వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2012
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 5 నుండి దారిమార్పు చెందింది)
2012 లో ప్రచురితమైన వాక్యాలు
మార్చు- భారతదేశంలో రెండవదిగా మరియు, ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటిదిగా ప్రారంభమైన పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ లేదా ఫరూక్ నగర్ అనీ! ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు).
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుదినాల కేలండర్ మరియు భారతదేశ ప్రభుత్వ సెలవు దినాల కేలండర్ చూడండి.
- జాతీయ సేవా పథకం 1969లో ప్రారంభం అయిందని..
- తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి.
- కదులుతున్న కారు నుండి ఎగిరిదిగటం ఎలా, మృత సముద్రంలో మనం ఎందుకు మునిగిపోలేము లాంటి ఆసక్తిగల విషయాలున్న పుస్తకం నిత్యజీవితంలో భౌతికశాస్త్రం
- స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుంది.
- జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయముర్తిగా నియంచబడ్డారు.
- కేంద్రకామ్లాలు జన్యు పదార్థాలుగా వ్యవహరించే జీవ రసాయనాలు. వీనిలో డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ. లు ముఖ్యమైనది.
- ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది.
- ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ ప్రకారం ఫ్రాన్స్ లోని లాస్కూ గుహల్లో ఆదిమానవులు గుహల గోడల మీద వేలకొలది వ్యంగ్య చిత్రాలు చిత్రించారు.
- మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. చూడండి యవ్వనం
- శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (CSIR, 1942) అనునది 39 పరొశోధనాశాలలు, 50 క్షేత్ర స్థానాలు మరియు విస్తరణా కేంద్రాలతో కూడిన భారతదేశపు అతిపెద్ద పరిశోధన సంస్థ.
- తల్లి సౌభాగ్యాన్ని మరియు పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే వేడుక సీమంతం.
- ఇందిరా పార్క్, హైదరాబాదులోని చక్కటి ఉద్యానవనాలలో ఒకటి.
- తంగి సత్యనారాయణ (1931 - 2009) సుప్రసిద్ధ శాసనసభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు.
- ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని అర్ధం.
- గంధమహోత్సవం అనగా గంధపుచెక్కల నుండి తయారుచేసిన గంధపు లేపన్నాన్ని పంచే ఉత్సవం.
- రక్తపుగడ్డ అనగా రక్తము ఒక అవయవములో గాని లేదా ఒక ప్రాంతములో గాని గూడుకట్టుకొనుట.
- నీలగిరి కొండలలో పెరిగే నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి లభించే ఔషధ తైలాన్ని నీలగిరి తైలం అంటారు.
- ఖతి అనేది భాష యొక్క రాత రూపాన్ని నిర్మించే విధానం.
- ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను నివారించే రహదారి నియమాలు పాటించండి.
- భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ భారతీయ కళలు మరియు సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నదని.
- విశ్వనాథ్ సూరి ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు మరియు రాజకీయనేత.
- సచిన్ టెండుల్కర్ (కుడి పక్క చిత్రంలో) 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
- మార్క్ ఎలియట్ జూకర్ బర్గ్ ప్రపంచప్రసిద్ధిగాంచిన సోషల్ నెట్వర్కింగ్ జాలస్థలమైన ఫేస్బుక్ సృష్టికర్త.
- ప్రసిద్ధిచెందిన త్ర్యంబక మహా మంత్రం అవసాన సమయాల్లొ జపిస్తే పరమశివుడు రక్షిస్తాడని నమ్మకం.
- శారదా లిపిని క్రీ.శ. 8వ శతాబ్దంలో సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు.
- శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారంచేసే ఒక టెలివిజన్ ఛానల్.
- శరత్ చంద్ర చటోపాధ్యాయ్ తెలుగు పాఠకులకు సుపరిచుతులైన ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా మరియు కథా రచయిత.
- పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయ అవసరముల నిమిత్తము ఏర్పరచుకున్న దిగుడు బావి.
- గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. భారతదేశంలో హిందూ ధర్మం అనుసరించి తల్లికి శ్రాద్దకర్మలు నిర్వహించే ఏకైక క్షేత్రమిదే.
- పుట్టగొడుగుల పెంపకం - ఒక ఆహారసంబంధమైన కుటీర పరిశ్రమ.
- బృందావన్ గార్డెన్స్ కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉద్యానవనం.
- న్యూట్రాన్ తార సూపర్నోవా పేలుళ్ళ తర్వాత మిగిలిన అవశేష తారలు.
- అంతర్జాలంలోగల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనది ఆంధ్రభారతి.
- పొన్న చెట్టు రూపంలో తయారు చేయబడిన పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహంను ఉంచి జరుపుకునే ఉత్సవాన్ని పొన్నమాను సేవ అంటారు.
- నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో వున్న క్వాలిటి కంట్రోల్ లాబోరెటరిలో సేకరించు విత్తనాల నమూనాలనునూనె గింజలను పరీక్షించు పద్ధతులు వాడి దాని ఫలితాలపై కొనుగోలు చేస్తారు.
- అగ్ని భద్రత అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ సంబంధించినది.
- తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి.
- వికీపీడియాలో వుపయోగించే ఉపకరణం (Gadget) హాట్కేట్. దీనిని ఉపయోగించి వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయవచ్చు.
- ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు కొవ్వుఆమ్లాలు లేని నూనెలు.
- వికీపీడియాలో తెలుగు టైపు తెలియని వారు కూడా చేయగలిగే శుద్ధి పనులున్నాయి
- భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయం తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం
- భారతీయ రూపాయి చిహ్నము రూపొందించింది ఐఐటి, ముంబై కి చెందిన డి.ఉదయ్ కుమార్ .
- శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానముగా ప్రసిద్ది చెందినది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఉన్నది.- వ్యాసం ప్రారంభించినవారు :YVSREDDY
- ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి రూపొందిస్తున్నఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 1976 లో స్వచ్ఛందసంస్థగా నమోదయ్యింది. -వ్యాసం ప్రారంభించినవారు:Arjunaraoc
- బిద్రీ కళ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ.- వ్యాసం ప్రారంభించినవారు :విశ్వనాధ్.బి.కె.
- రాజేష్ ఖన్నా 163 చిత్రాలలో నటించాడు .- వ్యాసం ప్రారంభించినవారు :Veera.sj
- స్టుడియో అనేది ఒక చిత్రకారుడు లేదా అతని వద్దనుండే ఉద్యోగులు పనిచేసుకొనే గది.
- వ్యాసం ప్రారంభించినవారు :Rajasekhar1961
- అష్టగంధాలు లో ఒక సుగంధము అత్తరు
- వ్యాసం ప్రారంభించినవారు :Nrahamathulla
- గ్రీకు పురాణం ప్రకారం హెరాకిల్స్ (లేదా హెర్క్యులెస్) సాహసాల్లో సాటిలేని వీరుడు. ఇతడు హెరాకిల్స్ దేవలోకానికి అధిపతి అయిన జూస్ కు, మానవ స్త్రీ అయిన అల్కమెనెకు జన్మించాడు. ఇతడు పన్నెండు అత్యంత కష్టతరమైన సాహసాలను ఛేదించిన ధీరుడు.- వ్యాసం ప్రారంభించినవారు:Redaloes
- విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు. వ్యాసం ప్రారంభించినవారు: YVSREDDY
- జాషువా రచించిన పారశీక కవి పిరదౌసి యొక్క యధార్ధజీవిత, వ్యధార్ధ వెతల కథ ఫిరదౌసి కావ్యం ఆంధ్ర విశ్వ కళాశాల గ్రంధ నిర్ణాయక సభ వారిచే 1940 వరకు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు పాఠ్యాంశంగా నిర్ణయింపబడినది. -వ్యాసం ప్రారంభించినవారు: Palagiri
- ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి. - వ్యాసాన్ని ప్రారంభించినవారు: YVSREDDY
- తెలుగు మరియు కన్నడ భాషల్లో నవలలు వ్రాయడంలో సుప్రసిద్ధుడైన సూర్యదేవర రామమోహనరావు,1985 నుండి సుమారు 95 నవలలు వ్రాశాడు . - వ్యాస విషయకర్త: Redaloes
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. -వ్యాస విషయకర్త:YVSREDDY
- మురారిరావుగా పేరొందిన మురారిరావు ఘోర్పాడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. 18వ శతాబ్దపు దక్కన్ చరిత్రలో ప్రముఖ చారిత్రక వ్యక్తి. - వ్యాస విషయకర్త: వైజాసత్య
- శ్రీకాకుళానికి చెందిన శ్రీ వేదుల ప్రభాకర శ్రీనివాస్ 'మిమిక్రీ శ్రీనివాస్' గా సుపరిచితులు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నాడు. - వ్యాస విషయకర్త: Kvr.lohith
- శ్రీకాకుళానికి చెందిన శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారు ప్రముఖ మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం కళాకారుడు. ఈయన మిమిక్రీ శ్రీనివాస్ యొక్క గురువు గారు. - వ్యాస విషయకర్త: Kvr.lohith
- కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ ప్రఖ్యాత రచయిత, హేతువాది.1931 లో అమ్మనబ్రోలు లో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు. పొదలకూరు, రేవూరు, కోవూరు, ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలుగు పద్యములను వ్రాసిన గొప్ప రచయిత. ఈయన పద్యములు సమాజంలో గల సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి.... - వ్యాస విషయకర్త: Nrahamthulla
- దాశరథి కృష్ణమాచార్య చేసిన తెలుగు అనువాదం గాలిబ్ గీతాలు మిర్జా అసదుల్లాఖాన్ యొక్క గాలిబ్ ఉర్దూ గజళ్లకు మొట్టమొదటి తెలుగు అనువాద పుస్తకము. - వ్యాస విషయకర్త: Palagiri
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2013, భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2013, - వ్యాస విషయకర్త: అర్జున