జె. వి. రమణమూర్తి

నటుడు
(జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి నుండి దారిమార్పు చెందింది)

జె. వి. రమణమూర్తి (మే 20, 1933 - జూన్ 22, 2016) గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లాలో మే 20, 1933లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు", "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి", "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు. నాటకరంగంలో దశాబ్దాల సేవలకు గానూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జె.వి.రమణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
200ox
జె. వి. రమణమూర్తి
జననంజొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
మే 20, 1933
విజయనగరం జిల్లా
మరణంజూన్ 22, 2016
హైదరాబాదు
మరణానికి కారణంక్యాన్సర్
వృత్తితెలుగు సినిమా నటుడు
ప్రసిద్ధులుకన్యాశుల్కం లో పాత్ర
మతంహిందూమతం

వ్యక్తిగత వివరాలుసవరించు

రమణమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో 1933లో జన్మించాడు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రమణమూర్తి చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ పెంచుకొన్నాడు. సైన్స్‌ పట్టభద్రుడైన జె.వి.రమణమూర్తి సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్నేహితులతో కలసి అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని నాటకాల్ని ప్రదర్శించేవాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే రంగస్థల నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యిసార్లకిపైగా కన్యాశుల్కంలోని గిరీశం పాత్రని పోషిస్తూ అపర గిరీశంగా పేరు పొందాడు. ఆయన భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌తో కలిసి జీవించేవాడు. రమణమూర్తి మరో ప్రముఖ నటుడైన జె.వి.సోమయాజులు సోదరుడు. [1]

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారంసవరించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది[2].

చిత్ర సమాహారంసవరించు

1950వ దశాబ్దంసవరించు

1960వ దశాబ్దంసవరించు

1970వ దశాబ్దంసవరించు

1980వ దశాబ్దంసవరించు

1990వ దశాబ్దంసవరించు

2000వ దశాబ్దంసవరించు

మరణంసవరించు

వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016, జూన్ 22 వ తేదీన హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[3]

మూలాలుసవరించు

  1. ఈనాడు సినిమా పేజీ, జూన్ 23, 2016
  2. http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522[permanent dead link] తిరుపతిలో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  3. "జె.వి.రమణమూర్తి కన్నుమూత". మూలం నుండి 2016-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-23. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు