వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ద

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

మార్చు
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
దగాపడిన తమ్ముడు [1] బలివాడ కాంతారావు నవల బలివాడ కాంతారావు ( 1927, జూలై 3 - 2000, మే 6 ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు. ఆయన రాసిన ప్రసిద్ధ రచన దగాపడిన తమ్ముడు. కాంతారావు రాసిన ఈ నవల అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు భారతీయ భాషలలోని ముఖ్యమైనవాటిలోకి అనువదించారు. 2990100071292 2001
దత్తత(పుస్తకం) [2] పినిశెట్టి శ్రీరామమూర్తి నవల 2020010004833 1954
దత్తపుత్ర శోకము [3] ముక్కామల సూర్యనారాయణరావు నాటకం 2020010004832 1956
దత్తమూర్తి తత్త్వ శతకం [4] వనుమల్లి సూరారెడ్డి శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. కంతేటి దత్తమూర్తీ! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016637 1932
దత్తమంత్ర సుధార్ణవము [5] విద్యాసాగరశర్మ ఆధ్యాత్మికత, హిందూమతం శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. ఆ దత్తాత్రేయుని మంత్రవిధి, పూజావిధి మొదలైనవి ఈ గ్రంథంలో రచించారు. 2020120035602 1993
దమయంతీ చరిత్రము [6] పంచవటి వేంకటిరామయ్య సాహిత్యం 2020120000300 1911
దయ శతకము [7] ఎన్.ఎ.నరసింహాచార్యులు శతకం 2020050016654 1938
దయ్యం పట్టిన మనిషి [8] మూలం:టాల్ స్టాయ్, అనువాదం:రాంషా నవల 2020010001756 1951
దయ్యాలు [9] స్థానాపతి రుక్మిణమ్మ కథల సంపుటి 2020050016563 1936
దర్శనకర్తలు-దర్శనములు-రెండవ భాగము [10] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034392 1987
దర్శనకర్తలు-దర్శనములు-మూడవ భాగము [11] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120019999 1989
దర్శన దర్పణము [12] చివుకుల అప్పయ్యశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000308 1945
దర్శనాచార్య శ్రీకొండూరు సాహిత్య జీవితచరిత్ర [13] అలంపురి బ్రహ్మానందం జీవితచరిత్ర 2020120000306 1993
దర్శనాలు-నిదర్శనాలు-రెండవ భాగాము [14] మోపిదేవి కృష్ణస్వామి వ్యాస సంపుటి 2020120020000 1991
దరిజేరిన నావ [15] పి.చి.కృష్ణమూర్తి నవల 2020120004056 1983
దరిద్ర నారాయణ వ్రతము [16] యక్కలి రామయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061533 వివరాలు లేవు
దర్శిని(పుస్తకం) [17] సి.సిమ్మన్న వ్యాస సంపుటి 2990100061534 1994
దశకన్యా ప్రబోధము [18] గేరా ప్రేమయ్య నాటకం 2020050015846 1955
దశ కుమార చరిత్ర [19] ఎం.సంగమేశం ప్రబంధ కథలు 2020120004059 1957
దశ కుమార చరితమ్ [20] మహాకవి దండి, పరిష్కర్త:పాటిబండ మాధవశర్మ సాహిత్యం 2020120012610 1972
దశ కుమార చరితమ్ [21] వేదము వేంకటరాయ శాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2030020024845 1910
దశ కుమార చరిత్రము [22] కేతన కవి సాహిత్యం 2020120000310 1925
దశరధరాజ నందన చరిత్ర [23] మరింగంటి సింగరాచార్య, పరిష్కర్త:శ్రీ రంగాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004058 1977
దశరూపక సారము [24] గడియారం రామకృష్ణ శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004062 1960
దశమ భాగము [25] ఐ.జాన్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004823 1960
దశా భుక్తి చంద్రిక [26] సూరరాయ సామంత ప్రభు ఆధ్యాత్మిక సాహిత్యం 2020050086980 1922
దశావతార నాటకము [27] వివరాలు లేవు నాటకం, యక్షగానము 2020050015259 1954
దశావతార చరిత్రము [28] ధరణిదేవుల రామయమంత్రి పద్యకావ్యం దశావతారాల చరిత్రాన్ని ఈ గ్రంథంలో సవిస్తరంగా పద్యకావ్యంగా మలిచారు ధరణిదేవుల రామయమంత్రి. సాధారణంగా దశావతారాల్లోని రాముడు, కృష్ణుడు వంటి వారి జీవితాలనే ఎక్కువగా కావ్యరూపంలో మలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దశావతారాలు అన్నింటి చరిత్రమూ పద్యకావ్యంగా మలచడం విశేషం. 2030020024745 1926
దశావతారములు [29] కొండపల్లి వీరవెంకయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2020050015693 1929
దసరా యజ్ఞ సప్తకం [30] సత్యసాయిబాబా ఆధ్యాత్మిక సాహిత్యం, వ్యాస సంపుటి 2990100051636 1997
దస్తావేజు మతలబులు [31] నేదునూరి వేంకట కృష్ణారావు పంతులు వృత్తి సాహిత్యం దస్తావేజులు అత్యంత సూక్ష్మమైన వివరాలతో వ్రాయడం సాధారణమైన విషయం కాదనీ నేర్వవలసిన విద్యగా భావించాలనీ అనుభవజ్ఞుల మాట. నిత్యజీవితంలో సాధారణంగా ఉపయోగపడే వడ్డీతో కూడిన అప్పు పత్రాలను మొదలుకొని అరుదైన, క్లిష్టమైన దత్తత స్వీకార పత్రాల వరకూ అన్ని రకాల దస్తావేజులూ రాసే విధానాలు ఇందులో ఉన్నాయి. 2030020024570 1932
దళవాయి రామప్పయ్య(పుస్తకం) [32] చల్లా రాధాకృష్ణ శర్మ చారిత్రాత్మక నవల 2020050016092 1953
దళిత కథలు [33] సంపాదకులు:ఆర్.చంద్రశేఖరరెడ్డి, కె.లక్ష్మీనారాయణ కథల సంపుటి 2990100071294 1996
దళిత కథలు-రెండవ భాగము [34] సంపాదకులు:కొలకలూరి ఇనాక్, కె.లక్ష్మీనారాయణ కథల సంపుటి 6020010007142 1998
దళిత కథలు-నాల్గవ భాగము [35] సంపాదకులు:కె.లక్ష్మీనారాయణ కథల సంపుటి 2020120019992 1998
దళిత గీతాలు [36] సంపాదకులు:జయధీర్ తిరుమలరావు గీతాలు 2020120029098 1993
దళితులు అసలు జాతి నాగులు [37] భూపతి నారాయణమూర్తి సాహిత్యం దళితులు నిజానికి నాగజాతి వారని ప్రతిపాదిస్తూ వివరిస్తున్న గ్రంథమిది. 2020120000298 1995
దళితులు చరిత్ర-మొదటి భాగము [38] కత్తి పద్మారావు సాహిత్యం, చరిత్ర దళితోద్యమాలకు సంబంధించి పోరాట నాయకుల్లో ఒకరైన కత్తి పద్మారావు వ్రాసిన దళితుల చరిత్ర గ్రంథమిది. 6020010000299 1991
దక్షారామాయణము [39] భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి స్థలపురాణం దక్షారామం పుణ్యక్షేత్రం ప్రాచీనమూ, ప్రాధాన్యత సంతరించుకున్నదీను. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస పలు గ్రంథాల్లో కానవస్తుంది. శ్రీనాథుడు రచించిన భీమఖండం ఈ క్షేత్ర మాహాత్మ్యమే. స్కాంద పురాణంలోనూ దీని ప్రస్తావన, ప్రశస్తి కానవస్తాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి గద్యరూపంలో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని రచించారు. 2030020024561 1926
దక్షిణ దేశ భాషా సారస్వతములు [40] కోరాడ రామకృష్ణయ్య సాహిత్యం 2020010004801 1954
దక్షిణ దేశములు-నాట్యము [41] తుమ్మలపల్లి సీతారామారావు సాహిత్యం 2020010004804 1956
దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయము [42] నిడదవోలు వేంకటరావు సాహిత్యం తెలుగు సాహిత్యంలో 1600 నుండి 1775 వరకు దాక్షిణాత్య యుగము/దక్షిణాంధ్ర యుగము అంటారు. తంజావూరు, మధుర ప్రాంతాలను పరిపాలించిన తెలుగు, మరాఠీ నాయక రాజులు తెలుగు భాషా సాహిత్యాలను పోషించడంతో అక్కడ ఏర్పడ్డ సారస్వత వికాసాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఈ యుగం వల్ల తెలుగు సాహిత్యంపై కలిగిన ప్రభావాలను ఈ రచనలో ప్రముఖ సాహిత్య పరిశోధకులు నిడదవోలు వేంకటరావు ఈ గ్రంథంగా రచించారు. 2020010002621 1960
దక్షిణ పవనం [43] మూలం:ఎల్మర్ గ్రిన్, అనువాదం:మహీధర జగన్మోహనరావు నవల 2020010001414 1952
దక్షిణభారత కథాగుచ్ఛము [44] ప్రచురణ:మదరాసు విశ్వవిద్యాలయం కథా సంపుటి, అనువాద సాహిత్యం 2020010004871 1959
దక్షిణ భారత చరిత్ర- ప్రథమ భాగము [45] మూలం:కె.కె.పిళ్ళై, అనువాదం:దేవరకొండ చిన్నికృష్ణ శర్మ సాహిత్యం, చరిత్ర 2020010004803 1959
దక్షిణభారత దేవాలయములు [46] వసంతరావు రామకృష్ణరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028468 2001
దక్షిణ భారత సాహిత్యములు [47] ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సాహిత్యం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి మొదటి భాగంగా దక్షిణ భారత భాషల సాహిత్యం గురించి వివిధ రచయితల చేత వ్యాసాలు రాసి ఒక సంపుటిగా ప్రచురించారు. తరువాత భాగాలలో మిగిలిన భారత భాషల సాహిత్యాల గురించి కూడా సంపుటులు ప్రచురించారు 2020120000291 1979
దక్షిణ భారతము-ఆయుర్వేద ప్రచారము [48] డి.గోపాలాచార్యులు సాహిత్యం 2020120000295 1917
దక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర [49] (డీఎల్‌ఐ ప్రతిలో వివరాలు దొరకలేదు. అంతర్జాలంలోని సమాచారం ప్రకారం) నటరాజ రామకృష్ణ నాట్య కళ, నాట్య శాస్త్రము, విజ్ఞాన సర్వస్వము దాక్షిణ భారతీయుల నాట్యకళా రీతులు, వాటి విశేషాలు, తేడాలు, వివరాలు వంటి వాటితో సమగ్రంగా ఈ గ్రంథాన్ని రూపొందించారు. కేవలం శాస్త్రీయ నృత్యరీతులకే పరిమితం కాకుండా జానపద నృత్యరీతులు, ఇతర విధానాల నృత్యరీతుల గురించి వివరించడం రచయిత విస్తృత అవగాహనకు, సరైన దృక్పథానికి నిదర్శనం. నృత్యప్రదర్శనల ద్వారా జీవించే వివిధ కులాల గురించి కూడా వివరాలు ఇచ్చారు. ఈ గ్రంథంలోని వివరాలు విజ్ఞాన సర్వస్వ శైలిలో ఉంటాయి. 2020050003578 1932
దక్షిణాఫ్రికా (రెండు భాగాలు) [50] దిగవల్లి వేంకటశివరావు చరిత్ర దక్షిణాఫ్రికాకు, భారతదేశానికి జాతీయోద్యమానికి పూర్వం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 19శతాబ్ది సమయంలోనే ఎందరో భారతీయులు కూలీలుగా పనిచేయడానికి వలసవెళ్ళారు. ఆపైన గాంధీ బారిస్టరుగా పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళి సత్యాగ్రహమనే ఆయుధాన్ని కనుగొన్నారు. బ్రిటీష్ పరిపాలనలో మగ్గుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని భారత జాతీయోద్యమ స్ఫూర్తితోనే కృషిచేశారు. అటువంటి దేశ చరిత్రను నిర్మించడం వల్ల నడుస్తున్న జాతీయోద్యమానికి సహకారి అవుతుందని భావించి 1928 ప్రాంతాల్లో దిగవల్లి వేంకట శివరావు ఈ గ్రంథాన్ని రచించారు. 2030020024581 1928
దక్షిణాఫ్రికా ధర్మయుద్ధము [51] మూలం: మహాత్మాగాంధీ, అనువాదం: దుగ్గిరాల రామకృష్ణయ్య చరిత్ర ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. గాంధీ ఆ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పోరాటాన్ని గురించి రాసిన రచన ఇది. 2020010004802 1959
