సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల నుండి నడపబడు ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1][2] ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీ నకు అనుసంధానం (కనెక్ట్) చేయబడింది. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుంచి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను నడుస్తుంది. ఈ రైలు భారతదేశం లోని ప్రతిష్ఠాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు వర్గం లోకి చేరుతుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ |
స్థితి | Operating |
స్థానికత | తెలంగాణ, మధ్య ప్రదేశ్ & ఢిల్లీ |
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర రైల్వే |
మార్గం | |
మొదలు | సికింద్రాబాద్ (ఎస్.సి) |
ఆగే స్టేషనులు | 4 |
గమ్యం | హజ్రత్ నిజాముద్దీన్ (NZM) |
రైలు నడిచే విధం | వీక్లీ (వారానికి ఒకసారి) |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి 1వ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్ |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆటోర్యాక్ సదుపాయం | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది (టికెట్ నందు చేర్చారు) |
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
బ్యాగేజీ సదుపాయాలు | ఉంది |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 76 కి.మీ./గం. |
ఇది లాలగూడ నుండి డబ్ల్యుఎపి7 ఇంజను ఆధారంగా నెట్టబడుతుంది. రైలు నంబర్లు 12437/12438 గా ఉన్నాయి.
రైలు సికింద్రాబాద్ నుంచి 12:45 గంటలకు ప్రతి బుధవారం బయలు దేరుతుంది, 10:25 గంటలకు గురువారం హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. హజ్రత్ నిజాముద్దీన్ నుండి 15:55 గంటలకు ప్రతి ఆదివారం బయలు దేరుతుంది, 14:00 గంటలకు సోమవారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీనికి ఒక ఎసి 1 వ తరగతి, 4 ఎసి 2 టైర్, 10 ఎసి 3 టయర్, 1 పాంట్రీ కారు ఉన్నాయి.
- రైలు నంబరు : 12437 సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు నంబరు : 12438 హజ్రత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
జోను , డివిజను
మార్చుఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని ఉత్తర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 12437. ఈ రైలు వారానికి ఒక రోజు (బుధవారం) నడుస్తుంది.
విరామములు
మార్చుఐదు
- సికింద్రాబాద్ జంక్షన్ (ప్రారంభం)
- కాజీపేట జంక్షన్
- బల్లార్షా జంక్షన్
- నాగపూర్ జంక్షన్
- భోపాల్ జంక్షన్
- ఝాన్సీజంక్షన్
- హజ్రత్ నిజాముద్దీన్ (అంత్యం)
- ప్రయాణ సమయము : గం. 21.40 ని.లు, బయలుదేరు సమయము : గం. 12:45 ని.లు, చేరుకొను సమయము : గం. 10.25 ని.లు + ఒక రాత్రి, తరగతులు : ఎసి మొదటి తరగతి, సెకండ్ ఎసి, థర్డ్ ఎసి., దూరము : 1660 కి.మీ., సరాసరి వేగము : 76 కి.మీ./గం., ప్రయాణ మార్గము : ఈ రైలు వయా కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లు గుండా (ద్వారా) ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : రైలు నంబరు : 12438 హజ్రత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని రైళ్లు 22 జతల ఉన్నాయి.[3][4][5]
రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=2&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
- ↑ http://indiarailinfo.com/train/hazrat-nizamuddin-secunderabad-rajdhani-express-12438-nzm-to-sc/1342/748/835
- ↑ http://indiarailinfo.com/train/blog/hazrat-nizamuddin-secunderabad-rajdhani-express-12438-nzm-to-sc/1342/748/835
- ↑ "Rajdhani Express trains". Indian Railways. Retrieved 14 Feb 2010.
- ↑ "List of all Rajdhani Express trains". etrain.info. Retrieved 4 Sep 2013.
బయటి లింకులు
మార్చుచిత్రమాలిక
మార్చు-
ముంబై రాజధాని
-
తిరువనంతపురం రాజధాని
-
ముంబై రాజధాని
-
ఇంటీరియర్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్
-
ఆగస్ట్ క్రాంతి రాజధాని
-
చెన్నై రాజధాని
-
బెంగుళూర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఎసి కోచ్
-
రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఆహారము