వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - అ
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
మార్చుపుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం అఖిలపక్ష మహాసభ 1928 [1] అనువాదం: ఓగేటి వెంకటసుబ్బయ్యశాస్త్రి రాజనీతి శాస్త్రం, చరిత్ర భారతీయులు తమను తాము పరిపాలించుకుని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలా సమర్థులేనన్న విషయం నిరూపించుకునేందుకు చేసిన సఫలమైన ప్రయత్నమిది. 20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రిటీష్ రాజనీతివేత్తలు భారతీయులకు పరిపాలించే సమర్థత లేదన్న దురభిప్రాయంతో ఉండేవారు. మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కమిటీ 1928లో రాజ్యాంగ నిర్మాణానికి అవసరమైన సూచనలు, సూత్రాలతో ఇచ్చిన ఈ నివేదిక ఆ దురభిప్రాయాన్ని పటాపంచలు చేసింది. ఆ రీత్యా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆపైన 20 ఏళ్ళ తర్వాత మోతీలాల్ కుమారుడు జవహర్‌లాల్ నేతృత్వంలో నిజమైన స్వాతంత్ర్యంతో పాటుగా, నిజరూపంలో రాజ్యాంగం ఏర్పడడం విశేషం. ఆ రెంటినీ పరిశీలిస్తే మంచి వివరాలు తెలుస్తాయి. 2020050005850 1928 అగ్ని క్రీడ [2] నందిరాజు చలపతిరావు సాహిత్యం బాణాసంచా తయారీకి సంబంధించిన రచన ఇది. దీనిలో రకరకాల బాణసంచా వస్తువులు, వాటి సమ్మేళనాలు, తయారీల గురించి ఉంది. 2020050005872 1925 అదృష్ట విజయము [3] నాటకం అరేబియన్ నైట్స్ అనే పారశీక కథా సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలోకి అనువాదమై ప్రసిద్ధి పొందింది. అందులోనూ అలాదీన్ కథ, ఆలీబాబా నలభై దొంగలు కథ మొదలైనవి ప్రత్యేక ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. ఈ గ్రంథం ఆ ఆలీబాబా నలభై దొంగల కథను 20 శతాబ్ది తొలి అర్థభాగంలోని భారత దేశాన్ని రంగంగా స్వీకరించి చేసిన నాటకానువాదం. 2030020025184 1926 అద్వైత పూర్ణానుభవ ప్రకాశిక [4] ములుకుట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం అద్వైత సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మికవేత్త ఈ గ్రంథాన్ని అద్వైత, ఆధ్యాత్మికాది విషయాలతో రచించారు. 2990100061739 1940 అచలగురు మార్గము [5] నిజానంద తులసీదాస్ ఆధ్యాత్మిక సాహిత్యం శివరామదీక్షిత అచలగురు పీఠాధిపతిగా వ్యవహరించిన శ్రీకృష్ణ దేశికేంద్రులు రచించిన గ్రంథం నుంచి సేకరించి నిజానంద తులసీదాస్ తయారుచేసిన సంకలనమిది. 2020120033934 2000 అచల ప్రబోధ [6] జూపూడి హనుమద్దాస్ ఆధ్యాత్మిక సాహిత్యం అచలపీఠాధిపతుల బోధలు, వారి పట్ల నమ్మకం వంటివాటిని అనుసరించి ఈ రచనకు రూపకల్పన చేశారు. గ్రంథం ఆధ్యాత్మిక విసయాలపై శ్రద్ధ నిలిపింది. 2020120028801 1935 అచలాత్మజా పరిణయము [7] తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు ద్వ్యర్థి కావ్యము, కావ్యం ద్వ్యర్థి కావ్యం చాలా విలక్షణమైన, కష్టభరితమైన ప్రక్రియ. ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్తే దాన్ని ద్వ్యర్థి కావ్యమని పిలుస్తారు. రాఘవ పాందవీయమనే గ్రంథాన్ని ఉదాహరణగా స్వీకరిస్తే అవే పద్యాలు రామాయణ పరంగా చదువుకుంటే రామాయణంగానూ, మహాభారతంగా అర్థం చేసుకుంటే భారతంగానూ అర్థం వచ్చేలా రచించారు. ఇలాంటి గ్రంథాన్ని రచించడానికి విస్తృతమైన భాషా పరిజ్ఞానం, లోతైన సాహిత్య పాండీత్యం అవసరం. ఆ అపురూపమైన ప్రక్రియలో ఈ గ్రంథం చేరుతుంది. 2030020025082 1936 అచ్చ తెలుగు కుబ్జాకృష్ణవిలాసము [8] నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు అచ్చ తెలుగు కావ్యం, పద్య కావ్యం తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు(నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి) తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు. అచ్చతెలుగుకు సంస్కృత సమాలు కలిస్తే మనది ఆంధ్ర భాష లేదా తెలుగు భాష. సంస్కృత సమపదం ఒక్కటి కూడా రాకుండా పద్యాన్ని రచించడం కొంచెం కష్టమైన పనే. తెలుగు(ఆంధ్ర) భాషలో వందల పద్యాలతో రాస్తూ మధ్యలో ఎక్కడయినా ఒకటి అచ్చతెలుగు పద్యం రాస్తే, అది పాఠకునికీ, శ్రోతకీ ఒక విశ్రాంతిగా ఉంటుంది. వైవిధ్యం వల్ల మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది. ఐతే మొత్తం పుస్తకమంతా అచ్చతెలుగులోనే చెప్తే, ఇంకెంత సంబరపడతాడు! దాని చందం తెలిసినవాడు ఎంతగా ఆశ్చర్యపడతాడు! శ్రమను గుర్తించి ఎంతగా కొనియాడతాడు! ఊహించలేం. ఇటువంటి అభిప్రాయంతోనే తొలి అచ్చతెలుగు కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఈ గ్రంథమూ అలాంటిదే. కుబ్జ(పొట్టి, అందవికారమైన అమ్మాయి)ని మధురలో కృష్ణుడు సుందరిగా మలిచిన గాథను ఇతివృత్తంగా స్వీకరించారు. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు. 2030020024902 1932 అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు [9] కె.వి.సుందరాచార్యులు సాహిత్య విమర్శ కూచిమంచి తిమ్మకవి రచించిన అచ్చతెలుగు రామాయణంపై చేసిన పరిశోధన ఫలితం ఈ గ్రంథం. ఈ సిద్ధాంత రచనకు గాను రచయిత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. పట్టాను పొందారు. 2020120028805 1993 అచ్యుతానంత గోవింద శతకములు [10] అద్దంకి తిరుమల తిరువేంగడ తాతదేశికాచార్యులు శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. అచ్యుతానంద గోవిందా అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016656 1935 అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు [11] కోట వేంకటాచలం చరిత్ర భారతీయ పురాణ వాౙ్మయంలోని చరిత్రనంతా తోసివేసి బ్రిటీష్ వారు తమ ఆధిక్యత నిలుపుకునేందుకు చరిత్రను వక్రీకరించారని పేర్కొంటూ పలువురు జాతీయ భావాలు కలిగిన భారతీయ చరిత్రకారులు విభేదించారు. ఆ క్రమంలో సప్తర్షి మండల గతిని అనుసరించి వేలాది సంవత్సరాలు ఖరారుగా వ్రాసిపెట్టిన పురాణాలలోని చరిత్రను పునఃప్రతిష్ఠించేందుకు ప్రయత్నించినవారు కోట వేంకటాచలం. వలసవాద దేశాలు తమ వలస దేశాన్ని మానసికంగా అదుపులో ఉంచుకునేందుకు చేసే ప్రయత్నాలలో ఈ చరిత్ర హననం కూడా ఒకటని గుర్తించిన నేటి అధ్యయనకారుల దృష్టిలో ఆయన రచనలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. బ్రాహ్మణులైన కణ్వ, శుంగ, శాతవాహన వంశాల పతనానంతరం దేశం హూణాది విదేశీయుల పరమైపోతున్న తరుణంలో రాజపుటానా(నేటి రాజస్థాన్) ప్రాంతంలోని కొందరు బ్రాహ్మణులు బయలుదేరి క్షాత్రంతో దేశాన్ని తిరిగి జాతీయ పాలన కిందకు తీసుకువచ్చారని ఈ గ్రంథంలో రచయిత వివరించారు. ఆ క్షాత్రమవలంబించిన బ్రాహ్మణుల సంతతి పరిపాలనకు సంబంధించిన ఉద్యోగాలలో ఈ మధ్య కాలం వరకూ కుదురుకున్నారని, వారినే ఆంధ్రదేశంలో "నియోగి బ్రాహ్మణులు" అంటున్నారని ఆయన పేర్కొన్నారు. వీటన్నిటికీ పురాణాలు మొదలైన చారిత్రిక గ్రంథాల ఆధారాలు చూపించారు వేంకటాచలం. ఆ నియోగి బ్రాహ్మణ ప్రభువులు లేదా అగ్నివంశ క్షత్రియుల పరిపాలన గురించి, ఉత్థాన పతనాల గురించి తెలిపారు. 2990100068455 1950 అజంతా సుందరి [12] సి.నారాయణ రెడ్డి రూపకం, చరిత్ర సి.నా.రె.గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ రచన ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం 2030020025007 1955 అడయిక్కప్పపిళ్ళె [13] ముద్దుకృష్ణ నాటకం సంకలన కర్తగా సుప్రసిద్ధులైన ముద్దుకృష్ణ రాసిన నాటకమిది. అక్కయిప్పపిళ్ళై నాటకంలో బీమా ఇన్స్ పెక్టరు పాత్ర పేరే అక్కయిప్పపిళ్ళై. ఆయనతో పాటుగా బీమా ఏజెంటు, జమీందారు వంటి పాత్రలూ ఉన్నాయి. 2020010002602 1941 అడవి పువ్వులు [14] మిన్నికంటి గురునాథశర్మ పద్య గ్రంథం అడవి పువ్వులు అనే ఈ పద్యకావ్యాన్ని కవి మిన్నికంటి గురునాథశర్మ రచించారు. 2030020025644 1933 అడవి బాపిరాజు బృందావన్ లాల్ వర్మ చారిత్రిక నవలల తులనాత్మక పరిశీలన [15] కె.వి.నాగరత్నమ్మ సాహిత్య విమర్శ, పరిశోధన అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. ఆయన గోన గన్నారెడ్డి, కోనంగి, హిమబిందు, అడవి శాంతిశ్రీ, అంశుమతి వంటి చారిత్రిక నవలలు రచించారు. బృందావన్ లాల్ వర్మ హిందీ భాషలో ప్రసిద్ధుడైన నాటకకర్త, నవలా రచయిత. ఆయన హిందీలో గధ్ కుందర్, విరాటకీ పద్మిని, ముసహిబ్జు, ఝాన్సీకీ రాణి, కచ్నర్, మదవ్‌జీ సింధియా, టూటే కాంటే, మృగనయని, భువన్ విక్రమ్, అహల్యాబాయి వంటి చారిత్రిక నవలలు రచించారు. వీరిలో బృందావన్ లాల్ వర్మ 1889లో జన్మిస్తే 1895లో జన్మించారు. వీరిద్దరూ సమకాలికులు కావడమే కాక పలు ఇతరమైన ఎన్నో పోలికలు ఉన్నాయి. వీరి చారిత్రిక నవలలపై రచయిత్రి తన పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా తులనాత్మక అధ్యయనం చేసి సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. 2990100071214 1993 అడుగుజాడ గురజాడ [16] కె.బాబూరావు సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర గురజాడ అప్పారావు తన కాలానికి నూతనమైన వివిధ ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. ముత్యాల సరాలు అనే మాత్రా ఛందస్సును ముద్రణ మాధ్యమంలో ప్రాచుర్యం చేసిన కవిగా, కన్యాశుల్కం నాటకకర్తగా సుప్రసిద్ధుడు. ఆయన కాలం నాటికి తెలుగులో కమ్యూనిస్టు భావజాలం వృద్ధిచెందక పోవడం వల్ల నేరుగా ఆ కోణంలో రచనలు చేయకపోయినా భావసారూప్యతను ఆధారం చేసుకుని కమ్యూనిస్టులు ఆయనను గురుస్థానంలో నిలిపారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథాన్ని రాశారు రచయిత. ఈ గ్రంథంలో గురజాడ అప్పారావు జీవితం, సాహిత్య కృషి గురించి వ్రాశారు. 2990100061471 1990 అడుగుజాడలు [17] కె.ఎల్.నరసింహారావు నాటకం 1950 తొలి అర్థభాగంలో రచించిన ఈ నాటకం అప్పట్లో ప్రభుత్వం పెట్టిన దేశాభివృద్ధికి సహకరించే నాటకాల పోటీలో ప్రథమ బహుమతి సాధించింది. 2030020025190 1955 అనగనగా-2 [18][dead link] మూలం: ఎం.చౌక్స్, పి.ఎం.జోషి, అనువాదం: చల్లా రాధాకృష్ణ శర్మ కథ అనగనగా-2 నెహ్రూ బాల పుస్తకాలయం రెండవ భాగము. దీని రచన (1973 సం.) ఎం.హౌక్సీ, పి.ఎం.జోషి. ఇందులో పులక్ బిస్వాస్ చిత్రాలు అందించగా, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారి నుండి ప్రచురించబడి, 1976 (శక 1897) సం. ప్రథమ ముద్రణతో విడుదలయి, అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ చేశారు. ఈ పుస్తకము 1991 సం. (శక 1913) ద్వితీయ ముద్రణతో ముద్రితమయినది. 99999990129036 1976 అనుభవ పశువైద్యచింతామణి [19] యేజెళ్ళ శ్రీరాములు చౌదరి వైద్యం వేట దశను దాటిన నాటి నుంచి అన్ని సమాజాలలోనూ పశువులను పాలు, మాంసం వంటీ ఆహార అవసరాల కోసం, స్వారీ, కాపలా, వ్యవసాయం వంటి ఇతర అవసరాల కోసం పెంచడం ఉంది. ఆ క్రమంలోనే భారతీయ సమాజంలో సాధారణంగా గుర్రాలు, ఆవులు, గేదెలు, ఎడ్లు, గొర్రెలు, కుక్కలు వంటి జంతువులను రకరకాల అవసరాలకై పెంచుతారు. పశుపాలన సమాజంలో అందరూ ఏదోక రూపంలో చేసినా కొందరు మాత్రం ప్రత్యేక వృత్తిగానూ చేపట్టారు. ఆ క్రమంలో జంతువుల పెంపకం ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి అయింది. ఆ నేపథ్యంలో రాసినదే ఈ రచన. 2990100051606 1957 అనుభవ సుధానిధి [20] పాలెపు బంగారరాజు పద్యకావ్యం తన జీవితానుభవాన్ని కవి పద్యరూపంలో పాఠకులకు అందించారు. ఈ గ్రంథం శతక శైలిలో సాగింది. 2020050019105 1910 అపూర్వ సంఘసంస్కరణము [21] కాళ్లకూరి గోపాలరావు హాస్యము, పద్యకావ్యము హేళన ఈ గ్రంథం పేరుతోనే ప్రారంభమయింది. ఆనాటి సమాజంలో సాగుతున్న సంస్కరణల తీరు, సంఘ సంస్కరణల పద్ధతీ విమర్శిస్తూ రాస్తున్న పద్యాల సంకలనానికి అపూర్వ సంఘసంస్కరణమన్న పేరు పెట్టడం హేళన కాక మరేమిటి? ఈ గ్రంథం తెలుగులోని తొలినాటి, అరుదైన హేళన రచనల్లో ఇది ఒకటి. 2020120028930 1916 అమృతం కురిసిన రాత్రి [22] దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితా సంకలనం, కవిత్వం అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. 2990100071220 2004 అమెరికా మహాపురుష చరిత్రము [23] వేదము వెంకటకృష్ణశర్మ జీవిత చరిత్ర అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆధునిక చరిత్రలో అనితర సమానమైన ప్రాధాన్యత పొందిన దేశం. ఈ దేశంలో జన్మించి రాజకీయ, న్యాయ, శాస్త్రసాంకేతిక, సాహిత్య, సినిమా వంటి రంగాల్లో కృషిచేసిన పలువురు మహనీయుల జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో రచించారు. 2030020024456 1933 అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజా ప్రభుత్వం [24] మూలం: కాథరీన్ హడ్సన్ చరిత్ర అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలు, వారి ప్రభుత్వం, నాయకులు, రాజ్యాంగ సూత్రాలు వంటి వాటిపై వివరాలు అందించే ఈ పుస్తకం అమెరికన్ విశ్వవిద్యాలయ పండితుడైన కాథరీన్ హడ్సన్ గ్రంథానికి అనువాదం. 2020050016254 వివరాలు లేవు అతీతానుభవ తత్త్వనీతి [25] కృష్ణానందాచల బ్రహ్మపూర్ణులు తత్త్వాలు, ఆధ్యాత్మికత తత్త్వాలకు సాహిత్యంలో, సంగీతంలో కూడా తగిన స్థానం ఎప్పుడూ ఉంది. చూడడానికి ఏదో సాంసారిక విషయంలా, కొన్న్ సందర్భాల్లో కొందరికి పిచ్చిగా అనిపించినా చాలామందికి తత్త్వగీతాల్లోని అంతర్విహితమైన సత్యము కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంథం అలాంటి తత్త్వాలకు ఆలవాలం 2020050019197 1917 అథయజుర్వేద భాష్యము (ద్వితీయ భాగము) [26] ఆంధ్ర మూలం: దయానంద సరస్వతి, అనువాదం:అన్నే కేశవార్యశాస్త్రి వేద భాష్యం, అనువాద రచన స్వామి దయానంద సరస్వతి (1824-1883) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు. తన ఆర్యసమాజ సూత్రాలకు, సంఘసంస్కరణలకు వేదాల్లో ఉన్న సమర్థనలతో భాష్యం రాశారు. అలా వ్రాసినవాటిలో ఈ యజుర్వేదభాష్యం ఒకటి. దానికి ఇది తెలుగు సేత. 2990100071211 2000 అథిలబింబము [27] రెంటాల వేంకట సుబ్బారావు సాహిత్యం ఆంగ్ల మహాకవి, ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్‌స్పియర్ వ్రాసిన పలు నాటకాలను బింబావళి పేరుతో రచయిత వరుసగా అనుసృజనలు చేశారు. వాటిలో ఈ అథిలబింబము ఒకటి. 2020120033929 1920 అదికార భాష తీరుతెన్నులు [28] సి.ధర్మారావు పరిశోధనా గ్రంథం 1988 నాటి అధికార భాషా సంఘం కార్యదర్శిగా పనిచేసిన సి.ధర్మారావు మాతృభాషలో విద్యాభ్యాసం, దాని వల్ల వికాసం, తెలుగు అధికారభాషగా అమలవ్వాల్సిన అవసరం, అమలు స్థితి వంటి విషయాలు ఉన్నాయి. 2990100061470 1989 అధికార భాష - తెలుగు చరిత్ర [29] గొడుగు నిర్మలాదేవి పరిపాలన, చరిత్ర ప్రాౙ్నన్నయ యుగం నుంచీ ఆధునిక కాలం వరకూ అధికార భాషగా తెలుగు పరిణామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలుగు అధికార భాషగా నిర్వహించడం వెనుక అవకాశాలు, ఇబ్బందులు ఈ గ్రంథంలో రాశారు. రచయిత్రి ఈ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ చేశారు. 2990100071215 1999 అధిక్షేప శతకములు [30] కె.గోపాలకృష్ణారావు శతకం అధిక్షేపం సాహిత్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. వేర్వేరు రుగ్మతలపై తీవ్రంగా నేరుగా నిరసించడం కన్నా రచయితలు, కవులు ఈ అధిక్షేపాన్ని ఎన్నుకుంటారు. ఆ క్రమంలో కె.గోపాలకృష్ణారావు రాసిన అధిక్షేప సాహిత్యం ఇది. 