పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
యమగర్వభంగము అను మార్కండేయ నాటకము [1] |
కేతివరపు రామకృష్ణశాస్త్రి |
నాటకం |
|
2020050015224 |
1925
|
యాజ్ దే సా ఇండియా [2] |
అనువాదం బాలాంత్రపు రజనీకాంతరావు |
చరిత్ర |
పాశ్చాత్య చరిత్రకారులు భారతదేశ చరిత్ర నిర్మాణంలో నాణేలు, తవ్వకాల్లో లభించిన ప్రాచీన నిర్మాణాలు, శాసనాలు వంటివాటితో పాటుగా విదేశీయాత్రికుల వ్రాతలపై ఆధారపడ్డారు. సాంస్కృతిక షాక్‌లను కూడా పక్కనపెట్టి వారి రాతలను యధార్థానికి దగ్గరగా ఉంటాయని విశ్వసించారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథాన్ని నిర్మించారు. |
99999990128969 |
1971
|
యజుర్వేద భాష్యము [3] |
దయానంద సరస్వతి స్వామి |
ఆధ్యాత్మికం |
దయానంద సరస్వతి హిందూమతంలో సనాతనమైన, ప్రామాణ్యగ్రంథాలైన వేదాల ప్రాముఖ్యతను ముందుకుతీసుకువస్తూ ఆర్య సమాజము స్థాపించారు. పూర్వ హైందవ సిద్ధాంతకర్తల బాటలోనే తన సిద్ధాంతాలను సమర్థించేందుకు వేదభాష్యాలు రచించారు. వాటిలో ఇదొకటి |
2020120007882 |
1000
|
యజుర్వేదీయ మైత్రాయణీ సంహితా [4] |
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన వేదవిద్యలయ ఆచార్యుల సంశోధనతో |
ఆధ్యాత్మికం |
హిందువులకు పరమ ప్రమాణమైన నాలుగు వేదాలలో యజుర్వేదం ఒకటి. ఆంధ్రులకు ఎక్కువగా అధ్యయన వేదంగా పరంపరానుగంతంగా వస్తోన్నదీ యజుర్వేదం. దానిలోని మైత్రాయణీ సంహితను ఈ గ్రంథంలో తెలుగు వచనంతో సహా వివరంగా అందించారు. |
2020120002371 |
2002
|
యజ్ఞ ఫలము [5] |
మూలం.భాసుడు, అనువాదం.బులుసు వెంకటేశ్వరులు |
నాటకం |
అపురూపమైన తన నాటకాలతో సంస్కృత సాహిత్యంలోనే కాక భారతీయ సారస్వతంలో నిలిచిపోయిన మహాకవి భాసుడు. భాసో హాసః-భాసుడు (సరస్వతీదేవి) చిరునవ్వు అన్న చాటుశ్లోక భాగం సంస్కృత భాషాపండిత లోకంలో సుప్రసిద్ధం. భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, బాణుడు, భవభూతి మొదలైన అరుదైన మహాకవుల కోవలోని వాడు. ఆయన రచించిన ఊరు భంగం నాటకం దుర్యోధనుడి మరణంతో పూర్తయ్యే విషాదాంతం కావడం, రంగంపై మరణాన్ని చూపవలసిరావడంతో ఆనాటి నాటక సంప్రదాయాలకు ఎదురు నిలిచి గొప్ప సాహసంగా నిలిచిపోయింది. ఆయన 23కు పైగా నాటకాలు వ్రాసినా వాటిలో 15కు లోపే లభిస్తున్నాయి. అటువంటీ సందర్భంలో కొన్ని దశాబ్దాల క్రితం కథియావాడ్ జిల్లాలోని గొండలు అనే పట్టణంలో కాళిదాసశాస్త్రికి లభించిన ఈ కృతి భాసునిదేనా కాదా అన్న చర్చలు దాటుకుని ప్రముఖులైన పండితులతో భాసకృతేనని నిర్ధారణ పొందింది. సీతారామకళ్యాణం వరకూ రామాయణ గాథను ఇతివృత్తంగా తీసుకున్న ఈ నాటకాన్ని బులుసు వేంకటేశ్వరులు తెలుగులోకి అనువదించారు. |
2030020024758 |
1952
|
యక్ష గానము [6] |
ఎస్.వి.జోగారావు |
సాహిత్యం |
యక్షగానం (కన్నడ:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత[1]. ఇది ఒక శాస్త్రీయ శైలి. తెలుగు సాహిత్యానికి చెందిన దక్షిణాంధ్ర యుగంలో ఈ యక్షగానానికి గొప్ప ప్రశస్తి లభించింది. అనేకమైన యక్షగానాలు అప్పట్లో రచించారు. ఆ గొప్ప కళ గురించి రాసిన ఈ పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ద్వారా ప్రచురితమైంది. |
2020120033148 |
1975
|
యక్ష గానములు(తంజావూరు) [7] |
పరిష్కర్త: కాకర్ల వెంకటరామ నరసింహం |
సాహిత్యం |
రాయల యుగంలో ప్రబంధాల వలె దక్షిణాంధ్ర యుగంలో వైభవోపేతమైన దశకు అందుకున్నవి యక్షగానాలు. పలువురు రాజాశ్రితులైన కవులు, రాజనర్తకులతో పాటు రాజులు కూడా యక్షగానాలు రచించడంతో ఇది సుస్పష్టం. ఈ సారస్వత యుగానికి తంజావూరు ఒక కేంద్రంగా విలసిల్లింది. ఆ యుగం నాటి కొన్ని యక్షగానాలు పరిష్కరించి ఈ గ్రంథంలో ప్రచురించారు. |
2020120036170 |
1973
|
యక్ష ప్రశ్నలు [8] |
మూలం.వ్యాసుడు, అనువాదం.తిరూమలై కండ్యూరు రామానుజాచార్యులు |
సాహిత్యం |
యక్షుని రూపంలోని యమధర్మరాజు ఒక కొలనును పట్టుకుని ఆ కొలను వద్దకు నీటికోసం వచ్చిన పాండవులు ఒక్కొక్కరినీ తను అడిగే ప్రశ్నకు సమాధానం ఇస్తేనే నీరు అంటూ పందెం కడతాడు. సమాధానం చెప్పకుండానే నీరు తాగే ప్రయత్నం చేసిన పాండవుల్లో చిన్నవారు నలుగురూ మృతులు అవుతారు. పెద్దవాడైన ధర్మరాజు మాత్రం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి తన తమ్ములందరినీ జీవితులను చేసుకుంటాడు. ఐతే యక్షుడు అడిగే ఆ ధర్మసందేహాలు చాలా ప్రశస్తి పొందాయి. ఇది వాటీకి ఆంధ్రానువాదం. |
2020120002372 |
1901
|
యాజ్ఞవల్క్య చరిత్రము [9] |
సంపాదకులు: లింగంగుంట వెంకటసుబ్బయ్య |
జీవితచరిత్ర |
యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు.ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం(బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత మరియు యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు. ఆయన జీవితగాథ అనేకమైన మలుపులతో, అంతరార్థాలు బోధించే కథలతో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము, తైత్తరీయోపనిషత్తు వంటి వాటి ఆవిర్భావాలకు సంబంధించిన కథలతో ముడిపడి ఉంది. ఆ కథను ఈ రచనలో తెలిపారు రచయిత. |
2020050006450 |
1955
|
యాదృచ్ఛిక ప్రక్రియలు [10] |
వై.ఎన్.రామకృష్ణయ్య |
గణితశాస్త్రం, సాంఖ్యకశాస్త్రం |
సాంఖ్యక శాస్త్రం ద్వారా భౌతిక శాస్త్ర, జీవశాస్త్రాది ప్రముఖ శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రయోగాలకు ఉపయోగపడే ప్రక్రియ యాధృచ్ఛిక ప్రక్రియ. దీన్ని ఆంగ్లంలో రాండం ప్రాసెస్/స్టాకాస్టిక్ ప్రాసెస్ అంటారు. సంభావ్యతలను వివరించే ఈ శాస్త్రం ప్రయోగాలకు చాలా ఉపకరిస్తుంది. ఇది తెలుగు అకాడమీ వారు ప్రచురించిన పఠనీయ గ్రంథం. |
2020120002369 |
1977
|
యదార్ధము [11] |
రాయసం వేంకటరమణయ్య |
నాటకం |
పాతివ్రత్యానికి సంబంధించిన ఇతివృత్తాన్ని చిత్రీకరించిన సాంఘిక నాటకం ఇది. |
2020050015066 |
1945
|
యదార్ధవాది [12] |
కొడవటిగంటి కుటుంబరావు |
నాటకం |
కొడవటిగంటి కుటుంబరావు (అక్టోబర్ 28 1909 – ఆగష్టు 17 1980), ప్రసిద్ధ తెలుగు రచయిత.హేతువాది . కొకుగా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు. ఆయన రచించిన నాటకమిది. |
9000000004795 |
1956
|
యదార్ధ బోధిని [13] |
చిన్మయ రామదాసు |
సాహిత్యం |
తెలుగు, సంస్కృత సాహిత్యాలలోని నీతులు, ఆధ్యాత్మిక విశేషాలు, సూక్తులు, భక్తి పద్యాలు వంటివి గుదిగుచ్చి తయారు చేసిన సంకలనం ఇది. |
2020120036168 |
1983
|
యదార్ధ దృశ్యాలు [14] |
మునిమాణిక్యం నరసింహారావు |
నాటకం |
మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఇవి ఆయన రచించిన హాస్య ప్రధానమైన నాటికలు. |
9000000004406 |
1945
|
యదార్ధ మానవత్వం [15] |
కలవకుంట కృష్ణమాచార్య |
సాహిత్యం |
|
9000000005087 |
1960
|
యదు వంశము [16] |
మహావాది వేంకటరత్న |
కావ్యం |
|
9000000004897 |
1945
|
యవనవ్వనం [17] |
గుడిపాటి వెంకట చలం |
కథలు, సాహిత్యం |
తెలుగు సాహిత్యంలో భావంలోనూ, భాషలోనూ విప్లవంలా వచ్చిన రచయిత గుడిపాటి వెంకట చలం. ఆయన స్త్రీల సమస్యల గురించి, సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్న హిపోక్రసీ గురించి సూటి విమర్శలు చేశారు. ఆయన రచించిన అత్యంత సరళమైన, మధురమైన తెలుగులో రాసిన వచనం భాషలోని సరళతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రచన ఆయన రాసిన కథల సంపుటి. |
2020050016627 |
1953
|
యాచమనాయుడు [18] |
ప్రతాప రామకోటయ్య |
చారిత్రాత్మిక నవల |
|
2020050016774 |
1951
|
యాచశూరేంద్ర విజయము [19] |
బాలాంత్రపు వేంకటరాయ కవి |
నాటకం |
|
5010010033134 |
1910
|
యాజుష శ్రౌత స్మార్తానుక్రమణిక [20][dead link] |
చల్లా లక్ష్మణశాస్త్రి |
ఆధ్యాత్మిక గ్రంథం |
|
5010010078884 |
1922
|
యాత్రా చరిత్ర పూర్వభాగము [21] |
మండపాక పార్వతీశ్వరశాస్త్రి |
యాత్రా సాహిత్యం |
|
5010010088841 |
1915
|
యాత్రికుడు [22] |
భాస్కరాచార్య రామచంద్రస్వామి |
సాహిత్యం |
|
2030020024875 |
1947
|
యాదవ రాఘవ పాండవీయం [23] |
సరిపెల్ల విశ్వనాథశాస్త్రి |
కావ్యం |
|
2020120002367 |
1966
|
యాగ సంరక్షణము [24] |
వాజపేయయుజుల రామసుబ్బారావు, వేంకటనారాయణ సోదరకవులు |
సాహిత్యం |
|
9000000004932 |
1937
|
యధా రాజ తధా ప్రజ [25] |
గంగిశెట్టి శివకుమార్ |
కథా సాహిత్యం |
|
2020120007881 |
1982
|
యామినీపూర్ణతిలకావిలాసము [26] |
చెళ్లపిళ్ల నరసకవి |
కావ్యం |
కడియం గ్రామంలో జన్మించిన "చెళ్ళపిళ్ళ నరసకవి" తెలుగు సాహిత్యంలో క్షీణయుగంగా ప్రసిద్ధి చెందిన కాలంలో(17-18 శతాబ్దాలు) రచించిన ప్రబంధం. ఇది శృంగార ప్రధానమైన ప్రబంధం. అంతవరకూ వ్రాతప్రతిగా ఉన్న ప్రబంధాన్ని 1893లో గురులింగదేవర ముద్రించగా అనంతర కాలంలో ఈ ప్రతిని శృంగారకావ్య గ్రంథమండలీ పరంపరలో ప్రచురించారు.
|
2020120030104 |
1984
|
యువ(1973 ఫిబ్రవరి సంచిక) [27] |
సంపాదకుడు: చక్రిపాణి |
మాసపత్రిక |
|
2990100068934 |
1973
|
యువ(1974 జూన్ సంచిక) [28] |
సంపాదకుడు: చక్రిపాణి |
మాసపత్రిక |
|
2990100049813 |
1974
|
యువ(1975 జనవరి సంచిక) [29] |
సంపాదకుడు: చక్రిపాణి |
మాసపత్రిక |
|
2990100068932 |
1975
|
యువ(1975 ఫిబ్రవరి సంచిక) [30] |
సంపాదకుడు: చక్రిపాణి |
మాసపత్రిక |
|
2990100068933 |
1975
|
యువ(1975 ఏప్రిల్ సంచిక) [31] |
సంపాదకుడు: చక్రపాణి |
మాసపత్రిక |
|
2990100068931 |
1975
|
యువజన విజ్ఞానము [32] |
సురవరం ప్రతాపరెడ్డి |
సాహిత్యం |
|
9000000004975 |
1951
|
యోగ సారము [33] |
జంధ్యాల శివన్నశాస్త్రి |
ఆధ్యాత్మికం, యోగశాస్త్రం |
యోగం భారతదేశం హైందవ, బౌద్ధాల ద్వారా ప్రపంచానికి అందించిన అతిగొప్ప బహూకృతి. శరీరాన్ని, మనస్సుని నియంత్రిస్తూ వాటిలోని అత్యున్నతమైన శక్తులను వెలికితీసే యోగశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందుతోంది. యోగసాధకుడైన జంధ్యాల శివన్నశాస్త్రి ఈ గ్రంథంలో ఛందోబద్ధ పద్యాల్లో యోగరహస్యాలను వివరించారు. |
2020050019138 |
1914
|
యోగ వియోగములు [34] |
మూలం: రవీంధ్రనాధ్ ఠాగూర్, అనువాదం: కారుమూరి వైకుంఠరావు |
సాహిత్యం |
|
2020120002397 |
1972
|
యోగము పరోక్షము అపరోక్షము [35] |
మూలం. బ్రహ్మానంద, అనువాదం. రామకుమారుడు |
యోగం, ఆధ్యాత్మికం |
సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన అత్యున్నతమైన ఎన్నో బహుమతుల్లో యోగం కూడా ఒకటి. మనిషి అంతర్ముఖుడై తనను తాను పరిశీలిస్తూ మానసిక శక్తిని భౌతిక ప్రపంచంపై ప్రసరించే అపురూపమైన విద్య యోగం. దీన్ని గురించి భారతీయ చింతనలు, ప్రయోగాలు మొదలుకొని ప్రపంచంలోని ఇతర మతాల్లో కూడా తళుక్కుమన్న సందర్భాలు, ఏ విధంగా నిరూపణ చేయవచ్చు మొదలైన ఎన్నో విశేషాలతో ఈ గ్రంథం తయారయ్యింది. |
2020050019155 |
1915
|