వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2022
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 15 నుండి దారిమార్పు చెందింది)
2022 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
2022 సంవత్సరం లోని వాక్యాలు
మార్చు01 వ వారం
మార్చు- ... బెంగాలులో విద్యావ్యాప్తి, భారతీయ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసిన క్రైస్తవ ప్రచారకుడు విలియం కెరే అనీ! (చిత్రంలో)
- ... తొలి తెలుగు ఇంజనీరు వీణం వీరన్న ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో విశేష సేవ చేశాడనీ!
- ... భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన కాకోరీ కుట్రలో రైల్లో ఉన్న ఆంగ్లేయుల పన్నుల ధనాన్ని విప్లవ కారులు అపహరించారనీ!
- ... సుచేతా కృపలానీ భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి అనీ!
- ... భారత ప్రభుత్వ చట్టం 1919 ఆంగ్లేయుల పాలనలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేసిన చట్టమనీ!
02 వ వారం
మార్చు- ... గోపాల్‌దాస్ అంబైదాస్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా మారడం కోసం రాజ్యాన్ని వదులుకున్న మొట్టమొదటి రాజుగా పేరు పొందాడనీ!
- ... భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ 2011 లో పద్మశ్రీ పురస్కార గ్రహీత అనీ!
- ... భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన గంగాధర్ అధికారి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తల ఉపన్యాసాలకు హాజరయ్యేవాడనీ!
- ... ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ నుంచి సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైందనీ!
- ... ఇప్పటి దాకా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి అనుబంధం ఉన్న 98 మంది నోబెల్ బహుమతి పొందిన వారనీ!
03 వ వారం
మార్చు- ... 1962 భారత చైనా యుద్ధ నేపథ్యంలో వచ్చిన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిందనీ!
- ... 1990 మచిలీపట్నం తుఫాను ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన ధన, ప్రాణ నష్టాన్ని కలగజేసిందనీ!
- ... బంగ్లాదేశ్ లోని మహిలార సర్కార్ మఠం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయం అనీ!
- ... కాస్పియన్ సముద్రము ను ప్రపంచంలో అతిపెద్ద సరస్సు గానూ, పూర్తి స్థాయి సముద్రంగానూ భావిస్తారనీ!
- ... శ్రీలంక లోని కాండీ నగరం ఆ దేశాన్ని పాలించిన పురాతన రాజుల చివరి రాజధాని అనీ!
04 వ వారం
మార్చు- ... పాకిస్థాన్ లోని హింగ్లాజ్ మాత దేవాలయం యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటనీ!
- ... చైనాలోని హువాంగ్షాన్ పర్వతం ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటనీ!
- ... సర్దార్ రవీందర్ సింగ్ దక్షిణ భారతదేశంలో నగర మేయర్ గా ఎన్నికైన ఏకైక సిక్కు జాతీయుడనీ!
- ... అట్లాంటా లోని విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయమనీ!
- ... జబ్బులతో బాధ పడుతున్న వారినీ, వారి కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడాన్ని పాలియేటివ్ కేర్ అంటారనీ!
05 వ వారం
మార్చు- ... నేపాల్ లోని చిట్వాన్ జాతీయ ఉద్యానవనం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిందనీ!
- ... జపనీస్ సాంప్రదాయమైన షింటోయిజం లో పూజారిణులను మికో అంటారనీ!
- ... నేపాల్ లోని భక్తపూర్ పురాతన సంస్కృతికి ప్రాచుర్యం పొందినదనీ!
- ... బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు వనపర్తి సంస్థానానికి చెందిన రాజకుటుంబీకురాలనీ!
- ... మలేషియా లోని బటు గుహలు లో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రఖ్యాత పుణ్యక్షేత్రమనీ!
06 వ వారం
మార్చు- ... హింద్రాఫ్ మలేషియాలో హిందూ సమాజం హక్కులు కాపాడటానికి ఏర్పడ్డ సంస్థ అనీ!
- ... చైనా లోని డేనియల్ సరస్సు లో లిథియం సమృద్ధిగా లభిస్తుందనీ!
- ... పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ అత్యంత సంపన్నమైన భారత పార్లమెంటు సభ్యుల్లో ఒకడిగా ఉన్నాడనీ!
- ... షింటో మతం జపాన్ దేశంలో ఉద్భవించిన స్థానిక మతమనీ!
- ... కాలిఘాట్ చిత్రకళ కలకత్తాలోని కాళికా దేవి ఆలయంలో ప్రారంభమైన ఒక చిత్రకళా ఉద్యమమనీ!
07 వ వారం
మార్చు- ... కార్తీకమాసం ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారనీ!
- ... చైనాలోని లెషన్ జెయింట్ బుద్ధ ప్రపంచంలో అత్యంత ఎత్తైన బుద్ధుని రాతి విగ్రహం అనీ!
- ... పద్మశ్రీ పురస్కార గ్రహీత కుశాల్ కొన్వర్ శర్మ అస్సాం ఏనుగు వైద్యుడిగా పేరు గాంచాడనీ!
- ... ప్రపంచంలో అత్యంత ఎత్తైన, పెద్దదైన టిబెటన్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారనీ!
- ... పడమటి సంధ్యారాగం తొంభైశాతం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమనీ!
08 వ వారం
మార్చు- ... చైనాలోని మొగావో గుహలు వెయ్యి సంవత్సరాలకు పూర్వపు బౌద్ధ కళను ప్రతిబింబిస్తున్నాయనీ!
- ... దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన డెస్మండ్ టుటు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడనీ!
- ... ప్రపంచంలో సుమారు 20 కోట్లమంది దూరధమని వ్యాధితో బాధ పడుతున్నారనీ!
- ... నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ఆపరేషన్ పోలో అంటారనీ!
- ... లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్‌హాలు రాబడి ప్రపంచ ధార్మిక కార్యక్రమాలకు వాడుతారనీ!
09 వ వారం
మార్చు- ... టెంపోరావు గా పేరు గాంచిన తెలుగు డిటెక్టివ్ రచయిత అసలు పేరు కూరపాటి రామచంద్రరావు అనీ!
- ... భారత్ వికాస్ పరిషత్ స్వామి వివేకానంద బోధనలు ఆదర్శంగా ఏర్పడ్డ సేవాసంస్థ అనీ!
- ... అమలాపురం గ్రంథాలయం 68 ఏళ్ళకు పైగా నిర్వహించబడుతున్నదనీ!
- ... లోకపల్లి సంస్థానం చివరి పాలకురాలు లక్ష్మమ్మను ఆ ప్రాంత ప్రజలు దేవతగా పూజిస్తారనీ!
- ... కేరళ లోని కుంబలంగి దేశంలో తొలి శానిటరీ నాప్కిన్ రహిత ప్రాంతంగా పేరొందింది అనీ!
10 వ వారం
మార్చు- ... భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ యువజన క్రీడాశాఖా మంత్రిగా పనిచేస్తున్నాడనీ!
- ... శబరిమల అయ్యప్పస్వామి దేవస్థానానికి వెళ్ళే భక్తులు చాలామంది మకర జ్యోతి దర్శనానికి వెళతారనీ!
- ... ఆన్లైన్ మీటింగ్ లు నిర్వహించగలిగే జూమ్ ఉపకరణం కోవిడ్ మహమ్మారి సమయంలో గణనీయమైన పెరుగుదల సాధించిందనీ!
- ... కోల్‌కత లోని నేతాజీ భవన్ స్వాతంత్ర్య సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ నివాస స్థానమనీ!
- ... కంగానీ వ్యవస్థ బ్రిటిష్ ప్రభుత్వ సమయంలో ఏర్పడ్డ కార్మిక నియామక వ్యవస్థ అనీ!
11 వ వారం
మార్చు- ... నాథ్ పాయ్ గోవా విముక్తి ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడనీ!
- ... అమెరికాలోని స్వామి నారాయణ్ దేవాలయం ముప్ఫై ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ దేవాలయమనీ!
- ... పాతరాతియుగం నుంచే శిలాగుహ చిత్రకళ విరాజిల్లిందనీ!
- ... బ్రిటిషు భారతదేశంలో వెట్టి చాకిరీ వ్యవస్థ ద్వారా పదహారు లక్షలకు పైగా భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా దేశాలకు పంపించారనీ!
- ... ఇస్కాన్ ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన హరేకృష్ణ మంత్రం కలి సంతరణోపనిషత్తులోనిదనీ!
12 వ వారం
మార్చు- ... విప్లవ నాయకుడు వీరపాండ్య కట్టబ్రహ్మనను ఆంగ్లేయులు 39 సంవత్సరాల వయసులో ఉరితీశారనీ!
- ... హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం నవాబుల పరిపాలనా కాలంలో సైఫాబాద్ ప్యాలెస్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన భవనం అనీ!
- ... శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు అనీ!
- ... బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ద్విసభ్య నియోజకవర్గం పద్ధతిలో పార్లమెంటులో, వివిధ రాష్ట్ర శాసన సభలకు ఇద్దరు సభ్యులు ప్రాతినిథ్యం వహించేవారనీ!
- ... ప్యూ రీసెర్చి సెంటర్ వాషింగ్టన్ అమెరికాలోని నిష్పక్షపాత సామాజిక పరిశోధనా సంస్థ అనీ!
13 వ వారం
మార్చు- ... బహుభాషా గాయకుడు నరేష్ అయ్యర్ కెరీర్ ప్రారంభించిన తొలి ఏడాదిలోనే జాతీయ పురస్కారం అందుకున్నాడనీ!
- ... వాగ్గేయకారుడు సారంగపాణి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కార్వేటినగరంలో ఉత్సవాలు జరుగుతాయనీ!
- ... ఆకాశవాణి హైదరాబాదు కేంద్రాన్ని మొదటగా నిజాం రాజులు డెక్కన్ రేడియో పేరుతో ప్రారంభించారనీ!
- ... అక్షరాభ్యాసం అనేది తొలిసారి అక్షరాలు నేర్చుకునేందుకు పాటించే హిందూ సాంప్రదాయం అనీ!
- ... నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కాకతీయుల కాలం నాటి గోడను గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తున్నారనీ!
14 వ వారం
మార్చు- ... బాబాసాహెబ్ ఆప్టే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి ప్రచారకుల్లో ఒకడనీ!
- ... తాళ్ళపాక అన్నమాచార్య మనుమడు తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు అష్ట భాషా చక్రవర్తి అని బిరుదు పొందినవాడు అనీ!
- ... నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ నాగార్జున సాగర్ రహదారి ప్రాంతంలో ఉన్న పైలట్ శిక్షణా కేంద్రమనీ!
- ... 1876-1878 సంవత్సరాల మధ్యలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ కరువు సుమారు 55 లక్షల నుంచి కోటి మంది ప్రాణాలు బలిగొన్నదనీ!
- ... అమెరికాలోని సెంట్రల్ ఇండియానా హిందూ దేవాలయం ఇండియానాపోలిస్ లో ఏర్పాటుచేసిన మొదటి హిందూ దేవాలయం అనీ!
15 వ వారం
మార్చు- ... ఇ. సి. జార్జ్ సుదర్శన్ పలుసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డ భౌతిక శాస్త్రవేత్త అనీ!
- ... మహారాష్ట్రలోని తుల్జా భవాని దేవాలయం గురించిన ప్రస్తావన స్కాంద పురాణములో ఉందనీ!
- ... ఇక్రిశాట్ అనేది భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రమనీ!
- ... తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్య శిక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక శిక్షణా కేంద్రం ఉందనీ!
- ... తంజావూరు సరస్వతీ గ్రంథాలయం వారు ప్రచురించిన రాజగోపాల విలాసము 17వ శతాబ్దానికి చెందిన రచన అనీ!
16 వ వారం
మార్చు- ... రమాకాంత్ అచ్రేకర్ సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువనీ!
- ... టిబెట్‌పై చైనా దురాక్రమణ తర్వాత ఆ దేశంలోని బౌద్ధాచార్యుడు దలైలామా ప్రవాసంలోకి వెళ్ళవలసి వచ్చిందనీ!
- ... ఖగోళంలో గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాల వంటివి ఎక్రీషన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడతాయనీ!
- ... శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో లింగాన్ని పరశురాముడు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతున్నదనీ!
- ... ఘరియల్ మొసళ్లను 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన సింధు లోయ లో కనుగొన్నారనీ!
17 వ వారం
మార్చు- ... అరుంధతి నాగ్ దివంగత కన్నడ నటుడు, దర్శకుడు అయిన శంకర్ నాగ్ సతీమణి అనీ!
- ... టిబెట్ దలైలామాను బౌద్ధదేవత అవలోకితేశ్వరుడు అవతారంగా భావిస్తారనీ!
- ... 1832-33 సంవత్సరాల మధ్యలో గుంటూరు ప్రాంతాన్ని వణికించిన డొక్కల కరువు వల్ల సుమారు 2 లక్షలమందికి పైగా మరణించారనీ!
- ... పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్హౌస్ వాయువులను అత్యధికంగా వెలువరించే చైనా, అమెరికా దేశాలు పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన క్యోటో ఒప్పందంపై సంతకాలు చేయలేదనీ!
- ... సంతాలి భాష భారతదేశంతో పాటు ఇతర సరిహద్దు దేశాలలో సుమారు 70 లక్షల మంది వాడుతున్నారనీ!
18 వ వారం
మార్చు- ... పంచాంగ కర్తగా పేరొందిన ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మునుపు మిమిక్రీ కళాకారుడిగా పనిచేశాడనీ!
- ... బాండిట్ క్వీన్ బందిపోటు రాణి ఫూలన్ దేవి జీవితం ఆధారంగా వచ్చిన హిందీ సినిమా అనీ!
- ... పురాతన గ్రీకు తత్వ శాస్త్ర భావన అయిన స్టోయిసిజం ధార్మిక జీవనమే మానవుల సంతోషానికి మూలం అని బోధిస్తుందనీ!
- ... దశరాజ యుద్ధం అనేది ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఒక యుద్ధం అనీ!
- ... మహాబోధి విహార్ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా భావించబడుతుందనీ!
19 వ వారం
మార్చు- ... శ్రీ విరించి గా పేరుగాంచిన నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి కేంద్రసాహిత్య అకాడమీలో తెలుగు అనువాదకుడనీ!
- ... బీహార్ లోని చండికా స్థాన్ భారతదేశంలో 51 శక్తి పీఠాల్లో ఒకటనీ!
- ... కొలామి భాష అత్యధికులు మాట్లాడే మధ్య ద్రావిడ భాష అనీ!
- ... సా. శ 130 సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం లో క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించారనీ!
- ... మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధికారులకు శిక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ అనీ!
20 వ వారం
మార్చు- ... మాధురి బర్త్వాల్ ఆల్ ఇండియా రేడియోలో తొలి మహిళా స్వరకర్తగా పేరు గాంచిందనీ!
- ... సత్యార్థ ప్రకాశము అనే గ్రంథాన్ని రచించినది స్వామి దయానంద సరస్వతి అనీ!
- ... గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 లో కొత్తగా ఏర్పడ్డ జట్టు అనీ!
- ... ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 156 దేశాలకు పైగా కార్యాలయాలను కలిగి ఉందనీ!
- ... పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనేది మాజీ కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ అనీ!
21 వ వారం
మార్చు- ... విశ్వనాథనాయని స్థానాపతి మదురై నాయకర్ రాజులలో మొదటివాడనీ!
- ... రాజగోపాలవిలాసము అనే గ్రంథాన్ని రచించినది చెంగల్వ కాళయ అనీ!
- ... రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ పౌరులను ఆపరేషన్ గంగా అనే పేరుతో భారతీయ ప్రభుత్వం రక్షించిందనీ!
- ... గర్భాశయపు లోపలి మ్యూకర్ పొరను ఎండోమెట్రియమ్ అంటారనీ!
- ... కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి 2021 సంవత్సరంలో అవుట్‌స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్ గా జాతీయ పురస్కారం అందుకుందనీ!
22 వ వారం
మార్చు- ... పద్మశ్రీ పురస్కార గ్రహీత సుచేతా దలాల్ భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత పెంపుకు కృషి చేస్తుందనీ!
- ... ఈషా ఫౌండేషన్ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థాపించబడిన ఆధ్యాత్మిక సంస్థ అనీ!
- ... సెల్ఫీ ఆఫ్ సక్సెస్ తెలంగాణాకు చెందిన ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన ప్రజాదరణ పొందిన పుస్తకమనీ!
- ... ఎర్త్ అవర్ గ్లోబల్ వార్మింగ్ మీద అవగాహన కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తారనీ!
- ... దీపావళి సందర్భంగా ఆదివాసీలు దండారి పండుగ జరుపుకుంటారనీ!
23 వ వారం
మార్చు- ... మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పి.సి. భట్టాచార్య ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడాన్ని వ్యతిరేకించాడనీ!
- ... నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్త సంస్థ అనీ!
- ... శతక కవుల చరిత్రము తెలుగులో శతకాలు రచించిన కవుల జీవిత చరిత్రలు గ్రంథస్తం చేసిన పుస్తకం అనీ!
- ... నగారా వాయిద్యాన్ని పంజాబీ, రాజస్థానీ జానపద సంగీతంలో ఎక్కువగా వాడతారనీ!
- ... కాంచీపురంలోని జురహరేశ్వర దేవాలయం లో శివుడు వ్యాధులను నయం చేసే దేవుడిగా ప్రసిద్ధి చెందాడనీ!
24 వ వారం
మార్చు- ... మామిడాల జగదీశ్ కుమార్ యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ నూతన ఛైర్మన్ గా నియమితుడయ్యాడనీ!
- ... ఆలంపూర్ జోగులాంబ దేవాలయం పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటనీ!
- ... 1831 లో జరిగిన బాలాకోట్ యుద్ధం లో సిక్కులు విజయం సాధించి తమ సామ్రాజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించారనీ!
- ... వన విహార్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉందనీ!
- ... ఇంప్రెషనిజం అనేది ఫ్రాన్సులో ప్రారంభమైన చిత్రకళా ఉద్యమం అనీ!
25 వ వారం
మార్చు- ... మరణానంతరం ఆస్కార్ అవార్డు నామినేషన్ పొందిన తొలి నటుడు జేమ్స్ డీన్ అనీ!
- ... గురుగ్రామ్ భీం కుండ్ ద్రోణాచార్యుడు పాండవులకు విలువిద్య నేర్పిన స్థలంగా భావిస్తారనీ!
- ... భారతదేశాన్ని ఫ్రెంచి పాలననుంచి విముక్తి చేయడంలో భాగంగా నిజాం దళం ఏర్పడిందనీ!
- ... మైత్రి అనేది అంటార్కిటిక్ మీద పరిశోధనకు భారతదేశం ఏర్పాటు చేసిన శాశ్వత పరిశోధనా కేంద్రమనీ!
- ... నోహ్కలికై జలపాతం భారతదేశంలో ఎత్తైన జలపాతాల్లో ఒకటనీ!
26 వ వారం
మార్చు- ...భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన థామస్ బాబింగ్టన్ మెకాలే భారతీయ శిక్షాస్మృతి సృష్టికర్త అనీ!
- ... చరిత్రకారుడు కె.ఎస్.లాల్ భారతదేశపు మధ్యయుగపు చరిత్రపై విస్తృత పరిశోధనలు చేశాడనీ!
- ... హిందూ సాంప్రదాయంలో ప్రదోష సమయం శివుని పూజకు అనుకూల సమయంగా భావిస్తారనీ!
- ... ఆరుద్ర రాసిన త్వమేవాహం తెలంగాణాలో నిజాం నిరంకుశత్వం నేపథ్యంలో వచ్చిన రచన అనీ!
- ... రాజ్మా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన వంట దినుసు అనీ!
27 వ వారం
మార్చు- ... సరోజినీ నాయుడు సోదరుడు వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ కూడా స్వాతంత్ర్య విప్లవ వీరుడు అనీ!
- ... గయ లోని విష్ణుపాద దేవాలయం ప్రసిద్ధి పొందిన హిందూ దేవాలయాల్లో ఒకటనీ!
- ... హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి అతి ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశం అనీ!
- ... తెలుగు సినిమా రచయిత రాకేందు మౌళి మరో రచయిత వెన్నెలకంటి కుమారుడనీ!
- ... ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందాడనీ!
28 వ వారం
మార్చు- ... స్వామి కరపత్రి అరచేతిలో సరిపోయే ఆహారం మాత్రమే తీసుకునే వాడనీ!
- ... ఒడిషాలోని రాయగడ పట్టణం భారతదేశంలోని తీరప్రాంత వాణిజ్యానికి కేంద్రంగా విలసిల్లిందనీ!
