వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ధ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

మార్చు
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ధ్వజమెత్తిన ప్రజ [1] దాశరధి కృష్ణమాచార్య కవితా సంపుటి 2990100051639 1981
ధన్య కైలాసము [2] విశ్వనాథ సత్యనారాయణ నాటకం 2020010004809 1957
ధన్యజీవి(కథ) [3] సామవేదం జానకీరామశర్మ, నోరి రామశర్మ కథా సాహిత్యం 2020050016776 1949
ధన్వంతరి నిఘంటువు [4] సంగరాజు కామాశాస్త్రి వైద్య శాస్త్రం, నిఘంటువు 2030020025514 1923
ధన్వంతరి విజయము [5] చినభైరాగియోగి వైద్య శాస్త్రం 2020120004072 1919
ధనలక్ష్మి [6] మారెళ్ల కామేశ్వరరావు నవల 2020050014535 1932
ధనాభిరామము [7] సూరన కవి సాహిత్యం 2020010004874 1950
ధ్వని-మనుచరిత్రము [8] కె.రాజన్నశాస్త్రి భాష, పరిశోధనాత్మక గ్రంథం 2990100051640 1988
ధ్వని-లిపి-పరిణామం [9] వడ్లమూడి గోపాలకృష్ణయ్య భాష, పరిశోధనాత్మక గ్రంథం 2030020025252 1955
ధనుర్దాసుడు [10] గుదిమెళ్ళ రామానుజాచార్యులు సాహిత్యం 2020010004876 1958
ధనుర్మాస వ్రత మంగళాశాసన క్రమము [11] యతీంద్రులు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000302 1978
ధనుర్విద్యా విలాసము [12] గ్రంథకర్త. కృష్ణమాచార్యుడు, పరిష్కర్త.వేటూరి ప్రభాకరశాస్త్రి క్రీడలు, యుద్ధ విద్య, పద్యకావ్యం ప్రాచీన యుద్ధవిద్యలో ధనుర్విద్యా ప్రావీణ్యత అత్యంత ప్రముఖమైన అంశం. తుపాకులు, ఫిరంగులు వంటి ఆధునిక ఆయుధాలు విపరీతంగా ప్రపంచమంతా వ్యాపించేవరకూ దీని ప్రభావం కొనసాగింది. ఆధునిక యుగంలో కూడా కొన్ని ప్రత్యేకమైన స్థితిగతుల్లో వ్యూహకర్తలు ధనుస్సుతో విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనంతరకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన క్రీడగా ఆర్చరీ అధునికీకరణ చెందింది. తెలుగులో ఎంతో సాహిత్యం పద్యరూపంలో ధనుర్విద్యపై ఉంది. ఈ నేపథ్యంలో ధనుర్విద్య గురించి ఆ విద్యాకౌశలం కలిగిన మహమ్మద్ జాఫర్ వద్ద నేర్చిన తిరుపతి రాయలనే మహారాజు వివరిస్తుండగా దానిని కృష్ణమాచార్యుడనే కవి పద్యరూపంలో రచించినట్టుగా గ్రంథంలోని ఆధారాలు చెప్తున్నాయి. 2030020025412 1950
ధమ్మపదం [13] పాళీభాష నుండి అనువాదం:శ్రీమోక్షానంద స్వామి సాహిత్యం 2020120000301 1983
ధమ్మపదం [14] రత్నాకరం బాలరాజు సాహిత్యం 2020120000325 1994
ధమ్మపదము(బుద్ధగీత) [15] చర్ల గణపతిశాస్త్రి సాహిత్యం 2020120000326 1995
ధర్మఖండము [16] ఈదుపల్లి భవానీశ కవి పురాణం, పద్యకావ్యం ప్రసిద్ధమైన స్కాంద పురాణంలో భీమ ఖండం, కాశీ ఖండం వంటి వాటితోపాటుగా ధర్మఖండం కూడా ఒకటి. ధర్మప్రతిపాదితము, ప్రబోధకము ఐన విషయాలు ఇందులో ఉన్నాయి. అటువంటి ధర్మఖండాన్ని తెలుగులో ఈదుపల్లి భవానీశ కవి ఈ కావ్యం రూపంలోకి అనువదించారు. 2030020025446 1931
ధర్మఘంట [17] హరి రామనాధ్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034417 1983
ధర్మ దీపికలు [18] కాట్రపాటి సుబ్బారావు సాహిత్యం 2040100028469 1994
ధర్మదీక్ష [19] ముదివర్త కొండమాచార్యులు పద్యకావ్యం 2990100071298 వివరాలు లేవు
ధర్మదీక్ష(నాటకం) [20] మధురాంతకం రాజారాం నాటకం 2020120000330 1984