దక్షిణాఫ్రికా సత్యాగ్రహము- ప్రథమ భాగము [52] మూలం:మహాత్మా గాంధీ, అనువాదం:గొల్లపూడి సీతారామశాస్త్రి సాహిత్యం, అనువాదం 2990100061531 1940
దక్షిణోత్తర గోగ్రహణములు [53] గూడూరి వెంకట శివకవి నాటకం, పౌరాణిక నాటకం మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ నాటకానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.పాండవులు ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, అతడిని హతం చేస్తాడు. కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన కౌరవులు, వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. కౌరవులు, భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు. కౌరవ సేనను వీరోచితంగా జయిస్తానని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇది ఇతివృత్తం. 2030020025363 1950
శ్రీ దత్త చరిత్ర [54] రచయిత వివరాలు లేవు భక్తి, ఆధ్యాత్మికం శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. ఆయన పవిత్ర గాథను ఈ గ్రంథంలో పద్యరూపంలో తెలిపారు. 2020050005809 1900
దాగుడుమూతలు [55] మూలం: రవీంధ్రనాధ్ ఠాగూర్, అనువాదం: దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కథల సంపుటి భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్. టాగోరు గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలికావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. ఆయన రచించిన కథల సంపుటి ఇది. 2020010004797 1957
దాన బలి [56] బుద్ధిరాజు శేషగిరిరావు నాటకం 2020050015815 1929
దానవ వధ [57] ఉమర్ ఆలీషా నాటకం ఉమర్ ఆలీషా సూఫీ వేదాంత వేత్త,తెలుగు సాహితీ వేత్త.సంఘ సంస్కర్త.గ్రాంధికవాది. ఆయన రచించిన నాటకంి ఇది. 6020010000287 1914
దానవీర కర్ణ [58] శ్రీరామమూర్తి నాటకం 2020120019996 1935
దామోదరం సంజీవయ్య స్వర్ణోత్సవము [59] వివరాలు లేవు సావనీర్ దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 7,1972) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. ఆయన 50వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రచురించిన సావనీర్ ఇది. 2020050004555 1970
దారా [60] పువ్వాడ శేషగిరిరావు ఖండకావ్యం షాజహాన్ కుమారుడైన దారా చారిత్రిక వ్యక్తీ. అతని జీవిత గాథను ఆధారం చేసుకుని రచించిన ఖండకావ్యం ఇది. 2020010004795 1948
దారా [61] పగడాల కృష్ణమూర్తి నాయుడు ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004881 1958
దారాషకో [62] భమిడి సత్యనారాయణశర్మ సాహిత్యం 2020010002572 1949
దాశరధి రంగాచార్య రచనలు-మొదటి సంపుటి [63] దాశరథి రంగాచార్య సాహిత్య సంకలనం 2990100071301 2001
దాశరధి రంగాచార్య రచనలు-రెండవ సంపుటి [64] దాశరథి రంగాచార్య సాహిత్య సంకలనం 2990100071302 1997
దాశరధి రంగాచార్య రచనలు-నాల్గవ సంపుటి [65] దాశరథి రంగాచార్య సాహిత్య సంకలనం 2990100071303 2000
దాశరథీ శతకం [66] కంచెర్ల గోపన్న శతకం రామదాసుగా విఖ్యాతుడైన కంచెర్ల గోపన్న భద్రాచల రామునికి ఆలయం కట్టించిన పుణ్యాత్ముడు. తానాషా పరిపాలనలో తహశీల్దారుగా పనిచేసిన గోపన్న భద్రాచలంలో విశిష్టమైన కోదండ, వైకుంఠ రామునికి ఆలయం లేకపోవడంతో చలించిపోయి రామాలయం పన్ను సొమ్ముతో నిర్మించారు. దానితో ఆగ్రహించిన తానాషా గోపన్నను గోల్కొండలో ఖైదు చేశాడు. ఆపైన రాముడు, లక్ష్మణుడు స్వయంగా వచ్చి తానాషాకు ధనమిచ్చి విడిపించుకున్నారని ఐతిహ్యం. అంత విఖ్యాత భక్తుడైన రామదాసు మంచి కవి, వాగ్గేయకారుడు. వాగ్గేయకారునిగా ఆయన చేసిన కృతులు కర్ణాటక సంగీతంలోనూ, కవిగా రాసిన దాశరథీ శతకం తెలుగు సాహిత్యంలోనూ సుప్రసిద్ధం. ఆయన దాశరథీ కరుణాపయోనిధి అన్న మకుటంతో ఈ శతకం రచించారు. చక్కని ప్రౌఢ శైలిలో, భక్తి, జ్ఞాన వైరాగ్యాలను బోధిస్తూ రచించిన పద్యాలు తెలుగునేల నలుచెరుగులా వ్యాప్తిచెందినాయి. (రచన వందల ఏళ్ల క్రితం) 2020050016518 1948
దాశరథి విలాసం [67] రచన.క్రొత్తపల్లి లచ్చయ్య కవి, పరిష్కరణ.చెలికాని సూర్యారావు పద్యకావ్యం కవి పిఠాపురం సమీపంలోని చెందుర్తి గ్రామవాస్తవ్యుడు. తన ఇరవైయవ ఏట శ్రీరామాయణాన్ని ఈ కావ్యంగా రచించడం ప్రారంభించాడు. తన తల్లి, తమ్ములు మరణించుటచే నడుమ కొద్ది సంవత్సరాల పొడవునా ఆటంకాలు ఏర్పడినా విడువక తుదకు పదేళ్ళకు పూర్తిచేశారు. దాన్ని అనంతర కాలంలో చెలికాని సూర్యారావు పరిష్కరించగా 1928లో అచుప్రతిగా వెలువడింది. అంతవరకూ గ్రంథం వ్రాతప్రతిగానే ప్రాచుర్యంలో ఉంది. కవిత్రయ మహాభారత, పోతన భాగవతాల వలె ప్రామాణికమని పేరుతెచ్చుకున్న రామాయణాలు తెలుగులో లేకపోవడంతో ఎందరెందరో కవులు తమవైన రామాయణాలు రాసి తరించారు. అనంతర కాలంలో రామాయణ కల్పవృక్షం, అంతకుముందు రంగనాథ రామాయణాలు ఉన్నా పోతన, కవిత్రయ రచనల్లా నిర్దిష్టమైన స్థితిని పొందలేదు. అలా వచ్చిన అనేకానేక రామాయణాల్లో ఇది కూడా ఒకటి. 2030020025437 1928
దాసబోధ [68] అనువాదకుడు:కొణకంచి చక్రధరరావు, పరిష్కర్త:శేషాద్రి రమణ కవులు సాహిత్యం 9000000003304 1955
దాస సుదర్శిని [69] ములగలేటి గోపాలకృష్ణ ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028464 2002
దాస్య విముక్తి [70] అక్కపెద్ది సత్యనారాయణ పద్య కావ్యం 9000000003048 1943
దాస్య విమోచనము [71] శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి సాహిత్యం 2020050014988 వివరాలు లేవు
దాసి పన్నా(పుస్తకం) [72] షేక్ దావూద్ కథ 2020010002136 1950
దాసీ కన్య [73] చిలకమర్తి లక్ష్మీనరసింహం నవల 2020010004825 1935
దాక్షిణాత్య భక్తులు [74] రావినూతల శ్రీరాములు ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028463 2002
దాక్షిణాత్య దేశిచ్ఛందో రీతులు-తులనాత్మక పరిశీలన [75] కె.సర్వోత్తమరావు సాహిత్యం 2990100071291 1986
దాక్షిణత్య సాహిత్య సమీక్ష-మొదటి సంపుటి [76] జి.నాగయ్య సాహిత్యం 2020120032279 1976
దిక్చక్రం [77] కోడూరి కౌసల్యాదేవి నవల 2990100071309 1975
దిక్కులేని దీనురాలు [78] రవీంద్రనాధ టాగూరు కథ, అనువాద సాహిత్యం 2020010004919 1958
దిగంతాల కావల [79] ఎస్.ఝాన్సీరాణి నవల 2990100071306 1980
దిగంతాలకు(పుస్తకం) [80] నండూరి విఠల్ నవల 2990100071307 1965
దిగంబరి (పుస్తకం) [81] మల్లాది అవధాని నాటికలు, తత్త్వం తత్త్వశాస్త్రం అత్యంత గహనమైన విషయం. దానిని తేలికగా అర్థమయ్యేలా వివరించడమే కష్టమైతే నాటికల రూపంలోకి మలచడం మరింత కష్టమనవచ్చు. ఈ నేపథ్యంలో ఈ తత్త్వనాటికల సంకలనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. 2030020025201 1941
దిద్దుబాటు చరిత్ర [82] డి.జె.రత్నము ఆధ్యాత్మక సాహిత్యం 2020010004918 1956
దినచర్య(పుస్తకం)-మొదటి భాగము [83] ముసునూరి వెంకటశాస్త్రి సాహిత్యం 2020010004922 1958
ద్విపద భారతం-మొదటి భాగం [84] సోమన, పరిష్కర్త:పింగళి లక్ష్మీకాంతం ఇతిహాసం ద్విపద దేశీఛందస్సు. అచ్చ తెలుగు సామెతలు, జాతీయాలు, జానపద గీతాలతో దగ్గరి చుట్టరికమున్న ఛందోరూపం ద్విపద. అందుకే తెలుగు భాషలో తమ సాహిత్యం సామాన్యునికి బాగా చేరాలన్న ఆశయం కలిగిన కవులు ద్విపదలోనే కావ్యాలు నిర్మించారు. ఆ క్రమంలోనే ఈ ద్విపద భారతం రచించారు సోమన. 2020010004929 1943
ద్విపద భారతం-నాల్గవ భాగం [85] సోమన ఇతిహాసం ద్విపద దేశీఛందస్సు. అచ్చ తెలుగు సామెతలు, జాతీయాలు, జానపద గీతాలతో దగ్గరి చుట్టరికమున్న ఛందోరూపం ద్విపద. అందుకే తెలుగు భాషలో తమ సాహిత్యం సామాన్యునికి బాగా చేరాలన్న ఆశయం కలిగిన కవులు ద్విపదలోనే కావ్యాలు నిర్మించారు. ఆ క్రమంలోనే ఈ ద్విపద భారతం రచించారు సోమన. 2030020024871 1950
ద్విపద మేఘదూతము [86] మూలం.కాళిదాసు, అనువాదం.పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు కావ్యం ద్విపద దేశీఛందస్సు. అచ్చ తెలుగు సామెతలు, జాతీయాలు, జానపద గీతాలతో దగ్గరి చుట్టరికమున్న ఛందోరూపం ద్విపద. అందుకే తెలుగు భాషలో తమ సాహిత్యం సామాన్యునికి బాగా చేరాలన్న ఆశయం కలిగిన కవులు ద్విపదలోనే కావ్యాలు నిర్మించారు.ఈ గ్రంథం కాళిదాసు కృతికి ఆంధ్ర ద్విపద అనువాదం. 2030020025166 1950
దిలారామ [87] కేతవరపు వేంకటశాస్త్రి నవల 2990100049362 1952
దివ్వటీలు [88] పైడిపాటి సుబ్బరామశాస్త్రి కావ్యం 2020120000343 1959
దివ్యకథా సుధ [89] జి.నారాయణరావు కావ్యం 2020010002534 1959
దివ్య ఖుర్ ఆన్-రెండవ సంపుటి [90] మూలం:మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది, అనువాదం:షేక్ హమీదుల్లా షరీఫ్ అనువాదం, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000347 1995
దివ్య జీవనము(నవల) [91] వేలూరి శివరామ శాస్త్రి నవల 2020050016308 1948
దివ్య జ్యోతి(భక్త కన్నప్ప) [92] చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000346 1940
దివ్యదేశ వైభవ ప్రకాశికా [93] ఎన్.వి.రామానుజాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028473 1997
దివ్య ప్రబంధ మాధురి [94] కె.టి.ఎల్.నరసింహాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం, వ్యాస సంపుటి 2040100028474 1994
దివ్య పురుషులు [95] అద్దేపల్లి లక్ష్మణస్వామి వాచకం 2020010004932 1946
దివ్యమూర్తులు [96] కొత్త సత్యనారాయణ చౌదరి జీవితచరిత్రలు 2020010004931 1955
దివ్య యోగ సాధనరహస్యములు [97] అనుభవానంద స్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004078 1991
దివ్యజ్ఞాన దీపిక [98] ఆంధ్ర దివ్యజ్ఞాన సమాజ ప్రచురణ పత్రిక, ఆధ్యాత్మికత దివ్యజ్ఞాన సమాజం తెలుగువారైన పలువురు మేధావులు, సాహిత్యవేత్తలు, తత్త్వవేత్తలనే కాక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన సామాన్యులను కూడా ఆకర్షించింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు, చలం, కృష్ణశాస్త్రి తదితరులు నేరుగా, శ్రీపాద వంటివారు పాక్షికంగా ప్రభావితులయ్యారు. చలం మాటల్లోనే చెప్పాలంటే 1915-24 దశకం ఆంధ్రదేశంలో దివ్యజ్ఞానసమాజానికి స్వర్ణయుగం. అలాంటి సమయంలో నాటి సమాజ పత్రికయైన దివ్యజ్ఞాన దీపిక సంవత్సరం ప్రతులు ఇవి. 5010010077989 1914
దివ్యజ్ఞాన దీపిక(జూన్ 1958) [99] ఆంధ్ర దివ్యజ్ఞాన సమాజ ప్రచురణ పత్రిక, ఆధ్యాత్మికత దివ్యజ్ఞాన సమాజం తెలుగువారైన పలువురు మేధావులు, సాహిత్యవేత్తలు, తత్త్వవేత్తలనే కాక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన సామాన్యులను కూడా ఆకర్షించింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు, చలం, కృష్ణశాస్త్రి తదితరులు నేరుగా, శ్రీపాద వంటివారు పాక్షికంగా ప్రభావితులయ్యారు. చలం మాటల్లోనే చెప్పాలంటే 1915-24 దశకం ఆంధ్రదేశంలో దివ్యజ్ఞానసమాజానికి స్వర్ణయుగం. అలాంటి సమయంలో నాటి సమాజ పత్రికయైన దివ్యజ్ఞాన దీపిక సంవత్సరం ప్రతులు ఇవి. 2020050004586 1958
దివ్య జ్ఞాన సారము [100] చిట్టమూరి రామయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000345 1937
దివాంధము-ద్వితీయ భాగము [101] పంతము ఆంజనేయకవి పద్య కావ్యం 2020120002094 1936
దివ్వెల మువ్వలు [102] సి.నారాయణ రెడ్డి ఖండకావ్య సంపుటి 2020010004930 1959
దివోదాసు(పుస్తకం) [103] శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి నాటకం 2020050015583 1943
దిష్టిబొమ్మలు, చీకటిదొంగలు [104] వేణు నాటికల సంపుటి 2020010004927 1955
దీనజన బాంధవుడు శ్రీ వేములు కూర్మయ్య [105] జి.వి.పూర్ణాచంద్ జీవిత చరిత్ర 2020120029103 2000
దీనబంధు [106] బాబూ ఎస్.జైసింగ్ నాటకం, సాంఘిక నాటకం దీనబంధు అనే పేరిట రచించిన ఈ నాటకం సంఘసంస్కరణను ముఖ్యాంశంగా స్వీకరించి రచించింది. ఈ నాటకాన్ని కవి ఆనాటికి కొత్తగా అభివృద్ధి చెందుతున్న వ్యావహారిక భాషలో రచారు. 2030020025044 1946
దీనరక్షానిధి [107] పాటిబండ్ల వెంకటరామయ్య చౌదరి శతకం 2020050014803 1924
దీప లేఖ [108] పి.దుర్గారావు నాటిక 2020120000313 1994
దీపసభ [109] బోయి భీమన్న పద్య కావ్యం స్వాతంత్ర్యం ఉదయించి, తెలుగు వారికి రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో ప్రచురితమైనదీ దీపసభ కావ్యం. ఈ గ్రంథంలో దీపం, జ్యోతి, వెలుగు వంటి పోలికలను అభివృద్ధి, మార్పులతో పోల్చారు. భీమన్న బహుగ్రంథకర్త, సంస్కరణాభిలాషి. 2030020025341 1955
దీపావళి [110] వేదుల సత్యనారాయణ శాస్త్రి కవితా సంకలనం 2020010004836 1937
దీపిక [111] భండారు విజయ కవితా సంకలనం 2020120004063 1984
దీవార్-రాతిగోడ [112] అయిలావఝ్జుల సూర్యప్రకాశశర్మ నాటకం 2020010004928 1955
దీక్షిత దుహిత [113] శివశంకరశాస్త్రి పద్య నాటకం 2990100068521 1946
దీక్షితులు నాటికలు [114] చింతా దీక్షితులు నాటికల సంపుటి 2020010002852 1958
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి యాంధ్ర-లక్ష్మీ శృంగార కుసుమమంజరీ విమర్శనము [115] ఓరుగంటి వేంకటేశ్వరశర్మ విమర్శనాత్మక గ్రంథము 2020010002065 1936
దుర్మార్గ చరిత్రము [116] విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు పద్యకావ్యం ఒక దుర్మార్గుని జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించిన కావ్యమిది. 2020120028816 1906
దుర్వాది గజాంకుశము [117] మల్లంపల్లి మల్లికార్జునశాస్త్రి వివాద సాహిత్యం, పద్యకావ్యం శివపురపు వీరభద్ర పాకయాజి అభిప్రాయాలను ఖండించే నిమిత్తం రచించిన వివాద సాహిత్యమిది. ఈ గ్రంథాన్ని మల్లికార్జునశాస్త్రి పద్యరూపంగా రచించారు. 2020050019107 1910
దూకుడు(పుస్తకం) [118] సత్యాల నరసిబాబు సాహిత్యం, వ్యాస సంపుటి 2020120000340 1949
దూతఘటోత్కచము [119] దీపాల పిచ్చయ్యశాస్త్రి కథ 2020010004901 1959
దృష్టాంత నీతిపద్యములు [120] యండ్లూరి కోటయ్య నీతి, శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే దృష్టాంత నీతిపద్యాలనే శతకం. రామ రామ సార్వభౌమరామ అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050019144 1912
దేవకన్య [121] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:కె.రమేశ్ కథ 2020120034406 1967
దేవకీనందన శతకము [122] ప్రచురణ:వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ శతకం 2020050006440 1934
దేవతలు యుద్ధం(నవల) [123] విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం 2020010004854 1960
దేవతలు మాట్లాడనప్పుడు [124] మూలం:మైఖేల్ సోలోపైవ్, అనువాదం:ఓగిరాల వెంకట సుబ్బారావు సాహిత్యం 2020120004067 1962
దేవదత్త(నాటకం) [125] మూలం:కె.ఎం.మున్షీ, అనువాదం:వేమూరి ఆంజనేయ శర్మ నాటకం 2020120000319 1951
దేవదాసు [126] మూలం:శరత్ చంద్ర చటోపాధ్యాయ్, అనువాదం:చక్రపాణి నవల శరత్ చంద్ర చటోపాధ్యాయ్ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రాచుర్యం పొందాయి. దేవదాసు నవల తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించింది. 2020050015479 1933
దేవదాసు(నాటకం) [127] బొజ్జా సూర్యనారాయణ నాటకం 2020010002684 1957
దేవదూత [128] మూలం:లియో టాల్‌స్టాయ్ నవల 2020050016124 1929
దేవపూజా రహస్యము [129] ఈశ్వర సత్యనారాయణ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120029108 1959
దేవయాని [130] మద్దూరి సుబ్బారెడ్డి కథ, ఆధ్యాత్మిక సాహిత్యం 2040100047100 1983
దేవాత్మశక్తి [131] విష్ణుతీర్థజీ మహరాజ్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000323 1988
దేవాలయ తత్త్వము [132] వావిలికొలను సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000320 1927
దేవాలయాలు తత్త్వవేత్తలు [133] వి.టి.శేషాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028465 1997
దేవీ అశ్వధాటి [134] మూలం:కాళిదాసు, వ్యాఖ్యాత:మేళ్ళచెరుఫు భానుప్రసాదరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120007150 1998
దేవీ గానసుధ [135] ఓగిరాల వీరరాఘవ శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004068 1947
దేవీ గానసుధ-ద్వితీయ సంపుటి [136] ఓగిరాల వీరరాఘవ శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2020010002830 1958
దేవీజోన్ [137] గద్దే లింగయ్య చౌదరి జీవితచరిత్ర 2030020029723 1931
దేవీ భాగవతం [138] రచన. వేద వ్యాసుడు, సంపాదకత్వం. చింతామణి యజ్వ నారాయణశాస్త్రి పురాణం శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. దేవీభాగవతాన్ని నాటి మద్రాసులోని ప్రాచ్య లిఖిత భాండాగారంలోని ప్రతి నుంచి వెంకట జగ్గారాయ బహద్దూరు తీయించి ప్రచురించగా ప్రచురణకు ముందు లేఖక ప్రమాదాలను చింతామణి యజ్వ నారాయణశాస్త్రి పరిహరించి సంపాదక బాధ్యతలకు తుల్యమైన కృషి చేశారు. అయితే ఇది తెలుగు లిపిలోనున్న సంస్కృత ప్రతి. 2020050019201 1915
దేవీ భాగవతం-ద్వితీయ స్కంధము [139] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020025001 1927
దేవీ భాగవతం-తృతీయ స్కంధము [140] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020024909 1910
దేవీ భాగవతం -చతుర్థ స్కంధము [141] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020025300 1910
దేవీ భాగవతం-పంచమ స్కంధము [142] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020025117 1912
దేవీ భాగవతం-షష్ట స్కంధము [143] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020024950 1915
దేవీ భాగవతం-సప్తమ స్కంధము [144] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020024933 1927
దేవీ భాగవతం-ఉత్తరార్ధము [145] తిరుపతి వేంకట కవులు పద్యకావ్యం, పురాణం తిరుపతి వేంకటేశ్వరులన్న పేరుతో ప్రఖ్యాత శతావధానులు, నాటకకర్తలు, కావ్యకర్తలూ ఐన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి రచించిన పద్యకావ్యమిది. ప్రఖ్యాత దేవీ భాగవతానికి ఆంధ్రీకరణ ఇది. శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది. 2030020024889 1934
దేవీ శక్తి [146] మూలం:మహాత్మా గాంధీ, అనువాదం:తత్త్వానంద స్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004865 1959
దేవుడా పారిపో! [147] బైనబోయిన నాటకం 2020120000324 1979
దేవుడి కోపం [148] చివుకుల ఆదినారాయణ సాహిత్యం 2020050016545 1945
దేవుడికి ఉత్తరం [149] వి.ఎస్.రమాదేవి కథానికల సంపుటి 2020120029110 1961
దేవుడు-మానవుడు [150] కొచ్చెర్ల చిన్మయాచార్య విశ్వకర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028467 2002
దేవుడు లేడా? [151] పి.ఎన్.ఆచార్య సాహిత్యం 2990100068520 1951
దేవుడెవరు? [152] చిన్మయ రామదాసు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004069 1974
దేవుని జీవితము [153] గోపీచంద్ సాహిత్యం 2020010005470 1929
దేవులపల్లి కృష్ణశాస్త్రి [154] భూసురపల్లి వెంకటేశ్వర్లు సాహిత్య విమర్శ, చరిత్ర దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగులో గొప్ప భావకవి. ఆయన భావకవితా యుగంలో మహాకవిగా ఖ్యాతి గడించారు. ఆంధ్రాషెల్లీగా పేరుపొందిన కృష్ణశాస్త్రి రాసిన గ్రంథాల్లో కృష్ణపక్షం ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చింది. ఆయన సమకాలీకులు, తదనంతర కవులూ, కృష్ణశాస్త్రి భావకవిత ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు, అనుకూలురు అన్న తేడా లేకుండా గొప్ప కవి అని అందరితో అనిపించుకున్నారు. "కృష్ణశాస్త్రికి విగ్గేలా" అంటూ శ్రీశ్రీ, "కవిత్వం ఒక ఆల్కెమీ/కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు, పెద్దనకు తెలుసు, నన్నయకు తెలుసు" అంటూ తిలక్, "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచమంతటికీ బాధ" అంటూ చలం ఆయనను తలచుకుంటూనే ఉన్నారు. భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంస్థ వారు కృష్ణశాస్త్రి జీవితం, సాహిత్యాన్ని గురించి వ్రాశారు. 2990100051637 2001
దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహితీ సౌరభం [155] ఎన్.నిర్మలాదేవి సాహిత్యం 2990100051638 1985