- ... పి. కేశవ రెడ్డి రాసిన అతడు అడవిని జయించాడు నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారనీ!
- ... రష్యా, నార్వే ఉత్తర తీరాలలో ఉన్న బేరెంట్స్ సముద్రం పెద్దగా లోతులోని సముద్రమనీ!
- ... లడఖ్ లోని లేహ్ సమీపంలో ఉన్న భారతీయ ఖగోళ వేధశాల ప్రపంచంలోనే ఎత్తైన వేధశాలల్లో ఒకటనీ!
29 వ వారం
మార్చు- ... దిలీప్ కుమార్ చక్రవర్తి తూర్పు భారతదేశంపై విశేష పరిశోధనలు చేసిన చరిత్రకారుడనీ!
- ... గోల్కొండ వ్యాపారులు మహారాష్ట్ర మూలాలు కలిగి తెలంగాణా ప్రాంతంలో పనిచేసిన నియోగి బ్రాహ్మణులనీ!
- ... మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం లోని గోపురం దక్షిణ భారతదేశంలోని ఎత్తయిన గోపురాల్లో ఒకటనీ!
- ... తెలంగాణాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తుందనీ!
- ... అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం త్రివిధ సాయుధ దళాల్లో సిబ్బంది నియామకానికి కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అనీ!
30 వ వారం
మార్చు- ... మహంత్ రామచంద్ర దాస్ పరమహంస అయోధ్య రామమందిర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడనీ!
- ... మహారాష్ట్ర లోని వార్ధా పట్టణం పత్తి వ్యాపారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనీ!
- ... హవాయి లోని సైన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫౌండేషన్ ఇస్కాన్ నుండి వేరుపడిన వైష్ణవ యోగా సంస్థ అనీ!
- ... కొమ్మమూరు కాలువ బ్రిటిష్ కాలంలో నౌకా రవాణా మార్గంగా వాడేవారనీ!
- ... కొల్హాపూర్ తోలు చెప్పుల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినదనీ!
31 వ వారం
మార్చు- ... ఇక్బాల్ సింగ్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన సిక్కు వ్యక్తులలో ఒకడనీ!
- ... అమెరికా లోని శాంటాక్రజ్ లో ఉన్న సొసైటీ ఆఫ్ ఎబిడెన్స్ ఇన్ ట్రూత్ అద్వైత వేదాంతాన్ని వ్యాప్తి చేసే సంస్థ అనీ!
- ... రాడార్ రేడియో తరంగాలను ఉపయోగించి ఒక స్థలం నుంచి దూరంగా ఉన్న వస్తువుల ఉనికిని కనుగొంటారనీ!
- ... భారతదేశంలోని గోండ్వానా పేరు మీదుగా పురాతన ఖండమైన గోండ్వానాలాండ్ కి ఆ పేరు వచ్చిందనీ!
- ... మహారాష్ట్రలో ప్రాచీన చరిత్ర కలిగిన వికట్ ఘడ్ కోట ట్రెక్కింగ్ చేసేవారిని విశేషంగా ఆకర్షిస్తున్నదనీ!
32 వ వారం
మార్చు- ... పద్మభూషణ్ పురస్కార గ్రహీత టి. ఆర్. శేషాద్రి సైన్సులో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త అనీ!
- ... టపోరీ అనే పదం వీధి రౌడీలను, వారి ఆహార్యాన్ని సూచించడానికి వాడతారనీ!
- ... హల్దీఘాటీ యుద్ధం 16 వ శతాబ్దంలో రాజపుత్రుడు మహారాణా ప్రతాప్, మొఘలులకు మధ్య జరిగిన యుద్ధమనీ!
- ... ఇటలీ దేశంలో పుట్టిన పిజ్జా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఒకటనీ!
- ... సాగర ఘోష అనే పూర్తి పద్య కావ్యం రాయడానికి రచయిత గరికిపాటి నరసింహారావుకు నాలుగేళ్ళు పట్టిందనీ!
33 వ వారం
మార్చు- ... స్వామి అభేదానంద రామకృష్ణ పరమహంస శిష్యుల్లో అందరికన్నా ఆఖరున మరణించాడనీ!
- ... సాధారణ ఆల్కహాలు రసాయనిక నామం ఇథనాల్ అనీ!
- ... మహా వీర చక్ర భారతదేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారమనీ!
- ... గోదావరి లోయ బొగ్గుక్షేత్రం దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైన బొగ్గు క్షేత్రమనీ!
- ... కాశ్మీరు చరిత్రకు సంబంధించిన రాజతరంగిణి అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించింది కల్హణుడు అనీ!
34 వ వారం
మార్చు- ... స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నీలకంఠ బ్రహ్మచారి చివరి దశలో మైసూరు నంది పర్వత ప్రాంతాల్లో శ్రీ ఓంకారానంద స్వామి పేరుతో ఆశ్రమవాసం చేశాడనీ!
- ... ప్రపంచ వ్యాప్తంగా పండే అక్రోటుకాయల్లో చైనా 33% ఉత్పత్తి చేస్తుందనీ!
- ... తెహ్రీ డ్యామ్ భారతదేశంలో అత్యంత ఎత్తయిన ఆనకట్ట అనీ!
- ... భారతదేశంలో విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ అనీ!
- ... షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యాపారసంస్థల్లో ఒకటనీ!
35 వ వారం
మార్చు- ... అభిమన్యు దాసాని అలనాటి సినీ నటి భాగ్యశ్రీ కుమారుడనీ!
- ... భారతదేశంలో స్థాపించబడిన ఐ టి సి లిమిటెడ్ 90 దేశాలకు పైగా తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుందనీ!
- ... ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అంచనా ప్రకారం తెలంగాణా లోని బయ్యారం మైన్స్ లో 16 లక్షల కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఉందనీ!
- ... బ్యాంక్ ఆఫ్ ఇండియా 1946 లో లండన్ లో ఒక శాఖను ప్రారంభించడం ద్వారా దేశం వెలుపల కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి భారతీయ బ్యాంకుగా నిలిచిందనీ!
- ... కర్ణాటక బ్యాంక్ స్వాతంత్య్రానికి పూర్వం 1924 లో స్థాపించిన ప్రైవేటు బ్యాంకు అనీ!
36 వ వారం
మార్చు- ... ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు షేన్ వార్న్ అంతర్జాతీయ పోటీల్లో 1000 వికెట్లు తీశాడనీ!
- ... డాబర్ సంస్థ భారతదేశంలో అతిపెద్ద నిత్యావసర వస్తువుల ఉత్పత్తి సంస్థ అనీ!
- ... టైక్వాండో దక్షిణ కొరియాలో అంతర్యుద్ధాల సమయంలో ప్రజలు ఆత్మరక్షణ కోసం ఏర్పాటుచేసుకున్నదనీ!
- ... 1975లో స్థాపించబడిన ఆఫ్రికన్ హిందూ మఠం ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి హిందూ మఠమనీ!
- ... పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డం కోసం మొదటిసారి పాకిస్తాన్ ప్రకటన 1932 లో జరిగిందనీ!
37 వ వారం
మార్చు- ... ఉన్నియార్చ కేరళకు చెందిన కళరిపయట్టు యుద్ధక్రీడాకారిణి అనీ!
- ... పంపులు, పైపులు తయారు చేసే కిర్లోస్కర్ గ్రూప్ భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందునుంచీ ఉన్న వ్యాపార సంస్థ అనీ!
- ... మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ద్వైత వేదాంత మఠాల్లో ప్రసిద్ధి గాంచిన సంస్థ అనీ!
- ... తెలంగాణ లో నూతనంగా ఏర్పాటయిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరాన్నంతటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే వీలుందనీ!
- ... ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలకు సమీపంలో ఉన్న జ్వాలాపురం పురాతత్వ స్థలం లో వేల ఏళ్ళ క్రితం నివసించిన ఆధునిక మానవుల ఆధారాలు లభ్యమయ్యాయనీ!
38 వ వారం
మార్చు- ... ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు అని బిరుదు కలిగిన వాడు కోలాచలం శ్రీనివాసరావు అనీ!
- ... లార్సెన్ & టూబ్రో సంస్థ ప్రపంచంలో అతిపెద్ద ఐదు నిర్మాణ సంస్థల్లో ఒకటనీ!
- ... కపిల హింగోరాణిని భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు మాతృమూర్తిగా భావిస్తారని!
- ... ఉజ్జయిని కాలభైరవ దేవాలయం లో దేవతకు మద్యం నైవేద్యంగా సమర్పిస్తారనీ!
- ... ఉదయ్ ఉమేశ్ లలిత్ భారత సుప్రీంకోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడనీ!
39 వ వారం
మార్చు- ... భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడనీ!
- ... లీవర్ టెక్నాలజీతో తాళాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన తొలిసంస్థ గోద్రేజ్ గ్రూప్ అనీ!
- ... భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రవేశపెట్టినది జస్టిస్ పి.ఎన్. భగవతి అనీ!
- ... ప్రొతిమా బేడి భారతదేశపు ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి అనీ!
- ... కల్పతరువు ఉత్సవం ప్రతి సంవత్సరం రామకృష్ణ మఠం సన్యాసులు జరుపుకునే పండగ అనీ!
40 వ వారం
మార్చు- ... మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి సాహు మహరాజ్ 19 వ శతాబ్దంలోనే తన పరిపాలనలో ప్రగతిశీల విధానాలను అవలంభించాడనీ!
- ... కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న లింగాయత సాంప్రదాయనికి ఆద్యుడు బసవేశ్వరుడు అనీ!
- ... సుదీర్ఘ చరిత్ర కలిగిన వస్త్ర వ్యాపార సంస్థ సెంచరీ టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీస్ బిర్లా గ్రూపునకు చెందిన సంస్థ అనీ!
- ... చైనాకు చెందిన యువాన్ వాంగ్ నిఘా ఓడ ఉపగ్రహాలను, క్షిపణులను గమనించి ఇంటెలిజెన్స్ ను చేరవేస్తాయనీ!
- ... సురయ్యా త్యాబ్జీ పింగళి వెంకయ్య రూపొందించిన భారతీయ జెండాలో చరఖాను మార్చి ధర్మచక్రాన్ని చేర్చి తుదిరూపుని ఇచ్చిందనీ!
41 వ వారం
మార్చు- ... ఇటీవలే గూఢచర్య ఆరోపణల నుంచి బయటపడ్డ కేరళకు చెందిన శాస్త్రవేత్త నంబి నారాయణన్ ఇస్రోలో విక్రం సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి వారితో కలిసి పనిచేశాడనీ!
- ... భారతీయ బహుళజాతి ఆహార సంస్థ హల్దీరామ్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉందనీ!
- ... మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో టేకును వాణిజ్యపరంగా విస్తృతంగా పెంచుతారనీ!
- ... తమిళనాడులోని కృష్ణగిరి రిజర్వాయర్ భారతదేశపు మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా నిర్మించబడిందనీ!
- ... కస్బా వినాయక దేవాలయం లోని గణపతిని పూణే గ్రామదేవుడిగా పరిగణిస్తారనీ!
42 వ వారం
మార్చు- ... బాలనటిగా రాణిస్తున్న నైనికా విద్యాసాగర్ దక్షిణ భారత నటి మీనా ఏకైక కూతురనీ!
- ... 1984 లో యూనియన్ కార్బైడ్ ఇండియా అనే పూర్వనామం కలిగిన ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా సంస్థ వల్ల భోపాల్ దుర్ఘటన సంభవించిందనీ!
- ... ఉత్తర గోవాలో ఉన్న అగ్వాడ కోట భారత పురాతత్వ శాఖ పరిరక్షిత స్థలాల్లో ఒకటనీ!
- ... చిలకలూరిపేట బస్సు దహనం ఘటన కేసులో నిందితులకు ఉరిశిక్ష ఆఖరి రోజున తప్పిపోయి చివరికి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడింది అనీ!
- ... పజిల్స్ ని అధ్యయనం చేయడాన్ని ఎనిగ్మటాలజీ అంటారనీ!
43 వ వారం
మార్చు- ... వీరేంద్ర హెగ్డే కర్ణాటకలోని ధర్మస్థళ ఆలయ వంశపారంపర్య నిర్వాహకుడనీ!
- ... బ్లూస్టార్ భారతదేశంలో ఎసిలు తయారు చేసే రెండవ అతిపెద్ద దేశీ సంస్థ అనీ!
- ... సా.శ. పూ 3300 నుంచి లిప్‌స్టిక్ ని వాడుతున్నారనీ!
- ... భారతదేశంలో అతిపెద్ద వైద్యుల సంఘం భారతీయ వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) అనీ!
- ... జనతాదళ్ నుంచి 1997 లో విడిపోయి లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ అనీ!
44 వ వారం
మార్చు- ... బోరిస్ బెకర్ పదిహేడేళ్ల చిరుప్రాయంలోనే టెన్నిస్ లో ఆరు అంతర్జాతీయ టైటిళ్ళు సాధించాడనీ!
- ... ఆకాశ ఎయిర్ భారతదేశపు బిలియనీర్ రాకేశ్ ఝుంఝున్ వాలా స్థాపించిన విమానయాన సంస్థ అనీ!
- ... అజిత్ జోగి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రి అనీ!
- ... వెంకటగిరి పోలేరమ్మ జాతర ను 1919 లో అంటు వ్యాధుల నుంచి ప్రజలను కాపాడ్డం కోసం ప్రతి యేటా జరుపుకుంటున్నారనీ!
- ... ప్రభుత్వ రంగంలో వ్యాపార నిపుణులను పెంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానేజ్మెంట్ బెంగళూరు అనీ!
45 వ వారం
మార్చు- ... క్రైమ్ ఫిక్షన్ సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచిన షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించింది ఆర్థర్ కోనన్ డోయల్ అనీ!
- ... ఫుట్‌బాల్ ఆటలో డ్రా అయిన మ్యాచ్‌లో విజేత ఎవరో తేల్చేందుకు వాడే పెనాల్టీ షూటౌట్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ గణాంకాల్లో మాత్రం ఆ మ్యాచ్‌ను డ్రా అయినట్లుగానే పరిగణిస్తారనీ!
- ... రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడైన స్వామి విజ్ఞానానంద పూర్వాశ్రమంలో పలు శాస్త్రీయ రంగాల్లో నిష్ణాతుడనీ!
- ... భూమిజ్ ప్రజలు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం మొదలైన రాష్ట్రాల్లో నివసించే గిరిజన తెగ అనీ!
- ... జీశాట్ అనేది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సమాచార ఉపగ్రహ వ్యవస్థ అనీ!
46 వ వారం
మార్చు- ... షింజో అబే జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అనీ!
- ... వివిధ రకాల వాహనాలు, యంత్రాలు తయారు చేసే ఎస్కార్ట్స్ లిమిటెడ్ బహుళజాతి వ్యాపార సంస్థ ప్రధాన కార్యాలయం హర్యానాలో ఉందనీ!
- ... ఎల్లప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుండే యోగిని ఆనందమయి మాత అనీ!
- ... కంప్యూటర్లలో సమాచారాన్ని భద్రపరచడానికి వాడే సాలిడ్-స్టేట్ డ్రైవ్ సాధారణ హార్డ్ డ్రైవ్ కన్నా వేగంగా పనిచేస్తుందనీ!
- ... మైసూరు సామ్రాజ్యం మొదట్లో విజయనగర రాజులకు సామంతులుగా ఉండేవారనీ!
