అతడు (సినిమా)

2005 సినిమా
(అతడు నుండి దారిమార్పు చెందింది)

అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదల అయిన ఒక తెలుగు సినిమా. ఇందులో హీరోగా మహేష్ బాబు నటించాడు. త్రిష కథానాయికగా నటించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.[1]

అతడు
దర్శకత్వంత్రివిక్రం శ్రీనివాస్
రచనత్రివిక్రం శ్రీనివాస్
తారాగణంమహేష్ బాబు, త్రిష
ఛాయాగ్రహణంకే.వి. గుహన్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
ఆగస్టు 10, 2005 (2005-08-10)
సినిమా నిడివి
172 నిముషాలు
భాషతెలుగు
బడ్జెట్రూ. 7 కోట్లు

ఈ సినిమా 3 నంది పురస్కారాలు,, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఇది తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ లో Poszukiwany అనువాదం అయ్యి పోలండ్ లో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది. 2005లో ఈ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ మాట రచయిత, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది.

నందు (ఘట్టమనేని మహేశ్ బాబు), మల్లి (సోనూ సూద్) ప్రొఫెషనల్ కిల్లర్స్. కలిసి పనిచేస్తు ఆ పనితో వాళ్ళు సంపాదించిన డబ్బుని పంచుకుంటారు. స్వతహాగా మంచివాడే ఐనా డబ్బిస్తే ఎవరినైనా చంపగలిగే మనస్తత్వం నందుకి ఉంది. ప్రతిపక్ష నాయకుడు శివా రెడ్డి (షయాజీ షిండే) ఈ ఎన్నికల్లో గెలవడానికి తన అనుచరుడు, స్నేహితుడైన బాజి రెడ్డి (కోట శ్రీనివాసరావు), మరో స్నేహితుడు ఫరూక్ (పోసాని కృష్ణమురళి)తో కలిసి ఓ పథకం వేస్తాడు. ఆ పథకం ప్రకారం త్వరలో జరిగే జనతా పార్టీ సమావేశంలో తన పై దాడి జరగాలి, కాని తను చావకూడదు. ప్రజల సానుభూతి ద్వారా నెగ్గాలనుకుంటాడు. ఇందుకు నందును కోటిన్నర రూపాయలు చెల్లించి ఎంచుకుంటారు. అన్ని అనుకున్నట్టే జరుగుతున్న వేళలో కాల్చక ముందే ఎవరో శివా రెడ్డిని ఒకడు హతమారుస్తాడు. పోలీసులు ఆ బిల్డింగుని చుట్టుముడతారు.లో పారిపోతుంటే మల్లి ఉన్న కారుని వేరే పెద్ద కారు గుద్దటంతో భారీ పేలుడు చోటు చేసుకుని కారు పేలిపోతుంది. మల్లి చనిపోయాడని తెలిసిలో ఆ బిల్డింగ్ మీదకెక్కి ఒక పెద్ద తాడు ద్వారా అటుపక్క వెళ్తున్న ట్రైను మీదకి దూకేస్తాడు.

ట్రైనులోకెళ్ళిన నందుకి పార్థసారథి ఊరాఫ్ పార్థు (రాజీవ్ కనకాల) అనే వ్యక్తి పరిచయమౌతాడు. పార్థు చిన్నప్పుడు తన తాత సూర్యనారాయణ మూర్తి (నాజర్) తిట్టాడన్న కోపంతో ఇల్లు వదిలి పారిపోయి గుజరాత్ రాష్ట్రంలో ఒక కాంట్రాక్టరు వద్ద పనిచేస్తుంటాడు. తిరిగి తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని తన సొంత ఊరైన బాశర్లపూడికి బయలుదేరతాడు.వాళ్ళిదరూ ప్రయాణిస్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్స్ గుడివాడ స్టేషన్లో 20 నిమిషాలపాటు ఆగుతుంది. అక్కడ పోలీస్ కాల్పుల్లోలో బదులు పార్థు చనిపోతాడు.లో సరైన సమయానికి పారిపోయి బాశర్లపూడిలో ఉన్న సూర్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్తాడు. అక్కడి పరిస్థితుల ప్రభావం వల్ల తనే పార్థునని అబద్ధమాడుతాడు నందు. అందరూ నమ్మిన తర్వాత పార్థు మరదలు పూరి (త్రిష) లో ఊరాఫ్ పార్థుతో ప్రేమలో పడుతుంది. ఆ కుటుంబంతో కలిసి బ్రతుకుతూ పార్థు తన గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. శివా రెడ్డి హత్య కేసును సీబీఐ అధికారి ఆంజనేయ ప్రసాద్ (ప్రకాశ్ రాజ్)కు అప్పగిస్తారు. పార్థు రైల్వే రిజర్వేషన్ టికెట్ ఫారం ద్వారా ఆంజనేయ ప్రసాద్ బాశర్లపూడి ఇంటికి వెళ్తాడు. అక్కడ పార్థుగా ఉన్న నందుపై అనుమానంతో అతని వేలిముద్రలు సంపాదించాలనుకుంటాడు. కానీలో తెలివిగా తప్పించుకోవడమే కాక విచారణలో తనకేం తెలియదని ఆంజనేయ ప్రసాద్, తన బృందాన్ని నమ్మిస్తాడు.

తన బృందంతో కలిసి సాక్ష్యాధారాల కోసం వెతుకుతుండగా సాక్ష్యాలన్నీ మల్లిని నేరస్తుడిగా చూపిస్తుంటాయి. కాని మల్లి చనిపోయాడు కనుక జైలులో ఉన్న మల్లి స్నేహితుడైన సాధు (రాహుల్ దేవ్)ని కలుస్తారు. సాధు ద్వారా మల్లి కేవలం ప్లాన్ అమలు చేస్తాడని చంపేవాడులో అని చెప్తాడు.లో ఫొటో పోలీసుల దగ్గర లేదు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుండగా పార్థుగా ఉన్నలో మూర్తి గారి పొలానికి నాయుడు (తనికెళ్ళ భరణి) కంచె వేయిస్తే తీయించేయడం, పార్థు వల్ల నష్టపోయిన పూజారి గారి కుటుంబానికి ధనసహాయం చేయడం, జాతరలో పూరీని నాయుడు మనిషైన బుజ్జి (బ్రహ్మాజీ) నుంచి కాపాడటం, మూర్తి గారి మనవరాలి పెళ్ళికి 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి చేస్తు మూర్తి గారికి దగ్గరౌతాడు. పూరి ప్రేమను కూడా స్వీకరించి తన ప్రేమకి తలొంచుతాడు. పార్థు చేసిన ఈ పనులు కేవలం పార్థు చిన్ననాటి స్నేహితుడైన రమణ (సునీల్)కి మాత్రమే తెలుసు.

 
నాయుడు లాయరుని పొలం నుంచి కంచె తీయించేందుకులో తుపాకితో బెదిరిస్తున్న సన్నివేశం
 
పూజారి గారి కుటుంబం గురించి రమణ నందుతో మాట్లాడుతున్న సన్నివేశం

మూర్తి గారి మనవరాలి పెళ్ళికి మూర్తి గారు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు. సాధు ద్వారాలో తన సంపాదనని బ్యాంకులో దాస్తాడని తెలుసుకున్న ఆంజనేయ ప్రసాద్ ఆడిట్ శాఖ పేరిట బాశర్లపూడి మంజీరా బ్యాంకులో తనిఖీలు చేస్తుంటారు. అక్కడ క్లియర్ ఐన చెక్కుల్లో మూర్తి గారు ప్రెసెంట్ చేసిన చెక్ మీద నందగోపాల్ అని సంతకం చేసి ఉంటుంది. ఆంజనేయ ప్రసాద్ సందేహాలు నిజమైయ్యాయని నిర్థారించుకున్నాక పెళ్ళి ఐన వెంటనే మూర్తి గారి ఇంటికి వెళ్ళి నందుని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికేలో పారిపోయాడని తెలుసుకుంటాడు. దర్యాప్తు బృందం వెళ్ళిపోయాక ఆ రాత్రి రమణ,లో ఇంటికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్తారు. ఇంట్లో వాళ్ళెవరూ స్పందించక పోయినా మూర్తి గారు మాత్రం ఒక పెద్ద తుపాకీనిచ్చి పంపిస్తారు. అందులో పిల్లలు ఆడుకునే గోళీ ఒకటి ఇరుక్కుని ఉంది. ఈ విషయం మూర్తి, నందులకు తెలియదు.

హైదరాబాద్ వెళ్ళాక బాజి రెడ్డికి ఫోన్ చేసి ఇంతకు ముందు మన సంభాషణలను రికార్డ్ చేసానని శివా రెడ్డిని చంపింది ఎవరో చెప్పకపోతే సి.బి.ఐ. వాళ్ళకు ఆ సాక్ష్యాన్ని అందచేస్తానంటాడు. అప్పుడు బాజి రెడ్డి మల్లికి రెండు కోట్లిచ్చి పదవి కోసం శివా రెడ్డిని చంపించానని చెప్తాడు. ఈ సంభాషణనిలో నిజంగానే రికార్డ్ చేస్తాడు. నందుని చంపడానికి ఆంజనేయ ప్రసాద్ బృందంలో ఒకరైన రవిని బాజి రెడ్డి డబ్బులిచ్చి కొన్నాడని ఆంజనేయ ప్రసాద్ తెలుసుకుంటాడు. ఓ పాత చర్చిలో తనని చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులనిచంపేసినలో గోడ చాటున దాక్కుని ఉన్న మల్లితో పోరాడుతుండగా మల్లి మూర్తి గారిచ్చిన గన్నుని లాక్కుంటాడు. గోళీ అడ్డుపడటంతో బుల్లెట్ వెనక్కి వెళ్ళి మల్లి తలకి తగలడంతో మల్లి చనిపోతాడు.లో రికార్డ్ చేసిన ఆ క్యాసెట్టుని ఆంజనేయ ప్రసాద్ తీసుకుని బాజి రెడ్డి ఆఫీసుకి వెళ్తాడు. ఎలెక్షన్లలో భారీ మెజారిటితో గెలిచిన ఆ పార్టీ బాజి రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిసీలిస్తుంటారు. అప్పుడే ఆంజనేయ ప్రసాద్ ఈ క్యాసెట్ లీకైతే ఆవేశపరుడైన శివా రెడ్డి కొడుకు నీ ప్రాణం తీస్తాడన్న వాస్తవాన్ని చెప్పి ఆంజనేయ ప్రసాద్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. దానితో బాజి రెడ్డి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. నందుని వదిలేసాక ఆంజనేయ ప్రసాద్ ఆ గన్నుని తీస్కుని వెళ్ళిపోగా పార్థు అస్థికలు కలిపిలో బాశర్లపూడికి తిరిగి వెళ్ళిపోతాడు.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

