వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2020
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 13 నుండి దారిమార్పు చెందింది)
2020 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
2020 సంవత్సరం లోని వాక్యాలు
మార్చు01 వ వారం
మార్చు- ... బుద్ధుడు 200 సంవత్సరాల క్రితం జ్ఞానోదయానికి చేరుకున్న ప్రదేశంలో వజ్రాసన స్థాపించబడినదనీ!
- ... గంభీరావుపేట లోని సీతారామ దేవాలయం లో అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుందనీ!
- ... మహాభారతం ఆధారంగా జరాసంధుడు, శిశుపాలుడు చేది రాజ్యాన్ని పరిపాలించారనీ!
- ... కళింగ ప్రాంతం మహానది, గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతమనీ!
- ... అయోధ్యరాజు దశరధుడు ముగ్గురు రాణులలో ఒకరైన కైకేయి కేకయరాజ్యానికి యువరాణి అనీ!
02 వ వారం
మార్చు- ...శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ మానవ పరిణామం అనీ!
- ...కురురాజు పాండురాజు రెండవభార్య మాద్రి మద్రరాజ్యానికి చెందినదనీ!
- ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పద్నాలుగో గవర్నర్ ఐ.జి. పటేల్ అనీ!
- ...ఏడిస్ ఈజిైప్టె అనే జాతి దోమకాటు వల్ల మానవులకు డెంగ్యూ జ్వరం వస్తుందనీ!
03 వ వారం
మార్చు- ...సింధు రాజ్యాన్ని శిబి కుమారులలో ఒకరైన వృషదర్భ స్థాపించాడని విశ్వసిస్తారనీ!
- ... ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి పురాతన మానవులని అంటారనీ!
- ... వంగరాజ్యం భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యమనీ!
- ... చాళుక్య రాజవంశం మొదటి సార్వభౌమ పాలకుడు మొదటి పులకేశి అనీ!
04 వ వారం
మార్చు- భూవైజ్ఞానిక కాలమానంలో ప్రస్తుత ఇపోక్ ఐన హోలోసీన్ లోని ప్రస్తుత భాగాన్ని మేఘాలయ రాష్ట్రం పేరున మేఘాలయన్ అంటారనీ, దానికొక కారణం కూడా ఉందనీ..
- పిల్ట్‌డౌన్ మనిషి పేరుతో ఒక మనిషి పుర్రెకు చింపాంజీ దవడను చేర్చి ఇంగ్లాండులో ఒక పురాజీవ మోసం చెయ్యబోయారనీ, ఆధునిక మాంవుడు ఇంగ్లీషు వాడేనని నమ్మింప జూసారనీ..
05 వ వారం
మార్చు- ... పురాతనకాలంలో పౌండ్రవర్ధన ఉత్తర బెంగాలు ప్రాంతంలో ఉండేదనీ!
- ...పశ్చిమ భారతదేశంలో యదువంశ రాజులు పాలించిన రాజ్యాలలో హయహయ రాజ్యం ఒకటనీ!
- ...చంద్రవంక నది ఒడ్డున పలనాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడనీ!
- ...మరాఠా పేష్వా మొదటి బాజీరావు రెండవ భార్య మస్తాని అనీ!
06 వ వారం
మార్చు- ...కేరళ ట్రావెన్కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను విధించేవారనీ. ఈ విధానాన్ని నంగేలి వ్యతిరేకించిందనీ!
- ...గుజరాత్ లోని భావ్‌నగర్ సమీపంలోని సముద్రం లోపల నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉన్నదనీ!
- ... భారత పార్లమెంటు 2019 అక్టోబర్ 31 లడఖ్ కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించిందనీ!
- ...GAFAM సంస్థలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంపై ప్రభావం చూపుతాయనీ!
07 వ వారం
మార్చు- ... షాద్ పేరుతో అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని రాసిన కవి కాళోజీ రామేశ్వరరావు అనీ!
- ... తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అను నూతన కవితా ప్రక్రియను ప్రారంభించి రచయిత ఎం. కె. సుగంబాబు అనీ!
- ... సాధారణంగా టెర్రాఫార్మింగ్ చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారనీ!
- ... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య సెలా కనుమ ఉన్నదనీ!
08 వ వారం
మార్చు- ...మున్నార్ ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారనీ!
- ...మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం అనీ!
- ...జీవానికి మద్దతు ఇచ్చేలా గ్రహ వాతావరణం సామర్థ్యాన్ని పెంచే ప్లానెటరీ ఇంజనీరింగ్ ప్రక్రియ టెర్రాఫార్మింగ్ అనీ!
09 వ వారం
మార్చు- .... డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానమనీ!
- ...సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుందనీ!
- ...మున్నార్ ను "దక్షిణ భారత కాశ్మీర్" అని కూడా పిలుస్తారనీ!
- ...శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందిందనీ!
10 వ వారం
మార్చు- ... కర్ణాటక రాష్ట్రంలో జరిగే వార్షిక ఎద్దుల పోటీ కంబళ అనీ!
- ...కోట హరినారాయణ తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరనీ!
- ...ఐరోపాలో 6 వ అత్యంత జనసాంద్రత కలిగిన దేశం బెల్జియం అనీ!
- ...భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహములు రెండుచోట్ల మాత్రమే వుంటే అందులో మొదటిది దక్షిణ దేశములో 'ఫలణి'లోను రెండవది గోలింగేశ్వర స్వామి ఆలయం లో ఉందనీ!
11 వ వారం
మార్చు- ...అంతరిక్షంలో ఉండి పనిచేసే టెలిస్కోపు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనీ!(చిత్రంలో)
- ...శబ్ద కాలుష్యం వలన హృదయ సంబంధ రుగ్మతలు, రక్తపోటు, అధిక ఒత్తిడి స్థాయిలు, టిన్నిటస్, వినికిడి లోపం, నిద్రలేమి కలుగుతాయి.
- ...మధ్య అమెరికా లోని అతి పెద్ద మంచినీటి సరస్సు నికరాగువా సరస్సు అనీ!
- ...జాతీయ భద్రతా దినోత్సవాన్ని మార్చి 4న జరుపుతారనీ!
- ...శిబి చక్రవర్తి మోక్షం పొందే ప్రదేశంలో వెలసినది కపోతేశ్వరస్వామి దేవాలయం అనీ!
12 వ వారం
మార్చు- ...ఏటా ఒకే కాలంలో జరిగే వైల్డెబీస్ట్ల వలస సెరెంగెటిలో పెద్ద ఆకర్షణ అనీ!
- ...రోమన్లు భూ సర్వేను ఒక వృత్తిగా గుర్తించారనీ!
- ...ఒగ్గుకథల ‘సూపర్‌స్టార్' బిరుదాంకితురాలు మల్లారి జమ్మ అనీ!
- ...సామాజిక సేవలకు గాను గూగుల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును గెలుచుకున్న మహిళ పూసపాటి సంచయిత గజపతిరాజు అనీ!
- ...ప్రధానాహారం ప్రాంతానికి, ప్రాంతానికి మారుతూ ఉంటుందనీ!
13 వ వారం
మార్చు- ...శబ్ద కాలుష్యం కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందనీ!
- ... భారత రిజర్వు బ్యాంకు తన కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా యస్ బ్యాంక్ బోర్డును నిలిపివేసిందనీ!
- ...వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటారనీ!
- ...అత్రి మహర్షి గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలంను అత్రి మండలం అని పిలుస్తారనీ!
14 వ వారం
మార్చు- ... శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే కరోనా వైరస్ ను 1960లో తొలిసారిగా కనుగొన్నారనీ!
- ...చౌరి చౌరా సంఘటన ఫలితంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారనీ!
- ... నండూరి రామమోహనరావు తెలుగులో గ్రంథస్తం చేసిన ఖగోళ శాస్త్ర విశేషాల సంపుటి విశ్వరూపం అనీ!
- ... కానరీ ద్వీపాలు స్పెయిన్ దక్షిణప్రాంత స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం అనీ!
15 వ వారం
మార్చు- ... మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్అనీ.(చిత్రంలో)
- ...ఆంధ్రజాలరి గా సుపరిచితమైన నృత్య కళాకారుడు డి. వై. సంపత్ కుమార్ అనీ.
- ... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం స్థాపించినది కూర్మా వేణు గోపాలస్వామి అనీ.
- ...ఒక కళాకారుడు త్రిపాత్రాభినయంతో నటించిన మొదటి హిందీ చిత్రం మధుమతి అనీ.
16 వ వారం
మార్చు- ... ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెఎఫ్సీ వ్యవస్థాకుడు కల్నల్ సాండర్స్ అనీ!(చిత్రంలో)
- ... కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్ అనీ!
- ... ఆది శంకరాచార్యుడు 8 వ శతాబ్దంలో వ్రాసిన గ్రంథం వివేకచూడామణి అనీ!
- ... చీకటిలో ఫోటోలు తీయడానికి పరారుణ వికిరణాలు ఉపయోగిస్తారనీ!
17 వ వారం
మార్చు- ...చేతులు కడుక్కోవడం వల్ల కలిగే వైద్య ప్రయోజనాలను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్ అనీ!
- ... కాశ్మీరును కాపాడిన 19 యేండ్ల యువకుడు మఖ్బూల్ షేర్వాణీ అనీ!
- ...కంప్యూటరులో కట్, కాపీ, పేస్ట్ లాంటి కమాండ్లును రూపొందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ అనీ!
- ...ఆకాశంలో వలస పక్షుల గుంపు వాటి ప్రవాహ ఘర్షణను తగ్గించుకోవడానికి V ఆకారంలో ఎగురుతాయనీ!
18 వ వారం
మార్చు- ...భారతదేశ పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచీకరణ వ్యతిరేక రచయిత్రి వందన శివ అనీ! (చిత్రంలో)
- ...భారతదేశపు తొట్టతొలి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అనీ!
- ...గోవా విముక్తికై ప్రాణాలర్పించిన ఆధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు సూరి సీతారాం అనీ!
- ...సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ అనీ!
19 వ వారం
మార్చు- ...స్కైలాబ్ అనే ఉపగ్రహం కాలం చెల్లి, నియంత్రణ కోల్పోయి గతి తప్పడం వలన భూమిపై 1979 జూలై 11న పడిపోయిందనీ!
- ...భారత్-చైనా యుద్ధంలో ఒక్కడే 72 గంటలపాటు చైనా సేనలను నిలువరించి 150 మంది సైనికులను మట్టుబెట్టిన వీర జవాను జశ్వంత్‌సింగ్ రావత్ అనీ!
- ... తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు పండుగ సాయన్న అనీ!
- ...భారత స్వాతంత్ర్య సమరయోధుడు కారుకొండ సుబ్బారెడ్డిని బ్రిటిష్ వారు బుట్టాయగూడెంలో ఉరి తీసారనీ!
20 వ వారం
మార్చు- ... మీనల్ దఖావే భోసలే బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు, దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ ను రూపొందించిందనీ!
- ... భారతదేశంలో సరస్వతీ నది ఉనికిని కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త విష్ణు శ్రీధర్ వాకణ్కర్ అనీ!
- ... ఆర్గానోబ్రోమైడ్ సమ్మేళనాలను అగ్ని నిరోధకంగా ఉపయోగపడతాయనీ!
- ... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేసే రీతిలో తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంచుతాడనీ!
21 వ వారం
మార్చు- ...భారతదేశంలో హరిద్వార్ చాలా ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం అనీ!
- ...టామ్ అండ్ జెర్రీ వంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించినవాడు జీన్ డీచ్ అనీ!
- ...భారతదేశంలో 2019–20 కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉందనీ!
- ...అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది ఉలూపి అనీ!
22 వ వారం
మార్చు- ...1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నామనీ!
- ...ఆధునిక యుగంలో వీరరస ప్రధాన కవిగా రామ్‌ధారీ సింగ్ దినకర్ గుర్తింపు పొందారనీ!
- ...పర్వతం మీదనే ముఖ్యమైన పన్నెండు మంది దేవతలు నివాసమున్నారని గ్రీకులు నమ్మేవారనీ!
- ...మే నెల చివరలో తమిళనాడు పర్యాటక అభివృద్ధి బోర్డు ఏలగిరి వేసవి ఉత్సవం నిర్వహిస్తుందనీ!
23 వ వారం
మార్చు- ... హిందూ మహాసముద్రం లోని ఒక ద్వీపం డియెగో గార్సియా అనీ!
- ... గ్రీకు దేవాధిపతి జూస్ ని హిందువుల ఇంద్రుడితో పోల్సవచ్చుననీ!
- ... జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయమునకు 2017 లో "విజిటర్స్ అవార్డు" లభించిందనీ!
- ... 2018 మార్చి 9 న భారత సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాల ప్రకారం కారుణ్య మరణం భారతదేశంలో చట్టబద్ధమైనదనీ!
24 వ వారం
మార్చు- ...3000 కి పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనత సాధించిన వైద్యుడు సర్వేశ్వర్ సహారియా అనీ!
- ...సర్వర్ క్లస్టర్ లలోని కంటైనర్స్ ని నియంత్రించేదుకు క్యూబెర్నెట్స్ వాడతారనీ!
- ...భారతదేశంలో సర్వేయింగు, మ్యాపింగు చేసే బాధ్యతలున్న కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏజెన్సీ సర్వే ఆఫ్ ఇండియా అనీ!
- ...ప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998 జనవరి 10న భారతదేశంలోని ముంబైలో ప్రారంభమైందనీ!
25 వ వారం
మార్చు- ...ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల హిమబిందు అనీ!
- ...1949 లో విజయనగరం జమీందారీ జమీందారీ ఇండియన్ యూనియన్‌లో చేరిందనీ!
- ... అమరరాజా గ్రూప్ ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్ అమరోన్ తయారీలో గుర్తింపు పొందిందనీ!
- ...డీహైడ్రేషన్ ఎక్కువ కావడం వల్ల మరణం సంభవించవచ్చనీ!
26 వ వారం
మార్చు- ...ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్, రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరమనీ!
- ...1998 ఆటా నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దృశ్యకావ్యం పడమటి గాలి అనీ!
- ...1793 నుండి 1798 వరకు సిలోన్ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేదనీ!
- ... క్రిప్స్ రాయబారం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిషుప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నమనీ!
27 వ వారం
మార్చు- ...పోలియోకు నోటి ద్వారా వేసే టీకాను కనుగొన్న ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, దాని ధరను తక్కువగా ఉంచేందుకు గాను, తన టీకాకు పేటెంటు తీసుకోలేదనీ!
- ... ఏదైనా సూక్ష్మక్రిములను 30 సెకన్లలోపు నాశనం చేసే క్రిమి సంహారక రసాయన ద్రావణం శానిటైజర్ అనీ!
- ...విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం వల్ల సమీప గ్రామాలు ప్రభావితమైనాయనీ!
- ... 1909 లో మోర్లే-మింటో సంస్కరణలకు సురేంద్రనాథ్ బెనర్జీ మద్దతు ఇచ్చాడానీ!
- ... ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం హెలీకాప్టర్ మనీ వెనుకున్న ముఖ్య ఉద్దేశమనీ!
28 వ వారం
మార్చు- ... జమ్షెడ్జీ టాటా ను "భారతీయ పరిశ్రమ పితామహుడు" గా భావిస్తారనీ!
- ... పూర్వపు సంస్థానాల పాలకులకు, వారి కుటుంబాలకూ చేసిన చెల్లింపే ప్రీవీ పర్సు అనీ!
- ... చిన్మయానంద 1964 లో విశ్వ హిందూ పరిషత్ సహాయ స్థాపకుడనీ!
- ... ఆంధ్రాతాన్ సేన్ బిరుదాంకితుడైన రంగస్థల కళాకారుడు డి.వి. సుబ్బారావు అనీ!
29 వ వారం
మార్చు- ... వేబ్యాక్ మెషీన్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ ను ఆర్కైవు చేసే భాండాగారం అనీ!