47 వ వారం
మార్చు- ... రోష్ని నాడార్ భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటయిన హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఛైర్పర్సన్ అనీ!
- ... 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయకుడు విరూపాక్ష గణపతి రూపంలో దర్శనమిస్తాడనీ!
- ... పబ్మెడ్ 1997 నుంచి వైద్య సంబంధిత రంగాల సమాచారాన్ని ఉచితంగా అందజేస్తున్న సర్చ్ ఇంజన్ అనీ!
- ... భారత వాతావరణ శాఖ భారతదేశంలోనే కాక, ప్రపంచమంతటా వందలకొద్దీ అబ్జర్వేటరీలను నిర్వహిస్తోందనీ!
- ... మార్ఫా హైదరాబాదీ ముస్లింలు ప్రదర్శించే ఒక రకమైన సంగీతమనీ!
48 వ వారం
మార్చు- ... పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయవేత్త, వైద్యుడు సుశోవన్ బెనర్జీ రూపాయికే వైద్యం చేసేవాడనీ!
- ... గుడ్డట్టు వినాయక దేవాలయం లో వినాయకుడు చెక్కినట్లుగా, స్థాపించినట్లుగా కాక రాతి నుంచి ఉద్భవించినట్లుగా విశ్వసిస్తారనీ!
- ... డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫయర్ (DOI) అనేది వివిధ వస్తువులను ప్రత్యేకంగా గుర్తించడానికి ISO (అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ) ఏర్పాటు చేసిన గుర్తింపు సంఖ్య అనీ!
- ... ఆర్. కె. నారాయణ్ కథల ఆధారంగా మాల్గుడి డేస్ ధారావాహికకు దర్శకత్వం వహించింది శంకర్ నాగ్ అనీ!
- ... సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో, ఇతర భారతీయ పరిశోధన సంస్థలు కలిపి రూపొందిస్తున్న అంతరిక్ష నౌక ఆదిత్య-ఎల్1 అనీ!
49 వ వారం
మార్చు- ... మధ్వ సాంప్రదాయంలో ప్రసిద్ధమైన వాయుస్త్రోత్రాన్ని రచించింది త్రివిక్రమ పండితాచార్య అనీ!
- ... పర్వతమయమైన ప్రాంతాల్లో సురక్షితంగా రైళ్ళు నడిపేందుకు కొంకణ్ రైల్వే యాంటీ కొలిజన్ సాంకేతికత లాంటి అనేక ఆవిష్కరణలు చేసిందనీ!
- ... పిప్పలి ని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారనీ!
- ... నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం అనీ!
- ... సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్రపంచంలో అతిచిన్న సార్వభౌమిక సమాఖ్య అనీ!
50 వ వారం
మార్చు- ... అతి పురాతనమైన ఈజిప్టు లిపిని మొదటిసారిగా అర్థం చేసుకున్నది థామస్ యంగ్ అనీ!
- ... టిబెట్ లో ప్రాచుర్యం పొందిన కదంప అనే బౌద్ధశాఖకు మూలపురుషుడు భారత బౌద్ధసన్యాసి అతిశా అనీ!
- ... ఛెల్లో షో అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న భారతీయ సినిమా అనీ!
- ... ప్రపంచంలోని అరబ్ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ అరబ్ లీగ్ అనీ!
- ... ఆర్థిక అసమానతలను కొలిచేందుకు జినీ సూచిక ఒక సాధనమనీ!
51 వ వారం
మార్చు- ... రాబర్ట్ హుక్ మొదటిసారిగా సూక్ష్మదర్శిని సాయంతో సూక్ష్మక్రిములను చూశాడనీ!
- ... భారత దేశపు గ్రహాంతర అంతరిక్ష యాత్రలకు సహాయపడే ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ కర్ణాటకలోని రామనగర లో ఉందనీ!
- ... కాపీ హక్కుల విషయంలో బెర్న్ ఒప్పందాన్ని అనుసరించే దేశాలలో ఎటువంటి ప్రత్యేక దరఖాస్తు అవసరం లేకుండానే తాము సృష్టించిన వాటిని కాపీహక్కు దక్కుతుందనీ!
- ... భారతదేశపు జాతీయ పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించింది కాన్షీరాం అనీ!
- ... భారతదేశంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నియంత్రించేది జాతీయ విద్యా విధానం అనీ!
52 వ వారం
మార్చు- ... భారత స్వాతంత్య్రానంతరం భారత యూనియన్ లో కలవడానికి మొట్టమొదట అంగీకరించిన రాజ్యపాలకుడు జయచామరాజేంద్ర వడియార్ అనీ!
- ... కరేబియన్ పర్యాటకులు ఎక్కువ మంది డొమినికన్ రిపబ్లిక్ ని సందర్శిస్తారనీ!
- ... వివిధ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం స్వర్ణజయంతి ఫెలోషిప్ అందజేస్తుందనీ!
- ... ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం భారతదేశంలో ఏర్పాటు చేసిన మూడవ ఆలిండియా రేడియో ప్రసార కేంద్రమనీ!
- ... ఇప్పటిదాకా కనుగొన్న రసాయనిక మూలకాల్లో అత్యధిక ద్రవ్యరాశి కలిగినది ఒగానెస్సాన్ అనీ!