్నారు. మీకు ఇక్కడ అనుభవం లేక త్వరగా మీ తప్పు మీకు అర్థం కావట్లేదు. మీరు బేషరతుగా మీ ఆరోపణలని ఉపసంహరించుకోవాలి. ఈ కింది విషయాలు గమనిస్తే మీకే అర్థం అవుతుంది.
* శశికాంత్ అనుమతిచ్చాడు అంటున్నారు. ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతీ తీసుకోనక్కరలేదు. కొత్తగా వచ్చిన వాడుకరికి అతడి చర్చా పేజీలో స్వాగతం మూస ఉంచుతారు. జంబో గాడికే కాదు , నేను చాలా మందికి ఇలా పంపాను. ఇక్కడ చూడండి. స్వాగతం మూసలు పెట్టినవి చూడండి. . ఉదాహరణకి వాడుకరి చర్చ:Ngunturu వాడుకరి చర్చ:Anandrao వాడుకరి చర్చ:Rajeshyadav వాడుకరి చర్చ:Swamyrepalle వాడుకరి చర్చ:Gaddambobby వాడుకరి చర్చ:Srinu512 వాడుకరి చర్చ:Prashanth Reddy వాడుకరి చర్చ:Sitaramarajuadimalla ఇంకా అనేక మందికి వికీలో చేరినప్పుడు స్వాగతం మూసలు పెట్టాను. అంతేగాదు, మీ చర్చా పేజీలో కూడా మీరు చేరిన రోజున అర్జున గారు ఇలాంటి మూసనే పెట్టారు.
* ముందు మీరు పూర్తిగా చదివిన తర్వాత రాస్తే బాగుంటుంది. ఇది పూర్తిగా చదవండి. ఆ జంబో గాడి బూతు పురాణం మొట్టమొదట వ్యతిరేకించిందే నేను. అసలు నాకు అప్పటికీ అనిపించింది, నాకెందుకులే అని. కాకపోతే అర్థనారీస్వరుడు అన్న పదాన్ని జంబో గాడు ఒక బూతుపదంగా వాడేసరికి నేను ఆపుకోలేక దానికి జవాబు రాశాను. ఇక్కడ హిందువులను కావాలని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలన్నిటినీ వ్యతిరేకిస్తూనే ఉంటా. మీరు కూడా ఒకసారి పొరబాటున ఊర్వశి వేశ్య అన్నందుకు మిమ్మల్ని వ్యతిరేకించాను. కాకపోతే తర్వాత తెలిసింది , అది వేరే ఎవరో అజ్ఞాత సభ్యుడు చేసిన నిర్వాకం అని.
ఇంతకంటే వివరంగా చెప్పాలంటే నా వల్ల కాదు. మిగతా నిర్వాహకులూ , వాడుకరులూ కాస్త ప్రసాదు గారికి అర్థం అయ్యేలా చెప్పగలిగితే సంతోషం. ఏది ఏమైనా , మీరు ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి.
జాయిన్ అయిన రోజునే జంబో విమర్శలు చేసాడు అన్నారు. నిజమే. కానీ మీరు ఒక విషయం గమనించాలి. కొత్తవాడు గనుకనే ఇక్కడి పరిస్థతి ఎరుగక అంతగా విమర్శలు చేశాడు. అనుభవం ఉన్నవాడికి అన్ని విషయాలు తెలుసుగనక అలా రాయడు. నాకు ఇక్కడ చాలానే అనుభవం ఉంది. మీరు పూర్తిగా చదివి, అర్థం చేసుకుని రాస్తే ఇతరులకు ఇబ్బంది ఉండదు. సగం సగం చదివి రాయకండి. ఆ జంబో గాడు రాసింది , దాని తర్వాత ఏ సభ్యుడు ఎలా స్పందించాడో కాస్త తీరిగ్గా చదవండి.

--శశికాంత్ 01:02, 16 నవంబర్ 2010 (UTC)

జంబో విమర్శలు

మార్చు
  • నేను పూర్తిగా చదివిన తరువాతనే చాలా రోజుల తరువాత ఆ విషయన్నిచూశాను అప్పుడు వెంటనే వ్రాయాలనిపించి వ్రాశాను.
  • మీరు కాదు అని అన్నారు, దానికి విపులముగా వివరణలు కూడా తెలియజేశారు.
  • నేను మిమ్మల్ని ఏక వచనముతో సంభొదించ లేదు.
  • నేను మిమ్మల్ని ఇంకా అనుమానించటము లేదు. జరిగిన విషయాలు తెలియ చేసాను.
  • అనుభవము నాకు లేదు అంటే నాకు అర్ధము కాలేదు.
  • నేను సగం సగం చదివి వ్రాయలేదు. ఇప్పుడు మీరు వ్రాశిన విషయాలలోని ఆంతర్యం మీరు అర్ధం చేసుకుంటున్నారా ? మీ మనసుని స్థిమితముగా వుంచగలరు.
  • మీ పదాలలో కాఠిన్యం కనబడుతోంది.
  • నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగము చేసిన విశ్రాంత ఉద్యోగిని, ప్రపంచ అనుభవానికి తక్కువేమీ లేదు. నాకు ఒకరు చెప్పనవసరము లేదు లెండి. అంత అర్ధము కాని వాళ్ళము కాదు. మీ ప్రస్తుత రచనలు మళ్ళీ మీరే ఒకసారి చూసుకోండి.
  • కొత్త వాళ్ళు కాదు వ్రాశింది. పాత వాళ్ళే కొత్తగా వచ్చి వ్రాశినట్లు వుంది.
  • నేను ఇంతటితో వదిలి వేయటము జరిగిందని ముందే చెప్పాను.
  • అసలు ఆ విమర్శలలోని అర్ధాలు గురించి ఎవరయినా అలోచిస్తున్నారా అని కూడా ప్రస్తావించాను.
  • ఈ విషయములో మిమ్మల్ని మంచిగానే అర్ధం చేసుకున్నాను. నేను అందర్నీ అలానే అనుకుంటాను.
ఇది ఎవరికి సందించినది అయిననూ
  • ఇందు మూలముగా మీ అందరకూ తెలియజేయునది ఏమనగా, శశికాంత్ అనే నా తోటి సభ్యుని మనసు నా అనుమాన పద విషయ వాక్యములతో బాధ కలిగించేటట్లు చేసి ప్రవర్తించి నందులకు బేషరుతుగా, వారి మీద నేను చేసిన అరోపణలు సరి అయినవి కావని, అవి వారు చేసిన వ్యాఖ్యానాలు కావని రూఢిగా సుస్పష్ట దృగ్గోచరమయిన పిదప పొరపాటును ఉపసంహరించు కుంటున్నాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 16 నవంబర్ 2010 (UTC)

ఇందాక మీరు సమయం వివరాలు ఈ విధంగా తప్పుగా రాసారు.
  1. జంబో విమర్శ మొదటి సమయము:16:16, నవంబర్ 3, 2010 ---------- నిజమే
  2. జంబో విమర్శ చివరి సమయము: 10:13, నవంబర్ 4, 2010 ------------ నిజమే
  3. శశికాంత్ జవాబు సమయము: --శశికాంత్ 11:49, 3 నవంబర్ 2010--- అబద్ధం

ఇవి సరైన సమయాలు వరుస క్రమంలో --

  1. 16:16, నవంబర్ 3, 2010 Jambo మొదటి విమర్శ
  2. 16:44, నవంబర్ 3, 2010 Jambo రెండోవ దిద్దుబాటు
  3. 17:19, నవంబర్ 3, 2010 శశికాంత్ మొదటి జవాబు
  • నేను జంబోకి స్పందించిన మొదటిసారి నా పాఠ్యంతో పాటు, అతడు రాసిన దానిలోని అర్థనారీస్వరుడు అన్న అభ్యంతరకర వచనాలను strike చేసాను(ఖండించాను). ఈ విధంగా. అందువల్ల మీరు ఆ పూర్తి పాఠ్యం నేనే రాసాననుకుంటున్నారు.
  • ఇక మీరేమనుకుంటారో మీ ఇష్టం. నేను ఇక స్పందించను.
  • కఠిన పదజాలం వాడానని అంటున్నారు... శశికాంత్ దాష్టీకం అని శీర్షిక ఒకసారి గమనించండి. అంతకన్నా కఠిన పదజాలం నేను వాడి ఉంటే కచ్చితంగా నాదే తప్పు. జంబోవి సమయాలు కాపీ పేస్ట్ చేసారు, మరి నాది మాత్రం అలా చేయకుండా స్వయంగా టైపు చేసారు. పైగా తప్పుగా ఇచ్చారు. ఇందులో ఆంతర్యం ఏమిటో..

--శశికాంత్ 06:37, 16 నవంబర్ 2010 (UTC)

కఠిన పదజాలం

మార్చు
  • నేను వదిలేయండి ఇంతటితో అన్నాను. ఆ తరువాత విషయాన్ని సాగదీస్తూ మీరు చేస్తున్న ప్రయత్నములో వాడిన పదములు గురించి నేను ప్రస్తావించటము జరిగింది.
  • శశికాంత్ దాష్టీకం, అనేది మీరు వివరణ ఇవ్వక మునుపుది. అయినా ఇప్పటికీ కూడా మీ అవేశము తగ్గిందా ? "అర్థనారీస్వరుడు" గురించి పదాల కూర్పు, వ్రాసే పద్దతి, అందులోని వాక్యాలు మొత్తము వివరణ మాత్రము వాడుకరి: Arjunaraoc గారివి. అలానే వున్నాయి. మీ పద ప్రయోగాలు ఆ విధముగా ఉండవు. మీ పదాలాలో కొంత అవేశము (కార్గిల్ యుద్ధాలు గురించి, క్రికెట్ గురించి వ్రాస్తూ వుంటారు కదా), అపరిపక్వత ( అంటే చిన్న వయసు తనము), అస్థిరత్వము ( అంటే మనసు కుదురుగా వుండక పోవటము), ఓరిమి లేకపోవుటము, ఇత్యాది చెప్పుకుంటే చాలా విషయాలు మీ రచనలలో గోచరిస్తూ వుంటాయి. మీ రచనలు చదువుతూ వున్న వారికెవరికైనా రచయితలోని అవేశము స్పష్టముగా గోచరిస్తుంది. ఒక సారి మీవి, Arjunaraoc గారివి మరొకరిని మీ వాళ్ళని (స్నేహితులు) చదవమనండి.
  • లాగాలనుకుంటే సాగదీద్దాము, కాని మీకే సమయము లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంత అవసరమంటారా ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:54, 16 నవంబర్ 2010 (UTC)

ఇక నా వల్ల కాదు. ఎవరైనా తెవికీలో బాగా అనుభవం ఉన్న వారు వీలుంటే కాస్త చొరవ తీసుకుని ప్రసాదు గారికి జరిగింది వివరించగలరని మనవి. ప్రసాదు గారూ, మీరు తెవికీ ని బాగా అర్థం చేసుకుంటే ఇలాంటివి జరగవు. మీకు తెవికీలో అనుభవలేమి వల్ల ఇబ్బంది పెడుతున్నరు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన మీ వాదన సాగుతోంది. నేను ఎన్ని ఆధారాలు చూపించినా వాటిని పట్టించుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా , మీరు నిరాధార నిందారోపణలు చేస్తున్నారు. కొన్నాళ్లు పోతే మీకే వికీ వాడకం అలవాటు అయ్యి అసలు విషయం అర్థం అవుతుంది.

మీరు దయజేసి దీనికి జవాబు రాయకండి, నాకు మళ్ళీ జవాబు రాసే ఓపిక లేదు. ఈసారికి వేరే అనుభవజ్ఞుడికి ఆ అవకాసం ఇద్దాం. --శశికాంత్ 13:04, 16 నవంబర్ 2010 (UTC)

ఇది అర్ధం కాలేదా ?

మార్చు
  • ఇందు మూలముగా మీ అందరకూ తెలియజేయునది ఏమనగా, శశికాంత్ అనే నా తోటి సభ్యుని మనసు నా అనుమాన పద విషయ వాక్యములతో బాధ కలిగించేటట్లు చేసి ప్రవర్తించి నందులకు బేషరుతుగా, వారి మీద నేను చేసిన అరోపణలు సరి అయినవి కావని, అవి వారు చేసిన వ్యాఖ్యానాలు కావని రూఢిగా సుస్పష్ట దృగ్గోచరమయిన పిదప పొరపాటును ఉపసంహరించు కుంటున్నాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 16 నవంబర్ 2010 (UTC)

