వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 1

     పాత చర్చ 1   
All Pages:  ... (up to 100)


స్వాగతం

Pavan santhosh.s/పాత చర్చ 1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Pavan santhosh.s/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     --కె.వెంకటరమణ (చర్చ) 17:08, 13 డిసెంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
 
"5 నిముషాల్లో వికీ"
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణ (చర్చ) 17:08, 13 డిసెంబర్ 2013 (UTC)

స్వాగతం మిత్రమా!

సంతోష్, మీకు తెలుగు వికీపీడియాలోకి స్వాగతం! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:37, 14 డిసెంబర్ 2013 (UTC)

పుస్తకం సమాచార పెట్టె

మీరు ప్రారంభించిన ఛెంఘిజ్ ఖాన్ (పుస్తకం) పేజీలో పుస్తకాలకు సంబంధించిన సమాచార పెట్టెను చేర్చాను. దానిలో వివరాలను పొందుపరచండి.Rajasekhar1961 (చర్చ) 07:06, 18 డిసెంబర్ 2013 (UTC)

కొత్త వాక్యం మొదలు పెట్టాలంటే

పవన్ సంతోష్ గారు మనం విజయవాడలో కలిసినప్పుడు మాట్లాడుకున్నట్లుగా, చాలా చక్కగా మీరు వ్యాసాలు వృధ్థి చేస్తున్నందులకు ధన్యవాదాలు! మీరు బసవరాజు_రాజ్యలక్ష్మి వ్యాసం లో కొత్త వాక్యం కోసం కష్ట పడినట్లు అనిపించింది. తెవికీ లో ఒక చిన్న వాక్యం వ్రాసి ఇంకో కొత్త వాక్యం క్రింద రావలంటే వాక్యం చివర <br> ఉంచితే సరి  :) బసవరాజు_రాజ్యలక్ష్మి వ్యాసం లో మీకు చూపించడానికి గాను మార్పులు చేసాను చూడండి. --విష్ణు (చర్చ)20:54, 22 డిసెంబర్ 2013 (UTC)

తెలుగు పత్రికలు

కొన్ని తెలుగు పత్రికలు గురించి వ్యాసాలు మన తెవికీలో ఉన్నాయి. ఇక్కడ వర్గం:తెలుగు పత్రికలు చూడండి. మీవద్ద నున్న మరికొన్ని కొత్త పత్రికల గురించి వ్యాసాలు మొదలుపెట్టండి.Rajasekhar1961 (చర్చ) 09:59, 27 డిసెంబర్ 2013 (UTC)

స్వరాజ్య పత్రిక పేజీలో సమాచారపెట్టె:Newspaper పెట్టాను. ఒకసారి చూసి సమాచారాన్ని పూర్తిచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 16:03, 27 డిసెంబర్ 2013 (UTC)

నాకు తెలిసినంతవరకూ నింపాను. సూచనలకు కృతజ్ఞతలు.--Pavan santhosh.s (చర్చ) 16:39, 27 డిసెంబర్ 2013 (UTC)

మీరు వ్రాస్తున్న వ్యాసాలు

నమస్కారం పవన్ సంతోష్ గారూ, మీరు తెవికీలో కొత్తగా చేరినా తెలుగు సాహిత్యం చక్కని వికీశైలికి తగిన వ్యాసాలు వ్రాస్తున్నారు. శెభాష్!! చాలా ముచ్చటగా ఉంది. మీకు ఆంగ్ల వికీలో పనిచేసిన అనుభవం ఉన్నట్టు నాకనిపించింది. చాలా మంది కొత్తవాళ్ళు వ్యాసాలంటే ఏదో మాగజిన్ ఆర్టికల్స్ లాగా వ్రాసేస్తుంటారు. --వైజాసత్య (చర్చ) 02:49, 31 డిసెంబర్ 2013 (UTC)

కృతజ్ఞతలు వైజా సత్య గారూ! ఐతే మీరన్నట్టు నేను ఆంగ్ల వికీలో పనిచేయలేదు. ఐతే పలు సాహిత్యవ్యాసాలు రాశాను. ఆంగ్లసాహిత్యాన్ని గురించి తెలుసుకునేందుకు పలుమార్లు ఆంగ్లవికీ పేజీలు చదివాను. ఆ నేపథ్యంలో నేను రాసే వ్యాసాలకు వాటికీ మధ్య ఉన్న మౌలికమైన భేదం కొంతవరకూ తెలిసింది. అన్నిటికీ మించి రెహమానుద్దీన్, విష్ణు గార్ల మార్గదర్శకత్వం, మీ వంటివారి సాన్నిహిత్యమే ఇవన్నీ నేర్పింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.--Pavan santhosh.s (చర్చ) 02:55, 31 డిసెంబర్ 2013 (UTC)

నేను కూడా గమనిస్తున్నాను. పవన్ సంతోష్ గారు సాహిత్యంపై చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. మీ కృషి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ అభినందనలు. --రవిచంద్ర (చర్చ) 06:29, 1 జనవరి 2014 (UTC)Reply

తెలుగు పతకం

  తెలుగు మెడల్
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.

