కర్మ సిద్ధాంతము

(ఖర్మ సిద్ధాంతం నుండి దారిమార్పు చెందింది)

కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.[1]
కర్మ (సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది.
కర్మ సిద్దాంతము ప్రకారము : పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.
కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు[1].
అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం.విధిరాత నే వారు కర్మగా భావిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది[2]. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.
ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు.
అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.[3]

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము
కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।

మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।

సాంఖ్య యోగము-భగవద్గీత

"కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు"

కర్మవాదానికి ఉదాహరణలుసవరించు

పునర్జన్మల పై నమ్మకం, స్వర్గ ప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణ: "నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను" అని కొందరు అంటుంటారు.

ఎన్ని విధాలైన కర్మలుసవరించు

 • సంచిత కర్మ: కర్మ యొక్క మొత్తం
 • ప్రారబ్ధ కర్మ : సంచితం లోనుంచికొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత
 • ఆగామి కర్మ : ప్రారబ్దం వల్ల జరిగే పనులను (మంచి-చెడు) లను నావల్లే జరిగాయని అహన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు

భగవద్గీతలో కర్మసవరించు

కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు.

 • కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉంది. అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి. అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మలలో చిక్కుకోడు. కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు. కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి. యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్ఠుడిని కర్మలు బంధించలేవు.
 • గీతాకారుడు కర్మ వీడుటకు వీలులేదని, పని చేయనిచో జీవయాత్ర జరుగదు అని, పనిచేయక ఎవరు అరనిముషమైనను ఊరక ఉండజాలరని, ఇఛ్చ లేకున్నను రజోగుణములనుండి పుట్టిన కామ క్రోధములు కార్యమునందు నియోగించునని తెలిపినాడు.
 • కర్మ జగత్తులో మనము బ్రతుకుచున్నాము. మనకు కాలుచేతులు కలవనియు, పనిచేయవలసి యున్నదనియు కార్యమునందు ప్రవృత్తి కలదనియు మనము తలంచుచున్నాము.మనము పని చెయుదము, సుఖ దుఃఖములలో తగులు కుందుము, సంసారములో మునుగు చుందుము, ఇదియే కర్మ బద్ధ స్థితి, కర్మ బంధన మోక్షమే మొక్షము.
 • మనుష్యుడు తన ప్రకృతిని బట్టియే పని చేయుచుండును.ఆత్మ ప్రకృతితో కలిసి యున్నది. కొందరు సత్త్వ గుణ ప్రధానులు. కొందరు తమో గుణ ప్రధానులు, మరికొందరు రజో గుణ ప్రధానులు.మనుష్యుడు బయట కర్మ చేయుచున్నను మనసులోపల చేయునేడల అది కర్మ త్యాగము కాదు. దీని వలన గీతాకారుడు ఇంద్రియనిగ్రహము యొక్క శ్రేష్ఠత్వమును అంగీకరింపలేదు.
 • కర్మ చేయుట మొదలెడినచో నైష్కర్మ్యము సిద్ధింపదని గీతాకారుని విశేషమతము.నైష్కర్మ్యమనగా కర్మ రాహిత్యము.
 • ప్రకృతి యొక్క గుణముల వలన కర్మ జరుగు చున్నది. కాని అహంకార మూఢుడు నేనే కర్తనని తలంచును. యోగముక్తుడు కానివానికి సన్యాసము దుఃఖహేతువు అగును.
 • కర్మయందెవడు అకర్మను, ఆ కర్మయందు కర్మను చూచునో వాడు మనుష్యులలో బుద్ధికలవాడు, వాడు యోగి, వాడు సర్వకర్మ కాలి.
 • కర్మ చేయుము కాని యోగస్థుడువై కర్మ చేయుము; ఫలము కోరనివాడవై కర్మ చేయుము.

బౌద్ధంలో కర్మసవరించు

కోరికే కర్మ. ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు. కర్మలు వారసత్వంతోనే పుడతారు.

హిందూ మతంలో కర్మసవరించు

కర్మ అంటే సరి అయిన అర్ధం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే. నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు. హిందూ ధర్మమం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది. కర్మ అనేది హింధూ ధర్మంతో అనేక విధముల ముడివడి ఉంటుంది. మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం. మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది. కర్మసిద్ధాంతం ఆత్మతో ముడి పడి ఉంటుంది. హింధూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తుంది. ఆత్మను జీవుడు అని కూడా అంటారు. జీవుడు శరీరంలో ప్రవేశింన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెప్తుంది. కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తరువాత కూడా అతడి వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం, నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది. పుణ్యం, పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పీపీలికాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది. ప్రళయ కాలంలో కూడా పుణ్య పాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజ రూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది. కాని మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది. కనుక మనిషి కర్మలను ధర్మబద్ధంచేసి సత్కార్మాచరణ చేసి తనను తాను ఉద్దరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం.

