అమరావతి రాజధాని ఉద్యమం

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు

2019 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రానికి మూడు రాజధాను లుంటాయని ప్రకటించడంతో అమరావతి ఉద్యమానికి బీజం పడింది. గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.[6] ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం, 2020 కి వ్యతిరేకంగా ఉద్భవించింది. ఈ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వేర్వేరు ప్రదేశాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల్లో తమ సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులను ఈ నిర్ణయం గందరగోళం, అభద్రతా భయాందోళనలకు గురి చేసింది.[36] మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 డిసెంబరు 18 న మందడం, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెంలో నిరసనలు ప్రారంభమయ్యాయి.[37] కొద్ది రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమంతటా నిరసనలు వ్యాపించాయి.[38] 2020 డిసెంబరు 17 న, నిరసనల వార్షికోత్సవం సందర్భంగా వరుసగా కార్యక్రమాలు జరిగాయి.[39]

అమరావతి రాజధాని ఉద్యమం
తేదీ2019 డిసెంబరు 18– జరుగుతూ ఉంది
(మొత్తం 4 సంవత్సరాలు, 334 రోజులు)[1]
స్థలంఆంధ్రప్రదేశ్
కారణాలు
  • ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం, 2020 ను ప్రవేశపెట్టడం
  • ప్రభుత్వ విభాగాలను మూడు రాజధానులలో వికేంద్రీకరించడం[2][3]
  • Suggestions of G. N. Rao, BCG Committees to have decentralized government[4]
  • బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు[5]
  • అమరావతిలో పోలీసుల దుశ్చర్యలు
లక్ష్యాలు
  • ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టాన్ని పూర్తిగా రద్దు చెయ్యడం
  • అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించడం[6]
  • రాజధానిగా అమరావతి సమగ్రాభివృద్ధి[6]
  • ఈ సమస్యలో రాష్ట్రపతి, ప్రధానమంత్రులు జోక్యం చేసుకోవాలి[7][8]
  • ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి[9]
  • అరెస్టు చేసిన నిరసనకారులను విడుదల చెయ్యాలి
  • ఇన్‌సైడర్ ట్రేడింగు జరిగిందన్న ఆరోపణలపై న్యాయ విచారణ చెయ్యాలి[10]
పద్ధతులునిరసనకారులు: ప్రదర్శనలు, ధర్నా, నిరశన దీక్ష, సమ్మె, పికెటింగు, sloganeering, సత్యాగ్రహం, హ్యాష్‌ట్యాగుల వ్యాప్తి అథారిటీలు: అరెస్టులు, అలజడి పోలీసులు, దుశ్చర్య, లాఠీ ఛార్జి, మూకుమ్మడి అరెస్టులు, గృహ నిర్బంధం, రవాణా నిరోధాలు, సెక్షను 144[11]
స్థితిOngoing protests in accordance with the restrictions due to pandemic situation.[12]

Previously:

Concessions
given
పౌర ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు

ఉద్యమ కారులు:
(ఒక అధికార కేంద్రం లేదు)


మద్దతు:


ఇతర సంస్థలు:

  • తానా[29]
  • కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్
  • కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్
  • గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్[30]
ముఖ్య నాయకులు
నిరసనకారులు
(కేంద్ర నాయకత్వమంటూ ఏదీ లేదు)
మృతులు, క్షతగాత్రులు, అరెస్టులు
మరణాలు58[33][34]
క్షతగాత్రులుదాదాపు 200[31][32]
అరెస్టైనవారు200+[35]

నేపథ్యం

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రాచీన మానవ ఆవాస స్థానాలలో ఒకటి. ఈ ప్రాంతానికి కనీసం రెండు సహస్రాబ్దాల నాటి చరిత్ర ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకుల వంటి చారిత్రికక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. ధాన్యకటకం వంటి నగరాలతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.[40] 2014 లో ఎన్నికైన ప్రభుత్వం, ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మార్చాలని తలపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కీర్తి, గొప్ప సంస్కృతి, చారిత్రక, మతపరమైన సంపదను ప్రోత్సహించాలని భావించింది.[41] సింగపూర్ కంపెనీ రాజధానీ నగరాన్ని రూపొందించింది. నగరాన్ని అభివృద్ధి చేయడానికి రెండు ప్రభుత్వాల సహకారంతో సింగపూర్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు కన్సల్టెంట్‌లు, ఇతర అంతర్జాతీయ కన్సల్టెంట్లు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేసారు.[42][43]

అప్పటి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు అమరావతి రాజధానీ నగరానికి శంకుస్థాపన చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శంకుస్థాపన చేశాడు.[44][45] ఈ రాజధాని నగరాన్ని కృష్ణా నది ఒడ్డున బంగాళాఖాతం నుండి సుమారు 60 కి.మీ. దూరంలో ఉన్న గొప్ప సారవంతమైన భూమిలో నిర్మించ తలపెట్టారు. నగరంలో 51% పచ్చని ప్రదేశాలు, 10% నీటి వనరులను కలిగి ఉండేలా రూపొందించారు. ఈ కొత్త నదీతీర రాజధాని కోసం రైతుల నుండి విశిష్టమైన సాగు భూమిని సమీకరించింది.[46] భారతదేశంలోనే తొలిసారిగా గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు అమరావతి కోసం భూ సమీకరణ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు.[47][48][49] ఇది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లతో దాదాపు రూ. 17,500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటితో పాటు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, పెట్టుబడులు, బాండ్లు, లీజు అద్దె రాయితీల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించాలని ప్రణాళిక వేసింది. సరికొత్త రాజధానీ నగరానికి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడి అవసరమైఉతుందని అంచనా వేసారు.[50][51] భారత ప్రభుత్వం 2,500 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. భవిష్యత్తులో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.[52][53] కానీ, గత ప్రభుత్వం అమరావతిలోని అనేక ఆస్తులపై సమాచార దుర్వినియోగానికి, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం, APCRDA, ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) లు మద్దతు ఇచ్చిన భారీ ప్రాజెక్టులు, ఒప్పందాలను నిలిపివేసింది.[54][55] వాటిని సమీక్షించేందుకు ప్రభుత్వం అనేక కమిటీలను నియమించింది. దాంతో అమరావతిలో ప్రైవేట్ సంస్థలు చేపట్టిన పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతూండగా, ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ పనులు, రహదారి పనులు పూర్తిగా ఆగిపోయాయి.[56]

2019–ప్రస్తుతం

మార్చు

2019 జూలైలో, ప్రపంచ బ్యాంకు $300 మిలియన్ల అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల సహాయాన్ని రద్దు చేసింది. "అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం చేసిన అభ్యర్థనను భారతదేశం ఉపసంహరించుకుంది" అని ఒక ప్రకటన విడుదల చేసింది.[57][58][59] ప్రపంచ బ్యాంకు తర్వాత, బీజింగ్‌కు చెందిన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా అమరావతి రాజధాని నగర ప్రాజెక్టుకు $200 మిలియన్ల నిధులను ఉపసంహరించుకుంది. దాంతో అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడింది.[60][61][62]

2019 నవంబరులో, అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్‌లతో కూడిన సింగపూర్ కన్సార్టియం రాజధాని నగరం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుండి వైదొలిగింది. ఇతర ప్రాధాన్యతల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును కొనసాగించకూడదని నిర్ణయించుకోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు.[63][64] అమరావతిలో రాజధానిని నిర్మించడంపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, “మన ప్రాధాన్యత లండన్‌నో, ప్యారిస్‌నో నిర్మించడం కాదు. ఇది మా ప్రాధాన్యతా కాదు, మాకంత సామర్థ్యమూ లేదు. మాకు దాన్ని నిర్మించడం సాధ్యం కాదు” అన్నాడు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించడానికి అమరావతి ప్రాంతం అనుకూలంగా లేదనీ, అది వరదలకు గురయ్యే అవకాశం ఉందనీ అతను చెప్పాడు.[65][66] "ఆర్థిక మందగమనం కారణంగాను, గత ప్రభుత్వపు దుష్పరిపాలన వల్లనూ" దిగజారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి లోని అనేక భారీ ప్రాజెక్టుల పనిని కొనసాగించలేకపోయాడు.[67][68]

2019 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించింది. కోస్తా ఆంధ్రలో అమరావతి, రాష్ట్ర శాసనసభతో శాసన రాజధాని గాను, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం రాష్ట్ర సచివాలయంతో పరిపాలనా రాజధాని గాను, రాయలసీమలోని కర్నూలు హైకోర్టుతో న్యాయ రాజధాని గానూ మూడు రాజధానులు ఉంటాయని,ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రకటించాడు.[69][70] ఈ ప్రకటన, అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న విదేశీ పెట్టుబడిదారులతో సహా ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేసింది.[71] ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం లోని రైతులు, స్థానికులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.[37][72]

కాలక్రమం

మార్చు

సంఘటనల కాలక్రమం

మార్చు
  • 2014 జూన్ 2
  • 2014 జూన్ 8
  • 2014 డిసెంబరు 31
    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7068 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా, 122 చ.కి.మీ. ప్రాంతాన్ని రాజధాని నగర ప్రాంతంగా ప్రకటించింది.[76][77]
    • ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చట్టం, 2014 అమల్లోకి వచ్చింది.[78]
  • 2015 ఏప్రిల్ 1
    • ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.[79]
  • 2015 మే 25
    • సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.[80]
  • 2015 అక్టోబరు 22
  • 2017 జూలై 1
    • ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అధికారికంగా అమరావతి నుంచి విధులు ప్రారంభించారు.[82]
  • 2019 ఫిబ్రవరి 3
  • 2019 మార్చి 18
  • 2019 మే 30
  • 2019 జూలై 23
    • అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రకటించాయి.[88]
  • 2019 సెప్టెంబరు 13
    • అమరావతిలో ప్రారంభించిన అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించడానికీ, రాజధానితో సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని సూచించడానికీ కొత్త ప్రభుత్వం GN రావు నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ కమిటీని నియమించింది.[89]
  • 2019 నవంబరు 11
    • సింగపూర్ ప్రభుత్వ మద్దతుతో కూడిన కన్సార్టియం అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను విరమించుకుంది.[90]
  • 2019 డిసెంబరు 17
  • 2019 డిసెంబరు 20
    • అర్బన్ ప్లానింగ్ నిపుణులతో కూడిన ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది.[93]
    • జీఎన్ రావు ఇంకా మాట్లాడుతూ, వికేంద్రీకృత ప్రభుత్వం రూపంలో 'కొన్ని రాజధాని విధులను' ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్యానెల్ సూచించింది.[94][95]
  • 2019 డిసెంబరు 29
  • 2020 జనవరి 3
    • బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నివేదికలో, మూడు రాజధానుల ఆలోచనకు మద్దతు ఇచ్చింది.[97]
  • 2020 జూలై 31
    • APCRDA, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు [98] రద్దును ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఆమోదించారు.
  • 2020 డిసెంబరు 17
  • 2021 నవంబరు 23
    • రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. మరింత మెరుగైన, సమగ్రమైన మూడు రాజధానుల బిల్లును రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాడు.[100]
  • 2022 మార్చి 3
    • అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చెయ్యమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.[101]
  • 2022 సెప్టెంబరు 12
    • అమరావతి ఉద్యమం 1000 రోజులకు చేరుకుంది.[102]
    • రైతులు ఆంధ్రప్రదేశ్ అంతటా మహా పాదయాత్ర మొదలుపెట్టారు.[103] అమరావతిలో మొదలైన నిరసన యాత్ర 2022 నవంబరు 11 అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయంలో ముగుస్తుంది.[104]
  • 2022 నవంబరు 28
    • అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చెయ్యమని మార్చి 3 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. "ఆంధ్రప్రదేశ్‌లో అధికారాల విభజన లేదా? హైకోర్టు కార్యనిర్వహణ విభాగం లాగా ఎలా వ్యవహరిస్తుంది?" అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.[105]

నిరసనల కాలక్రమం

మార్చు
  • 2019 డిసెంబరు 18
    • జగన్ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే అమరావతి, ముఖ్యంగా తుళ్లూరు, రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి.[37]
  • 2019 డిసెంబరు 19
  • 2019 డిసెంబరు 19
    • వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాలు, దుకాణాలు బందుకు బహిరంగంగా మద్దతు నిచ్చాయి. నిరసనకారులు రోడ్లపై గుమిగూడడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, అనేక ప్రభుత్వ వాహనాలకు అంతరాయం కలిగింది.[108]
    • 29 గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అమరలింగేశ్వర ఆలయం వైపు వెళ్లే APSRTC బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు.[109]
  • 2020 అక్టోబరు 11
  • న్యాయస్థానం నుండి దేవస్థానానికి
    • తమ ఉద్యమానికి మద్దతు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర నిర్వహించారు., 2021 నవంబరు 1 న అమరావతిలో మొదలైన ఈ పాదయాత్ర డిసెంబరు 16 న తిరుపతిలో వెంకటేశ్వరస్వామి దర్శనంతో ముగిసిసింది. డిసెంబరు 18 న తొరుపతిలో బహిరంగ సభను నిర్వహించారు.

నిరసనలు, ప్రదర్శనలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ ప్రకటనతో అమరావతి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిధ్వని నిరసనలు జరిగాయి. పురుగుమందుల డబ్బాలతో రోడ్డుపై బైఠాయించిన వారు ఇప్పటికే అమరావతి నుంచి సచివాలయాన్ని, హైకోర్టును తరలించడాన్ని తప్పుబట్టారు.[112] ప్రభుత్వ పాలన మొత్తం ఎక్కడికక్కడే ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Amaravati Protests enter 18th day". The Hindu. 2020-01-05. Retrieved 2020-01-05.
  2. "Andhra Pradesh Jaganmohan Reddy moots three capital idea". The Hindu Business Line. 2019-12-17. Retrieved 2020-01-02.
  3. "Farmers protest Jaganmohan Reddy's three capital idea in Amaravati". The Hindu Business Line. 2019-12-19. Retrieved 2019-12-20.
  4. "Want no change in Amaravati, Say Protestors". The Business Standard. 2019-12-20. Retrieved 2020-01-05.
  5. "Botsa satyanarayana hints to develop amaravati as IT Hub or other Industrial Hub instead of Capital city". The Hans India. 2019-12-26. Retrieved 2020-01-02.
  6. 6.0 6.1 6.2 6.3 "Amaravati protestors demands amaravati as sole capital of the state". ANI. 2019-12-19. Retrieved 2019-12-20.
  7. "Amaravati Farmers seeks centres intervention over relocation of capital city". Hindustan Times. 2019-08-23. Retrieved 2020-01-06.
  8. "Amaravati Farmers Write to Prez, PM against Jagan Govt's Proposal to Develop Three Capitals in Andhra". CNN-News18. 2019-12-24. Retrieved 2020-01-03.
  9. "Amaravati People Asking president's Rule in Andhra Pradesh". Telugu Today. 2020-01-11. Retrieved 2020-01-11.
  10. "Former Andhra CM Naidu, Demands Judicial Inquiry on insider trading allegations". CNN-News18. 2019-12-23. Retrieved 2020-01-05.
  11. "AP Capital: అమరావతిలో రైతుల బంద్.. 144 సెక్షన్ అమలు". Samayam. 2019-12-19. Retrieved 2019-12-19.
  12. "ఉద్యమం ఉద్యమమే... కరోనా కరోనానే: అమరావతి పరిరక్షణ సమితి కీలక నిర్ణయం". Asianet News. 2020-03-20. Retrieved 2020-08-23.
  13. "Now, a 16-member High Power Committee to study G.N. Rao Committee and BCG reports on A.P. Capital shifting". The Hindu. 2019-12-29. Retrieved 2019-12-31.
  14. "Andhra Pradesh constitutes 16 member High Power Committee to resolve Capital city crisis". CNN-News18. 2019-12-29. Retrieved 2019-12-31.
  15. "YSRCP writes to president, to declare Amaravati as unconstitutional". The Hans India. 2020-01-07. Retrieved 2020-01-07.
