వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ర
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
మార్చుపుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం రఘునాథ రాయలు (నవల) [1] కాకర్ల వెంకట రామనరసింహము నవల, చారిత్రిక నవల రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడే. రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు. ఈ నవల ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని రచించారు. 2030020024610 1951 రఘునాథ నాయకాభ్యుదయము, రఘునాథాభ్యుదయము [2] విజయ రాఘవ నాయకుడు ద్విపద కావ్యం, యక్షగానం రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. ఆయన వారసుడైన విజయరాఘవ నాయకుడు రఘునాథ నాయకాభ్యుదయమనే ద్విపద కావ్యాన్ని, రఘునాథాభ్యుదయమనే యక్షగానాన్ని ఆయన జీవిత గాథతో ముడిపెట్టి చెప్పారు. ఈ కావ్యాలను నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మల పరిష్కరణ, సంపాదకత్వంలో వారి విపులమైన పీఠికతో రచించారు. 2030020025261 1951 రత్నపేటిక [3] ఎం.గోపాలకృష్ణమూర్తి అపరాధ పరిశోధక నవల క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో తెలిపేవి అపరాధ పరిశోధక నవలలు. తెలుగులో ఒకనాడు వెల్లువలా వచ్చిన డిటెక్టివ్ నవలల్లో ఇదీ ఒకటి. రచయిత బరంపురానికి చెందినవారు. 2030020025020 1932 రత్నావళి [4] మూలం.శ్రీహర్షుడు, అనువాదం.మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి నాటకం, అనువాదం రత్నావళీ అనె అందమైన రాజకుమారి, ఉదయుడనే గొప్ప రాజు మధ్య జరిగిన ఇతివృత్తంగా అజ్ఞాత సంస్కృత నాటక రచయిత రత్నావళి నాటకాన్ని రచించారు. దాని కర్తగా నాటి భారత చక్రవర్తి హర్షుని పేరు పెట్టారని పండితుల అభిప్రాయం. నాటకంలో నాల్గంకాలు ఉన్నాయి. సాహిత్యంలో హోలీ పండుగను నమోదు చేసిన తొలి సాహిత్యం రత్నావళి నాటికే. ఈ నాటికను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి అనువదించారు. 2030020024700 1947 రమణీయ రామయణము [5] ఆదిపూడి సోమనాధరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120001813 1930 రమేశ్ బాబు [6] మండపాక గున్నేశ్వరరావు నవల, అపరాధ పరిశోధక నవల క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో తెలిపేవి అపరాధ పరిశోధక నవలలు. తెలుగులో ఒకనాడు వెల్లువలా వచ్చిన డిటెక్టివ్ నవలల్లో ఇదీ ఒకటి. రచయిత తాడేపల్లిగూడెం పట్టణానికి చెందినవారు. 2030020025079 1941 రస్టీ సాహసాలు [7] మూలం.రస్కిన్ బాండ్, అనువాదం.భార్గవీ రావు బాల సాహిత్యం రస్కిన్ బాండ్ భారతీయ ఆంగ్ల సాహిత్యరంగంలోనూ, బాల సాహిత్య రంగంలోనూ సుప్రసిద్ధులు. ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందిన రస్కిన్ బాండ్ తాను చిన్నతనం నుంచీ జీవిస్తున్న సుందరమైన హిల్ స్టేషను ముస్సోరీ గురించీ, ఆయన బాల్యం గురించీ అపురూపమైన పుస్తకాలు రచించారు. ఆయన బాలల సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ రాసిన పలు కథలు, కాల్పనికేతర సాహిత్యం, ఆత్మకథాత్మక వ్యాసాలు, నవలలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా నిర్ణయించారు. ఆయన రచించిన రస్టీ సాహసాలు అన్న నవల బాలలను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీన్ని తెలుగులోకి అనువదింపజేసి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా నెహ్రూ బాల పుస్తకాలయం శీర్షికలో ప్రచురించారు. 99999990128927 1996 రమాసుందరి-ద్వితీయ ఖండము [8] గ్రంథి సుబ్బారావు అపరాధ పరిశోధక నవల, నవల క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో తెలిపేవి అపరాధ పరిశోధక నవలలు. తెలుగులో ఒకనాడు వెల్లువలా వచ్చిన డిటెక్టివ్ నవలల్లో ఇదీ ఒకటి. 2030020025069 1933 రసపుత్ర కదనము [9] కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళు నాటకం చిత్తోర్/చిత్తోడ్ పౌరుషానికీ, వీరత్వానికి ప్రసిద్ధమైన రాజ్యం. రాజపుత్ర రాజుల పరిపాలనలో ఢిల్లీ చక్రవర్తిని కూడా ఎదిరించగలిగిన స్థితిలో ఉండేది. ఆ రాజ్యానికీ ఢిల్లీ సుల్తానైన అల్లావుద్దీన్‌తో జరిగిన చారిత్రిక పోరాటాన్ని ఈఇ నాటకంగా మలిచారు. 2030020024722 1922 రసాభరణము [10] అనంతామాత్యుడు సాహిత్య విమర్శ అనంతామాత్యుడు భోజరాజీయము అనే కావ్యం రచించిన కవి. అనంతామాత్యుడు ఛందోదర్పణమనే ఛందోగ్రంధాన్ని కూడా రచించాడు. ఆ క్రమంలోనే ఈ సాహిత్య లక్షణాలను వివరించే సాహిత్య విమర్శా శాస్త్ర గ్ర్నథాన్ని రచించారు. 2030020025492 1930 రసార్ణవ సుధాకరము-చమత్కార చంద్రిక [11] చిలుకూరి పాపయ్యశాస్త్రి అలంకార శాస్త్రం 2020050006224 1937 రసమఞ్జరీ [12] భానుమిశ్రకవి రచన, వేంకటరాయశాస్త్రిగ ఆంధ్రటీక రసస్వరూప చర్చ శృంగారరసస్వరూప ప్రతిపాదకముగా నవోఢ, ముగ్ధ, స్వీయ, పరకీయ మొదలైన 68 రకాల స్త్రీ అవస్థాభేదాలు, చతురుడు, నర్మసచివుడు, పీఠమర్ధుడు మొదలైన సుమారు 27 రకాల పురుష అవస్థా భేదాల గురించి చర్చించబడిన శ్లోకాలకు వేదం వేంకటరాయశాస్త్రిగారి చే ఆంధ్రటీక వ్రాయబడిన ఈ పుస్తకము సుమారు నూటికిపై బడిన పేజీలలో ఉంది.
2020050018511 1909 రామాయణము (మొల్ల) [13] ఆతుకూరి మొల్ల ఇతిహాసం, పద్యకావ్యం మొల్ల రామాయణము, సంస్కృతములో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది. 2020120001236 1911 రాం కబీర్ [14] ధర్మవరం గోపాలాచార్యులు నాటకం ధర్మవరం గోపాలాచార్యులు (1856) సుప్రసిద్ధ నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఇతనికి అగ్రజుడు. వీరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు. ఆయన రాసిన నాటకమిది. రామభక్తునిగా పేరొందిన కబీర్ దాసు హిందూముస్లిముల ఉమ్మడి సంస్కృతికి ప్రతీకల్లో ఒకరు. ఆయన జీవితం అటు చారిత్రికంగానూ, ఇటు భక్తిపరంగానూ ప్రాధాన్యత కలిగినది. అటువంటి జీవితాన్ని ఆధారం చేసుకుని గోపాలాచార్యులు ఈ నాటకం రాశారు. 2030020024748 1926 రాగ తాళ చింతామణి [15] సంపాదకుడు. టి.చంద్రశేఖరన్ సంగీత శాస్త్రం రాగతాళ చింతామణి భరత శాస్త్రంలోని సంగీత విషయాలకు ఆంధ్రీకరణ అంటూ గ్రంథ కర్తలు పేర్కొన్నారు. భరతశాస్త్రం దేశవ్యాప్తంగా సంగీత, నృత్యాది కళలకు శాస్త్రీయ ఆధార గ్రంథంగా ఉపకరిస్తోంది. ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. ఆ నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇతర బార్ కోడ్ 2020050006482 [16] 2030020025453 1952 రాగ మాలిక (పుస్తకం) [17] అడవి బాపిరాజు కథా సంపుటి బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు. బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. ఇది ఆయన రచించిన కథల సంపుటి. 2030020024688 1945 రాగమంజరి కందుకూరి వీరేశలింగం పంతులు నాటకం 9000000001101 1926 రాగవాసిష్ఠం [18] బోయి భీమన్న నాటకం బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు. భీమన్న వ్రాసిన ‘రాగవాసిష్ఠం’ నాటకంలో గల అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలోను, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించాడు. ఇతర బార్ కోడ్ 5010010033171 2030020024806 195౩ రాజకీయ పరిజ్ఞానము [19] మారేమండ రామారావు రాజనీతి శాస్త్రము ఈ గ్రంథం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రకటించారు. బ్రిటీష్‌వారి పరిపాలనలో దమననీతిని మాత్రమే అనుభవించిన భారతీయులు స్వాతంత్ర్యం రాగానే పురోగమించేందుకు అవసరమైన రాజనీతి తెలపాలనే భావనతో ప్రముఖ చరిత్రకారుడు మారేమండ రామారావు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంగానే కాక సామాన్యులైన పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా రాశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో రాజకీయ విధానాల గురించి వివరించారు. 2020120001217 1951 రాజభక్తి నాటకము [20] ఆర్.మదన గోపాల నాయుడు నాటకం, అనువాదం రాజభక్తి నాటకాన్ని రచయిత మరాఠీ నుంచి అనువదించారు. మహారాష్ట్రులు 19వ శతాబ్ది చివరి దశాబ్దాలు మొదలుకొని తెలుగునాట ప్రేక్షకూలను తమ నాటకాలతో అలరించారు. ఆ క్రమంలో పలువురు వాటిని తెనిగించారు. ఈ నాటకం కూడా ఆ కోవలోనిదే. 2030020024918 1937 రాజశేఖర విలాసము [21] కూచిమంచి తిమ్మకవి పద్యకావ్యము శివభక్తుడైన భళ్ళాణుడను ఒక రాజు కథను దానధర్మశీలతను శివుడు పరీక్షించి ఆతనిననుగ్రహించిన విషయమును అందమైన ధారాశుద్ధి గలిగిన పద్యరాశితో రాజశేఖర విలాసము అను పేరిట తిమ్మకవి రచించాడు. నూరు పేజీలు గల ఈ కృతితో పాటు మరిన్ని శైవ, వైష్ణవ భక్తి కావ్యములు, వ్యాకరణానికి చెందిన ప్రసిద్ధ గ్రంథములను కూడా తిమ్మకవి రచియించినటుల ఇందున్న ముందుమాట వలన తెలియుచున్నది. 2020050018761 1896 రాజస్థాను కథావళి (మొదటి సంపుటం) [22] చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహిత్యం, చరిత్ర రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశులుగా ఉనికిలోనే ఉన్నారు. వీరిలో మగవారి శౌర్యం, ధైర్యం, పోరాటపటిమలను, స్త్రీల మానసంరక్షణ, ఉన్నత నడవడికలను ఉత్తర భారతదేశ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కథలను సేకరించి, సరళమైన భాషలో చిలకమర్తి వారు తెలుగు పాఠకులకు అందించారు ఈ పుస్తకంలో. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినవి కాదు. అంతమాత్రాన అన్నీ కల్పితాలు, అతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్ర, కల్పన, అతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి. 2030020024519 1917 రాజపుత్ర తేజఃపుంజము రాణాప్రతాపసింగ్ [23] ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణ నాటకం, చారిత్రిక నాటకం రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశులుగా ఉనికిలోనే ఉన్నారు. వీరిలో మగవారి శౌర్యం, ధైర్యం, పోరాటపటిమలను, స్త్రీల మానసంరక్షణ, ఉన్నత నడవడికలను ఉత్తర భారతదేశ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు. 1576లో హల్దిఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయాడు. ఆయన జీవితాన్ని ఈ నాటకం రూపంలో మలిచారు. 2030020025287 1925 రాజ్యలక్ష్మి (నాటకం) [24] నండూరి బంగారయ్య నాటకం, సాంఘిక నాటకం ఇది నండూరి బంగారయ్య రచించిన తొలి నాటకం. కనుపర్తి రాజ్యలక్ష్మి రచించిన ఒట్టు కథ చదవగా ఇందులోని కొంత భాగం స్ఫురించిందని కవి స్వయంగా చెప్పుకున్నారు. 2030020025142 1932 రాజమన్నారు నాటికలు [25] పాకాల వెంకట రాజమన్నారు నాటికలు పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (1901 - 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఏ.జె. జాన్ మరణించడంతో హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా ఉన్న రాజమన్నారు 1957 నుండి 1958 వరకు మద్రాసు రాష్ట్ర ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు. రాజమన్నార్ తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించాడు. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశాడు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నాడు. కొంతకాలం లలితకళకు సంబంధించిన తమిళ మాసపత్రిక "కళ"కు సంపాదకత్వం వహించాడు. రాజమన్నార్ వ్రాసిన నాటకాలెన్నో రేడియోలో ప్రసారమయ్యాయి. వాటిలో చాలా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఈయన బళ్ళారి రాఘవతో కలిసి "తెగని సమస్య" అనే నాటకాన్ని రచించాడు. తెలుగులో ఏకాంకికలు వ్రాసిన ఆద్యులలో ముద్దుకృష్ణ, చలంలతో పాటు రాజమన్నారు కూడా ఒకడు. ఇవి ఆయన రచించిన నాటకాలు. 2030020025051 1955 రాజస్థాను కథావళి (రెండవ సంపుటం) [26] చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహిత్యం, చరిత్ర రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశులుగా ఉనికిలోనే ఉన్నారు. వీరిలో మగవారి శౌర్యం, ధైర్యం, పోరాటపటిమలను, స్త్రీల మానసంరక్షణ, ఉన్నత నడవడికలను ఉత్తర భారతదేశ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కథలను సేకరించి, సరళమైన భాషలో చిలకమర్తి వారు తెలుగు పాఠకులకు అందించారు ఈ పుస్తకంలో. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినవి కాదు. అంతమాత్రాన అన్నీ కల్పితాలు, అతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్ర, కల్పన, అతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి. ఇది ఆయన రాసిన రాజస్థాను కథావళికి రెండవ సంపుటం. 2040100047229 1938 రాజగోపాల విలాసము [27] చెంగల్వ కాళకవి ప్రబంధం దక్షిణాంధ్ర యుగమని పేరొందిన తంజావూరు నాయకుల కాలంలో వెలువడ్డ ప్రబంధమిది. కాళకవి విజయ రాఘవ నాయకుని ఆస్థానంలోని వాడు. ఈ గ్రంథం విజయ రాఘవునికి అంకితంగా రాయడమే కాక ముందు చాలా భాగం వారి వంశ ప్రశస్తి తెలిపేందుకు రాశారు. 2030020025041 1951 రాజ్యాంగ వివేకము [28] రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ రాజనీతి శాస్త్రం, చరిత్ర ప్రపంచంలోని వివిధ దేశాలు, జాతుల్లో రాజకీయం, రాజ్యాంగం వంటి భావనలు, పద్ధతులు ఎలా ఉండేవో, నేటి సమాజం వరకూ ఎలా మారుతూ వచ్చాయో ఈ పుస్తకంలో వివరించారు. సనాతనమైన వేదవాౙ్మయం మొదలుకొని నేటి వరకూ వివిధ రాజ్యాంగ భావనల్లో వచ్చిన పరిణామ క్రమాన్ని చిత్రించారు రచయిత. ఆ క్రమంలో గ్రీస్, రోమన్, ఫ్రాన్స్, రష్యా, భారతదేశం, చైనా మొదలైన దేశాల్లోని రాజకీయ వ్యవస్థల గురించిన వివరాలు ఇచ్చారు. 5010010031552 1935 రాణీ సంయుక్త (నవల) [29] వి.సుబ్బారావు చారిత్రిక నవల పృథ్వీరాజు, కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త (సంయోగిత)ను తీసుకొనిపోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దై వ్రాసిన పృథ్వీరాజ్ రాసో అనే కావ్యం ఈ కథపై ఆధారితమైనదే. ఆ కథను ఆధారం చేసుకుని ఈ నవల రచించారు. 2030020024611 1915 రామచంద్ర శతకము [ ] ఏటుకూరి సీతారామయ్య శతకం శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పవచ్చు. ఆ క్రమంలో తెలుగునాట వెల్లువైన శతకాల్లో ఇది ఒకటి. ఈ రచయిత బహుగ్రంథకర్త. 1922ల్లో రాసిన ఈ శతకంలో పూర్వశతకాల వలె నీతి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు కాక ఉరకలెత్తుతున్న జాతీయోద్యమ స్ఫూర్తియైన హరిజనోద్ధరణ, స్త్రీస్వాతంత్ర్యం వంటి వాటిని, ద్రవిడ ప్రాంతంలో పెరుగుతున్న బ్రాహ్మణేతరోద్యమం (బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం అని కూడా వ్యవహారం) వంటి వాటిని ప్రవేశపెట్టారు గ్రంథకర్త. 1922 రామదాసు (నాటకం) [30] రామనారాయణ కవులు నాటకం, చారిత్రిక నాటకం భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఆయన జీవిత కథను కొంత కల్పన చేర్చి ఈ నాటకంగా మలిచారు. 2030020024607 1929 రామదాసు నాటకం [31] డి.వేంకటరమణయ్య నాటకం, చారిత్రిక నాటకం భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఆయన జీవిత కథను కొంత కల్పన చేర్చి ఈ నాటకంగా మలిచారు. 2030020024798 1927 రామచంద్రోపాఖ్యానము [32] వారణాసి వేంకటేశ్వర కవి పద్యకావ్యం రామాయణము మొత్తం కథను పరిశీలించి, సంక్షేపించి, ఆరు కాండములలో ఉన్న రామాయణ కావ్యాన్ని ఆరు ఆశ్వాసములకు కుదించి రామచంద్రోపాఖ్యానమని పేరు పెట్టారు. ఈ రచనలో కవి కొంత భాగం గద్యం (వచనం)లోనూ, కొంత భాగం పద్యం (కవిత)గానూ రాసారు. ఈ కావ్యము 1911 లో ముద్రితమయింది. ఈ ముద్రణకు పీఠిక పురాణపండ మల్లయ్యశాస్త్రి రాసారు. ఈ రచనను వేంకటేశ్వర కవి కుక్కుటేశ్వర స్వామికి అంకితమిచ్చారు. 2030020025080 1911 రామోపాఖ్యానము తద్విమర్శనము [33] కావ్యం.ఎర్రన, విమర్శ.పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పద్యకావ్యం, సాహిత్య విమర్శ ఎర్రాప్రగడ రచించిన రామాయణం రామోపాఖ్యానం. ఆయన రాసిన తొలినాళ్ళ కావ్యంగా దానికి పండితోలోకంలో ప్రత్యేకాసక్తి కలిగివుంది. ఆ కావ్యాన్నీ దానిపై తాను రచించిన విమర్శనూ ప్రచురించారు పెండ్యాల వారు. 2030020025176 1938 రామాయణ విశేషములు [34] సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. ఇది రామాయణాంతర్గతమైన విశేషాల గురించి ఆయన రాసిన వ్యాస సంకలనం. 2030020025417 1943 రామరాజీయము [35] వెంకయ్య పద్యకావ్యం ఆరవీటి రామరాయలు (జ.1484[1] - మ.1565) (Rama Raya) శ్రీ కృష్ణదేవ రాయలు అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. విజయనగర రాజ వంశములలో నాలుగవది, చివరిదీ ఐన అరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు (కన్నడములో అళియ అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు. ఆయన సింహాసనాన్ని అధిష్టించడాన్ని ఈ గ్రంథంలో అభివర్ణించారు. 2030020025218 1923 రామకృష్ణ - వివేకానంద [36] విన్నకోట వేంకటరత్నశర్మ నాటకం, చారిత్రిక నాటకం శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (1836 ఫిబ్రవరి 18 - 1886 ఆగష్టు 16) ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది. స్వామీ వివేకానంద (1863 జనవరి 12 - 1902 జూలై 4), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. వీరిద్దరూ గురుశిష్యులుగా అత్యంత ప్రాచుర్యం కలిగినవారు. ఇది వీరి జీవితాలపై రచించిన నాటకం. 2030020025002 1950 రామస్తవం [37] పేరు తెలియదు ఆధ్యాత్మికం రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచునారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. ఇది ఆయనను కీర్తించే స్తవము. దీనిని రచించిన కవి ఏదో కారణంతో తన పేరును గుప్తంగా ఉంచారు. 2020050015294 1924 రామాభ్యుదయము [38] అయ్యలరాజు రామభద్రుడు ప్రబంధం, పద్యకావ్యం రామాభ్యుదయము ఒక తెలుగు ప్రబంధము. దీనిని అయ్యలరాజు రామభద్రుడు రచించారు. ఇది ఎనిమిది ఆశ్వాసాల బృహత్ప్రబంధం; ఇందులో పద్దెనిమిది వందలకు పైగా పద్యాలున్నాయి. 2030020025466 1917 రామాయణ సంగ్రహము [39] పత్రి విశ్వేశ్వర శాస్త్రి పద్యకావ్యం భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము. వాల్మీకి రామాయణాన్ని సంక్షిప్తపరిచి పద్యరూపంగా కవి రచించారు. 2030020025134 1934 రామాశ్వమేధము [40] చింతలపాటి రామమూర్తి శాస్త్రి పద్యకావ్యం అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. రాముడు నిర్వహించిన అశ్వమేధం వరకూ సాగే ఈ కావ్యం సంస్కృతానువాదం. 2030020025362 1941 రామేశ్వర మహాత్మ్యము [41] ఏనుగు లక్ష్మణ కవి పద్యకావ్యం ఏనుగు లక్ష్మణ కవి క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లి గారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతి తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీద అనువాదం చేసాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. ఏనుగు లక్ష్మణ కవి 2. పుష్పగిరి తిమ్మన 3. ఏలకూచి బాలసరస్వతి. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు. ఆ లక్ష్మణ కవి రచించిన పద్యకావ్యమిది. 2030020025264 1903 రాయబారము (ప్రథమ సంపుటి) [42] దేవరాజు వేంకట కృష్ణారావు సాహిత్యం 2020050006182 1928 రాయచూరు యుద్ధము[43] కేతవరపు వేంకటశాస్త్రి నవల రాయచూరు దక్షిణ భారతదేశమందలి కర్ణాటక రాష్ట్రములోని చిన్న పట్టణము. కృష్ణ తుంగభద్ర నదుల అంతర్వేదిలోనున్న ఈ పట్టణము చారిత్రకముగా ప్రసిద్ధి గాంచింది. విజయనగర రాజులకు, గుల్బర్గా మరియు బిజాపూరు సుల్తానులకు మధ్య పెక్కు యుద్ధములకు కారణమైనది. శ్రీ కృష్ణదేవరాయలకు అహమ్మదు షాకు మధ్య 1520లో జరిగిన యుద్ధము దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. ఆ రాయచూరు యుద్ధం కారణంగానే కృష్ణదేవరాయలుకు తన సామ్రాజ్యంపై పట్టు దొరికింది. అటువంటి కీలకమైన యుద్ధగాథను ఇతివృత్తంగా తీసుకుని ఈ చారిత్రిక నవల రాశారు. 2020050016612 1938 రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం) [44] కల్లూరు అహోబలరావు సాహిత్య విమర్శ, చరిత్ర రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతపు సాహిత్యం ఎంతగానో సుసంపన్నమైంది. విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే. కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది. ఈ గ్రంథంలో రాయలసీమకు చెందిన రచయితల చరిత్రను అందించారు. 2990100061748 1975 రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం) [45] కల్లూరు అహోబలరావు సాహిత్య విమర్శ, చరిత్ర రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతపు సాహిత్యం ఎంతగానో సుసంపన్నమైంది. విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే. కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది. ఈ గ్రంథంలో రాయలసీమకు చెందిన రచయితల చరిత్రను అందించారు. రెండో సంపుటంలో మరికొందరు రచయితల జీవితం, సాహిత్య కృషి అందించారు. 2990100061749 1977 రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటం [46] కల్లూరు అహోబలరావు సాహిత్యం, చరిత్ర, జీవిత చరిత్ర రాయలసీమ ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలైన నవల, కథ మొదలైనవి ఆలస్యంగా ప్రారంభమైనవన్న ప్రథ ఉన్నా రాయలసీమ రచయితలు ఆ ప్రక్రియలను వేగంగా తమ సొంతం చేసుకుని అపురూపమైన సాహిత్యాన్ని సృష్టించారు. కరువు, అలజడులు, వర్షాధార స్థితిగతులతో నిత్యం జీవితంతో పోరాటం చేయాల్సిన స్థితిగతులు సాహిత్యంలో అద్భుతరీతిలో చిత్రీకరించినవారున్నారు. అటువంటి రచయితల గురించి ఈ సంపుటాల్లో అహోబలరావు జీవిత గాథలుగా వివరించారు. 2990100061827 1981 రాయలసీమ రచయితల చరిత్ర (నాల్గవ సంపుటం) [47] కల్లూరు అహోబలరావు సాహిత్య విమర్శ, చరిత్ర రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతపు సాహిత్యం ఎంతగానో సుసంపన్నమైంది. విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే. కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది. ఈ గ్రంథంలో రాయలసీమకు చెందిన రచయితల చరిత్రను అందించారు. రెండో సంపుటంలో మరికొందరు రచయితల జీవితం, సాహిత్య కృషి అందించారు. 2990100061750 1986 రాహుల్ సాంకృత్యాయన్ [48] మూలం. ప్రభాకర్ మాచ్వే, అనువాదం. ఎస్.ఎస్.ప్రభాకర్ జీవిత చరిత్ర హిందీ యాత్రాసాహిత్య పితగా మహాపండిట్ రాహుల్ సాంకృత్యాయన్ స్థానం చెదరనిది. భారతీయ పండితుల్లో అత్యంత విస్తృతంగా యాత్రలు చేసిన అరుదైన వ్యక్తి. తన జీవితంలో 45 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఇంటికి దూరంగా యాత్రల్లోనే గడిపారు. ముందు బౌద్ధ భిక్షువుగా, అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా మారారు. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా పనిచేశారు. బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసిన కారణంగా 3 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించారు. ఆయన మేధోసంపత్తికీ, పాండిత్యానికి గాను మహాపండిట్ అన్న పేరుతో పిలుస్తూంటారు. రాహుల్ సాంకృత్యాయన్ బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆర్యుల సంస్కృతి గురించి చేసిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతానికి అనుకూలంగా ఓల్గా నుంచి గంగకు, వివిధ చారిత్రిక కాలాలను కాన్వాసుగా తీసుకుని పలు నవలలు, ఆత్మకథ వంటివి రచించారు. ఆయన రచనలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తన డైరీలను ఆయన సంస్కృతంలో రాసుకునేవారు, విస్తృతమైన యాత్రలు చేసి ప్రపంచానుభవం గడించిన రాహుల్‌జీ డైరీలు కూడా సాహిత్య విలువలు కలిగి ఉన్నాయి. ఆయన జీవితం, సాహిత్యాలను భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 2990100061743 1989 రుక్మిణీ కళ్యాణం [49] పోతన పద్య కావ్యం రుక్మిణీ కళ్యాణం మహాభాగవత పురాణంలో దశమ స్కందములోని ఒక ఘట్టం. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు విదర్భ రాజైన భీష్మకుని కుమార్తెయైన రుక్మిణిని వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు. 2030020024886 1928 రుక్మిణీదేవి సీమంతము [50] జానపదులు స్త్రీల పాటలు, మంగళహారతి రుక్మిణీ దేవి సీమంత శుభసందర్భం వివరిస్తూ సాగే జానపదగీతం. ఇందులో కథా వృత్తాంతంతో బాటు, గర్భవతి తినవలసినవి, విశ్రాంతి తీసుకోవలసినవి, తీసుకోవలసిన జాగ్రత్తలు, అందరితో పాటు కలిసిమెలిసి ఉండే సమాజపు రీతులు, వీటితో పాటు కృష్ణలీలలు మరియు మంగళం పాట ఉంటాయి.మొత్తం అచ్చులో 18 పుటలున్న ఈ గీతం లయబద్ధంగా సాగే జానపదగీతం. ] 2020050018477 1897 రూడిన్ [51] మూలం.ఇవాన్ టర్జనీవ్ నవల, అనువాదం ప్రముఖ రష్యన్ నవలాకారుడు టర్జనీవ్ రాసిన తొలి నవల ఇది. 19వ శతాబ్ది అర్థభాగంలోనే ఆయన ఈ నవల ద్వారా తొలినాళ్ళ రష్యన్ నవలలకు బీజాలు వేశారు. క్రిమియా యుద్ధం అనంతర స్థితిగతులను ఆధారం చేసుకుని రచించిన ఈ నవలలో ప్రధాన ఇతివృత్తం నాయకా నాయకుల ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఈ నవల ఆంగ్లవికీ పేజీ ఇది. 2030020024618 1955 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-అదిలాబాద్ జిల్లా [52] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007190 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-అనంతపురం జిల్లా [53] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007182 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-కడప జిల్లా [54] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007184 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-కరీంనగర్ జిల్లా [55] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 9000000001183 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-కర్నూలు జిల్లా [56] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007196 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-కృష్ణా