నూరేళ్ళ తెలుగు నవల

నూరేళ్ళ తెలుగు నవల 1878 - 1977 సహవాసి కలం పేరుతో జంపాల ఉమామహేశ్వరరావు గారు సంకలనం చేసిన తెలుగు పుస్తకం. దీనికి డి. వెంకట్రామయ్య సంపాదకత్వం వహించగా పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్ వారు 2007 సంవత్సరంలో ముద్రించారు.

అమెరికాలో ఉన్న తెలుగు పాఠకుల కోసం డా. జంపాల చౌదరి సంపాదకత్వంలో వెలువడుతున్న తెలుగునాడి మాసపత్రికలో 2004 నుండి 2007 దాకా కొన్ని నవలా పరిచయాలు ప్రచురించింది.

రచనలు మార్చు

  1. రాజశేఖర చరిత్రము : కందుకూరి వీరేశలింగం
  2. మాలపల్లి : ఉన్నవ లక్ష్మీనారాయణ
  3. బారిష్టరు పార్వతీశం : మొక్కపాటి నరసింహశాస్త్రి
  4. మైదానం : చలం
  5. వేయి పడగలు : విశ్వనాథ సత్యనారాయణ
  6. నారాయణరావు : అడవి బాపిరాజు
  7. చివరకు మిగిలేది : బుచ్చిబాబు
  8. అసమర్థుని జీవయాత్ర : గోపీచంద్
  9. అతడు-ఆమె : ఉప్పల లక్ష్మణరావు
  10. చదువు : కొడవటిగంటి కుటుంబరావు
  11. అల్పజీవి : రావిశాస్త్రి
  12. కీలుబొమ్మలు : డా. జి. వి. కృష్ణరావు
  13. మంచీ-చెడూ : శారద
  14. ప్రజల మనిషి : వట్టికోట ఆళ్వారుస్వామి
  15. పెంకుటిల్లు : కొమ్మూరి వేణుగోపాలరావు
  16. కాలాతీత వ్యక్తులు : డా. పి. శ్రీదేవి
  17. దగాపడిన తమ్ముడు : బలివాడ కాంతారావు
  18. బలిపీఠం : రంగనాయకమ్మ
  19. కొల్లాయి గట్టితేనేమి ? : మహీధర రామమోహనరావు
  20. మైనా : శీలా వీర్రాజు
  21. చిల్లర దేవుళ్ళు : దాశరథి రంగాచార్య
  22. అంపశయ్య : అంపశయ్య నవీన్
  23. పుణ్యభూమి కళ్ళుతెరు : బీనాదేవి
  24. హిమజ్వాల : వడ్డెర చండీదాస్
  25. మట్టిమనిషి : వాసిరెడ్డి సీతాదేవి

మూలాలు మార్చు

  • నూరేళ్ళ తెలుగు నవల 1878-1977 (పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం - పరిశీలన), రచన: సహవాసి, సంపాదకుడు: డి.వెంకట్రామయ్య, పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2007. ISBN 978-81-905756-0-7


ఇవి కూడా చూడండి మార్చు