ఉత్పలమాల
(ఉత్పల మాల నుండి దారిమార్పు చెందింది)
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఉత్పల మాల వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.[1]
ఉత్పల మాల
మార్చుభానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
- ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
- యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
- ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
గణవిభజన
మార్చుభ | ర | న | భ | భ | ర | వ |
U I I | U I U | I I I | U I I | U I I | U I U | I U |
పుణ్యుడు | రామచం | ద్రుడట | పోయిము | దంబున | గాంచెదం | డకా |
ఉదాహరణలు
మార్చుపోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ.
ఉదాహరణ 1
మార్చుపుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్
ఉదాహరణ 2
మార్చుఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్
తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం సారపు ధర్మమున్ విమల సత్యము ఉత్పలమాలకు మరొక ఉదాహరణ.
మూలాలు
మార్చు- ↑ మిరియాల), Dileep Miriyala(దిలీపు. "ఉత్పలమాల — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2021-06-18. Retrieved 2019-08-25.
- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "ఉత్పలమాల : ఛందోపరిచయము : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2019-08-25.
బాహ్య లంకెలు
మార్చు- #ఛందస్సు-ఉత్పలమాల #chandassu part -2#utpalamala#Telugu grammar#vyakaranam#TET#DSC#s.i Telugu grammar (in ఇంగ్లీష్), retrieved 2019-08-25