వట్లూరు రైల్వే స్టేషను
వట్లూరు రైల్వే స్టేషను ఏలూరు సమీపంలో ఉంది. ఇది ఏలూరు రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ రైల్వే డివిజను కింద ఉంది. ఇది దేశంలో 2773వ రద్దీగా ఉండే స్టేషను.[1]
Vatlur వట్లూరు वट्लुर् | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
![]() Vatlur railway station on a cloudy day | |
సాధారణ సమాచారం | |
Location | విజయవాడ రోడ్, వట్లూరు , ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్![]() |
Coordinates | 16°24′50″N 81°14′31″E / 16.4140°N 81.242°E |
Elevation | 16 metres (52 ft) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 4 |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | VAT |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
విద్యుత్ లైను | అవును |
ప్రయాణీకుల సదుపాయాలు మార్చు
ఈ రైల్వే స్టేషనుకు ఎగువ, దిగువ రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా రెండు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. ఇక్కడ ఒక సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది. మొదటి ప్లాట్‌ఫారము మీద ప్రయాణీకుల కొరకు సిమెంట్ సీటింగు ఉంది, ఒక సాధారణ వేచి ఉండు హాలు ఉంది. స్థానిక ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ వద్ద ఆగుతాయి.
విద్యుద్దీకరణ మార్చు
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము పూర్తిగా 1997 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పూర్తిగా 2005 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. ఒక ఎస్‌ఎస్ఎస్పి వట్లూరు రైల్వే స్టేషను పక్కన నిర్మించబడింది.[2]
మూలాలు మార్చు
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "IR History Part VII (2000-present)". IRFCA. Retrieved 2013-01-23.
బయటి లింకులు మార్చు
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |