తెలంగాణ నగరాల జాబితా జనాభా ప్రకారం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి.(ఫిబ్రవరి 2025) |
తెలంగాణ రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న నగరాల జాబితా క్రింద ఇవ్వబడింది.









నగరాల జాబితా
మార్చునగరాలు: లక్ష లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను నగరాలు అంటారు.[1] 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలో లక్ష లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన నగరపాలక సంస్థలు ఎనిమిది, పురపాలక సంఘాలు ఆరు ఉన్నాయి.[2] వీటిలో 2025 లో కొత్తగా మంచిర్యాల, మహబూబ్‌నగర్ పట్టణాలు నగరపాలక సంస్థలుగా ఏర్పడ్డాయి. మంచిర్యాల నగరపాలక సంస్థలో నస్పూర్, క్యాతనపల్లి పురపాలికలతో పాటుగా ముల్కల్ల, గుడిపేట, వేంపల్లి మేజర్ గ్రామ పంచాయితీలు విలీనం అయ్యాయి. మంచిర్యాల నగరపాలక సంస్థ మొత్తం జనాభా నాలుగు లక్షలకు (447,543) చేరింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థలో దివిటీపల్లి, భుత్పూర్ లు విలీనం కాగా, జనాభా మూడు లక్షలకు (386,097) చేరింది.
గమనిక: భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "ది రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్, ఇండియా" వారిచే నిర్వహించబడిన "భారత జనగణన గణాంకాలు 2011" ఆధారంతో ఈ గణాంకాల డేటా రాయబడింది.
లక్షకంటే ఎక్కువ జనాభా కల నగరాలు 2024 ప్రకారం
మార్చుస్థానం | నగరం | జిల్లా | పూర్వపు జిల్లా అయితే | పౌర స్థితి | జనాభా (2011) |
---|---|---|---|---|---|
1 | హైదరాబాదు | హైదరాబాదు | హైదరాబాదు | నగరపాలక సంస్థ | 6,993,262 |
2 | వరంగల్ | హన్మకొండ | వరంగల్ పట్టణ జిల్లా | నగరపాలక సంస్థ | 704,570 |
3 | నిజామాబాదు | నిజామాబాదు | నిజామాబాదు | నగరపాలక సంస్థ | 7,11,644 |
4 | ఖమ్మం | ఖమ్మం | ఖమ్మం | నగరపాలక సంస్థ | 542,076 |
5 | కరీంనగర్ | కరీంనగర్ | కరీంనగర్ | నగరపాలక సంస్థ | 736,206 |
6 | రామగుండం | పెద్దపల్లి | కరీంనగర్ | నగరపాలక సంస్థ | 354,552 |
7 | మహబూబ్ నగర్ | మహబూబ్ నగర్ | మహబూబ్ నగర్ | నగరపాలక సంస్థ | 386,097 |
8 | మంచిర్యాల | మంచిర్యాల | ఆదిలాబాద్ | నగరపాలక సంస్థ | 452,563 |
9 | నల్గొండ | నల్గొండ | నల్గొండ | పురపాలక సంఘం గ్రేడ్ -1 | 154,326 |
10 | ఆదిలాబాద్ | అదిలాబాద్ | అదిలాబాద్ | పురపాలక సంఘం గ్రేడ్ -1 | 117,167 |
11 | సూర్యాపేట | సూర్యాపేట | నల్గొండ | పురపాలక సంఘం గ్రేడ్ -1 | 106,805 |
12 | మిర్యాలగూడ | నల్గొండ | నల్గొండ | పురపాలక సంఘం గ్రేడ్ -1 | 104,918 |
13 | జగిత్యాల | జగిత్యాల | కరీంనగర్ | పురపాలక సంఘం గ్రేడ్ -1 | 103,390 |
1 లక్ష కంటే తక్కువ జనాభా కల పట్టణాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం 50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు.
మిగిలిన జిల్లా ముఖ్య పట్టణాలు
మార్చుసంఖ్య. | పట్టణం | జిల్లా | పూర్వపు జిల్లా | పౌర స్థితి | 2011 జనాభా |
---|---|---|---|---|---|
1 | మెదక్ | మెదక్ | మెదక్ | పురపాలక సంఘం గ్రేడ్ -2 | 46,880 |
2 | మహబూబాబాద్ | మహబూబాబాదు | వరంగల్ | పురపాలక సంఘం గ్రేడ్ -2 | 52,851 |
3 | భూపాలపల్లి | జయశంకర్ భూపాలపల్లి | వరంగల్ | నగర పంచాయితీ | 42,387 |
4 | నారాయణపేట | నారాయణపేట | మహబూబ్ నగర్ | పురపాలక సంఘం గ్రేడ్ -3 | 41,752 |
5 | పెద్దపల్లి | పెద్దపల్లి | కరీంనగర్ | నగర పంచాయితీ | 41,171 |
6 | మేడ్చల్ | మేడ్చల్-మల్కాజ్‌గిరి | రంగారెడ్డి | పురపాలక సంఘం గ్రేడ్ -3 | 35,611 |
7 | శంషాబాద్ | రంగారెడ్డి | రంగారెడ్డి | జీహెచ్‌ఎంసీ | 32,583 |
8 | నాగర్‌కర్నూల్ | నాగర్‌కర్నూల్ | మహాబుబ్‌నగర్ | నగర పంచాయితీ | 26,801 |
9 | ఆసిఫాబాద్ | కొమరంభీం | ఆదిలాబాద్ | జనగణన పట్టణం | 23,059 |
10 | యాదగిరిగుట్ట | యాదాద్రి భువనగిరి | నల్గొండ | జనగణన పట్టణం | 20,120 |
11 | ములుగు | ములుగు | వరంగల్ | జనగణన పట్టణం | 12,135 |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Census 2011 definition". The Registrar General & Census Commissioner, India. Archived from the original on 17 June 2007. Retrieved 10 September 2020.
- ↑ "Cities, Towns and Outgrowth Wards". Citypopulation.de. Retrieved 10 September 2020.