పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
ఏ.ఆర్.రాజరాజవర్మ [1] |
మూలం. కె.ఎం.జార్జి, అనువాదం. జి.లలిత |
జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ |
ఏ.ఆర్.రాజరాజ వర్మ కేరళకు చెందిన ప్రముఖ కవి, వ్యాకర్త, మహారాజా కళాశాలకు చెందిన ప్రాచ్య భాషలకు ఆచార్యునిగా పనిచేశారు. మలయాళ భాష, సాహిత్యాలకు చేసిన సేవలకు గాను ఆయనను కేరళ పాణిని అని వ్యవహరిస్తూంటారు. కేరళ వ్యాకరణ నిర్మాణంలోనూ, సాహిత్య రచనలోనూ చెదరని స్థానం కలిగిన ఆయన జీవితం, సాహిత్యాలను భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా సాహిత్య అకాడెమీ సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. |
2990100061542 |
1989
|
ఏరువాకా సాగాలోయ్! [2] |
మూలం: ఏలినీ ఛాంగ్, అనువాదం: కొమ్మూరి వెంకటరామయ్య |
నవల |
1900లో తూర్పుచైనాలో తీవ్రమైన క్షామం వచ్చినప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఊరి ప్రజలు ఆకలిమంటలకు తట్టుకోలేక ప్రభుత్వపు ధాన్యపుకొట్లపైనబడి దోచుకోప్రారంభించారు. గుంపును చెదరగొట్టేందుకు స్థానిక మిలటరీ తుపాకులు కాల్చింది కానీ జనాల్ని ఆపలేకపోయింది. రోజంతా ప్రజలు దోచుకోవడమూ, మిలటరీ తుపాకులు పేల్చడమూ జరుగుతూనే ఉంది. ఆ గ్రామపార్టీ నాయకునికి అండగా నిలిచి ధాన్యపుకొట్లను కాపాడేందుకు ప్రభుత్వోద్యోగి శక్తికొద్దీ పోరాడారు. పార్టీనాయకుడు గాయపడి అలసిపోయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మనం తప్పటడుగు వేశాం అన్నాడు. ఆ ప్రభుత్వోద్యోగి చాలా చింతపడి తర్వాతి కాలంలో తనను తాను విమర్శించుకుని ఓ వ్యాసం వ్రాశారు. ఈ సంఘటన ఆధారంగా నవల వ్రాశారు. దాన్ని కొమ్మూరి వెంకట్రామయ్య అనువదించారు. |
2020010005028 |
1955
|
ఏకవీర (పుస్తకం) [3] |
విశ్వనాధ సత్యనారాయణ |
నవల |
విశ్వనాధ సత్యనారాయణ తెలుగు వారికి చిరపరిచితులైన రచయిత. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ఏకవీర అనే ఈ నవల ఆయన రాసిన మొదటి నవల. |
2020050014993 |
1947
|
ఏకాదశి (పుస్తకం) [4] |
చింతా దీక్షితులు |
సాహిత్యం |
చింతా దీక్షితులు (1891 - 1960) ప్రముఖ కథా రచయిత మరియు బాల గేయ వాజ్మయ ప్రముఖులు. వీరు తూర్పు గోదావరి జిల్లా లోని దంగేడు గ్రామంలో జన్మించారు. వీరు బి.ఏ. ఎల్.టి పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేశారు. వీరు తన బంధువైన చింతా శంకర దీక్షితులతో కలసి జంటకవులు మాదిరిగా కవితారంగంలో ప్రవేశించారు. ఆయన తదనంతర కాలంలో రాసిన కథల సంపుటీ ఇది. |
2030020024516 |
`తెలియదు.
|
ఏకాదశీ మహాత్మ్యము [5] |
ప్రౌఢకవి మల్లన |
పద్యకావ్యం, ఆధ్యాత్మికం |
ఏకాదశి తిథి హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఉపవాస దీక్షతో విష్ణువుని ధ్యానించి ద్వాదశి ఘడియలు ప్రారంభమయ్యాకా తిథి మారకుండా భోజనం చేసి, తనతో మరొక అతిథికి కూడా భోజనం పెట్టడం ఏకాదశి వ్రతం. ఈ వ్రతాలను క్రమం తప్పకుండా చేయడం చివరకు అంత్యమున నోట మాటరాని దుస్థితి ఏర్పడితే మృత్యుఘడియల్లో కూడా విష్ణునామస్మరణ చేసే మానసిక, శారీరిక స్థితిని మొదటి నుంచీ అభ్యాసం చేయడానికి. దీని ప్రాధాన్యతను తెలిపే రుక్మాంగదుని చరిత్రమిది. ఈ గ్రంథానికే రుక్మాంగద చరిత్రమని మరొకపేరు. |
2030020025426 |
1926
|
ఏకాంకికలు [6] |
సంపాదకుడు.శివశంకరశాస్త్రి |
ఏకాంకికలు |
ఏకాంకిక అనేది దృశ్యకావ్యమనబడే నాటకాల్లో ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో పలువురు ప్రఖ్యాత రచయితలు చేసిన రచనలను సంకలనం చేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. పీఠికలో తెలుగునాట నాటకాల చరిత్ర మొదలుకొని ఏకాంకికల ఆవిర్భావ వికాసాల వరకూ సవివరంగా చర్చించడం విశేషం. |
2030020024537 |
1945
|
ఏకాంకిక సంగ్రహం [7] |
కన్నడ మూల సంపాదకుడు: ఆద్య రంగాచార్య, అనువాదం: అయాచితుల హనుమచ్ఛాస్త్రి |
ఏకాంకిక నాటికల సంపుటి |
ఏకాంకిక అనేది దృశ్యకావ్యమనబడే నాటకాల్లో ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో పలువురు ప్రఖ్యాత రచయితలు చేసిన రచనలను సంకలనం చేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. కన్నడ భాషలో వివిధ రచయితలు రాసిన నాటికలను రంగాచార్య సంపుటిగా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని హనుమచ్ఛాస్త్రి తెలుగులోకి అనువదించారు. |
2990100061544 |
1978
|
ఏకాక్షి(మొదటి భాగం) [8] |
జి.నారాయణరావు |
నవల |
ఈ నవల ఇంగ్లీష్లో రాయబడిన ఒక నవలకు అనుసృజన. ఏకాక్షి అనే ఆంధ్రుని గురించిన నవల ఇది. ఇది ఒక పరిశోధక నవల అని దచయిత పీఠికలో చెప్పారు. ఇది మొదటి భాగం. |
2020050016328 |
1930
|
ఏకాక్షి(రెండవ భాగం) [9] |
జి.నారాయణరావు |
నవల |
ఈ నవల ఇంగ్లీష్లో రాయబడిన ఒక నవలకు అనుసృజన. ఏకాక్షి అనే ఆంధ్రుని గురించిన నవల ఇది. ఇది ఒక పరిశోధక నవల అని దచయిత పీఠికలో చెప్పారు. ఇది రెండవ భాగం. |
2020050014306 |
1930
|
ఏకోత్తరశతి [10] |
మూలం: రవీంధ్రనాధ్ ఠాగూర్, అనువాదం:త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి |
కవితా సంపుటి |
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్ (Ravindranath Tagore). తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. ఆయన రాసిన కవితలను వీరరాఘవస్వామి తెలుగులోకి అనువందించారు. ఆ పుస్తకమే ఇది. |
2990100051644 |
1963
|
ఏది సత్యం? [11] |
శారద |
నవల |
ప్రముఖ నవలాకారుడు, కథకుడు శారద వ్రాసిన నవల ఇది. |
2020050016269 |
1955
|
ఏమిటీ జీవితాలు [12] |
మాలతీ చందూర్ |
నవల |
మాలతీ చందూర్ తెలుగులో రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే Dear Abby[2] వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. |
2990100071313 |
1981
|
ఏర్చి కూర్చిన ప్రసిద్ధ కథలు [13] |
మాలతీ చందూర్ |
నవలా పరిచయాలు |
మాలతీ చందూర్ తెలుగులో రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో పరిచయం చేశారు. ఈమె పరిచయాల్లో జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఈ పుస్తంలో ప్రసిద్ధ ఆంగ్ల నవలలైన ప్రైడ్ అండ్ ప్రజుడీస్, మిల్ అన్ ది ప్లాన్, అంకుల్ టామ్ స్ కాబిన్ వంటి నవలల పరిచయాలు చేశారు. ప్రమదావనం శీర్షిక నుంచి తీసుకున్న పరిచయాలివి. |
2020050016113 |
1952
|