కర్మసన్యాస యోగంసవరించు

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం ఉన్నా దానిని జనసామాన్యానికి ఎక్కువ ఎరుకపరిచింది భగవద్గీత. భగవద్గీతలో కృష్ణభగవానుడు కర్మసన్యాస యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం, కర్మ యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు. జీవులు కర్మ చేయకుండుట ఆసంభవం. జీవుడు చేసిన పుణ్య కర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం, సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని. పాప కర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెడతాడని హిందూ ధర్మం వివరించింది. ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది. పుణ్యలోకాలు, నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెప్తుంది. మనుష్యలోకంలో ప్రాణులకు పాప, పుణ్య, విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరింవి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాప పుణాలకు అతీతములు. మానవ జన్మ మాత్రమే పాప పుణ్యకర్మలు మనసు యొక్క ప్రకోపంతో చేస్తుంటాడు కనుక మానవ జన్మ పాపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాని ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసభవం. పాపమూ, పుణ్యమూ ఎక్కువా తక్కువగా జీవుడిని వెన్నాడుతూ ఉంటాయి కనుక కర్మసన్యాస యోగం మనిషి యోగం, తపస్సు, ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మసన్యాసయోగం ఆచరించి పరమాత్మలో కలసి మోక్షం పొందవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎలాగంటే కర్మసన్యాస యోగంద్వారా పాపపుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు. అందువలన ఆత్మ పరమాత్మలో కలిసి పోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘ కాల ప్రయాణాన్ని ముగించ వచ్చని కర్మసన్యాస యోగం వివరిస్తుంది. కర్మసన్యాస యోగం ఆచరిస్తూ ముక్తి పొందవచ్చనది సారాంశం.

కర్మయోగంసవరించు

"ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు" అని అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడన్నాడు:"కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది" అని పలికాడు. అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తుంది. ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి. కర్మపరిత్యాగం చేసి తపోమార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధనా మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు. పుట్టిన ప్రతి జీవి కర్మచేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు " అర్జునా ! ఉత్తముడు ఏకర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు. ఈ లోకంలో నాకు పొంద తగినది కోరతగినదీ ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మారగం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను " అని చెప్పాడు. యజ్ఞము చేయడం అన్నది కర్మ. కాని యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది. దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞములో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు. లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం. కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది సారాంశం. కర్మ చేయక పోవడం, విదుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుందన్నది హిందూ ధర్మం వివరిస్తుంది.

కర్మ ఫలంసవరించు

హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవత్గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో " కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు " అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అభిగమించ వచ్చని హిందూధర్మం బోధిస్తుంది. అంతేగాక భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది.

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో కర్మ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[4] కర్మ లేదా కర్మము karma. [Skt. √ kri = to do.] n. An act or deed: action in general. పని. Religious action, such as sacrifice; ablution. Actions, conduct, a course of procedure. Destiny; fate, that is, the allotment, to be enjoyed or suffered in the present life, of the fruit of the good and evil actions performed in former lives. Moral duty; obligation imposed by peculiarities of tribe, occupation, &c. Funeral rites. The object of a verb in Grammar. వాని కర్మము ఎవ్వరు చేసారు who performed his funeral rites? An art, as శిల్పకర్మము the art of statuary. Doing: ఇది నీ కర్మమే this is all your doing, it is your own fault. Ill hap, misfortune, hard lot: affliction. అయ్యో కర్మమా O dear! oh what a pity! పాప కర్మము a sinful deed అనగా పాపపు పని. కర్మఠము [Skt.] n. Ceremonial precision. కర్మజీవి లేదా కర్మఠుడు n. A formalist, a ritualist: one who is earnest in the performance of the rites of religion. కార్యమును చివర వరకు సాధించేవాడు. తెలుగు వ్యాకరణంలో కర్మణి క్రియ అనగా A transitive verb, అకర్మ క్రియ an intransitive verb. కర్మరంగము n. The five sided sour green plum called Averrhoa Carambola, or అంబాణవుకాయ. కర్మసాక్షి n. A witness of all our acts, viz., the sun అనగా సూర్యుడు. కర్మాంతరము n. Funeral rites, obsequies.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 http://pustakam.net/?p=4597
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-11. Retrieved 2010-08-13.
 3. http://www.vaartha.com/content/21300/puja.html[permanent dead link]
 4. బ్రౌన్ నిఘంటువు ప్రకారం కర్మ పదప్రయోగాలు.[permanent dead link]