2990100051604 1982 అద్భుత రామాయణము [31] వేదుల వేంకటశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం మహాభారతం తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రనలు చేసిన తెనిగింపుతో సరిపడగా రామాయణాలు మాత్రం అనేకానేకంగా పుట్టుకువచ్చాయి. వేయేళ్ళ తెలుగు సాహిత్యంలో కథ, కథనాలు, శిల్పంలో మార్పుచేర్పులతో వందల రామాయణాలు ఏర్పడ్డాయి. వాటిలో ఈ అద్భుత రామాయణము ఒకటి. 2990100067406 1972 అన్నీ తగాదాలే [32] భమిడిపాటి కామేశ్వరరావు ప్రహసనాలు, హాస్య నాటికలు భమిడిపాటి కామేశ్వరరావు హాస్య బ్రహ్మగా పేరొందిన అపురూప హాస్య రచయిత. ఆయన రచించిన ఈ హాస్య, లఘు హాస్య నాటికలు ప్రదర్శనల్లో వేసుకునేందుకు పనికివస్తాయి. తెలుగు వ్యాకరణం, పద్య లక్షణాలు, పద్యాలు అర్థాలు మొదలైన విషయాల్లో జరిగే తీవ్రమైన చర్చలను అత్యంత హాస్యభరితమైన తగాదాల రూపంలోకి మలచడం సామాన్యులకు అనూహ్యం. అటువంటి ఫీటు సాధించారు ఈ పుస్తకంలో భమిడిపాటి. 2030020024705 1946 అపూర్వ మనోహర చిత్రకథలు [33] పూడిపెద్ది లింగమూర్తి కథల సంపుటి కల్పనలు, వర్ణనలు, మలుపులతో కూడిన తెలుగు పెద్ద కథలు ఇవి. 2020050016773 1932 అబలా సచ్చరిత్ర రత్నమాల [34] బండారు అచ్చమాంబ జీవిత చరిత్ర స్త్రీలు బలహీనులు, శౌర్యహీనులు కాదని వారిలో ఎందరో వీరనారులు, పవిత్ర చరితులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారని నిరూపించేందుకు, స్త్రీ విద్య నాశనహేతువు కాక దేశోపకారణం కాగలదనీ నిరూపించేందుకు ఈ గ్రంథం రచించానని రచయిత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతదేశంలోని పలువురు వీరనారుల సంగ్రహ జీవిత గాథలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. తెలుగులో తొలి కథ రాసిన గౌరవం పరిశోధనల వల్ల ఇటీవల బండారు అచ్చమాంబకే దక్కుతోంది. ఆమె తెలుగు వైతాళికుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సోదరి కాగా లక్ష్మణరావు ఆమెను రచనరంగంలో బాగా ప్రోత్సహించారు. 2030020024474 1935 అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండవ సంపుటం) [35] బండారు అచ్చమాంబ జీవిత చరిత్ర స్త్రీలు బలహీనులు, శౌర్యహీనులు కాదని వారిలో ఎందరో వీరనారులు, పవిత్ర చరితులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారని నిరూపించేందుకు, స్త్రీ విద్య నాశనహేతువు కాక దేశోపకారణం కాగలదనీ నిరూపించేందుకు ఈ గ్రంథం రచించానని రచయిత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతదేశంలోని పలువురు వీరనారుల సంగ్రహ జీవిత గాథలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. తెలుగులో తొలి కథ రాసిన గౌరవం పరిశోధనల వల్ల ఇటీవల బండారు అచ్చమాంబకే దక్కుతోంది. ఆమె తెలుగు వైతాళికుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సోదరి కాగా లక్ష్మణరావు ఆమెను రచనరంగంలో బాగా ప్రోత్సహించారు. ఈ సంపుటంలో ప్రాచీన భారతీయ స్త్రీల నుంచి ఆధునిక కాలానికి చెందిన స్త్రీల జీవిత గాథలు ఉన్నాయి. రాణీ సంయుక్త జీవితగాథతో మొదలుపెట్టి 34మంది జీవితచిత్రణలు చేశారు. 2030020024477 1917 అబద్ధాల వేట [36][dead link] ఎన్.ఇన్నయ్య వ్యాస సంపుటి నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31న గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించాడు. తెలుగు లో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు మరియు కొన్ని అనువాదాలు చేశాడు. మానవేంద్ర నాథ్ రాయ్ రచనలు అనువదించారు. తెలుగు అకాడమీ వీటిని తెలుగు యూనివర్సిటీ ప్రచురించింది. ఇతడు హేతువాది. తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు. అబద్ధాల వేట హేతువాదం బాటలో ఇన్నయ్య వ్రాసిన గ్రంథం. 2020120000028 1995 అబ్రహాం లింకన్ [37] మూలం: స్టెర్లింగ్ నార్త్, అనువాదం: నృసింహగురు జీవితచరిత్ర అబ్రహం లింకన్ (1809 ఫిబ్రవరి 12 – 1865 ఏప్రిల్ 15) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు. ఆయన జీవిత చరిత్రకు అనువాదం ఇది. 2020010003759 1959 అబ్రహంలింకన్ చరిత్ర [38] గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర అబ్రహం లింకన్ ప్రపంచచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు. అమెరికాలో బానిసత్వాన్ని ముగించేందుకు ప్రయత్నించిన గొప్ప నేత. ఆంధ్రదేశంలో రాజకీయ చైతన్యం రగల్చడంలో ముఖ్యుడైన జర్నలిస్ట్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఈ అబ్రహం లింకన్ జీవిత చరిత్ర వ్రాశారు. 2020120000036 1907 అబ్బూరి వరదరాజేశ్వరరావు కవితా సంచిక [39] అబ్బూరి వరదరాజేశ్వరరావు కవితల సంకలనం అబ్బూరి వరద రాజేశ్వరరావు తెలుగు కవి, సాహిత్యవేత్త. ఆయన తెలుుగు సాహిత్యవాతావరణంలో ప్రముఖులు. పలువురు కవిపండితులతో సన్నిహిత సంబంధాలు నెరపారు. ఆయన వ్రాసిన కవితలన్నిటినీ ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయవేత్త పరకాల ప్రభాకర్ ఈ రూపంలో సంపుటీకరించారు. 2020120003761 1993 అబ్బూరి సంస్మరణ [40][dead link] సంపాదకుడూ: అబ్బూరి గోపాలకృష్ణ సాహిత్య సంకలనం అబ్బూరి రామకృష్ణారావు (1896-1979) ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది. ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో ప్రతిబింబిస్తవి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలు నడిపించడమే కాకుండా, స్వకపోలకల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన పద్యాలలో ఒక్క పలుకు పట్టి చూచినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది. నదీసుందరి, మల్లికాంబ వంటి వీరి కావ్యాలు తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధం. వారి జీవితం, సాహిత్యాల గురించిన విశ్లేషణతో సాగే వ్యాసాల సంకలనమిది, సోమరాజు సుశీల, బూదరాజు రాధాకృష్ణ, పన్నూరి రామారావు, తొగర్రాతి హనూరావు సంపాదకసభ్యులుగా ఉన్నారు. 2020120000029 1988 అభయ ప్రదానం [41] పుట్టపర్తి నారాయణాచార్యులు చారిత్రిక నవల రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే సంస్కృతంలో రచించాడు. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని సంగీత సాహిత్యాల సమ్మేళనంగా రచించిన చారిత్రిక గ్రంథమిది. ప్రముఖ రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ గ్రంథాన్ని రచించారు. 2990100071208 డిజిటల్ ప్రతిలో కాలం లేదు అభయముద్ర [42] పన్యాల రంగనాథరావు కవితా సంపుటి పన్యాల రంగనాథరావు పూర్వం ఢిల్లీ ఆకాశవాణిలో పనిచేసినవారు. కథకుడు, నాటకరచయిత. ఆయన రాసిన ఈ కవితాసంకలనానికి పాశ్చాత్య భాషల పండితుడు, సాహిత్యకారుడు పురిపండా అప్పలస్వామి ముందుమాట వ్రాశారు. 2020010003724 1960 అభాగిని [43] అనువాదం: శివం కథల సంపుటి, అనువాద సాహిత్యం శైలజానందముఖర్జీ, తారాశంకర్ బందోపాధ్యాయ్, అనాథ శంకరరాయ్ అనే ముగ్గురు ప్రఖ్యాత బెంగాలీ రచయితలు వ్రాసిన కథలను అనువదించి ఈ సంకలనంగా ప్రచురించారు. 2020010003720 1960 అభాగ్యోపాఖ్యానము [44] కందుకూరి వీరేశలింగం హాస్య ప్రబంధము కందుకూరి వీరేశలింగం బ్రహ్మసామాజికుడు, సుప్రసిద్ధ సంస్కర్త, సాహిత్యకారుడు. ఆయన సాహిత్యమంతా సంస్కరణ దృష్టితో, పాశ్చాత్య పోకడలతో చేశారు. వాటిలో ఇది ఒకటి. 2020120028794 1898 అభిజ్ఞాన జయదేవ [45] రాప్తాటి సుబ్బదాసు నాటకం సంస్కృతకవి, గీతగోవిందకర్త జయదేవుడి జీవితాన్ని నాటకంగా వ్రాసిన గ్రంథమిది. రచయిత దీనిని సురభి నాటక ప్రదర్శనల కోసం వ్రాశారు. 2020010002610 1936 అభిజ్ఞాన మణిమంత నాటకం [46] ధర్మవరం కృష్ణమాచార్యులు నాటకం ధర్మవరం కృష్ణమాచార్యులు ఆధునిక ఆంధ్ర నాటకానికి పితామహునిగా ప్రసిద్ధికెక్కిన వ్యక్తి. ప్రాచీన భారతీయ నాటక సంప్రదాయాల్లో ఆది, మధ్యాంతాలు మంగళకరంగానే ఉండాలనీ, రంగస్థలంపైన మరణాన్ని ప్రదర్శించకూడదనీ నియతులు ఉండేవి. ఆధునిక యుగారంభంతో వచ్చిన మార్పుల వల్ల నాటకకర్తలు ఆ నియమాలను కాదని విషాదాంతాలు, మృత్యుప్రదర్శనలు చేశారు. క్రమంగా ప్రేక్షకులు కూడా మారి వాటిని ఆమోదించారు. అలా ఆ నియమాన్ని ధిక్కరించిన తొలి విషాదాంత నాటకాల్లో ఇదీ ఒకటి. కృష్ణమాచార్యులు ఈ నాటకాన్ని 1915లో తొలి ముద్రణ పొందినప్పుడు మనసు ఒప్పకున్నా సంఘానికీ, సంప్రదాయానికీ భయపడి మంగళాంతం చేశారు. ఐతే విషాద సారంగధర నాటకం విషాదాంతము కావడమూ, ఎన్నో ప్రదర్శనలకు నోచి చివరకు ఆరో ముద్రణ వెలుగు చూడడమూ గమనించిన ఆచార్యులవారు మూడో ముద్రణ(1929) నాటికి ధైర్యం వహించి తమ అభిజ్ఞాన మణిమంత నాటకాన్ని కూడా విషాదాంతంగా మార్పు చేశారు. అలాగే చిత్రనళినీయమనే మరో నాటకమూ బలవంతం మీద మోదాంతం చేయవలసివచ్చిందనీ, మరో ముద్రణ పొందితే తప్పక ఖేదాంతం చేస్తాననీ ఈ నాటక పీఠికలో రాశారు. 2030020025133 1929 అభిజ్ఞాన శాకుంతలము [47] మూలం.కాళిదాసు, అనువాదం.వీరేశలింగం నాటకం, అనువాదం అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. ఆ నాటకానికి వీరేశలింగం చేసిన అనువాదమిది. 2030020025004 1931 అభిజ్ఞాన శాకుంతలము [48] సంస్కృత మూలం: కాళిదాసు, అనువాదం: రాంభట్ల లక్ష్మీనారాయణశాస్త్రి పద్య ప్రబంధం అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. ఆ నాటకానికి పద్యరూపంలోని అనువాదం ఇది. 6020010033928 వివరాలు లేవు అభిభాషణము [49] డి.గోపాలాచార్య ఆయుర్వేదం, ఉపన్యాసం అఖిలభారతాయుర్వేద విద్యాపీఠానికి అప్పటి అధ్యక్షులు, వైద్యరత్న బిరుదుపొందిన పండితులు డి.గోపాలాచార్యులు ఎనిమిదవ అఖిల భారత ఆయుర్వేద మహాసమ్మేళనానికి అనుబంధమైన ఆయుర్వేద మహావస్తుప్రదర్శనంలో పుణెలో 1917 ఫిబ్రవరి 25లో ఇచ్చిన అధ్యక్షోపన్యాసం ఈ గ్రంథంగా వెలువరించారు. 2020120006993 1922 అభినవ ఉత్తర గోధానాపహరణము [50] రావి అచ్చయ్యనాయుడు ఆధ్యాత్మిక సాహిత్యం విరాట పర్వానికి చెందిన ఉత్తరగోగ్రహణం, నర్తనశాల వంటి ఇతివృత్తాలు పండితపామర రంజకంగా నిలిచాయి. ముఖ్యంగా దృశ్యరూపకమైన కావ్యాలలో వీటి ప్రాబల్యం ఎక్కువ. తెలుగునాట నాటకాలు, సినిమాలు వంటివి ఈ ఇతివృత్తం ఆధారంగా తయారయ్యాయి. అభినవ ఉత్తర గోధనాపహరణము ఆ ఇతివృత్తంతో వ్రాసిన నాటకమే. 2020010002758 1930 అభినవ కుమతి శతకము [51] గాజులపల్లి వీరభద్రరావు శతకం అభినవ కుమతీ శతకం నీతి బోధించే కంద పద్యాల శతకం. పిల్లలకు నీతిని బోధించేందుకు ఈ గ్రంథాన్ని రచించారు. 2020050016529 1926 అభినవ భారతము [52] మతుకుమిల్లి మాదయమంత్రి సాహిత్యం ఆరువేల నియోగి కులస్థుడు, పెదపమిడి, చినపమిడి వంటి గ్రామాల్లోని భల్లేరాయణిం వారి సంస్థానంలో మంత్రులుగా పనిచేసిన మతుకుమిల్లి వంశోద్భవుడూ అయిన మతుకుమిల్లి మాదయమంత్రి వ్రాసిన గ్రంథమిది. కావ్యంతోపాటుగా మొదట్లో కావ్యకర్త మతుకుమిల్లి మాదయమంత్రి పూర్వులైన ప్రసిద్ధులున్న వంశవృక్షాన్నీ, వారి వంశఖ్యాతిని వివరించే వ్యాసాన్నీ, పూర్వుల్లో ప్రఖ్యాతుని గురించిన వ్యాసం, వారి కులమైన నియోగి బ్రాహ్మణుల గురించిన వ్యాసం, కావ్యాన్ని గురించిన వ్యాసంతో సహా ప్రచురించారు. 2990100071210 1924 అభినవ తిక్కన సన్మాన సంచిక [53] అభినవ తిక్కన సన్మాన సంఘం సాహిత్యం తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అనికట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. ఆయన సన్మాన సంచిక ఇది. 2020050002659 1942 అభినవ బాలనీతికథా సప్తతి: [54] ఎన్.స్వామినాథ శాస్త్రి నీతి కథా సాహిత్యం పిల్లలకు సంస్కృతభాషను బోధించేందుకు ఉపకరించేలా ఈ కథలను రచయిత వ్రాశారు. వీటిని పిల్లలకు పాఠ్యగ్రంథంగా పూర్వం ఉపయోగించేవారు. సంస్కృతభాషను తెలుగులిపిలో వ్రాసే తెలుగు పండితుల అలవాటుకు ఇదొక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. 2030020024530 1923 అభినవషడశీతి [55] చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ధర్మశాస్త్రం అభినవ షడశీతి గ్రంథం అశౌచ ధర్మనిర్ణయ శాస్త్రగ్రంథం. ఈ గ్రంథంలో అశౌచస్వరూప నిర్ణయం, అశౌచవిశేష స్వరూప నిరూపణం, స్రావాశౌచము, పాతాశౌచము, ప్రసవాశౌచము వంటివన్నీ వ్రాశారు. 5010010004338 1936 అభినవ సరస్వతి [56] వివరాలు లేవు ఆధ్యాత్మిక పత్రిక అభినవ సరస్వతి అప్పటి సనాతన భావజాలంతో ఏర్పడిన పత్రిక. హిందూసంఘంపై ప్రభుత్వం, సంస్కర్తలు సంస్కరణలు చేస్తున్న కాలంలో వాటికి వ్యతిరేకంగా వ్యాసాలు, వార్తలు వ్రాశారు. ఈ సంచికలో గోదావరి మండల వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ మహాసభ వంటివాటి గురించిన వార్తలు, పూర్వాచార రక్షణగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. 2990130066772 1929 అభినవ సరస్వతి [57] వివరాలు లేవు ఆధ్యాత్మిక పత్రిక అభినవ సరస్వతి అప్పటి సనాతన భావజాలంతో ఏర్పడిన పత్రిక. హిందూసంఘంపై ప్రభుత్వం, సంస్కర్తలు సంస్కరణలు చేస్తున్న కాలంలో వాటికి వ్యతిరేకంగా వ్యాసాలు, వార్తలు వ్రాశారు. పుస్తక పరిచయాలు, వార్తలు, వ్యాసాలు, పల్నాటి వీరభారతం వంటి గ్రంథాలు ప్రచురితమైనాయి. 2990130066773 1931 అభినవ శాకుంతలము [58] ఘంటంభట్లగారి వెంకటభుజంగకవి సాహిత్యం కాళిదాస విరచితమైన అభిజ్ఞాన శాకుంతల నాటకం భారతీయ సాహిత్యంలోనే కాక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ముఖ్యమైన రచనల్లో ఒకటి. అటువంటి నాటకం తెలుగులో పలువురు కవులకు స్ఫూర్తిగా నిలిచి ఎన్నో కావ్యాలు, నాటకాల రచనకు కారణమైంది. ఈ నాటకమూ ఆ స్ఫూర్తితో రచించిందే. దీనికి అభినవసరస్వతి పత్రికా సంపాదకుడైన జానపాటి పట్టాభిరామశాస్త్రి పరిష్కర్తగా వ్యవహరించారు. 2020050015611 1926 అభినవ హరిశ్చంద్రీయము [59] మేడూరి హనుమయ్య నాటకం హరిశ్చంద్రుని కథ భారతీయ సాహిత్యంలో సుప్రసిద్ధి పొందినది. సత్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి, కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు భారతీయుల స్ఫూర్తిదాతల్లో ఒకరు. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకున్న నాటకం ఇది. 2020050015069 1924 అభినవాంధ్ర బిల్హణీయము [60] రాయరె ద్విపద కావ్యం బిల్హణీయం సంస్కృత కావ్యాల్లో సుప్రసిద్ధమైనది. దానిని అనుసరించి ద్విపద పద్యాల్లో వ్రాసిన కావ్యమిది. 2020120003764 1992 అభినవాంధ్ర వాసవదత్త [61] ఉప్పల నరసింహశర్మ సాహిత్యం స్వప్న వాసవ దత్త సంస్కృత కావ్యాల్లో సుప్రసిద్ధి పొందినది. దానిని అనుసరించి ఈ కావ్యంగా ఉప్పల నరసింహశర్మ తెలుుగలోకి అనువదించారు. 2020010002537 1929 అభినయం [62] శ్రీనివాస చక్రవర్తి నాటక లక్షణ గ్రంథం తెలుగు నాటక రంగ ప్రముఖుడు శ్రీనివాసచక్రవర్తి అభినయాన్ని గురించి వ్రాసిన లక్షణ గ్రంథమిది. 2030020024731 1956 అభినయ దర్పణము [63] నందికేశ్వరుడు నాట్య శాస్త్రం, నాటక రంగం రెండు వేల యేళ్ళకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గ్రంథం నందికేశుని అభినయ దర్పణం. ఇది ప్రాచీన కాలం నుంచి నటన, నాట్యం అనే కళలపై తన ప్రభావాన్ని చూపుతోంది. నాట్యాన్ని గురించి తెలుసుకోగోరే పాఠకులకు ఇది చాలా ఉపకరించే గ్రంథం. వావిళ్ళ వారు ఈ గ్రంథాన్ని తెలుగు తాత్పర్యాల సహితంగా ప్రచురించారు. 2030020025491 1934 అభినయ దర్పణము [64] రచన.మాతృభూతయ్య కవి, సంపాదకత్వం. టి.వి.సుబ్బారావు నాట్యశాస్త్రము, లక్షణ గ్రంథం అభినయ దర్పణము తెలుగులో చందోరూపంగా రచించిన నాట్య లక్షణగ్రంథం. సంస్కృత అభినయ దర్పణాన్ని అనుసరించినా చాలా భేదాలతో స్వతంత్రించి సాగింది. పైగా దీన్ని కవి లక్షణ గ్రంథం కావడానికి లోపం లేకుండానే ప్రబంధంగా మలచడం విశేషం. సంగీత విశారదుడైన టి.వి.సుబ్బారావు సంపాదకత్వం వహించారు. 2030020025396 1951 అభినందన చంద్రిక [65] ముళ్ళపూడి తిమ్మరాజు షష్టిపూర్తి సంచిక ముళ్ళపూడి తిమ్మరాజు తణుకు ప్రాంతంవారు. ఆయన పోషకునిగా, ప్రచురణకర్తగా, దాతగా తెలుగు సారస్వతాన్ని పరిపోషించారు. తెలుగు సాహిత్యంలో రచయితలు, ప్రచురణకర్తలు వంటివారితోపాటుగా దానిని పోషిస్తూ దాతలుగా, పోషకులుగా ప్రఖ్యాతిపొందినవారూ ఉన్నారు. వీరు వారిలో ఒకరు. ఇది ఆయన షష్టిపూర్తి సంచిక. 2990100071209 వివరాలు లేవు అభిసారిక (ఏప్రిల్, మే నెలల సంచిక, 1977) [66] డి.రాంషా మాస పత్రిక అభిసారిక అనే ఈ పత్రిక శృంగార విజ్ఞానానికి సంబంధించింది. వయోజన శృంగారానికి సంబంధించిన పలు విషయాలు ఇందులో ఉన్నాయి. 2020120012534 1977 అభీనవ భర్తృహరి [67] భాగవతుల నృశింహశర్మ నీతి గ్రంథం ముదిగొండ నాగలింగశాస్త్రి సుభాషితాలు మూడు సంపుటాలుగా సంస్కృతంలో రచించగా వాటిని భాగవతుల నృశింహశర్మ అభినవ భర్తృహరి పేరిట తెలుగులోకి అనువదించారు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత రత్నావళి భారత సంస్కృతిలో సుప్రఖ్యాతం. కాగా ఏ కవి రాసిన గ్రంథాన్ని ఆ కవి పేరుమీదే వ్యవహరించడం సంస్కృత విద్యార్థుల వాడుక. ఈ నేపథ్యంలోనే సుభాషితాలకు భర్తృహరికీ అభేదంగా భావించి ఆ భర్తృహరి రచనలకు వలెనే రాసిన సుభాషితాలను అభినవ భర్తృహరి అని పేరుపెట్టారు. 2020120012536 1924 అభ్యుదయం [68] కొలకులూరి ఇనాక్ నాటికల సంపుటి కొలకలూరి ఇనాక్ ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకుడు. సాహిత్యవిమర్శకు గాను ఇటీవల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న విశిష్ట రచయిత. ఆయన వ్రాసిన నాటికల సంపుటి ఇది. 2020120028798 1985 అభ్యుదయం [69] శ్రీ భరద్వాజ నాటకం అభ్యుదయ కథాంశంతో వ్రాసిన ఈ నాటకాన్ని రచయిత మహాత్మా గాంధీకి అంకితం చేశారు. 2020010002596 1959 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు [70] పేర్వారం జగన్నాధం వ్యాస సంకలనం పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో 1934 సెప్టెంబరు 23 న జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగంలో ఆచార్యుడిగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశాడు.2008 సెప్టెంబరు 29 న వరంగల్ లో మరణించాడు. ఆయన వ్రాసిన సాహిత్య విమర్శ రచన ఇది. 2020120000031 1987 అన్నపూర్ణాదేవి లేఖలు [71] మాగంటి అన్నపూర్ణాదేవి లేఖలు మాగంటి అన్నపూర్ణాదేవి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వనిత, సమాజ సేవిక, రచయిత్రి. తన 27వ యేటనే మరణించిన ఈమె అప్పటికే భారత స్వాతంత్ర్య పోరాటంలోప్రముఖమైన పాత్ర నిర్వహించి మహాత్మా గాంధీ మన్ననలు పొందింది. ఈమె భర్త మాగంటి బాపినీడు దక్షిణాదిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులలో ఒకడు. ఇది ఆమె లేఖాసాహిత్యం. 2020050005825 1933 అనాది అనంతం [72] మూలం.అద్య రంగాచార్య, అనువాదం.కె.సుబ్బరామప్ప నవల, సాంఘిక నవల, అనువాదం అనాది అనంతం పుస్తకం ప్రముఖ కన్నడ రచయిత అద్య రంగాచార్య రచించిన కన్నడ నవలకు తెలుగు అనువాదం. అనాది అనంతం నవలకు అద్య రంగాచార్య కన్నడ నవల అనాది అనంత మూల గ్రంథం. 1959లో రచించిన అనాది అనంత అద్య రంగాచార్య 8వ నవల. ఈ నవలను కె.సుబ్బరామప్ప తెలుగులోకి అనువదించగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. తెలుగు అనువాదం తొలి ముద్రణ 1978లో జరుగగా, 1990లో రెండవ ముద్రణ పొందింది. ఈ నవల అనాది అనే మొదటిభాగం, అనంతం అనే రెండవభాగాల సమాహారం. 99999990129029 1978 అన్వేషణ-విశ్వనాథ, జాషువా శతజయంతి సంచిక [73] సంపాదకుడు.యార్లగడ్డ బాలగంగాధరరావు సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర, పత్రిక విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలోనే వలసవాదాన్ని ఎదిరించినవారు. గుర్రం జాషువా అదే కాలంలో కుల వివక్షపై పోరాటం చేసినవారు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి సౌజన్యం ఉండేది. సిద్ధాంతాల హోరులో పలువురు లేని వివాదాలు ప్రచారం చేసినా వారి మధ్య స్నేహం చెదరనిది. వారిద్దరూ 1895లో జన్మించినవారే. 1995లో నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు ప్రాచ్య పరిశోధన విభాగం వారిద్దరి శతజయంతిని పలువురు సాహిత్యవేత్తల ప్రసంగాలతో నిర్వహించి. వాటన్నిటినీ విభాగపు పత్రిక అన్వేషణ ప్రత్యేక సంచికలో ప్రకటించింది. 2990100061481 1995 అన్వేషణ అనుభూతి [74] మోపిదేవి కృష్ణస్వామి ఆత్మకథ అన్వేషణ అనుభూతి అనే ఈ గ్రంథం ఆత్మకథాత్మకమైనది. 2020120028922 1982 నామలింగానుశాసనమను అమరకోశము [75] అమరసింహుడు నిఘంటువు అమరకోశం సంస్కృతభాషలో ప్రసిద్ధి పొందిన నిఘంటువు. ఈ నిఘంటువులో సంస్కృతంలోని సంబంధిత పదాలను తేలిగ్గా గుర్తుపెట్టుకునేందుకు శ్లోకాలుగా ఇచ్చారు. సంస్కృతభాషను నేర్చే ప్రతి విద్యార్థి అమరం చదువుకునేవారు. 2990100028387 1951 అమరావతి మాహాత్మ్యము [76] మల్లాది అనంతరామయ్య పద్యకావ్యము గుంటూరు జిల్లాలోని అమరావతి నగరంలోని అమరేశ్వరాలయము ఏర్పడిన కథను వివరించు చిన్ని పొత్తము 2020050018816 1914 అమరు కావ్యము [77] సంస్కృత వ్యాఖ్య.వేమ భూపాలుడు, ఆంధ్రవ్యాఖ్య. వేదము వేంకటరాయశాస్త్రి సంస్కృత కావ్యము, వ్యాఖ్య ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని స్థిరపరిచేందుకు దేశమంతటా వివిధ సిద్ధాంత వేత్తలతో వాదనలు చేసి దిగ్విజయాన్ని పొందుతూండగా ఉభయభారతి అన్న మహావేత్త, మండనమిశ్రుని భార్య ఆ సిద్ధాంతానికి సంసారులు కూడా అంగీకరించాలి కనుక తనతో శృంగారపరమైన అంశాలలో కూడా వాదించి నిరూపించమని సవాలుచేసింది. శంకరులు ఆజన్మ బ్రహ్మచారి, సర్వసంగ పరిత్యాగి, సన్యాసి. ఆయన అనుభవించని, ఆమెకు సంసారిగా అనుభవం ఉన్న శృంగార శాస్త్ర పరంగా చర్చించాలంటే తనకు శృంగారానుభవం కావాలి. సన్యాసం స్వీకరించిన వాడు కావడంతో ఆ శరీరంతో అనుభవించరాదు. అమరుకుడన్న మహారాజు మృతకళేబరం అడవిలో కనిపించడంతో శంకరుడు తన శరీరాన్ని యోగశక్తి ద్వారా వదిలి శిష్యులను కాపాలా ఉంచి, రాజు శరీరంలో ప్రవేశిస్తాడు. రాజు శరీరంతో ఆయన రాణులను ధర్మబద్ధంగా, అద్భుతమైన రీతుల్లో అనుభవిస్తూ కామశాస్త్రాంతర్గతమైన సమస్త రహస్యాలు తెలుసుకుంటాడు శంకరుడు. రాణి ఎవరో మహనీయుడు రాజు శరీరంతో వర్తిస్తున్నాడని ఊహించి ఆయనను శాశ్వతంగా రాజు శరీరంలో నిలుపుకునేందుకు రాజ్యంలో జంతు, మానుష కళేబరాలేవైనా పడివుంటే దహనం చేయాలని సైనికులను ఆదేశించింది. ఆ ఆదేశానుసారం జంతువుల దేహాలు తగులపెడుతూ శిష్యుల వద్దనున్న శంకరుని దేహమూ దహనం చేసే ప్రయత్నం చేస్తారు. ఆపైన ఏం జరిగిందన్నది మిగిలిన కథ. (రచనాకాలం 8-9 శతాబ్దాలు) 2030020025271 1950 అమర గౌరవము [78] మోచర్ల రామకృష్ణయ్య స్మృతి కావ్యం ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ఆయన స్మృతి కావ్యం ఇది. 2020010003926 1953 అమరజీవి పొట్టిశ్రీరాములు జీవిత చరిత్ర [79] బాదం శ్రీరాములు జీవిత చరిత్ర ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ఆయన జీవిత చరిత్ర ఇది. 2990100067409 1992 అమరసింహుడు [80] బేతపూడి వెంకట శివరావు జీవితచరిత్ర రాజస్థాన్‌లో పౌరుష ప్రతాపాలకు ప్రఖ్యాతి వహించిన మేవాడ్ రాజ్యానికి చెందిన రాజు రాణా అమరసింహ్ జీవితగాథను, ఆయన కాలంలోని స్థితిగతులను ఈ పుస్తకంలో వివరించారు. తన పూర్వీకుడైన రాణా ప్రతాప్‌సింగ్ వలెనే బలవత్తరమైన మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్‌ను ఎదిరించి తన సార్వభౌమాధికారం నిలుపుకునేందుకు పోరాడిన రాజు వీరగాథ ఇది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో నాటి ఉన్నత పాఠశాల విద్యలో భాగంగా బోధించేందుకు ఈ పుస్తకాన్ని రాశారు. 2020050016624 1952 అమ్మ [81] మూలం.మాగ్సిం గోర్కీ, అనువాదం.క్రొవ్విడి లింగరాజు నవల, అనువాదం ప్రపంచప్రఖ్యాతి పొందిన నవలలో మాగ్సిం గోర్కీ రష్యన్ భాషలో రచించిన అమ్మ ఒకటి. ఈ రచన 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల కోట్ల ప్రతులు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగునాట కూడా దాని ప్రభావం అమోఘమైంది. అమ్మ అనే మాటలో కొంతమంది సెంటిమెంటు చూస్తుంటారు గాని వాస్తవంలో అమ్మ అనేదే ఏ సెంటిమెంటూ లేని వాస్తవం. మానవాళి అస్తిత్వానికి ఆరంభ వాచకం అమ్మే. అన్ని బాధలూ, గాథలకు ప్రథమ ప్రత్యక్ష సాక్షి అమ్మే. వాస్తవానికి అమ్మ పాత సమాజానికి ప్రతీక. దాని క్రమానుగత చైతన్య పతాక. 'అమ్మ' పుస్తకంలోని ప్రతి పాత్రా, ప్రతి పరిణామం రచయిత మగ్జీమ్ గోర్కీ వాస్తవ జీవితంలో పరిశీలించి తెలుసుకున్నదే. 1905లో రష్యాలో తొలి విప్లవం పొడసూపింది. దాన్ని జార్ చక్రవర్తి దారుణంగా అణచివేశాడు. ఆ విప్లవమే అక్టోబరు విప్లవ విజయానికి స్ఫూర్తి. ఆ తొలి విప్లవం నుంచి వెలువడ్డ మూడు అపురూపమైన నవలల్లో గోర్కీ అమ్మ కూడా ఒకటి. ఇది తెలుగులో అమ్మ నవలకు వచ్చిన తొలినాటి అనువాదాల్లో ఒకటి. 2020120004242 1956 అమ్మవారి దండకం [82] గుండు జగన్నాథం భక్తిసాహిత్యం దానవసంహారం చేసి ధర్మస్థాపన చేసిన అమ్మవారి దండకం. 2020050018612 1922 అమృత కణములు [83] సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి పద్య కావ్యం సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (జ: 1897 - 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు. సికిందరాబాదుకు చెందిన సూర్యనారాయణశాస్త్రి రాసిన అమృతకణములు అనే పద్యకావ్యమిది. 2020120033986 1942 అమృత నేత్రాలు [84] ఆచార్య తిరుమల కవితా సంపుటి పలు పురస్కారాలు గ్రహించి, అనేక సాంస్కృతిక, సాహిత్య సంస్థలకు సలహాదారుగా వ్యవహరించిన ఆచార్య తిరుమల వ్రాసిన కవితల సంపుటి ఈ అమృత నేత్రాలు. 2990100071221 1987 అమృత మార్గము [85] మోక్షానందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం ఈ గ్రంథంలో అరవిందుల సృష్టి పరిణామక్రమాన్ని, తంత్రం గురించిన కొన్ని విషయాలను లోతుగా చర్చించారు. 2020120033984 1977 అమృత లహరీ [86] సుబ్బావధాని సాహిత్యం వ్యాఖ్యాసహితంగా దంటు సుబ్బావధాని వ్రాసిన అమృతలహరి గ్రంథం ఇది. శ్రీతిరుమల శ్రీనివాస త్రిలింగ మహావిద్యాపీఠానికి ఆయన అధిపతి, అదే విద్యాపీఠం వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 2020120019641 వివరాలు లేవు అమృత వాహిని-1 [87] ప్రకాశకులు: మాడపాటి హనుమంతరావు
సూక్తులు అమృతవాహిని అనే పేర ప్రచురించిన ఈ పుస్తకంలో 500మంది మహాపురుషుల సూక్తులు, వ్యాఖ్యలు ఉన్నాయి. నల్లగొండకు చెందిన సర్వోదయ ఆశ్రమము వారు దీనిని ప్రచురించారు. దేశవిదేశాలకు, వివిధ భాషలకు, పలు శతాబ్దాలకు చెందిన మహారాజులు, మహర్షులు, ఆలోచనపరులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు వంటివారి సూక్తులు ఇందులో లభ్యం. 2020120033985 1959 అమృత వాహిని-2 [88] ప్రకాశకులు: మాడపాటి హనుమంతరావు సూక్తులు అమృతవాహిని మొదటి సంచికలో 500మంది మహాపురుషుల సూక్తులు ప్రచురించగా మరింతమంది మహనీయుల సూక్తులతో ఈ గ్రంథాన్ని తిరిగి సర్వోదయ ఆశ్రమము వారు ప్రచురించారు. 2020120007001 1959 అమృత వాహిని-మొదటి భాగము [89] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీపావతల్లి ముత్తీవి సీతారాం సంపాదకత్వంలో కాకినాడ యతీంద్ర ప్రచురణలు ప్రచురణలో వెలువడ్డ ఆధ్యాత్మిక గ్రంథం ఇది. పుస్తకంలో శ్రీమద్భగవద్గీత గురించిన పలు ఆధ్యాత్మిక విశేషాలున్నాయి. 2040100028389 1982 అమృత వాహిని-రెండవ భాగము [90] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీమద్భగవద్గీతకు సంబంధించిన పలు విశేషాలతో వెలువడ్డ ఈ ద్వితీయ లహరిని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్యాత్మిక గ్రంథాలకు ఇచ్చే రాయితీపై ప్రచురించారు. 2040100028390 1982 అమృత వాహిని-మూడవ భాగము [91] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీమద్భగవద్గీతకు సంబంధించిన పలు యోగాలకు సంబంధించిన విశేషాలతో ఈ తృతీయ లహరిని ప్రచురించారు. తితిదే ఆధ్యాత్మిక గ్రంథాలకు ఇచ్చే ప్రత్యేక రాయితీపై ప్రచురించారు. 2040100028391 1982 అమృత వాహిని-నాల్గవ భాగము [92] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీమద్భగవద్గీతలోని జ్ఞానయోగానికి సంబంధించిన భాగానికి వ్రాసిన అమృత వాహిని వ్యాఖ్యానంతో ఈ చతుర్థ లహరిని ప్రచురించారు. తితిదే ఆధ్యాత్మిక గ్రంథాలకిచ్చే రాయితీపై ఇది ప్రచురితమైంది. 2040100028392 1982 అమృత వాహిని-ఐదవ భాగము [93] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీమద్భగవద్గీతలోని కర్మసన్న్యాసయోగానికి సంబంధించిన భాగానికి వ్రాసిన అమృతవాహిని వ్యాఖ్యానసహితంగా ఈ పంచమ లహరి ప్రచురితమైంది. తితిదే ఆధ్యాత్మిక గ్రంథాలకు ఇచ్చే రాయితీపై ఈ గ్రంథం ప్రచురితమైంది. 2040100028393 1982 అమృత వాహిని-ఏడవ భాగము [94] పావతల్లిముత్తీవ సీతారాం ఆధ్యాత్మిక సాహిత్యం శ్రీమద్భగవద్గీతలోని ఆత్మసంయమయోగానికి సంబంధించిన భాగానికి వ్రాసిన అమృతవాహిని వ్యాఖ్యానసహితంగా ఈ లహరి ప్రచురితమైంది. తితిదేవస్థానాలు ఆధ్యాత్మిక గ్రంథాలకు ఇచ్చే రాయితీపై ఈ గ్రంథం ప్రచురితమైంది. 2040100028394 1982 అమృత హరణము [95] కొలచెల కృష్ణసోమయాజి నాటకం గుంటూరుకు చెందిన మిత్రమండలి ఈ నాటకాన్ని ప్రచురించారు. ఈ నాటకాన్ని మహాభారతానికి చెందిన అమృతహరణం అనే కథాంశంతో రచించారు. 2020120033983 వివరాలు లేవు అమృతాభిషేకము [96] దాశరథి ఖండ కావ్యం తెలంగాణా సాయుధ పోరాటయోధుడు, ప్రముఖ కవి, సినిమా రచయిత దాశరథి కృష్ణమాచార్యుల సుప్రసిద్ధమైన రచన ఈ అమృతాభిషేకము. ఇది ఆయన వ్రాసిన ఖండకావ్యము. 1959లో ప్రచురించారు. ఈ గ్రంథాన్ని ప్రముఖ రాజకీయ నాయకులు, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డి గారికి దాశరథి అంకితమిచ్చారు. 2020010003927 1959 అరగడియ [97] మూలం.పరప్పురత్తు, అనువాదం.మల్లాది మంగతాయారు నవల, అనువాదం, సాంఘిక నవల కేరళలో స్వాతంత్ర్యానికి పూర్వం రాజ్యమైన తిరువాన్కూరు రాజ్యంలో ఒక క్రైస్తవుని జీవిత గాథగా ఈ నవల రచించారు. పరప్పురత్తు మలయాళ భాషలో రచించిన ఈ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా అనువదింపజేసి ప్రచురించింది. 99999990128951 1980 అరుణా ఆసిఫాలీ [98] ఏడిద కామేశ్వరరావు జీవిత చరిత్ర భారత జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళా నేతల్లో అరుణా ఆసిఫ్ ఆలీ ముఖ్యురాలు. సంప్రదాయ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన అరుణ మిషనరీ పాఠశాలలోని బోధల వల్ల మొదట దేశాచారాల పట్ల వ్యతిరేకత చూపినా అనంతరకాలంలో తల్లి ప్రోద్బలంతో హిందూ ఆచారాల్లోని ఔన్నత్యం, భారతదేశం గొప్పదనం తెలుసుకున్నారు. మోతీలాల్ నెహ్రూ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల అరుణ దేశ జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆపైన ముస్లిం లీగ్ నాయకుడైన ఆసిఫ్ అలీని మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అరుణ క్రియాశీలంగా పనిచేసి నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా బొంబాయిలోని గోవాలియా టాంక్ మైదాన ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఘటన ద్వారా ఆమె ప్రసిద్ధిచెందారు. ఈ గ్రంథం ఆమె జీవిత చరిత్ర. 5010010032007 1942(సంవత్సరం సందేహాస్పదం) అరుణాచల స్తుతి పంచకము [99] అనువాదం.