  16. "Students' group from AU backs Jagan". The Times of India. 2020-01-20. Retrieved 2020-08-23.
  17. "బీసీజీ రిపోర్ట్ బోగస్ : అమరావతి పరిరక్షణ సమితి". TV9 Telugu. 2020-01-04. Archived from the original on 2020-10-13. Retrieved 2020-01-07.
  18. "Amaravati Farmers form JAC Union to resist capital shifting". Sunday Guardian. 2020-01-04. Retrieved 2020-01-04.
  19. "JAC plans to scale up Amaravati protest into a mass movement". The Hindu. 10 December 2020.
  20. "Vijayawada: Mahila JAC urges government to withdraw 3 capitals proposal". The Hans India. 2020-08-03. Retrieved 2020-08-23.
  21. "Amaravati farmers move high court, seek stay on three capitals for Andhra". Business Line. 2020-08-03. Retrieved 2020-08-23.
  22. "Amaravati protesters hit the road in Amaravati villages". The Hindu. 2019-12-28. Retrieved 2019-12-31.
  23. "రాజధాని కోసం ఎన్నారైల నిరసనలు". Vaartha. 2020-01-12. Archived from the original on 2020-01-12. Retrieved 2020-01-12.
  24. "Chandhrababu naidu wife donates bangles for save amaravati movement of Farmers". CNN-News18. 2020-01-01. Retrieved 2020-01-01.
  25. "TDP joins amaravati protests, denies Kammas benefited land deals". News Minute.com. 2020-01-01. Retrieved 2020-01-05.
  26. "Finally Pawan makes his mind to support amaravati farmers on capital issue". The Hans India. 2019-12-30. Retrieved 2019-12-31.
  27. "BJP:CM Jagan has no power to move capital from Amaravati". The Hans India. 2020-01-04. Retrieved 2020-01-04.
  28. 28.0 28.1 "'YS Jaganకు అమరావతి శాపం.. ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్': సీపీఐ నారాయణ". Samayam. 2020-01-04. Retrieved 2020-01-06.
  29. "Andhra Pradesh: As Farmers' Stir Crosses 200 Days, NRIS Bring Amaravati Back to Focus". Mumbai Mirror. 2020-06-30. Retrieved 2020-08-23.
  30. "'Don't move high court from Amaravati'". Times of India. 2019-09-24. Retrieved 2019-09-25.
  31. "మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాజధాని బంద్". ABN Andhra Jyothi. 2020-01-03. Retrieved 2020-01-12.
  32. "రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ ఫిర్యాదు". One India. 2020-01-03. Retrieved 2020-01-06.
  33. "Farmer who took part in protest against AP capital shift move dies of heart attack". India Today. 2020-01-04. Retrieved 2020-01-06.
  34. "Amaravati: Youth commits suicide over the capital shifting". The Hans India. 2020-01-10. Retrieved 2020-01-12.
  35. "Andhra Pradesh police beat women protesters". Deccan Chronicle. 2020-01-11. Retrieved 2020-01-12.
  36. "Farmers from 29 Amaravati villages protest Jagan's proposal for three capitals". The News Minute. 2019-12-19. Retrieved 2019-12-19.
  37. 37.0 37.1 37.2 "Hours after CM Jagan's decision, farmers of Amaravati stage protests against three capitals to state". The Hans India. 2019-12-18. Retrieved 2019-12-19.
  38. "రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్‌". Eenadu. 2020-01-04. Archived from the original on 2020-10-19. Retrieved 2020-01-04.
  39. Bandari, Pavan Kumar (2020-12-17). "Andhra Pradesh: One year for Amaravati movement, farmers to hold Jana Rana Bheri today". The Hans India (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2020. Retrieved 2021-07-09.
  40. "About, Amaravati". Andhra Pradesh Capital Region Development Authority. Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-18.
  41. "How Andhra Pradesh plans to make its new capital, Amaravati as 'world class city'". The Economic Times. 2017-05-21. Retrieved 2018-06-18.
  42. "Andhra capital Amaravati will be bigger, better than Singapore: Chandrababu Naidu". The Hindustan Times. 2018-04-13. Retrieved 2019-11-12.
  43. "Amaravati masterplan: AP to ink MoU with Singapore govt today". The Hindustan Times. 2018-01-11. Retrieved 2019-01-26.
  44. "Modi lays foundation for Amaravati: As it happened". The Hindu. 2015-10-22. Retrieved 2016-09-02.
  45. "Chief Justice Ranjan Gogoi lays foundation stone for Andhra High Court in Amaravati". The News Minute. 2019-04-04. Retrieved 2020-01-04.
  46. "Amaravati: A capital idea, but how feasible?". Live Mint. 2016-07-22. Retrieved 2016-08-17.
  47. "Farmers offer 33,000 acre land for Andhra capital at Amravati". India Today. 2017-06-18. Retrieved 2019-08-15.
  48. "Farmers offer 33,000 acre land for Andhra capital at Amravati". The Hindu Business Line. 2017-06-18. Retrieved 2019-01-12.
  49. "'రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం... ఇప్పుడు పిల్లా పెద్దా అంతా రోడ్డున పడ్డాం". BBC. 2020-01-07. Retrieved 2020-01-08.
  50. "Rs 17,500 cr WB booster shot for Andhra Pradesh's Amaravati city". Financial Express. 2016-11-16. Retrieved 2019-11-12.
  51. "Andhra CM Naidu taps into World Bank to fund his dream capital Amaravati". The Hindustan Times. 2018-04-28. Retrieved 2019-11-16.
  52. "Centre gave ₹2,500 cr. forbuilding Amaravati: CM". The Hindu. 2017-12-01. Retrieved 2018-01-06.
  53. "Amaravati will be Andhra Pradesh's New Capital. Budget: 20,000 Crores". NDTV. 2015-04-02. Retrieved 2015-06-17.
  54. "Fate of Amaravati, hangs in balance". Indian Express. 2019-06-02. Retrieved 2019-08-03.
  55. "We have details of insider trading in Amaravati:Botsa". Indian Express. 2019-08-27. Retrieved 2019-09-02.
  56. "Several projects stalled in Andhra Pradesh as blame game continues". The Hindu Business Line. 2019-06-24. Retrieved 2019-08-26.
  57. "World Bank drops its $300 mn promise for amaravati project". The Economic Times. 2019-07-18. Retrieved 2019-07-26.
  58. "India withdrew request for financing Amaravati project: World Bank". India Today. 2019-07-22. Retrieved 2019-07-23.
  59. "World Bank says it 'dropped' Amaravati project due to Centre withdrawing finance request". Times of India. 2019-07-19. Retrieved 2019-07-28.
  60. "Asian Infrastructure Investment Bank withdraws $200 million funding to Amaravati project". Live Mint. 2019-07-24. Retrieved 2019-08-01.
  61. "China-Backed Bank Drops $200 Million Loan For Amaravati Project". NDTV. 2019-07-23. Retrieved 2019-07-28.
  62. "After World Bank, China-led development bank pulls out of Amaravati project". The Economic Times. 2019-07-23. Retrieved 2019-07-28.
  63. "Withdrawal of Singapore Consortium from Amaravati Development Project a mutual decision, says Satyanarayana". ANI. 2019-11-13. Retrieved 2019-11-13.
  64. "Andhra Pradesh: Singapore closes Amaravati capital city startup project". India Today. 2019-11-12. Retrieved 2019-11-13.
  65. "'Amaravati not safe to be capital': Andhra minister Botsa Satyanarayana". Asianage. 2019-08-21. Retrieved 2019-10-12.
