వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - చ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
చండ్ర రాజేశ్వరరావు గారితో నా అనుభవాలు [1] చండ్ర సావిత్రీదేవి ఆత్మకథ, జీవిత చరిత్ర చండ్ర రాజేశ్వరరావు (1915-1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు,[1] సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.)కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌' అవార్డుతో సోవియట్‌ యూనియన్‌, `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీదును మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు. రాజేశ్వరరావు భార్య సావిత్రీదేవి ఆయన గురించి ఈ గ్రంథం రచించారు. 2990100071281 1998
చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు [2] చండ్ర రాజేశ్వరరావు వ్యాసాలు, రాజకీయం చండ్ర రాజేశ్వరరావు భారతదేశ వ్యాప్తంగా పేరుపొందిన కమ్యూనిస్ట్ నాయకుడు. 1969లో తెలంగాణా ఉద్యమం, 1973లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం గురించి, వాటి పరిణామాల గురించి ఆయన రాసిన వ్యాసాలను ఈ గ్రంథంలో ప్రచురించారు. 2990100071280 2001
చండిక(పుస్తకం) [3] ముత్తనేని వేంకట చెన్నకేశవులు నాటకం 2020050015228 1925
చండీ శతకము [4] బాణ మహాకవి శతకము 2020120000232 1991
చందమామ కథలు(పుస్తకం) [5] మాచిరాజు కామేశ్వరరావు కథా సాహిత్యం 2990100071290 2004
చందసుల్తాన [6] మాగుంట వెంకటరమణయ్య, సంపాదకత్వం.చెలికాని లచ్చారావు నవల, చారిత్రిక నవల చాంద్ బీబీ సుల్తానా మధ్యయుగాల నాటి చారిత్రిక వ్యక్తి. ఆమె బీజాపూరు సుల్తానైన అల్లీ ఆదిల్ షాహీ భార్య. భర్తను పెళ్ళైన కొన్ని ఏళ్ళకే హత్యచేసి కుట్రదారులు చంపగా, అతని తమ్ముని సింహాసనంపై కూర్చోబెట్టి పరిపాలించింది. 2030020024612 1920
చంద్రకళానాడి [7] మేడవరపు సంపత్ కుమార్ జ్యోతిష్యం 2990100067424 2004
చంద్రకళా స్వయంవరము [8] వివరాలు లేవు నాటకం 2020050015127 1924
చంద్రకాంత (నాటకం) [9] చక్రావధానుల మాణిక్యశర్మ నాటకం 2030020025358 1920
చంద్రభాగా తరంగాలు (ప్రధమ భాగము) [10] స్వామి సుందర చైతన్యానంద ఆధ్యాత్మికం 2990100061527 1987
చంద్రమతీ పరిణయము [11] నరికొండ హనుమంతరాజు నాటకం 2020050015111 1937
చంద్రరేఖా విలాపము [12] కూచిమంచి జగ్గకవిచంద్ర హాస్య ప్రబంధం 2020050006463 1931
చంద్రలోక యాత్ర [13] ఎ.వి.ఎస్.రామారావు బాల సాహిత్యం 2020120032253 1991
చంద్రవదన చాకచక్యం [14][dead link] ఎల్లోరా నవల 2020120029066 1957
చంద్రాంగద చరిత్రము [15] వేంకటపతి ఐతిహ్యం 5010010088945 1897
చంద్రగుప్త [16] మూలం.ద్విజేంద్రలాల్ రాయ్, మూలం.శ్రీపాద కామేశ్వరరావు నాటకం, చారిత్రిక నాటకం, అనువాదం చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశాన్ని మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. చంద్ర గుప్తుడు మొట్ట మొదటిసారిగా భారతదేశమంతటినీ ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు. ఆయన గురువు చాణక్యుని సహకారంతో చంద్రగుప్తుడు ఈ విజయం సాధించారు. ఆ ఇతివృత్తాన్ని ద్విజేంద్రలాల్ బెంగాలీలో రచించగా శ్రీపాద కామేశ్వరరావు తెనిగించారు. 2030020024682 1926
చంద్రగుప్త [17] ఉమర్ ఆలీషా నాటకం, చారిత్రిక నాటకం. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశాన్ని మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. చంద్ర గుప్తుడు మొట్ట మొదటిసారిగా భారతదేశమంతటినీ ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు. ఆయన గురువు చాణక్యుని సహకారంతో చంద్రగుప్తుడు ఈ విజయం సాధించారు. ఆ ఇతివృత్తాన్ని డాక్టర్ ఉమర్ ఆలీషా ఐదంకాల నాటకంగా రచించారు. (తొలి ముద్రణ 1910) 2030020025136 1955
చంద్రగుప్త విజయము [18] జంధ్యాల లక్ష్మీనారాయణశాస్త్రి నవల 2990100071282 1972
చంద్రగిరి దుర్గము [19] అమ్మిశెట్టి లక్ష్మయ్య చారిత్రక కావ్యం 2020010002415 1948
చంద్రగిరి దుర్గము-సహృదయ వివేచన [20] మిరియాల వెంకటరమణారెడ్డి చారిత్రక కావ్య విమర్శ 2990100047091 2000
చంద్రనాథ్ [21] కౌండిల్య నవల 2020010004687 1960
చంద్రప్రభ చరిత్రము [22] తిరుపతి వెంకటేశ్వర కవి సాహిత్యం 2020010004688 1954
చంద్రభాను చరిత్రము [23] తరిగొప్పుల మల్లనమంత్రి పద్యకావ్యం 16వ శతాబ్దంలో తరిగొప్పుల మల్లనమంత్రి రచించిన పద్యకావ్యం ఇది. ద్వాపరయుగంలో కృష్ణుని సమకాలంలో జరిగిన కథ ఇది. ఈ కథలో చంద్రభాను శ్రీకృష్ణ సత్యభామాదులు ప్రధాన పాత్రలుగా ఉంటారు. తళ్ళికోట యుద్ధానంతరపు విజయనగర రాజు పరిపాలనలో ఉద్యోగిగా పనిచేసేవారు. 2030020025254 1922
చంద్రయ్యలో చైతన్యం [24] మూలం: లియోటాల్ స్టాయ్, హిందీ అనువాదం: జైనేంద్రకుమార్, తెలుగు అనువాదం: దండమూడి మహీధర్ సాహిత్యం 2020010004684 1959
చంద్రశేఖర శతకం [25] పరిష్కర్త.మున్నంగి శర్మ శతకం ఈ గ్రంథకర్త ఎవరో, ఆయన పేరేమిటో తెలియలేదని పరిష్కర్త పేర్కొన్నారు. శతక సాహిత్యంలోని ఎన్నో గ్రంథాల్లో ఇది ఒకటి. 2020050016513 1932
చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉపన్యాసములు [26] మూలం.చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, అనువాదం.వేలూరి రంగధామనాయుడు ఉపన్యాసములు, ఆధ్యాత్మికత, హిందూమతం జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మే 20, 1894 – జనవరి 8, 1994) కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68వ వారు. వారు పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతొ కూడా పిలవబడతారు. ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి. స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. ఒక ధర్మం శక్తి ఆ ధర్మా నికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఆయన మద్రాసు (నేటి చెన్నై)లో తమిళ భాషలో చేసిన ప్రసంగాలను రంగధామనాయుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు. 02020120001650 1955
చంద్రహాస నాటకము [27] గంజి నాగయ్య నాటకం 5010010086092 1912
చంద్రహాసము [28] జి.జోసపుకవి సాహిత్యం 2020010004683 1933
చంద్రిక [29] బుద్ధవరపు వేంకటరత్నం కథ 2020010004751 1955
చంపకం-చదపురుగులూ [30] మాలతీ చందూర్ కథా సాహిత్యం 2020010004632 1955
చంపకమాలిని(పుస్తకం) [31] ఎ.రాజమ్మ నవల 2020050016284 1927
చంద్రాలోక సమున్మేషము [32] టి.భాస్కరరావు సాహిత్యం 2020120029064 1973
చంద్రాలోకము [33] అమరవాది నీలకంఠ సోమయాజి సాహిత్యం 2020120004029 1944
చంద్రాలోకము [34] అక్కిరాజు ఉమాకాంతము సాహిత్యం 2020120034340 1938
చంద్రికా పరిణయము [35] రచయిత: సురభి మాధవరాయ ప్రభు, సంపాదకుడు:కేశవపంతుల నరసింహశాస్త్రి కావ్యం 2020120004030 1982
చందు [36] బాలి (చిత్రకారుడు) బాల సాహిత్య పత్రిక 2990100071283 2004
చందు మీనన్ [37] మూలం: టి.సి.శంకరమీనన్, అనువాదం: కె.కె.రంగనాధాచార్యులు జీవితచరిత్ర 2990100051627 1979
చంద్రుడికి... [38] భమిడిపాటి కామేశ్వరరావు జీవితచరిత్ర 2020010004615 1955
చంద్రునికో నూలుపోగు [39] పురాణం సుబ్రహ్మణ్యశర్మ నవల 2020010004647 1960
చంపూ భాగవతం [40] కె.విశ్వనాధశాస్రి పద్యకావ్యం, సంస్కృత అనువాదం 2030020024869 1908
చంపూ రామాయణం [41] ఆంధ్రీకరణ.ఋగ్వేదకవి వెంకటాచలపతి పద్యకావ్యం, సంస్కృత అనువాదం సంస్కృతంలోని చంపూ రామాయణాన్ని ఋగ్వేదకవి వెంకటాచలపతి ఆంధ్రీకరించారు. వేంకటాచలపతి కార్వేటినగర సంస్థానాధీశునికి ఆస్థాన కవి. ఈయన రచించిన ఈ గ్రంథాన్ని అనంతరకాలంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ప్రచురించారు. 2030020024914 1917
చంపూ రామాయణం(అరణ్య, కిష్కింధకాండ) [42] మూలం: భోజరాజు, అనువాదం: తట్టా నరసింహాచార్యులు పద్యకావ్యం, సంస్కృత అనువాదం 2040100028455 1990
చక్కని ఇంగ్లిష్ రాయడమెలా? [43] పత్తిపాటి నాగేంద్రప్రసాద్ సాహిత్యం 2020120029057 1997
చక్కని తెలుగు రాయడమెలా? [44] వి.లక్ష్మణరెడ్డి సాహిత్యం 2020010004621 1960
చక్రదత్త [45] చక్రపాణి సాహిత్యం 2030020025414 1926
చక్రధారి శతకం [46] పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. చక్రధారీ! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016660 1935
చక్రభ్రమణం [47] కోడూరి కౌసల్యాదేవి నవల 2990100049358 1964
చక్రవర్తికి లేఖలు [48] వేమరాజు సుభద్ర సాహిత్యం 2020050005648 1956
చక్రి (పుస్తకం) [49] ధనికొండ హనుమంతరావు కథల సంపుటి 2020010004676 1954
చచ్చిపోయిన మనిషి [50] మూలం: డి.హెచ్.లారెన్స్, అనువాదం: పా.ప కథా సాహిత్యం 2020010004613 1951
చతురాస్యము [51] కల్లూరి వేంకటరామశాస్త్రులుగారు వ్యాసములు, పద్యములు షడ్దర్శిని (అరసున్న, శకటరేఫ ల గురించి పరిశోధనాత్మకవ్యాసము), సూక్తిబ్రాహ్మణ్యసారసాక్షి(అంకెల లేఖనము గురించి పరిశోధనాత్మకవ్యాసము), జార్జిముక్తావళి, నవరత్నమంగళమాలిక(కోటిలింగేశ్వర మకుటంతో తొమ్మిది పద్యాలు) ఉన్న సుమారు నలభై అయిదు పుటల పుస్తకము 2020050018898 1913
చతుర్దశ భువనములు ఏవి? ఎక్కడ? [52] కోడూరి సుబ్బారావు సాహిత్యం 2020120032259 1990
చతుర్ముఖీ కంద పద్య రామాయణము [53] నాదెళ్ళ పురిషోత్తమరావు ఆధ్యాత్మిక సాహిత్యం 5010010031943 1926
చతుర్వేద సారము [54] పాల్కురికి సోమనాధుడు, పరిష్కర్త: బండారు తమ్మయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034350 1962
చతుశ్లోకీ వ్యాఖ్యానమ్ [55] పెరియవాచ్చాంబిళైకుమారర్ ఆధ్యాత్మికం 5010010017410 1913
చతుస్సూత్రీ [56] విమలానంద భారతిస్వామి ఆధ్యాత్మికం 2020120029072 1978
చమత్కార కథాకల్లోలిని [57] చిలకపాటి వేంకటరామానుజశర్మ సాహిత్యం 2020120019912 1929
చమత్కార కవిత్వము [58] కవి: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, పుస్తక సంపాదకులు: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం 2020010004631 1949
చమత్కార మంజరి [59] సింహాద్రి వెంకటాచార్యులు పద్య కావ్యం చమత్కార మంజరి అనే ఈ కావ్యాన్ని రచించిన వ్యక్తి గోదావరి మండలానికి చెందిన శ్రీవైష్ణవ కులస్తుడని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గ్రంథంలోని పద్యాలను అప్పకవికి పూర్వులైన లాక్షణికులు ఉపయోగించకపోవడం చేసి, ఈ గ్రంథకర్త దాదాపు 1630-40ల నడుమ గ్రంథ రచన చేసివుంటారని నిర్ణయించారు. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు 1900 సంవత్సరంలో తమ ముద్రణాశాల ద్వారా ప్రచురించగా అనంతర కాలంలో ఈ ప్రతిని జానపాటి పట్టాభిరామశాస్త్రి ముద్రించారు. 2030020025083 1911
చదరంగం (పుస్తకం) [60] మూలం: రవీంద్రనాధ్ ఠాకూర్, అనువాదం: శశిభూషణ పాత్రో కథా సాహిత్యం 2020010004614 1958
చదువు(పుస్తకం) [61] కొడవటిగంటి కుటుంబరావు నవల 2990100071276 1982
చదువులా?? చావులా?? [62] నామిని సుబ్రహ్మణ్యం నాయుడు సాహిత్యం 2990100071277 2002
చదువెందికో తెలుసా? [63] బొడ్డుపల్లి సుబ్బారావు నాటకం 2020120032245 1959
శ్రీ చన్న మల్లేశ్వర శతకము [64] గంగాధరకవి శతకం తెలుగు సాహిత్య శాఖల్లో ప్రఖ్యాతి పొందినవాటిలో శతకం ఒకటి. శతక సాహిత్యం ద్వారా పలువురు కవులు భక్తి, వైరాగ్యం, నీతి మొదలైన విషయాలు బోధించారు. అదే క్రమంలో ఈ గ్రంథం శివభక్తిని ప్రతిపాదిస్తోంది. 2020050016508 1924
చరక సంహిత [65] వెంకటాచలపతి ప్రసాదశాస్త్రి సాహిత్యం 2020120034321 1930
చరక సంహిత సూత్రస్థానం [66] విశ్వనాధశాస్త్రి వైద్యం 5010010006787 1935
చరక సంహిత కల్ప-సిద్ధి స్థానములు [67] నుదురుపాటి విశ్వనాధశాస్త్రి వైద్యం 5010010006782 1941
చరక సంహిత విమనస్థానము [68] పి.హిమసాగర చంద్రమూర్తి వైద్యం 5010010006788 1935
చరక సంహిత శరీరస్థానము [69] ఎం.ఎల్.నాయుడు, సి.హెచ్.రాజరాజేశ్వరశర్మ, పి.హిమసాగర చంద్రమూర్తి వైద్యం 5010010006784 1941
చరమాంకం [70] తారక రామారావు నాటకం 2020120034359 1987
చరమోపాయ నిర్ణయం [71] శ్రీనివాస రామానుజం సాహిత్యం 2020120034343 1910
చరణ్ దాస్ [72] అయిలావఝ్ఝుల సూర్యప్రకాశ్ శర్మ నాటకం 2020010004651 1951
చరిత్రకథలు (నాల్గవ భాగము) [73] నండూరి విఠల్ బాబు చరిత్ర 2020010004658 1957
చరిత్రకెక్కని చరితార్ధులు(విస్మృత కవులు-కృతులు) [74] బి.రామరాజు చరిత్ర 2990100051628 1985
చరిత్ర ధన్యులు [75] మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి చరిత్ర చరిత్ర ధన్యులు చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం. ఇందులో రచయిత శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి. చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది. 2020120000242 1954
చరిత్రపరిశోధకులు [76] కోన వెంకటరాయ చరిత్ర 2020010004659 1959
చరిత్ర-సివిక్స్ [77] ధన్యంరాజు అప్పారావు, ధన్యంరాజు సత్యనారాయణ, రాణీరావు భావయ్యమ్మారావు పాఠ్యగ్రంథం 2020010004652 1958
చలం నవలలు-సామాజిక చైతన్యం [78] వెన్నవరం ఈదారెడ్డి సాహిత్యం 2990100061525 1979
చలం నాటకాలు [79] గుడిపాటి వెంకటాచలం నాటకాల సంపుటి 2020010004624 1957
చలం-స్త్రీ వాదం [80] ఏటుకూరు బలరామమూర్తి సాహిత్యం 2990100071279 1994
చలం ఉత్తరాలు చింతా దీక్షితులుగారికి (మొదటి భాగము) [81] గుడిపాటి వెంకటాచలం సాహిత్యం 2020010004623 1944
చలంగారి ఉత్తరాలు విరేశలింగం గారికి [82] గుడిపాటి వెంకటాచలం సాహిత్యం 2020120034327 1996
చలిజ్వరము (పుస్తకం) [83] ఆచంట లక్ష్మీపతి వైద్యం 2020120000228 1915
చలో హైద్రాబాద్ [84] వేదాంతం కవి నాటకం 2020010004626 1948
చాటుపద్యమణిమంజరి-ద్వితీయ భాగము [85] సంపాదకుడు.వేటూరి ప్రభాకరశాస్త్రి చాటువులు మరుగునపడివున్న అపురూపమైన చాటుపద్యాలను సేకరించి వాటి వెనుకనున్న చారిత్రిక విశేషాలను ఈ గ్రంథంగా అచ్చువేశారు వేటూరి. 1914లోనే తొలిభాగాన్ని ప్రచురించగా వెంటనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఆపైన మొదటిభాగం మరొక ముద్రణ పొందింది. అదే క్రమంలో వేరే పద్యాలను సేకరించి రెండవభాగంగా ప్రచురించిన వేటూరి ఆ ప్రతులూ చెల్లిపోగా ఈ మరికొన్ని కొత్త పద్యాలను చేర్చి ఈ గ్రంథం ప్రచురించారు. ఇది రెండవ భాగానికి మూడవ ముద్రణ 2030020025596 1952
చాటుపద్య రత్నాకరము [86] దీపాల పిచ్చయ్య శాస్త్రి చాటువులు 5010010076952 1927
చాటుధారా చమత్కార సారః [87] అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి చాటువులు, శ్లోకాలు సంస్కృతాంధ్ర సాహిత్యాలలో చాటువులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రసిద్ధ కవుల జీవితాల్లో జరిగినవిగా చెప్పే చమత్కారమైన కథల్లో ఇవి ఇముడుతూంటాయి. ఆయా కవుల శైలిని అనుసరిస్తూనే, అపూర్వమైన రసజ్ఞత అందిస్తుంటూంది చాటు సాహిత్యం. ఈ గ్రంథంలో పూర్వకవుల చాటుశ్లోకాలకు వ్యాఖ్యాన సహితంగా సుబ్రహ్మణ్యకవి అందించారు. 2030020025366 1931
చతుర్ లడ్‌కీ [88][dead link] అనువాదం.కె.ఉస్.వసంతలక్ష్మి, బొమ్మలు.చంద్రశేఖర్ జోషి బాల సాహిత్యం కౌమార ప్రాయంలోని పిల్లలకు ఆసక్తిగా ఉండే పుస్తకం ఇది. బొమ్మల కథ ఐన ఈ పుస్తకంలో షావుకారు మోసాన్ని అతనికే తిప్పికొట్టిన తెలివైన అమ్మాయి కథ ఉంది. పేదరైతు కూతురునైన తనను తన ఆర్థిక స్థితిగతులు ఆసరాగా తీసుకుని వివాహం చేసుకుందామనుకున్న ముసలి షావుకారును ఆమె తెలివి ఉపయోగించి దెబ్బకొడుతుంది. నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా వారు అనువదింపజేసి ప్రచురించారు. 99999990129013 1998
చతుర చంద్రహాసం [89] చిలకమర్తి లక్ష్మీనరసింహం నాటకం గ్రంథకర్త చిలకమర్తి ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ఐదంకాల నాటకమిది. 2030020025157 1922
చతుర్వేద పరమరహస్యము [90] పీసపాటి లక్ష్మావధాని తత్త్వశాస్త్రం, హిందూమతం, ఆధ్యాత్మికం వేదాలలోని సాంకేతికములు, చిహ్నాల వెనుక దాగి ఎన్న్నో రహస్యమూ, గహనమూ ఐన విషయాలు ఉన్నాయి. అటువంటివాటిని వివరిస్తూ వేదాల అంతరార్థాలు ప్రతిపాదించే గ్రంథమది. 5010010016871 1950
చదువు కథలు [91] సంపాదకులు.కేతు విశ్వనాథరెడ్డి, పోలు సత్యనారాయణ కథా సాహిత్యం చదువు విజ్ఞానాన్ని, వివేకాన్ని, వికాసాన్ని కలిగిస్తుంది. అందరికీ విద్య అందాలనే విషయంపై కృషిచేసిన స్వచ్ఛంద సంస్థ ఆ ఆశయాన్ని ప్రచారం చేసేందుకు తెలుగు కథా సాహిత్యంలో చదువు గురించి ప్రబోధించే, చదువు విలువ తెలియజెప్పే కథలను ఈ గ్రంథంగా సంతరించి ప్రచురించారు. ఇందులో గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కె.సభా, చాసో, బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారాం, దాశరథి రంగాచార్య తదితర ప్రముఖ రచయితలు చదువు అంశంపై వేర్వేరు సందర్భాల్లో రచించి ప్రచురించిన కథలను సంకలనం చేసి ప్రచురించారు. 2990100051624 1994
చదువుకున్న పిల్ల [92] అనువాదం.వి.ఎన్.శర్మ బాల సాహిత్యం, నవల ఆంగ్లసాహిత్యంలో వయసుల వారీగా ఎదుగుతున్న పిల్లలు చదవదగ్గ సాహిత్యం వర్గీకరించి, రచయితలు కూడా ఆ వయసుల వారిని దృష్టిలో ఉంచుకుని రచించే సంప్రదాయం ఉంది. ఈ గ్రంథం అలాగే ఆంగ్లంలో యుక్తవయసు బాలలు చదివేందుకు రచించారు. దీన్ని తెలుగులోకి అనువదించారు. బ్రిటీష్ ఇండియా రోజుల్లో బొంబాయిలో స్థిరపడి సంపన్నులైన బ్రిటీష్ కుటుంబం నుంచి బాలిక ఇంగ్లాండు వెళ్తుంది. ఆమె కన్నా చిన్నవయసున్న అత్తయ్య కొడుకు ఆమె చెప్పే భారత్ కబుర్లకు ఆశ్చర్యపడి ఎలాగైనా భారతదేశం వెళ్ళాలని ఆశపడతాడు. ఇలా సాగే ఇతివృత్తం కౌమారంలో ఉన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. 2030020024679 1995
చరిత్ర పురుషులు-చారిత్రిక సంఘటనలు [93] ఎం.డి.సౌజన్య చరిత్ర 2020120034345 1989
చాణక్య(పుస్తకం) [94] కోడూరి శ్రీరామకవి ఏకపాత్రాభినయం 2020120004027 1986
చాణక్య నీతి దర్పణము [95] సంస్కృత మూలం: చాణక్యుడు, హిందీ మూలం: జగదీశ్వరానంద సరస్వతి, ఆంధ్రానువాదం: ఆరమండ్ల వెంకయ్యార్య నీతిశాస్త్ర గ్రంథం 2020120034333 1996
చాణక్య నీతి సూత్రాలు [96] పుల్లెల శ్రీరామచంద్రుడు నీతిశాస్త్ర గ్రంథం 2020120032249 1996
చారిత్ర నాటక పంచకము [97] వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు నాటకాలు 2020120034344 1926
చారిత్రక కావ్యములు [98] బి.అరుణకుమారి చరిత్ర 6020010029069 1978
1.చారిత్రిక శ్రీశైలము, 2.భారతీయ సంస్కృతి, 3.చారిత్రక కాశీక్షేత్రము, [99] కొడాలి లక్ష్మీనారాయణ చరిత్ర చారిత్రిక శ్రీశైలము: ప్రాచీన కాలం నుంచి తెలుగునాడును వ్యవహరించే త్రిలింగ నామంలోని మూడు శివలింగాల్లో శ్రీశైలం ఒకటి. సుప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీశైలం ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీశైల చరిత్ర దాదాపుగా 5వ శతాబ్ది నుంచి ఆంధ్రదేశ చరిత్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూంటుంది. వివిధ రాజవంశాలు శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తూ ఆ క్రమంలో శాసనాలు వేయించారు. ఎందరో కవులు తమ రచనల్లో శ్రీశైల మల్లికార్జునుని ప్రస్తుతిస్తూ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం గురించిన చారిత్రిక వివరాలతో ఈ గ్రంథాన్ని రచించారు. చారిత్రక కాశీక్షేత్రము: భారతదేశమంతా కర్మభూమిగా ప్రసిద్ధిచెందితే కాశీ మాత్రం మోక్షభూమి అన్న ప్రత్యేకత కలిగివుంది. వారణ, అసి నదుల మధ్యనున్న భూమి అనాది, అనంతమని భారతీయుల విశ్వాసం. పౌరాణికంగానే కాక కాశీకి చారిత్రికంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ సంస్కృతితో ఎంతగానో ముడిపడ్డ నగరం కావడంతో చరిత్రలో ప్రాచీన రాజ్యాలకు, పరిశ్రమలకు, దండయాత్రలకు ఇలా ఎన్నింటికో సాక్షీభూతంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చారిత్రిక కాశీక్షేత్రము గ్రంథంలో పలు ఆకరాల నుంచి కాశీ చరిత్రను పునర్నిర్మించారు. 6020010034346 1972
చారిత్రక జ్యోతులు [100] పోలవరపు శ్రీహరిరావు ఏకాంకికలు 2020010004654 1946
చారిత్రక వ్యాసములు (ప్రథమ భాగము) [101] నేలటూరు వెంకటరమణయ్య చరిత్ర 5010010000595 1948
చారిత్రక వ్యాసములు (బౌద్ధయుగము) [102] మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాసాలు 2020010004655 1944
చార్లీ చాప్లిన్ (జీవిత చరిత్ర) [103] వాసిరెడ్డి భాస్కరరావు జీవిత చరిత్ర చార్లీ చాప్లిన్ ప్రపంచస్థాయి కళాకారుడు. మూకీ సినిమాల్లో ఆయన పండించిన హాస్యం తరతరాలకు చెదరనిది. తలపై పెద్దదైపోయిన టోపీ, బటన్లు పట్టని కోటు, చేతిలో కర్ర, వదులు ప్యాంటు, చిన్ని మీసంతో ఆయన చేసిన ట్రాంప్ పాత్ర హాలీవుడ్ చరిత్రలో మరుపురానిదిగా మిగిలిపోయింది. ఆయన జీవిత చరిత్ర ఇది. 2990100071275 1984
చారు చంద్రోదయము [104] చెన్నమరాజు సాహిత్యం 2990100061522 1987
చారు గుప్త [105] పి.లక్ష్మీకాంతం చారిత్రాత్మిక నవల 2990100066355 2000
చారు చర్య [106] మూలం: భోజరాజు, అనువాదం: అప్పమంత్రి సాహిత్యం 2020050006449 1949
చారుదత్తము [107] కొత్త సత్యనారాయణ చౌదరి నాటకం 2020010004663 1948
చారుమతీ పరిణయము [108] మంత్రిప్రగడ భుజంగరావు నాటకం 5010010086022 1917
చారుణి [109] పాటిబండ మాధవశర్మ పద్య కావ్యం 2020010002532 1947
చింతామణి [110] కాళ్ళకూరి నారాయణరావు నాటకం 2020120000265 1923
చింతామణి [111] రామనారాయణ కవులు నాటకం చింతామణి లేదా లీలాశుక నాటకం తెలుగు నాట ప్రఖ్యాతము. అన్నిటికీ మించి కాళ్లకూరి వారి నాటకం తెలుగునాట ఊరూరా ప్రచురితమైంది. ఐతే ఆ ప్రాచుర్యాన్ని బట్టి మరికొన్ని రూపాంతరాలు ఏర్పడ్డాయి. అటువంటీ వాటిలో ఇదొకటి. 2030020024988 1922
చింతామణి అనుమానఖండం [112][dead link] వివరాలు అస్పష్టం వ్రాతప్రతి ఇది ఒక వ్రాత ప్రతి. 1990030081873
చింతామణి విషయ పరిశోధనము [113] వఝ్ఝుల చినసీతారామస్వామిశాస్త్రి పరిశోధక గ్రంథం 2990100073369 1997
చింతా దీక్షితులు సాహిత్యం [114] ప్రధాన సంపాదకుడు: వెలగా వెంకటప్పయ్య సాహితీ సర్వస్వం 2990100051630 1996
చిక్కవీర రాజేంద్ర [115][dead link] మూలం.మాస్తి వెంకటేశ అయ్యంగార్, అనువాదం.జానుమద్ది హనుమచ్ఛాస్త్రి నవల, చారిత్రిక నవల, అనువాదం చిక్కవీర రాజేంద్ర కన్నడ సాహిత్యంలో అపురూపమైన రచనల్లో ఒకటి. కొడకు అనే ప్రాంతాన్ని బ్రిటీష్ వారు కంపెనీ పాలనలోకి తీసుకునే ముందు పరిపాలించిన ఆఖరి రాజైన చిక్కవీర రాజేంద్రుని చుట్టూ తిరుగుతుంది ఈ నవల. కొడగు బ్రిటీష్ పాలనలోకి వెళ్ళేముందు సంవత్సరపు కథను ఇందులో చిత్రీకరించారు. పతనమైపోతున్న భారతీయ విలువలు, బ్రిటీష్ కుయుక్తులు, క్రైస్తవ ఫాదరీల ప్రచారం మొదలైన విషయాలు చిత్రీకరించినా ఆంతరమున భారతీయ సంస్కృతిలోని అతులితమైన శాంతిని, కర్తవ్యనిష్ట కలిగిన అపురూపమైన వ్యక్తులు గ్రంథంలో కనిపిస్తాయి. చారిత్రిక వాస్తవికతను తప్పకుండానే అపురూపమైన విషయాలను తెలిపిన గ్రంథమిది. ఈ గ్రంథరచనకు గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు మాస్తి. మైసూరు సామ్రాజ్యంలో దివానుగా పనిచేసిన ఆయన తనకు జ్ఞానపీఠ్ పురస్కారంతో పాటు లభించిన ధనాన్ని నిధిగా మలచి కన్నడ సాహిత్య అభివృద్ధికి వెచ్చించారు. ఈ కారణంతోనే మాస్తి కన్నడద ఆస్తి(మాస్తి కన్నడకు ఆస్తి) అన్న ప్రఖ్యాతి లభించింది. 99999990128986 1973
చికాగో నగరోపన్యాసములు [116] పరబ్రహ్మశాస్త్రి వ్యాసశర్మ స్వామీ వివేకానందుని సైద్ధాంతికోపన్యాసములు వివేకానందుని జీవిత సంగ్రహముతో పాటు హిందూ మతానికి సంబంధించిన అనేక అపోహలను తొలగిస్తూ వారు చికాగోలో చేసిన ప్రసంగాల విషయవివరాలతో కూడిన పుస్తకమిది. 1863 లో జన్మించిన వీరు బాల్యములోనే సంగీత సాహిత్య చిత్రలేఖన నర్తనాదులలో కూడా ప్రవేశమున్నది.1893 సెప్టెంబరు 17 న చికాగోలో సర్వమతసభయందు చేసిన ప్రసంగము జగత్ప్రసిద్ధము.1900 వ సం. మాతృభూమికి తిరిగివచ్చి మహాక్షేత్రముల సందర్శనము చేసి 1902 లోకేవలము 39 ఏండ్ల వయస్సులోనే పరమపదమునందిరి.ఈ ఉపన్యాసములలో ఆత్మకు శరీరసంబంధము, అన్యమతసహనము, భక్తి ముక్తి నిరూపణ, జన్మరాహిత్యము, జీవయాత్రకు సంబంధించిన ఎన్నో విషయములు చర్చించబడినవి. ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రామకృష్ణమఠము కొఱకై ఈ పుస్తకము వ్రాయబడింది. 2020050018964 1920
చిక్కాల కృష్ణారావు రచనలు (రెండవ భాగము) [117] చిక్కాల కృష్ణారావు సాహిత్యం 2020120000258 1955
చికిత్సాసారము [118] పువ్వాడ సూర్యనారాయణరావు వైద్యం 6020010032263 1927
చిగురులు-పువ్వులు [119] పి.దుర్గారావు కవితల సంపుటి 2020120029079 1984
చిగిరించిన గులాబి (పుస్తకం) [120] పోట్లూరి సుబ్రహ్మణ్యం కథల సంపుటి 2020120034361 1991
చిరకారి నాటకం [121] ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకం ధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharmavaram Ramakrishnamacharyulu) (1853 - 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. భారతంలోని శాంతిపర్వాంతర్గతమైన కథను స్వీకరించి ఈ రచన చేశారు. 2030020025317 1919
చికిత్సాసార సంగ్రహము [122] సంపాదకుడు చంద్రశేఖరన్ ఆయుర్వేదం ఇది ఆయుర్వేదానికి సంబంధించి తెలుగులో వచ్చిన ప్రాచీన గ్రంథాలలో ఒకటి. గ్రంథకర్త పేరు, కాలం లాంటి వివరాలు లేవు. గ్రంథానికి రాసిన ముందుమాటలోని వివరాలను బట్టి ఇది క్రమపద్ధతిలో రచించిన గ్రంథం కాదు. దీనిని రచయిత తన వైద్యవృత్తిలో భాగంగా అనుభవానికి వచ్చినప్పుడల్లా రాసుకుని సంకలనం చేసినట్టు భావించారు సంపాదకుడు. 2990100051629 1953
చిత్ శక్తి విలాసము [123] స్వామి ముక్తానంద పరమహంస ఆత్మకథాత్మక సాహిత్యం 2020120029086 1970
చిత్కళ [124] నీలా జంగయ్య గేయ కథా కావ్యం 2020120034369 1990
చిత్తప్రబోధము [125] మాడుగుల వేంకట సూర్యప్రసాదరావు పద్యకావ్యం 6020010034372 1954
చిత్తరంజన్ దాసు జీవితచరిత్ర [126] ఆర్.నారాయణరావు జీవిత చరిత్ర చిత్తరంజన్ దాసు ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్‌ని గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు. చిత్తరంజన్ దాసు జీవిత చరిత్ర ఇది. 2030020024420 1944
చిత్తూరు జిల్లా వీధినాటకాలు-ఒక పరిశీలన [127] వి.గోవిందరెడ్డి పరిశీలనాత్మక గ్రంథం 2040100047097 2001
చిత్ర కందపద్య రత్నాకరము [128] నాదెళ్ళ పురుషోత్తమకవి కావ్యం 5010010086017 1922
చిత్ర కథలు(3వ భాగము) [129] నిడమర్తి సత్యనారాయణమూర్తి కథల సంపుటి 2020050016371 1932
చిత్ర కథలు(4వ భాగము) [130] నిడమర్తి సత్యనారాయణమూర్తి కథల సంపుటి 2020050016391 1932
చిత్ర కవిత [131] హరి శివకుమార్ కవితల సంపుటి 2990100061529 1990
చిత్రతారకము [132] భమిడి సత్యనారాయణశర్మ సాహిత్యం 2020010002807 1947
చిత్రప్రబోధ [133] శ్రీ అనుభవానందస్వామి ఆధ్యాత్మికం 2020120000279 1979
చిత్రనళీయము [134] సీతారామకవి నాటకం 2020050015800 1926
చిత్రభాను [135] సంపాదకత్వం: టి.రంగస్వామి కవితా సంపుటి 2020120029085 2002
చిత్ర భారతము [136] చరిగొండ ధర్మన్న పద్య కావ్యం చరిగొండ ధర్మన్న రచించిన ఈ గ్రంథాన్ని తన వద్ద దొరికినంత మేరకు స్వీకరించి పాదాలకు పాదాలే లేకపోతే స్వయంగా పూరించి మరీ తన పత్రికలో మొదట ప్రచురించారు కందుకూరి వీరేశలింగం. ఆ ప్రతిలో స్ఖాలిత్యములు, లేఖక దోషములు లెక్కకు మిక్కిలి కావడంతో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకారంతో ఓలేటి వెంకటరామశాస్త్రి సంపాదకత్వంలో వావిళ్ళ వారు ఈ మేలు ప్రతిని ప్రచురించారు. ధర్మన్న పాండురంగ మహాత్మ్యం రచించిన తెనాలి రామకృష్ణుని సమకాలీకుడని సంపాదకులు అభిప్రాయపడ్డారు. (రచన శతాబ్దాలకు ముందే) 2030020025459 1934
చిత్రరత్నాకరము [137] గురజాడ శ్రీరామమూర్తి సాహిత్యం 2020010004740 1951
చిత్రలేఖనము [138] తలిశెట్టి రామారావు చిత్ర కళ తలిశెట్టి రామారావు తొలి తెలుగు వ్యంగ్యచిత్రకారునిగా సుప్రసిద్ధుడు. ఈ గ్రంథంలో చిత్రకళ నేర్చుకునే ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఈ గ్రంథంలో చిత్రకళకు సంబంధించిన మూలసూత్రాలు వివరించారు. ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు ఆయన రచించిన పుస్తకాన్నీ ఆధారంగా చేసుకునే తొలినాళ్ళలో అభ్యసించారు. 2030020025431 1918
చిత్ర సుందరి [139] మూలం.అఖిలన్, అనువాదం.వాకాటి పాండురంగారావు నవల, అనువాదం అఖిలన్ ప్రముఖ తమిళ రచయిత. ఆయన తన రచలకు గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం, సాహిత్య అకడెమీ అవార్డు మొదలైనవి పొందారు. చిత్తిరప్పావై అన్న నవలను మొదట ఆనందవికటన్ పత్రికలో ప్రచురించి అనంతరం పుస్తకరూపంలోకి మళ్ళింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తమ అంతర భారతీయ గ్రంథమాల శీర్షిక ద్వారా అనువదింపజేసి ప్రచురించారు. 99999990128960 1983
చిత్ర భారతము [140] మూలం.చరిగొండ ధర్మన్న, వచన సంగ్రహం. పళ్ళె వేంకట సుబ్బారావు వచనం చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి. చరికొండ గ్రామానికి చెందిన ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు కాని అతని రచనలు, మంత్రి పోషణల ప్రకారం జీవితకాలం క్రీ.శ.1480-1530గా నిర్ణయించారు. పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చరికొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ధర్మన్న రచించిన చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. దాని సుబ్బారావు వచన సంగ్రహంగా ఈ గ్రంథం రూపొందించారు. 2030020024597 1923
చిత్రవాణి (ప్రధమ భాగము) [141] పెన్మెత్స రాజంరాజు ఖండకావ్యం 2020010004744 1950
చిత్రవాణి (రెండవ భాగము) [142] పెన్మెత్స రాజంరాజు ఖండ కావ్యం 2020010004746 1951
చిత్ర సుందరి [143] మూలం: అఖిలన్, అనువాదం: వాకాటి పాండురంగారావు నవల 99999990128960 1983
చిత్రసేనోపాఖ్యానము [144] మూలం. పమ్మల సంబంధ మొదలియార్, అనువాదం. డి.వేంకటరమణయ్య నాటకం, అనువాద నాటకం తమిళంలో పమ్మల సంబంధ మొదలియార్ రచించిన నాటకానికి ఇది ఆంధ్రానువాదం. తమిళభాషలోని ఇది పలు ప్రదర్శనలకు నోచుకుని ప్రజాదరణ పొందడంతో తెనిగించారు. దీనిని సంస్కృతంలో శంకర సుబ్రహ్మణ్యశాస్త్రి ‘నారద నైపుణి’ అన్న పేరిట రచించారని ముందుమాటలో తెలిపారు. 2020050015964 1925
చిత్రశాల [145] మల్లది రామకృష్ణశాస్త్రి కథల సంపుటి 2020010004741 1960
చిత్రశాల [146] కొర్లపాటి శ్రీరామమూర్తి నవల 2020120034370 1957
చిత్రాంగద [147] మూలం:రవీంద్రనాధ్ ఠాగూర్ అనువాదం: మల్లవరపు విశ్వేశ్వరరావు నాటకం 2020010004728 1947
చిత్రాగద సంగ్రహము [148] కాలరాధాభట్టు వేంకటరమణమూర్తి కావ్యం 2030020025461 1933
చిత్రాంగి నాటకము [149] కాలంశెట్టి గురవయ్య నాటకం 2020050016086 1957
చిత్రాభ్యుదయము [150] కాళ్ళకూరి నారాయణరావు నాటకం, చారిత్రిక నాటకం చిత్రాంగి-సారంగధరుల గాథ చాలా ప్రాచుర్యం పొందింది. రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ చిత్రాంగికీ నడుమ జరిగిన కథ ఇది. రాజమండ్రిలో ఇప్పటికీ చిత్రాంగి మేడ, సారంగధరుని మేడ ఉన్న ప్రాంతాలుగా కొన్ని స్థలాలను చూపుతారంటే ఈ కథ ప్రాచుర్యం ఎంతటిదో తెలుస్తోంది. అటువంటి గాథను ఇతివృత్తంగా స్వీకరించి చింతామణి మొదలైన నాటకాల కర్త కాళ్ళకూరి నారాయణరావు ఈ నాటకం రచించారు. ఈ పుస్తకం రచయిత మరణానంతరం ప్రచురింపబడింది. 2030020025294 1932
చిత్రా పూర్ణిమ [151] గరిమెళ్ళ సత్యగోదావరిశర్మ నవల 2020050016305 1947
చిత్రాల తిరుప్పావై [152] మూలం:గోదాదేవి, వ్యాఖ్యానం: పరవస్తు వేంకటరంగాచార్యులు, పురవస్తు వేంకటరామానుజాచార్యులు ఆధ్యాత్మికం 2020010001348 1953
చిత్తూరు జిల్లాలో తొలి స్వాతంత్ర్య పోరాటం [153] దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చరిత్ర 2020120034367 1992
చితోడు పతనము [154] కోటమర్తి చిన రఘుపతి చారిత్రిక నాటకం, నాటకం చిత్తోర్/చిత్తోడ్ పౌరుషానికీ, వీరత్వానికి ప్రసిద్ధమైన రాజ్యం. రాజపుత్ర రాజుల పరిపాలనలో ఢిల్లీ చక్రవర్తిని కూడా ఎదిరించగలిగిన స్థితిలో ఉండేది. ఆ రాజ్యం తుదకు ఎలా పతనమైందన్న వీరరస ప్రధానమైన ఇతివృత్తాన్ని నాటకంగా మలిచారు గ్రంథకర్త. 2030020024841 1935
చిత్తోపరమణ శతకము [155] వేంకట శోభనాద్రికవి శతకం 2020120029088 1925
చిద్విలాస శతకము [156] రాప్తాడు సుబ్బదాస యోగి శతకం 2020010002817 1948
చిన్మయ దీక్షా [157] రచయిత వివరాలు లేవు సాహిత్యం 2020010000651 1936
చిన్న కాకమ్మ కథ [158] రచయిత వివరాలు లేవు కథా సాహిత్యం 2020120034363 1932
చిన్నకోడలు [159] క్రావవరపు నరసింహం నవల, అనువాదం 2020010001231 1924
చిన్ననాటి ముచ్చట్లు [160] కె.ఎన్.కేసరి ఆత్మకథాత్మక గ్రంథం 2990100067429 1999
చిన్నయసూరి జీవితము [161] నిడుదవోలు వేంకటరావు జీవితచరిత్ర పరవస్తు చిన్నయ సూరి ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన జీవిత చరిత్రను పరిశోధన పరమేశ్వర బిరుదాంకితులైన నిడదవోలు వెంకటరావు రచించారు. 2990100071287 1962
చిన్నారి విజయం [162] గీతా సుబ్బారావు నవల, బాలల సాహిత్యం 2020120032266 1993
చిన్ని కథలు [163] వేదగిరి రాంబాబు కథా సాహిత్యం 2020120034364 1993
చిట్టడవిలో చిన్నారి [164] అనువాదం: కొమ్మూరి ఉషారాణి నవల 2020050016240 1957
చిట్కా వైద్యం-2 [165] డి.ఆదినారాయణరావు వైద్యం 2020120034368 1998
చిట్టి నీతి కథలు [166] పంగనామాల బాలకృష్ణమూర్తి కథల సంపుటి, బాలల సాహిత్యం 2020050015499 1938
చిట్టెమ్మ(పుస్తకం) [167] రామారావు సాంఘిక నవల 2020050016777 1937
చిరంజీవ! చిరంజీవ! సుఖీభవ!! సుఖీభవ!! [168] జి.వి.పూర్ణచంద్ వైద్యం 6020010004047 1998
చిరంజీవి (పుస్తకం) [169] అనుసరణ: శ్రీ విరించి కథా సాహిత్యం 2020010004729 1957
చిరంజీవులు [170] నండూరి రామమోహనరావు సంపాదకీయాల సంకలనం 2990100061528 1987
చిరంజీవులు [171] చక్రావధానుల మాణిక్యశర్మ ఆధ్యత్మికం సాహిత్యం 2020120000270 1928
చిరు గజ్జెలు(పుస్తకం) [172] వడ్డెపల్లి కృష్ణ బాలల సాహిత్యం 2020120032268 1994
చిరు గజ్జెలు(నాటికలు) [173] సంకలనకర్త: ఏడిద కామేశ్వరరావు నృత్య నాటికలు 2020120034366 1979
చిరుతల కనకతార నాటకము [174] వేముల లక్ష్మీరాజం నాటకం 2020010005646 1958
చిరుతొండ నాటకము [175] గంగాధరయ్య నాటకం 2020010004735 1950
చిలకమర్తి జీవితం-సాహిత్యం [176] ముక్తేవి భారతి జీవన చిత్రణ 2990100067428 2001
చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర [177] చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆత్మకథ చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఆయన స్వీయచరిత్ర ఈ గ్రంథం. ఈ పుస్తకంలోని విషయాలను ఇటీవల కాలంలో కూడా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు 2030020029702 1944
చిలకమర్తి లక్ష్మీనరసింహ కృత గ్రంధములు (మొదటి సంపుటి) [178] చిలకమర్తి లక్ష్మీనరసింహం వచన కావ్య సంపుటి 2030020024553 1913
చిలకమర్తి లక్ష్మీనృశింహకవి సంపూర్ణ గ్రంథావళి-రెండవ సంపుటం(నవలలు) [179] చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలలు చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు. ఆయన షష్టిపూర్తి సందర్భంగా వారి సంపూర్ణ సాహిత్యం ప్రచురించారు. 2030020024513 1927
చిలక, గోరింకా (పుస్తకం) [180] జమదగ్ని కథల సంపుటి 2020010004677 1959
చిలకపచ్చ చీర [181] ఐతా చంద్రయ్య కథల సంపుటి 2020120032264 1996
చివరకు మిగిలేది (మొదటి భాగము) [182] బుచ్చిబాబు నవల చివరకు మిగిలేది తెలుగు నవలా సాహిత్యంలో, మరీ ముఖ్యంగా సీరియస్ లిటరేచర్ అని వర్గీకరించే విభాగంలో, బాగా ప్రాచుర్యం పొందిన నవలల్లో ఒకటి. చివరకు మిగిలేది నవల మానసిక చిత్తవృత్తులను పరిశీలించేదని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ఒక తరం పాఠకులను విపరీతంగా ప్రభావితం చేసిన రచన ఇది. (మొదటి ముద్రణ 1953) 2990100051632 2002
చివరకు మిగిలేది (రెండవ భాగము) [183] బుచ్చిబాబు నవల 2020010002643 1952
చీకటి నీడలు [184] బైరాగి కవితల సంపుటి 2990100067427 1978
చీకటిలో చిరుదివ్వెలు [185] వి.వి.బాలకృష్ణ స్వయం ఉపాధి పథకాల సంపుటి 6020010034353 1998
చీకట్లో చిరుదీపం (పుస్తకం) [186] యప్పేరావు నాటకం 2020010002662 1945
చీకటిలో జ్యోతి [187] మూలం: టాల్ స్టాయ్, అనువాదం: చర్ల గణపతిశాస్త్రి నవల 2020120032260 1970
చీకటిలో సిరివెన్నెల [188] చింతలపాటి మురళికృష్ణ వచన కవితల సంపుటి 2020120034352 1997
చీనా కథలు [189] మూలం: ఆస్వాల్డ్ ఎర్డ్ బర్గ్, అనువాదం: జగన్మోహన్ కథల సంపుటి 2020120034354 1940
చీనా-జపాను [190] గరిమెళ్ళ సత్యనారాయణ చరిత్ర 2020010004714 1937
చీనా-జపాను-జెకోస్లొవేకియా-జర్మనీ (పుస్తకం) [191] కె.రంగాచార్యులు చరిత్ర 2020050005826 1939
చీమలు (పుస్తకం) [192] బోయ జంగయ్య కథల సంపుటి 2020120032265 1996
చీరాల చరిత్రము [193] రచయిత పేరు లేదు చరిత్ర 5010010088271 1921
చీలని పాయలు [194] పొన్నాల యాదగిరి నవల 2990100071286 1983
చుక్కమ్మ(పుస్తకం) [195] గూడపాటి వెంకటాచలం కథల సంపుటి 2020120029089 1944
చూడామణి (నాటకం) [196] పానుగంటి లక్ష్మీ నరసింహారావు నాటకం, చారిత్రిక నాటకం చూడామణి నాటక ఇతివృత్తాన్ని కల్హణుడు రచించిన కాశ్మీర రాజతరంగిణి నుంచి వినయాదిత్యుడనే రాజు, దామోదరశర్మ అనే మంత్రిల యదార్థగాథను స్వీకరించి పెంచి రచించారు. రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహరావు (Panuganti Lakshmi Narasimha Rao) (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. 2030020024830 1950
చెంచు నాటకం [197] కె.జె.కృష్ణమూర్తి నాటకం 5010010080104 1927
చెట్లు(పుస్తకం) [198] మూలం: కాన్రడ్ రిచ్ టర్, రచయిత: ఎన్.అర్.చందూర్ నవల 2020010004706 1956
చెదపురుగు [199][dead link] మూలం.శీర్షేందు ముఖోపాధ్యాయ, అనువాదం.బొమ్మన విశ్వనాథం నవల, అనువాదం బెంగాలీ సాహిత్యంలో విశిష్ట స్థానం పొందిన ఘూన్ పొకా నవలను చెదపురుగుగా తెలుగులోకి అనువదించారు. ఈ నవలలో ప్రధానపాత్రైన శ్యాం ఆధునిక మానవుని జీవనానికి ప్రతినిధి. అతను ఆధునిక జీవితంలోని గందరగోళాన్నీ, నాగరీకత ప్రసాదించే అపరాధభావననూ అనుభవిస్తూంటాడు. అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా ఈ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128988 1975
చెన్నకేశవ శతకం [200] రామడుగు సీతారామశాస్త్రి శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. చెన్నకేశవా! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016681 1944
చెప్పలేం!(పుస్తకం) [201] భమిడిపాటి కామేశ్వరరావు నాటకం 2020010002933 1953
చెప్పుడు మాటలు [202] కన్నడ మూలం సంకలనకర్తలు: శ్రీరంగ, ఎన్.కస్తూరి. అనువాదం: తిరుమల రామచంద్ర నాటికల సంకలనం కన్నడ నాట ప్రసిద్ధి చెందిన పలువురు నాటకకర్తలు శ్రీరంగ, బెంద్రె, పర్వతవాణి, క్షీరసాగర, ఎన్.కస్తూరిల నాటకాల సంకలనానికి అనువాదం ఇది. ఈ నాటికల సంకలనం అనువాదకుడు తిరుమల రామచంద్ర. ఆయన పత్రికా సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు. 2020010005072 1952
చెన్నపట్టణములో [203] వేమూరి శ్రీనివాసరావు ఆత్మకథాత్మకం 1920-30ల కాలంలో బి.ఎ. పూర్తిచేసి ఉద్యోగాంవేషణ చెస్తూ చెన్నపట్టణం చేరుకున్న తెలుగువాడి కథ ఇది. ఈ పుస్తకంలో బి.ఎ. పరీక్ష ఇవ్వడం, రాజా వారి వద్ద ఉద్యోగార్థిగా వెళ్ళడం ఉంటుంది. అదే క్రమంలో చెన్నపట్టణం చేరడం, దానిలోని విశేషాలు వివరించడం మొదలైనవి ఉన్నాయి. 2030020024764 1925
చెన్నపురీ విలాసము[204] మతుకుమల్లి నృసింహశాస్త్రి సాహిత్యం, చరిత్ర బ్రిటీష్ పరిపాలనా కాలంలో మహా నగరంగా ఎదిగిన ఆనాటి మద్రాసు లేక చెన్నపట్టణం గురించి రాసిన కావ్యమిది. చెన్నపట్టణంలోని సముద్రం, సముద్రతీర హర్మ్యాలు, ఓడరేవులు, వాణిజ్యకూడళ్ళు మొదలుకొని ఆనాటి నగరమంతటినీ పద్యరూపంలో వర్ణించారు. స్వాతంత్ర్యానికి పూర్వపు మద్రాసు నగరాన్ని వర్ణించి సాంఘిక చరిత్రలకు సామాగ్రి అందించారు మతుకుమిల్లి నృశింహశాస్త్రి. ఈ కవి చెన్నపురిని, గూడూరు మరియు వల్లూరు జమిందారైన బొమ్మదేవర నాగభూపాలునితో కలిసి సందర్శించాడు. దీనిని ఆరు అధ్యాయాలుగా విభజించారు. ఈ పుస్తకంలో 232 అచ్చ తెలుగు పద్యాలు, ఒక్కొక్క దానిలో 4-5 పంక్తులు కలిగినవిగా నాటి చెన్నపురి అనగా నేటి చెన్నైలో నివసించే ప్రజలు, వేషభాషలు మరియు అలవాట్లను విపులంగా వివరించాయి. ఇందులో పట్టణంలోని వింతలు, విశేషాలు, నగర ప్రణాళిక మొదలైన వాటిని వివరించారు. 2020050014936 1941
చెన్నబసవ పురాణం [205] గంగపట్టణపు సుబ్రహ్మణ్యకవి పురాణం, ఆధ్యాత్మికం 2020120034356 1925
చెరగని అక్షరాలు [206] నవ్యభారతి కథల సంపుటి 2020010004699 1957
చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము) [207] శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి సాహిత్యం 2020120000251 1936
చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (ద్వితీయ భాగము) [208] శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జీవితచరిత్ర 2020120019930 1936
చెఱకు [209] గోటేటి జోగిరాజు సాహిత్యం 2020120034358 1960
చెఱువు మీద పద్యములు [210] ఆడిదము రామారావు పద్య సంపుటి 2020120019932 1918
చేతన [211] ప్రవచనకర్త: జిడ్డు కృష్ణమూర్తి, రచయిత: అరుణా మోహన్ తత్త్వం 2990100047094 1996
చేతి వేళ్ళే కంప్యూటర్లు [212] తోటకూర సత్యనారాయణరాజు సాహిత్యం 2990100067425 1993
చేనేత దర్పణం [213] ఉత్పల సత్యనారాయణ సాహిత్యం 2020120034355 1958
చేనేత-ప్రధాన పరిశ్రమ [214] డి.వెంకటస్వామి మొదటి ఫారము పాఠ్యగ్రంథం 2020010004691 1949
చేనేత-ప్రధాన పరిశ్రమ [215] కె.ఎస్.శర్మ రెండవ ఫారము పాఠ్యగ్రంథం 2020010004692 1949
చేనేత సన్నాహ విధానములు [216] కె.సూర్యనారాయణ వృత్తి విద్యా సాహిత్యం చేనేత భారత జాతీయోద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. ఒకనాటి భారత ఆర్థికవ్యవస్థలో కీలకమైన రంగం. కానీ వందల ఏళ్ళుగా పరిశ్రమ బ్రిటీష్-ఇండియా ప్రభుత్వం నిరసించి, అభివృద్ధిని కుంటుపరచడం వల్ల వేలాది, లక్షలాది చేనేత కుటుంబాలు నష్టపోయాయి. భారత స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ వారు చేనేతను ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానంతరం వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో చేనేత పరిశ్రమ ఉత్సాహపూరితంగా ప్రతిస్పందించింది. ఆ క్రమంలోనే చేనేత సహకార సంఘాలు, ముమ్మర కార్యకలాపాలు సాధ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో 60వ దశకంలో ఈ గ్రంథాన్ని చేనేత పరిశ్రమ ఏర్పాటుచేసుకునేందుకు ఉపకరించే వృత్తివిద్యా సాహిత్యంగా రూపొందించారు. 2020010001774 1960
చైతన్య [217][dead link] మూలం.దిలీప్ కుమార్ ముఖర్జీ, అనువాదం.అయాచితుల హనుమచ్ఛాస్త్రి ఆధ్యాత్మికం, జీవిత చరిత్ర చైతన్య మహాప్రభు 16వ శతాబ్దిలో తూర్పు భారతదేశానికి చెందిన హిందూ సన్యాసి, భక్తుడు. ఆయన కృష్ణ భక్తినీ, గౌడీయ వైష్ణవాన్నీ భక్తుల్లో పాదుకొల్పాడు. వైష్ణవ భక్తి పరంపర, భాగవత పూర్ణత్వం, భగవద్గీతా తత్త్వం వంటి వాటిలో ఆయన ప్రాముఖ్యత వహించిన భక్తుడు. ఆయన వేదాంతంలో అచింత్య భేదాభేద సిద్ధాంతాన్ని దర్శించారు. ప్రత్యేకంగా ఆయన కృష్ణుని వివిధ రూపాలను ఆరాధించడంలోనూ, హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని పఠించడంలోనూ ప్రత్యేక ప్రాచుర్యం కలుగజేశారు. ఆయన గురించి జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128936 1993
చైతన్య కవిత [218] తంగిరాల సుబ్బారావు కవితలు 2990100071278 1997
చైతన్య కిరణాలు [219] వల్లభాపురపు దేవదానం గేయ సంపుటి 2020120034323 1993
చైతన్య చరితావళి (ద్వితీయ ఖండము) [220] మూలం: ప్రభుదత్త బ్రహ్మచారి, అనువాదం: కుందుర్తి వెంకటనరసయ్య సాహిత్యం 2020120029056 1982
చైతన్య స్రవంతి [221] రావెళ్ళ వెంకట రామారావు కవితల సంపుటి 2020120029075 1977
చైతన్య స్రవంతి [222] వాసా ప్రభావతి వ్యాస సంపుటి 6020010032269 1991
చైతన్య స్రవంతి [223] బుచ్చిబాబు సాహిత్యం 2020010004736 1957
చైత్రమాస మహాత్మ్యము [224] చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ఆధ్యాత్మికం 2020120032247 1938
చైనా నూతన ప్రజాస్వామికం [225] మూలం: మా-సీ-యంగ్, అనువాదం పి.వి.శివయ్య చరిత్ర 2020010004716 1940
చైనా జపాను ప్రసిద్ధ కథలు [226] అనువాదం సూరాబత్తుల సుబ్రహ్మణ్యం కథల సంపుటి 2020010004713 1960
చైనాలో నా బాల్యం [227] మూలం: చియాంగ్ యీ, అనువాదం: నోరి రామశర్మ ఆత్మకథాత్మక గ్రంథం 2020010004715 1958
చైనాలో నూతన జీవితోద్యమం [228] చైనా మూలం: జనరిలిస్సిమొ చియాంగ్ కై షేక్, ఆంగ్ల అనువాదం: చియాంగ్ కై షేక్ భార్య, అనువాదం: శశి చరిత్ర, అనువాదం 2020120000261 1943
చైనా ప్రజల సంక్షిప్త చరిత్ర [229] అనువాదం ముద్దికూరి చంద్రశేఖరరావు చరిత్ర 2020010004717 1959
చైనా వ్యవసాయక విప్లవం [230] రచయిత వివరాలు లేవు చరిత్ర 2020010004723 1953
చైనా విప్లవము [231] అయ్యదేవర కాళేశ్వరరావు చరిత్ర 2020010004722 1960
చైనా విప్లవ చరిత్ర (ప్రధమ సంపుటి) [232] నిడమర్తి అశ్వినీకుమార దత్తు చరిత్ర 2020010004721 1949
చైనా స్త్రీలు [233] మూలం: అనిల్.డి.సిల్వా, అనుసరణ: టి.సావిత్రి సాహిత్యం 2020120034322 1954
చైనా సంక్షిప్త చరిత్ర [234] మూలం: ఎల్.కారింగ్ టన్ గుడ్ రిచ్, అనువాదం: ఎన్.వి.రంగాచార్యులు చరిత్ర 2020010004618 1959
చొక్కనాధ చరిత్ర [235] పచ్చకప్పురపు తిరువేంగళరాజు పురాణం 2020050006480 1954
చొక్కనాధ చరిత్ర-సమగ్ర పరిశీలన [236] వడ్లూరి ఆంజనేయరాజు పరిశీలనాత్మక గ్రంథం 2990100028460 1993
చొప్పదంటు ప్రశ్నలు [237] మహీధర నళినీ మోహన్ విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం చీకటిలో జంతువుల కళ్ళు ఎందుకు మెరుస్తాయి? కొంగలు బాణపు ములుకు ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? ఎర్రగుడ్డ చూపితే ఎద్దుకు గంగవెర్రులెందుకు? లాంటి ప్రశ్నలు పిల్లలు వేస్తే "చొప్పదంటు ప్రశ్నలు" అని కొట్టీ పారేస్తూంటారు. నిజానికి ఇలాంటీ ప్రశ్నలే మనిషి విజ్ఞానాన్ని విస్తరించి ఇప్పుడున్న స్థితికి తీసుకువచ్చాయనీ, అలాంటి ప్రశ్నలు వేస్తేనే పిల్లల మానసిక స్థితి సరిగా ఉన్నట్టు అంటూ ఈ గ్రంథంలో అటువంటీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ప్రముఖ విజ్ఞాన శాస్త్రం రచయిత మహీధర మురళీమోహన్ 2990100071289 2002
చోరశిఖామణి [238][dead link] సిహెచ్.శ్రీనివాసరావు సాహిత్యం 20010004752 1923
చోరశోధకుడు [239] అయ్యగారి నరసింహమూర్తి డిటెక్టివ్ నవల 2990100066357 1926
చౌగర్ పులులు [240] మూలం: జిమ్ కార్బెట్, అనువాదం: కృత్తివాస తీర్థులు సాహిత్యం 2020050014326 1956