ఎం.వి.ఎస్. హరనాథరావు

నాటక సినీ రచయిత, నటుడు
(ఎం. వి. యస్. హరనాథ రావు నుండి దారిమార్పు చెందింది)

ఎం. వి. ఎస్. హరనాథ రావు (1948 జూలై 27 - 2017 అక్టోబరు 9) నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు.[3][4] 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశాడు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన కొన్ని సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి.[3] 20 కి పైగా సినిమాల్లో నటించాడు.[5] ఈయన తమ్ముడు మరుధూరి రాజా కూడా సంభాషణల రచయిత.

ఎం.వి.ఎస్. హరనాథరావు
జననం(1948-07-27)1948 జూలై 27 [1]
మరణం2017 అక్టోబరు 9(2017-10-09) (వయసు 69)[2]
ఒంగోలు
వృత్తినాటక రచయిత, దర్శకుడు, సినీ రచయిత, నటుడు
జీవిత భాగస్వామికోటేశ్వరి
పిల్లలుసాహిత్య, శ్రీ సూక్త, నాట్య
తల్లిదండ్రులు
  • రంగాచార్యులు[3] (తండ్రి)
  • సత్యవతి దేవి (తల్లి)

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

హరనాథ రావు 1948 జూలై 27 న గుంటూరులో జన్మించాడు. ఆయన తండ్రి రంగాచార్యులు గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లి సత్యవతి దేవి సంగీత ఉపాధ్యాయురాలు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. చదువుకుంటున్నప్పుడే తండ్రితో కలిసి పౌరాణిక నాటకాలు చూసేవాడు. మూడో తరగతి నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. తల్లి ప్రభావంతో ఆయనకు సంగీతం మీద కూడా ఆసక్తి కలిగింది. తల్లి ఉద్యోగ రీత్యా ఒంగోలుకు మారడంతో ఈయన కూడా ఒంగోలు చేరి శర్మ కళాశాలలో చదివాడు.

నాటకరంగం

మార్చు

ఒంగోలులో శర్మ కాలేజీలో చదువుతున్నపుడు నాటకాల్లో బాగా పాల్గొనేవాడు. ఆయన రాసిన మొట్టమొదటి నాటకం రక్తబలి. హరనాథ రావు దర్శకుడు టి. కృష్ణ కళాశాల రోజుల నుంచి మంచి స్నేహితులు. ఒకసారి ఇద్దరూ కలిసి అనేక నాటకాలు వేశారు. వారిద్దరూ కలిసి విజయవాడలో నాటకోత్సవాలు చూసి స్ఫూర్తి పొంది తాము కూడా మంచి నాటకాన్ని రాయాలనుకున్నారు. హరనాథ రావు దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి జగన్నాథ రధచక్రాలు అనే నాటకం రాశాడు. భగవంతుని ఉనికిని గురించి తాత్వికంగా చర్చించిన నాటకం ఇది. ఇది రాయటానికి ఈయనకు రెండేళ్ళు పట్టింది. ఈ నాటకం కొడవటిగంటి కుటుంబరావు, గోరా, ఆత్రేయల ప్రశంసలు పొందింది. కన్యా వరశుల్కం కు గాను ఉత్తమ నాటకంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి పురస్కారం అందుకున్నాడు. 6 నాటకాలు, 10 నాటకాలకు రచన, దర్శకత్వం చేసారు, వాటిలో నటించాడు.[1]

సినిమా రంగం

మార్చు

హరనాథ రావు తన స్నేహితుడైన టి. కృష్ణ ద్వారా సినీ పరిశ్రమలో 1985 లో రచయితగా అడుగుపెట్టాడు. ఒక్క సినిమా మినహాయించి ఆయన తీసిన అన్ని సినిమాలకూ హరనాథ రావే సంభాషణలు రాశాడు.[6] మరో వైపు కొన్ని సినిమాలలో కూడా నటించాడు.

తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 80 చిత్రాలకు రచయతగా, నటుడిగా 40 చిత్రాలకు పనిచేసారు. కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. రచయితగా సినిమాల్లో, రంగస్థలంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నాడు.

రచయితగా

మార్చు

నటుడిగా

మార్చు

పురస్కారాలు

మార్చు
  • నంది పురస్కారం (రచయతగా) - ప్రతిఘటన, ఇదా ప్రపంచం, భారత నారి, అన్న, అమ్మాయి కాపురం
  • కందుకూరి అవార్డు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (రచయితగా)
  • దాసరి స్వర్ణ కంకణం
  • కళాసాగర్ (చెన్నై) - ఉత్తమ రచయత అవార్డు
  • జాలాది సినీ రచయితల అవార్డు
  • ఆచార్య ఆత్రేయ అవార్డు
  • పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు
  • పినిశెట్టి అవార్డు
  • చాట్ల అవార్డు

హరనాథ రావు 2017 అక్టోబరు 9 న గుండెపోటుతో ఒంగోలులో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 TV1. "Jevannatakam, TV1 interview with M.V.S". youtube.com. TV1. Retrieved 12 July 2016.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 "నంది అవార్డుల రచయిత ఇకలేరు". telugu.samayam.com. samayam.com. Retrieved 9 October 2017.
  3. 3.0 3.1 3.2 Staff Reporter (23 December 2007). ఈనాడు ఆదివారం వ్యాసం: దరిద్రమంటే అంత కసి. హైదరాబాదు: ఈనాడు. p. 20. Retrieved 25 October 2016.
  4. "హరనాథరావు కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 10 October 2017.
  5. "మాటల 'రాక్షసుడి' కలం ఆగిపోయింది". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 11 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.
  6. "అభ్యుదయం చిలికించిన కలం". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 10 October 2017.

బయటి లింకులు

మార్చు