సూర్యాపేట

తెలంగాణ, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం లోని పట్టణం
(Suryapet నుండి దారిమార్పు చెందింది)

సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలానికి చెందిన పట్టణం,[4][5] సూర్యాపేట జిల్లా యొక్క ప్రధాన కేంద్రం.[6] అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం కింద సూర్యాపేటను అభివృద్ధి చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.[7] పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 లో సూర్యాపేటకు దక్షిణ భారతదేశంలోనే "పరిశుభ్రమైన నగరం"గా అవార్డు లభించింది.[8][9] దీనిని "గేట్‌వే ఆఫ్ తెలంగాణ" అని కూడా అంటారు.[10]

సూర్యాపేట
సూర్యాపేట
Nickname: 
సన్ సిటీ
సూర్యాపేట is located in Telangana
సూర్యాపేట
సూర్యాపేట
తెలంగాణలో ప్రాంతం
సూర్యాపేట is located in India
సూర్యాపేట
సూర్యాపేట
సూర్యాపేట (India)
Coordinates: 17°08′29″N 79°37′25″E / 17.1415°N 79.6236°E / 17.1415; 79.6236
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లాసూర్యాపేట జిల్లా
Government
 • Typeపురపాలకసంఘం
 • Bodyసూర్యాపేట పురపాలకసంఘం
 • ఎమ్మెల్యేగుంటకండ్ల జగదీష్‌రెడ్డి (బిఆర్ఎస్)
విస్తీర్ణం
 • Total35 కి.మీ2 (14 చ. మై)
Elevation
178 మీ (584 అ.)
జనాభా
 (2011)[1][2][3]
 • Total1,05,250[1]
 • Rank10వ (తెలంగాణలో)
306వ (భారతదేశంలో)
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
508 213
టెలిఫోన్ కోడ్91-8684
Vehicle registrationటిఎస్–29
Sex ratio1000:923 /
HDI Categorymedium
Literacy84.88%

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[11]

చరిత్ర

మార్చు

ఒకప్పుడు ఈ పట్టణం భానుపురి అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారింది. చాళుక్యులు, కాకతీయులు, నిజాం రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించారు.[12] సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యాపేటలో నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.[13] ఈ పట్టణం తెలంగాణ ముఖద్వారం అని కూడా చెప్పుకోవచ్చు. సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి 134 కి. మీ. (83 మై.) దూరంలో, విజయవాడకి 138 కి. మీ. (86 మై.) దూరంలో ఉంది. 1952లో గ్రేడ్ -3 సూర్యాపేట పురపాలకసంఘంగా ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 1984లో గ్రేడ్ -2, 1998 నవంబరు 7న గ్రేడ్ -1 పురపాలక సంఘంగా మార్చబడింది.[14]

భాషలు

మార్చు
 
సూర్యాపేట బస్ స్టాండ్

తెలుగు, కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు.

తపాలా సౌకర్యం

మార్చు

సూర్యాపేటకు స్పీడు పోష్టు సౌకర్యంతో కూడిన తపాలా కార్యాలయం ఉంది.

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km 2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359

ప్రభుత్వ భవనాలు

మార్చు

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల, జాతీయస్థాయి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను 2023, ఆగస్టు 20న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[15] ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  • సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం: కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌కు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ ఎస్. వెంకట్రావును కుర్చీలో కుర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపాడు. జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని 21 ఎకరాల్లో 50 కోట్ల రూపాయలతో 1.25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా ఈ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటుచేశారు. ప్రాంగణంలో సుమారు 70రకాల మొక్కలు నాటారు. కలెక్టరేట్‌కు విద్యుత్‌కు బదులు సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.65లక్షలతో వంద కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కోసం కలెక్టరేట్‌కు మిషన్‌ భగీరథ నీటిని వినియోగించనున్నారు. అందుకు కలెక్టరేట్‌ సముదాయం వద్ద 1.20లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంకులు నిర్మించారు. ఈ ట్యాంకులకు ఖమ్మం రోడ్డులోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు.[16]
  • పోలీసు కార్యాలయం: సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేసీఆర్ కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, హోంమంత్రి మహమూద్ అలీ రిబ్బన్ కట్ చేసి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించాడు. నూతన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. 20 ఎకరాల్లో 38.50 కోట్ల రూపాయలతో మూడు అంతస్తుల్లో సుమారు 60వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ కార్యాలయంలో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎ‌స్‌‌డీ‌లకు ప్రత్యేక గదు‌ల‌తో‌పాటు రెస్ట్‌ రూంలు, నేరా‌లను ఛేదిం‌చేలా క్రైం విభాగం, పరి‌పా‌లనా విభా‌గా‌ల‌ఉ, ఇంటె‌లి‌జెన్స్‌, డాగ్‌ స్క్వాడ్‌, డిజి‌టల్‌ ల్యాబ్‌లు, ట్రైనింగ్‌ హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, సైబర్‌ ల్యాబ్‌, పీడీ సెల్‌, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌‌వార్డు, ఔట్‌‌వార్డు, మినీ కాన్ఫ‌రె‌న్స్‌‌హాల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, పార్కు ఏర్పాటుచేయబడ్డాయి.
  • వైద్య కళాశాల: పండితుల వేదమంత్రోచ్ఛారణలతో కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం కేసీఆర్ రిబ్బన్ కట్ చేయడంతోపాటు కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రిమోట్ కంట్రోల్ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో చేతులు కలిపి ముచ్చటించిన కేసీఆర్, వారి చదువు వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.[17]
  • వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్: పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రిమోట్ కంట్రోల్ తో, రిబ్బన్ కట్ చేసి మార్కెట్ ను కేసీఆర్ ప్రారంభించాడు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మార్కెట్ ను పరిశీలించి, కూరగాయల అమ్మకందారులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నాడు.[18] 30.18 కోట్ల రూపాయలతో 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలోనే అతిపెద్దగా ఈ మార్కెట్‌ను నిర్మించారు. ఆరుఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకుల్లో 200 దుకాణాలు ఉన్నాయి. రోజుకు 9 నుంచి 10గంటల పాటు స్కైషేడ్‌తో పగటి వెలుగు ప్రసరించేలా ఏర్పాటుచేశారు. దేశంలోనే ఈ తరహా మార్కెట్‌ నిర్మాణంలో ఇదే మొదటిది కావడం విశేషం. మార్కెట్‌లోని దుకాణాల్లో విద్యుత్‌ లైట్లు అవసరం లేకుండా పగటి వేళల్లో స్కైషేడ్‌ ద్వారా వెలుతురు ప్రసారం అవుతుంది. ఈ మార్కెట్‌లో పండ్లు, పూలు, మటన్‌, చికెన్‌, కూరగాయలు, చేపలతో పాటు ఇంకా పలు రకాల వస్తువులు ఒకే చోట లభించేలా నిర్మించారు.
  • ఐటీ హబ్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో సూర్యాపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట ఐటీ హబ్ ను నిర్మించింది. 2023, అక్టోబరు 2న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ హబ్ ను ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశాడు.[19][20]

బ్రాహ్మణ సదన భవనం

మార్చు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని 2023, అక్టోబరు 1న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.[21] ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారులు కె.వి. ర‌మ‌ణాచారి, బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, సిఎంఓ పిఆర్‌ఓ, బ్రాహ్మణ పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ జ్వాలా నరసింహారావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, బ్రాహ్మణ సంఘాలు, పీఠాధిప‌తులు, పండితులు పాల్గొన్నారు.[22]

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Basic Information". Official website of Suryapet. Archived from the original on 11 ఏప్రిల్ 2018. Retrieved 21 February 2016.
  2. "Cities, Towns and Outgrowth Wards". Citypopulation.de. Retrieved 19 September 2015.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 3 May 2015.
  4. "Cities having population 1 lakh and above, Census 2011" (PDF).
  5. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 11 October 2016.
  6. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  7. "AP identifies 31, Telangana 15 cities under AMRUT scheme". Eenadu English Portal. Archived from the original on 2015-11-27. Retrieved 2023-11-22.
  8. Singh, S Bachan Jeet (1 May 2017). "Suryapet among top 10 cleanest cities in India". The New Indian Express. Retrieved 15 August 2019.
  9. "Swachh Survekshan -2017 – ranks of 434 cities" (PDF). Archived from the original (PDF) on 2017-07-12. Retrieved 2023-11-22.
  10. http://suryapetmunicipality.com/
  11. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  12. "Suryapet Municipality Introduction". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Government of Telangana. Archived from the original on 4 March 2016. Retrieved 15 February 2016.
  13. "నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ".[permanent dead link]
  14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  15. Velugu, V6 (2023-08-20). "సూర్యాపేటలో కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  16. ABN (2023-08-19). "సీఎం పర్యటనకు పేట ముస్తాబు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.
  17. telugu, NT News (2023-08-20). "CM KCR | సూర్యాపేటలో కేసీఆర్‌ పర్యటన.. మెడికల్‌ కాలేజీ ప్రారంభించిన సీఎం". www.ntnews.com. Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.
  18. "CM KCR : సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. పలు కార్యాలయాలు ప్రారంభం". EENADU. 2023-08-20. Archived from the original on 2023-08-20. Retrieved 2023-08-22.
  19. "TS: సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Prabha News. 2023-10-02. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
  20. "Trending news: ఐటీ హబ్‌తో భవిష్యత్‌కు భరోసా". Sakshi Education. 2023-10-05. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
  21. telugu, NT News (2023-10-01). "Viprahitha Brahmin Sadan | 2.50 కోట్లతో విప్రహిత బ్రాహ్మణ సదన్‌.. నేడు సూర్యాపేటలో ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2023-10-01. Retrieved 2023-11-22.
  22. "బ్రాహ్మణులు భాగస్వాములు కావాలి". Sakshi. 2023-10-02. Archived from the original on 2023-11-22. Retrieved 2023-11-22.

ఇవి కూడా చూడండి

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

మార్చు