  66. "Scrapping Chandrababu Naidu's plans for Amaravati will be easier said than done for Jaganmohan Reddy govt". Firstpost. 2019-08-26. Retrieved 2019-10-14.
  67. "Amaravati start-up area project not financially viable: Andhra FM Buggana Rajendranath". ANI. 2019-11-13. Retrieved 2019-11-14.
  68. "Start-up Area Project was not financially feasible: AP FinMin". The Hindu Business Line. 2019-11-13. Retrieved 2019-11-14.
  69. "Concept of 3 capitals to be considered in Andhra Pradesh: Chief Minister YS Jagan Mohan Reddy". India Today. 2019-12-17. Retrieved 2019-12-18.
  70. "Andhra Pradesh to have three capitals, says YS Jaganmohan Reddy". Times of India. 2019-12-17. Retrieved 2019-12-18.
  71. "After dreaming big, Amaravati investors now stare at a bigger vacuum". Times of India. 2019-09-25. Retrieved 2019-09-30.
  72. "Had Jagan Mohan Reddy opposed Amaravati, we wouldn't have given lands: Farmers". Live Mint. 2019-12-29. Retrieved 2019-12-31.
  73. "Andhra Pradesh split, India's 29th state Telangana is born". CNN-News18. 2014-06-02. Retrieved 2014-06-06.
  74. "How a new state is created in India". India Today. 2013-07-30. Retrieved 2014-06-01.
  75. "Chandrababu Naidu to be sworn in as CM of new Andhra Pradesh on Sunday". The Hindu Business Line. 2014-06-07. Retrieved 2014-06-16.
  76. "A.P. Capital Region Development AAct comes to being". The Hindu. Press Reader. 2014-12-31. Retrieved 2015-01-01.
  77. "Declaration of A.P. Capital Region - Ap.gov.in" (PDF). APCRDA. Archived from the original (PDF) on 11 May 2019. Retrieved 11 January 2020.
  78. "Andhra Pradesh capital plan gets going, CRDA Bill in assembly". The Times of India. 2014-12-21. Retrieved 2014-12-31.
  79. "Andhra Pradesh cabinet approves the plan to name the capital city as Amaravati". The Hindu. 2015-04-01. Retrieved 2015-04-02.
  80. "Singapore presents master plan for Amaravati". The Hindu Business Line. 2015-05-25. Retrieved 2015-05-30.
  81. "An auspicious start for Amaravati as Modi lays foundation stone". Deccan Chronicle. 2015-10-22. Retrieved 2015-10-30.
  82. "A.P. govt. starts work from new Secretariat". The Hindu. 2017-06-30. Retrieved 2017-07-01.
  83. "CJI Ranjan Gogoi to inaugurate interim Andhra Pradesh High Court complex". Indian Express. 2019-02-03. Retrieved 2019-02-14.
  84. "CJI Ranjan Gogoi inaugurates Andhra Pradesh High Court new building at Amaravathy". Akash Vani. 2019-02-03. Archived from the original on 2020-10-13. Retrieved 2019-02-14.
  85. "AP High Court to function at Nelapadu from March 18". Indian Express. 2019-03-18. Retrieved 2019-03-31.
  86. "Monster victory for Jagan, humiliating loss for Naidu". The Times of India. 2019-05-24. Retrieved 2019-05-30.
  87. "YS Jaganmohan Reddy takes oath as Andhra Pradesh CM". The Economic Times. 2019-05-30. Retrieved 2019-06-12.
  88. "After World Bank, China-backed bank drops USD 200 mn loan for Amaravati". Deccan Chronicle. 2019-07-23. Retrieved 2019-07-30.
  89. "Andhra Govt Appoints Expert Panel to Decide Future of Capital, Likely to Increase 12 More Districts". CNN-News18. 2019-09-14. Retrieved 2019-09-30.
  90. "Singapore consortium pulls out of Andhra's Startup Area Project". The Economic Times. 2019-11-13. Retrieved 2019-11-14.