గిద్దలూరి నరసింగరావు స్థల మహాత్మ్యం, పద్య కావ్యం అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వాసిస్తున్నారు. ఈ గ్రంథం అరుణాచలం మహాత్మ్యాన్ని రచించారు. 2030020025263 1936 అరుంధతీ వసిష్ఠము [100] బులుసు వెంకటేశ్వర్లు పద్య కావ్యము అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి. ఆ పుణ్యదంపతుల చరిత్రము ఈ కావ్యంగా రూపకల్పన చేశారు. 2030020024930 1953 అష్టాదశ పురాణ సార సంగ్రహము-మూడవ భాగం [101] వేమూరి జగన్నాథశర్మ పురాణం, ఆధ్యాత్మికం అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ గ్రంథంలో పురాణాలను వచనానువాదంలో అందించారు. 2030020024504 1926 అష్టాదశ రహస్యములు [102] పిర్లై లోకాచార్యులు ఆధ్యాత్మికం, మతం ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన మత గ్రంథము. 1990020047603 వివరాలు లేవు అర్జున ప్రతిజ్ఞ [103] చందాల మల్లయ్య వచన కావ్యం కుంతీదేవి వ్రతమాచరించినప్పుడు చిన్నతనంలోనే పట్టుదలతో అర్జునుడు ఐరావతాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చినాడని మహాభారత కథనం. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ కావ్యం రచయిత రాశారు. ఐతే వచన కావ్యంగా పేర్కొన్న ఈ ప్రక్రియ ఆధునిక ప్రక్రియలైన పెద్ద కథ, నవలిక, నవలలో ఏదో ఒకదాని కిందికి వస్తుంది. 2030020025174 1927 అలంకార తత్త్వ విచారము [104] కురుగంటి సీతారామయ్య సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం భారతీయ భాషల్లో సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి అలంకారశాస్త్రం విస్తారంగా అభివృద్ధి చెందింది. కావ్య ప్రయోజనం నుంచి ప్రారంభించి కావ్య రచనలో వివిధ శైలులు వంటివన్నీ చర్చకు వస్తాయి. ప్రాచీనాలంకారికులు కావ్యజగత్తుకూ, కవికీ, రసికునికీ నడుమ సంబంధాన్ని రకరకాలుగా విశ్లేషించారు. తెలుగు సాహిత్యం ఆధునిక యుగంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో నేటి విమర్శ రూపానికి చేరింది. ఐతే ఈ గ్రంథంలో ప్రాచీన పద్ధతిలోనే అలంకార శాస్త్ర రచన ద్వారా ఈ ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని విశ్లేషించారు. 2030020025467 1915 అలంకార చంద్రోదయం [105] ఇమ్మానేని శరభలింగ కవి కావ్యం ఇమ్మానేని శరభలింగకవి న్యాయవేత్తగా ఉద్యోగం చేస్తూనే స్వతాహాగా అబ్బిన సాహిత్యాభిలాష వల్ల కవిత్వరచన అలవడింది. ఆయన రచించిన ఈ కావ్యాన్ని కావ్యరచన అనంతరం శరభలింగ కవి కుమారుడు ఇమ్మానేని వీరేశలింగం అప్పటి ప్రముఖ కవి, శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిచే పరిష్కరింపజేసుకుని ప్రకటించారు. గ్రంథాదిలో క్లుప్తంగా కవి చరిత్ర కూడా లభిస్తోంది. 2030020024837 1906 అవయవ చింతామణి వ్యాఖ్య [106][dead link] రఘుదేవ వ్యాఖ్యానం, వ్రాతప్రతి ఇది వ్యాఖ్యానం. ఇది ఒక వ్రాతప్రతి. 1990030081872 అవిమారకము [107] మూలం.భాసుడు, అనువాదం.మానవల్లి రామకృష్ణ కవి నాటకం, సంస్కృత అనువాదం భాసో హాసః-భాసుడు (సరస్వతీదేవి) చిరునవ్వు అన్న చాటుశ్లోక భాగం సంస్కృత భాషాపండిత లోకంలో సుప్రసిద్ధం. భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, బాణుడు, భవభూతి మొదలైన అరుదైన మహాకవుల కోవలోని వాడు. ఆయన రచించిన ఊరు భంగం నాటకం దుర్యోధనుడి మరణంతో పూర్తయ్యే విషాదాంతం కావడం, రంగంపై మరణాన్ని చూపవలసిరావడంతో ఆనాటి నాటక సంప్రదాయాలకు ఎదురు నిలిచి గొప్ప సాహసంగా నిలిచిపోయింది. ఈ గ్రంథం ఆయన రచనల్లో బయట పడని రత్నం, తెలుగు సాహిత్యంలో గొప్ప సాహిత్యాలను వెలికి తెచ్చిన రామకృష్ణకవి దీన్ని కేరళీయుల నుంచి తీసుకువచ్చి తెనిగించారు. 2030020025107 1916 అశ్వ పరీక్ష [108] యేజెళ్ళ శ్రీరాములు జంతుశాస్త్రం గుర్రాలపై ప్రయాణాలు సాగించే రోజుల్లో అశ్వహృదయం తెలుసుకుని వర్తించడం, వాటి మంచిచెడులు తెలిసి ఎంచుకోవడం వంటివి నైపుణ్యం స్థాయి నుంచి శాస్త్రం వరకూ అభివృద్ధి చెందింది. అదే నేపథ్యంలో ఈ గ్రంథాన్ని అభినవ సహదేవ బిరుదు పొందిన యేజెళ్ళ శ్రీరాములు రచించారు. భారతీయ అశ్వవైద్యానికి ఆద్యునిగా పేరొందిన శాలిహోత్రుని నుంచి మొదలుకొని పారశీక అశ్వ వైద్యాభివృద్ధి వంటి చారిత్రికాంశములు, అనంతరం అశ్వశాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలతో ఈ గ్రంథాన్ని రూపకల్పన చేశారు. గుర్రాలకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 2990100067412 1943 అశ్వత్థామ అచ్చి [109] చిలుకూరి నారాయణరావు నాటకాలు, సాంఘిక నాటకం, పౌరాణిక నాటకం ఈ రెండు నాటకాల పుస్తకాన్ని ప్రధానంగా నాటక రంగంలోని సంస్కరణ, శాస్త్రవిరుద్ధమైనా రసభరితమైన రచనలు చేయవచ్చని నిరూపణ కోసం రచించారు. భారతీయ నాటక సంప్రదాయం, అలంకారిక శాస్త్రం అనుసరించి నాటకాలు మంగళంగా ప్రారంభమై, మంగళంగానే ముగియాలి. ఐతే పాశ్చాత్య నాటక ప్రభావం బలపడే కొద్దీ కాళిదాసాదుల మంగళాంతాలకు, షేక్స్‌పియర్ వంటి వారి విషాదాంతాలకూ మధ్య నాటకకర్తల్లో అంతస్సంఘర్షణ ప్రారంభమైంది. ఆధునిక యుగానికి చెందిన విషాద నాటకాలను ప్రారంభించేందుకు నాటక రంగం చాలా సంఘర్షణలకే లోనైంది. అలా సాగుతున్న క్రమంలో విషాదాంతాలను బలపరిచేందుకు అశ్వత్థామ రచించారు. మరో వైపు మహారాజుల ప్రణయాన్నే నాటకాలు చిత్రీకరించడాన్ని కూడా విభేదిస్తూ సామాన్యమైన రైతు కూలీల నడుమ ప్రణయాన్ని ఉద్దేశపూర్వకంగా లచ్చి నవలలో చిత్రించారు చిలుకూరి వారు. ఈ సంస్కరణలకు తోడు ఆనాడు ప్రబలంగా సాగుతున్న గ్రాంథిక వ్యవహారిక విభేదాల్లో వ్యవహారికాల పక్షాన నిలిచి వీటన్నిటినీ వ్యావహారికాలుగా మలిచారు. ఈ నాటకాలు తెలుగు నాటక సాహిత్యంలో ఆధునిక యుగావిర్భావంలోని ఘర్షణలకు చిహ్నాలు.ఇంకొక నకలు రూపకద్వయి అశ్వత్థామ అచ్చి, బార్ కోడ్ 02990100068678 [110] 2030020025065 1933 అశుతోష్ ముఖర్జీ [111] మూలం.ఎ.పి.దాసు గుప్త, అనువాదం.భమిడిపాటి రామగోపాలం జీవిత చరిత్ర అశుతోష్ ముఖర్జీ బెంగాలీ. ఆయన విశిష్ట విద్యావేత్త. కలకత్తా విశ్వవిద్యాలయానికి రెండవ భారతజాతీయుడైన వైస్-ఛాన్సలర్. అశుతోష్ నాలుగు సార్లు వరుసగా ఆ పదవి చేపట్టి విడిగా ఐదోసారి కూడా ఎన్నికయ్యారు. గొప్ప వ్యక్తిత్వం, ఉన్నతమైన ఆత్మ గౌరవం, ధైర్యం, అత్యున్నతమైన పరిపాలనా సామర్థ్యాలు మూర్తీభవించిన వ్యక్తి. ఆయన మ్యాథ్స్, విజ్ఞాన శాస్త్రం సబ్జెక్టుల్లో రెండు ఎం.ఎ.లు పొందారహీత ప్రతిష్ఠాత్మకమైన ప్రేమ్‌చంద్-రాయ్‌చంద్ ఉపకారవేతనానికి ఎంపికయ్యారు. ఆయన జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. 99999990129008 1986 అశోక చక్రవర్తి ధర్మశాసనములు [112] దేశభట్ల లక్ష్మీనరసింహము, చిలుకూరి వీరభద్రరావు చరిత్ర ప్రఖ్యాత భారత చక్రవర్తి అశోకుడు వేయించిన 26శాసనాల పాఠ్యాలతో పాటుగా వివరాలను ఇచ్చారు. దేశభట్ల లక్ష్మీనరసింహం వ్యాఖ్యానిస్తూ చేసిన ప్రసంగాలను ప్రఖ్యాత చారిత్రికుడు, రచయిత చిలుకూరి వీరభద్రరావు అనువదించి ప్రచురించారు. ఈ గ్రంథం ద్వారా అశోకుని పరిపాలన, ఆనాటి సాంఘిక, రాజకీయ స్థితిగతులు వంటివన్నీ తెలుసుకోవచ్చు. 2030020029691 1928 అశోకుని ఎర్రగుడి శిలాశాసనములు [113] రాయప్రోలు సుబ్రహ్మణ్యం చరిత్ర అశోకచక్రవర్తి వ్రాయించిన శాసనాలు తెలుగునాట ఎర్రగుడి-జొన్నగిరి నడుమ 1928లో దొరికింది. ఆపైన అది ఆంధ్రదేశంలో ప్రాచీనమైన భాష, లిపి వంటి విషయాలను వెలికితీసినట్టైంది. 1971లో రాష్ట్ర శాసనసభలో ఈ అంశం చర్చకు వచ్చి తెలుగు వారి పూర్వ భాషావైభవాలకు గుర్తైన ఈ శాసనాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించనున్నట్టు ఆనాటి రాష్ట్రమంత్రి ప్రకటించగా ఈ పుస్తకం తదనంతరం రూపుదిద్దుకుంది. 2990100071236 1975 అశౌచనిర్ణయదర్పణమ్ [114] చల్లాలక్ష్మీనరసింహశాస్త్రి సదాచారముల వివరణ అశౌచస్వరూపము, అశౌచప్రమాణము, మృతాశౌచము,జాతాశౌచము మొదలైన విషయములను యాజ్ఞవల్క్యస్మృతి ఆధారంగా శ్లోకము భావము ఇవ్వబడినవి. 2020050018835 1912 అశౌచ సర్వస్వము [115] వింజమూరి వేంకట నృశింహాచార్యులు ఆచారాలు, హిందూమతం జన్మించినప్పుడు, మరణించినప్పుడు సంబంధిత బంధువులు అశౌచంగా భావించి ఆ సమయంలో అశౌచం లేనివారికి దూరంగా ఉండడం, ఆలయాలకు వెళ్ళే విషయంలో విధినిషేధాలు పాటించడం వంటివి చేస్తూంటారు. ఈ అశౌచాలు కూడా వేర్వేరు కులాల్లో వేర్వేరుగా ఉంటాయి. బ్రాహ్మణ కులంలో కూడా వివిధ శాఖల్లో వేర్వేరుగా కనిపిస్తాయి. ఈ గ్రంథంలో ద్రావిడ వైష్ణవ బ్రాహ్మణులు పాటించవలసిన జాతాశౌచ, మృతాశౌచాలను నిర్ణయించి రచించారు. 202020050019125 1918 అస్పర్శయోగము అనే భగవద్గీత-రాజయోగము, ప్రథమభాగం [116] దయానంద పొన్నాల రాజయోగి ఆధ్యాత్మికం భగవద్గీతకు అస్పర్శయోగమని దయానంద పొన్నాల రాజయోగి వ్రాసిన వ్యాఖ్యానమిది. 2020120028952 వివరాలు లేవు అస్పృశ్యతా నివారణము (బుర్రకథ) [117] ఓ.సుబ్బరాయశర్మ బుర్రకథలు అస్పృశ్యతా నివారణం మహాత్మా గాంధీ తన జాతీయోద్యమ ప్రణాళికలో ముఖ్యపాత్రని ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎందరో గాంధేయవాదులు, జాతీయోద్యమకారులు అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడారు. జాతీయ యవనికపై అస్పృశ్యత దురాచారమని, అదొక సమస్య అని స్పష్టమైంది. ఆపైన బి.ఆర్.అంబేద్కర్ వంటి దళిత నాయకులూ సైద్ధాంతిక పోరాటాన్ని చేశారు. జాతీయోద్యమం ఫలించి స్వాతంత్ర్యం లభించాకా కాంగ్రెస్ చేతికే అధికారం రావడంతో అస్పృశ్యతను నివారించేందుకు చట్టాలు చేశారు. ఆ సందర్భంగా వందల యేళ్ళ అస్పృశ్యతా చరిత్రను, చివరకు అస్పృశ్యత నివారణను చూపుతూ బుర్రకథ రచించారు. 2030020025534 1955 అళియ రామరాయలు [118] చిలుకూరి వీరభద్రరావు చరిత్ర, జీవిత చరిత్ర పతనం అంచున ఉన్న కాలంలోని విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా వ్యవహరించిన అళియ రామరాజు జీవితాన్ని ఈ పుస్తకంలో వివరించారు. అళియ రామరాయలు జీవిత చరిత్ర ద్వారానే మహా వైభవంగా వెలుగొందిన విజయనగర సామ్రాజ్యం ఏ కారణాల వల్ల పతనమయిందో తెలుసుకునే వీలుదొరుకుతుంది. కాగా ఈ పుస్తకం ఆనాటి చక్కని గ్రాంథిక భాషలో వ్రాయడం వల్ల చదివేవారికి కొంత ఇబ్బంది కలిగినా విషయ సంపత్తి దాన్ని అధిగమించి చదివించవచ్చు. 2030020029688 1945 అళియ రామ భూపాలుడు [119] టి.శివశంకరం చరిత్ర, జీవిత చరిత్ర విజయనగర సామ్రాజ్యం పతనమైపోతున్న సమయంలో ఆఖరి ఆశలా వెలిగిన చక్రవర్తి అళియ రామరాయల జీవిత చరిత్ర ఈ గ్రంథం. అళియ అంటే అల్లుడు అని అర్థం. కొడుకులు లేని కృష్ణదేవరాయలుకు వారసునిగా విజయనగర సామ్రాజ్య పరిపాలన చేపట్టిన అల్లుడు రామరాయలు. అప్పటికే విజయనగరాన్ని నాశనం చేయాలని జట్టుకట్టిన మహమ్మదీయ రాజ్యాలను ఎదుర్కొనే ప్రయత్నమే కాక రాజ్యంలో సామరస్యం, సుస్థిరత నెలకొల్పే ప్రయత్నం చేశాడు రామరాయలు. చారిత్రిక కారణాలతో సామ్రాజ్యం అనంతర కాలంలో పతనమై, సుల్తాన్ల క్రౌర్యం వల్ల ప్రపంచ స్థాయి నగరమైన విజయనగరం నేలమట్టమైపోయినా తన వ్యక్తిత్వం, దక్షతల వల్ల రామరాయల జీవితం చరిత్రలో నిలిచింది. ఈ కారణాల వల్ల ఆయన జీవితగాథను వేర్వేరు రచయితలు పలు గ్రంథాలుగా రచించారు. ఈ గ్రంథం నాటి సరళ వ్యావహారికంలో రాశారు. 2030020024520 1932 అహల్యా శాపవిమోచనము [120] పప్పు మల్లికార్జునరావు పద్యకావ్యం ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడింది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడింది. ఆ వృత్తాంతాన్ని ఈ పద్యకావ్యంగా కవి మలిచారు. 2030020025186 1924 అహల్య [121] మల్లాది అచ్యుతరామశాస్త్రి నాటకం, పౌరాణిక నాటకం అహల్య గౌతమ మహర్షి భార్య. ఆమెను బ్రహ్మ లోకంలో అందరికన్నా సౌందర్యవతిగా సృష్టించి ఎవరైతే ముల్లోకాలు మొదట చుట్టివస్తారో వారికే ఆమెను ఇచి పెళ్ళీ చేస్తానని ప్రకటించారు. ఇంద్రుడు తన సర్వశక్తులు ఒడ్డి ముల్లోకాలు చుట్టిరాగా, గౌతమ మహర్షి ప్రసవిస్తున్న గోవు చుట్టూ తిరిగిరావడంతో ఇంద్రునికన్నా ముందే ముల్లోకాలు తిరిగినట్టైందని ఆయనకే ఇచ్చి చేస్తారు. ఒకనాడు కోడి రూపంలో తెల్లవారకుండానే కూసి గౌతముని నదీస్నానానికి వెళ్ళేలా చేసి గౌతముని రూపాన్ని ధరించి వస్తాడు ఇంద్రుడు. అహల్యతో రమించాలని కొరతాడు. ఆయనే తన భర్త అని భ్రమించిన అహల్య అంగీకరిస్తుంది. వెనక్కి తిరిగివచ్చిన గౌతముడు ఇంద్రుడిని అహల్యతో చూసి ఇద్దరినీ శపిస్తాడు. ఆమె అమాయకురాలని, ఇంద్రుడే మోసం చేశాడని అర్థం చేసుకుని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. త్రేతాయుగంలో రామచంద్రుడు గౌతమాశ్రమానికి వచ్చినప్పుడు ఆయన పాదధూళి సోకి శిలయైన అహల్య తిరిగి మానవరూపం చేరుతుంది. ఆ గాథతో అహల్య నాటకాన్ని రచించారు. 2030020025364 1947 అహల్యాబాయి (నవల) [122] చిలకమర్తి లక్ష్మీనరసింహం నవల, చారిత్రిక నవల మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు. ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని చిలకమర్తి లక్ష్మీనరసింహం వ్రాసిన చారిత్రిక నవల ఇది. దీనికి 1898లో చింతామణి ప్రథమ బహుమతి లభించింది. 9000000002484 1951 అహల్యా శాపవిమోచనం [123] రామనారాయణ కవులు నాటకం, పౌరాణిక నాటకం అహల్య గౌతమ మహర్షి భార్య. ఆమెను బ్రహ్మ లోకంలో అందరికన్నా సౌందర్యవతిగా సృష్టించి ఎవరైతే ముల్లోకాలు మొదట చుట్టివస్తారో వారికే ఆమెను ఇచి పెళ్ళీ చేస్తానని ప్రకటించారు. ఇంద్రుడు తన సర్వశక్తులు ఒడ్డి ముల్లోకాలు చుట్టిరాగా, గౌతమ మహర్షి ప్రసవిస్తున్న గోవు చుట్టూ తిరిగిరావడంతో ఇంద్రునికన్నా ముందే ముల్లోకాలు తిరిగినట్టైందని ఆయనకే ఇచ్చి చేస్తారు. ఒకనాడు కోడి రూపంలో తెల్లవారకుండానే కూసి గౌతముని నదీస్నానానికి వెళ్ళేలా చేసి గౌతముని రూపాన్ని ధరించి వస్తాడు ఇంద్రుడు. అహల్యతో రమించాలని కొరతాడు. ఆయనే తన భర్త అని భ్రమించిన అహల్య అంగీకరిస్తుంది. వెనక్కి తిరిగివచ్చిన గౌతముడు ఇంద్రుడిని అహల్యతో చూసి ఇద్దరినీ శపిస్తాడు. ఆమె అమాయకురాలని, ఇంద్రుడే మోసం చేశాడని అర్థం చేసుకుని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. త్రేతాయుగంలో రామచంద్రుడు గౌతమాశ్రమానికి వచ్చినప్పుడు ఆయన పాదధూళి సోకి శిలయైన అహల్య తిరిగి మానవరూపం చేరుతుంది. ఆ గాథతో అహల్య నాటకాన్ని రచించారు. 2030020025241 1922 అహింస [124] ఎం.ఎస్.రాజలింగం ఏకాంకిక మహాత్మా గాంధీ రాజకీయ సమస్యలు సైతం పరిష్కరించుకునేందుకు పనికివస్తుందని ప్రపంచానికి నిరూపించి చూపిన ఆయుధం అహింస. నిజానికి అహింస అంటే హింస కానిదన్న ఏకవాక్య సమాధానం కాక బలహీనుల ఆయుధమా, బలవంతుల ఆయుధమా వంటి ప్రశ్నలు ఇద్దరు మిత్రుల సంభాషణ రూపంలో తెలిపే ఏకాంకిక ఇది. 2030020024693 1945 అక్షరమాల [125] కోమర్తి నారాయణరావు కవితల సంకలనం ఉపాధ్యాయుడు, కవిపోతన, మనదేశం-మహోన్నతం వంటి వివిధ అంశాలపై కోమర్తి నారాయణరావు రచించిన కవితలను సంకలించి ఈ పుస్తకంగా ప్రచురించారు. 2020010003721 1949 మూలాలు
మార్చు