పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్‌కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
బక్సారు యుద్ధము [1] |
మొసలికంటి సంజీవరావు |
చరిత్ర |
మొసలికంటి సంజీవరావు ప్రముఖచరిత్రకారుడు. చరిత్రలో అత్యంత కీలకమైన బక్సర్ యుద్ధం గురించి ఆయన వ్రాసిన పుస్తకమిది.
|
2020010004301 |
1925
|
బగ్ జార్గల్ [2] |
మూలం: విక్టర్ హ్యోగో, అనువాదం: పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు |
నవల |
విక్టర్ హ్యూగో ఒకనాటి ఆంగ్ల నవలా సాహిత్యంలో తిరుగులేని ధృవతార, ప్రపంచ నవలా సాహిత్య పరిణామంలో ఆయన నవలలు కూడా కీలకమైనవి. ఆయన వ్రాసిన నవలకు పింగళి-కాటూరిగా పేరొందిన తెలుగు జంటకవులు చేసిన అనువాదం ఇది.
|
99999990125912 |
1929
|
బడ దీదీ [3] |
మూలం: శరత్ చంద్ర ఛటర్జీ, అనువాదం: చక్రపాణి |
కథ, బాల సాహిత్యం |
బెంగాలీలో శరత్ బాబు రాసిన నాటకాలు తెలుగునాట అత్యంత ప్రాచుర్యం పొంది సినిమాల రూపం కూడా పొందాయి. ఇది కూడా ఆయన రాసిన కథే. శరత్ సాహిత్యాన్ని తెలుగు వారికి సన్నిహితం చేసినవారిలో ముఖ్యులైన చక్రపాణి ఒకరు. ఇది ఆయన అనువాదం.
|
2020050016278 |
1951
|
బడాయి మేక [4] |
వేజండ్ల సాంబశివరావు |
గేయ కథలు, బాల సాహిత్యం |
ఇది బాల సాహిత్యం. పిల్లల గేయకథలు ఉన్నాయి ఇందులో.
|
2990100061491 |
1982
|
బడి దారి [5] |
కస్తూరి నరసింహమూర్తి |
పాఠ్యగ్రంథం |
ఇది పాఠ్యపుస్తకం.
|
2020120028971 |
1999
|
బడి పంతులు (నాటక సంపుటి) [6] |
శ్రీనివాస చక్రవర్తి |
నాటక సంపుటి |
తెలుగునాట రంగస్థలి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు శ్రీనివాస చక్రవర్తి. ఆయన పూర్తిపేరు చక్రవర్తుల వెంకట శ్రీనివాస రంగ రాఘవాచార్యులు. ఆయన వ్రాసిన నాటక సంకలనమిది.
|
2030020025127 |
1955
|
బడి పంతులు (నాటకం) [7] |
పెండెం సూర్యనారాయణరావు |
నాటకం |
ఇది ఒక నాటకం.
|
2020010004286 |
1957
|
బడి పంతులు బ్రతుకు [8] |
జాల రంగస్వామి |
నాటకం |
బతకలేక బడిపంతులు అన్నది తెలుగులో ప్రాచుర్యం పొందిన నాటి సామెత. అప్పటి సామాజిక స్థితిగతులు ప్రతిబింబిస్తూ బడిపంతులు బతుకు అన్న పేరుతో రాసిన నాటకమిి.
|
2020010002666 |
1953
|
బడి పిల్లలు [9] |
మట్టగుంట రాధాకృష్ణ |
నవల |
బడిపిల్లలు అన్న ఈ నవలను మట్టగుంట రాధాకృష్ణ వ్రాశారు.
|
2030020025215 |
1955
|
బోజ కవితలు-ఆటలు-పాటలు [10][dead link] |
బోయ జంగయ్య |
బాల సాహిత్యం |
బోయ జంగయ్య పిల్లల కోసం రాసిన కవితలు, కథలు, ఆటలు వంటివి ఈ గ్రంథంలో ప్రచురించారు. |
2020120000025 |
1998
|
బభ్రువాహన నాటకము [11] |
కె.శతృజ్ఞరావు |
నాటకం |
తెలుగునాట పేరొందిన ఇతివృత్తం బభ్రువాహనుని కథ. దాని ఆధారంగా రాసిన నాటకమిది.
|
2020010002611 |
1923
|
బల్లకట్టు పాపయ్య [12] |
మా గోఖలే |
కథా సాహిత్యం |
వ్యావహారికోద్యమాన్ని మాండలికాల స్థాయికి తీసుకువెళ్ళిన శ్రీపాద, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తొలితరం రచయితల్లో ఎన్నదగినవారు మా గోఖలే. ఆయన ప్రాంతీయమైన పలుకుబడులు, మాండలిక పదసంపదకు పెద్దపీట వేశారు. గోఖలే గుంటూరు జిల్లాలోని పల్లెటూరును కథా కార్యక్షేత్రంగా ఎంచుకుని రచించారు. ఆయన రాసిన దాదాపు 50 కథల్లో 36 కథలు పూర్తిస్థాయి మాండలికంలో రాసిన కథలే. ఆయన రచించిన కథల సంపుటి ఈ బల్లకట్టు పాపయ్య |
2030020024643 |
1955
|
బలి [13] |
మూలం: రవీంద్రనాధ్ ఠాగూర్, అనువాదం: ఎన్.బ్రహ్మయ్య |
నాటకం |
నోబెల్ బహుమతి పొందిన సాహిత్యవేత్త, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన రాసిన ఈ నాటకాన్ని ఎన్.బ్రహ్మయ్య అనువదించారు.
|
2020010001176 |
1957
|
బసవ పురాణము[14] |
గ్రంథకర్త.పాల్కురికి సోమనాథుడు సంపాదకుడు.గూడ వేంకట సుబ్రహ్మణ్యం |
సాహిత్యం |
పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలోనే కాక వీరశైవ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. లింగధారణ, వీరశైవాచారాలు వంటివి ప్రారంభించిన బసవేశ్వరుని జీవితాన్ని ప్రధాన కథగా, ఇతర శివభక్తుల వీర భక్తిగాథలు ఉపకథలుగా స్వీకరించి పాల్కురికి సోమన ఈ గ్రంథాన్ని రచించారు. గ్రంథ రచనలో కూడా జానపదుల సాహిత్యానికి సమీపంలో ఉండే ద్విపద ఛందస్సును స్వీకరించి గ్రంథ రచన చేశారు. ఈ సుప్రసిద్ధ గ్రంథాన్ని సుదీర్ఘమైన ముందుమాటతో సంపాదకుడు గూడ వెంకట సుబ్రహ్మణ్యం తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ముద్రించారు. |
2990100051641 |
1969
|
బసవరాజు అప్పారావు గీతములు [15] |
బసవరాజు అప్పారావు |
గీతాలు |
బసవరాజు అప్పారావు ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. ఆయన రాసిన గీతాల సంకలనమిది.
|
2020010002119 |
1934
|
బసవ వచనామృతం [16] |
రేకళిగె మఠము వీరయ్య |
ఆధ్యాత్మికం |
బసవేశ్వరుడు మత సంస్కర్త, వీరశైవ మతకర్త. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం. ఆయన రచించిన వచనాలు బసవన్న వచనాల పేరిట కన్నడ సాహిత్యంలో సుప్రఖ్యాతం. వాటిని వీరయ్య ఈ గ్రంథంలో తెనిగించారు. |
2030020024522 |
1941
|
బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల [17] |
డి.రామలింగం |
జీవిత చరిత్ర |
బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయానికి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు. ఆయన జీవితచరిత్రను తెలుగు అకాడమీ ప్రచురించింది. |
2990100061492 |
1989
|
బడాపానీ [18] |
మూలం.లీలా మజుందార్, అనువాదం.వి.పతంజలి |
బాల సాహిత్యం |
బాలలకు వికాసం, వినోదం, పలు ఇతర ప్రాంతాలు తెలిసే విధంగా ఉండే సాహిత్యం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బెంగాలీ కథ ఐన బారాపానీ తెలుగులో అనువదించి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
99999990175628 |
1973
|
బద్ది నీతులు [19] |
బద్ది భూపాలుడు |
నీతి, శతకం |
బద్ది నరేంద్రా అన్న మకుటంతో రాసిన పలు నీతిపద్యాలను ఈ శతకంగా ప్రచురించారు. బద్ది భూపాలుడు రాసినవిగా చెప్తున్న ఈ పద్యాల్లో నిత్యజీవనానికి ఉపకరించే నీతులు ఉంటాయి. (ప్రచురణ తేదీ కన్నా బాగా పూర్వపు గ్రంథమిది) |
2020050019196 |
1917
|
బడిలో చెప్పని పాఠాలు [20] |
బోయ జంగయ్య |
బాల సాహిత్యం, విద్య |
బోయ జంగయ్య ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు. ఆయన బడిలో పిల్లలకు చెప్పని, వారికి తెలియాల్సిన పాఠాలుగా ఇవి రచించారు. |
2020120028972 |
1998
|
బర్హిశిలేశ్వర శతకము [21] |
నెమలికంటి బాపయ్య |
శతకం |
శతకం అంటే ఒకేమకుటంతో రాసే వంద పద్యాల సంకలనం. ఇది నెమలికంటి బాపయ్య రాసిన శతకం.
|
2020050014488 |
1925
|
బలజా సౌభద్రీయము [22] |
కస్తూరి శివశంకరకవి |
నాటకం |
బలజా సౌభద్రీయం పౌరాణిక నాటకం.
|
2020120000074 |
1903
|
బలరామ శతకం [23] |
పాతులూరి సుభద్రాచార్య |
శతకం |
శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. బలరామా! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. |
2020050016639 |
1931
|
బలి బంధనము [24] |
చందాల కేశవదాసు |
నాటకం, పౌరాణికం |
చందాల కేశవదాసు తెలుగు సినీ చరిత్రలో తొలి సినీ గేయ రచయితగా చెదరని స్థానం సంపాదించుకున్నారు. నాటకరంగంలో రచయితగా ఆయన సుప్రఖ్యాతుడు. ఈ గ్రంథం ఆయన రచించిన పౌరాణిక నాటకం. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామనునిగా పాతాళానికి అనగద్రొక్కిన వైనాన్ని ఇతివృత్తంగా స్వీకరించారు. |
2030020024651 |
1935
|
బలే చింతామణి [25] |
బి.టి.రాఘవచార్యులు |
సాహిత్యం |
ఇది బలే చింతామణి అన్న పేరున్న నాటిక.
|
2020050015634 |
1929
|
బంగారు పిలక [26][dead link] |
సంకలనం: తురగా జానకి |
కథా సంకలనం |
వివిధ ప్రముఖ రచయితలు రాసిన కథలను తురగా జానకి ఈ పుస్తకంలో సంకలనం చేసి, పొందుపరిచారు. |
99999990128972 |
1979
|
బహిష్కారము [27] |
కె.సి.జాన్ |
పద్య కావ్యం |
కె.సి.జాన్ అనే రచయిత వ్రాసిన పద్య కావ్యమిది.
|
2020010004297 |
1956
|
బహుచెర [28] |
వివరాలు లేవు |
నవల |
బహుచెర అనే పేరున్న ఈ రచన ఒక నవల.
|
2030020025163 |
1955
|
బహుదూరపు బాటసారి [29] |
యామినీ సరస్వతి |
కథ |
యామినీ సరస్వతి వ్రాసిన కథ ఇది.
|
2020120028975 |
1980
|
బహులాశ్వ చరిత్రము [30] |
దామరాల వెంగళభూపాల |
ప్రభంధం |
బహులాశ్వ చరిత్రమనే ఈ గ్రంథం పద్యకావ్యం, ప్రబంధం.
|
2020120034216 |
1906
|
బ్రహ్మచర్యవ్రతప్రకాశిక [31] |
ముట్నూరు గోపాలదాసు |
నియమాలు ఆచారాలు |
బ్రహ్మచర్య వ్రతపాలనలో పూర్వులు చెప్పిన వివరముల సంగ్రహం |
2020050018497 |
1921
|
బ్రహ్మవిద్యాసారము [32] |
రచన: లెడ్ బీటర్; అనువాదం: అ.మహదేవశాస్త్రి |
తత్త్వ శాస్త్రము
|
బ్రహ్మసమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనికూడా గుర్తిస్తారు. ఈ గ్రంథాన్ని బ్రహ్మసమాజ ప్రముఖుడైన లెడ్ బీటర్ రచించారు.
|
2990100067420 |
1923
|
బ్రహ్మేంద్ర పారాయణ చరిత్ర [33] |
ఇంకొల్లు శ్రీరామశర్మ |
జీవిత చరిత్ర |
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దికి చెందిన ఆధ్యాత్మికవేత్త, సంఘసంస్కర్త అన్నిటికన్నా మిన్నగా కాలజ్ఞాన తత్త్వ రచయిత. ఆయన జీవితంలోని పలు విశేషాలను, ఘట్టాలను అనుసరించి ఆయనను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించేవారు ఉన్నారు. ఆయన విశ్వబ్రాహ్మణ కులస్తులు, విశ్వబ్రాహ్మణులకు ఆరాధ్యులు. ఈ నేపథ్యంలో ఆయన జీవితాన్ని పారాయణ చేసేందుకు వీలుగా ఈ గ్రంథాన్ని రచించారు. |
2020010022880 |
1951
|
బ్రహ్మోత్తర ఖండము [34] |
శ్రీధరమల్లె వెంకటరామ కవి |
పురాణం, పద్యకావ్యం |
ఈ బ్రహ్మోత్తర ఖండము స్కాంద పురాణాంతర్గతమైన భాగం నుంచి కవి తెనిగించారు. బ్రహ్మోత్తర ఖండంలో శివ సంబంధమైన పలు కథలు, శివభక్తుల జీవన గాథలు ఉంటాయి. ఈ శైవ సంబంధ సాహిత్యాన్ని తెలుగులో పద్యరూపంలో రచించారు కవి. |
2030020024939 |
1955
|
బానిసా కాదు దేవతా కాదు [35] |
మల్లాది సుబ్బమ్మ |
స్త్రీవాదం |
మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య. ఆమె రచించిన గ్రంథమిది.
|
2020120028990 |
1988
|
బాపన పిల్ల [36] |
మూలం: శరచ్చంద్ర, అనువాదం: వేలూరి శివరామశాస్త్రి |
నవల |
వేలూరి శివరామశాస్త్రి బహుగ్రంథకర్త, గొప్ప పండితులు. ఇది ఆయన చేసిన అనువాదం.
|
2020050015005 |
1959
|
బాపు కార్టూన్లు-1 [37] |
బాపు |
వ్యంగ్య చిత్రాలు, హాస్యం, కార్టూన్లు |
బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. అంతటి గీతాకారుడు వేయగా తరతరాలుగా తెలుగువారిని నవ్విస్తున్న కార్టూన్లను రెండు సంకలనాలు చేసి విశాలాంధ్ర వారు ప్రచురించారు. |
2990100071242 |
2005
|
బాపు కార్టూన్లు-2 [38] |
బాపు |
వ్యంగ్య చిత్రాలు, హాస్యం, కార్టూన్లు |
బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. అంతటి గీతాకారుడు వేయగా తరతరాలుగా తెలుగువారిని నవ్విస్తున్న కార్టూన్లను రెండు సంకలనాలు చేసి విశాలాంధ్ర వారు ప్రచురించారు. |
2990100071241 |
2002
|
బాపు (పుస్తకం) రెండవ భాగం [39][dead link] |
మూలం.ఎఫ్.సి.ఫ్రేటౌస్, అనువాదం.బాలాంత్రపు రజనీకాంత రావు |
బాల సాహిత్యం, జీవిత చరిత్ర |
భారత జాతిపిత, జాతీయోద్యమంలో కీలకనేత మహాత్మా గాంధీ జీవితాన్ని బొమ్మలు, వివరాలతో పిల్లలకు అందించే ప్రయత్నమిది. తేలికైన భాషలో, అర్థమయ్యే వివరణలతో ఈ గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకంలో బాపు జీవితంలోని ఎన్నో ఘట్టాలు ఆయా సందర్భంలో బొమ్మలుగా వేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నెహ్రూ బాల గ్రంథాలయం సీరీస్‌లో భాగంగా ఈ అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. |
99999990128977 |
1970
|
బాపూజీ ఆత్మకథ [40] |
పద్యానువాదం.తుమ్మల సీతారామమూర్తి, మూలం.మహాత్మా గాంధీ |
ఆత్మకథ, పద్యకావ్యం |
మహాత్ముని ఆస్థానకవిగా, తెలుగు లెంకగా పేరొందిన కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఆయన మహాత్ముని అహింసా సిద్ధాంత ప్రవచనానికి, సిద్ధాంతానికి ఆచరణకు భేదం లేని సద్వర్తనకూ ఆజన్మాభిమాని. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువాదమై, గొప్ప రచనగా పేరొందిన మహాత్మా గాంధీ ఆత్మకథ మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ద ట్రూత్‌ను తెలుగులోకి పద్యరూపంలోకి అనువదించారు. ఆ అనువాదమే ఈ బాపూజీ ఆత్మకథ గ్రంథం. |
2990100051771 |
1936
|
బాపూజీ దివ్య స్మృతికి [41] |
కొత్త సత్యనారాయణ చౌదరి |
పద్యకావ్యం |
|
2020050005894 |
1947
|
బాపూ రమణీయం [42] |
ముళ్ళపూడి వెంకటరమణ |
ఆత్మకథాత్మకం |
బాపూ రమణలు తెలుగులో పేరొందిన సాంస్కృతిక జంట. బాపూ రాతకు, రమణ రాతకు మాత్రమే కాకుండా బాపు దర్శకత్వానికి, రమణ రచనకూ కూడా పేరుపొందారు. ఇది వారిద్దరూ చేసిన సృజనకు పుస్తకరూపం.
|
2990100061490 |
1990
|
బాబా సాహెబ్ అంబేద్కర్ [43] |
మూలం.కె.రాఘవేంద్రరావు, అనువాదం.కె.ఆర్.కె.మోహన్ |
జీవిత చరిత్ర |
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. ఆయన జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. |
2990100051610 |
1999
|
బాణ గద్య కావ్య కథలు [44] |
మూలం.బాణుడు, అనువాదం, రూపకల్పన.శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి |
అనువాదం, కథా సాహిత్యం |
కావ్యం బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో సంస్కృత భాషాపండిత లోకంలో సుప్రసిద్ధం. భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, బాణుడు, భవభూతి మొదలైన అరుదైన మహాకవుల కోవలోని వాడు. ఊరుభంగం మొదలైన అపురూపమైన నాటకాలే కాక హర్షచరిత్రమనే కావ్యం, నవలారూపమైన కాదంబరినీ రచించారు. ఈ గ్రంథంలో హర్షచరిత్ర, కాదంబరిలను గద్యరూపంలోకి అనువదించి సంక్షిప్తంగా ప్రచురించారు. |
2030020024819 |
1931
|
బాణ భట్ట [45] |
ఆంగ్ల మూలం: కె.కృష్ణమూర్తి, అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు |
జీవిత చరిత్ర |
బాణోచ్ఛిష్టం జగత్సర్వం అనే పేరుపొందిన గొప్ప కావ్యకర్త బాణుడు. ఇది ఆయన జీవితచరిత్ర. ప్రసిద్ధ పండితుడు పుల్లెల శ్రీరామచంద్రుడు చేసిన అనువాదం ఇది.
|
2990100051611 |
1979
|
బాణభట్టుని స్వీయచరిత్ర [46] |
బాణ భట్టు |
స్వీయ చరిత్ర, ఆత్మకథాత్మకం |
బాణభట్టుని స్వీయచరిత్ర పేరిట బాణుని జీవితాన్ని స్వీయచరిత్రగా వ్రాశారు రచయిత.
|
5010010088952 |
1910
|
బాణుని కాదంబరి దాని వైశిష్ట్యము [47] |
వేదము వేంకటరామన్ |
పరిశీలనాత్మక గ్రంథం |
బాణోచ్ఛిష్టం జగత్సర్వం అనే పేరుపొందిన గొప్ప కావ్యకర్త బాణుడు. ఇది బాణుని కాదంబరి వైశిష్ట్యాన్ని గురించి వ్రాసిన పరిశోధనాత్మక గ్రంథం.
|
2990100061489 |
1980
|
బాలకవి శరణ్యము [48] |
గిడుగు రామమూర్తి |
వ్యాకరణం, సాహిత్యోద్యమాలు, వ్యవహారికోద్యమం |
గిడుగు రామమూర్తి తెలుగు సాహిత్యాన్ని గ్రాంథిక భాష పట్టు నుంచి విడిపించి వ్యావహారిక భాషవైపుకు నడిపినవారు ఆయన. నిజానికి గ్రాంథిక భాష సమస్య 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో రాకపోగా (చూ.కాశీయాత్ర చరిత్ర, నా యెఱుక) అనంతర కాలంలో గ్రాంథికం, భాషా నిర్దుష్టత మొదలైన నియతులు పెరిగాయి. దీనంతటికీ ఒకానొక మూలకారణం కవి ప్రయోగాన్ని, జీవద్భాషను ప్రతిబింబించడం మానివేసి ఇవి మంచివీ, ఇవి కాదు అని నిర్ణయించడం మొదలుపెట్టి నిలవనీరుగా మారిపోయిన వ్యాకరణ సంప్రదాయమని గిడుగు భావించారు. ఆ క్రమంలోనే ఆయన ఉద్యమంలో భాగంగా ఈ గ్రంథం వేర్వేరు వ్యాసాలుగా రచించగా గిడుగు షష్టిపూర్తి మహోత్సవాలకు ప్రచురించారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రామాణికులైన పూర్వకవులు తమ ప్రాంతంలోని శిష్టవ్యవహారికాన్ని ఎలా వాడుకున్నారో వివరిస్తూ ఆ లక్ష్యాలకు లక్షణాలను అందించి వ్యాకరణం రచించారు. గ్రాంథిక భాషను ఖండించి వ్యవహారిక ప్రయోగాన్ని నిశ్చయపరిచేందుకు నాలుగు వాదాలను ప్రయోగించారు గిడుగు. ఆ నాలుగు వాదాలను విస్తరిస్తూ నాలుగు గ్రంథాలు రచించారు- అవి వ్యాసవళి, గద్య చింతామణి, ఆంధ్రపండిత భిషక్కుల భాషా భేషజము, బాలకవి శరణ్యము |
2030020025411 |
1933
|
బా-బాపూజీల చల్లని నీడలో [49] |
హిందీ మూలం: మనూబెహన్ గాంధి, అనువాదం: ఎన్.వి.శివరామశర్మ |
సాహిత్యం |
మనూ బాపూజీకి అత్యంత సన్నిహితురాలు. ఆమె కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీల నీడలో గడిపిన కాలాన్ని గురించి వ్రాసిన స్వీయచరిత్రాత్మక రచన ఇది.
|
2990100051609 |
1974
|
బాబాలు, స్వామీజీలు, గురుమహారాజులు [50] |
ఆర్.ఆర్.సుందరరావు |
సాహిత్యం |
బాబాలు, స్వామీజీలు, గురువుల గురించి రాసిన పుస్తకమిది.
|
2990100067413 |
1987
|
బారిష్టరు పార్వతీశం [51] |
మొక్కపాటి నరసింహశాస్త్రి |
హాస్య సాహిత్యం, నవల |
బారిష్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి కలం నుండి వెలువడిన హాస్యంతో కూడిన నవల. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశంఒక పల్లెటూరు నుండి బయలుదేరి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటాడు. పదోతరగతి విద్యార్థులకు మొదటి భాగం ఉపవాచకంగా కొత్త తరానికీ చేరువయ్యింది.
|
2020050016239 |
1957
|
బాల కథా కౌముది [52] |
డి.సీతారామారావు |
బాల కథా సాహిత్యం |
పిల్లల కథల పుస్తకం ఇది.
|
2020050016156 |
1937
|
బాల కథావళి [53] |
దీపాల పిచ్చయ్య శాస్త్రి |
బాల కథా సాహిత్యం |
దీపాల పిచ్చయ్యశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత, కవి. ఆయన వ్రాసిన పిల్లల కథల పుస్తకం ఇది.
|
2020050015315 |
1933
|
బాలకవి శరణ్యము [54] |
రచయిత: గిడుగు రామ్మూర్తి పంతులు, ప్రకాశకుడు: తెలికిచెర్ల వెంకటరత్నం |
సప్తతి సంచిక |
బాలకవి శరణ్యము గిడుగు వ్రాసిన లక్షణ గ్రంథం. తాను ప్రారంభించిన వ్యావహారికోద్యమంలో భాగంగా ఆయన కొత్తతరం కవుల కోసం వ్రాసిన లక్షణ గ్రంథంలో గ్రాంథికవాదులు అసాధువుల, వర్జనీయాలని వ్రాసిన కొన్ని పదాలకు పూర్వకవుల ప్రయోగాలు చూపి తిప్పికొట్టారు.
|
5010010000444 |
1933
|
బాలకాండము [55] |
చదలువాడ సుందరరామశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం, ఇతిహాసం |
చదలవాడ సుందరరామశాస్త్రి రాసిన రామాయణ బాలకాండమిది.
|
2030020024552 |
1954
|
బాలకృష్ణ భాగవతము [56] |
వీర రాఘవకవి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
వీరరాఘవ కవి రాసిన భాగవతం ఇది.
|
5010010088382 |
1922
|
బాల కృష్ణలీల [57] |
కాళహస్తి తమ్మారావు |
నాటకం |
ఇది బాలకృష్ణుని గురించి రాసిన నాటకం.
|
2020050016045 |
1952
|
బాలకృష్ణ శతకము [58] |
జక్కేపల్లి జగ్గకవి |
ఆధ్యాత్మిక సాహిత్యం, శతకం |
బాలకృష్ణా అన్న మకుటంతో రాసిన శతకం ఇది.
|
2020050014786 |
1925
|
బాల కేసరి [59] |
భమిడిపాటి కామేశ్వరరావు |
నాటకం |
భమిడిపాటి కామేశ్వరరావు ప్రముఖ తెలుగు హాస్యరచయిత. ఆయన రాసిన నాటకమిది.
|
2020010004316 |
1955
|
బాల గీతాంజలి [60] |
నీలా జంగయ్య |
బాల సాహిత్యం |
నీలా జంగయ్య కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు. వాసవీ సాహిత్యపరిషత్తును స్థాపించాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. నందనవనం అనే సాహితీ సంస్థకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఆయన రాసిన పిల్లల పుస్తకమిది.
|
2020120007060 |
1978
|
బాల గీతావళి [61] |
వేంకట పార్వతీశకవులు |
బాల సాహిత్యం, పాఠ్యగ్రంథం |
వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు. ఇది ఆయన రాసిన పిల్లల పాటల పుస్తకం.
|
2020120000096 |
1940
|
బాల గేయాలు [62] |
ఎస్.గంగప్ప |
బాల సాహిత్యం |
ఎస్.గంగప్ప ప్రముఖ సాహిత్యవేత్త, అనువాదకులు. ఇది ఆయన రాసిన పిల్లల పుస్తకం.
|
2020120028982 |
1981
|
బాలప్రౌఢ వ్యాకరణ సర్వస్వము (ద్వితీయ సంపుటి) [63] |
స్ఫూర్తిశ్రీ |
వ్యాకరణం, బాల సాహిత్యం |
ఇది స్ఫూర్తిశ్రీ రాసిన వ్యాకరణం
|
2990100071240 |
1970
|
బాలబోధిని- ప్రథమ భాగము [64] |
కాశీ కృష్ణాచార్య |
బాలల సాహిత్యం, పాఠ్యగ్రంథం |
ఇది కాశీ కృష్ణాచార్యులు వ్రాసిన బాలల సాహిత్యం
|
2020050006040 |
1956
|
బాలబోధిని-ద్వితీయ భాగము [65] |
కాశీ కృష్ణాచార్య |
బాలల సాహిత్యం, పాఠ్యగ్రంథం |
ఇది కాశీ కృష్ణాచార్యులు వ్రాసిన బాలల సాహిత్యం
|
2020010004311 |
1948
|
బాలబోధిని-తృతీయ భాగము [66] |
కాశీ కృష్ణాచార్య |
బాలల సాహిత్యం, పాఠ్యగ్రంథం |
ఇది కాశీ కృష్ణాచార్యులు వ్రాసిన బాలల సాహిత్యం
|
2020010004310 |
1946
|
బాలభక్తులు [67] |
ఆవంత్స వేంకటరత్నం |
ఆధ్యాత్మికం, బాల కథా సాహిత్యం |
పిల్లలుగానే మహాభక్తులైన వారి జీవితాల గురించిన పుస్తకమిది.
|
2020050014299 |
1932
|
బాల భాగవతము [68] |
దోనూరి కోనేరునాథకవి, పరిష్కర్త: పంగనామల బాలకృష్ణమూర్తి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
బాలల కోసం వ్రాసిన భాగవతం ఇది.
|
2040100028429 |
1954
|
బాల భారతం-మొదటి భాగం [69] |
ధేరం వెంకటాచలపతి |
బాల సాహిత్యం, పౌరాణికం, ఇతిహాసం |
మహాభారతం ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన ఇతిహాసం. గ్రీకు పురాణాలు, అత్యంత విస్తారమైనవిగా పాశ్చాత్య సాహిత్యంలో పేరుపొందినవీ ఐన ఒడిస్సీ, ఇల్లియాడ్‌లను కలిపినా మహాభారతంలో పదో వంతు కూడా ఉండవు. అంత సవిస్తరమైనది ఐనా వింటే భారతమే వినాలీ అన్న పేరు తెచ్చుకున్న రుచ్యమైన గ్రంథం. దాంతో మహా భారతాన్ని బాలలకు తేలికగా, సంక్షిప్తంగా ఆసక్తికరంగా చెప్పడానికి ఈ గ్రంథాన్ని రచించారు. |
2030020024631 |
1922
|
బాల భారతం-రెండవ భాగం [70] |
ధేరం వెంకటాచలపతి |
బాల సాహిత్యం, పౌరాణికం, ఇతిహాసం |
మహాభారతం ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన ఇతిహాసం. గ్రీకు పురాణాలు, అత్యంత విస్తారమైనవిగా పాశ్చాత్య సాహిత్యంలో పేరుపొందినవీ ఐన ఒడిస్సీ, ఇల్లియాడ్‌లను కలిపినా మహాభారతంలో పదో వంతు కూడా ఉండవు. అంత సవిస్తరమైనది ఐనా వింటే భారతమే వినాలీ అన్న పేరు తెచ్చుకున్న రుచ్యమైన గ్రంథం. దాంతో మహా భారతాన్ని బాలలకు తేలికగా, సంక్షిప్తంగా ఆసక్తికరంగా చెప్పడానికి ఈ గ్రంథాన్ని రచించారు. |
2030020024518 |
1922
|
బాల చంద్రాలోకము [71] |
ఆలపాటి వెంకటప్పయ్య |
కావ్యం |
చంద్రాలోకం కావ్యాన్ని సరళతరం చేసి వ్రాశారు ఈ పుస్తకంగా.
|
2020120034148 |
1992
|
బాల చరితము [72] |
మూలం.భాసుడు, అనువాదం.సూరిగుచ్చి కృష్ణమూర్తి |
నాటకం, అనువాదం |
భాసో హాసః-భాసుడు (సరస్వతీదేవి) చిరునవ్వు అన్న చాటుశ్లోక భాగం సంస్కృత భాషాపండిత లోకంలో సుప్రసిద్ధం. భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, బాణుడు, భవభూతి మొదలైన అరుదైన మహాకవుల కోవలోని వాడు. ఆయన రచించిన ఊరు భంగం నాటకం దుర్యోధనుడి మరణంతో పూర్తయ్యే విషాదాంతం కావడం, రంగంపై మరణాన్ని చూపవలసిరావడంతో ఆనాటి నాటక సంప్రదాయాలకు ఎదురు నిలిచి గొప్ప సాహసంగా నిలిచిపోయింది. |
2030020024964 |
1950
|
బాల నాగమ్మ [73] |
నాగశ్రీ |
కథ |
బాలనాగమ్మ కథ సుప్రసిద్ధి పొందిందే. ఈ పుస్తకం ఆ ఇతివృత్తంతోనే వ్రాశారు.
|
2020120034156 |
1986
|
బాల నాగమ్మ [74] |
నాగశ్రీ |
నాటకం |
బాలనాగమ్మ కథ సుప్రసిద్ధి పొందిందే. ఈ నాటకం ఆ ఇతివృత్తంతోనే వ్రాశారు.
|
2020010004318 |
1960
|
బాలనీతి కథలు [75] |
ఎ.ఎల్.నారాయణ |
నీతి కథలు, బాల కథా సాహిత్యం |
పిల్లల నీతి కథల సంకలనం ఇది.
|
2020050015308 |
1931
|
బాల రాజ్యం [76] |
మూలం: పుల్టన్ ఔర్సలర్, విల్ ఔర్సలర్, అనువాదం: ఎన్.ఆర్.చందూర్ |
బాల సాహిత్యం |
ఎన్.ఆర్.చందూర్ (చందూరి నాగేశ్వరరావు) సుప్రసిద్ధ రచయిత. జగతి మాసపత్రికకు సంపాదకుడు. ఆయన అనువదించిన బాల సాహిత్యమిది.
|
2020010004321 |
1949
|
బాలరామాయణము ( ప్రథమ సంపుటి) [77] |
వివరాలు లేవు |
ఆధ్యాత్మికం, బాల సాహిత్యం |
పిల్లల కోసం రాసిన రామాయణం ఇది.
|
5010010088737 |
1920
|
బాలరామాయణము (ద్వితీయ భాగము) [78] |
తిరుపతి వేంకటేశ్వర కవి |
ఆధ్యాత్మికం, బాల సాహిత్యం |
తిరుపతి వేంకటేశ్వర కవి వ్రాసిన బాలరామాయణం ఇది.
|
5010010032804 |
1903
|
బాల రోగములు చికిత్స [79] |
తల్లాప్రగడ కామేశ్వరరావు |
వైద్యం |
తల్లాప్రగడ కామేశ్వరరావు పిల్లల జబ్బులకు చికిత్స వివరాలు వ్రాసిన పుస్తకమిది.
|
5010010000445 |
1950
|
బాల లోకం [80] |
ఎర్రోజు సత్యం |
బాల సాహిత్యం, కవితా సంపుటి |
ఇది బాల సాహిత్య సంపుటి.
|
2020120034155 |
1980
|
బాల వ్యాకరణము [81] |
పరవస్తు చిన్నయసూరి |
వ్యాకరణం |
చిన్నయసూరి ప్రముఖ వ్యాకర్త. ఇది ఆయన వ్రాసిన అత్యంత ప్రాచుర్యం పొందిన బాల వ్యాకరణ గ్రంథం.
|
2030020025619 |
1917
|
బాల వ్యాకరణ సూక్తులు ( ప్రథమ భాగము) [82] |
అంబడిపూడి నాగభూషణం |
బాల సాహిత్యం, వ్యాకరణం |
బాల వ్యాకరణంలోని సూక్తులు ఇలా అందించారు.
|
2020120000100 |
1988
|
బాల వ్యాకరణ సూక్తులు (తృతీయ భాగము) [83] |
అంబడిపూడి నాగభూషణం |
బాల సాహిత్యం, వ్యాకరణం |
బాల వ్యాకరణంలోని సూక్తులు ఇలా అందించారు.
|
2020120028987 |
1988
|
బాల వాజ్ఙయం [84] |
బి.వి.నరసింహం |
బాల సాహిత్యం |
ఇది పిల్లల పుస్తకం.
|
2020120012587 |
1975
|
బాల వికాసిని [85] |
కృష్ణప్రసాద్ |
బాల సాహిత్యం |
ఇది పిల్లల పుస్తకం.
|
2020120032185 |
2003
|
బాల విజ్ఞాన కోశము [86] |
కొమరగిరి కృష్ణమోహనరావు |
బాల సాహిత్యం |
ఇది పిల్లల కోసం వ్రాసిన విజ్ఞాన సర్వస్వ తరహా పుస్తకం.
|
2020120003907 |
1980
|
బాల వితంతు విలాపము [87] |
ముట్నూరి వెంకటసుబ్బారాయుడు, మంగిపూడి వేంకటశర్మ |
కథా సాహిత్యం |
బాల వితంతువు జీవితం ఎలాంటి మలుపులు తిరింగిందో వ్రాసిన పుస్తకమిది.
|
5010010086045 |
1908
|
బాల వినోదిని (ద్వితీయ భాగము) [88] |
పూతలపట్టు శ్రీరాములురెడ్డి |
బాలల కథా సాహిత్యం |
ఇది బాలల గురించి వ్రాసిన కథా సాహిత్యం
|
5010010077040 |
1933
|
బాల వీరులు [89] |
డి.సీతారామారావు |
ఆధ్యాత్మికం, బాల కథా సాహిత్యం |
|
2020050016398 |
1930
|
బాల శశాంకమౌళి శతకము [90] |
తాత రామయోగికవి |
ఆధ్యాత్మికం, బాల సాహిత్యం, శతకం |
|
2020050016408 |
1924
|
బాల శతకము [91] |
కొణిదెన వేంకట నారాయణరావు |
ఆధ్యాత్మికం, బాల సాహిత్యం, శతకం |
|
2020050014792 |
1925
|
బాల శతకము [92] |
ఆలపాటి వెంకటప్పయ్య |
బాల సాహిత్యం, శతకము |
|
2020120034145 |
1962
|
బాల సరస్వతీయము [93] |
నన్నయ్య, పరిష్కర్త: వజ్ఝుల సీతారామస్వామిశాస్త్రి |
బాల సాహిత్యం |
|
2020010010786 |
1932
|
బాల సాహితి [94] |
వెలగా వెంకటప్పయ్య |
బాల సాహిత్యం |
|
2020120028985 |
1985
|
బాలల విజ్ఞాన సర్వస్వం (సంస్కృతి విభాగం) [95] |
సంపాదకుడు: బుడ్డిగ సుబ్బరామన్ |
సాహిత్యం, విజ్ఞాన సర్వస్వం |
|
2020120032188 |
1990
|
బాలల శబ్దరత్నాకరం [96] |
తూమాటి దొణ్ణప్ప |
సాహిత్యం |
|
2020120034154 |
1991
|
బాలల హనుమంతుడు [97] |
మూల సంకలనం: రామనారాయణశరణ్, పరిష్కర్త: తెలికేపల్లి లక్ష్మీనారాయణశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120032187 |
1990
|
బాల్య వివాహ తత్త్వసారము [98] |
ఎ.వెంకటాచలపతిరావు |
సాహిత్యం |
|
2020120019823 |
వివరాలు లేవు
|
బాలాదిత్య [99] |
వరిగొండ సత్యనారాయణమూర్తి |
చారిత్రాత్మక నవల |
|
2020050015023 |
1925
|
బాలాదిత్య-2 [100] |
వరిగొండ సత్యనారాయణమూర్తి |
చారిత్రాత్మక నవల |
|
2020010004307 |
1936
|
బాలానంద కుశలవుల కథ [101] |
నాగశ్రీ |
కథా సాహిత్యం, ఆధ్యాత్మికం |
|
2020120032196 |
1999
|
బాలానంద పల్నాటి వీర చరిత్ర [102] |
నాగశ్రీ |
కథా సాహిత్యం, చరిత్ర |
|
6020010028984 |
1998
|
బాలానంద యాదగిరి నరసింహస్వామి చరిత్ర [103] |
నాగశ్రీ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
6020010032199 |
1986
|
బాలానంద శ్రీ కాళహస్తి మహాత్మ్యం [104] |
నాగశ్రీ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120007057 |
1986
|
బాహాటము [105] |
వాగ్భాటాచార్య |
సాహిత్యం |
|
2030020025537 |
1926
|
బ్రాహ్మణీకం [106] |
గుడిపాటి వెంకట చలం |
సాహిత్యం, నవల |
బ్రాహ్మణీకం నవల ప్రముఖ తెలుగు రచయిత చలం రచించారు. సంప్రదాయ కుటుంబాల్లో స్త్రీలకు ఆనాడు (దాదాపు 80ఏళ్ల క్రితం) జరిగిన అన్యాయాలను, అనాచారాలను వ్యతిరేకిస్తూ చేసిన రచన ఇది. |
2020050016565 |
1939
|
బి.ఎ.కూచిపూడి నృత్యం [107] |
పోణంగి శ్రీరామ అప్పారావు, కె.ఉమారామారావు |
పాఠ్యగ్రంథం |
|
2020120007044 |
1994
|
బి.ఎన్.భాషితాలు [108] |
బి.ఎన్.రెడ్డి |
నీతి పద్యాలు |
|
2020120034275 |
2002
|
బి.నందంగారి ఆసుపత్రి [109] |
తురగా జానకీరాణి |
నాటికల సంపుటి, బాలల సాహిత్యం |
|
2020120032233 |
1992
|
బ్రిటను దేశ చరిత్ర [110] |
ఖండపల్లి బాలేందు శేఖరం |
చరిత్ర |
సెల్టుల నుంచి మొదలుకొని ఇటీవలి పార్లమెంటు పరిపాలన వరకూ వేలయేళ్ల బ్రిటన్ దేశ చరిత్రను వివరిస్తూ ఈ గ్రంథాన్ని రచించారు. తేలికైన భాషలో లోతైన వివరాలను రచయిత అందించారు. |
2990100067421 |
1967
|
బ్రిటిష్ రాజ్యాంగ చరిత్ర [111] |
వెంకట సుబ్రహ్మణ్యం |
చరిత్ర |
బ్రిటీష్ రాజ్యాంగ వ్యవస్థ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన వాటిలో ఒకటిగా పేరుగాంచింది. భారతదేశానికి స్వాతంత్ర్యం, ఆపైన సమర్థత సాధించుకునే క్రమంలో పలువురు రాజ్యాంగవేత్తలు ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను, రాజ్యాంగ వ్యవస్థలను పరిశీలించారు. ఆ నేపథ్యంలో రాసిన గ్రంథమే ఇది.