  91. "'Decentralised administration': Andhra may have three capitals, says CM Jagan". Live Mint. 2019-12-17. Retrieved 2019-12-18.
  92. "Jagan Reddy's Andhra may be India's first state with 3 capitals". Hindustan Times. 2019-12-17. Retrieved 2019-12-23.
  93. "GN Rao Committee submits its report to CM Jagan reddy at Camp office in Tadepalli". The Hans India. 2019-12-20. Retrieved 2019-12-23.
  94. "GN Rao panel report backs Jagan Mohan's three-Capital proposal for Andhra". Indian Express. 2019-12-21. Retrieved 2019-12-31.
  95. "GN Rao Committee Submits Report To YS Jagan". Sakshi. 2019-12-20. Retrieved 2019-12-23.
  96. "Andhra Pradesh constitutes 16-member High Power Committee to find solution for capital city crisis". The Economic Times. 2020-01-13. Retrieved 2020-01-13.
  97. "Boston Consulting Group for decentralised development of AP". The Hindu Business Line. 2020-01-04. Retrieved 2020-01-04.
  98. "Andhra Governor gives nod to CM Jagan Mohan Reddy's three-capital plan". Livemint (in ఇంగ్లీష్). 2020-08-01. Retrieved 2020-08-07.
  99. "JAC plans to scale up Amaravati protest into a mass movement". The Hindu. 10 December 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
  100. "AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన". ఈనాడు. Archived from the original on 2022-08-21. Retrieved 2024-05-25.
  101. "'రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు' - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు". BBC News తెలుగు. 2022-03-03. Archived from the original on 2022-03-20. Retrieved 2024-05-25.
  102. PV, Ramana Kumar (2022-09-12). "Amaravati Farmers' March: 2nd Phase of Protest Begins With Arasavalli Temple Padyatra". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-09-12.
  103. Sridhar, G. Naga (2022-09-12). "Fight for Amaravati: Farmers begin Maha Padayatra across AP". Business Line (in ఇంగ్లీష్). Retrieved 2022-09-12.
  104. K. Menon, Amarnath (2022-09-12). "Why Amaravati farmers are on a long march in Andhra Pradesh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-12.
  105. "Top court stays HC's order to develop Amaravati as Andhra capital in 6 months". Hindustan Times. 28 November 2022. Retrieved 13 April 2023.
  106. "మూడు పై మంటాలు". ABN Andhra Jyothi. 2019-12-19. Archived from the original on 2020-10-27. Retrieved 2019-12-23.
  107. "రాజధాని సెగలు". ABN Andhra Jyothi. 2019-12-19. Archived from the original on 2020-10-27. Retrieved 2019-12-20.
  108. "తాడో పేడో". ABN Andhra Jyothi. 2019-12-20. Archived from the original on 2020-10-29. Retrieved 2019-12-25.
  109. "Amaravati bandh: Farmers protest against remarks of Chief Minister Jagan in State Assembly". Indian Express. 2019-12-19. Retrieved 2019-12-21.
  110. "Amaravati farmers' protest enters 300th day". The Times of India (in ఇంగ్లీష్). October 13, 2020. Archived from the original on 14 October 2020. Retrieved 2021-07-09.
  111. "Protests staged for Amaravati as capital". The Hindu (in Indian English). Special Correspondent. 2020-10-11. ISSN 0971-751X. Retrieved 2021-07-09.{{cite news}}: CS1 maint: others (link)
  112. "Amaravati farmers protest Andhra CM's idea of three capitals". Business Standard. 2019-12-18. Retrieved 2019-12-19.