- ... ఓజోన్ పొర సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుందనీ!
- ... నర్మదా నది సాత్పురా శ్రేణికి ఈశాన్య చివర ఉన్న అమర్ కంటక్ వద్ద ఉద్భవించిందనీ!
- ... పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో మే నెల 2020 లో పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించిందనీ!
30 వ వారం
మార్చు- ... జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన ఉర్దూ కవులలో అఖ్లాక్ ముహమ్మద్ ఖాన్ నాల్గవ వాడనీ!
- ... అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త క్లారెన్స్ మెల్విన్ జెనర్ గౌరవార్థం జెనర్ ప్రైజ్ స్థాపించారనీ!
- ... తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో ములుకనాడు బ్రాహ్మణులు ఒక ఉప సమూహం అనీ!
- ... ప్రేమ్‌చంద్ తరువాత హిందీ కల్పనా సాహిత్యంలో ప్రధాన కథకుడు అమర్ కాంత్ అనీ!
31 వ వారం
మార్చు- ... ఏడిదము సత్యవతి ఆత్మకథ రాసుకున్న తొలి తెలుగుమహిళ అనీ!
- ... డోక్లాం ప్రాంతంలో చైనా రహదారిని నిర్మించడాన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించిందనీ!
- ... 1896 లో న్యాపతి సుబ్బారావు పంతులు నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన నవల హేమలత (నవల) అనీ!
- ... వేపా రామేశం 1920 నుంచి 1935 దాకా మదరాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడనీ!
32 వ వారం
మార్చు- ... ఫిరోజ్ గాంధీ తన మామ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేసాడనీ!(చిత్రంలో)
- ... థేరవాదం బౌద్ధమతంలో అతి పురాతమైన శాఖల్లో ఒకటనీ!
- ... "పండిత", "సరస్వతి" బిరుదులు పొందిన మొదటి మహిళ, భారతీయ సంఘసంస్కర్త పండిత రమాబాయి అనీ!
- ... తెలుగు సినిమా నటి వేదవల్లి కుమార్తె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత అనీ!
33 వ వారం
మార్చు- ... భారత క్రికెట్ క్రీడాకారుడు దళిత కులానికి చెందినవాడు అయినందున పాల్వంకర్ బాలూ కులవివక్షను ఎదుర్కొన్నాడనీ!
- ... 20 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉండి నివసించేందుకు కనీసం ఒక పూరిల్లునూ సంపాదించుకోని నిస్వార్థ రాజకీయనాయకుడు పాటూరు రామయ్య అనీ!
- ...రెండో యాదగిరిగుట్టగా పేరు సంపాదించుకున్న దేవాలయం వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనీ!
- ...కొర్రమట్ట ను తెలంగాణ రాష్ట్ర చేపగా ఎంచుకున్నారనీ!
34 వ వారం
మార్చు- ...కాళ్ళకూరి సదాశివరావు జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన మొదటి వ్యక్తి అనీ!
- ... జీనో సోక్రటిస్ పూర్వ కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అనీ!
- ... కాగితం గుజ్జును వాడి విత్తనాలను మొలకెత్తించేందుకు మొలకెత్తే కాగితం వాడుతారనీ!
- ... గట్టెం వెంకటేష్ న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని టూత్ పిక్ పై చెక్కి రికార్డు సృష్టించాడనీ!
35 వ వారం
మార్చు36 వ వారం
మార్చు- ... మధుమేహం తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు రోజుకి ఒక్కటి తింటే చాలనీ!
- ...చెయ్యడం ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థికి విమర్శనాత్మక ఆలోచనను మెరుగుపరుస్తుందనీ!
- .. ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సహజాత పదాల ఆధారంగా నిరూపించిన భాషాశాస్త్రవేత్త గారపాటి ఉమామహేశ్వరరావు అనీ!
37 వ వారం
మార్చు- ...డిజిటల్ అక్షరాస్యతను జ్ఞాన పథంలో ఒక భాగంగా భావించాలనీ!
- ... గోల్కొండ చక్రవర్తి తానీషా కొలువులో పనిచేసిన అక్కన్న మాదన్నలు భక్త రామదాసు మేనమామలనీ!
- ...ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందనీ!
- ... అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన శృంగార నీతి కావ్యం హంసవింశతి అనీ!
38 వ వారం
మార్చు- ... న్యుమోనియా సాధారణంగా వైరస్లు, బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందనీ!
- ...సోడియం హైపోక్లోరైట్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ ఉపరితలాలను క్రిమిరహితం చేయవచ్చనీ!
- ...సర్ రుడాల్ఫ్ వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి ఐరన్ సిలిండరును పని చేయించినందున గుర్తుగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం జరుపుకుంటారనీ!
- ... "చూసి చూడంగానే" సినిమాతో తెలుగు సినిమారంగంలోకి వర్ష బొల్లమ్మ నటిగా రంగప్రవేశం చేసిందనీ!
39 వ వారం
మార్చు- ...కోటి వేంకనార్యుడు "ఆంధ్రభాషార్ణవము" అనే అచ్చ తెలుగు నిఘంటువును పద్య రూపంలో రాసాడనీ!
- ... రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లో శిక్షణ ఇచ్చే భారతీయ రైల్వే ప్రధాన కేంద్రీకృత శిక్షణా సంస్థ రైల్ నిలయం లో ఉన్నదనీ!
- ...భారతదేశం భూటాన్‌లో 1,416 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోందనీ!
- ...సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందనీ!
40 వ వారం
మార్చు- ...అబుదాబి ద్వీపం ఐదు లేన్ల మోటారువే వంతెన ద్వారా సాదియాట్ ద్వీపానికి అనుసంధానించబడి ఉందనీ!
- ... క్వాల్కమ్ సంస్థ మేధో సంపత్తి, సెమీకండక్టర్స్, సాఫ్ట్వేర్ వైర్లెస్ టెక్నాలజీకి సంబంధించిన సేవలను సృష్టిస్తుందనీ!
- ... టాల్‌స్టాయి కథలు లను తెలుగులోకి అనువదించినది భమిడిపాటి కామేశ్వరరావు అనీ!
- ... ప్రపంచ కొబ్బరి దినోత్సవం మొదటిసారిగా ఇండోనేషియాలో ప్రారంభమైందనీ!
41 వ వారం
మార్చు- ... రాజగోపాల కృష్ణ యాచేంద్ర వెంకటగిరి సంస్థానానికి 28వ మహారాజు అనీ!
- ... గిరిజ శ్రీ భగవాన్ గా పేరుపొందిన డిటెక్టివ్ రచయిత అసలు పేరు తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు అనీ!
- ... మూలా వెంకటరంగయ్య బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి వాహినీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడనీ!
- ... ప్రపంచమంతటా ప్రజాదరణ పొందిన జమీల్యా (నవల) మొదటగా రష్యన్ భాషలో వెలువడిందనీ!
42 వ వారం
మార్చు- ...సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక అనీ!
- ... ప్రీతం ముండే భారత పార్లమెంటు ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసిందనీ!
- ...అండమాన్ నికోబార్ దీవులలోని సౌత్ బటన్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతిచిన్న జాతీయ ఉద్యానవనం అనీ!
- ...సాహిల్ దోషి తన 14వ యేట కార్బన్ డై ఆక్సైడ్ తో విద్యుత్ తయారుచేసే పరికరాన్ని ఆవిష్కరించాడనీ!
43 వ వారం
మార్చు- ...భీష్మ ప్రతిజ్ఞ తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చారిత్రాత్మకమైందనీ!
- ... రఘుపతి సూర్యప్రకాష్ ద్రౌపది వస్త్రపహారణం సినిమాలో ఆప్టికల్ ఎఫెక్ట్‌లను ఆశ్రయించకుండా, ఒక చిత్రం సన్నివేశంలో 5 చోట్ల ఒక నటుడిని కనిపించగలిగేలా చేసాడనీ!
- ... అజంత అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన సాహిత్య కారుడు త్రిపురనేని శ్రీనివాస్ అనీ!
- ... అంతరిక్షంలో రెండు కృత్రిమ ఉపగ్రహాలు ఢీకొనడం మొదటిసారిగా 2009 లో జరిగిందనీ!
44 వ వారం
మార్చు- ... పాపం పసివాడు దక్షిణాఫ్రికా చలనచిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనే చిత్రం ఆధారంగా నిర్మితమైందనీ!
- ... కారకోరం ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి అనీ!(చిత్రంలో)
- ...తెలుగు సినిమా నటుడు చక్రవర్తుల నాగభూషణం రక్తకన్నీరు నాటకం ప్రదర్శనద్వారా గుర్తింపు పొంది "రక్తకన్నీరు" నాగభూషణంగా ప్రసిద్ధి పొందాడనీ!
- ...తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు స్వంత ఖర్చులతో ఉద్యమాన్ని నడిపిన భాషాభిమాని సాధు వరదరాజం పంతులు అనీ!
- ...వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య చేపల మార్కెట్లు వారధిగా ఉంటాయనీ!
45 వ వారం
మార్చు- ...గోవా, కొంకణ్ ప్రాంతాలలో ప్రజలు గజలక్ష్మిని తమ సంరక్షక దేవతగా పూజిస్తారనీ!
- ... తండ్రి ఆజ్ఞపై పరశురాముడు ఖండించిన తన తల్లి తల మాదిగవాడలో పడినందున వారు ఆమెను ఎల్లమ్మ గా కొలుస్తారనీ!
- ...తూర్పు జావా ప్రావిన్స్‌లోని అత్యంత పేద ప్రాంతాలలో మదురా ద్వీపం ఒకటి అనీ!
- ... సెర్గీ బుబ్కా 6.0 మీటర్లు, 6.10 మీటర్ల ఎత్తును దూకిన మొట్టమొదటి పోల్ వాల్ట్ క్రీడాకారుడు అనీ!
- ... ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది కశ్యప సంహిత అనీ!
46 వ వారం
మార్చు- ...రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక బురాన్ అంతరిక్ష నౌక అని!
- ...50 పైగా నిఘంటువుల నిర్మాణానికి కృషి చేసిన సాంకేతిక పరిజ్ఞాన శిక్షణకారుడు పెద్ది సాంబశివరావు అనీ!
- ...5,065 మీటర్లు ఎత్తున ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్ లలో ఒకటనీ!
- ... 1947-1956ల మద్య భారతదేశంలో ఉనికిలో ఉన్న ఉన్నత పదవి రాజ్ ప్రముఖ్ అనీ!
- ...భారత సైన్యం సబ్-సెక్టర్ నార్త్ (ఎస్ఎస్ఎన్) అని పిలిచే ప్రాంతంలో డెప్సాంగ్ మైదానం ఒక భాగమనీ!
47 వ వారం
మార్చు- ...పాక్షికంగా మరల మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ స్పేస్ షటిల్ అనీ!
- ...తారిమ్ బేసిన్‌లోని యార్కండ్ ల మధ్య పురాతన బిడారు మార్గంలో కారకోరం అత్యంత ఎత్తైన కనుమ అనీ!
- ...కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న కనుమ దారి ఖుంజేరబ్ కనుమ అనీ!
- ...16 వ జైన తీర్ధంకరుడైన శాంతినాధుని దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో అగ్గలయ్య గుట్టపై ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుందనీ!
- ...స్విట్జర్లండ్ ప్రెసిడెంటు పదవీ కాలం ఒకే సంవత్సరమనీ, విదేశాల్లో అధికారిక పర్యటనలు అస్సలు చెయ్యరనీ
48 వ వారం
మార్చు- ... ప్రపంచంలో అత్యంత పురాతనమైన జంతు ప్రదర్శనశాల ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందనీ!
- ... హైపోథైరాయిడిజం వ్యాధికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువ అవడం వల్ల అనీ!
- ... డయానా హేడెన్ భారతదేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎన్నికైన మూడవ మహిళ అనీ!
