వాడుకరి చర్చ:T.sujatha/పాతచర్చలు 1

తాజా వ్యాఖ్య: థాంక్స్ టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.


సుజాత గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 17:30, 3 ఆగష్టు 2006 (UTC)

మీ అనువాదాలు

సుజాత గారూ, నా పేజీలో మీ అనువాదాలు చూసాను, చక్కగా చేస్తున్నారు. మిగతావి కూడా చెయ్యండి. అలాగే, మీరు వికీ నిఘంటువులో ఎందుకు పని చేయకూడదు!? విక్షనరీ చూడండి. అక్కడ మీవంటి ఉత్సాహవంతుల అవసరం ఎంతో ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 03:29, 9 సెప్టెంబర్ 2006 (UTC)

భగవద్గీత అధ్యాయానుసారం

సుజాత గారూ, భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికి సోర్స్లో ఉన్నది. ఇంక ఈ చర్చా పేజి చూడండి. మీ శ్రమ వృధా కాకూడదని చెబుతున్నాను. విక్షనరీలో మీ కృషి బాగుంది. --వైఙాసత్య 14:12, 26 సెప్టెంబర్ 2006 (UTC)

సామెతలు

సుజాత గారూ, సామెతలకు మీరు రాస్తున్న వివరణలు బాగున్నాయి. నాదో చిన్న సలహా, వివరణ పేజీలో చివరన [[వర్గం:సామెతలు]] అని తగిలించండి. సాధ్యమైనన్ని ముఖ్యపదాలని లంకెలుగా మార్చండి. ఉదాహరణకి ఈ పేజీలో నేను చేసిన మార్పులు చూడండి.--వీవెన్ 17:50, 24 నవంబర్ 2006 (UTC)

చెట్టు గురించి

సుజాతగారూ, చెట్టువ్యాసం చూశాను. అంతా చాలా సామాన్యమైనది అనుకొనే విషయం గురించి వ్యాసం ప్రారంభించడం విశేషమైన ప్రయత్నం. దయచేసి కొనసాగించండి. వీలును బట్టి కొన్ని ఫొటోలు జోడించండి. --కాసుబాబు 15:07, 20 జనవరి 2007 (UTC)Reply

మకరందం, తేనె - రెండు వ్యాసాలు

సుజాతగారు, ఒకసారి చర్చ:మకరందం చూడండి. మకరందం, తేనె - రెండు వ్యాసాలనూ కలపాలన్న ప్రతిపాదన ఉన్నది. మీ అభిప్రాయం ఏమిటి? --కాసుబాబు 18:59, 25 జనవరి 2007 (UTC)Reply

భగవద్గీత తెలుగు అనువాదం

సుజాతగారూ, వికిసోర్స్‌లో భగవద్గీత (తెలుగు అనువాదము) అనే వ్యాసం ప్రారంభించబడింది. మీకు వీలయినప్పుడు అనువాదాన్ని అక్కడ వ్రాయవచ్చును. --కాసుబాబు 05:12, 28 జనవరి 2007 (UTC)Reply

కృతజ్ఞతలు

సుజాతగారు, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. --నవీన్ 09:00, 23 ఏప్రిల్ 2007 (UTC)Reply

సేవ

వికీపీడీయా కు మీ సేవ అద్వితీయం--172.142.230.149 15:21, 19 మే 2007 (UTC)Reply

హలొ హలొ

ఏమిటండి మీరు తెవికి లొ ఎప్పుడు కనిపించరు.172.142.230.149 అది నేనే ఇది నేనే మాటలబాబు --మాటలబాబు 17:35, 28 జూన్ 2007 (UTC)Reply

హలో మాటల బాబుగారు.నేనీ మద్య చాలా బిజీ ఇంట్లోలేను,పైగా నేను ఎక్కువగా విక్షనరీ

లో ఎక్కువ పనిచేస్తాను,మీకు వీలైతే ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి.మీరిలా అడగటం చాలా సంతోషంగా ఉంది థాంక్స్. t.sujatha 17:48, 28 జూన్ 2007 (UTC)

విక్షనరీ లొ పని చేస్తున్నారు అని చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఒక పదము అర్థము తెలియక చస్తున్నాను మీరేమైన సహాయం చెయ్యగలరేమో చూడండి. గవాక్షము అంటే అర్థం ఏమిటి--మాటలబాబు 17:52, 28 జూన్ 2007 (UTC)Reply
valve అనుకుంటా ఎందుకైనా మంచింది డిక్షనరీ చూడండి --వైజాసత్య 18:05, 28 జూన్ 2007 (UTC)Reply
క్షమించాలి కవాటమంటే valve గవాక్షమంటే window. మా వూళ్లో మట్టిమిద్ద పై వెలుతురు కోసం తెరిచి ఉంచిన కంతను గవాజీ అనేవాళ్లు. అది గవాక్షము నుండే వచ్చింది కాబోలు --వైజాసత్య 18:10, 28 జూన్ 2007 (UTC)Reply

బాగుంది బాగుంది మీరు గెలిచారు, ఆ పదానికి అర్థం తెలియక నా తల బాదుకొన్నాను. మా అమ్మగారిని అడిగితే మా అమ్మ గారు కూడా తప్పు చెప్పారు(గడప అన్నారు), మా నాన్నా గారు దానిని సరిచేశారు కిటికీ అని. మిమ్మల్ని పరిక్షించాలి అని అనిపించింది, విక్షణరీ లొ పని చేస్తున్నరు గా మరి అందువలన, ఆ పదము (గవాక్షం) ప్రయోగము తెవికీ లొ త్వరలోనే చేస్తాను. పరిక్షించినందుకు మీరు ఏమి అనుకోలేదని భావిస్తునాను--మాటలబాబు 18:26, 28 జూన్ 2007 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
 
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

అనువాదములు, దేవా గారి పతకం

  తెలుగు మెడల్
సుజాత గారు, మీరు అనువాదాలు చాలా బాగా చేస్తున్నారు. దానికితోడు చాలా వేగంగా అనువాదిస్తున్నారు. తెలుగువికీకి మీకృషి అభినందనీయం. ఈ తెలుగు మెడల్ అందుకోండి.

----δευ దేవా 09:39, 16 జనవరి 2008 (UTC)----Reply

సముచితమైన సత్కారం :-) --వైజాసత్య 17:02, 16 జనవరి 2008 (UTC)Reply

సభ్యులపై చర్చ

సుజాతా గారు, మీరు సభ్యుల చర్చ పేజీలో వ్రాయాలంటే కొత్త పేజీని సృష్టించే అవసరం లేదు. ఆయా సభ్యుల చర్చా పేజీలలోనే వ్రాస్తే సరిపోతుంది. మీరు ప్రపంచ నగరాలపై అనువాదం బాగా చేస్తున్నారు. మీ కృషి అలాగే కొనసాగనీయండి.C.Chandra Kanth Rao 16:39, 16 జనవరి 2008 (UTC)Reply

కొన్ని సూచనలు

సుజాత గారు, సింగపూరు నగర వ్యాసాన్ని ఎంతో కష్టపడి అనువదించి 81 కె.బి.ల సమాచారంతో తెవికిలో 15 వ పెద్ద వ్యాసంగా తీర్చిదిద్దినందులకు అభినందనలు. మీ కృషి ఇలాగే కొనసాగించండి. అదే సమయంలో క్రింది సూచనలు కూడా పాటిస్తే బాగుంటుంది. (సింగపురు వ్యాసంలో నేను కొద్దిగా సరిచేశాను)

  • వ్యాసంలో సంవత్సరాలకు, తేదీలకు, వ్యాసంగా ఉండవలసిన పదాలకు (ప్రస్తుతం దానిపై వ్యాసం లేకున్నా సరే) లింకులు ఇవ్వండి.
  • ఫుల్‌స్టాప్, కామాల తరువాత స్పేస్ వదలండి.
  • కొత్త పేరా కావాలంటే ఒక అదనపు లైను వదిలేయండి.
  • అదే పదంలో పొల్లు అక్షరం తరువాత పదాన్ని కొససాగించాలంటే ^(shift+6) వాడండి. స్పేస్ వదిలే అవసరం లేదు.
  • మీరు ఇంతకు క్రితం ప్రారంభించిన లాస్ ఏంజిల్స్ వ్యాసాన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుంది.
  • భారతీయ నగరాలపై మీ కృషి కొనసాగిస్తే బాగుంటుంది.--C.Chandra Kanth Rao 09:58, 20 జనవరి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

నిర్వాహకత్వానికి నేను చేసిన స్వీయప్రతిపాదనకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. δευ దేవా 14:18, 26 జనవరి 2008 (UTC)Reply

తెలుగు వికీపీడియా వ్యాసం

సుజాత గారు, తెలుగు వీకీపీడియా‎ వ్యాసం చక్కగా వ్రాస్తున్నారు. ఇంకనూ సభ్యుల సభ్యపేజీలలో వెదికి సమాచారం గ్రహించవచ్చు. అయినా అందరూ మనవాళ్ళేగా ఎవరికి వారు ఇంకనూ సమాచారం జతచేసుకోనూ వచ్చు. ఇంకో విషయం నా పేరే తప్పుగా వ్రాశారు. పర్వాలేదు లేండి నేను సరిదిద్దుకుంటాను. దానికి లింకులిచ్చే పని ఉంది. సభ్యుల పేర్లకు ఆయా సభ్యుల సభ్యపేజీలకు లింకులివ్వాలి. మీరు మొత్తం వ్రాసిన తరువాత పరిశీలించి ఇంకనూ మెరుగుపర్చడానికి సూచనలిస్తాను.C.Chandra Kanth Rao 18:15, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply

లాస్ ఏంజిలెస్

మీ నివాసము లాస్ ఏంజిలెసా??? దయచేసి తెలుపుము--బ్లాగేశ్వరుడు 06:47, 9 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అంతర్జాల సౌకర్యము సరిగా ఉండడాము లేదు అందుకని ఇటువైపు రావడానికి కుదరడము లేదు.అంతేకాక పరీక్షలు వచ్చుచున్నవి ఒకటి తరువాత మరొకటి. ఈ మధ్యనే నే లాస్ ఏంజిలెస్ కి వచ్చాను బాగున్నది నగరము. హాలీవుడ్ కి వెళ్ళదాము అని అనుకొన్నాను కాని వెళ్ళలేదు. లాస్ ఏంజిలెస్ డౌన్ టౌన్ , స్టేపిల్స్ కార్నర్, సిటి బస్సు రైలు స్టేషన్ మొదలగునవి చూశాను. డిస్నీ లాండ్ చూడాడానికి కుదరలేదు. లాంగ్ బీచ్ వైపుకూడా వెళ్లాను. లాస్ ఎంజిలెస్ గురించి వ్రాస్తున్నారని కుతుహలము కొద్ది ఏదో మీమ్మల్న్ అడిగాను--బ్లాగేశ్వరుడు 07:35, 9 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు

నా స్వీయనిర్వాహకహోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 14:07, 19 ఫిబ్రవరి 2008 (UTC)Reply

మీ సంతకం

మీ సంతకంలో మీ సభ్యుడి పేజీకి గాని చర్చ పేజీకి గాని లింకు లేదని గమనించాను. అలాంటి సంతకం పెట్టుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఏదో ఒక పేజీకి లింకు పెట్టండి. సాయీ(చర్చ) 04:04, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

boldface

మీరు వ్రాస్తున్న చికాగో వ్యాసంలో చాలా చోట్ల bold అక్షరాలు వాడుతున్నరు. వ్యాసానికి ఒక సారే వాడాలని వికిపీడియా guidelines చెబుతున్నాయి. సాయీ(చర్చ) 08:18, 10 మార్చి 2008 (UTC)Reply

శాన్ ఫ్రాన్సిస్కో కూడాను సాయీ(చర్చ) 09:10, 10 మార్చి 2008 (UTC)Reply

మీ వ్యాసాల జాబితా

సుజాత గారు, మీరు రాస్తున్న వ్యాసాల జాబితా మొత్తం ఎక్కడయినా లభ్యమవుతుందా? లేనిచో అలాంటిది ఒకటి ఉంటే (ఉదాహరణకు ఒక table లా) ముందు ముందు అందరికీ చాలా ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నాను. --Svrangarao 17:32, 17 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:24, 20 మార్చి 2008 (UTC)Reply

ఇస్లాం గురించి వ్యాసాలు

సోదరి సుజాత గారు నమస్కారం. మీ ప్రోత్సాహకర వాక్యాలకు ధన్యవాదాలు. మీ సూచనకూ ధన్యవాదాలు. అలాగే తప్పకుండా కృషి చేస్తాను. సోదరుడు nisar 11:58, 1 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీ కృషికి నా ప్రత్యేక అభినందనలు !!!

సుజాత గారు, మీరు ఎంతొ శ్రద్ధతో,శ్రమతో చక్కగా వ్రాసిన వ్యాసాలు (ప్రస్తుతానికి మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ మరియు చికాగో చదివాను) చాల వివరంగా,విజ్ఞానాత్మకంగా ఉన్నాయి.మీ కృషికి నా ప్రత్యేక అభినందనలు. మీరు పార్కులు(ఉద్యానవనాలు) ఆని వ్రాసే బదులు ఉద్యానవనాలు(పార్కులు) అని వ్రాస్తే ముచ్చటగా ఉంటుందని అనుకుంటున్నాను.పార్క్ అనే పదం ఇంగ్లీష్ కదా బ్రాకెట్లో వుంటే బావుంటుందని. నేను మొదలు పెట్టిన వ్యాసాలని పూర్తిచేసే బదులు మీరు వ్రాసిన వ్యాసాలని చదివే పనిలో మునిగివున్నాను(పనిలో పనిగా మీరు వ్రాసిన వ్యాసాలలో కొన్ని అక్షర దోషాలని సరిదిద్దాను). మరొక్కసారి మీకు అభినందనలు!!! వాసు. bojja 09:20, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

జోహార్లు !!!

నేను వ్రాయటం తరువాత సంగతి,ముందు మీరు వ్రాసినవే చదివేదానికి బోల్డు సమయం పట్టేట్టువుంది.మీ ఒపికకి,తపనకి, తెవికికి మీరు చేస్తున్న, కూరుస్తున్న విజ్ఞాన సంపదకి మరొక్క సారి జోహార్లు(నాకు వెంటనే సమాధానం ఇచ్చినందుకు కూడా). వాసు. bojja 12:14, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఈ వారం సమైక్య కృషి

సుజాత గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీ సహకారానికి ధన్యవాదాలు. మూసను అభినందించినందుకు కృతజ్ఞతలు. δευ దేవా 08:07, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

అర్ధవీడు వ్యాసం

సుజాత గారూ! మీరు అర్ధవీడు మండలం అవే వ్యాసం మొదటలు పెట్టారు. బహుశా ఆ గ్రామాల గురించి వ్రాద్దామని అనుకొంటాను. ఇప్పటికే మొదలైన వ్యాసాలు చూడండి - అర్ధవీడు, గన్నేపల్లి, వెలగలపాయ --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:22, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

అర్ధమైంది. మీరు అనుకొన్న పని గనుక కావాలంటే బాట్ ద్వారా వైజా సత్య గాని, ప్ర్రదీప్ గాని చేయగలరు కనుక మీరు శ్రమ వృధాగా చేయవద్దు. అయితె అలా చేయాలా వద్దా అనేది అంత తేలికగా నిర్ణయించలేము. చర్చించవలసి ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:11, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

