వికీపీడియా:వికీప్రాజెక్టు/పాత తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ఎడిటథాన్
తెలుగు సినిమా వ్యాసాలను 2005, 2006 ప్రాంతాల్లో బాట్ వినియోగించి తయారుచేశారు. అయితే క్రమంగా కొన్ని వ్యాసాలపై సముదాయం దృష్టిపెడుతూ అభివృద్ధి చేసినా, మరెన్నో వ్యాసాలు కొద్ది సమాచారంతోనూ, మూలాలు లేకుండానూ మిగిలేవుంది. 1930లు, 40లు, 50ల్లో వచ్చిన తెలుగు సినిమాల వ్యాసాలను అభివృద్ధి చేసే ఎడిటథాన్ నిర్వహించడం వల్ల వ్యాసాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఆలోచనతో ఎడిటథాన్ నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో వ్యాసంలో పోస్టర్, సమాచారం, మూలాలు వంటివి అభివృద్ధి చేసి వ్యాస విస్తరణకు తోడ్పడగలరు.
ఆశించేవి
మార్చుమీరు ఈ ఎడిటథాన్లో పాల్గొంటే కనీసం 1930, 1940, 1950 దశకాల్లో విడుదలైన తెలుగు సినిమా వ్యాసాలను కనీసం మొలకస్థాయి దాటేలా, ఆపైన మరింత సమాచారంతోనూ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. ఐతే మీరెన్ని వ్యాసాలపై పనిచేయదలుచుకుంటే అన్ని వ్యాసాలపైనే పనిచేయవచ్చు. వ్యాసాలను వికీపీడియా పాలసీలను, గైడ్లైన్లను అనుసరించి అభివృద్ధి చేయాలి.
నియమాలు
మార్చువ్యాసాన్ని జూన్ 15, 2016 నుంచి జూన్ 25, 2016 మధ్యకాలంలో కనీసం 3వేల బైట్లు, లేదా 280-300 పదాలకు మించి అభివృద్ధి చేయాలి. వ్యాసం 1930లు, 40లు, 50ల్లో విడుదలైన తెలుగు సినిమా అయివుండాలి. (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి లెక్కించాలి) వ్యాసం కాపీహక్కుల ఉల్లంఘనకు గురైన అంశం కాకూడదు, నిర్ధారింపదగినది మరియు ఇతర ముఖ్యమైన వికీపీడియా పాలసీలను అనుసరించాలి. వ్యాసానికి చక్కని మూలాలు ఉండాలి; వ్యాసం యాంత్రికానువాదం ద్వారా చేసియంది కాకూడదు. వ్యాసాల్లో నిర్వహణ మూసలు ఉండకూడదు.
ఇతర విషయాలు
మార్చుకింద ఏర్పరచిన పట్టికలో పైన నియమాలను అనురించే ఏ తెలుగు సినిమా వ్యాసాన్నైనా చేర్చవచ్చు. అవసరమైన మూలాలను సహ సభ్యులు, సంస్థను కోరవచ్చు.
ఆన్లైన్ లో లభిస్తున్న మూలాలు
మార్చు- indiancine.ma - ఇక్కడ చూడండి.
పాల్గొనే సభ్యులు
మార్చుమీ ప్రగతిని ఇక్కడ, ఈ ఫార్మాట్లో నమోదుచేయండి: Example (talk) (Article 1, Article 2, Article 3, Article 4, Article 5)
వ్యాసాలు
మార్చుఈ కింద అభివృద్ధి చేయదగ్గ కొన్ని వ్యాసాలను చూడవచ్చు. ఐతే పట్టికను ఎవరైనా నియమాలను అనుసరిస్తూన్న వ్యాసాలు చేర్చి తాజాకరించవచ్చు. సభ్యుని పేరు వద్ద మీకు ఆసక్తి వుంటే సంతకం చేయవచ్చు.