కె.ఆర్.విజయ

(కె. ఆర్. విజయ నుండి దారిమార్పు చెందింది)

కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసినది.[1]

కె ఆర్ విజయ
జననంనవంబరు 30, 1948
ట్రావెన్‌కోర్(తిరువనంతపురం), కేరళ, భారతదేశం
ప్రసిద్ధినటీమణి

నవంబరు 30, 1948లో కేరళ లో జన్మించారు. విజయ తల్లి కల్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరుకు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు తమిళనాడులోని పళనిలో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు.

విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.

ఈమె సోదరి కుమార్తె అనూష హీరోయిన్ గా గోల్‌మాల్ గోవిందం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది.

నటించిన చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  1. Andhrajyothy (17 November 2023). "కేఆర్ విజయ @ 60". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.