తెలుగు బాలసాహిత్యం

(బాల సాహిత్యము నుండి దారిమార్పు చెందింది)
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ఆనందం - దాసరి వేంకటరమణ రాసిన బాలల సాహిత్య పుస్తకం
  • 1812 : మొట్టమొదటి తెలుగు నిఘంటువు ప్రచురించబడింది.
  • 1816: మొట్టమొదటి తెలుగు ముద్రణాలయం మద్రాసులో స్థాపించబడింది.
  • 1818: సి. పి. బ్రౌన్ దొర గారి నిఘంటువు ప్రచురించబడింది.
  • 1819: రావిపాటి గురుమూర్తి - "ద్వాత్రింశతి సాలభంజికలు", "విక్రమార్కుని కథలు" ప్రచురితమయ్యాయి.
  • 1820: మద్రాస్ వెర్నాక్యులర్, స్కూల్ బుక్ పబ్లిషిగ్ సొసైటీ స్థాపన
  • 1834: రావిపాటి గురుమూర్తి - "పంచతంత్ర కథలు" ప్రచురితం.
  • 1842: గోపకవి "దాశరధి శతకము" ప్రచురితం.
  • 1845: పూడూరు సీతారామశాస్త్రి పెద్దబాలశిక్ష ప్రచురితం.
  • 1851: అద్దంకి సుబ్బారావు "తెలుగు వాచకము" ప్రచురితం.
  • 1853: చిన్నయ సూరి "మిత్రభేదము" ప్రచురితం.
  • 1855: బ్రౌన్ సంకలనం "తాతాచాఱ్లు కథలు" ప్రచురితం.
  • 1856: పుడూరు సీతారామశాస్త్రి "నీతికథలు - చిత్ర కథలు" ప్రచురితం.
  • 1861: "పరమానందయ్య శిష్యుల కథలు" ప్రచురితం.
  • 1872: కందుకూరి వీరేశలింగం "నీతి ధిపిక (శతకం)" ప్రచురితం.
  • 1873: కందుకూరి వీరేశలింగం "నీతికథామంజరి" ప్రచురితం.
  • 1874: గజ్జెల రామానుజులు "స్త్రీ నీతి శాస్త్రము" ప్రచురితం.
  • 1884: జనవినోదిని పత్రికలో పిల్లల పాటలు ప్రచురితం.
  • 1905: "తెలుగు జానపద గేయాలు" ప్రచురితం
  • 1908: పిల్లల రచనలు "వివేకవతి" పత్రికలో ప్రచురితం.
  • 1909: "రేడియో అక్కయ్య" న్యాయపతి కామేశ్వరి జననం; గిడుగు సీతాపతి "చిలకమ్మ పెండ్లి", "రైలుబండి" పాటలు రచన. .
  • 1912: వెంకట పార్వతీశ కవులు "బాలగీతావళి" ప్రచురితం.
  • 1919: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పిల్లల పాటలు "అనసూయ" పత్రికలో ప్రచురితం.
  • 1924: అడవి బాపిరాజు గారి అమ్మ పాటలు "భారతి"లో ప్రచురితం.
  • 1925: వావికొలను సుబ్బారావు గారి తల్లి పిల్ల పాటలు "నవ్వులతోట" పత్రికలో ప్రచురితం.
  • 1928: "గృహలక్ష్మి" పత్రికలో "బాల విజ్ఞానశాఖ" ప్రాంభించారు.
  • 1929: ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో పిల్లల కార్యక్రమాలు ప్రారంభం.
  • 1931: చింతా దీక్షితులు "సూరి సీతి వెంకి" "భారతి"లో ప్రచురించబడినది.
  • 1933: ఆండ్ర శేషగిరిరావు గారి "బాల భూమి" శీర్షిక ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురణ ప్రారంభమైనది.
  • 1937: గుమ్మడిదాల దుర్గాబాయమ్మ - "Little Ladies of Brundavan" - మద్రాసులో మొదటి పిల్లల సంఘం స్థాపించబడింది. దుర్గాబాయి గారి "బాలానందం" కార్యక్రమాలు ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో మొదలయ్యాయి.
  • 1939: మద్రాసు ఆకాశవాణి కేంద్రంనుండి "రేడియో అన్నయ్య" న్యాయపతి రాఘవరావు "బాలల కార్యక్రమాలు" ప్రారంభించాడు.
  • 1940:
    • మొదటి బాలల పత్రిక "బాలకేసరి" ప్రారంభం - సంపాదకుడు - మేడిచర్ల ఆంజనేయమూర్తి.
    • "భారతి"లో గిడుగు సీతాపతి బాలానందం అనే పిల్లల శీర్షిక ప్రారంభించాడు.
    • మద్రాసులో "ఆంధ్ర బాలానంద సంఘం" స్థాపన.
  • 1941: న్యాయపతి రాఘవరావు "బాల" అనే పిల్లల మాసపత్రికను ప్రారంభించాడు.
  • 1946: చక్రపాణి చందమామ పత్రికను ప్రారంభించాడు.
  • 1949:
  • బాలమిత్ర, "పాపాయి" అనే పిల్లల పత్రికలు ప్రారంభం.
  • 1951: న్యాయపతి రాఘవరావు అధ్వర్యంలో HMV కంపెనీవారు పిల్లల పాటల రికార్డులు విడుదల చేశారు.
  • 1952:
    • విజయవాడలో "తెలుగు బాలరచయితల సంఘం" ప్రారంభం.
    • మద్రాసులో "తెలుగు బాలల మహాసభ" నిర్వహణ.
    • పాటిబండ మాధవశర్మ సంపాదకత్వంలో "బాలప్రభ" మాసపత్రిక ఆరంభం.
  • 1953:
  • 1955:
    • బొమ్మరిల్లు (కవిరావు, పిల్లల బొమ్మల భారతం (మాగంటి బాపినీడు, లక్కపిడతలు (చింతా దీక్షితులు) - భారత ప్రభుత్వ అవార్డు పొందాయి.
    • మద్రాసులో గల బాలానంద సంఘం వారు సంచార గ్రంథాలయం (Mobile Library) ను ప్రారంభించారు.
    • భారత ప్రభుత్వం బాలల చలనచిత్ర సమితి (Children's Film Society) ను ప్రారంభించింది.
    • "బాలల విజ్ఞాన సర్వస్వం" తెలుగులో ప్రచురించబడింది. (పూర్తిగా),
    • గుంటూరులో "బాలానంద సంఘం" నెలకొల్పబడింది.
  • 1956:
  • 1957:
    • నటరాజ రామకృష్ణ వ్రాసిన "నర్తన బాల"కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • హైదరాబాద్ లో "తెలుగు బాలల మహాసభలు" జరిగినవి.
  • 1958:
    • "బాలప్రభ" అనే మాసపత్రిక ప్రారంభించబదినది.
    • బి.వి.నరసింహారావు వ్రాసిన "పాలబడి పాటలు", వారణాశి సుబ్రహ్మణ్యం వ్రాసిన "జంతు ప్రపంచం ఏనుగు" లకు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
  • 1959:
    • ఆవంచ లక్ష్మణరావు వ్రాసిన "చిలుకమ్మ చుట్టాలు"కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • ఉప్పల సత్యనారాయణాచార్య వ్రాసిన " గంగావతరణం" నకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించి.
  • 1960: ఆకాశం (విస్స అప్పారావు), బొమ్మల గౌతమ బుద్ధుడు (వేదుల కామేశ్వరరావు), జంతు ప్రపంచం (ఎస్.ఎల్.నరసింహారావు) లకు భారత ప్రభుత్వ అవార్డులు వచ్చాయి.
  • 1961:
    • బిడ్డల చేతిపనులు (కె.ఎస్.నరసింగాచారి), పరమాణుకథ (ఎ.వి.యస్.రామారావు) లు భారత ప్రభుత్వ అవార్డులు పొందాయి.
    • హైదరాబాద్ లో "బాల సాహిత్య శిక్షణా శిబిరం" జరిగింది.
  • 1962:
    • నర్తనసీమ (నటరాజ రామకృష్ణ), అంతరిక్ష విజ్ఞానం (ఎ.వియస్.రామారావు), బాలప్రపంచం (మసూనా) లు భారత ప్రభుత్వ అవార్డులు పొందాయి.
    • "చంద్రభాను" అనే మాసపత్రిక ప్రారంభించబడింది.
  • 1963:
    • "విశ్వరహస్యం" (ఎ.వియస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • అల్లరి గోపి అద్భుత యాత్ర ( వసమూర్తి) నకు దక్షిణ భారత భాషా పుస్తక అవార్డు లభించిది.
    • "బాలరాజ్యం" అనే మాసపత్రిక ప్రారంభించబడింది.
    • "బాల సాహిత్య మాల" ప్రచురించబడింది.
  • 1964:
    • "బాలానందం" మాసపత్రిక ప్రారంభం.
    • పగలు రాత్రి (డి.కన్యకుమారి) నకు భారత ప్రభుత్వ అవార్డు వచ్చింది.
  • 1965:
    • "రఘపతి" మాసపత్రిక ప్రారంభం.
    • విజ్ఞానలోకం (వెలగ వెంకటప్పయ్య), బాలాభిరామం ( మిరియల రామకృష్ణ) లకు దక్షిణ భారత దేశ పుస్తక అవార్డు లభించింది.
    • బాలలబొమ్మల నెహ్రూ (బి.సూర్యనారాయణ మూర్తి) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • బాలల భవన్ హైదరాబాదులో ఏర్పాటు.
  • 1966:
    • బంగారు నడిచిన బాట (కలువకొలను సదానంద) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • చిట్టి ముత్యాలు (గంగరాజు సుశీలాదేవి), యువరాజు (కె.రామలక్ష్మి) లు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను పొందాయి.
    • ఆంధ్ర బాలనంద సంఘం వారు పిల్లలకు రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు.
  • 1967:
    • నర్తనసీమ (నటరాజు రామకృష్ణ) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • గేయఖండావళి (జె.రాఘవమ్మ), నేటి విద్యార్థి (కె.యస్.వెంకటరమణ) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
  • 1968:
    • స్వతంత్ర భారతి ( వెక్కలంక లక్ష్మిపతిరావు) కి భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • మూడుమొగ్గలు ( ఎ.లక్ష్మిరమణ) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
  • 1969:
    • కుంకుమరేఖ (కోడూరి లీలావతి, ప్రకృతి వింతలు (గిడుగు విశాలాక్షి) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
    • "పసిడిబాల" మాసపత్రిక ప్రారంభం.
  • 1970: '
    • రంగు రంగుల రత్న దీపాలు ( మిరియాల రామకృష్ణ) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • "ఆనందబాల", "బాలప్రపంచం" మాసపత్రిక ప్రారంభం.
    • అనంతంలో అంతం (కంచి రమాదేవి), ఆంధ్ర దేశ యాత్ర ( యసం సుశీలాదేవి) లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
  • 1972:
    • చంద్రలోక యాత్ర (ఎ.వి.యస్.రామారావు) నకు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • "బొమ్మరిల్లు" మాసపత్రిక ప్రారంభం.
  • 1973: "గాలిలో ప్రయాణం" (రెడ్డి రాఘవయ్య) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
  • 1974:
    • యాగ్లీకం (సీత) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
    • "వసంతబాల", "పాలవెల్లి" మాసపత్రిక ప్రారంభం.
    • అఖిల భారత తెలుగు బాలల ఉత్సవం (All India Telugu Children Festival ) హైదరబాదులో ఏర్పాటు చేయబడింది.
    • ఆకాశాన్ని చూద్దాం ( ఎ.వి.యస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
  • 1975:
    • తెలుగు దూరదర్శన్ (టెలివిజన్) కార్యక్రమాలు హైదరాబాద్ లో ప్రారంభించబడినవి.
    • బాల విజ్ఞాన కథానిధి ( ఎ.వి.యస్.రామారావు) కు భారత ప్రభుత్వ అవార్డు లభించింది.
    • బంగారుతల్లి (పాలంకి వెంకట రామచంద్రమూర్తి) నకు ఆంధ్రా అవార్డు లభించింది.
    • "జ్యోతి" వారపత్రిక ప్రారంభం.
    • "బుజ్జాయి" మాసపత్రిక ప్రారంభం.
    • " చందమామ" పత్రిక వ్యవస్థాపకులు "చక్రపాణి" గారి అస్తమయం.
  • 1976:
    • "ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ" ప్రభుత్వ సంస్థగా హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
    • "దయ్యాల మేడ" ( కంచి రమాదేవి) కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
  • 1977:
    • ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు ప్రారంభించబడినవి.
    • "బాల", "బేడి", "స్నేహబాల", "కంపక్" మాసపత్రికల ప్రారంభం.
    • ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి డాక్యుమెంట్ విడుదల.
    • న్యాయపతి రాఘవరావు గారికి సన్మానం.
  • 1978:
    • "బాలచంద్రిక", "ప్రమెద", "బాలభారతి", "మా బడి", పాఠశాల మాసపత్రికల ప్రారంభం.
    • పి.తిరుమలరావు, బి.వి.నరసింహారావు, పాలంకి, ఇల్లిందుల సరస్వతి లకు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ తరపున " బాలబందు" బిరుదు ప్రదానం.
    • న్యాయపతి రాఘవరావు, కామెశ్వరి గార్లు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ యిచ్చిన "బాలబందు" అవార్డు తిరస్కరణ.
  • 1979:
    • "బాలవాణి" మాసపత్రిక ప్రారంభం.
    • "విద్యాబాల" త్రైమాసిక పత్రిక ప్రారంభం
    • డాక్టరేట్ డిగ్రీ కొరకు "బాల గేయ సాహిత్యం" పై ఎం.కె.దేవకి గారు వ్రాసిన పరిశోధనా వ్యాసం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నకు సమర్పణ.
    • బాలల గేయాలు రికార్డు చేయబదినవి.
    • "మనచుట్టూ ఉన్న వింతమొక్కలు" (కొత్త శేషాద్రి) నకు భారత ప్రభుత్వ అవార్డు.
  • 1980:
    • "బాలబంధు" బిరుదం కొరకు ఎంపికైన ఏడిద కామేశ్వరరావు, శ్రీకాంతాం కృష్ణారావు.
    • "బాలజ్యోతి" మాసపత్రిక ప్రారంభం.
    • సేకరించిన బాలల సాహిత్యాన్ని ప్రచురించిన అకాడమీ.
    • తెలుగు బాలల సాహిత్య అవార్డు పొందిన వెలగ వెంకటప్పయ్య.
    • కె.సభా అస్తమయం.

  • మూలం: బాల సాహితి వికాసం (డాక్టరేట్ పరిశోధన, ఆంధ్రా విశ్వవిద్యాలయం, 1977-1980), వెలగ వెంకటప్పయ్య 1982.: సిద్దార్థ పబ్లిషర్స్, విజయవాడ.

మూలాలు

మార్చు