ధర్మ నిర్ణయం(పుస్తకం) [21] తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు నవల 2990100071300 1970
ధర్మనందన విలాసము [22] కాళ్ళకూరి గౌరీకాంత కవి ప్రబంధం, చరిత్ర క్రీ.శ.1800 ప్రాంతంలో నాటి విజయనగర సంస్థానానికి(నేటి విశాఖ జిల్లాకు) చెందిన కాళ్ళకూరి గౌరీకాంత కవి రచించిన ప్రబంధమిది. ధర్మరాజు భార్య కళావతిల వివాహాన్ని వర్ణిస్తూ సాగే ప్రబంధ శైలీ ఇతివృత్తంతో ఈ కావ్యాన్ని కవి నిర్మించారు. ధారాశుద్ధితో, తెలుగువారి ఆచార వ్యవహారాలు, సాంఘిక చరిత్ర నిర్మాణానికి ఉపకరించే అమూల్యాభరణాది వస్తువుల వర్ణనలతో ఉందంటూ సంపాదకుడు కొత్త భావయ్య చౌదరి ప్రశంసించారు. ఈ గ్రంథంలోని మరో విశేషం చారిత్రిక వివరాలు. కమ్మవారి చరిత్రపై ఆసక్తి కలిగిన సంపాదకునికి ఈ గ్రంథ వివరాలు మొదట ఆడిదము రామారావు పంతులు రచించిన కళింగదేశ చరిత్రములో దొరకగా ఆపైన వివరాలు తెలుసుకున్న కృతిభర్త వంశీకుడు ప్రచురింపజేశారు. కృతిభర్త వెలిసేటి గురురాయుడు 16-17శతాబ్దులలో విజయనగర సంస్థానానికి సేనానిగా వ్యవహరించిన కమ్మ కులస్తుడు. ఆయన వివరాలే కాక వారి వంశస్థుల వివరాలు, వెలిచేరు, బంటుపల్లి గ్రామ నిర్మాత విశేషాలు, వారికీ విజయనగర సంస్థానానికీ గల సంబంధం మొదలైన విశేషాలు ఈ గ్రంథంలో లభిస్తున్నాయి.ప్రచురణ.1951, రచన.1800 2990100071299 1951
ధర్మచక్రము (నాటకం) [23] నండూరి రామకృష్ణమాచార్యులు నాటకం, చారిత్రిక నాటకం మహాపద్మనందుణ్ణి, ఆయన కుమారులైన నందుల్ని సామదానభేద దండోపాయాలతో గద్దెదింపి చక్రవర్తియైన చంద్రగుప్త మౌర్యుని కొడుకు, బౌద్ధాన్ని ఆసియా అంతటా ప్రచారం చేసేందుకు విశేషమైన కృషి చేసిన అశోకుని తండ్రి - బింబిసారుడు. అటు సామాది ఉపాయాలతో తండ్రి అందించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ, ఇటు కొడుక్కి ధర్మనిరతిని అందించడంలోనూ వారధిగా నిలిచాడంటూ, ఆయన జీవితాన్ని, ప్రేమకథను ఈ నాటకంగా మలిచారు రచయిత. 2030020025299 1950
ధర్మజ రాజసూయము-2 [24] వివరాలు లేవు సాహిత్యం 2020120032292 1969
ధర్మజ్యోతి(పుస్తకం) [25] పాణ్యం లక్ష్మీనరసింహయ్య సాహిత్యం 2020010004884 1952
ధర్మపదం కథలు [26] బోధ చైతన్య కథల సంపుటి 2020120000305 1998
ధర్మపథంలో జీవనరధం [27] మూలం:మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది, అనువాదం:ఎస్.ఎం.మలిక్ వ్యాస సంపుటి, ఆధ్యాత్మిక సాహిత్యం ఇస్లాం మతం గురించి, ముస్లిముల జీవన విధానం గురించి, ఇస్లాం బోధించే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించిన వ్యాసాలను మౌలానా ఉర్దూలో రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోనికి మలిక్ అనువదించారు. 2020120020030 2000
ధర్మపాల విజయము [28] బొమ్మకంటి ప్రభాకర్ సాహిత్యం 9000000002757 1959
ధర్మపాలుడు-ద్వితీయ భాగం [29] మూలం.రాఖాలదాస బంధోపాధ్యాయ, అనువాదం.వేదుల సత్యనారాయణశాస్త్రి నవల, చారిత్రిక నవల, అనువాదం బెంగాలీలో రచించిన ఈ చారిత్రికనవలను తెలుగులోకి శతావధాని వేదుల సత్యనారాయణశాస్త్రి అనువదించారు. 2030020025380 1929
ధర్మ మంజరి [30] జటావల్లభుల పురుషోత్తము సాహిత్యం 2020010004813 1958
ధర్మ రక్షణ [31] నాగేశ్వరరావు సాహిత్యం 9000000002799 1959
ధర్మరక్షణము [32] భూపతి లక్ష్మీనారాయణరావు నాటకం 2020010004889 1960
ధర్మవర చరిత్రమ్ [33] శీరిపి ఆంజనేయులు సాహిత్యం 2020120034421 1919
ధర్మ విజయము [34] అల్లసాని రామనాథశాస్త్రి, దండిపల్లి వెంకటసుబ్బాశాస్త్రి వాచకం 2020010004815 1960
ధర్మరాజ విజయము [35] నారాయణ సుబ్రహ్మణ్య కవి పద్య కావ్యం 2020120034389 1913
ధర్మవీర్ పండిత లేఖారాం [36] హిందీ మూలం:త్రిలోక్ చంద్ర విశారద, అనువాదం:సంధ్యావందనం శ్రీనివాసరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000328 1997
ధరలు:వాటి తీరు తెన్నులు [37] తాళ్ళూరు నాగేశ్వరరావు సాహిత్యం 2020120000303 1983
ధర్మశాస్త్రం [38] వజ్జిపురం శ్రీనివాస రాఘవాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం 5010010088924 1884
ధర్మశాస్త్రాలలో శిక్షాస్మృతి [39] బి.విఠల్ న్యాయ శాస్త్రం 2990100028471 2000
ధర్మసార రామాయణము [40] జనమంచి శేషాద్రిశర్మ పద్యకావ్యం "రామో విగ్రహవాన్ ధర్మః"-రాముడు రూపం ధరించిన ధర్మం అని సూక్తి. రాముని దారి అనే అర్థంలోనే రామాయణం అనే పేరుని స్థిరపరిచారు వాల్మీకి మహర్షి. రామయణంలోని ధర్మానికి ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టి ఈ గ్రంథాన్ని ధర్మసార రామాయణంగా, రామాయణంలోని ధర్మాలపై ప్రత్యేకమైన దృష్టి నిలిపి రచించారు కవి. 2030020024984 1937
ధర్మసిద్ధాంత సంగ్రహము [41] ముదిగొండ వేంకటరామశాస్త్రి సాహిత్యం 2020120000334 1934
ధరణికోట (నాటకం) [42] సోమరాజు రామానుజరావు నాటకం, చారిత్రిక నాటకం సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. ఆయన చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు ఆయన తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. రెడ్డిరాజుల పరిపాలననూ,అందులోనూ ముఖ్యంగా వారు పోరిన ఓ సంగ్రామాన్ని కథావస్తువుగా స్వీకరించి ఈ నాటకం రచించారు. 2030020025381 1945
ధర్మాగ్రహము [43] ఎన్.టి.జ్ఞానందకవ్ సాహిత్యం 2020120000329 1998
ధర్మాంగ చరిత్రము [44] యీపూరి నారాయణరాజు వచన రచన, జానపద గాథ ధర్మాంగుడనే మహారాజు ప్రధాన పాత్రలోని జానపద గాథ ఇది. ఇందులో ధర్మాంగునికి పాము పుట్టడం, ఆ పామును ఒక యువరాణికి ఇచ్చి పెళ్ళిచేయడం, ఆపైన పాము మనిషిగా మారడం, చివరకు ఎవరూ నమ్మకపోతే నమ్మించడం వంటి మలుపులున్నాయి. ఐతే 19వ శతాబ్ది నాడు తెలుగు వివాహాలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది. ఇందులో సవివరంగా రెండుమార్లు వివాహాలను, జాతకర్మలను వర్ణిస్తారు. 2020050019198 1895
ధర్మాంగద చరిత్రము [45] వివరాలు లేవు యక్షగానం 2990100071296 వివరాలు లేవు
ధర్మోపన్యాసములు [46] సద్గురు మలయాళ స్వామి ఉపన్యాసాలు 2020120032293 1961
ధర్మోద్ధరణ [47] మూలం:ఎస్.రాధాకృష్ణన్, అనువాదం:బద్దేపూడి రాధాకృష్ణమూర్తి వాచకం 2020010004816 1960
ధాతు పాఠ: [48] పాణిని, దయానంద సరస్వతి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034400 1890
ధ్యాన పుష్పము [49] ఆంగ్ల మూలం:జిడ్డు కృష్ణమూర్తి, మూలం:జె.ఎస్.రఘుపతిరావు ఆధ్యాత్మక సాహిత్యం 2990100061536 2001
ధ్యాన మార్గము [50] పులిపాటి వేంకట సుబ్బయ్య ఆధ్యాత్మక సాహిత్యం 2020120034427 1998
ధ్యాన ముక్తావళి [51] వైనతేయ భట్టాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028472 1998
ధ్యాన యోగము [52] నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు ఆధ్యాత్మక సాహిత్యం 2020120034428 1998
ధ్యానం [53] మూలం: ఏకనాధ్ ఈశ్వరన్, అనువాదం: మధురాంతకం నరేంద్ర ఆధ్యాత్మికం 2020120029137 1998
ధ్యానం [54] పి.వి.కృష్ణారావు ఆధ్యాత్మక సాహిత్యం 2020120004076 1998
ధ్యానం [55] జె.కృష్ణమూర్తి ఆధ్యాత్మక సాహిత్యం 2020120029116 2000
ధ్యానం చేసేది కాదు-జరిగేది [56] చిక్కాల కృష్ణారావు ఆధ్యాత్మక సాహిత్యం 2020120029117 2001
ధార్మికోల్లాసిని [57] నాదెళ్ళ పురుషోత్తమ కవి సాహిత్యం 5010010086093 1917
ధ్రువకుమార విజయము [58] వారణాశి వేంకటేశ్వర్లు కథ, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004074 వివరాలు లేవు
ధ్రువ చరిత్రము [59] గంధం వేంకటనరషింహాచార్యులు కథ, ఆధ్యాత్మిక సాహిత్యం 2020050015476 1932
ధ్రువ తార [60] రావినూతల శ్రీరాములు చరిత్ర, జీవిత చరిత్ర ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేకించి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది. ఆయన పూర్వీకుల ప్రాంతమైన నెల్లూరు ప్రాంతానికి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. ఆయన జీవిత చరిత్ర గ్రంథమిది 2990100067431 2003
ధ్రువుడు(పుస్తకం) [61] డి.నాగసిద్ధారెడ్డి కథ, ఆధ్యాత్మిక సాహిత్యం 2040100047106 1980
ధ్రువోపాఖ్యానము [62] బమ్మెర పోతన భాగవతం, పద్యకావ్యం "పోతన్న తెలుగుల పుణ్యపేటి" అంటూ ప్రస్తుతించారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పోతనామాత్యుని. పోతన రచించిన ఆంధ్రమహా భాగవతం తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథంగా చెప్పుకోవచ్చు. వ్యాసుడు రచించిన సంస్కృత మూల భాగవతం కాక తెలుగువారికి భాగవత ఘట్టాలన్నీ పోతన దర్శింపజేసినట్టుగానే పరిచయమంటే ఆయన ఎంతగా మురిపించారో తెలుసుకోవచ్చు. పోతన భాగవతంలోని కొన్ని ఘట్టాలైనా రాని తెలుగువారు ఉండేవారు కాదు. ప్రతీవారూ గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం, కృష్ణబాల్యలీలలు, వామనావతారం తదితర ఘట్టాలు ప్రత్యేకంగా వివిధ సందర్భాల కోసం విడిగా పారాయణ చేసేవారు. ఆయా ఘట్టాలన్నీ తెలుగువారికి కంఠోపాఠాలే కాదు, కళ్లముందు కూడా మెదిలేవంటే సందేహం లేదు. అంత ప్రాచుర్యం పొందిన ఆంధ్ర మహాభాగవతంలో ధ్రువోపాఖ్యానాన్ని టీకా తాత్పర్యసహితంగా ఈ ప్రతిరూపంలో ప్రచురించారు. 2030020025103 1926
ధ్రువోపాఖ్యానము [63] ప్రచురణ:వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ పద్యకావ్యం, ఆధ్యాత్మిక సాహిత్యం 2020010004902 1953
ధూమపానము(పుస్తకం) [64] పిడపర్తి ఎజ్రా పద్యకావ్యం 2020120000341 2000
ధూమరేఖ [65] విశ్వనాథ సత్యనారాయణ నవల 2020010004903 1960
ధూర్జటి కలాపం [66] వేదాంతం పార్వతీశం పద్య కావ్యం 2020120034426 1996
ధూర్జటి కవితా వైభవం [67] పి.ఎస్.ఆర్.అప్పారావు విమర్శనాత్మక గ్రంథం 2020120000342 1976
ధైర్య కవచము [68] వెన్నెలకంటి సుందరరామయ్య ప్రబంధం ఇది పదహారు అంకాల ప్రబంధం. వచనం ఎక్కువగా పద్యం తక్కువగా ఉన్నా రెంటి కలయిక కావడంతో చంపూ కావ్యమనే చెప్పవచ్చు. 2030020024829 1914