  • నన్ను ప్రతిసారి అంటూ వుంటే నేను అసలు ఊరుకోను. నాకెందుకు సలహాలు, పద్దతులు చెప్పటము ?
  • తప్పకుండా జవాబు ఇస్తాను.
  • నాతో వాదన మీకు శూన్యమే.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:27, 16 నవంబర్ 2010 (UTC)

  • ఎహె, అసలు మీ చాదస్తంతో చంపేస్తున్నారు. నాకు సహనం పోయింది. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి. ఎవడో బూతులు తిడితే నేనా బాధ్యుడిని. వెళ్ళి వాడి మీద పడండి. మీ వాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోమంటే, మీరు దానికి అనుమానాలు జోడిస్తూ ఏదో జాలి చూపించినట్టుగా ఒక ముష్టిలో సారీ నా మొహాన పడేసారు. దాని వల్ల నేను మళ్ళీ ఎంతో సహనంతో మీ అనుమానాలు తీర్చడానికి ప్రయత్నిస్తే అవేమీ పట్టించకోకుండే ఎదేదో రాస్తున్నారు.

అనుమానాలు లేవంటూనే ఇలా ఎందుకు రాసారు...

"అర్థనారీస్వరుడు" గురించి పదాల కూర్పు, వ్రాసే పద్దతి, అందులోని వాక్యాలు మొత్తము వివరణ మాత్రము వాడుకరి: Arjunaraoc గారివి. అలానే వున్నాయి. మీ పద ప్రయోగాలు ఆ విధముగా ఉండవు.

ఇదేదో ఈ రోజు తేల్చుకుందాం రండి. ముందు మీరు మొదలు పెట్టండి. అసలు నా తప్పు ఏమిటో చెప్పండి. నా మీద ఎందుకు ఆరోపణలకు దిగారో చెప్పండి. పూర్తిదానికి మీదే బాధ్యత అని అంగీకరించి క్షమాపణలు చెప్పండి. ఎటువంటి అనుమానాలు , ఆరోపణలు వ్యక్తం చేయకండి. లేదంటే దీనిని చివరవరకూ సాగతీద్దాం. --శశికాంత్ 13:36, 16 నవంబర్ 2010 (UTC)

ఏమిటి తేల్చేది

మార్చు
  • ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:03, 16 నవంబర్ 2010 (UTC)

  • మీ ఇష్టం వచ్చినట్టు వాగుకోండి. చరిత్ర పేజీ చూస్తే ఎవిడికైనా స్పష్టంగా అర్థం అవుతుంది. --శశికాంత్ 03:43, 17 నవంబర్ 2010 (UTC)

స్పందన బాగానేఉంది...

మార్చు

హలో ఫ్రెండ్స్‌ నేను జంబోని... ఇటీవల నేను పెట్టిన పోస్టింగ్‌కు సభ్యులు బాగానే స్పందిస్తున్నారు. ధన్యవాదాలు. వీకీ నిర్వాహకుడు అర్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కాస్తంత కటువుగా వాక్యప్రయోగం చేసినా.. ఆ కరుకుదనం యొక్క మూలార్థాన్ని ఆయన (మాత్రమే) గ్రహించారు అర్జున గారూ...మీరు యాంత్రిక వ్యాసాలు పెద్దగా చదవలేదంటున్నారు. ఇది కాస్తంత హాస్యాస్పదంగానే ఉంది. (నాకు మట్టుకు.. అనధ్యా భావించకండి.. మీరు వీకీ నిర్వాహకులు కదా..)ఇటీవల కాలంలో వస్తున్న కథనాలు గూగుల్‌ వారి అనువాద కథనాలు లేకపోతే ఏక వాక్య కథనాలే కదండీ.. సరే విడిచిపెట్టండి... మీ ఈ మెయిల్‌ ఐడీ సంపాదించి.. నేను సేకరించిన అనువాద వ్యాసాలను కొన్నింటిని మీకుపంపుతాను.( వాటిలో తెలుగును గుర్తించగలిగితే నూటపదహార్లు తాంబూలంలో పెట్టి సమర్పించుకుంటాను) ప్రస్తుతం వాటిని మా విద్యార్థులకు.. తెలుగు ఎలా రాయకూడదో..శైలికి అందిపుచ్చుకోకుండా రాస్తే ఆ కథనాలు ఎంత వెగటుగా ఉంటాయో... తెలియజెప్పడం కోసం ఉదాహరణలుగా వాడుకుంటున్నాను. అంత భయానకంగా ఉంటాయి... ఆ రాతలు... అర్జున గారు... వీకీపీడియాలోకి రోజూ వచ్చే వ్యక్తుల్లో ఈ కింద రెండు రకాలవారు ఉంటారు. 1. భాషాభిమానులు 2. భాషావేత్తలు భాషాభిమానులు, భాషావేత్తలకు మధ్య వ్యత్యాసాన్ని వీకీ నిర్వాహకులు తెలుసుకుని తీరాలని నేను అభిప్రాయపడుతున్నాను. వీకీపీడియాలో భాషాభిమానులు హడావిడి ఎక్కువగా కనిపిస్తోందే కానీ, భాషావేత్తలకు అతి తక్కువగా స్థానం కనిపిస్తోంది.(హడావిడి విషయంలో) అందువల్లనే గూగుల్‌ వారో... వేరే మరొకరు పెట్టే అనువాద కథనాలు పరంపర కొనసాగుతూనే ఉంది. గూగుల్‌ అనువాద వ్యాసాల విషయంలో.. మేము గత ఆరు నెలలుగా పోరాడుతూనే ఉన్నాం.(వీకీ వేదికగా కాదు..).. ఇది ముగించిన తరువాత.. గూగుల్‌ వారి భాషా మారణకాండను అపమని కోరుతూ మైకెల్‌ గాల్వేజ్‌కు మరోసారి ఉదాహరణ సహిత ఈ మెయిల్‌ను పంపనున్నాం. అనువాద వ్యాసాలకు సంబంధించి నా నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను.

ఇక మరో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావిస్తాను.

1. శశికాంత్‌ 2. జె.వి.ఆర్‌.కె. ప్రసాద్‌

ముందుగా శశికాంత్‌ గారి విషయానికి వద్దాం..

శశికాంత్‌ గారూ.. మాట.. తూటా కంటే చాలా పదునైనది. ఏళ్ల తరబడి మాటలను అమ్ముకుంటూ బతుకున్న మాకు.. మాటను ఎలా ఉపయోగించాలో బాగానే తెలుసనుకుంటున్నాం. శశికాంత్‌ గారూ.. బండబూతులు అంటే ఏమిటో.. మీకు తెలుసా..? ఇక్కడ రాస్తే బాగోదు.. .. వాటిని బండబూతులు అంటారు. తెలుగు భాష తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే.. వీకీ నిర్వాహకులపై నేను కాస్త కటువైన భాషా ప్రయోగం చేసానని అంటారే తప్ప...బూతులు తిట్టానని అనరు. కనుక కాస్త హుందాగా వ్యవహరించండి. ప్రసాద్‌ గారు మిమ్ముల్ని అపార్థం చేసుకుంటే.. ఆయనకు కాస్తంత విడమర్చి చెప్పి ఉంటే బాగుంటుంది.

ఇక ప్రసాద్‌ గారు.. మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు. వయస్సుకు గౌరవం ఇవ్వాలని.. వయస్సు రీత్యా మిమ్ముల్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మీ యొక్క తిరుగుటపాపై దాడి కొనసాగిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సార్‌కు.. కోపం.. ముక్కు మీదే ఉంటుందనుకుంటా( పేరులో ముక్కంటి ఉన్నాడు కదా...క్షమించాలి.. చిన్న సెటైర్‌) నేను రాసిన మొదటి పోస్టింగ్‌ను మీరు పూర్తిగా చదవలేదని నా భావన. నా కోసం మళ్లీ మరొక సారి చదవండి. షోడశ కన్యలు లేవని మీరు చెప్పారు..ఓ.కే నేను కూడా అదే మాట చెప్పానండీ.. అలాంటి లేని వాటి గురించి ప్రతిపాదించవద్దన్నాను.

మీరే ఒప్పుకుంటున్నారు.. వంశవృక్షాల గురించి తెలియక రాసాను. ఆ తరువాత తీసేశాను అని.. ( నిజమే కదా.. మీరు రాసిన తిరుగు సమాధానం చూడండి).. అందుకే అలాంటి వ్యర్థమైన విషయాల గురించి.. ప్రతిపాదించవద్దన్నాను. హిందువుల వంశవృక్షాలంటే మీకు అంత తేలిగ్గా ఉందా.. అని అంటున్నారు... నా మొత్తం పోస్టింగ్‌లో హిందువులను అవమాన పరిచే వాక్యం కనిపించిందా..?? ( అ విధంగా ఉందని రుజువు చేసిన వారికి నేను నా తెలుగు సరస్వతిని ధారాదత్తం చేస్తాను.. చచ్చే వరకు మరొక తెలుగు అక్షరం ముక్క రాయను) ఇక మిమ్ముల్ని వ్యక్తిగతంగా విమర్శించాను అని అంటున్నారు... దీనికి కూడా పై సవాలే. సవాలుకు సై అంటే.. చెప్పండి.. నేను మిమ్ముల్ని కానీ.. మీరన్నట్లు హిందువుల వంశవృక్షాలను తేలిగ్గా తీసిపారేసానని..(జలసూత్రం వారి వంశవృక్షం ఇక్కడ పొందుపరచకూడదని.. ఇంతకు ముందు చర్చలో చెప్పుకున్నాం. మీరు కూడా ఒప్పుకున్నారు) ఇక్కడ ఎవరైనా సోదాహరణగా చెబితే.. నేను పై సవాలుకు కటుట్బడి ఉంటాను. లేని పక్షంలో మీరు మీరు వీకీపీడియాను విడిచిపెట్టేస్తారా..??? ఇక క్షమాపణలు చెప్పాలి.. లేని పక్షంలో.. అన్నారు. పెద్దవారు.. ఈ లాజిక్‌లు, ఈ వాదనలు అన్నింటినీ పక్కనపెట్టండి. మీరు బాధపడినట్లయితే నా హృదయపూర్వక క్షమాపణలు. సర్‌.. ఒక్క మాట... మీరు రాసిన పోస్టింగ్స్‌ మొత్తం ( దీనికి సంబంధించి).. మీ పదప్రయోగం ఎలా ఉందో చూడండి.. శశికాంత్‌ ఏమనుకుంటున్నాడు.(శశికాంత్‌ బదులు నేను) శశికాంత్‌ దాష్టీకం భేషజం ఎక్కువ ఇక్కడకు వచ్చే వాళ్లను రానివ్వకుండా చేస్తున్నాడు మీరేం ఉద్దరించారో తెలిస్తే... ( సర్‌, నేను రాసిన సుమారు 30 నుంచి 40లక్షల పదాల తెలుగు ఇప్పటి వరకు ప్రచురితమైనదండి..ఇప్పటి వరకు సర్వామోదయోగ్యమైన రాతలే రాసానండీ..) ఇక ప్రతి వాక్యం విషం చిమ్మేలా ఉంది. వీటికి మిమ్ముల్ని క్షమాపణలు అడగను. పెద్దవారు మీరు .. ఆ విధంగా రాసి ఉండవచ్చా.. లేదా అనేది మీ విజ్ఞతకు సంబంధించిన అంశంగా భావించి.. దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే మరొక్క చివర అంశం ప్రసాద్‌ గారు... గూగుల్‌ వారి అనువాద వ్యాసాల వల్ల తెలుగు భ్రష్టుపట్టిపోతోందన్న.. కోణంలో నేను మీ ముందుకువచ్చాను. అయితే మొత్తం మీద ప్రధానాంశాన్ని పక్కనపెట్టి... మీరు చర్చనుమొత్తం మరోకోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కనుక.. గూగుల్‌ వారి నాసిరకం కథనాల మధ్య.. మనం రాసే కథనాలకు కూడా అదే తరహా మార్కు పడుతోందన్న విషయాన్ని గుర్తించి.. వాటిని నిరోధించడమా... లేక వాటి నాణ్యతను పెంచడమా.. అన్న అంశంపై మీ గళం విప్పాల్సిందిగా కోరుతున్నాను. మీలాంటి పెద్దవారు.. తెలుగుభాషపై గూగుల్‌ జరుపుతున్న భాషా మారణకాండపై స్పందించనట్లయితే కచ్చితంగా మనం మన భావితరాలకు అన్యాయం చేసినవారం అవుతాం. ఏమంటారు.. ప్రసాద్‌ గారు...

శశికాంత్‌కు ...

మార్చు

అయ్యా శశికాంత్‌ గారూ.. అర్థనారీశ్వరుడు అన్నది బూతు కాదు.. కాస్తంత మీ భాషాపరిజ్ఞానాన్ని పెంచుకోండి...శశికాంత్‌ గారూ జంబో గాడు.. అంటూ తరచుగా పదప్రయోగం చేస్తున్నారు.. నేను మీ బాల్యమిత్రుడినా.. లేక మరెవనినైనానా.. కాస్తంత సభ్యతతో మాట్లాడటం నేర్చుకోండి. సంస్కారం అనేది పుట్టుకతో రావాల్సిన అంశమని వివేకానందుడు అంటాడు.. అలాంటి సంస్కారం మనలో లోపిస్తే.. మన పుట్టుకలు ప్రశ్నార్థకం అవుతాయి.. కనుక కాస్తంత సంస్కార పదప్రయోగం చేయండి. తరచుగా మీరు వీకీ పీడియాకు కొత్త.. కొత్త అనే ప్రయోగం చేస్తున్నారు.. కొత్తసభ్యులు, పాత సభ్యులుకు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా..? మళ్లీ చెబుతున్నాను.. అనవసరంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని ఆపి.. నేను ప్రతిపాదించిన అంశం.. గూగుల్‌ అనువాద వ్యాసాలు.. వాటి నాణ్యత గురించి కాస్తంత అర్థవంతమైన చర్చకు బాటలువేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది...

కాస్త సంతకం చేసి రాయండి. అసలు మీ వల్లే నన్ను ఇంత క్షోభకు గురిచేసారు ప్రసాదుగారు. నేను సభ్యతతో మాట్లాడాలా ...మరి మీరు ఎలా మాట్లాడారు.... దానికి నేను ఎంత సభ్యతతో జవాబు ఇచ్చాను. అయినా నాపై అభాండాలు వేస్తే చివరికి నేను కూడా సహనం కోల్పోయి మీ ఇద్దరి లాగే మాట్లాడాను. నేను ఇక్కడ ఎప్పటినంచో పనిచేస్తున్నా , ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా ప్రసాదు గారు నన్ను బాగా అపనిందలు పాలు చేయడంతో అలా జరిగింది. ఎన్ని ఋజువులు చూపినా ప్రసాదు గారు నాపై అభాండాలు మోపారు. అర్థనారీశ్వరుడు అన్నది బూతు కాదని చెప్పిందే నేను. మీరు దానిని ఒక బూతుగా వాడారు. అందువల్ల నేను అది బూతు కాదని చెప్పాను. నా భాషాపరిజ్ఞానాన్ని శంకించే ముందు మీ రాసింది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇదిగో మీరు ఇలా రాసారు.

మనమేమైనా అర్థనారీశ్వరులమా... మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...
దీని అర్థం కాస్త చెప్పగలరు. మాటలు వక్రీకరించకండి. లేకపోతే మళ్ళీ అదో గొడవ. --శశికాంత్ 15:07, 17 నవంబర్ 2010 (UTC)

మంచి చర్చలు జరగాలి

మార్చు

వికీపీడియా చర్చలకు నా జవాబు:

  • మొత్తం అంతా చదివాను. చర్చలకు వేదిక అని అనుకుంటే అసలు సమస్య లేనే లేదు. కానీ అర్ధము లేని వృధా ప్రయాస చర్చల వల్ల ఉపయోగము ఎవరికీ వుండదు.
  • జంబో చర్చించాలంటే ఇది సరి అయిన మార్గము కాదనుకుంటాను. మీరు వేడుక చూడటము యేమంత బావుండ లేదు.
  • యాంత్రిక వ్యాసాలంటే నాకు మాత్రము ఎటువంటి అభ్యంతరము లేదు.
  • ఎవరికైనా దొరికిన కాస్త సమయమైనా సద్వినియోగము చేసుకోవాలని, పదిమందికి తన జ్ఞానాన్ని పంచి పెట్టాలని కేవలము (ఇక్కడ) వికీకు వస్తారు. అది కూడా ఈషణ్మాత్రము ఏమీ ఆశించక చాలా మంది మంచి మనసులతో రావడము జరుగుతుంది.
  • నేను చాలా వెబ్ సైట్ల వాటిల్లో గత 8 సం. వుంటూ, నాకు అనేక వందల మంది స్నేహితులు వున్నారు. అందులో నాకు ఎవరూ తెలియదు. ఇప్పటికీ వారంతా మంచి "ఆకాశ స్నేహితులు" . కారణము, నాకు నిజ జీవితములో స్నేహితులు లేరు. అందులోనూ నాకు మగ వాళ్ళంటే భయం, అందుకేనేమో నా సమాధానములు వారి మనసుకు నచ్చినట్లుగా ఉండవు.
  • నేను తరచుగా ప్రయాణాలు చేస్తునే ఉంటాను. హైదరాబాదులో ఎక్కువ రోజులే వుంటాను. ఈ సారి తప్పకుండా కలుద్దాము. (ఎలా కలుస్తామనే ప్రశ్న రాదు. Arjunaraoc దగ్గర నా ఈ మెయిల్ అడ్రస్సు వుంది, నా ఫొన్ నం., కార్ నం. ఇస్తాను.)
  • అనవసరముగా కేవలము వృధా సమయ చర్ఛలు చేసుకునేందుకు కావలసిన వెబ్ సైట్లు వున్నాయి.
  • జంబో ఉదహరించిన విషయాల మీద చర్చించమంటే ఎవరూ ఆ విషయము మాట్లాడరు. కేవలము వ్యక్తిగతంగా తేసుకుంటున్నారు.
  • నేను మొత్తము (జంబో+శశికాంత్ చర్చ కలిసి వున్నది) చదివిన తరువాత, సహజముగానే ఎవరి మనసు అయినా బాధ పడుతుంది. అయినా నేను యధాలాపంగా ఒకరోజు ఆ పాత చర్చ చూడటము జరిగింది. వెంటనే వ్రాశాను. ఆ తరువాత 3 రోజులకు అసలు విషయము నిదానముగా చెప్పారు. తరువాత, తరువాత ఆవేశము పెంచుకున్నారు.
  • ఎవరైనా ఇక్కడకు రావడము అంటే చెడు అలవాట్లకు దూరముగా ఉండి, ప్రశాంత స్థితి, పరిస్థితులలో మంచి నడవడి, ప్రవర్తనలతో తన జ్ఞానాన్ని అందించాలని వస్తారు. అటువంటి వాతావరణము ఎల్లప్పుడూ వుండే విధముగా ముందు తప్పని సరిగా ప్రయత్నించాలి.
  • ఇక్కడము రావద్దనే అధికారము ఎవరకైనా వుందేమో నాకు తెలియదు.
  • నా పదాలు కొందరికి బాధ కలిగించాయి అని తెలియజేశారు, అందుకు తగిన విధముగా అందరికీ విషయాన్ని తెలియజేస్తూ నా పదాలని ఉపసంహరించుకుంటూ తెలియ జేయడము జరిగింది. కాని అర్ధం చేసుకొనక, మరో నాలుగు మాటలు చేర్చటముతో, చర్చ మరోలా సాగింది.
  • ఎవరైనా ఏ విషయములో నయినా చర్చ చేయాలనుకుంటే ముందుగానే తెలియజేయండి. అది అందరికీ మంచిది. చర్చ మొదలు పెట్టిన వారు అందుబాటులో వుండే విధముగా చూసుకోండి.
  • నేను పొరపాటు అన్న పదము తప్ప అంతకంటే ఎక్కువ బహుశః నాకు తెలిసినంత వరకు నేను యెక్కడ వ్యక్తిగతముగా వాడుట జరుగ లేదనుకుంటాను. అందుకే అంతకంటే ఎక్కువ పదము వాడను. ( ఏమో ఇంతవరకు ఎవరూ అంతకంటే నా నుంచి ఆశించ లేదు, ఆ సందర్భము రాలేదు)
  • ఇంకా వివరణలు ముందు ముందు ముందు ఇస్తాను.
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:48, 17 నవంబర్ 2010 (UTC)

ఇక ఆపేస్తే బాగుంటుంది....

మార్చు

ఇక ఈ విషయం పై చర్చ ఆపి.. ఈ పేజీని పాత చర్చలలోకి తోసేస్తే బాగుంటుంది.....ఎలాగూ ఈ పేజీ చాలా పెద్దదైపోయింది. --శశికాంత్ 15:20, 17 నవంబర్ 2010 (UTC)