కలికి చిలకల కొలికి

కలికి చిలకల కొలికి పాట గురించి మీరు తెలుగు వెలుగులో వ్రాసిన వ్యాసం బాగుంది. దాని గురించి వికీలో కొంత సమాచారాన్ని చేరుస్తున్నాను. దయచేసి ఒకసారి చూసి తప్పులుంటే సవరించండి. వీలుంటే బాగుచేయండి.Rajasekhar1961 (చర్చ) 02:12, 15 జనవరి 2014 (UTC)Reply

థాంక్యూ. అలాగే చూస్తాను. --Pavan santhosh.s (చర్చ) 13:39, 15 జనవరి 2014 (UTC)Reply

ప్రాజెక్టు ఆహ్వానం

మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ కు చెందిన వ్యాసంలో మార్పులు చేయడం గమనించాము. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీ మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. --అర్జున (చర్చ) 04:16, 25 జనవరి 2014 (UTC)Reply

నందోరాజా భవిష్యతి

నందోరాజా భవిష్యతి వ్యాసం బాగుంది. ఇది వికీట్ర్ండ్స్ లో మొదటి పది రేంకుల్లో స్థానం సంపాదించింది. అనగా ఇది మంచి వ్యాసంగా అంతర్జాల వీక్షణలను పొందుతున్నదని అర్ధం. అందుకు మీకు నా ధన్యవాదాలు. చిన్న, అసంపూర్తి వ్యాసాలు కాకుండా, సమగ్రమైన పూర్తిచేసిన వలన వ్యాసాలు పలువురు ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.Rajasekhar1961 (చర్చ) 07:44, 27 జనవరి 2014 (UTC)Reply

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు సర్. నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. --Pavan santhosh.s (చర్చ) 09:16, 27 జనవరి 2014 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

పతకం

  అసాధారణమైన కొత్త తెవికీ సభ్యులు పురస్కారం
తెవికీలో చేరి కొన్నాళ్లే అయినా, చక్కగా వికీ పద్ధతిలో, వికీ అవగాహన ఉన్న సభ్యుడికి మల్లే తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ సంతోష్ గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ వన్నెల చిన్నెల సీతాకోకచిలుక పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. వైజాసత్య (చర్చ) 07:21, 30 జనవరి 2014 (UTC)Reply

చాలా కృతజ్ఞతలు సర్--Pavan santhosh.s (చర్చ) 10:09, 30 జనవరి 2014 (UTC)Reply

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము

 

నమస్కారం Pavan santhosh.s గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 10:14, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గంReply

పుస్తకాల పేజీల సృష్టిలో సహకారం గురించి

నేను చేస్తున్న పుస్తకాల వ్యాసాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు వీలుంటే పుస్తకం సమాచార పెట్టెలు పెట్టి నేను వ్యాసంలో ఇచ్చినంతమటుకు సమాచారాన్ని నింపే ప్రయత్నం చేయగలరు. కృతజ్ఞతలతొ --పవన్ సంతోష్ (చర్చ) 02:23, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

అలాగే ప్రయత్నిస్తాను. --రవిచంద్ర (చర్చ) 05:51, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

అమోఘం

పవన్ గారూ, సాహిత్యం ప్రాజెక్టును చాలా చక్కగా అభివృద్ధి చేసారు. విజయవాడలో మీరిచ్చిన మాటను తగువిధంగా ప్రతిస్పందించి కార్యరూపం ఇచ్చారు. అభినందనలు. మీసాహితీ తృష్ణను చూసి చాలా ముచ్చటేస్తోంది. అహ్మద్ నిసార్ (చర్చ) 11:28, 5 మార్చి 2014 (UTC)Reply

కృతజ్ఞతలు అహ్మద్ నిసార్ గారూ.. మీ వంటి వారి సహకారం, ప్రోత్సాహం వల్లనే కృషిచేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:14, 5 మార్చి 2014 (UTC)Reply

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం

  నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం
పవన్ సంతోష్ గారికి,నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు లో విశేష కృషికిధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:45, 17 మార్చి 2014 (UTC)Reply
చాలా సంతోషంగా ఉంది. మీ ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞతలు.--పవన్ సంతోష్ (చర్చ) 14:15, 17 మార్చి 2014 (UTC)Reply
Return to the user page of "Pavan santhosh.s/పాత చర్చ 1".