పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
ఈ కాలం కథలు [1] |
వేదగిరి రాంబాబు |
మినీ కథల సంపుటి |
వేదగిరి రాంబాబు కథారచయిత, కథాసాహిత్యాభిమాని, పోషకుడు. ఆయన వ్రాసిన కథలను ఈ రూపంలో సంపుటీకరించారు. దీనిలోని కథలను ఈ ‘కాలం’ కథలు, ఉత్త‘రాళ్ళ’ కథలు, టెలిఫోన్ కథలు, స్వీట్ నాన్సెన్స్ అనే విభాగాలుగా విడదీశారు.
|
2020120004091 |
1994
|
ఈతరం స్త్రీ [2] |
అర్నాద్ |
నవల |
అర్నాద్ ప్రసిద్ధి చెందిన దుంప హరనాథరెడ్డి ప్రముఖ తెలుగు నవలా రచయిత. కాళీపట్నం రామారావును గురువుగా భావించే అర్నాద్ 50 కి పైగా రచనలు చేసాడు. ఆయన రచించిన ప్రసిద్ధ నవల ఇది. |
2990100051662 |
2003
|
ఈడూ-జోడూ [3] |
భమిడిపాటి రాధాకృష్ణ |
నాటకం |
భమిడిపాటి రాధాకృష్ణ (1929 - 2007) ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు వీరి తండ్రి. భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు 'కీర్తిశేషులు' లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి ప్రముఖులైయ్యారు. ఆయన రచించిన నాటకమిది. |
2030020024759 |
1953
|
ఈశ్వర [4] |
సంపాదకుడు: టి. శ్రీరంగస్వామి |
కవితా సంకలనం |
శ్రీలేఖ సాహితి, వరంగల్లు అనే సంస్థ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు గడిచిన సంవత్సరంలో ఉగాది సందర్భంగా పలువురు కవుల కవితలతో ఈ సంచిక ఏర్పాటుచేసి ప్రచురించారు.
|
2020120029139 |
1977
|
ఈశ్వర సేవకులు [5] |
మూలం.మహదేవ దేశాయ్, అనువాదం.కొత్త సత్యనారాయణ చౌదరి |
జీవిత చరిత్ర |
ఖుదాయీ బిద్మత్‌గార్ అంటే ఈశ్వర సేవకులని అర్థం. ఈ పదాన్ని సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరులను ఉద్దేశించి భారత జాతీయవాదులు ఉపయోగించేవారు. ఈ గ్రంథంలో ఖాన్ సోదరులుగా పేరొందిన కాంగ్రెస్ వాదులు, జాతీయోద్యమ కారులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, డాక్టర్ ఖాన్ సాహెబ్ జీవిత చరిత్రలు రచించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బ్రిటీష్ ఇండియాలోని పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సరిహద్దు రాష్ట్రానికి చెందినవారు. ఆ ప్రాంతం హింసాయుతమైన పోరాటాలకు, అలజడులకు పేరుపొందింది కాగా గఫార్ ఖాన్ అటువంటి రాష్ట్రంలో గాంధీజీ బోధించిన అహింసా సిద్ధాంతాన్ని వ్యాపింపజేయడం జాతీయవాదుల్లోనే కాక బ్రిటీష్ అధికారులు, సరిహద్దు రాష్ట్ర నాయకుల్లో కూడా ఆశ్చర్యం కలిగించింది. గఫార్ ఖాన్ భారతదేశం మతప్రాతిపదికన విడిపోవడం, పాకిస్తాన్ ఏర్పడడం అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయరాదని ప్రయత్నించారు. మొదటి నుంచీ దేశ సమైక్యత గురించి పట్టుదలతో ఉంటున్న కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరే జారిపోవడం, పాకిస్తాన్ ఏర్పాటుకావడం వంటి పరిణామాలతో గఫార్ ఖాన్, ఖాన్ సాహేబ్‌లు హతాశులయ్యారు. ఎన్నో ఏళ్ళుగా భుజం భుజం కలిపి స్వాతంత్ర్యం కోసం కృషిచేసిన భారత దేశానికి చెందిన జాతీయోద్యమ సహచరుల గురించి ఖాన్ బాధతో మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందుకు విసిరేసి వెళ్ళిపోయారు అన్నారు. ఏదేమైనా అనంతర కాలంలో ఏర్పరిచిన అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్న విదేశీ పౌరునిగా (అప్పటికి పాకిస్తాన్ పౌరసత్వం ఉండేది) ఆయన ప్రసిద్ధిచెందారు. ఈ మహనీయుల జీవితాలను గాంధీజీ సూచన మేరకు దేశాయ్ రచించారు. |
2030020029706 |
1938
|
ఈశ్వర దర్శనం [6] |
సంస్కృత మూలం: బ్రహ్మానంద స్వామి, అనువాదం: సూర్యనారాయణ తీర్థులు |
ఆధ్యాత్మికం |
సంస్కృతంలో ఈ గ్రంథాన్ని బ్రహ్మానంద స్వామి రచించారు. ఆ గ్రంథాన్ని రచయిత తెలుగు లోకి అనువదించారు. |
2020120000367 |
1927
|
ఈశ్వర విశ్వరూపం [7] |
జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి (శాంతిశ్రీ) |
ఆధ్యాత్మికం |
ఈ పుస్తకంలో నమక చమకములకు తాత్పర్యంతో సహా రాశారు.జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి (శాంతిశ్రీ): సత్యసాయిబాబా సన్నిహితునిగా, కవిగా సుప్రసిద్ధులు. సత్యసాయిబాబా జీవితంపై, భావజాలంపై ఆయన రచించిన శాంతివనం గ్రంథం సత్యసాయిబాబా భక్తులకు పారాయణ గ్రంథం. |
2020120000368 |
1993
|
ఈశ్వర శతకము [8] |
అందే వేంకటరాజము |
ఆధ్యాత్మికం, శతకాలు |
శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "ఈశ్వరా!" అనే మకుటంతో ఈ పద్యాలను అందే వెంకటరాజం రచించారు.
|
2020120000382 |
1993
|
ఈశ-కేనోపనిషత్తులు [9] |
అనువాదం: రూపంగుంట సుబ్రహ్మణ్య పంతులు |
ఆధ్యాత్మికం |
సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాన్ని అరవిందాశ్రం వారు ఇంగ్లీషులో అనువదింపగా, ఆ ఇంగ్లీషు గ్రంథాన్ని రచయిత తెలుగు లోకి అనువదించారు. |
2020120000366 |
1974
|
ఈనాడు [10] |
ఆత్రేయ |
నాటిక |
ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (1921 - 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. ఆయన రాసిన నాటకాల్లో ఇది సుప్రఖ్యాతమైనది.
|
2020010005026 |
1954
|
ఈడొచ్చిన పిల్ల [11] |
ముట్నూరు సంగమేశం |
కథా సంపుటి |
ముట్నూరి సంగమేశం సంస్కృతాంధ్ర, హిందీ పండితులు. వీరు 1919 ఏప్రిల్ 25 సంవత్సరంలో పుట్టారు. వీరు శ్రీకాకుళం జిల్లా, వంతరాంలో జన్మించి, విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో గులివిందాడ అగ్రహారంలోస్థిరపడ్డారు. వీరు తెలుగులో హాస్య రచనలపై ప్రత్యేకంగా కృషిచేశారు. 1953లో తెలుగు హాస్యంపై వీరి చరన తెలుగు భాష సమితి బహుమతి పొందింది. అభిమన్యుడు-పద్మవ్యూహం అనే రచన కొండి రామంతో కలసి రచించారు. ఆయన రచించిన కథా సంపుటం ఇది.
|
2020120029133 |
1956
|
ఈరేడు లోకాలు [12] |
రచయిత పేరు లేదు. చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘంచే ప్రచురణ |
కథా సంకలనం |
చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘంచే ప్రచురితమైన కథా సంకలనం ఇది.
|
2990100049372 |
1972
|
ఈ దేశం నాదేనా? [13] |
మల్లాది సుబ్బమ్మ |
నవల |
మల్లాది సుబ్బమ్మ (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య. ఆవిడ రచించిన నవల ఇది.
|
6020010000364 |
1984
|
ఈ విషయమై ఆలోచించండి-1 [14] |
జి. కృష్ణమూర్తి |
తత్త్వ గ్రంథం |
ఈ విషయమై ఆలోచించండి ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రచించిన గ్రంథ పరంపర. ఆంగ్లంలో ముద్రించబడిన మూల గ్రంథాలను సి. హనుమంతరావు తెలుగులోకి అనువదించారు. వీటిని కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా వారు 1991 సంవత్సరంలో ప్రచురించారు.
|
2020120004089 |
1991
|
ఈ విషయమై ఆలోచించండి-2 [15] |
జి.కృష్ణమూర్తి |
తత్త్వ గ్రంథం |
ఈ విషయమై ఆలోచించండి ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రచించిన గ్రంథ పరంపర. ఆంగ్లంలో ముద్రించబడిన మూల గ్రంథాలను సి. హనుమంతరావు తెలుగులోకి అనువదించారు. వీటిని కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా వారు 1991 సంవత్సరంలో ప్రచురించారు.
|
2020120029135 |
1991
|
ఈ విషయమై ఆలోచించండి [16] |
జి.కృష్ణమూర్తి |
తత్త్వ గ్రంథం |
ఈ విషయమై ఆలోచించండి ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రచించిన గ్రంథ పరంపర. ఆంగ్లంలో ముద్రించబడిన మూల గ్రంథాలను సి. హనుమంతరావు తెలుగులోకి అనువదించారు. వీటిని కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా వారు 1991 సంవత్సరంలో ప్రచురించారు.
|
2020120034457 |
1999
|
ఈ ఇల్లు అమ్మబడును [17] |
డి. వి. నరసరాజు |
నాటికల సంపుటి |
డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరు లో జన్మించాడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రిక లో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు. ఆయన రచించిన నాటకం ఇది.
|
2020010005025 |
1958
|