పసుమర్రు (పామర్రు మండలం)

భారతదేశంలోని గ్రామం

పసుమర్రు,కృష్ణా జిల్లా,పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 157., యస్.టీ.డీ.కోడ్ = 08674.

పసుమర్రు (పామర్రు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
పసుమర్రు (పామర్రు మండలం) is located in Andhra Pradesh
పసుమర్రు (పామర్రు మండలం)
పసుమర్రు (పామర్రు మండలం)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°18′40″N 81°00′21″E / 16.311097°N 81.005754°E / 16.311097; 81.005754
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి బొప్పన కుసుమ కుమారి
జనాభా (2011)
 - మొత్తం 1,863
 - పురుషులు 934
 - స్త్రీలు 929
 - గృహాల సంఖ్య 560
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.antha sollu

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి.

సమీప మండలాలుసవరించు

గుడివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 49 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాల 1957 లో ప్రారంభించారు. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు, 2010-11 విద్యాసంవత్సరం నుండి 2014-15 విద్యాసంవత్సరం వరకు, వరుసగా ఐదు సంవత్సరాలపాటు, 100% ఉత్తీర్ణత సాధించారు. [4] 2016మార్చిలో పదవతరగతి పరీక్షలు వ్రాసిన ఈ పాఠశాల విద్యార్థులు మొత్తం 32 మందీ ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ విధంగా ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు, వరుసగా 100% ఉత్తీర్ణత సాధించడం ఇది ఆరవసారి. [7]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు

ఈ పాఠశాల పూర్వవిద్యార్థిని శ్రీమతి మద్దాలి అన్నపూర్ణాదేవి, 2009,జులై-24వ తేదీనాడు పాఠశాల పేరుమీద ఐదు లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్టు చేసారు. ఆ పైకం మీద సంవత్సరానికి వచ్చే వడ్డీ డబ్బుతో, విద్యా వలంటీరుకు వేతనంతోపాటు, పాఠశాల విద్యార్థులకు ఒక సంవత్సరానికి కావలసిన నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు వగైరాలు అందజేయుచున్నారు. విద్యార్థులు వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ, నాణ్యమైన విద్యను పొందుచూ అభివృద్ధిబాటలో పయనించుచున్నారు. [5]

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

కళ్యాణమండపం:- గ్రామానికి చెందిన కీ.శే.కొడాలి గోపాలరావు జ్ఞాపకార్ధం, ఆయన భార్య ఆండాళ్ళు తాయరు వితరణతో, నిర్మించు ఈ కళ్యాణమండప నిర్మాణానికి, 2015,డిసెంబరు-7న శంకుస్థాపన నిర్వహించారు. [6]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. పసుమర్రు మేజరు పంచాయితి. గ్రామ జనాభా సుమారు 12,000.
  2. గంగులవాని చెరువు, పసుమర్రు గ్రామ పంచాయతీపరిధిలోని ఒక శివారు గ్రామం.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బొప్పన కుసుమ కుమారి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి కాకి సునీత ఎన్నికైనారు. [3]
  4. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో, ప్రభుత్వం 13.5 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి చెందిన శ్రీ త్రిపురనేని శ్రీనివాస్, తన తండ్రి కీ.శే. నాసరయ్య ఙాపకార్ధం, ఈ పంచాయతీ భవన నిర్మాణానికై ఒకటిన్నర లక్షల రూపాయలు విరాళంగా అందించారు. మొత్తం 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన భవన నిర్మాణానికి 2017,జూన్-20న శంకుస్థాపన నిర్వహించారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు

శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి,అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ప్రధాన జీవనాధారము వ్యవసాయము.వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

సుప్రసిద్ధ కవి, చలనచిత్ర గీత రచయిత శ్రీ త్రిపురనేని మహారధి (20.4.1930 నుండి 23.12.2011) ఈ వూరివారే. [2]

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,863 - పురుషుల సంఖ్య 934 - స్త్రీల సంఖ్య 929 - గృహాల సంఖ్య 560;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2093.[3] ఇందులో పురుషుల సంఖ్య 1042, స్త్రీల సంఖ్య 1051, గ్రామంలో నివాస గృహాలు 568 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Pasumarru". Retrieved 30 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2011,డిసెంబరు-24. [3] ఈనాడు కృష్ణా/పామర్రు; 2014,జులై-29; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-31; 34వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,జులై-23; 23వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-8; 24వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-13; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-21; 2వపేజీ.