వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 10
← పాత చర్చ 9 | పాత చర్చ 10 | పాత చర్చ 11 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2009 జూలై 22 - 2010 జనవరి 18
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
Wikitrans/Google Translate kit
మార్చుWikitrans తెలుగు లోనికి కొన్ని పెద్ద పేజీలున్న సమాచారాన్ని ఎవరో తర్జుమా చేస్తున్నారు. కొంతవరకు బాగున్నాయి. వారు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారని అనిపిస్తుంది. అదే పద్ధతిలో మనం కొన్ని ముఖ్యమైన వ్యాసాలను అనువాదం చేయవచ్చునని నా అలోచన. మనలో కంప్యూటర్ జ్ఞానం ఉన్నవారు దాని గురించి టెక్నికల్ గా విశ్లేషిస్తే తెలుగు వికీ అభివృద్ధికి ఇది చాలా తోడ్పడుతుంది.Rajasekhar1961 10:54, 22 జూలై 2009 (UTC)
- ఈ సభ్యుడు http://translate.google.com/toolkit ఉపయోగించి వీటిని అనువదించాడు. ఇది అనువదించడానికి మూలవ్యాసాన్ని, అనువాదాన్ని పక్క పక్కనే చూపిస్తుంది. కొన్ని పదకోశంలో ఉన్న నామవాచకాలను గట్రా మాత్రం అదే తర్జుమా చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సాఫ్టువేరుకు తెలుగులోకి అనువదించగల సత్తాలేదు. కాకపోతే భవిష్యత్తులో యాంత్రిక అనువాదం దిశగా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ సభ్యుడు ఇక్కడ చేర్చిన వ్యాసాలు మానవప్రయత్నంతో అనువదించినవే. ఏదేమైనా ఇలాంటి పరికరాల్లో తెలుగును గురించి కూడా ఆలోచిస్తున్నారంటే శుభసూచకమే --వైజాసత్య 00:52, 23 జూలై 2009 (UTC)
- ధన్యవాదాలు. ఈ టూల్ కిట్ వలన ఉపయోగం ఏమిటి. మన అనువాదకులకు కూడా ఇది ఉపయోగపడుతుందా ఆలోచించి, అనువాదకులకు సూచించండి వైజాసత్య గారు.Rajasekhar1961 02:35, 23 జూలై 2009 (UTC)
- ఇది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి --వైజాసత్య 04:19, 23 జూలై 2009 (UTC)
- నిన్నన దీనిని ఉపయోగించడానికి ప్రయత్నించాను. ఒకటె అనిపించింది, Google Tranlisteration toolని ఉపయోగిస్తే, త్వరగా చెయ్యొచ్చు అని. తెలుగు వాక్యాలని ఆంగ్లములో రాయడము మనలో చాలా మందికి అలవాటేనేమో.
- కానీ ఈ టాన్స్‌లేషన్ కిట్ ఉపయోగించేకొద్దీ తర్జుమా ఎలా చెయ్యాలో అది నేర్చుకుంటుంది. కొన్నాళ్ళకు ఆ వీడియోలో చూపించినట్టు ఇలా ఇంగ్లీషు వ్యాసామిస్తే అలా మొత్తం చైనీసులో క్షణంలో అనువదించినట్టు తెలుగులో కూడా సాధ్యమౌతుంది. ఎంత ఎక్కువమంది దీన్ని ఉపయోగిస్తే అంత త్వరగా తెలుగు యాంత్రిక అనువాదం కూడా అభివృద్ధి చెందుతుంది. --వైజాసత్య 20:39, 23 జూలై 2009 (UTC)
- అంటే ఇది తెలుగు భాష అంత బాగా రానివారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వచ్చినవారు ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర భాషల వారికి భవిష్యత్తులో తోడ్పడుతుంది. వైజాసత్యగారు చెప్పినట్లు ఇది శుభసూచకం. దీని లింకు అనువాదకులకు ఉపకరణాల దగ్గర ఇచ్చి కొన్ని వివరాలు రాస్తే బాగుంటుంది.Rajasekhar1961 04:16, 24 జూలై 2009 (UTC)
- బాగానే ఉంటుంది. కానీ ఒక ఇబ్బంది ఉంది. మనము తెలుగులో పాటించే వ్యాకరణానికి, ఆంగ్ల వ్యాకరణానికి చాలా తేడా ఉంది. అనువాదము సరిగ్గా రాకపోవచ్చు. ప్రయత్నించటము లో తప్పులేదు. కిరణ్మయీ 04:43, 27 జూలై 2009 (UTC)
ఈ కొత్త సభ్యుని రచనలు చూడండి- ప్రత్యేక:Contributions/Bandrahills - సారాంశములో http://translate.google.com/toolkit అని ఇవ్వబడింది. బహుశా తెలుగులోనికి కూడా తర్జుమా లభ్యమైనట్టుంది! --Gurubrahma 19:26, 18 సెప్టెంబర్ 2009 (UTC)
- ఊహూ, అంత ఘననీయంగా పరిస్థితేం మెరుగుపడలేదు. నేను కొన్నాళ్ళనుండి ఆ టూల్ కిట్ ఉపయోగించి ఒక వ్యాసాన్ని తర్జుమా చేస్తున్నాను. ఆ సభ్యుని వద్ద కొన్ని అనువాద గ్లాసరీలు ఉంటే తప్ప, బాగా శ్రమపడే చేస్తున్నట్టుంది --వైజాసత్య 22:25, 18 సెప్టెంబర్ 2009 (UTC)
- తెవికీలోకి చేరే ఈ పెద్ద వ్యాసాలను వికీకరించడం చాలా పెద్ద పని. దీనిని ఎలా చేద్దామో తగిన సూచనలివ్వండి.Rajasekhar1961 13:33, 30 సెప్టెంబర్ 2009 (UTC)
- ఈ యాంత్రిక అనువాద వ్యాసాలు నాకు కూడా నచ్చడం లేదు. ఈ వ్యాసాలలోని బాష, శైలి ఏదో రకంగా ఉంది. కొన్ని వాక్యాలైతే అసలేమీ అర్థం కాకుండా ఉన్నాయి. లింకులు, మూసలు పనిచేపట్లేదు. లేని వ్యాసాలు చేర్చడం సంగతి ఏమో కాని బెనజీర్ భుట్టో లాంటి వ్యాసాలు మనం ఎంతో కష్టపడి ఎన్నో దిద్దుబాట్ల ద్వారా తెలుగు వారికి అవసరమైనంతగా చక్కగానే, ఉపయోగకరంగానే తయారుచేసుకున్నాం. ఆ వ్యాసం మొత్తాన్ని ఓవర్‌టేక్ చేసి "యాంత్రిక అనువాద వ్యాసా"న్ని ఉంచడం ఏమీ బాగనిపించడం లేదు. ఆంగ్ల వికీలో ఉన్నది ఉన్నట్లుగా తెవికీలో ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. తెవికీని సందర్శించేది తెలుగువారే కాబట్టి తెలుగు వారి దృష్టితోనే వ్యాసాలు ఉండాలి. -- C.Chandra Kanth Rao-చర్చ 17:14, 30 సెప్టెంబర్ 2009 (UTC)
- తమిళ వికీ మిత్రులు, ఇలాంటి అనువాద రచనలని నియంత్రించటానికి, కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. 1) వీటిని గుర్తించటానికి ప్రత్యేక మూస వాడటం. 2) ఇప్పటికే, సృజన రచన వుంటే, అనువాద రచనని అనుమతించక పోవటం. ఇలాంటి రచనలు ఎక్కువవుతున్నాయి కాబట్టి.తెవికీ కూడా ఈ దిశగా పని చేయాలి. మీ సలహాలు? అర్జున 14:22, 15 మే 2010 (UTC)
ఇవీ చూడండి
మార్చుపాత తెలుగు పాటలు
మార్చుఅరవై సంవత్సరాలకు పైబడిన తెలుగు సినిమా పాటలను వికీ మూలాలలో పూర్తి పాఠం ఉంచవచ్చునా. కాపీరైటు నిబంధనలను అతిక్రమించకుండా. అంటే 1948 ముందుగా విడుదలైన తెలుగు సినిమా పాటలన్నమాట. తెలిసిన వారు చెప్పండి. ఎందుకంటే ఈ పాటలలో కొన్ని నిజంగా సారవంతమైనవి, సాహిత్యపరంగా ఉత్తమమైనవి వున్నాయి. జానపద గీతాలకు కాపీరైటులు ఎలా వర్తింపజేస్తాము. ఎందుకంటే ఇవి చాలా వరకు ప్రజల నోటిలో నానుతున్న ప్రాచీనమైన సంప్రదాయ గీతాలు.Rajasekhar1961 13:47, 21 సెప్టెంబర్ 2009 (UTC) దినిని పరయత్నిఛగలరు http://www.microsofttranslator.com/Default.aspx
en:Indian copyright lawలో ఉన్న విషయం ఇది
- Literary, dramatic, musical and artistic works (other than photographs) - Sixty years from the beginning of the calendar year following the year in which the author dies. This will usually be more than sixty years as the time frame starts subsequent to the author's death
- Anonymous/pseudonymous/posthumous works, photographs, movies, sound recordings - Sixty years from the beginning of the year following the year of publication
పైనున్న నియమాల ప్రకారం మీరు చెప్పింది చెల్లదు. అంటే గానానికి 60 యేళ్ళ తరువాత కాపీహక్కు వర్తించదు కాని పాట రచయితకు కాపీ హక్కు ఉండవచ్చును. అయితే "పాత పాటలు" అన్న విషయాన్ని గుర్తుంచుకొని కొన్ని చరణాలను ఉదాహరించడం సముచితమవుతుందని భావిస్తున్నాను . --కాసుబాబు 17:47, 6 అక్టోబర్ 2009 (UTC)
తెలుగు బ్లాగులు, బ్లాగర్లు
మార్చుతెలుగు బ్లాగర్లు, బ్లాగులతో వికీపీడియాలోని చాలామంది సభ్యులు వ్యక్తిగతంగా అవినాభావ సత్సంబంధాలున్నాయి. అదటుంచితే ప్రత్యేకంగా ఏ వ్యక్తిగత తెలుగు బ్లాగరి కానీ ఏ ఒక్క తెలుగు బ్లాగు కానీ, విజ్ఞానసర్వస్వంలోకెక్కేంతగా ఇంకా ప్రసిద్ధి చెందలేదని నా అభిప్రాయం. అందువల్ల సదురు బ్లాగరుల పేజీలు, వ్యక్తిగత బ్లాగులకు వికీపీడియాలు ప్రస్తుతానికి తెలుగు వికీపీడియాలో విషయప్రాముఖ్యత లేని విషయాలే. కాబట్టి వాటిని తొలగించాలని నా ప్రతిపాదన --వైజాసత్య 05:49, 5 అక్టోబర్ 2009 (UTC)
- {{ప్రాముఖ్యత లేని విషయం}} అన్న మూసను పెట్టి ఒక వారం తరువాత తొలగించవచ్చును. --కాసుబాబు 17:50, 6 అక్టోబర్ 2009 (UTC)
- ఒకరి గురించి ఇంకొకరు రాస్తే సరే. ప్రాముఖ్యతనిర్ణయించటానికి పేజి ట్రాఫిక్ ని పరిగణిస్తే బాగుంటుంది--అర్జున 09:47, 19 అక్టోబర్ 2009 (UTC)
- తొలగించటం నాకు సమ్మతమే. కాని వీవెన్లాంటి వారిని ఉంచవచ్చేమో, ఇప్పటికే వార్తా పత్రికల్లో కొన్ని సార్లు వీరి గురించి, వీరి బ్లాగుల గురించి వచ్చింది కదా. కాకంటే అలా ఉంచితే మిగిల్న వారు కూడా ఉంచాలనుకుంటారు, చిక్కు సమస్యే! ఏదో ఒక నియమావళి ఉండాలి మనకు ఈ విషయంలో. ఆంగ్లంలో వికీలో ఇంత కంటే చిన్న వారిపై కూడా వ్యాసాలు ఉన్నాయనుకుంటాను అలా చూస్తే కనీసం కొన్ని తెలుగు బ్లాగుల గురించి అయినా వికి వ్యాసాలు ఉంచవచ్చు. ఈ విషయంలో ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఉదాహరణకు ఏదేని వార్తా పత్రికలో వ్యాసం వచ్చి ఉండటం, వారి బ్లాగు గురించి ఏదైన ప్రముఖ పత్రికలో వార్త రావటం, మొన్నగున్నవి. లేదా కనీసం మూడు సంవత్సరాల నుండి అన్నా తెలుగులో బ్లాగుతుండటం ఎట్సెట్రా. Chavakiran 10:57, 19 అక్టోబర్ 2009 (UTC)
అనువాద వ్యాసాలు
మార్చుఅనువాద వ్యాసాలు మన తెలుగు వికీని పాడుచేస్తున్నాయి. చేస్తున్నవారెవరో తెలియదు. ఈరోజు చేర్చిన పులి వ్యాసంలో అంతకు ముందుగా నేను చాలా శ్రమించి కూర్చిన సమాచారాన్ని తొలగించి కొత్త సమాచారాన్ని చేర్చారు. ఇది చాలా బాధ కలిగిస్తున్నది. పుష్పం వ్యాసం ఉండగా పువ్వు అనే దారిమార్పు పేజీలో అనువాద వ్యాసం తయారయ్యింది. ఇలా తెలుగువికీలోని వ్యాసాలన్నింటికి ఇదే పరిస్థితి కలిగే ప్రమాదం ఉన్నది. అసలు చేరుస్తున్నది ఎవరో తెలియదు. వారితో పెద్దలు చర్చించి ఉన్న వ్యాసాల్ని తొలగించకుండా జాగ్రత్త పడితే మంచిది. లేకపోతే పరిస్థితి మన చేయిదాటిపోతుంది.Rajasekhar1961 09:39, 6 అక్టోబర్ 2009 (UTC) తొలగిన్ఛవఛును
- చేర్చనివ్వండి. మీరు చేసిన మార్పులు ఎక్కడికీ పోవు. కావాలంటే వాటిని రోల్ బ్యాక్ చెయ్యవచ్చు. డూప్లికేట్ వ్యాసాలు తయారైతే వాటిని విలీనం చేద్దాం. అనువాదాలు అంత తరచుగా రావడం లేదు. మన తెలుగు వికీలో తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి సమాచారం మనకు పనికొస్తుంది. సదరు వ్యాసాల్లో మీకు ఎక్కడ మార్పులు చేయాలనిపిస్తే అక్కడ నిస్సందేహంగా మార్పులు చెయ్యండి. రవిచంద్ర (చర్చ) 14:55, 6 అక్టోబర్ 2009 (UTC)
- అనువాదాలు చేసే సభ్యులు తమ పరిచయాలను వ్రాయలేదు. వారి చర్చాపేజీలలో ఈ సమస్య గురించి విన్నపం వ్రాయండి. ఏమైనా ప్రతిస్పందన వస్తుందేమో చూద్దాము. నా అభిప్రాయం ఏమంటే ఎవరి కృషి వారిది. పరిమితులకు అనుగుణంగా వారిని ప్రోత్సహించడమే మంచిది. ఆ పరిమితులేమిటో వారితో చర్చించుదాము. కాలక్రమంగా ఈ యాంత్రిక అనువాదాలు తెలుగు వికీకి పెద్ద తోడ్పాటు కావచ్చునని నేను భావిస్తున్నాను --కాసుబాబు 15:43, 6 అక్టోబర్ 2009 (UTC)
- రాజశేఖర్ గారూ, కంగారు పడవద్దు. కావలసిన స్థానానికి ఎప్పుడైన మనం తిరుగుసేత (రోల్‌బాక్) చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వ్యాసంపైనే కొత్త అనువాదం అతికించడం లాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే..ఈ అనువాదకులు తెవికీకి వచ్చి వాటిని అతికించట్లేదు. ఆ గూగుల్ ట్రాన్స్లేషన్ టూల్‌కిట్ లోని అనువదించిన వ్యాసాన్ని ఆయా భాషల వికీలో చేర్చు అనే ఒక ఆప్షన్ ఉంది. అది ఉపయోగిస్తున్నారు. అదేమో సరాసరి వ్యాసం ఇంతకు ముందే ఉందో లేదో చూసుకోకుండా అటోమేటిగ్గా ఇక్కడ అతికించేస్తుంది. కాబట్టి తప్పు ఆయా అనువాదకులది కాదు. వాళ్ళకి కాసుబాబు గారు అన్నట్టు తగు సూచనలిస్తే సరిపోతుంది --వైజాసత్య 17:16, 6 అక్టోబర్ 2009 (UTC)
ఇవీ చూడండి
మార్చుబీటాలో ముంజేతి కంకణం
మార్చువికీమీడియా బీటాలో ముంజేతి కంకణం నాకు పనిచెయ్యడం లేదు. ఇంకా ఎవరైనా బీటాకు మారి ఉంటే ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారా? ఒకవేళ పరిష్కారం తెలిసుంటే ఇక్కడ తెలియజేయండి. —రవిచంద్ర (చర్చ) 05:34, 15 అక్టోబర్ 2009 (UTC)