జిల్లా [57] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007195 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-ఖమ్మం జిల్లా [58] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007194 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-చిత్తూరు జిల్లా [59] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007183 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-తూర్పు గోదావరి జిల్లా [60] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007187 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-నల్గొండ జిల్లా [61] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007198 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-నిజామాబాద్ జిల్లా [62] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007201 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-నెల్లూరు జిల్లా [63] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007200 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-పశ్చిమ గోదావరి జిల్లా [64] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007186 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-మెదక్ జిల్లా [65] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 9000000001550 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-వరంగల్లు జిల్లా [66] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007188 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-విశాఖ జిల్లా [67] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007203 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-శ్రీకాకుళం జిల్లా [68] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007202 1959 రెండో పంచవర్ష ప్రణాళిక 1959-60-హైదరాబాదు జిల్లా [69] ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ 2020010007192 1959 రెండో ప్రపంచ తెలుగు మహాసభలు 1981 ఏప్రిల్ [70] ప్రచురణ అంతర్జాతీయ తెలుగు సంస్థ సావనీర్ 6020010029619 1981 రెండో ప్రపంచయుద్ధమా? [71] హనుమంతరావు చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. రెండో ప్రపంచయుద్ధం మొదలైన కొద్ది సంవత్సరాలలో యుద్ధస్థితిగతులు, యుద్ధం వెనుక కారణాలు, భవిష్యత్ పరిణామాల ఊహాచిత్రం వంటీవి ఈ గ్రంథంలో రాశారు. అప్పట్లో వార్తాపత్రికలను అంతగా చదివే అలవాటు లేని సాధారణ అక్షరాస్యులు కూడా ప్రపంచయుద్ధం వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ గ్రంథం రచింపబడింది. 2030020025427 1950 రేగడి విత్తులు [72] చంద్రలత నవల ‘విత్తనం తో విప్లవం’ ఇది ‘రేగడివిత్తులు’ నవల ద్వారా రచయిత్రి చంద్రలత ఇచ్చిన సందేశం. 1996-7ల్లో ఉత్తరమెరికా తెలుగు సభ (తానా) నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి రూ. 1.2 లక్షలు అందుకున్న ఈ నవల, నాలుగు దశాబ్దాల కాలంలో వ్యవసాయం లోనూ, వ్యవసాయాన్ని నమ్ముకున్న ఓ పల్లెటూరి కుటుంబంలో వచ్చిన మార్పులని నిశితంగా చిత్రించింది. 2990100051763 1997 రేణుకాదేవి ఆత్మకథ (నవల) [73] మాలతీ చందూర్ నవల 1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. ఆమె రచించిన నవలల్లో ఇది ఒకటి. 2030020025250 1955 రంగభక్త లీలామృతము [74] సత్యనారాయణ భక్తి మహారాష్ట్రలో పాండురంగస్వామి ఇంటింటికీ ఇలవేల్పుగా ప్రఖ్యాతుడు. తుకారాం, పుండరీకుడు మొదలైన ప్రఖ్యాత భక్తులు పాండురంగ భక్తులే. ఆయా భక్తుల కథలన్నిటినీ గుదిగుచ్చి వచన రూపంలో రచించి ఈ గ్రంథంగా అందించారు. 2030020024466 1952 రంగరాయ చరిత్రము [75] నారాయణ కవి జీవిత చరిత్ర, పద్యకావ్యం బొబ్బిలి సంస్థానం బ్రిటీష్ వారికి పూర్వం నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రధానమైనదిగా కొనసాగుతూ వచ్చింది. రంగారావు అన్న పేరు వారి వంశీకులకు పారంపర్యంగా వస్తోంది. ఈ రచన రంగారావు బిరుదు వహించిన ఒకానొక సంస్థానాధీశుని గురించి రచించింది. 2030020025505 1914 రంగూన్ రౌడీ (నాటకం) [76] సోమరాజు రామానుజరావు సాంఘిక నాటకం వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా రచించిన నాటకమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం-గృహలక్ష్మికి ఆధారం. 2030020025013 1935 రాంగేయ రాఘవ [77] మూలం.మధురేశ్, అనువాదం.జ్వాలాముఖి జీవిత చరిత్ర హిందీ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన అభ్యుదయ రచయిత రాంగేయ రాఘవ. ఆయన తమిళ మూలాలున్న వ్యక్తి ఐనా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు పూర్వీకులు వలస రావడంతో హిందీ భాషీయునిగా ఆ భాషా సాహిత్యాలను సుసంపన్నం చేశారు. విస్తృతమైన అధ్యయనం, అనన్య సాధ్యమైన నిబద్ధత, మంచి ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్న వ్యక్తి కావడంతో ఆయన రచనలు శాశ్వతత్వం పొందాయి. అభ్యుదయవాదాన్ని సమర్థిస్తూ రచనలు చేసిన రాఘవ జీవితాంతం వేరే ఉద్యోగమేదీ చేయకుండా ఆర్థిక ఇబ్బందులను, ఉన్నతోద్యోగాల ప్రలోభాలను ఎదుర్కొని రచనలు సాగించారు. వివాహం తన అధ్యాయనం, రచనలకు అడ్డువస్తుందన్న అనుమానంతో 33ఏళ్ళ వరకూ పెళ్ళి సంబంధాలను తిరస్కరించారు. రచనా వ్యాసంగానికి అడ్డుపడదని నమ్మకం కుదిరాకే పెళ్ళి చేసుకున్నారు. మెడపై వేసిన రాచపుండును కాన్సర్‌గా గుర్తించకపోవడంతో ఆయన అకాలమరణం చెంది హిందీసాహిత్యానికి తీరనిలోటు మిగిల్చారు. ఆయన జీవితాన్ని గురించి భారతీయ సాహిత్య నిర్మాతలు సీరీస్‌లో సాహిత్య అకాడమీ మధురేశ్ రచించిన గ్రంథాన్ని ప్రముఖ విప్లవ కవి జ్వాలాముఖి అనువదించి విపులమైన పీఠికతో ప్రచురించారు. 2990100051758 1998 ఆర్. యస్. యస్. ఆకృతి దాల్చిన ఆదర్శం [78] హెచ్.వి.శేషాద్రి, అనువాదం: కె.శ్రీనివాసమూర్తి, రాంమాధవ్ సమాజం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వ్యవస్థాపకుడు డా.హెడ్గేవర్ జన్మశతాబ్ది సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ చరిత్ర, ఆదర్శాలు, కార్యకలాపాలను వివరిస్తూ హెచ్.వి.శేషాద్రి వ్రాసిన ఆంగ్ల పుస్తకానికి ఇది తెలుగు అనువాదం .ఇతర బార్ కోడ్లు 6020010035335 02020120020891 1990 రాచకన్యకాపరిణయము - సమగ్రపరిశీలనము [79] తలముడిపి బాలసుబ్బయ్య పరిశోధన, భాషాశాస్త్రం, సాహిత్యం వెల్లూరు నరసింగకవి విరచిత రాచకన్యకాపరిణయము కావ్యము పై సిద్ధాంత పరిశోధనా గ్రంథము. ఈ గ్రంథం చివరన రాచకన్యకాపరిణయము పూర్తి పాఠ్యము కూడా పొందుపరచబడినది ఇతర బార్ కోడ్లు 2990100051756, 2990100061741. 02990100071523 1989 రాచకొండ విశ్వనాథశాస్త్రి [80] కె.కె.రంగనాథాచార్యులు జీవితచరిత్ర, సాహిత్యం భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శృంఖలలో రాచకొండ విశ్వనాథశాస్త్రిపైన కేంద్ర సాహిత్య అకాడమీ వెలువరించిన మోనోగ్రాఫ్ 2990100061742 2000 రాధ [81] పొన్నలూరు పద్మావతి నవల 2990100071524 1978 రాధాకృష్ణ [82] ద్రోణంరాజు సీతారామకవి నాటకం 2020050015828 1925 రాధాకృష్ణ లీల [83] కంచర్ల వెంకట హనుమయ్య నాటకం ఈ నాటకానికి చంద్రముఖీ గర్వభంగము అన్న పేరు కూడా గలదు. 2020050015974 1927 రాధాకృష్ణ నాటకము [84] పానుగంటి లక్ష్మీనరసింహరావు నాటకము 5010010033167 1928 రాధికా సాంత్వనము [85] ముద్దుపళని కావ్యము ముద్దుపళని విరచిత శృంగారకావ్యము. దీనికి ఇళాదేవియమను నామాంతరము కూడా గలదు 2020050006419 1950 రాధికా సాంత్వనము - వెంపటి నాగభూషణం సమీక్షతో [86] రచన: ముద్దుపళని కావ్యము వెంపటి నాగభూషణం సమీక్షతో శ్రంగార కావ్య గ్రంథ మండలికోసం ప్రచురించబడిన ప్రతి 5010010076937 1939 రాధికా సాంత్వనము - సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు పీఠికతో [87] ముద్దుపళని కావ్యము సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు పీఠికతో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురణ 2020010002176 1953 రాధికా సాంత్వనము - బెంగుళూరు నాగరత్నమ్మ పరిష్కృత ముద్రణ [88] ముద్దుపళని కావ్యము బెంగుళూరు నాగరత్నమ్మ పరిష్కృత ముద్రణ 2020010002072 1950 రాజ్యలక్ష్మి [89] నండూరి బంగారయ్య నాటకము ఆరంకముల సాంఘీక నాటకము . ఇతర బార్ కోడ్లు , 2020120035305, 2030020024749, 2030020025142 2020120001226 1938 రాగతాళచింతామణి [] పోలూరి గోవింద కవి కళలు భరతముని యొక్క భరతశాస్త్రమునకు తొలి ఆంధ్రీకరణ ఈ గ్రంథము. నాట్యంలో రాగ తాళాల యొక్క ప్రాధాన్యత చాటడానికే కవి దీనిని రాగతాళచింతామణి అని పేరు పెట్టాడు. ఈ గ్రంథం మద్రాసులోని ప్రాచ్యలిఖిత భండాగారములోని తాళపత్రాలనుండి పరిష్కరించి, ప్రచురించబడింది. 1952 రాగజలధి [90] లత నవల 2020010007000 1960 రాగమాలిక జ్ఞానామృతము [91] సంకలనం: ఋషి సంస్కృతి విద్యాకేంద్రం ఆధ్యాత్మికం సిద్ధిసమాధి యోగకు సంబంధించిన ప్రార్థనలు, యోగసూత్రాల సంకలనం 2990100071525 1997 రాఘవపాండవీయము [92] పింగళి సూరన కావ్యము, సాహిత్యం విద్వాన్ ఈ. భాష్యకాచార్యుల యొక్క టీకా తాత్పర్యాలతో ప్రచురించబడిన నాలుగు ఆశ్వాసాల పింగళి సూరన కావ్యము. ఈ కావ్యాన్ని సూరన, విజయనగర పాలానకాలంలో, ప్రస్తుత ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఆకవీడును పాలించిన ఆకువీటి తిమ్మప్రభువుకు అంకితమిచ్చాడు. 2990100071526 రాజ కళింగగంగు [93] క్రొత్తపల్లి సూర్యరావు చారిత్రక నాటకము ఆంధ్రదేశసంబంధమగు ఐదంకముల ఈ నాటకమును చెన్నపట్నంలో ఆంధ్ర పరిషత్ పత్రికా కార్యదర్శులైన క్రొత్తపల్లి సూర్యరావు గారు రచించారు 2990100061744 1924 రాజరాజు [94] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చారిత్రక నాటకము రాజరాజు ఆంధ్రసాహిత్యానికి తొలిపాదుపెట్టిన రాజరాజనరేంద్రుని కథ 2990100067501 1944 రాజభక్తి [95] వెంకట పార్వతీశ్వర కవులు కావ్యము వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు. ఇంగ్లాండు పరిపాలకుడైన జార్జి చక్రవర్తియై పట్టాభిషేకం పొందినప్పుడు ఆశ్వీర్వాద పద్యాలుగా వీటిని రచించారు. 2030020024548 1915 రాజభక్తి నాటకము [96] ఆర్. మదనగోపాల నాయుడు నాటకము మరాఠీ భాష నుండి అనువదించబడిన భక్తిరస ప్రధానమైన పౌరాణిక నాటకము. 