వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - అంకెలు

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

మార్చు
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
15, 16 శతాబ్దాల తెలుగు సాహిత్యంలో సంగీత గద్య ప్రబంధాలు [1] చల్లా విజయలక్ష్మి సాహిత్యంలో సంగీతం పరిశోధనా గ్రంథము సంగీతంలో సాహిత్యం వ్యక్తం, సాహిత్యంలో సంగీతం అంతర్నిహితం. (శృతుల్లో చెప్పబడిన మాట.) సంగీత లక్షణ గంధంతో కవులు ప్రతిభగలిగిన వచనాలను రచించారు.ఈ కళలు దేనికది ప్రత్యేకమైనా రెండూ పరస్పరబద్ధమైతే శ్రోతకు కలిగించే ఆనందసిద్ధి మాటల్లో చెప్పలేనిది.రామాయణంలో కావ్యగాన ప్రసక్తి, ఖండగతి గద్య, ఉదాహరణ ప్రబంధం మొదలైన వాటిని గురించి వివరించబడినదీ పరిశోధనా గ్రంథము 2020120033912 1992
1857 పూర్వరంగములు[2] దిగవల్లి వేంకట శివరావు చరిత్ర 1857 సిపాయిల తిరుగుబాటు/ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం వెనుక గల చారిత్రిక శక్తులు, ఆ యుద్ధం పరిణమించేందుకు కారణమైన పరిస్థితుల గురించి వ్రాసిన చరిత్ర గ్రంథం. బ్రిటీష్ చరిత్రకారులు, వారి అనుయాయులు భారతదేశాన్ని వలసపాలన నుంచి విముక్తి చేసే మహాప్రయత్నమైన 1857 యుద్ధాన్ని జాతీయ స్వాతంత్ర్య పోరాటమనేందుకు వీలులేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారనీ, దాన్ని తొలగించి చారిత్రిక సత్యాలు పునస్థాపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. ప్రముఖ చారిత్రికులు దిగవల్లి వేంకట శివరావు పలు ప్రామాణిక ఆధారాల నుంచి ఈ గ్రంథాన్ని రచించారు. 2990100067391 1957
1857 తిరుగుబాటు [3] మూలం.తల్‌మిజ్ ఖల్‌దున్, అనువాదం.గాడిచర్ల హరిసర్వోత్తమరావు చరిత్ర 1857లో జరిగిన తిరుగుబాటు భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన మహా సంఘటన. బ్రిటీష్ వారు భారతీయ సంస్థానాధీశుల విషయంలోనూ, భారతీయ సైనికుల విషయంలోనూ తమ విధానాలను పునర్నిర్మించుకుని పరిపాలించారు. భారతీయ జాతీయవాదులు కూడా ఈ సంఘటన నుంచి స్ఫూర్తిపొందారు. 1944లో ఆజాద్ హింద్ ఫౌజును నడిపించిన సుభాష్ చంద్ర బోస్ కూడా భారతీయులై బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్నవారిని తమవైపు తిప్పుకుంటే జరిగే పరిణామాలను దీని ద్వారానే అర్థంచేసుకున్నారని కొందరు చారిత్రికులు పేర్కొంటారు. భారతదేశ వలస పాలన, ఆపైన భారత స్వాతంత్ర్య ఉద్యమంపై తన వెలుగును ప్రసరించిన ఈ యుద్ధం గురించి రాసిన గ్రంథమిది 2040100047021 1988
999 తలలు నరికిన అపూర్వ చింతామణి [4] నాగశ్రీ నవల 999 తలలు నరికిన అపూర్వ చింతామణ అనే ఈ గ్రంతం ప్రఖ్యాత జానపద రచన. ఆంధ్రరత్న బుక్ డిపో వారు ప్రచురించిన ఈ రచన అద్భుతరసంతో పాటుగా బాలలను మరింతగా ఆకర్షించే విశేషాలతో కూడివున్నది. 9000000004825 1959