- ... లౌలాన్ బ్యూటీ సా.పూ. 1800 కాలం నుంచీ ముఖ కవళికలతో సహా చెక్కు చెదరకుండా ఉన్న మమ్మీ అనీ!
- ...భారతదేశం లోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని లేహ్ అనీ!
49 వ వారం
మార్చు- ...రోహ్తాంగ్ కనుమ దక్షిణ భాగంలో, బియాస్ నది భూగర్భం నుండి ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహిస్తుందనీ!
- ...సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం శిల్పారామం ప్రధాన ఉద్దేశ్యం అనీ!
- ...చైనాతో వాణిజ్యం కోసం ప్రారంభించిన మొదటి భారత సరిహద్దు పోస్టు లిపులేఖ్ కనుమ అనీ!
- ... భారత రాష్ట్రపతి, అబ్దుల్ కలాం సియాచెన్ ను సందర్శించిన మొదటి దేశాధినేత అనీ!
- ... జోజి లా సొరంగం ప్రాజెక్టును 2018 జనవరిలో భారత ప్రభుత్వం ఆమోదించిందనీ!
50 వ వారం
మార్చు- ... మనిషి వయస్సు పెరిగేకొద్దీ దగ్గర చూపు మందగించడాన్ని చత్వారము అంటారనీ!
- ... కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వ్యాపార సంస్థల మధ్య పోటీని నియంత్రించే కేంద్రప్రభుత్వ సంస్థ అనీ!
- ... కార్ నికోబార్ దీవులను సముద్ర ప్రయాణీకులు "నగ్న ఉత్తర భూమి" అని పిలుస్తారనీ!
- ... బార్పేట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనేక వైష్ణవ సత్రాలు ఉన్నందువల్ల దీనిని సత్ర నగరి అని పిలుస్తారనీ!
51 వ వారం
మార్చు- ...మొహాలీ, పంచకుల రెండూ చండీగఢ్ కు ఉపగ్రహ నగరాలనీ!
- ... నల్బరిలో కమ్రుపి రాజుల రాగి పలక శాసనాలకు సంబంధించిన వివిధ ఆవిష్కరణలు ఉన్నాయనీ!
- ...మథుర జిల్లా వైష్ణవ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన బృందావన్‌కు కూడా ప్రసిద్ది చెందిందనీ!
- ... నేపాల్ లోని జానక్‌పూర్ లో వివాహ పంచమి వేడుక చాలా ముఖ్యమైనదనీ!
- ... పగడాలదీవి అనే పేరు ఉన్న పట్టణం కవరట్టి అనీ!
52 వ వారం
మార్చు- ...బుందేల్‌ఖండ్ ముఖ ద్వారం అని ఝాన్సీ నగరాన్ని పిలుస్తారనీ!
- ...పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించడానికి ప్రవేశ కేంద్రంగా పనిచేస్తోందనీ!
- ...మొరాదాబాద్ ను ఇత్తడి నగరం (పీతల్ నగరి) అని పిలుస్తారనీ!
- ... వింధ్య పర్వత శ్రేణికి, కైమూర్ శ్రేణికీ మధ్య ఉన్న రాబర్ట్స్‌గంజ్ ప్రాంతంలో ఆదిమానవులు ఊండేవారనీ!
- ... అరాజకం అంటే సాంప్రదాయ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ విధానమనీ!
53 వ వారం
మార్చు- ...బోగీబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన అనీ!
- ...1985లో కోల్‌కతా నుండి సిల్చార్కు నడిచిన ఎయిర్ ఇండియా విమానం ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా సిబ్బంది విమానంగా గుర్తింపు పొందిందనీ!
- ...2014 సెప్టెంబరు నాటి వరద సమయంలో, రియాసి జిల్లాలోని సద్దాల్ గ్రామం గణనీయమైన వినాశనాన్ని ఎదుర్కొందనీ!
- ...దుబ్రి ప్రాంతాన్ని నదుల భూమి అని పిలుస్తారనీ!
- ... ముత్యాల గర్భం అంటే కేవలం మగ క్రోమోజోములతో మాత్రమే ఏర్పడే ఒక అసాధారణ గర్భమనీ!