వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఐ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

మార్చు
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఐతరేయోపనిషత్తు [1] గోవారం శ్రీనివాసాచార్యులు ఆధ్యాత్మికం ఐతరీయ ఉపనిషత్తుకు సంబంధించిన గ్రంథమిది. 2040100047120 1920
ఐదు ఉపనిషత్తులు [2] ఇంగువ మల్లికార్జున శర్మ ఆధ్యాత్మికత, మార్క్సిస్ట్ సాహిత్యం, హిందూ మతం, తత్త్వ శాస్త్రం రచయిత స్వయంగా మార్క్సిస్ట్ అయివుండీ కమ్యూనిజం మానవ జాతి విముక్తి హేతువు అని నమ్ముతూ ఉండి ఈ రచన చేయడం కొందరికి విరోధాభాసగా తోచవచ్చు. ఐతే రచయిత సుదీర్ఘమైన పీఠిక ద్వారా ప్రాచీన ఉపనిషత్ సాహిత్యం ప్రపంచంలోని అత్యుత్తమమైన తత్త్వ శాస్త్ర గ్రంథాల క్రిందకు వస్తుందనీ, మార్క్సిస్టులు కూడా దానిని అధ్యయనం చేయాల్సివుందని పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ సంస్కృతి-తత్త్వం అపురూపమైన మానసిక, తాత్త్విక, భౌతికోన్నతి సాధించి ఉండగా మార్క్సిస్టులు దాని ఔన్నత్యాన్ని అంగీకరించి, పరిశోధనలు చేయడం మాని వ్యతిరేకించడం ద్వారా ఆ గొప్ప సంపదను చేజేతులారా అభివృద్ధి నిరోధకులకు అప్పగించేస్తున్నారని పేర్కొన్నారు. మావో జెడాంగ్ అత్యంత ప్రాచీనమైన తమ తాత్త్విక నేపథ్యాన్ని గొప్పగా వ్యాఖ్యానిస్తూ దానికి కమ్యూనిస్ట్ దృక్పథాన్ని చేరుస్తూ చైనీయుల సాంస్కృతిక సంపదను నిలబెట్టుకుంటూ కమ్యూనిజం సాధించారని, ఇది మన దేశ కమ్యూనిస్టులకు కూడా ఆదర్శం కావాలన్నారు. ఈ నేపథ్యంలో రచయిత సుదీర్ఘమైన పీఠికలోనూ, రచనలోనూ మార్క్సిజాన్నీ, ఉపనిషత్ తత్త్వాన్నీ సమన్వయ దృష్టితో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పుస్తకంలో ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తులను మూలసహితంగా, సటీకగా అందిస్తూ వాటిని తనదైన ప్రత్యేక రీతిలో వ్యాఖ్యానించారు. ఈ గ్రంథాన్ని మార్క్సిస్ట్ అధ్యయన వేదిక వారు ప్రచురించారు. 2020120000520 1999
ఐవానే గజల్ [3][dead link] మూలం.జీలానీ బానో, అనువాదం.బి.సీతాకుమారి నవల, అనువాదం ఐవాన్-ఎ-గజల్/ఐవానే గజల్ నవల హైదరాబాదు నగరంలో గత వైభవం తలచుకుంటూ నిర్వ్యాపారంగా కాలం గడిపే వ్యక్తి జీవితం చుట్టూ అల్లుకుంది. ఆ వ్యక్తి ముస్లిం మతస్తుడు, కవి సంప్రదాయానికి చెందిన కుటుంబంలో జన్మించినవాడు. వారి పూర్వులు అంతులేని సంపద సృష్టించగా తర్వాతి తరాలు ఏ పనీ లేకుండా కేవలం సాహిత్యం, లైంగికతతో జీవించడంతో క్రమంగా కుటుంబ సంస్కృతి నిస్తబ్దంగా మారిపోయి శిశిరంలోని చెట్టులా తయారవుతారు. ఈ నవలను పతనమవుతున్న ఫ్యూడల్ సంస్కృతికి అద్దంగా కొందరు సాహిత్యవేత్తలు భావించారు. అంతర భారతీయ గ్రంథమాల ద్వారా తెలుగులోకి అనువదించి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రకటించింది. 99999990175625 1998
ఐవాన్ హో [4] మూలం: వాల్టర్ స్కాట్, అనువాదం: కమలాకర వెంకటరావు నవల వాల్టర్ స్కాట్ ప్రముఖ ఆంగ్ల రచయిత, ఆయన వ్రాసిన నవలను కమలాకర వెంకటరావు చేసిన అనువాదం ఇది. ఇది చారిత్రిక నవల. దీనిలో నార్మన్లు ఎక్కువగా ప్రభువులగా విరాజిల్లడం ప్రారంభించిన కాలంలో మిగిలివున్న కొద్ది సాక్సన్ ప్రభువుల కుటుంబాల వారితో ముడిపడివున్న ఇతివృత్తం ఇది. 2020010001752 1926