పద్మాలయా స్టూడియోస్ లో త్రివిక్రం శ్రీనివాస్ అతడు సినిమా కథను మహేష్ బాబుకి వివరించారు. విన్నాక ఆ కథ నచ్చి మహేష్ తన తండ్రి, పద్మాలయా స్టూడియోస్ అధినేత, నటుడు కృష్ణకు కూడా వివరించారు. ఆయనకు కూడా సినిమా నచ్చడంతో పద్మాలయా పతాకంపైనే సినిమా తీద్దామని వారు భావించారు. అప్పటికి త్రివిక్రం నువ్వే నువ్వే సినిమాకు దర్శకత్వం వహిస్తూండగా, మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా చేస్తున్నారు. అయితే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడు కాక ముందే ఆయన ప్రతిభ గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత మాగంటి మురళీమోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కాకుంటే అంతకుముందే స్రవంతి రవికిషోర్ కు ఒప్పుకోవడంతో త్రివిక్రం రెండవ సినిమా జయభేరి పతాకంపై చేస్తానని మాటయిచ్చారు. అదే విషయాన్ని మహేష్ బాబుకు చెప్పి, ఈ సినిమా జయభేరి సంస్థలో తీద్దామనడంతో అలాగే ఆలోచించి చూద్దామని చెప్పారు.
ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకునిగా తొలి సినిమా నువ్వే నువ్వే పూర్తిచేశారు. రచయితగా విజయ భాస్కర్, చిరంజీవి కాంబినేషన్లో జై చిరంజీవకు కథ-చిత్రానువాదం-మాటలు రాసి ఇచ్చారు. మహేష్ కథానాయకునిగా టక్కరి దొంగ, బాబి, ఒక్కడు, నిజం సినిమాలు పూర్తిచేశారు. నాని, అర్జున్ సినిమాలు షూటింగ్ సాగుతూండగా మహేష్, త్రివిక్రమ్ ని ఈ సినిమా విషయమై తిరిగి సంప్రదించారు. దాంతో సినిమాను మహేష్ ఒకే చేసిన 3 సంవత్సరాలకు ప్రారంభించారు.
జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.[2]

నటీనటుల ఎంపిక

మార్చు

సినిమాలో మొదట కథానాయకుని పాత్ర పవన్ కళ్యాణ్తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించేసరికి ఓ అరగంట గడవడంతోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి కథ నచ్చకపోవడంతో ఆయన చేయలేదు. తర్వాత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి నటించారు. కథానాయిక పాత్రను అప్పటికి వర్షం సినిమాతో మంచి విజయం అందుకున్న త్రిషకి ఇచ్చారు.[2] ఇక సినిమాలోని 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అన్న ముఖ్యమైన పాత్ర గతకాలం నాటి కథానాయకుడు, అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్న శోభన్ బాబుతో చేయించాలని నిర్మాత మాగంటి మురళీమోహన్ ఆశించారు. అందుకోసం ఆయనకు బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. అయితే తిరిగి నటించనని శోభన్ బాబు నిరాకరించారు.

పాత్రలు-పాత్రధారులు

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

చిత్ర సంగీతం

మార్చు
Untitled
సం.పాటపాట రచయితనేపధ్య గాయకులుపాట నిడివి
1."అదరక బదులే చెప్పేటి నిప్పుకణం అతడే"విశ్వవిశ్వ, సుచిత్ర4:57
2."పిల్లగాలి అల్లరి"సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రేయా ఘోషాల్4:26
3."అవును నిజం"సిరివెన్నెల సీతారామశాస్త్రికె.కె & ఉపద్రష్ట సునీత4:27
4."చందమామ చందమామ"సిరివెన్నెల సీతారామశాస్త్రిమహాలక్ష్మీ అయ్యర్, రంజిత్ & సుచిత్ర3:55
5."నీతో చెప్పనా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్పీ బాలు & కె. ఎస్. చిత్ర5:12
6."పిలిచినా రానంటావా"సిరివెన్నెల సీతారామశాస్త్రికార్తీక్ & కవితా కృష్ణమూర్తి4:21

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (10 August 2021). "మహేశ్‌ బాబు క్లాసిక్ అతడు సినిమాకు 16 ఏళ్లు". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  2. 2.0 2.1 పులగం, చిన్నారాయణ (2015). "పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం". ఫన్ డే (సాక్షి ఆదివారం). Retrieved 2015-08-23.

బయటి లింకులు

మార్చు