|
2030020025562 |
1950
|
బిల్హణీయము [112] |
పండిపెద్ది కృష్ణస్వామి |
పద్యకావ్యం |
సంస్కృతంలోని సుప్రసిద్ధమైన బిల్హణీయమనే కావ్యం పండిపెద్ది వారు తెలుగులోకి పద్యకావ్యంగా అనువదించారు. ఆ గ్రంథాన్ని వావిళ్ళవారు ప్రైవేటు సర్క్యులేషన్‌కు మాత్రమే ఉపయోగించేలా పండిత ప్రతి (స్కాలర్ ఎడిషన్)గా ప్రచురించారు. |
2030020025463 |
1914
|
బిల్వమంగళ [113] |
మూలం.గిరీశ్ చంద్ర ఘోష్, అనువాదం.శ్రీపాద కామేశ్వరరావు |
నాటకం, అనువాద నాటకం |
బిల్వమంగళుని గాథ తెలుగులో చింతామణి నాటకంగా సుప్రసిద్ధం. ఐతే కామేశ్వరరావు తిరిగి బెంగాలీలో ఈ కథను ఆధారంగా చేసుకుని గిరీశ్ చంద్ర ఘోష్ రచించిన నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. |
2030020024769 |
1927
|
బిల్హణీయము (నాటకం) [114] |
మారేపల్లి రామచంద్రశాస్త్రి |
నాటకం |
బిల్హణీయం సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ప్రాచుర్యం వహించిన కావ్యం. అట్టి కావ్యాన్ని ఈ రూపంలో రామచంద్రశాస్త్రి నాటకీకరించారు. |
2030020025238 |
1913
|
బిల్హణ చరిత్రము [115] |
పరిష్కరణ, వ్యాఖ్యానం: వేదము వెంకటరాయశాస్త్రి |
కావ్యం |
వేదము వెంకటరాయశాస్త్రి తెలుగు, సంస్కృతభాషల్లో సుప్రసిద్ధ పండితులు. ఆయన పలు సంస్కృత కావ్యాలకు తెలుగులో టీక, వ్యాఖ్యలు వ్రాసి ప్రచురించారు. తెలుగులో పలు కావ్యాలకు అపురూపమైన వ్యాఖ్యలతో పరిష్కరించి ప్రచురించారు. ఈ క్రమంలో సంస్కృతాంధ్రాలకు చెందిన నాగానందం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఉత్తర రామచరితం, విక్రమోర్వశీయం, రత్నావళి, శ్రీ బిల్హణచరిత్రము, ఆముక్తమాల్యద వంటి కావ్యాలను సటీకా వ్యాఖ్యలతో ప్రచురించారు. ఇవే కాక ప్రతాపరుద్రీయం అనే చారిత్రిక నాటకాన్ని రచించారు. అలా శ్రీ బిల్హణ చరిత్రము గ్రంథం టీకా తాత్పర్యసహితంగా ప్రకటించారు. |
5010010031931 |
1911
|
బుద్ధ పురాణము [116] |
పెన్మెత్స రాజంరాజు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034311 |
1983
|
బుద్ధిమతీ విలాసము [117] |
బలిజేపల్లి లక్ష్మీకాంతకవి |
నాటకం, పౌరాణిక నాటకం |
శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు. మమత, మోహాలను వదులుకొని మరీ శివభక్తిలో తరించినట్టుగా చెప్పేదీ శిరియాళుని కథ. |
2030020025159 |
1932
|
బుద్ధిసాగర విజయము [118] |
పళ్ళె వేంకటసుబ్బారావు |
నాటకం |
సువర్ణముఖి, గంగాబాయి, త్రిభువనము, చిత్రభారతము, దుర్యోధన పరాభవము మొదలైన నాటకాలు రచించిన పళ్ళె వెంకటసుబ్బారావు దీనిని రచించారు. బుద్ధిసాగర విజయము అనే జానపద నాటకం ఇది.
|
2030020025005 |
1923
|
బుద్ధిశాలి [119] |
ధనికొండ హనుమంతరావు |
కథా సాహిత్యం |
ఈ గ్రంథం హనుమంతరావు రచించిన పలు కథల సంపుటి. |
2030020024683 |
1947
|
బృహన్నల నాటకం [120] |
ధర్మవరం కృష్ణమాచార్యులు |
నాటకం, పౌరాణిక నాటకం |
మహాభారత అంతర్గతమైన విరాట పర్వం ఈ నాటకానికి కథా వస్తువు. పాండవులు జూదంలో ఓడిపోయి పుష్కరకాలం అరణ్యవాసం ముగించుకున్నాకా అజ్ఞాత వాసం కోసం విరాట రాజు కొలువులో చేరుతారు. ఆపైన సాగే కథ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఈ నాటకం ఆ ఇతివృత్తాన్ని స్వీకరించింది. దీనికి గల మరో పేరు ఉత్తర గోగ్రహణం. |
2030020025208 |
1929
|
బృంద [121][dead link]
|
శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి
|
నాటకం, పౌరాణిక నాటకం
|
పద్మపురాణంలోని బృందా జలందర సంబంధమైన ఇతివృత్తాన్ని స్వీకరించి కవి తన ఊహలతో అభివృద్ధి చేసి నాటకాన్ని రచించారు. మొదట కవి స్నేహితుడొకడు సినిమా తీసేందుకు సంకల్పించి ఈ గ్రంథం వ్రాయించినా తర్వాత వేరే సినిమా కంపెనీ వారు దాదాపుగా ఇదే కథతో సినిమా తీసేసి ఉందడంతో విరమించుకున్నారు, ఆపైన నాటకం కోసం ఇదే కథను కొన్ని మార్పులు చేసి ఈ గ్రంథం రూపంలో అందించారు.
|
2030020025165
|
1941
|
బంగన్ బకావలి [122] |
అయినాపురపు సుందర రామయ్య |
నాటకం |
జానపద ఫక్కీలో రచించిన శృంగారరస ప్రధానమైన నాటకమిది. |
2030020025123 |
1925
|
బెంజిమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము [123] |
పసుమర్తి శ్రీనివాసరావు |
జీవిత చరిత్ర |
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా స్వాతంత్ర్యంలోనూ, ఆధునిక అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర కలిగిన వ్యక్తి. అనేక అంశాల్లో ఆయన తొలి అమెరికన్‌గా పేరొందారు. విద్యుత్తును కనిపెట్టడంలో ఆయన ఆవిష్కరణలు చాలా కీలకంగా పనిచేశాయి. రచయితగా, ముద్రణకర్తగా, సైంటిస్టుగా, పౌర ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి. ఆయన జీవితచరిత్రను ఆంధ్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టేందుకు గాను ఈ గ్రంథం రచించారు రచయిత. |
2030020025608 |
1913
|
కథా భారతి - బెంగాలీ కథానికలు [124][dead link] |
సంకలనం.అరుణ్‌కుమార్ ముఖోపాధ్యాయ, అనువాదం.చల్లా రాధాకృష్ణమూర్తి |
కథలు, అనువాదం |
అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా కథాభారతి అనే శీర్షికను ప్రకటించారు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు. కథాభారతిలో గుజరాతీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, పంజాబీ, ఉర్దూ మొదలైన భారతీయ భాషల్లోని ఉత్తమ కథాసాహిత్యాన్ని ఎంచి అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథం ద్వారా బెంగాలీ కథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. |
99999990129005 |
1991
|
బెడుదూరు హరిశ్చంద్ర నాటకము [125] |
బెడుదూరు రామాచార్యులు, బెడుదూరు కందాడై రంగాచార్యులు |
పౌరాణిక నాటకం |
|
2020010004285 |
1950
|
బేతాళ పంచవింశతిక [126] |
మూలం.గుణాఢ్యుడు, సంస్కృతానువాదం.సోమదేవుడు, ఆంధ్రానువాదం.వెంకట రామారావు |
కథలు |
గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో లేదు. ఈ కథలను తెలుగులోకి వెంకట రామారావు అనువదించారు. |
2030020024625 |
1934
|
బైబిలు దర్శిని-1 [127] |
మూలం: జి.డబ్ల్యూ.ఫూట్, డబ్ల్యూ.పి.బాల్, అనువాదం: పెన్మెత్స సుబ్బరాజు |
సాహిత్యం |
|
2990100071243 |
1986
|
బైబిలు దర్శిని-2 [128] |
మూలం: జి.డబ్ల్యూ.ఫూట్, డబ్ల్యూ.పి.బాల్, అనువాదం: పెన్మెత్స సుబ్బరాజు |
సాహిత్యం |
|
2990100071244 |
1986
|
బైబిలు దర్శిని-3 [129] |
మూలం: జి.డబ్ల్యూ.ఫూట్, డబ్ల్యూ.పి.బాల్, అనువాదం: పెన్మెత్స సుబ్బరాజు |
సాహిత్యం |
|
2990100071245 |
1986
|
బైబిలు దర్శిని-4 [130] |
మూలం: జి.డబ్ల్యూ.ఫూట్, డబ్ల్యూ.పి.బాల్, అనువాదం: పెన్మెత్స సుబ్బరాజు |
సాహిత్యం |
|
2990100071246 |
1986
|
బైబిలు దర్శిని-5 [131] |
మూలం: జి.డబ్ల్యూ.ఫూట్, డబ్ల్యూ.పి.బాల్, అనువాదం: పెన్మెత్స సుబ్బరాజు |
సాహిత్యం |
|
2990100071247 |
1986
|
బొబ్బిలి యుద్ధకథ [132] |
మల్లంపల్లి సోమశేఖరశర్మ |
జానపద సాహిత్యం, చరిత్ర |
జనవరి 23, 1757లో బొబ్బిలి కోటపై జరిగిన ముట్టడిని బొబ్బిలి యుద్ధంగా పేర్కొంటారు. దక్షిణభారతదేశ చరిత్రలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ప్రాముఖ్యత వహించిన ఘతన. ఈ యుద్ధానికి చారిత్రిక ప్రాధాన్యత మాత్రమే కాక యుద్ధం సమయంలో పలువురు వీరులు చూపిన త్యాగం, ధైర్యం, సాహసం వంటి వాటి వల్ల ప్రజల్లో సాంస్కృతికమైన ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలో సాహసం చూపి పోరాడి మరణించిన తాండ్ర పాపారాయుని పట్ల ప్రజాబాహుళ్యంలో వందల సంవత్సరాలుగా ఆరాధన నెలకొంది. ఈ యుద్ధగాథను జానపద కళాకారులు బుర్రకథగా విస్తృతమైన ప్రదర్సనలు చేసి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఈ గ్రంథంలో అలాంటి జానపద వాౙ్మయాన్నే మూడు ప్రతుల ద్వారా పరిష్కరించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు, తెలుగు వారి చరిత్రలో ఎన్నో కోణాలు వెలికితీసిన చిరస్మరణీయులు మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రచురించారు. ఆయన చరిత్ర పరిశోధకులు కావడంతో ప్రామాణిక చరిత్రకూ ఈ గ్రంథంలోని సమాంతర చరిత్రకూ మధ్య తేడాలు వంటీ వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. |
2990100051619 |
1956
|
బొమ్మల అల్లాఉద్దీన్ అద్భుతదీపం [133] |
రెంటాల గోపాలకృష్ణమూర్తి |
కథ |
|
2020120034150 |
1988
|
బొమ్మల ఆలివర్ ట్విస్ట్ [134] |
మూలం: చార్లెస్ డికేన్స్, అనువాదం: సింగంపల్లి అప్పారావు |
కథా సాహిత్యం |
|
2020120032190 |
2000
|
బొమ్మల ఏసుక్రీస్తు మహిమలు [135] |
బూరెల సత్యనారాయణమూర్తి |
కథా సాహిత్యం |
|
2020120034157 |
1999
|
బొమ్మల గలివర్ సాహసయాత్ర [136] |
ఎస్.కె.వెంకటాచార్యులు |
యాత్రా సాహిత్యం |
|
2020120034152 |
1988
|
బొమ్మల జయప్రకాశ్ నారాయణ్ [137] |
మలయశ్రీ |
బాల సాహిత్యం |
|
2020120034663 |
1999
|
బొమ్మల డాన్ క్విక్సోట్ సాహస యాత్రలు [138] |
అనువాదం: సింగంపల్లి అప్పారావు |
యాత్రా సాహిత్యం |
|
2020120034158 |
2000
|
బొమ్మల డేవిడ్ కాఫర్ ఫీల్డ్ [139] |
మూలం: చార్లెస్ డికేన్స్, అనువాదం: సింగంపల్లి అప్పారావు |
కథా సాహిత్యం |
|
2020120032191 |
2000
|
బొమ్మల పంచతంత్రం-మొదటి భాగం [140] |
పురాణపండ రంగనాధ్ |
బాల సాహిత్యం, రాజనీతి |
పంచతంత్ర కథలు వేలయేళ్ళుగా అపురూపమైన బాల సాహిత్యంగా, వ్యక్తిత్వ నిర్మాణ సాహిత్యంగా ఉపకరిస్తున్నాయి. జంతువులను పాత్రలుగా పెట్టి మానవులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విషయాలు బోధించారు. ఈ గ్రంథంలో పంచతంత్రంలోని సంధి, విగ్రహాలను బాలలకు ఇష్టమైన బొమ్మల కథల్లా అందించారు బాలానంద సంస్థ వారు. |
2020120034160 |
1988
|
బొమ్మల పంచతంత్రం-రెండో భాగం [141] |
మూలం.విష్ణుశర్మ, కథానువాదం.పురాణపండ రంగనాథ్ |
బాల సాహిత్యం, రాజనీతి |
పంచతంత్ర కథలు వేలయేళ్ళుగా అపురూపమైన బాల సాహిత్యంగా, వ్యక్తిత్వ నిర్మాణ సాహిత్యంగా ఉపకరిస్తున్నాయి. జంతువులను పాత్రలుగా పెట్టి మానవులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విషయాలు బోధించారు. ఈ గ్రంథంలో పంచతంత్రంలోని సంధి, విగ్రహాలను బాలలకు ఇష్టమైన బొమ్మల కథల్లా అందించారు బాలానంద సంస్థ వారు. |
2020120000088 |
1993
|
బొమ్మల భారతం [142] |
పురాణపండ రంగనాధ్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120032189 |
2000
|
బొమ్మల యోగి వేమన [143] |
మలయ శ్రీ |
బాల సాహిత్యం, జీవిత చరిత్ర |
వేమన తెలుగునాట కవిగా, యోగిగా సుప్రసిద్ధుడు. ఈ గ్రంథంలో ఆయన జీవితాన్ని బాలల కోసం అలతి పదాలు, బొమ్మల్లో రచించారు. |
2020120004000 |
1990
|
బొమ్మల రాజూ-పేద [144] |
మూలం: మార్క్ ట్వైన్, అనువాదం: సింగంపల్లి అప్పారావు |
కథా సాహిత్యం |
|
2020120019818 |
2000
|
బొమ్మల రాబిన్ హుడ్ సాహస కథలు [145] |
సింగంపల్లి అప్పారావు |
కథా సాహిత్యం |
|
2020120034161 |
2000
|
బొమ్మల రామాయణం [146] |
పురాణపండ రంగనాధ్ |
ఆధ్యాత్మికం సాహిత్యం |
|
2020120034162 |
1990
|
బొమ్మల రెండు మహానగరాల కథ [147] |
మూలం: చార్లెస్ డిక్సెన్, అనువాదం: సింగంపల్లి అప్పారావు |
చరిత్ర, అనువాదం |
|
2020120032193 |
2000
|
బొమ్మల శ్రీకృష్ణ లీలలు [148] |
రెంటాల గోపాలకృష్ణ |
బాల సాహిత్యం, ఆధ్యాత్మికం, కథా సాహిత్యం |
|
6020010007053 |
1984
|
బొమ్మల సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి [149] |
నాగశ్రీ |
బాల సాహిత్యం |
|
2020120034163 |
1992
|
బంగారు సంకెళ్ళు[150] |
మల్లాది సుబ్బమ్మ |
స్త్రీవాదం |
మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య. ఆమె రచించిన గ్రంథమిది.
|
2020120000102 |
1984
|
బందిపోటు దొంగ [151] |
కేతవరపు రామకృష్ణ శాస్త్రి |
జానపద సాహిత్యం, డిటెక్టివ్ నవల |
ఛత్రపతి శివాజీ కాలం ఇతివృత్తంగా ఒక బందిపోటు దొంగ గురించి వ్రాయబడిన కాల్పనిక రచన |
2020050016605 |
1937
|