అభినందనలు 2 !!! మీరు వ్రాసిన సింగపూర్ వ్యాసం(సింగపూర్ లాగే చాలా సుందరంగా ఉంది :-)

సుజాత గారు మీరు వ్రాసిన సింగపూర్ వ్యాసం(సింగపూర్ లాగే చాలా సుందరంగా ఉంది) చాలా బావుందంటే అతిశయోక్తి కాదు. నిజం. మరొక్క సారి మీకు అభినందనలు.మిగతావి చదివిన తరువాత మరల కలుస్తాను.వాసు. bojja 10:57, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:39, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ధన్యవాదాలు

సుజాత గారూ! వికీలో ఎవరైనా ఎందుకు పనిచేస్తారు చెప్పండి. వారికి ఏం లాభం? దీనితో పాటు వచ్చేది ఏమీ ఉండదు, దానికి తోడు మనస్థాపాన్ని కలిగిస్తే ఏం లాభం చెప్పండి. ఇది ఎంతవరకు సమంజసం తెవికీ సభ్యులకు. δευ దేవా 08:59, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

సరేనండి, కలసి పనిచేద్దాం. అన్నింటికి ధన్యవాదాలు.δευ దేవా 20:20, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

విన్నపం

నేను చేసిన తప్పుకు మనసారా క్షమాపణలు వేడుకుంటున్నాను కదండీ! మీరయినా మనస్థాపం కలిగిన సభ్యులకు కొంచెం సర్ది చెప్పండి.నావల్ల తెవికీ అభివృద్ధి ఆగిపోయే దశకు వచ్చిందంటే నాకు ఎంత అప్రదిష్ట. నేనెన్నడూ ఇలాంటిది కలలో కూడా ఊహించని మాట. తెలియక చేసిన పొరపాటును మన్నించండి. రవిచంద్ర(చర్చ) 09:15, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

చాలా చక్కగా చెప్పారు మనమంతా ఒక్క కుటుంబం అన్నమాటని. ఒక కుటుంబంలో ఎలా అభిప్రాయ భేధాలు వస్తాయో 20 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పుట్టిన/ఉన్న నాకు తెలుసు.ఇదే భావంతో ఇకపై ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తెవికీ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతాను. రవిచంద్ర(చర్చ) 13:25, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

3వ లక్ష దిద్దుబాటు

సుజాతగారూ నమస్తే, మీ అభిమానానికి ధన్యవాదాలు, నిసార్ అహ్మద్ 20:12, 11 జూన్ 2008 (UTC)Reply

థాంక్స్

నమస్కారం సుజాత గారూ! ఏదో పెద్ద పుడింగిలాగా వెళ్ళిపోయి మళ్ళీ వాపస్ ఎందుకొచ్చాడనుకోకుండా అందరూ ఇలా స్వాగతిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం అడగుతానండీ, పుడింగి తమిళం నుండి వచ్చిన పదమా? అస్లు పుడింగంటే ఏంటండి? δευ దేవా 08:28, 23 జూన్ 2008 (UTC)Reply

ధన్యవాదాలండీ. మీరు నన్ను గారూ అని సంభోదించడం బాగా లేదండి. దేవా అని మాత్రం అనండి, సరిపోతుంది. δευ దేవా 17:51, 25 జూన్ 2008 (UTC)Reply


క్రొత్త లైను

సుజాతగారూ! వ్యాసంలో క్రొత్త లైను (line break) కోసం మీరు "<br />" అని టైపు చేస్తున్నారు. ఇది అవుసరం లేదు. రెండు సార్లు లేదా మూడు సార్లు enter నొక్కితే సరిపోతుంది.

మరొక విషయం. మీ చర్చా పేజీ బాగా పొడవయ్యింది. మీకు అభ్యంతరం లేకపోతే పాత చర్చలను నేను వేరే పేజీలోకి మారుస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:29, 12 అక్టోబర్ 2008 (UTC)

Return to the user page of "T.sujatha/పాతచర్చలు 1".