తెవికీ కర పత్రము
మార్చునేను తయారు చేసిన తెవికీ కర పత్రము పై దాని చర్చ పేజిలో రాయండి అర్జున 15:52, 17 అక్టోబర్ 2009 (UTC)
తెవికీని అధికమించిన హిందివికీ
మార్చుచాలా కాలంగా తెవికీ భారతీయ భాషలలో అత్యధిక వ్యాసాలు కలిగిన వికీపీడియాగా ఉండేది. సెప్టెంబరు 2009లో హిందీ వికీపీడియాలో కొత్తగా 10వేల వ్యాసాలు చేరడంతో అది 50వేల వ్యాసాల మైలురాయిని దాటింది. మార్చి2008 నాటికి హిందివికీలో 28వేల వ్యాసాలుండగా 6 మాసాలలోనే 50వేలు దాటాయి (80% వృద్ధి). దీనితో బారతీయ భాషలలో అత్యధిక వ్యాసాలు కలిగిన వికీగా తెవికీ నుంచి ప్రథమస్థానపు హోదాను కూడా తీసుకున్నట్లయింది. మనం తెవికీలో చాలా చోట్ల "ప్రథమ" సమాచారాన్ని మార్చాల్సి ఉంటుందేమో! -- C.Chandra Kanth Rao-చర్చ 18:54, 18 అక్టోబర్ 2009 (UTC)
ఈ వారం వ్యాసాలు
మార్చుసభ్యులందరూ గమనించవలసిన విషయం - వారం వారం మొదటి పేజీలో ఉంచడానికి "ఈ వారం వ్యాసం" ఎన్నిక ఉన్న కొద్దీ కష్టమవుతున్నది. ఇటీవలి కాలంలో వచ్చిన పెద్ద వ్యాసాలు చాలా తక్కువ (సుజాత గారు వ్రాసినవి మినహాయించి). ఒక్కొక్క సభ్యులూ ఒక్కొక్క వ్యాసాన్ని విశేష వ్యాసంగా వ్రాయమని కోరుతున్నాను. అలా కాకుంటే 2010లో వ్యాసాల ఎన్నిక మరీ కష్టమవుతుంది. --కాసుబాబు 19:12, 24 అక్టోబర్ 2009 (UTC)
- సుజాత గారి స్పూర్తి తో ఈ పనిమీదనే ఉన్నాను. మిగతా సభ్యులు కూడా తమకు ఆసక్తి కలిగిన, చిన్నవిగా ఉన్న వ్యాసాలను విశేష వ్యాసంగా తయారు చేయమని కోరుతున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:27, 25 అక్టోబర్ 2009 (UTC)
- ఇటీవల మొలకలను ఒక స్థాయి దాటించడానికి మన కృషిని కేంద్రీకరించడం వళ్ళ పెద్ద వ్యాసాలను అంతగా అభివృద్ధి చేయలేకపోయాం. గూగూల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇక్కడ చేరుతున్న పెద్ద వ్యాసాలను కాస్త దృష్టిపెడితే వాటిని చక్కగా తీర్చిదిద్దవచ్చని నా అభిప్రాయం --వైజాసత్య 06:44, 25 అక్టోబర్ 2009 (UTC)
- ఇటీవలి కాలంలో కొత్తగా పెద్ద వ్యాసాలు చాలా తక్కువగా వస్తున్న విషయం నిజమే. చురుకైన సభ్యులు వృత్తి కార్యకలాపాలలో తీరికలేకుండా ఉండటం, తెవికీకి వెచ్చించిన కొద్దిపాటి సమయం కూడా నిర్వహణకే సరిపోవడం, ఇప్పటికే ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించాలని కొత్త వ్యాసాలు సృష్టించకపోవడం తదితరాలు దీనికి కారణాలు కావచ్చు. అయిననూ ఈ వారం వ్యాసం పరిగణలు మూస ఉన్న వ్యాసాలు ఇప్పటికే 190 ఉన్నాయి. వాటిలో చాలావరకు దానికి ఆమోదయోగ్యమైనవే. కొన్ని వ్యాసాలలో మూసలు పెట్టి 2,3 సం.లు కావస్తోంది. చాలా కాలం నుంచి పరిగణలో ఉన్న వ్యాసాలు ఈ వారం వ్యాసంగా పెడితే బాగుంటుంది (వాటిని ఇంతవరకు పెట్టకపోవడానికి కల సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది, ఉదా:కు కొన్ని వ్యాసాలలో బొమ్మలు లేవు). గూగుల్ ట్రాన్స్లేషన్ వ్యాసాలలో పదాలు, వాక్యాలను మనకనుగుణంగా మార్చుకోవాల్సి ఉంది. అందులో చాలా మూసలు తెవికీలో పనిచేయట్లేదు. ఇక నా సూచన ఏమంటే ఈ వారం సమైక్యకృషి లాగా కొత్త పథకం ప్రారంభించి అందులో అందరు సభ్యులకు అనుగుణంగా, అన్ని విషయాలు, అన్ని రంగాలు ఉండేటట్లు వ్యాసాలు పెడితే (మొలక వ్యాసాలు కావచ్చు, కొత్తవి కావచ్చు) ఉత్సాహం ఉన్న సభ్యులు తమకనుగుణమైన వ్యాసాలు ఎంపిక చేసుకొని పొడగిస్తారు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:04, 25 అక్టోబర్ 2009 (UTC)
- మళ్ళీ ఇంకో కొత్త పథకమే ఎందుకు ఈ వారం సమైక్యకృషి పైనే మరింత దృష్టి పెడితే సరిపోతుంది కదా --వైజాసత్య 17:12, 25 అక్టోబర్ 2009 (UTC)
- అలాగే చేద్దాం, కొద్దిపాటి మార్పులతో అందరి సభ్యులకు అనుగుణంగా, అన్ని విషయాల వ్యాసాలు వచ్చేటట్లు చేస్తే బాగుంటుంది. ఈ వారం సమైక్యకృషిలో ప్రస్తుతం ఉన్న 5 వ్యాసాలకు బదులు వాటి సంఖ్య పెంచాలి. దీనిపై ఇతర సభ్యుల సూచనలు కూడా తీసుకొని తగుమార్పులు చేద్దాం. -- C.Chandra Kanth Rao-చర్చ 17:19, 25 అక్టోబర్ 2009 (UTC)
- మళ్ళీ ఇంకో కొత్త పథకమే ఎందుకు ఈ వారం సమైక్యకృషి పైనే మరింత దృష్టి పెడితే సరిపోతుంది కదా --వైజాసత్య 17:12, 25 అక్టోబర్ 2009 (UTC)
- ఇటీవలి కాలంలో కొత్తగా పెద్ద వ్యాసాలు చాలా తక్కువగా వస్తున్న విషయం నిజమే. చురుకైన సభ్యులు వృత్తి కార్యకలాపాలలో తీరికలేకుండా ఉండటం, తెవికీకి వెచ్చించిన కొద్దిపాటి సమయం కూడా నిర్వహణకే సరిపోవడం, ఇప్పటికే ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించాలని కొత్త వ్యాసాలు సృష్టించకపోవడం తదితరాలు దీనికి కారణాలు కావచ్చు. అయిననూ ఈ వారం వ్యాసం పరిగణలు మూస ఉన్న వ్యాసాలు ఇప్పటికే 190 ఉన్నాయి. వాటిలో చాలావరకు దానికి ఆమోదయోగ్యమైనవే. కొన్ని వ్యాసాలలో మూసలు పెట్టి 2,3 సం.లు కావస్తోంది. చాలా కాలం నుంచి పరిగణలో ఉన్న వ్యాసాలు ఈ వారం వ్యాసంగా పెడితే బాగుంటుంది (వాటిని ఇంతవరకు పెట్టకపోవడానికి కల సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది, ఉదా:కు కొన్ని వ్యాసాలలో బొమ్మలు లేవు). గూగుల్ ట్రాన్స్లేషన్ వ్యాసాలలో పదాలు, వాక్యాలను మనకనుగుణంగా మార్చుకోవాల్సి ఉంది. అందులో చాలా మూసలు తెవికీలో పనిచేయట్లేదు. ఇక నా సూచన ఏమంటే ఈ వారం సమైక్యకృషి లాగా కొత్త పథకం ప్రారంభించి అందులో అందరు సభ్యులకు అనుగుణంగా, అన్ని విషయాలు, అన్ని రంగాలు ఉండేటట్లు వ్యాసాలు పెడితే (మొలక వ్యాసాలు కావచ్చు, కొత్తవి కావచ్చు) ఉత్సాహం ఉన్న సభ్యులు తమకనుగుణమైన వ్యాసాలు ఎంపిక చేసుకొని పొడగిస్తారు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:04, 25 అక్టోబర్ 2009 (UTC)
- ఇటీవల మొలకలను ఒక స్థాయి దాటించడానికి మన కృషిని కేంద్రీకరించడం వళ్ళ పెద్ద వ్యాసాలను అంతగా అభివృద్ధి చేయలేకపోయాం. గూగూల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇక్కడ చేరుతున్న పెద్ద వ్యాసాలను కాస్త దృష్టిపెడితే వాటిని చక్కగా తీర్చిదిద్దవచ్చని నా అభిప్రాయం --వైజాసత్య 06:44, 25 అక్టోబర్ 2009 (UTC)
ఊర్ల సమాచారం
మార్చుhttp://www.censusindia.gov.in/ వెబ్ సైటులో భారతదేశంలో ని నగరాల నుంచి చిన్న కుగ్రామం వరకు అన్ని గ్రామాల గురించి మనకు అవసరమయ్యే సమాచారం లభిస్తున్నది. గ్రామాల గురించిన సమాచారానికి ఇది అతి ముఖ్యమైన, నమ్మదగిన వనరు అని భావిస్తున్నాను. —రవిచంద్ర (చర్చ) 16:27, 1 నవంబర్ 2009 (UTC)
- ఈ విషయం అంత సులభమైనది కాదు. ఇంత తలనొప్పి వర్గీకరణ ఎవరు చేశారో కానీ!. ప్రతి మండలంలో కొన్ని రెవిన్యూ గ్రామాలుంటాయి. ఒక్కో రెవిన్యూ గ్రామం క్రింద కొన్ని చిన్న గ్రామాలుంటాయి. ఇదో వర్గీకరణ అయితే సమాంతరంగా మరో వర్గీకరణలో మండలంలో కొన్ని పంచాయితీలుంటాయి మరియు ఒక్కో పంచాయితీ క్రింద కొన్ని కుగ్రామాలు (అధికారికంగా అలా పిలుస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు) ఉంటాయి. రెవిన్యూ శాఖ రెవిన్యూ వర్గీకరణ ఉపయోగిస్తుంది, పంచాయితీ రాజ్ శాఖ ఈ పంచాయితీ వర్గీకరణను వాడుతుంది. (మండలాధ్యక్షులు, సర్పంచుల ఎన్నికలన్నింటికీ ఈ వ్యవస్థనే ఆధారం అని అనుకుంటా?!). అన్నీ రెవిన్యూ గ్రామాలు పంచాయితీలు అవకపోయే ఉదహారణలు చాలానే ఉన్నాయి. రహంతుల్లా గారు రక్షించండి సార్..నేను అర్ధం చేసుకున్నది కరెక్టేనా --వైజాసత్య 08:39, 3 నవంబర్ 2009 (UTC)
- వాళ్ళు వర్గీకరించినట్లు మనం వర్గీకరిద్దామని కాదు నా ఆలోచన. ఏదైనా గ్రామం గురించి ప్రాథమిక సమాచారమైన జనాభా, ఆడవారు, మగవారు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు, మొదలైన వాటి గురించి ఒకే చోట లభిస్తుంది కాబట్టి మాన్యువల్ గా సమాచారాన్ని చేర్చేటపుడు దీన్ని రెఫరెన్స్ గా వాడమని చెప్పాను అంతే.ఇంకా వీలుంటే వారిని సంప్రదించి, సమాచారం సేకరించి, బాటు ద్వారా గ్రామాల పేజీల్లో ఒక పట్టిక లాంటిది అంటించడం గురించి ఆలోచించాలి. --రవిచంద్ర (చర్చ) 14:46, 3 నవంబర్ 2009 (UTC)
- అవును. ఆ పనికి ఇది మంచి వనరు --వైజాసత్య 17:21, 3 నవంబర్ 2009 (UTC)
- వాళ్ళు వర్గీకరించినట్లు మనం వర్గీకరిద్దామని కాదు నా ఆలోచన. ఏదైనా గ్రామం గురించి ప్రాథమిక సమాచారమైన జనాభా, ఆడవారు, మగవారు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు, మొదలైన వాటి గురించి ఒకే చోట లభిస్తుంది కాబట్టి మాన్యువల్ గా సమాచారాన్ని చేర్చేటపుడు దీన్ని రెఫరెన్స్ గా వాడమని చెప్పాను అంతే.ఇంకా వీలుంటే వారిని సంప్రదించి, సమాచారం సేకరించి, బాటు ద్వారా గ్రామాల పేజీల్లో ఒక పట్టిక లాంటిది అంటించడం గురించి ఆలోచించాలి. --రవిచంద్ర (చర్చ) 14:46, 3 నవంబర్ 2009 (UTC)
- మన రాష్ట్రం లోని అన్ని గ్రామాలజాబితా http://apland.ap.nic.in/cclaweb/APVillageList.htm లో చూడవచ్చు --Nrahamthulla 07:36, 4 నవంబర్ 2009 (UTC)
Autobiography
మార్చుAutobiography కి సమానమైన తెలుగు పదం ఆత్మకథ లేదా జీవిత చరిత్ర లేదా మరేదైనా ఉంటే తెలియజేయండి. ప్రముఖుల జీవిత చరిత్రలను సేకరించడానికి ఈ జాబితా తయారుచేస్తే బాగుంటుంది. Rajasekhar1961 06:22, 7 నవంబర్ 2009 (UTC)
- ఒకరి జీవిత చరిత్ర మరొకరు వ్రాస్తే అది "ఆత్మకథ" (Biography), స్వయంగా జీవితచరిత్ర వ్రాసుకుంటే అది "స్వీయచరిత్ర" (Autobiography). కాబట్టి Autobiography పదానికి అర్థం స్వీయచరిత్ర ఉండాలి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:18, 7 నవంబర్ 2009 (UTC)
తెలుగులో ఆటోబయోగ్రఫీ ని ఆత్మకథ అనీ, బయోగ్రఫీని జీవిత చరిత్ర అనీ ఎక్కువ మంది వాడుతున్నారు. లైఫ్ స్కెచ్ ని జీవిత చిత్రం అంటున్నారు. వివిన మూర్తి
ఆత్మకథ అనగ స్వీయఛరిత్ర
వికీకరణ మాసం
మార్చుగూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో వివిధ సభ్యులు తయారు చేస్తున్న వ్యాసాలు ఈ మధ్య ఎక్కువగా తెవికీలో కనిపిస్తున్నాయి. ఈ వ్యాసాలు పరిమాణం ప్రకారం, ఘనంగా ఉన్నా నాణ్యతలో తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి వ్యాసాలను మనం వికీకరణ చేస్తే మంచి వ్యాసాలుగా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి 2010 సంవత్సరం జనవరి నెలను వికీకరణ మాసంగా ప్రకటించి ఈ వ్యాసాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాల్సిందిగా సభ్యులను అభ్యర్థిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 17:16, 14 డిసెంబర్ 2009 (UTC)
- రవిచంద్ర గారి సూచన బాగుందు. అలాంటి వ్యాసాలను జాబితాగా తయారు చేస్తే సభ్యులు వారికి ఆసక్తి ఉన్న వాటిని సరిచేయటానికి వీలుగా ఉంటుంది. t.sujatha 05:31, 15 డిసెంబర్ 2009 (UTC)
- ఇలా వికీకరణ చేయాల్సిన వ్యాసాలలో వికీకరణ మూసను చేర్చుతున్నాను. అందువలన వికీకరించవలసిన వ్యాసాలు వర్గానికి వెళితే ఇలాంటి వ్యాసాల్ని గుర్తించవచ్చును. సమయం ఉన్నవాళ్ళు వారి ఇష్టాన్ని బట్టి ఒక్కొక్క వ్యాసాన్ని వికీకరిస్తే ఈ పని సులువుగా పూర్తిచేయవచ్చును.Rajasekhar1961 05:56, 15 డిసెంబర్ 2009 (UTC)
- ఈ ప్రతిపాదనను నేను ఇప్పుడే చూశాను. ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ముందుముందు వికీ ప్రగతికి క్రొత్త మార్గాలు చూపించగలదు. సభ్యులంతా 2010 జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో సమిష్టిగా ఈ విషయంపై దృష్టి పెట్టమని కోరుతున్నాను. --కాసుబాబు 18:47, 18 జనవరి 2010 (UTC)
- ఇలా వికీకరణ చేయాల్సిన వ్యాసాలలో వికీకరణ మూసను చేర్చుతున్నాను. అందువలన వికీకరించవలసిన వ్యాసాలు వర్గానికి వెళితే ఇలాంటి వ్యాసాల్ని గుర్తించవచ్చును. సమయం ఉన్నవాళ్ళు వారి ఇష్టాన్ని బట్టి ఒక్కొక్క వ్యాసాన్ని వికీకరిస్తే ఈ పని సులువుగా పూర్తిచేయవచ్చును.Rajasekhar1961 05:56, 15 డిసెంబర్ 2009 (UTC)