2020050015542 1937 రాజకీయ వ్యాసాలు, [97] కొడవటిగంటి కుటుంబరావు కూర్పు: కృష్ణాబాయి, ప్రసాద్ సాహిత్యం, వ్యాససంపుటి కొకు వ్యాసప్రపంచం శీర్షికన విరసం వారు ప్రచురించిన వ్యాససంపుటి 2990100061745 2001 రాజలక్ష్మి ప్రతాపచంద్ర విజయము [98] జె.ఆదినారాయణ రెడ్డి నవల, చరిత్ర చారిత్రక నవల. పదమూడవ శతాబ్దంలో దేవగిరి రాజధానిగా మహారాష్ట్ర ప్రాంతాన్నేలిన యాదవరాజు రామదేవుడు ఈ నవలలో కథానాయకుడు 2020050015001 1935 రాజుపాళయం రాజకవుల యక్షగానములు [99] గొట్టుముక్కల కృష్ణమరాజు, గొట్టుముక్కల సింగరాజు, గొట్టుముక్కల కుమారపెద్దిరాజు సాహిత్యం, యక్షగానము ఆచార్య తిమ్మావజ్ఝుల కోదండరామయ్యచే పరిష్కరించబడి ప్రచురితమైన సంస్థానపాలకుల యక్షగానములు. ఇది సీతా కళ్యాణము, పారిజాతాపహరణము, సావిత్రి అనే మూడు యక్షగానముల సంకలనం 2990100051757 1981 రాజర్షి [100] రవీంద్రనాథ ఠాగూరు చరిత్ర, నవల విశ్వకవి రవీంద్రనాథుని రచన. కె.రమేష్ బెంగాళీ మూలం నుండి అనువదించారు. ఇది చారిత్రక నవల 2990100071527 1964 రాజసందర్శనము [101] దివాకర్ల వేంకటవధాని సాహిత్యం, కావ్యము పద్యకావ్యము 2990100067502 1947 రాజశేఖర చరిత్రము [102] కందుకూరి వీరేశలింగం సాహిత్యం, నవల తెలుగులో తొట్టతొలి నవలలో ఒకటి రాజశేఖర చరిత్రము. కందుకూరి ఈ నవల కల్నల్ మెంకజీకి అంకితమిచ్చాడు. ఈ నవల వివేకచంద్రికయను మరో పేరు కూడా ఉంది. 2990100071528 2004 రాజశిల్పి [103] పాటిబండ మాధవశర్మ నవల ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారు 1957లో నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన రచన 2990100071529 1964 రాజస్థాన కథావళి మొదటి భాగము [104] చిలకమర్తి లక్ష్మీనరసింహం కథలు, చరిత్ర, సాహిత్యం మరో ప్రచురణ 2030020024638 1937 రాజసూయరహస్యము [105] పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి చరిత్ర. పరిశోధన రాజసూయయాగంపై చారిత్రక పరిశోధనా గ్రంథము 2030020024515 1938 రాజవాహనవిజయము [106] కాకమూని మూర్తికవి ప్రబంధకావ్యము 16వ శతాబ్దానికి చెందిన కాకమూని మూర్తికవి ప్రణీతమైన ఐదు ఆశ్వాసాల ప్రబంధకావ్యము. నందిరాజు చలపతిరావు ప్రవేశికతో 2990100071530 1937 రాజయోగరత్నాకరము [107] దొరసామయ్య ఆధ్యాత్మికము వేదాంతవిద్యాభిలాషులకు ఉపయుక్తమైన గ్రంథము, దొరసామయ్య తాత్పర్యములతో 5010010088585 1909 రాజయోగసారము ద్విపదకావ్యము [108] తరిగొండ వెంగమాంబ సాహిత్యము, ఆధ్యాత్మికము తరిగొండ వెంకమాంబ (1800 - 1866), 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. వెంకమాంబ అనేక పాటలు, యక్షగానాలు రచించింది. సాహిత్యంలో మెలకువలు, రహస్యాలు తెలియకనే, అలంకార వ్యాకరణాది శాస్త్రాలు చదవకనే, కేవలం తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయ వల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని, తన కృతి వేంకటాచలమాహాత్మ్యం అవతారికలో వెంగమాంబ చెప్పుకుంది. ఇది ఆమె రచించిన ద్విపద కావ్యం. వావిళ్ళ వారిచే ప్రచురించబడిన ద్విపద కావ్యము,ఇంకొక బార్ కోడ్ 5010010080103. 2030020025118 1930 రాజు-మహిషి మొదటిభాగము [109] రాచకొండ విశ్వనాథశాస్త్రి నవల జయశ్రీ పత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ నవలను పుస్తకం రూపంలో విడుదలచేశారు. ఈ పుస్తకానికి శ్రీశ్రీ ముందుమాట వ్రాశాడు. 2990100071531 1971 రాజూ పేదా [110] మార్క్ ట్వేన్, అనువాదం: నండూరి రామమోహనరావు నవల, అనువాదం మార్క్ ట్వేన్ క్లాసిక్ నవలకు తెలుగు అనువాదం, ఇంకొక బార్ కోడ్ 2020050014527 2020050014314 1957 రాజ్యకాంక్ష [111] దర్భా రామమూర్తి నాటకము షేక్స్‌పియర్ నాటకము మెక్‌బెత్ ఆధారముగా వ్రాయబడిన నాటకము 5010010033192 1959 రాజ్యశ్రీ [112] ఈ. భాష్యకాచార్యులు చారిత్రక నవల 2020050016312 1926 రావిశాస్త్రి నవలానుశీలన [113] తాటి శ్రీకృష్ణ సాహిత్య విమర్శ ఇది రావిశాస్త్రి నవలల గురించిన సాహిత్యవిమర్శ 2990100071539 1997 రాళ్లు-రత్నాలు [114] పోకల నరసింహారావు నాటకము 2020010007001 1956 రామశతకము, బలరామశతకము, అర్చిరాది వర్ణనము [115] ఓరియంటల్ రీసెర్చ్ ఇన్సిట్యుట్, తిరుపతి శతకసాహిత్యము ఇది మూడు శతకములు కలబోసిన వ్రాత ప్రతి 5010010088264 1916 రామకథారసవాహిని [116] సత్యసాయిబాబా ఆధ్యాత్మికం 2990100071532 1964 రామరాజ్యమ్ [117] వాసా సూర్యనారాయణశాస్త్రి ఆధ్యాత్మికం 2990100071533 1961 రామతీర్థస్వామి బ్రహ్మజ్ఞానోద్భోదనలు [118] ఆధ్యాత్మికం 2030020029689 1942 రామతీర్థస్వామి జీవితము మొదటి భాగము [119] ముదుగంటి జగ్గన్నశాస్త్రి జీవితచరిత్ర, ఆధ్యాత్మికం 2030020029715 1933 రామానుజశతకము [120] ఓరియంటల్ రీసెర్చ్ ఇన్సిట్యుట్, తిరుపతి శతకము, సాహిత్యము వ్రాతప్రతి 5010010088403 1918 రామానుజుని ప్రతిజ్ఞ [121] పి.రాజగోపాలనాయుడు చారిత్రాత్మక నవల ఆద్వైతాన్ని ప్రచారం చేసిన వైష్ణవ గురువు రామానుజుని జీవితం ఆధారంగా వ్రాసిన చారిత్రక నవల. ఇతర బార్ కోడ్లు2990100067503,
29901000664912990100049511 1969 మూలాలు
మార్చు