దేవులపల్లి రామానుజరావు-రేఖా చిత్రం [156] టి.శ్రీరంగస్వామి జీవితచరిత్ర 2020120004070 1991
దేవేంద్రనాథ్ ఠాకూరు చరిత్రము [157] మూలం.దేవేంద్రనాథ్ భట్టాచార్య, అనువాదం.ఆకురాతి చలమయ్య జీవిత చరిత్ర దేవేంద్రనాథ్ ఠాగూర్ (మే 15 1817 – జనవరి 19 905) హిందూ తత్వవేత్త మరియు బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మత సంస్కరణకు కృషిచేశరు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి. ఈయన బెంగాల్ నందు శ్రీలైదాహలో జన్మించారు. ఈ గ్రంథంలో ఆయన జీవిత చరిత్రను వివరించారు. 2030020024413 1937
దేశం ఏమయ్యేట్టు?[158] త్రిపురనేని గోపీచంద్ కథాసంపుటి దేశం ఏమయ్యేట్టు గోపీచంద్ రచించిన కథాసంపుటి. ఈ కథల్లో పుస్తకశీర్షికగా పెట్టిన దేశం ఏమయ్యేట్టు కథ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, దేశంలో క్విట్ ఇండియా ఊపందుకున్న సమయంలోనిది. దేశ సౌభాగ్యం కోసమే పనిచేస్తామనే కాంగ్రెస్, సోషలిస్టు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, రాయిస్టు, కిసాన్ సభ వారు కలిసి కుమ్ములాడుకుంటూంటే దేశం స్థితి ఏం కావాలన్న ఆవేదనలో రాసిన కథ యిది. 2020050016632 1942
దేవలమహర్షి చరిత్రము లేదా దేవాంగ పురాణం [159] కడెము వేంకట సుబ్బారావు కుల చరిత్ర, కులపురాణం దేవాంగులు నేత పనిపైన జీవించడం కులవృత్తిగా కలిగిన కులం. వీరి కులోత్పత్తిని తెలుపుతూండే సంప్రదాయ కథనానికే దేవల మహర్షి చరిత్రమనీ, దేవాంగ పురాణమనీ పేరు. దేవాంగులు తమను తాము దేవాంగ మహర్షి సంతానంగా పేర్కొంటారు. వారి కులపురాణంలో దేవల మహర్షి నుంచి వారి వృత్తి ఎలా ఏర్పడిందనే విషయాలతో సహా వివిధ సంగతులు ఉంటాయి. ప్రస్తుత గ్రంథంలో జానపద గేయ ఫక్కీలో ఉండే దేవాంగుల పురాణాన్ని ఆశ్రిత కులాల నుంచి సేకరించి రచయిత వచన రూపంలో రచించారు. 2990100061802 1984
దేశ దాసు [160] పాతూరి రామకోటయ్య నాటకం 2020050015064 1939
దేశ దేశాల జానపద కథలు [161] వివిధ దేశాల రచయితలు కథల సంపుటి 2020010004846 1958
దేశ ద్రోహి [162] పి.వి.సుబ్బారావు కథా సంపుటి 2020050016250 1942
దేశ భక్తి [163] వనం శంకరశర్మ నాటకం 2020050015533 1939
దేశభక్తుడు [164] మూలం:కె.ఎస్.వేంకటరమణి, అనువాదం:గుర్రం సుబ్రహ్మణ్యం జీవితచరిత్ర 2020120034404 1933
దేశభక్తుని దీన యాత్ర [165] మూలం:ఆర్ధర్ కోస్లర్, ఆంగ్ల అనువాదం:గుర్రం సుబ్రహ్మణ్యం, తెలుగు అనువాదం:చలసాని రామారవు జీవితచరిత్ర 2020010001413 1941
దేశ హిత ప్రదీపిక [166] తెనాలి రామకృష్ణుడు సాహిత్యం 2990100071295 వివరాల లేవు
దేశిక [167] అన్నే ఉమామహేశ్వరరావు నవల 2020010004850 1960
దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి [168] కామరాజు హనుమంతరావు జీవితచరిత్ర 2020120000318 1928
దేశింగు రాజు కథ [169] ప్రచరణ:వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ కథ 2020010002714 1923
దేశీయ పరిశ్రమలు [170] పెండెం వెంకట్రాములు సాహిత్యం 2020050005767 1935
దేశోద్ధారకులు-మొదటి భాగము [171] బి.వి.నాంచారయ్య జీవితచరిత్రలు భారతదేశంలోని స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను, వారి కృషిని వివరిస్తూ రాసిన పుస్తకమిది. ఒకొక్క సంపుటిలో కొంత మంది సమరయోధుల గురించి ప్రచురించారు. 2020050015091 1947
దేశం ఏమైంది? [172] మూలం:ఎలస్ పేటస్, తెలుగు అనువాదం:రెంటాల గోపాలకృష్ణ నవల 2020010004849 1958
దేశం నాకిచ్చిన సందేశం?(పుస్తకం) [173] బుచ్చిబాబు కథల సంపుటి 2020010004894 1957
దేశం బాగుపడాలంటే(పుస్తకం) [174] ఎస్.గంగప్ప నాటికల సంపుటి 2020120020018 1997
దైవదూత-దివ్యజీవన సంధాత వారి పరిమళ జీవనం [175] ప్రచురణ:శ్రీశివానంద సందేశ ప్రచార సేవా సమితి జీవితచరిత్ర శ్రీ దేవానంద చినస్వామి షష్టిపూర్తి ఉత్సవానికి ప్రచురుంచిన జీవిత చరిత్ర ఇది. 2990100071305 1997
దైవప్రవక్తలు-నాలుగవ భాగం [176] మూలం:మౌలానా అబూ సలీం అబ్దుల్ హై, అనువాదం:మహమ్మద్ ఇక్బాల్ అహ్మద్ జీవితచరిత్ర, అనువాద సాహిత్యం ముస్లిం ప్రవక్తల జీవితచరిత్రలను సంపుటులుగా ప్రచురించారు. ఈ పుస్తకంలో హాజత్ మూసా ప్రవక్త జీవితచరిత్రను ప్రచురించారు. ఈ జీవితచరిత్రలను ఉర్దూలో రాయగా తెలుగులోనికి అనువదించి, ప్రచురించారు. 2020120000289 1985
దైవభక్తి [177] మూలం:లీలాకుషుహాల్ నందు ఖురుసండు, అనువాదం:పైడిమర్రి వెంకట సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000288 వివరాలు లేవు
దైవదూత దివ్యజీవన సంధాత వారి పరిమళ జీవితం [178] ప్రచురణ.శివానంద సందేశ ప్రచార సేవాసమితి ఆధ్యాత్మికం, జీవిత చరిత్ర బ్రహ్మానందాశ్రమానికి చెందిన దేవానంద చిన్నస్వామి వారి షష్టిపూర్తి సంచిక ఇది. ఈ సంచికలో ఆయన జీవిత చరిత్రను, వారి ఆశ్రమానికి సంబంధించిన విలువైన ఫోటోలను పొందుపరిచారు. 2990100071293 1997
దైవ లీల [179] వడ్లమూడి సిద్ధయ్య కవి కావ్యం 5010010000720 1927
దైవ సాక్షాత్కారం [180] వి.టి.చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికం దైవం, పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, వంటి అనేకమైన ఆధ్యాత్మిక పదాలకు ఎందరికో చూచాయగా అర్థాలు తెలిసివున్నా పూర్తిస్థాయిలో తెలియకపోవచ్చు. అటువంటి వ్యక్తులకు తేలికగా అర్థమయ్యేలా ఈ రచనను చేశారు చంద్రశేఖర్. ఆధ్యాత్మికతలో అందులోనూ హిందూమతంలో బయటకు కనిపించని అంతరార్థాలు ఇందులో అందించారు. 2020120000290 1983
దొడ్డ భాగవతము- ప్రథమ సంపుటి [181] దొడ్ల వేంకట రామారెడ్డి పద్యకావ్యం, ఇతిహాసం 2020010004898 1953
దొడ్డ రామాయణం- ప్రథమ భాగము [182] దొడ్ల వేంకట రామారెడ్డి పద్యకావ్యం, ఇతిహాసం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో ఇది ఒకటి. దొడ్ల వేంకట రామారెడ్డి తన ఇంటిపేరు, మంచి అన్న అర్థమూ కలిసివచ్చేలా తన రామాయణానికి దొడ్డ రామాయణం అని పేరుంచారు. 2030020024968 1955
దొడ్డ రామాయణం-ద్వితీయ భాగము [183] దొడ్ల వేంకట రామారెడ్డి పద్యకావ్యం, ఇతిహాసం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో ఇది ఒకటి. దొడ్ల వేంకట రామారెడ్డి తన ఇంటిపేరు, మంచి అన్న అర్థమూ కలిసివచ్చేలా తన రామాయణానికి దొడ్డ రామాయణం అని పేరుంచారు. 2020010004899 1958
దొంగా ఓ మనిషే! [184] నాయని దామోదరరెడ్డి కథల సంపుటి 2020010004900 1959
దోమాడ యుద్ధం [185] సోమారాజు రామానుజరావు కథ 2020120000349 1921
ద్రౌపదీ వస్త్రాపహరణం (నాటకం) [186] రామనారాయణ కవులు నాటకం, పౌరాణిక నాటకం ద్రౌపదీ వస్త్రాపహరణం పేరిట ప్రాచుర్యం పొందిన ఘట్టానికి సముచితమైన అసలు పేరు "ద్రౌపదీ మానసంరక్షణ"(ద్రౌపది వస్త్రం అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉండడంతో వస్త్రాపహరణ జరుగక మానం సంరక్షితమైంది). ఈ ఘట్టానికి ఫలితంగానే కురుక్షేత్రంలో అక్షౌహిణుల కొద్దీ సైన్యమూ, వేలాదిమంది మహావీరులు మృతిచెంది ధార్తరాష్ట్రులు సమూలంగా తుడిచిపెట్టుకుపోయారు. ఈ ఘట్టం ప్రాచుర్యం, ప్రాధాన్యతను గ్రహించి దీన్ని పూర్తిస్థాయి నాటకంగా మలిచి ప్రదర్శనలలోనూ, ప్రాచుర్యంలోనూ చక్కని విజయం సాధించారీ కవులు 2030020025356 1922
ద్రౌపదీ స్వయంవరము [187] తిక్కన, వ్యాఖ్యానం.చెరుకూరి వేంకట జోగారావు ఇతిహాసం "వింటే భారతం వినాలి" అన్నది తెలుగు వారి నానుడి. శ్రీమదాంధ్ర మహాభారత ప్రాచుర్యానికి అది గీటురాయి. కవిత్రయ భారతానికి అసంఖ్యాకులైన పండితులు రసికులను అలరించేందుకు చక్కని వ్యాఖ్యలు రచించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రమహాభారత అంతర్గతమైన ద్రౌపదీ స్వయంవర ఘట్టానికి సుబోధకమైన వ్యాఖ్యాసహితంగా ప్రచురించిన గ్రంథమిది. 2030020025111 1926
ద్రౌపదీ వస్త్రాపహరణం (మల్లాది రచన) [188] మల్లాది అచ్యుతరామశాస్త్రి నాటకం, పౌరాణిక నాటకం ద్రౌపదీ వస్త్రాపహరణం పేరిట ప్రాచుర్యం పొందిన ఘట్టానికి సముచితమైన అసలు పేరు "ద్రౌపదీ మానసంరక్షణ"(ద్రౌపది వస్త్రం అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉండడంతో వస్త్రాపహరణ జరుగక మానం సంరక్షితమైంది). ఈ ఘట్టానికి ఫలితంగానే కురుక్షేత్రంలో అక్షౌహిణుల కొద్దీ సైన్యమూ, వేలాదిమంది మహావీరులు మృతిచెంది ధార్తరాష్ట్రులు సమూలంగా తుడిచిపెట్టుకుపోయారు. ఈ ఘట్టం ప్రాచుర్యం, ప్రాధాన్యతను గ్రహించి దీన్ని పూర్తిస్థాయి నాటకంగా పలువురు నాటకకర్తలు మలిచారు. ఆ క్రమంలోనే మల్లాది అచ్యుతరామశాస్త్రి కూడా రచించి ప్రకటించారు. 2030020024726 1930
ద్రౌపది స్వయంవరము-చిరుతల భజన [189] ముప్పిడి నారాయణ జానపద కళారూపాలు 2020010004731 1957
దౌహృదిని [190] కోడూరి సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000337 1998
దండక రత్నములు [191] పలువురు కవులు దండకాలు ఇవి భగవంతుని గురించి పలువురు పూర్వ కవులు రాసిన దండకాలు. 2020010004875 1958
దంత వేదాంతం అంతా ఇంతే [192] భమిడిపాటి రాధాకృష్ణ వైద్యం 2020010002555 1960
దంపతులు [193] పొ.వెం.రంగారావు నాటకం 2020010002697 1931
దాంపత్యాలు [194] కోమలాదేవి నవల ఎమెస్కో అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. ఎమ్. శేషాచలం అండ్ కో (టూకీగా ఎమెస్కో) అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే బందరులోస్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్‌ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. అప్పట్లో ఎమెస్కో సంస్థ ప్రచురించిన పాకెట్ బుక్స్ లో ఇది ఒకటి. 2990100068519 1969
దాంపత్య జీవితం [195] మునిమాణిక్యం నరసింహారావు హాస్యం, కథాసాహిత్యం దాంపత్య జీవితాన్ని హాస్యభరితమైన పద్ధతిలో చూపిన రచయిత మునిమాణిక్యం. ఆయన సృష్టించిన కాంతం పాత్ర తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర. ఈ కథా సంకలనంలో తత్సంబంధితమైన సాహిత్యం ఉంది. 2030020024760 1951
దంభ ప్రదర్శనము [196] మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు సాహిత్యం 2020010002725 1935
దిండు క్రింది పోకచెక్క [197] విశ్వనాథ సత్యనారాయణ నవల 2020050016127 1952