టి.వి.రాజు

సినీ సంగీత దర్శకుడు
(తోటకూర వెంకటరాజు నుండి దారిమార్పు చెందింది)

తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: 1921 - అక్టోబర్ :25, ఫిబ్రవరి 20, 1973) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.

తోటకూర వెంకట రాజు
టి.వి.రాజు
జననంటి.వి.రాజు
అక్టోబరు 25 1921
రఘుదేవపురం , రాజమహేంద్రవరంభారతదేశం
మరణం20 ఫిబ్రవరి, 1973
మతంహిందూమతం
భార్య / భర్తసావిత్రి
పిల్లలుఇద్దరు; వెంకట సత్య సుర్యనారాయణ (గిటారిస్ట్), రాజ్ - సంగీత దర్శకులు)
తండ్రిపెద్ద సోమరాజు
తల్లిరత్తమ్మ

తోటకూర వెంకటరాజు రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు.

కుటుంబం

మార్చు

ఈయనకు 33వ యేట సావిత్రితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు. పెద్దవాడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, ఈయన గిటారిస్ట్. రెండవ కుమారుడు తోటకూర సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), రాజ్-కోటి ద్వయంలో ఒకడు. కోటి నుండి విడివడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

సినీ ప్రస్థానం

మార్చు

1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల సినిమాలో సంగీతదర్శకుడు పి.ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీయార్, కె.విశ్వనాథ్‌ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడువంటి చిత్రాలున్నాయి.

సినిమాలు

మార్చు

నటించినవి

మార్చు

పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.

విశేషాలు

మార్చు

ఈయన ఒకే ఒక సినిమాను నిర్మాతగా తీసారు. ఒకప్పటి రూమ్ మేట్స్ అయిన ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ తో కలిసి "బాల నాగమ్మ" (1959) సినిమాను నిర్మించారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు