కళారత్న పురస్కారాలు - 2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న (హంస) పురస్కారం.[1] 2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 47 మందికి కళారత్న పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్, శాసనసభ ఉప సభాధిపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.[2]

కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు.
వ్యవస్థాపిత 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2017
మొత్తం బహూకరణలు 47
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000
Award Rank
2017కళారత్న2019


పురస్కార గ్రహీతలు

మార్చు
క్రమసంఖ్య పేరు రంగం జిల్లా పేరు
1 సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం తూర్పుగోదావరి జిల్లా
2 వేటూరి ఆనందమూర్తి సాహిత్యం కృష్ణా జిల్లా
3 అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సాహిత్యం గుంటూరు జిల్లా
4 ఎస్.కె. హుస్సేన్ సత్యాంగి సాహిత్యం కడప జిల్లా
5 ఎం.పి. జానుకవి సాహిత్యం ప్రకాశం జిల్లా
6 వాసా ప్రభావతి సాహిత్యం గుంటూరు జిల్లా
7 డా. కె.వి.కృష్ణకుమారి సాహిత్యం గుంటూరు జిల్లా
8 డా. మొదలి నాగభూషణశర్మ సాహిత్యం గుంటూరు జిల్లా
9 అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం శ్రీకాకుళం జిల్లా
10 డా. జి.వి. పూర్ణచంద్ సాహిత్యం కృష్ణా జిల్లా
11 జయప్రకాశ్ రెడ్డి తెలుగు నాటకం గుంటూరు జిల్లా
12 సురభి వేణుగోపాలరావు తెలుగు నాటకం కడప జిల్లా
13 డా. జి. రవికృష్ణ తెలుగు నాటకం కర్నూలు జిల్లా
14 వి. సత్యనారాయణ సంగీతం (నాదస్వరం) చిత్తూరు జిల్లా
15 పెమ్మరాజు సూర్యారావు సంగీతం (గానం) కృష్ణా జిల్లా
16 తాళ్ళూరి నాగరాజు సంగీతం (వేణువు) తూర్పు గోదావరి జిల్లా
17 భూసురపల్లి వెంకటేశ్వర్లు సంగీత పరిశోధకుడు గుంటూరు జిల్లా
18 అశోక్ గురజాల సంగీతం కర్నూలు జిల్లా
19 ఎం.ఎం. శ్రీలేఖ సంగీత దర్శకురాలు పశ్చిమ గోదావరి జిల్లా
20 భాగవతుల వెంకటరామ శర్మ నృత్యం కృష్ణా జిల్లా
21 డి. దేవికా రాణి వుడయార్ శిల్పం పశ్చిమ గోదావరి జిల్లా
22 దొడ్డి సతీష్ శిల్పం విశాఖపట్నం జిల్లా
23 డివిలి అప్పారావు శిల్పం శ్రీకాకుళం జిల్లా
24 కె.ఎస్. వాసు చిత్రలేఖనం కృష్ణా జిల్లా
25 చింతలపల్లి కోటేశ్వరావు చిత్రలేఖనం కర్నూలు జిల్లా
26 డి. మురళిబాబు జానపద కళలు విశాఖపట్నం జిల్లా
27 ఉరుముల నాగన్న జానపద కళలు అనంతపురం జిల్లా
28 కొండగొర్రి దాలయ్య జానపద కళలు (సవర) శ్రీకాకుళం జిల్లా
29 ఇందిరా దత్ సామాజిక సేవ కృష్ణా జిల్లా
30 కె. ధర్మారెడ్డి సామాజిక సేవ తూర్పు గోదావరి జిల్లా
31 గుమ్మడి రాధాకృష్ణమూర్తి సామాజిక సేవ గుంటూరు జిల్లా
32 డా. పరి నాయుడు సామాజిక సేవ విజయనగరం జిల్లా
33 డా. శశిధర్ వైద్యం ప్రకాశం జిల్లా
34 డా. ఎ. శ్రీధర్ రెడ్డి వైద్యం కృష్ణా జిల్లా
35 ఈమని శివనాగిరెడ్డి పురావస్తు పరిశోధకుడు గుంటూరు జిల్లా
36 మంజులా నాయుడు టెలివిజన్ చిత్తూరు జిల్లా
37 సింహాచల శాస్త్రి హరికథ చిత్తూరు జిల్లా
38 ఎస్. మనోహర్ రావు ఇంద్రజాలం తూర్పు గోదావరి జిల్లా
39 వంగర సత్యనారాయణ వాస్తు గుంటూరు జిల్లా
40 పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అవధానం కృష్ణా జిల్లా
41 మోదుమూడి సుధాకర్ సంగీతం కృష్ణా జిల్లా
42 సి. రాఘవాచారి పాత్రికేయులు కృష్ణా జిల్లా
43 ఆర్. ఏకాంబరాచార్యులు సాహిత్యం తూర్పు గోదావరి జిల్లా
44 కె. అహోబిలరావు ఛాయాచిత్రగ్రాహకులు కృష్ణా జిల్లా
45 గండ్లూరి దత్తాత్రేయ శర్మ సాహిత్యం కర్నూలు జిల్లా
46
47

మూలాలు

మార్చు
  1. "Hamsa awards are now Kalaratna". The Hindu. 2006-08-16. ISSN 0971-751X. Retrieved 2021-04-05.
  2. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (18 March 2018). "పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Archived from the original on 22 మార్చి 2018. Retrieved 18 March 2018.